1) 🌹07 - DECEMBER డిసెంబరు - 2022 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 293 / Bhagavad-Gita -293 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -13వ శ్లోకము.
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 654 / Sri Siva Maha Purana - 654 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 005 / DAILY WISDOM - 005 🌹 సంపూర్ణ నిశ్శబ్దం The Supreme Silence
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 270 🌹
6) 🌹. శివ సూత్రములు - 07/ Siva Sutras - 07 🌹. 3. యోనివర్గః కాలశరీరం - 2 Yonivargaḥ kalāśarīram - 2
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹07, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. నారాయణ కవచం - 25 🍀*
*39. తస్యోపరి విమానేన గంధర్వపతిరేకదా |*
*యయౌ చిత్రరథః స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః*
*40. గగనాన్న్యపతత్సద్యః సవిమానో హ్యవాక్ఛిరాః |*
*స వాలఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః |*
*ప్రాప్య ప్రాచ్యాం సరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : అవిశ్వసనీయుడు - ఎన్నడూ అపజయాలు పొంది బాధల నుభవించని వానిని నీవు విశ్వసించ వద్దు. అతని అదృష్టాలు నీకు అనుసరించ దగినవి కావు, అతని పతాకం క్రింద నీవెప్పుడూ పోరాడవద్దు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల చతుర్దశి 08:02:27 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: కృత్తిక 10:26:15 వరకు
తదుపరి రోహిణి
యోగం: సిధ్ధ 26:53:45 వరకు
తదుపరి సద్య
కరణం: వణిజ 08:02:27 వరకు
వర్జ్యం: 27:50:40 - 29:35:08
దుర్ముహూర్తం: 11:45:04 - 12:29:36
రాహు కాలం: 12:07:20 - 13:30:50
గుళిక కాలం: 10:43:50 - 12:07:20
యమ గండం: 07:56:49 - 09:20:19
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:29
అమృత కాలం: 07:51:18 - 09:34:26
సూర్యోదయం: 06:33:19
సూర్యాస్తమయం: 17:41:20
చంద్రోదయం: 17:01:32
చంద్రాస్తమయం: 05:38:52
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు : సిద్ది యోగం - కార్య సిధ్ధి ,
ధన ప్రాప్తి 10:26:15 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 293 / Bhagavad-Gita - 293 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 13 🌴*
*13. త్రిభిర్గుణమయైర్భావైరేభి: సర్వమిదం జగత్ |*
*మోహితం నాభిజానాతి మామేభ్య: పరమవ్యయమ్ ||*
🌷. తాత్పర్యం :
*సమస్త విశ్వము సత్త్వరజస్తమో గుణములనెడి త్రిగుణములచే భ్రాంతికి గురియై గుణములకు పరుడను మరియు అవ్యయుడను అగు నన్ను ఎరుగజాలకున్నది.*
🌷. భాష్యము :
సమస్త ప్రపంచము త్రిగుణములచే మోహింపజేయబడియున్నది. అట్టి త్రిగుణములచే మోహమునకు గురియైనవారు శ్రీకృష్ణభగవానుడు ప్రకృతికి పరమైనవాడని ఎరుగజాలరు.
భౌతికప్రకృతి ప్రభావము నందున్న ప్రతిజీవియు ఒక ప్రత్యేకమైన దేహమును మరియు తత్సంబంధిత కర్మలను కలిగియుండును. గుణముల ననుసరించి కర్మల యందు చరించు మనుజులు నాలుగురకములుగా నుందురు. సత్త్వగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు బ్రహ్మణులు. రజోగుణమునందు సంపూర్ణముగా నిలిచియుండువారు క్షత్రియులు. రజస్తమోగుణములను కలిగియుండువారు వైశ్యులు, కేవలము తమోగుణము నందే యుండువారు శూద్రులు. శూద్రులకన్నను నీచులైనవారు జంతువులు లేక పశుప్రాయ జీవనులు అనబడుదురు.
కాని వాస్తవమునాకు ఈ ఉపాదులన్నియు అశాశ్వతములు. బ్రాహ్మణుడైనను, క్షత్రియుడైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను లేక ఇంకేదైనను ఈ జీవితము తాత్కాలికమైనది. ఈ జీవతము తాత్కాలికమైనను దీని పిదప మనకు ఈ జన్మ లభించునో ఎరుగలేము. మాయావశమున దేహభావనకు లోబడియే మనలను మనము భారతీయులుగనో, అమెరికావాసులుగానో లేక బ్రాహ్మణులుగనో, హిందువులుగనో, మహమ్మదీయులుగనో భావించుచుందురు. ఈ విధముగా త్రిగుణములచే బంధితులమైనచో మనము ఆ గుణముల వెనుకనున్న భగవానుని మరతుము. కనుకనే త్రిగుణములచే మోహమునొందిన జీవులు భౌతిక నేపథ్యము వెనుక నున్నది తానేయనుచు ఎరుగజాలకున్నారని శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు.
మానవులు, దేవతలు, జంతువులాదిగాగల అనేకరకముల జీవుల ప్రకృతి ప్రభావము చేతనే నిర్గుణుడైన శ్రీకృష్ణభగవానుని మరచియున్నారు. రజస్తమోగుణముల యందున్నవారే గాక, సత్త్వగుణమునందున్నవారు కూడా పరతత్త్వము యొక్క నిరాకారబ్రహ్మభావమును దాటి ముందుకు పోజాలరు. సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, యశస్సు, వైరాగ్యములు సమగ్రముగా నున్న శ్రీకృష్ణభగవానుని దివ్యరూపముచే వారు భ్రాంతి నొందుదురు. శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనుట సత్త్వగుణమునందున్నవారికే సాధ్యము కాదన్నచో, రజస్తమోగుణము లందున్నవారికి ఏమి ఆశ మిగిలి యుండగలదు? కాని కృష్ణభక్తిరసభావనము ఈ త్రిగుణములకు పరమైనట్టిది. దాని యందు ప్రతిష్టితులైనట్టివారు నిజముగా ముక్తపురుషులు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 293 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 7 - Jnana Yoga - 13 🌴
*13. tribhir guṇa-mayair bhāvair ebhiḥ sarvam idaṁ jagat*
*mohitaṁ nābhijānāti mām ebhyaḥ param avyayam*
🌷 Translation :
*Deluded by the three modes [goodness, passion and ignorance], the whole world does not know Me, who am above the modes and inexhaustible.*
🌹 Purport :
The whole world is enchanted by the three modes of material nature. Those who are bewildered by these three modes cannot understand that transcendental to this material nature is the Supreme Lord, Kṛṣṇa.
Every living entity under the influence of material nature has a particular type of body and a particular type of psychological and biological activities accordingly. There are four classes of men functioning in the three material modes of nature. Those who are purely in the mode of goodness are called brāhmaṇas. Those who are purely in the mode of passion are called kṣatriyas. Those who are in the modes of both passion and ignorance are called vaiśyas.
Those who are completely in ignorance are called śūdras. And those who are less than that are animals or animal life. However, these designations are not permanent. I may be either a brāhmaṇa, kṣatriya, vaiśya or whatever – in any case, this life is temporary. But although life is temporary and we do not know what we are going to be in the next life, by the spell of this illusory energy we consider ourselves in terms of this bodily conception of life, and we thus think that we are American, Indian, Russian, or brāhmaṇa, Hindu, Muslim, etc. And if we become entangled with the modes of material nature, then we forget the Supreme Personality of Godhead, who is behind all these modes. So Lord Kṛṣṇa says that living entities deluded by these three modes of nature do not understand that behind the material background is the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 654 / Sri Siva Maha Purana - 654 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 16 🌴*
*🌻. గణేశ శిరశ్ఛేదము - 2 🌻*
వీనిని మోసముతో మాత్రమే సంహరింప వచ్చును. మరియొక విధముగా వీనిని సంహరించుట సంభవము కాదు. శివుడు ఈ విధముగా నిశ్చయించుకొని సైన్యమధ్యములో నిలబడెను (8). నిర్గుణుడే యైననూ సగుణడై రూపమును స్వీకరించి యున్న శివదేవుడు, మరియు విష్ణువు కూడ యుద్ధములోనికి రాగానే, సర్వదేవతలు (9) మరియు మహేశుని గణములు కూడ గొప్ప హర్షమును పొందిరి. వారందరు ఒకరితో నొకరు కలుసుకొని ఉత్సవమును చేసిరి(10). అపుడు శక్తి పుత్రుడు, వీరుడు అగు గణేశుడు వీరగతిని ప్రదర్శించి మున్ముందుగా సుఖములన్నింటికీ విష్ణువును తన కర్రతో పూజించెను (11).
ఓ విభూ! నేనీతనిని మోహింప జేసిన సమయములో నీవాతనిని వధించుము. ఈ తపశ్శాలిని సమీపంచుట సంభవము కాదు. ఈతనిని మోసము లేకుండగా వధింప జాలము (12). ఇట్లు నిశ్చయించి శంభునితో సంప్రదించి ఆయన అనుమతిని పొంది విష్ణువు గణేశుని మోహింపజేయు ప్రయత్నములో లీనమయ్యెను (13). ఓ మహర్షీ! ఆ విధముగా మోహింప జేయుటలో నిమగ్నమై యున్న విష్ణువును గాంచి శక్తి మాత లిద్దరు తమ శక్తి బలమును ఆ గణేశునకు ఇచ్చిరి (14). ఆ శక్తి మాతలిద్దరు అంతర్ధానము కాగానే ఇనుమడించిన బలము గల గణేశుడు విష్ణువు స్వయముగా నిలబడి యున్న స్థలమునకు పరిఘను విసిరి వేసెను (15).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 654🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 16 🌴*
*🌻 The head of Gaṇeśa is chopped off during the battle - 2 🌻*
8. Thinking within himself “He has to be killed only by deception and not otherwise” he stayed in the midst of the army.
9-10. When lord Śiva who though devoid of attributes had assumed the attributive form was seen in the battle, when Viṣṇu too had come thither, the gods and Gaṇas of Śiva were highly delighted. They joined together and became jubilant.
11. Then Gaṇeśa the heroic son of Śakti following the course of heroes, at first worshipped (i.e struck) Viṣṇu with his staff, Viṣṇu who confers happiness to all.
12-13. “I shall cause him delusion. Then let him be killed by you, O lord. Without deception he cannot be killed. He is of Tāmasika nature and inaccessible.” Thinking thus and consulting Śiva, Viṣṇu secured Śiva’s permission and was engaged in the activities of delusion.
14. O sage, on seeing Viṣṇu in that manner, the two Śaktis handed over their power to Gaṇeśa and became submerged.
15. When the two Śaktis became submerged, Gaṇeśa with more strength infused in him hurled the iron club in the place where Viṣṇu stood.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 05 / DAILY WISDOM - 05 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 5. సంపూర్ణ నిశ్శబ్దం 🌻*
*ఆత్మ యొక్క ఆనందమే జీవుడు యొక్క ఆనందం. ఇది అత్యున్నత చైతన్యం యొక్క ఆనందం. చైతన్యంలో జీవించడం అంటే శాశ్వతమైన ఆనందంలో జీవించడం. ఇది సాధించడంలో ఉండదు. సాక్షాత్కారం మరియు అనుభవంలో ఉంటుంది. నూతనావిష్కరణలో ఉండదు కానీ ఉన్నది కనుక్కోవడంలో ఉంటుంది. వ్యక్తిగత సత్యము, విశ్వసత్యము మధ్య ఏకత్వము పెరిగే కొద్దీ చైతన్యం మరింతగా వ్యక్తమవుతుంది.*
*అవి రెండూ ఒకటే అయినప్పుడు చైతన్యం మాత్రమే వ్యక్తమవుతుంది. ఈ పూర్ణ చైతన్యమే అనంతమైన ఆనందం. ఇదే సర్వ శక్తులకు మూలం. ఇదే అనంతమైన స్వేచ్ఛ. ఇక్కడ జీవుడు ఉనికిలో ఒక అవిభాజ్య భాగమైపోతాడు. ఇక్కడే జీవుడు సత్యం యొక్క గంభీరమైన, సంపూర్ణమైన నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతాడు.*
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 05 🌹*
*🍀 📖 From The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj
*🌻 5. The Supreme Silence 🌻*
*The delight of the Self is the delight of Being. It is the Bliss of Consciousness-Absolute. The Being of Consciousness is the Being of Bliss, Eternal. It does not lie in achievement but realisation and experience, not invention but discovery. The Consciousness is more intense when the objective existence is presented near the subject, still more complete when the subjective and the objective beings are more intimately related, and fully perfected and extended to Absoluteness in the identification of the subject and the object.*
*This Pure Consciousness is the same as Pure Bliss, the source of Power and the height of Freedom. This is the supreme Silence of the splendid Plenitude of the Real, where the individual is drowned in the ocean of Being.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 270 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. తెలియని దాన్ని ఆహ్వానించు. దాని గుండానే ఎదుగుతావు. పరిణితికి వస్తావు. క్షణకాలం కూడా పాతదానికి అతుక్కోకు. చైతన్యముంటే ప్రేమ, ఆనందం దైవత్వం, సత్యం, స్వేచ్ఛ వస్తాయి.🍀*
*పాతదాన్ని నువ్వు ఎన్నుకుంటే బాధను ఎన్నుకుంటావు. కొత్తదాన్ని ఎన్నుకుంటే ఆనందంలో వుంటావు. అదే తాళం చెవిగా భావించు. తెలియని దాన్ని, ప్రమాదాన్ని ఆహ్వానించు. దాని గుండానే ఎదుగుతావు. పరిణితికి వస్తావు. క్షణకాలం కూడా పాతదానికి అతుక్కోకు. పాతదేదయినా వదిలిపెట్టు. పని పూర్తయ్యాకా ముగింపు పలుకు. వెనక్కి చూడకు. ముందుకే వెళ్ళాలి.*
*ఎవరూ అడుగుపెట్టని శిఖరాన్ని అధిరోహించడం ప్రమాదమే. ఎందుకంటే ఆ దారిలో ఎవరూ అప్పటిదాకా వెళ్ళలేదు. అక్కడ ప్రమాదాలున్నాయి. ప్రమాదం, ఆటంకం, అభద్రత నిన్ను చైతన్యంగా వుంచుతాయి. చైతన్యముంటే అన్నీ వుంటాయి. అన్నీ వస్తాయి. ప్రేమ, ఆనందం దైవత్వం సత్యం స్వేచ్ఛ వస్తాయి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 07 / Siva Sutras - 07 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
1- శాంభవోపాయ
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻3. యోనివర్గః కాలశరీరం - 2 🌻*
*🌴. ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం.🌴*
*స్వచ్ఛమైన చైతన్యంలో మాత్రమే బ్రహ్మం సాక్షాత్కరింప బడుతుంది. బంధమే స్వచ్ఛమైన చైతన్యం యొక్క బాధకు కారణం. ఈ సూత్రం బంధానికి గల కారణాలను విశ్లేషిస్తుంది. మునుపటి సూత్రంలో, మలమే (సహజ మలినాలు) బానిసత్వానికి కారణమని చర్చించారు. స్పంద కారికా (I.9) సహజమైన అశుద్ధం లేదా మాలాను ఇలా వివరిస్తుంది, “అనుభావిక వ్యక్తి యొక్క మానసిక స్థితి అతని స్వంత అపరిశుభ్రత వల్ల కర్మలకు (వర్గః) అనుబంధాన్ని కలిగిస్తుంది. ఇది తొలగిపోయినపుడు, అత్యున్నత స్థితి కనిపిస్తుంది. అంటే, అజ్ఞానం తొలగిపోయినప్పుడు, బ్రహ్మం సాక్షాత్కరిస్తుంది. మలాలు మళ్లీ రెండు రకాలుగా విభజించబడ్డాయి.*
*మొదటిది కర్మ మలము (కర్మ అనేది ప్రక్రియ నుండి భిన్నమైనది) మరియు రెండవది మాయ మలము. కర్మ మలము మానసిక మరియు శారీరక చర్యలను సూచిస్తుంది. ఇది ఒక కోరిక. మాయ యొక్క ఇతర సృష్టి అయిన సంబంధాలు మరియు భౌతిక అవసరాలతో స్వయం యొక్క అనుబంధానికి బాధ్యత వహిస్తుంది. ఒకరు మాయ మలం నుండి విముక్తులు అవ్వగలిగితే, అతను లౌకిక అస్తిత్వం కలిగి ఉండడు. అతను ఉన్నత మానవ ఉనికి కలవాడు లేదా జ్ఞాని అని అర్థం. అజ్ఞానం మరియు తత్ఫలితంగా వచ్చే బంధానికి మాయ మాత్రమే కారణం. ఆధ్యాత్మిక మార్గంలో అడ్డంకులను కలిగించేది మాయ మాత్రమే.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 07 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻3. Yonivargaḥ kalāśarīram - 2 🌻*
*🌴The multitude of similar origins is the body of parts of the whole.🌴*
*Brahman can be realised only in pure consciousness and bondage is the cause for the affliction of pure consciousness. This sūtrā proceeds to analyse the reasons for bondage. In the previous sūtrā, it was discussed that mala (natural impurities) is the cause for bondage. Spanda Kārikā (I.9) explains natural impurity or mala thus, “The afflicted mental state of an empirical individual is disabled by his own impurity causing attachment to actions (vargaḥ). When this disappears, then the highest state appears.” This means, when ignorance is removed, the Brahman is realised. The mala is again divided into two types.*
*The first one is kārma mala (karmā is different from kārma) and the second one is māyīya mala. Kārma mala refers to both mental and physical actions. It is essentially a desire, responsible for infinite association of the self with other creations of māyā (attachment to relationships and materialistic needs). If one is not associated with māyīya mala then it means that he is not a mundane existence, but a super human existence or a jñānī. It is only the māyā that is solely responsible for ignorance and consequent bondage. It is only the māyā that causes roadblocks in the spiritual path.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj