🍀 16, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 16, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 16, JANUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹. కనుమ పండుగ విశిష్టత - శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kanuma to All. 🌹
*ప్రసాద్ భరద్వాజ*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 312 / Bhagavad-Gita -312 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 02 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 159 / Agni Maha Purana - 159 🌹 🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 4 / Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 024 / DAILY WISDOM - 024 🌹 🌻 24. ఐక్యత యొక్క అవగాహన అమరత్వ స్థితికి దారితీస్తుంది / 24. The Perception of Unity Leads to the State of Immortality🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 288 🌹
6) 🌹. శివ సూత్రములు - 26 / Siva Sutras - 26 🌹 🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 1 / 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam -1🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹16, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
🍀. కనుమ శుభాకాంక్షలు, Good Wishes on Kanuma 🍀
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కనుమ, Kanuma 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 16 🍀*

29. నక్షత్రవిగ్రహ మతిర్గుణ బుద్ధిర్లయోఽగమః |
ప్రజాపతిర్విశ్వ బాహుర్విభాగః సర్వగోముఖః
30. విమోచనః సుసరణో హిరణ్య కవచోద్భవః |
మేఘజో బలచారీ చ మహీచారీ స్రుతస్తథా

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సనాతన వేద రహస్యం మానవ హృత్కుహరంలో తామర మొగ్గవలె ముకుళించుకుని వున్నది. మానవుని మనస్సు సత్యవస్తువు కభిముఖం కాజొచ్చినంతనే, — అతని హృదయం అనంతునిపై మరులు కొనుట ప్రారంభించి నంతనే ఆ అరవిందం ఒక్కొక్క రేకే వికసింప నుపక్రమిస్తుంది 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, హేమంత ఋతువు,
ఉత్తరాయణం,  పౌష్య మాసం
తిథి: కృష్ణ నవమి 19:21:56 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: స్వాతి 19:24:53 వరకు
తదుపరి విశాఖ
యోగం: ధృతి 10:32:22 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 07:38:32 వరకు
వర్జ్యం: 00:51:34 - 02:28:18
మరియు 24:51:22 - 26:24:54
దుర్ముహూర్తం: 12:48:04 - 13:32:55
మరియు 15:02:36 - 15:47:27
రాహు కాలం: 08:13:24 - 09:37:29
గుళిక కాలం: 13:49:44 - 15:13:49
యమ గండం: 11:01:34 - 12:25:39
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 10:31:58 - 12:08:42
సూర్యోదయం: 06:49:19
సూర్యాస్తమయం: 18:01:59
చంద్రోదయం: 01:00:04
చంద్రాస్తమయం: 12:46:37
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
19:24:53 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కనుమ పండుగ విశిష్టత - కనుమ శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kanuma to All. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కనుమ పండుగ విశిష్టత 🍀*

*సంక్రాంతి (Sankranthi) తరువాత వచ్చే పండుగే కనుమ పండుగ (Kanuma festival). కనుమ పండుగను పట్టణాల్లో కంటే పల్లెటూరులో బాగా జరుపుకుంటారు. ఈ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మనకు అన్నం పెట్టే భూమికి, గోవులకు, ఎడ్లకు పూజలు చేస్తారు. అయితే సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..*
 
*కనుమ రోజు ఆరెంజ్ కలర్ దుస్తులను (Orange color dress) ధరిస్తే మంచిది. ఈ రంగు దుస్తులను ధరిస్తే సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కనుమ పండుగ రోజున రైతులకు వ్యవసాయంలో సహకరించే పశువులను (Cattle) పూజించడం ఆచారంగా పాటిస్తారు.*
 
*ఈ రోజున పశువుల పాకను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలి (Pongali) వండుతారు. ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్ని పోలి చల్లటం (Poli challadam) అని అంటారు. పోలి చల్లడం అంటే సంవత్సరం పాటు పండే పంటలకు చీడ పురుగులు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.*
 
*ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం (Believe). ఈ రోజున ఆవులు, గేదెలు, ఎద్దులు, దున్నలను పసుపు, కుంకుమ, పూలు బెలూన్లతో అందంగా అలంకరించి (Beautifully decorated), కాళ్ళకు గజ్జలు, మెడలో గంటలు వేసి పూజిస్తారు. ఈ రోజున పశువులతో ఎటువంటి పని చేయించకుండా చాలా ప్రేమగా చూసుకుంటారు.*
 
*వారికి పంట పండించడంలో (Harvesting the crop) సహకరించిన ఈ పశువులను దైవంగా భావించి వాటిని పూజిస్తారు. అయితే కొన్ని పల్లెల్లో కనుమకు ఒక ప్రత్యేకత (Specialization) ఉంది. ఈ రోజున మినుములు తినాలనే ఆచారముంది. అందుకే వారు మినపగారెలను చేసుకొని తింటారు.*
 
*ఈ రోజున ఇంటికి వచ్చిన ఆడపడుచును, కొత్త అల్లుళ్లను తిరుగు ప్రయాణం (Return journey) చేయనివ్వరు. కనుమ రోజున మాంసాహారం (Non-vegetarian) వండుతారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కోలాహలంగా, సందడిగా ఇంటి వాతావరణం కనిపిస్తుంది. గాలి పటాలు ఎగుర వేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ పండుగను జరుపుకుంటారు.*
 
*కనుమ రోజున పెరుగును (Yogurt) దానం చేస్తే విశేష ఫలితం పొందుతారు. కొన్ని ప్రాంతాలలో కనుమ పండుగ రోజు పెద్ద ఎత్తున ఎద్దుల బండి పోటీలు (Bullock cart races), కోడిపందాలు నిర్వహిస్తుంటారు. వీటిని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం విశేషం. ఈ కనుమ పండుగ వాతావరణం అంతా పల్లెటూరిలో అందంగా కనిపిస్తుంది.*
 
*ఇలా సంక్రాంతి చివరి రోజులు జరుపుకునే కనుమ రోజుతో సంక్రాంతి పండుగ పూర్తవుతుంది. కనుమ పండుగ రోజున రైతులు పంట పండించడంలో సహాయపడిన పశువులను అందంగా అలంకరించి వాటికి ప్రత్యేక పూజలు చేయడం విశేషం. అందుకే కనుమ పండుగను పశువుల పండుగ (Cattle Festival) అని కూడా అంటారు.*
*- నవ్య*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 312 / Bhagavad-Gita - 312 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 02 🌴*

*02. అధియజ్ఞ: కథం కోత్ర దేహేస్మిన్మధుసూదన |*
*ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభి: ||*

🌷. తాత్పర్యం :
*ఓ మధుసుదనా! యజ్ఞప్రభువెవ్వరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించియుండును? భక్తియోగమునందు నిలిచినవారు మరణసమయమున నిన్నెట్లు ఎరుగజాలుదురు?*

🌷. భాష్యము :
యజ్ఞప్రభువను పదము ఇంద్రుని గాని, విష్ణువు గాని సూచించును. విష్ణువు బ్రహ్మరుద్రాది ప్రధానదేవతలతో ముఖ్యుడు కాగా, ఇంద్రుడు కార్యనిర్వాహక దేవతలతో ముఖ్యుడు. 

కనుకనే విష్ణువు మరియు ఇంద్రుడు ఇరువురును యజ్ఞములచే అర్పింపబడుదురు. కాని ఎవరు వాస్తవముగా యజ్ఞములకు ప్రభువనియు మరియు ఏ విధముగా భగవానుడు జీవిదేహములో వశించియుండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు.

శ్రీకృష్ణుడు మధువనెడి దానవుని సంహరించి యున్నందున అర్జునుడు అతనిని ఇచ్చట మధుసూదన అని సంభోదించుచున్నాడు. అర్జునుడు కృష్ణభక్తి పరాయణుడైనందున వాస్తవమునకు అతని మనస్సు నందు ఇట్టి సంశయములు ఉదయించకూడదు. 

అనగా ఈ సంశయములు దానవులను బోలియున్నవి. దానవులు దునుమాడుటులలో శ్రీకృష్ణుడు నేర్పరి కనుక తన మనస్సులో ఉదయించుచున్న దానవస్వభావ సంశయములను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఆ దేవదేవుని మధుసూదన యని సంబోధించుచున్నాడు. జీవితమున చేసినదంతయు మరణసమయమున పరీక్షింపబడుచున్నందున “ప్రయాణకాలే” యను పదము ఈ శ్లోకమున ప్రధానమై యున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 312 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 02 🌴*

*02. adhiyajñaḥ kathaṁ ko ’tra dehe ’smin madhusūdana*
*prayāṇa-kāle ca kathaṁ jñeyo ’si niyatātmabhiḥ*

🌷 Translation : 
*Who is the Lord of sacrifice, and how does He live in the body, O Madhusūdana? And how can those engaged in devotional service know You at the time of death?*

🌹 Purport :
“Lord of sacrifice” may refer to either Indra or Viṣṇu. Viṣṇu is the chief of the primal demigods, including Brahmā and Śiva, and Indra is the chief of the administrative demigods. Both Indra and Viṣṇu are worshiped by yajña performances. But here Arjuna asks who is actually the Lord of yajña (sacrifice) and how the Lord is residing within the body of the living entity.

Arjuna addresses the Lord as Madhusūdana because Kṛṣṇa once killed a demon named Madhu. Actually these questions, which are of the nature of doubts, should not have arisen in the mind of Arjuna, because Arjuna is a Kṛṣṇa conscious devotee. Therefore these doubts are like demons. Since Kṛṣṇa is so expert in killing demons, Arjuna here addresses Him as Madhusūdana so that Kṛṣṇa might kill the demonic doubts that arise in Arjuna’s mind.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 159 / Agni Maha Purana - 159 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 49*

*🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 4 🌻*

విష్ణువు గరుడారుఢుడై ఎనిమిది భుజములతో, కుడిచేతులలో ఖడ్గ-గాద-బాణ-వరదముద్రములను, ఎడమ చేతులలో ధనుస్‌-ఖేటక-చక్ర-శంఖములను ధరించి యుండును. లేదా ఆతని విగ్రహము చతుర్భుజము కూడ కావచ్చును. చతుర్భుజుడైన నృసింహుడు రెండు చేతులలో శంఖచక్రములను ధరించి, రెండు చేతులలో హరిణ్యకశివుని వక్షము చీల్చు చుండును.

వరాహమూర్తికి నాలుగు బాహువులుండును. ఆదిశేషుని చేతితోపట్టుకొనును. ఎడమచేతితో భూదేవిని ధరించును. ఎడమపార్శ్వమున లక్ష్మి ఉండును. లక్ష్మియున్నపుడు భూమి అతని పాదములందు లగ్నయైనట్లు చేయవలెను. త్త్రెలోక్య మోహనమూర్తియైన శ్రీహరి గరుడారూఢడు; ఎనిమిది భుజములు కుడిచేతులలో చక్ర-శంఖ-ముసల అంకుశములను, ఎడమచేతిలలో శంఖ-శార్జ-గదా-పాశములును ఉండును. వామభాగమున పద్మహస్తమైన లక్ష్మిప్రతిమను, దక్షిణ పార్శ్వమున సరస్వతి ప్రతిమను నిర్మింపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 159 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 49
*🌻Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 4 🌻*

16. (The image of) Viṣṇu (is represented) as having eight hands, Garuḍa (the vehicle), (holding) a sword, mace, and arrow in the right hand and as conferring gifts and (holding) the bow and mace in the left hand.

17. (The figure of) Narasiṃha (is represented) (as having) four hands holding the conch and disc and piercing (the body) of the mighty demon (Hiraṇyakaśipu).

18-21. (The figure of) Varāha (is endowed with) four arms holding the (serpent) Śeṣa in (one of) the hands and the earth in the left (hand) and (his consort) Kamalā (Lakṣmī). The earth should be made as resting at the feet and (goddess) Lakṣmī as seated at the feet. Trailokyamohana (one who stupefies the three worlds) (should be represented as riding) the Tārkhya (the eagle-vehicle) and possess eight hands, holding the sword, mace and goad in the right hand and the conch, bow, mace and the noose in the left hand. (Images of) Lakṣmī and Sarasvatī should be endowed with lotus and lute (respectively).  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹🌹.

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 24 / DAILY WISDOM - 24 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 24. ఐక్యత యొక్క అవగాహన అమరత్వ స్థితికి దారితీస్తుంది 🌻*

*లోపభూయిష్టమైన అంతర్గత సాధనాల వల్ల, అడ్డుపడే మానసిక స్థితుల వల్ల సత్యం సత్యంగా ప్రకాశించదు. ఈ పరిమితులను అధిగమిస్తే ఇంకా విస్తారమైన వాస్తవికత, గొప్ప స్వేచ్ఛ మరియు పూర్తి జీవితానికి దారితీస్తుంది. ప్రతి జీవిలో శాశ్వతంగా ఉండాలని, అన్ని విషయాలను తెలుసుకోవాలని, ప్రతిదానిపై ఆధిపత్యం చెలాయించాలని మరియు అత్యున్నత ఆనందాన్ని అనుభవించాలని ఒక సాధారణ కోరిక మరియు ప్రేరణ ఉంటాయి.*

*ఏకత్వాన్ని గుర్తించకపోవడం( ద్వైతం) స్వీయ వినాశనానికి దారితీసే మార్గం అని ఉపనిషత్తులు ఉద్ఘాటిస్తాయి. ఏకత్వాన్ని అనుభూతి చెందడంతో అత్యున్నత స్థితికి చేరుకుంటారు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 24 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 24. The Perception of Unity Leads to the State of Immortality 🌻*

*Truth does not shine as Truth, owing to the inner instruments, the clogging psychological modifications. The crossing the barrier of these limiting adjuncts seems to lead one to a vaster reality, greater freedom and fuller life. There is a common desire-impulse in every being to exist forever, to know all things, to domineer over everything, and to enjoy the highest happiness.*

*The statement of the Upanishads that the cognition of manifoldness is the path leading to self-destruction is adorned by the supreme exhortation that the perception of Unity leads to the exalted state of Immortality.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 289 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు శాశ్వతత్వాన్ని అందుకోడానికి, నువ్వు విశాలం కావడానికి, అపరిమితం కావడానికి, అవ్యక్తం కావడానికి ఆధ్యాత్మ ప్రయాణం దోహద పడుతుంది. 🍀*

*నదిలో బాటు ప్రవహించు. నదితో బాటు నడువు. నదిలో నిన్ను నువ్వు విస్మరించు. నది అప్పటికే సముద్రం వేపు సాగుతోంది. అది నిన్ను కూడా సముద్రం వేపు తీసుకుపోతుంది. నువ్వు ఈత కొట్టాల్సిన పన్లేదు. సముద్రం దేవుడికి ప్రాధాన్యం వహిస్తుంది. మనం సముద్రాన్ని చూడందే సంతృప్తిపడం. పరిమితుల వల్ల, సరిహద్దుల వల్ల, సముద్రాన్ని చూడలేం.*

*ఏ క్షణం నది సముద్రంలో కలుస్తుందో ఆ క్షణమే అది శాశ్వతత్వాన్ని సంతరించుకుంటుంది. ఆనంత మవుతుంది. ఆధ్యాత్మిక సాధనకు అదే లక్ష్యం. నువ్వు శాశ్వతత్వాన్ని అందుకోడానికి, నువ్వు విశాలం కావడానికి, అపరిమితం కావడానికి, అవ్యక్తం కావడానికి ఆధ్యాత్మ ప్రయాణం దోహద పడుతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 026 / Siva Sutras - 026 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 1 🌻*
*🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴*

*జాగృతి మేల్కొలుపు స్థితిని లేదా చైతన్యం యొక్క సక్రియమైన సాధారణ క్రియాశీల దశను సూచిస్తుంది (8).*

*స్వప్న అంటే కల. వికల్పం అంతర్గత అవగాహనను సూచిస్తుంది. బాహ్య అవగాహన ఇంద్రియాల ద్వారా జరుగుతుంది మరియు అంతర్గత అవగాహన మనస్సు ద్వారా జరుగుతుంది (9).*

*వివేక అంటే విచక్షణ. అవివేకా అంటే విచక్షణ లేకపోవడం. మాయ అంటే భ్రమ. సుషుప్తి అంటే గాఢ ​​నిద్ర. గాఢనిద్ర లేదా మాయలో విచక్షణ లేకపోవడం సహజంగా జరుగుతుంది (10).*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 026 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam -1🌻*
*🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴*

*Jñānaṁ means knowledge. Jāgrat refers to the state of wakefulness or the normal active stage with alert stage of consciousness (8).*

*Svapna means dream. Vikalpāḥ refers to internal perception. External perception happens through senses and internal perception happens through mind (9).*

*Viveka means discrimination. A-viveka means absence of discrimination. Māyā means illusion. Sauṣupta means deep sleep. Indiscrimination happens naturally in the deep sleep state or māyā (10).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

No comments:

Post a Comment