🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 139 / Agni Maha Purana - 139 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 43
🌻. ఆలయ ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనము - 2🌻
లేదా తూర్పు మొదలగు దిక్కులతో కేశవాది ద్వాదశ విగ్రహములను స్థాపించి మిగిలన గృహమునందు సాక్షాత్తు శ్రీహరిని స్థాపింపవలెను. భగవత్ర్పతిమను మట్టి, కఱ్ఱ, లోహము, రత్నములు, ఱాయి, చందనము, పుష్పము అను ఏడువస్తువులతో నిర్మింపబడి ఏడువిధములుగ నుండును. పుష్పములతోమట్టితో, చందనముతో నిర్మించిన ప్రతిమను వెంటనే పూజింపవలెను. చాల సమయము ఉంచకూడదు. పూజింపబడిన ఈ ప్రతిమలు సమస్తకామములను శీఘ్రముగ ఫలింప జేయును.
ఇప్పుడు శిలానిర్మిత ప్రతిమను గూర్చి చెప్పెదను. పర్వతమునుండి తీసికొనివచ్చిన ఱాయితో చేసిన ప్రతిమ ఉత్తమమైనది. పర్వతములు లేని పక్షమున భూమిలో లభించిన ఱాయి ఉపయోగింపవచ్చును. బ్రాహ్మణాదివర్ణముల వారికి వరుసగ తెల్లని, ఎఱ్ఱని, పచ్చని, నల్లని ఱాళ్ళు ఉత్తమమైనవి. తగిన వర్ణముగల శిల లభించినచో ఆలోపమును తీర్చుచటకై నరసింహ మంత్రముతో హోమము చేయవలెను. శిలపై తెల్లని రేఖఉన్నచో అది చాల ఉత్తమమైనది.
నల్లరేఖ ఉన్నచో నరసింహ హోమము చేసిన పిమ్మట అది ఉత్తమముగాను కంచుఘంటవంటి ధ్వని వచ్చుచు, భేదించినపుడు అగ్నికణములు వచ్చు శిల ''పులింగము'' ఆ చిహ్నములు తక్కువగా ఉన్న శిల ''స్త్రీ లింగము'' ఈ రెండు చిహ్నములను తేనిది ''నపుంసకలింగము'' ఏదైన మండలము వంటి గుర్తు ఉన్న శిల 'సగర్భ'; దానిని పరిత్యజింపవెలను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 139 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 43
🌻 Installation of deities in the temples - 2 🌻
9-11. (Images of) Keśava and others (should be placed) in the east and other directions or (the images) of Hari himself in all chambers. The images are of seven kinds—earthen, wooden, metallic, made of gems, made of stones, made of sandal and made of flowers. The images made of flowers, sandal and earth yield all desired fruits when they are worshipped at that moment. I shall describe the stone image (where such practice) prevails.
12. In the absence of hills, the stone lying buried in the earth should be taken out. Among the colours, white, red, yellow, and black are extolled.
13. When stones of the above-mentioned colours are not available (the desired) colour is brought about by the (ceremony known as) siṃhavidyā.[1]
14. After (the performance of) the siṃhahoma (a piece of) stone (which becomes) tinged with white colour or black colour or produces sound like a bell-metal or emits sparks of fire (is deemed) as male.
15. The female one is that in which these characteristics are present in a lesser degree. If they are devoid of colours they are neuter. (The stones) in which the sign of a circle is found are to be taken as impregnated and should be rejected.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment