🍀 16, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 16, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 16, JANUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹. కనుమ పండుగ విశిష్టత - శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kanuma to All. 🌹
*ప్రసాద్ భరద్వాజ*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 312 / Bhagavad-Gita -312 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 02 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 159 / Agni Maha Purana - 159 🌹 🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 4 / Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 024 / DAILY WISDOM - 024 🌹 🌻 24. ఐక్యత యొక్క అవగాహన అమరత్వ స్థితికి దారితీస్తుంది / 24. The Perception of Unity Leads to the State of Immortality🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 288 🌹
6) 🌹. శివ సూత్రములు - 26 / Siva Sutras - 26 🌹 🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 1 / 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam -1🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹16, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
🍀. కనుమ శుభాకాంక్షలు, Good Wishes on Kanuma 🍀
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కనుమ, Kanuma 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 16 🍀*

29. నక్షత్రవిగ్రహ మతిర్గుణ బుద్ధిర్లయోఽగమః |
ప్రజాపతిర్విశ్వ బాహుర్విభాగః సర్వగోముఖః
30. విమోచనః సుసరణో హిరణ్య కవచోద్భవః |
మేఘజో బలచారీ చ మహీచారీ స్రుతస్తథా

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సనాతన వేద రహస్యం మానవ హృత్కుహరంలో తామర మొగ్గవలె ముకుళించుకుని వున్నది. మానవుని మనస్సు సత్యవస్తువు కభిముఖం కాజొచ్చినంతనే, — అతని హృదయం అనంతునిపై మరులు కొనుట ప్రారంభించి నంతనే ఆ అరవిందం ఒక్కొక్క రేకే వికసింప నుపక్రమిస్తుంది 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, హేమంత ఋతువు,
ఉత్తరాయణం,  పౌష్య మాసం
తిథి: కృష్ణ నవమి 19:21:56 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: స్వాతి 19:24:53 వరకు
తదుపరి విశాఖ
యోగం: ధృతి 10:32:22 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 07:38:32 వరకు
వర్జ్యం: 00:51:34 - 02:28:18
మరియు 24:51:22 - 26:24:54
దుర్ముహూర్తం: 12:48:04 - 13:32:55
మరియు 15:02:36 - 15:47:27
రాహు కాలం: 08:13:24 - 09:37:29
గుళిక కాలం: 13:49:44 - 15:13:49
యమ గండం: 11:01:34 - 12:25:39
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 10:31:58 - 12:08:42
సూర్యోదయం: 06:49:19
సూర్యాస్తమయం: 18:01:59
చంద్రోదయం: 01:00:04
చంద్రాస్తమయం: 12:46:37
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
19:24:53 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కనుమ పండుగ విశిష్టత - కనుమ శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kanuma to All. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కనుమ పండుగ విశిష్టత 🍀*

*సంక్రాంతి (Sankranthi) తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ (Kanuma festival). కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూరులో బాగా జరుపుకుంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..*
 
*కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను (Orange color dress) ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను (Cattle) పూజించడం ఆచారంగా పాటిస్తారు.*
 
*ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి (Pongali) వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం (Poli challadam) అని అంటారు. పోలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.*
 
*ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం (Believe). ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు బెలూన్లతో అందంగా అలంకరించి (Beautifully decorated), కాళ్ళకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు.*
 
*వారికి పంట పండించడంలో (Harvesting the crop) సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెల్లో కనుమకు ఒక ప్రత్యేకత (Specialization) ఉంది. ఈ రోజున మినుములు తినాలనే ఆచారముంది. అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు.*
 
*ఈ రోజున ఇంటికి వచ్చిన ఆడపడుచును, కొత్త అల్లుళ్లను తిరుగు ప్రయాణం (Return journey) చేయనివ్వరు. కనుమ రోజున మాంసాహారం (Non-vegetarian) వండుతారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది. గాలి పటాలు ఎగుర వేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ పండుగను జరుపుకుంటారు.*
 
*కనుమ రోజున పెరుగును (Yogurt) దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎద్దుల బండి పోటీలు (Bullock cart races), కోడిపందాలు నిర్వహిస్తుంటారు. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం. ఈ కనుమ పండుగ వాతావరణం అంతా పల్లెటూరిలో అందంగా కనిపిస్తుంది.*
 
*ఇలా సంక్రాంతి చివరి రోజులు జరుపుకునే కనుమ రోజుతో సంక్రాంతి పండుగ పూర్తవుతుంది. కనుమ పండుగ రోజున రైతులు పంట పండించడంలో సహాయపడిన పశువులను అందంగా అలంకరించి వాటికి ప్రత్యేక పూజలు చేయడం విశేషం. అందుకే కనుమ పండుగను పశువుల పండుగ (Cattle Festival) అని కూడా అంటారు.*
*- నవ్య*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 312 / Bhagavad-Gita - 312 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 02 🌴*

*02. అధియజ్ఞ: కథం కోత్ర దేహేస్మిన్మధుసూదన |*
*ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి: ||*

🌷. తాత్పర్యం :
*ఓ మధుసుదనా! యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచినవారు మరణసమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు?*

🌷. భాష్యము :
యజ్ఞప్రభువను పదము ఇంద్రుని గాని, విష్ణువు గాని సూచించును. విష్ణువు బ్రహ్మరుద్రాది ప్రధానదేవతలతో ముఖ్యుడు కాగా, ఇంద్రుడు కార్యనిర్వాహక దేవతలతో ముఖ్యుడు. 

కనుకనే విష్ణువు మరియు ఇంద్రుడు ఇరువురును యజ్ఞములచే అర్పింపబడుదురు. కాని ఎవరు వాస్తవముగా యజ్ఞములకు ప్రభువనియు మరియు ఏ విధముగా భగవానుడు జీవిదేహములో వశించియుండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు.

శ్రీకృష్ణుడు మధువనెడి దానవుని సంహరించి యున్నందున అర్జునుడు అతనిని ఇచ్చట మధుసూదన అని సంభోదించుచున్నాడు. అర్జునుడు కృష్ణభక్తి పరాయణుడైనందున వాస్తవమునకు అతని మనస్సు నందు ఇట్టి సంశయములు ఉదయించకూడదు. 

అనగా ఈ సంశయములు దానవులను బోలియున్నవి. దానవులు దునుమాడుటులలో శ్రీకృష్ణుడు నేర్పరి కనుక తన మనస్సులో ఉదయించుచున్న దానవస్వభావ సంశయములను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఆ దేవదేవుని మధుసూదన యని సంబోధించుచున్నాడు. జీవితమున చేసినదంతయు మరణసమయమున పరీక్షింపబడుచున్నందున “ప్రయాణకాలే” యను పదము ఈ శ్లోకమున ప్రధానమై యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 312 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 02 🌴*

*02. adhiyajñaḥ kathaṁ ko ’tra dehe ’smin madhusūdana*
*prayāṇa-kāle ca kathaṁ jñeyo ’si niyatātmabhiḥ*

🌷 Translation : 
*Who is the Lord of sacrifice, and how does He live in the body, O Madhusūdana? And how can those engaged in devotional service know You at the time of death?*

🌹 Purport :
“Lord of sacrifice” may refer to either Indra or Viṣṇu. Viṣṇu is the chief of the primal demigods, including Brahmā and Śiva, and Indra is the chief of the administrative demigods. Both Indra and Viṣṇu are worshiped by yajña performances. But here Arjuna asks who is actually the Lord of yajña (sacrifice) and how the Lord is residing within the body of the living entity.

Arjuna addresses the Lord as Madhusūdana because Kṛṣṇa once killed a demon named Madhu. Actually these questions, which are of the nature of doubts, should not have arisen in the mind of Arjuna, because Arjuna is a Kṛṣṇa conscious devotee. Therefore these doubts are like demons. Since Kṛṣṇa is so expert in killing demons, Arjuna here addresses Him as Madhusūdana so that Kṛṣṇa might kill the demonic doubts that arise in Arjuna’s mind.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 159 / Agni Maha Purana - 159 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 49*

*🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 4 🌻*

విష్ణువు గరుడారుఢుడై ఎనిమిది భుజములతో, కుడిచేతులలో ఖడ్గ-గాద-బాణ-వరదముద్రములను, ఎడమ చేతులలో ధనుస్‌-ఖేటక-చక్ర-శంఖములను ధరించి యుండును. లేదా ఆతని విగ్రహము చతుర్భుజము కూడ కావచ్చును. చతుర్భుజుడైన నృసింహుడు రెండు చేతులలో శంఖచక్రములను ధరించి, రెండు చేతులలో హరిణ్యకశివుని వక్షము చీల్చు చుండును.

వరాహమూర్తికి నాలుగు బాహువులుండును. ఆదిశేషుని చేతితోపట్టుకొనును. ఎడమచేతితో భూదేవిని ధరించును. ఎడమపార్శ్వమున లక్ష్మి ఉండును. లక్ష్మియున్నపుడు భూమి అతని పాదములందు లగ్నయైనట్లు చేయవలెను. త్త్రెలోక్య మోహనమూర్తియైన శ్రీహరి గరుడారూఢడు; ఎనిమిది భుజములు కుడిచేతులలో చక్ర-శంఖ-ముసల అంకుశములను, ఎడమచేతిలలో శంఖ-శార్జ-గదా-పాశములును ఉండును. వామభాగమున పద్మహస్తమైన లక్ష్మిప్రతిమను, దక్షిణ పార్శ్వమున సరస్వతి ప్రతిమను నిర్మింపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 159 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 49
*🌻Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 4 🌻*

16. (The image of) Viṣṇu (is represented) as having eight hands, Garuḍa (the vehicle), (holding) a sword, mace, and arrow in the right hand and as conferring gifts and (holding) the bow and mace in the left hand.

17. (The figure of) Narasiṃha (is represented) (as having) four hands holding the conch and disc and piercing (the body) of the mighty demon (Hiraṇyakaśipu).

18-21. (The figure of) Varāha (is endowed with) four arms holding the (serpent) Śeṣa in (one of) the hands and the earth in the left (hand) and (his consort) Kamalā (Lakṣmī). The earth should be made as resting at the feet and (goddess) Lakṣmī as seated at the feet. Trailokyamohana (one who stupefies the three worlds) (should be represented as riding) the Tārkhya (the eagle-vehicle) and possess eight hands, holding the sword, mace and goad in the right hand and the conch, bow, mace and the noose in the left hand. (Images of) Lakṣmī and Sarasvatī should be endowed with lotus and lute (respectively).  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹🌹.

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 24 / DAILY WISDOM - 24 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 24. ఐక్యత యొక్క అవగాహన అమరత్వ స్థితికి దారితీస్తుంది 🌻*

*లోపభూయిష్టమైన అంతర్గత సాధనాల వల్ల, అడ్డుపడే మానసిక స్థితుల వల్ల సత్యం సత్యంగా ప్రకాశించదు. ఈ పరిమితులను అధిగమిస్తే ఇంకా విస్తారమైన వాస్తవికత, గొప్ప స్వేచ్ఛ మరియు పూర్తి జీవితానికి దారితీస్తుంది. ప్రతి జీవిలో శాశ్వతంగా ఉండాలని, అన్ని విషయాలను తెలుసుకోవాలని, ప్రతిదానిపై ఆధిపత్యం చెలాయించాలని మరియు అత్యున్నత ఆనందాన్ని అనుభవించాలని ఒక సాధారణ కోరిక మరియు ప్రేరణ ఉంటాయి.*

*ఏకత్వాన్ని గుర్తించకపోవడం( ద్వైతం) స్వీయ వినాశనానికి దారితీసే మార్గం అని ఉపనిషత్తులు ఉద్ఘాటిస్తాయి. ఏకత్వాన్ని అనుభూతి చెందడంతో అత్యున్నత స్థితికి చేరుకుంటారు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 24 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 24. The Perception of Unity Leads to the State of Immortality 🌻*

*Truth does not shine as Truth, owing to the inner instruments, the clogging psychological modifications. The crossing the barrier of these limiting adjuncts seems to lead one to a vaster reality, greater freedom and fuller life. There is a common desire-impulse in every being to exist forever, to know all things, to domineer over everything, and to enjoy the highest happiness.*

*The statement of the Upanishads that the cognition of manifoldness is the path leading to self-destruction is adorned by the supreme exhortation that the perception of Unity leads to the exalted state of Immortality.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 289 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు శాశ్వతత్వాన్ని అందుకోడానికి, నువ్వు విశాలం కావడానికి, అపరిమితం కావడానికి, అవ్యక్తం కావడానికి ఆధ్యాత్మ ప్రయాణం దోహద పడుతుంది. 🍀*

*నదిలో బాటు ప్రవహించు. నదితో బాటు నడువు. నదిలో నిన్ను నువ్వు విస్మరించు. నది అప్పటికే సముద్రం వేపు సాగుతోంది. అది నిన్ను కూడా సముద్రం వేపు తీసుకుపోతుంది. నువ్వు ఈత కొట్టాల్సిన పన్లేదు. సముద్రం దేవుడికి ప్రాధాన్యం వహిస్తుంది. మనం సముద్రాన్ని చూడందే సంతృప్తిపడం. పరిమితుల వల్ల, సరిహద్దుల వల్ల, సముద్రాన్ని చూడలేం.*

*ఏ క్షణం నది సముద్రంలో కలుస్తుందో ఆ క్షణమే అది శాశ్వతత్వాన్ని సంతరించుకుంటుంది. ఆనంత మవుతుంది. ఆధ్యాత్మిక సాధనకు అదే లక్ష్యం. నువ్వు శాశ్వతత్వాన్ని అందుకోడానికి, నువ్వు విశాలం కావడానికి, అపరిమితం కావడానికి, అవ్యక్తం కావడానికి ఆధ్యాత్మ ప్రయాణం దోహద పడుతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 026 / Siva Sutras - 026 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 1 🌻*
*🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴*

*జాగృతి మేల్కొలుపు స్థితిని లేదా చైతన్యం యొక్క సక్రియమైన సాధారణ క్రియాశీల దశను సూచిస్తుంది (8).*

*స్వప్న అంటే కల. వికల్పం అంతర్గత అవగాహనను సూచిస్తుంది. బాహ్య అవగాహన ఇంద్రియాల ద్వారా జరుగుతుంది మరియు అంతర్గత అవగాహన మనస్సు ద్వారా జరుగుతుంది (9).*

*వివేక అంటే విచక్షణ. అవివేకా అంటే విచక్షణ లేకపోవడం. మాయ అంటే భ్రమ. సుషుప్తి అంటే గాఢ ​​నిద్ర. గాఢనిద్ర లేదా మాయలో విచక్షణ లేకపోవడం సహజంగా జరుగుతుంది (10).*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 026 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam -1🌻*
*🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴*

*Jñānaṁ means knowledge. Jāgrat refers to the state of wakefulness or the normal active stage with alert stage of consciousness (8).*

*Svapna means dream. Vikalpāḥ refers to internal perception. External perception happens through senses and internal perception happens through mind (9).*

*Viveka means discrimination. A-viveka means absence of discrimination. Māyā means illusion. Sauṣupta means deep sleep. Indiscrimination happens naturally in the deep sleep state or māyā (10).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥🍀

🌻 425. 'తత్త్వమయీ’ - 1🌻


తత్త్వమే తానుగా నున్నది శ్రీమాత అని అర్థము. 'తత్త్వ మనగా తత్ అనెడి పురుష, ప్రకృతుల సమాగమ ప్రజ్ఞ. అదే శాశ్వత సత్యము. అది అనిర్వచనీయమైనది. అనన్య మగుటచే దానిని గూర్చి తెలుపుట అసాధ్యము. మరొకరు లేని స్థితి యందు అది ఎట్లు వున్నదో తెలుపుట ఎట్లు సాధ్యము? శ్రీమాత అట్టి తత్త్వము.

ఆ తత్త్వముతో అనుసంధానము చెందుట ధ్యానము యొక్క పరమావధి. అనుసంధానము జరుగుచున్న సందర్భమున ధ్యానము చేయువాడు ఆ తత్త్వము లోనికి ఆకర్షింపబడి తా నుండక తత్త్వమే యుండును. అట్టి స్థితిని చేరుటకే శ్రీమాత ఆరాధనము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita
Nisima mahima nitya-yaovana madashalini ॥ 91🌻


🌻 425. 'Tattvamayi' - 1🌻

Srimata itself is wisdom (tattva). The meaning of Tattva(Wisdom) is the amalgamation of Nature and Consciousness in equilibrium. It is the divine knowledge ( Pragnya). That is the eternal truth. It is indefinable. It is impossible to tell about it due to its uniqueness. How is it possible to express what it is in the absence of another? Srimata is such philosophy.

Connecting with that philosophy is the ultimate meditation. When the connection is taking place, the meditator is drawn into that Tattva and becomes Tattva without himself. To reach such a state is the worship of Srimata.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Osho Daily Meditations - 293. SURPRISE / ఓషో రోజువారీ ధ్యానాలు - 293. ఆశ్చర్యం


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 293 / Osho Daily Meditations - 293 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 293. ఆశ్చర్యం 🍀

🕉. అందమైనవి మరియు నిజమైనవి ఎల్లప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆశ్చర్యపడే సామర్థ్యాన్ని కలిగి ఉండండి. జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటే అది ఒకటి. 🕉


ఒకసారి మీరు ఆశ్చర్యపోయే సామర్థ్యాన్ని కోల్పోతే, మీరు చనిపోతారు. విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తే, మీరు ఇంకా బతికే ఉన్నారు. మీరు విషయాలను చూసి ఎంత ఆశ్చర్యపోతారో, మీరు అంతగా సజీవంగా ఉంటారు. అది పిల్లల సజీవత్వం; వారు అత్యంత ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ చెట్టు, లేదా పక్షి, లేదా కుక్క, లేదా పిల్లి, లేదా ఒడ్డున ఉన్న గులకరాయి వంటి వాటిని చూసి ఆశ్చర్యపోతారని కూడా ఎవరూ నమ్మలేరు. మీరు కోహినూర్ అనే గొప్ప వజ్రాన్ని కనుగొంటే మీ కంటే పిల్లలు చాలా ఆశ్చర్యపోతారు - అప్పుడు కూడా మీరు ఆశ్చర్యపోరు. కానీ పిల్లలకు ఆశ్చర్యం పోయే సామర్థ్యం ఉన్నందున, ప్రతి గులకరాయి వజ్రం అవుతుంది.

మీరు ఆశ్చర్యపోక పోతే, వజ్రం కూడా సాధారణ గులకరాయి అవుతుంది. మీరు ఆశ్చర్యపోయే సామర్థ్యాన్ని కలిగి ఉన్నంత మాత్రాన జీవితానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి తెరచుకుని ఉండండి. జీవితం అనంతం అని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోండి. ఇది ఎల్లప్పుడూ కొనసాగుతున్న ప్రక్రియ; అది ఎప్పటికీ ముగింపుకు రాదు. ఇది శాశ్వతమైన ప్రయాణం, మరియు ప్రతి క్షణం కొత్తది, ప్రతి క్షణం అసలైనది. ప్రతి క్షణం అసలైనదని నేను చెప్పినప్పుడు, ప్రతి క్షణం మిమ్మల్ని మీ మూలానికి తిరిగి పంపుతుంది, . ప్రతి క్షణం మిమ్మల్ని మళ్లీ చిన్నపిల్లలుగా చేస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 293 🌹

📚. Prasad Bharadwaj

🍀 293. SURPRISE 🍀

🕉. All that is beautiful and true always comes as a surprise. So retain the capacity to be surprised. That is one if the greatest blessings of life. 🕉

Once you lose the capacity to be surprised, you are dead. If things can surprise you, you are still alive. And the more you are surprised by things, the more alive you are. That is the aliveness of children; they are surprised by trivia. One cannot even believe they are surprised--by just an ordinary tree, or bird, or dog, or cat, or a pebble on the shore. Children are even more surprised than you would be if you were to find a Kohinoor, a great diamond--even then you won't be surprised. But because children have the capacity to become surprised, each pebble becomes a diamond.

If you are not surprised, even a diamond becomes an ordinary pebble. Life carries as much meaning as you carry the capacity to be surprised, the capacity to wonder. So always remain open. Remind yourself again and again that life is infinite. It is always an ongoing process; it never comes to an end. It is an eternal journey, and each moment is new, each moment is original. When I say each moment is original, I mean each moment throws you back to your origin, .each moment makes you a child again.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 672 / Sri Siva Maha Purana - 672


🌹 . శ్రీ శివ మహా పురాణము - 672 / Sri Siva Maha Purana - 672 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴

🌻. గణేశ వివాహోపక్రమము - 1 🌻



నారదుడిట్లు పలికెను -

తండ్రీ! సర్వోత్తమమగు గణేశ జన్మ గాథను, గొప్ప ప్రరాక్రమముతో ప్రకాశించు ఆయన దివ్య చరితమును చక్కగా వింటిని (1). తండ్రీ! దేవ దేవా! తరువాత ఏమాయెను? మహానందమును కలిగించునది, గొప్ప ప్రకాశము గలది అగు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని వర్ణించి శివతత్త్వమును వివరించుము (2).


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దయా స్వభావము గల నీవు చక్కగా ప్రశ్నించితివి. చెవులను అప్పగించి వినుము. ఓ బుషిశ్రేష్ఠా!నేను చెప్పెదను (3). ఓ విప్రశ్రేష్ఠా! ఇద్దరు కుమారుల పరమ లీలలను చూడగా పార్వతీ పరమేశ్వరులకు వారిపై గొప్ప ప్రేమ ఏర్పడెను(4). తల్లి దండ్రులు సర్వదా ప్రేమతో లాలించు చుండగా ఆ ఇద్దరు బాలకులు మిక్కిలి సుఖముగా పెరుగుతూ, ఎక్కువగా ఆటల నాడుచుండిరి (5). ఓ మహర్షీ ! వారిద్దరు బాలకులు గొప్ప భక్తితో గూడిన సమయములో తల్లి దండ్రులకు పరిచర్యలను కూడ చేసిరి (6).

ఆ తల్లి దండ్రులకు కుమార స్వామి యందు మరియు గణేశుని పైన మహాప్రేమ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ది గాంచెను (7). ఓ దేవర్షీ! ఒకప్పుడు ప్రేమ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు ఏకాంతము నందుండి దీర్ఘముగా ఆలోచించుచుండిరి (8).


పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి -

బాలకు లిద్దరు వివాహమునకు యోగ్యమగు వయస్సును పొందిరి. ఈ ఇద్దరు కుమారులకు శుభకరమగు వివాహమును చేయట ఎట్లు? (9) కుమార స్వామి అత్యంత ప్రీతి పాత్రుడు. గణేశుడు కూడా అంతే. లీలలతో ఆనందించే ఆ దంపతుల వారి గురించి ఈ తీరున ఆలోచించు చుండిరి (10).

ఓ మునీ! ఆ ఇద్దరు కుమారులు తమ త్లి దండ్రుల మనోగతము నెరింగి వారి ఇచ్ఛచే వివాహము కొరకు తహతహలాడ జొచ్చిరి (11). 'నేను వివాహమాడెదను' అని ఒకరు అంటే, 'నేను వివాహమాడెదను' అని మరియొకరు అంటూ వారిద్దరు ఒకరితోనొకరు నిత్యము వివాద పడుచుండిరి (12).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 672🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴

🌻 Gaṇapati’s marriage - 1 🌻


Nārada said:—

1. O dear father, the excellent story of the nativity and the divine conduct embellished by valour, of Gaṇeśa has been heard well.

2. O dear father, O lord of gods, what happened thereafter? Please narrate it. The great glory of Pārvatī and Śiva confers great delight.


Brahmā said:—

3. O excellent sage, you have asked well with a sympathetic mind. Listen attentively, O excellent sage, I shall narrate.

4. O excellent brahmin, seeing frequently the divine sports of both the sons, Pārvatī and Śiva had their love increased.

5. The happiness of the parents knew no bounds. The son too used to sport in joy and love.

6. O great sage, the sons rendered great service to their parents with great devotion.

7. The love and affection of the parents towards the six-faced lord and Gaṇeśa increased to a great extent like the moon in the bright half of the month.

8. O celestial sage, once the loving parents Pārvatī and Śiva held a secret talk and discussion.


Śiva and Pārvatī said:—

9. They thought that the two sons had attained to marriageable age and how best their marriage should be celebrated now.

I 0. The sixfaced lord Kārttikeya was their great beloved son. Gaṇeśa too was likewise. Thinking thus they were worried as well as delighted.

11. O sage, coming to know of their parents’ opinion, the sons too were eager to get married.

12. “I shall marry, I shall marry” saying thus to each other they always quarrelled with each other.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 711 / Vishnu Sahasranama Contemplation - 711


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 711 / Vishnu Sahasranama Contemplation - 711🌹

🌻711. అనలః, अनलः, Analaḥ🌻

ఓం అనలాయ నమః | ॐ अनलाय नमः | OM Analāya namaḥ


అలం న విద్యతే యస్య పర్యాప్తిః శక్తిసమ్పదాం ।
స మహావిష్ణురనల ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

అలం అనగా పర్యాప్తి; ఇంతతో ముగియును అను అవధి. అట్టి అవధి లేని వాడు అనలః. ఎవని శక్తులకును సంపదలకును అలం లేనివాడు అనలః. అపరిమిత శక్తులును సంపదలును కలవాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 711🌹

🌻711. Analaḥ🌻

OM Analāya namaḥ


अलं न विद्यते यस्य पर्याप्तिः शक्तिसम्पदां ।
स महाविष्णुरनल इति सङ्कीर्त्यते बुधैः ॥

Alaṃ na vidyate yasya paryāptiḥ śaktisampadāṃ,
Sa mahāviṣṇuranala iti saṅkīrtyate budhaiḥ.

Alaṃ signifies limit; Analaḥ means limitless. There is no limit or sufficiency to His power or wealth so He is Analaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹



కపిల గీత - 119 / Kapila Gita - 119


🌹. కపిల గీత - 119 / Kapila Gita - 119🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 03 🌴


03. తేన సంసారపదవీమవశోऽభ్యేత్యనిర్వృతః
ప్రాసఙ్గికైః కర్మదోషైః సదసన్మిశ్రయోనిషు

ఆ అభిమాన కారణముగా దేహ సంబంధమైన పుణ్యపాప కర్మల దోషముచే, అతడు (ఆ జీవుడు) అస్వతంత్రుడై శాంతిని కోల్పోవును. ఇట్లు దేహాభిమాన కారణముగనే అతడు ఉత్తమ, మధ్యమ, నీచయోనుల యందు జన్మించుచు సంసార చక్రమున పరిభ్రమించు చుండును.

ఇది దేవ రాక్షస మానవ (సదసన్మిశ్రయోనిషు - సత్ - అసత్ మిశ్రయోనిషు). ఆత్మ పుట్టదు. శరీరం చేసిన పని నాదే అనుకున్న పాపానికి, ఆ శరీరానికి ఏ శిక్ష పడాలో దానికి తగ్గ శరీరం వస్తుంది. మానవుడి శరీరం తట్టుకొనే కష్ట సుఖాలను క్రిమి కీటకాలు తట్టుకోలేవు. మనం ఎంత పాపం చేస్తే అంత చిన్న శరీరం వస్తుంది. ఎలాంటి పాపం చేస్తే నాకిలాంటి శరీరం వచ్చింది అని ఆలోచించే కాలము కూడా లేని శరీరం వస్తుంది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 119 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 03 🌴


03. tena saṁsāra-padavīm avaśo 'bhyety anirvṛtaḥ
prāsaṅgikaiḥ karma-doṣaiḥ sad-asan-miśra-yoniṣu

The conditioned soul therefore transmigrates into different species of life, higher and lower, because of his association with the modes of material nature. Unless he is relieved of material activities, he has to accept this position because of his faulty work.

Here the word karma-doṣaiḥ means "by faulty actions." This refers to any activity, good or bad, performed in this material world—they are all contaminated, faulty actions because of material association. The foolish conditioned soul may think that he is offering charity by opening hospitals for material benefit or by opening an educational institution for material education, but he does not know that all such work is also faulty because it will not give him relief from the process of transmigration from one body to another. It is clearly stated here, sad-asan-miśra-yoniṣu. This means that one may take birth in a very high family or he may take his birth in higher planets, among the demigods, for his so-called pious activities in the material world. But this work is also faulty because it does not give liberation. One who desires material liberation has to turn his activities to devotional service. There is no alternative.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


మకర సంక్రాంతి, Makar Sankranti Pongal


🌹. మకర సంక్రాంతి విశిష్టత 🌹

🍀. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀

ప్రసాద్ భరద్వాజ


జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ దక్షిణాయనంలో సంచరిస్తూ వస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినం కూడా ఇది.

సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మ. కాల చక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయనంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. భోగి తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి.

సంక్రాంతి రోజునే శ్రీ మహా విష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చారు. ధర్మస్తాపన జరిగి అధర్మమును రూపుమాపిన రోజు సంక్రాంతి.

మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు సంక్రాంతి పర్వదినాన నిర్వర్తించాలి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరాకి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.

మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.


🌹. కనుము విశిష్టత 🌹

సంక్రాంతి పండుగల్లో చివరి రోజు కనుము. కనుము కర్షకుల పండుగ. పాడి పంటలను, పశు సంపదను, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు. ప్రకృతి స్వరూపిణీ అయిన అమ్మ ఆరాధన విశేషమే ఈ రోజు. తెలంగాణ ప్రాంతంలో ముత్తైదువులను తమ ఇంటికి ఆహ్వాంచి, పసుపు, కుంకుమలు, నువ్వుల పిండి మొదలైనవి ఇచ్చి 'సువాసి' పూజలు చేస్తారు. ఏడాదంతా పాడిపంటలకు తోడ్పడిన పశువులకు కృతజ్ఞతలు చెప్పడాకి 'కనుము' పండుగను జరుపుకుంటారు. మనది వ్యవసాయిక దేశం కనుక మనుష్యులకే కాదు, పశు పక్ష్యాదులకు ఇది పండుగే.

మనకు ఎంతో ఆనందాన్ని, సకల సౌభాగ్యాలను, శుభములనిచ్చే సంక్రాంతి పండుగలను భక్తి ప్రపత్తులతో పూజిద్దాం, తరిద్దాం.

🌹🌹🌹🌹🌹

15 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹15, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

🍀. మకర సంక్రాంతి శుభాకాంక్షలు, Good Wishes on Makar Sankranti Pongal 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మకర సంక్రాంతి పొంగల్‌, Pongal Makar Sankranti 🌻

🍀. సూర్య మండల స్త్రోత్రం - 4 🍀


యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం |
త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |

సమస్త తేజోమయ దివ్యరూపం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : సకల మానవ హృదంతరాళము లందునూ సనాతన వేదరహస్యం గర్భితమై వున్నది. పూర్ణయోగ దర్శనంలో దానికే 'శాస్త్రం' అని పేరు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పౌష్య మాసం

తిథి: కృష్ణ అష్టమి 19:46:53 వరకు

తదుపరి కృష్ణ నవమి

నక్షత్రం: చిత్ర 19:12:05 వరకు

తదుపరి స్వాతి

యోగం: సుకర్మ 11:50:38 వరకు

తదుపరి ధృతి

కరణం: బాలవ 07:39:28 వరకు

వర్జ్యం: 02:34:00 - 04:13:48

మరియు 24:50:48 - 26:27:36

దుర్ముహూర్తం: 16:31:45 - 17:16:34

రాహు కాలం: 16:37:21 - 18:01:22

గుళిక కాలం: 15:13:21 - 16:37:21

యమ గండం: 12:25:18 - 13:49:19

అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47

అమృత కాలం: 12:32:48 - 14:12:36

సూర్యోదయం: 06:49:14

సూర్యాస్తమయం: 18:01:22

చంద్రోదయం: 00:07:31

చంద్రాస్తమయం: 12:07:55

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: తుల

యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య

ప్రాప్తి 19:12:05 వరకు తదుపరి

లంబ యోగం - చికాకులు, అపశకునం


🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹