కపిల గీత - 119 / Kapila Gita - 119


🌹. కపిల గీత - 119 / Kapila Gita - 119🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 03 🌴


03. తేన సంసారపదవీమవశోऽభ్యేత్యనిర్వృతః
ప్రాసఙ్గికైః కర్మదోషైః సదసన్మిశ్రయోనిషు

ఆ అభిమాన కారణముగా దేహ సంబంధమైన పుణ్యపాప కర్మల దోషముచే, అతడు (ఆ జీవుడు) అస్వతంత్రుడై శాంతిని కోల్పోవును. ఇట్లు దేహాభిమాన కారణముగనే అతడు ఉత్తమ, మధ్యమ, నీచయోనుల యందు జన్మించుచు సంసార చక్రమున పరిభ్రమించు చుండును.

ఇది దేవ రాక్షస మానవ (సదసన్మిశ్రయోనిషు - సత్ - అసత్ మిశ్రయోనిషు). ఆత్మ పుట్టదు. శరీరం చేసిన పని నాదే అనుకున్న పాపానికి, ఆ శరీరానికి ఏ శిక్ష పడాలో దానికి తగ్గ శరీరం వస్తుంది. మానవుడి శరీరం తట్టుకొనే కష్ట సుఖాలను క్రిమి కీటకాలు తట్టుకోలేవు. మనం ఎంత పాపం చేస్తే అంత చిన్న శరీరం వస్తుంది. ఎలాంటి పాపం చేస్తే నాకిలాంటి శరీరం వచ్చింది అని ఆలోచించే కాలము కూడా లేని శరీరం వస్తుంది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 119 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 03 🌴


03. tena saṁsāra-padavīm avaśo 'bhyety anirvṛtaḥ
prāsaṅgikaiḥ karma-doṣaiḥ sad-asan-miśra-yoniṣu

The conditioned soul therefore transmigrates into different species of life, higher and lower, because of his association with the modes of material nature. Unless he is relieved of material activities, he has to accept this position because of his faulty work.

Here the word karma-doṣaiḥ means "by faulty actions." This refers to any activity, good or bad, performed in this material world—they are all contaminated, faulty actions because of material association. The foolish conditioned soul may think that he is offering charity by opening hospitals for material benefit or by opening an educational institution for material education, but he does not know that all such work is also faulty because it will not give him relief from the process of transmigration from one body to another. It is clearly stated here, sad-asan-miśra-yoniṣu. This means that one may take birth in a very high family or he may take his birth in higher planets, among the demigods, for his so-called pious activities in the material world. But this work is also faulty because it does not give liberation. One who desires material liberation has to turn his activities to devotional service. There is no alternative.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment