🌹 07, JUNE 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 07, JUNE 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 07, JUNE 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 381 / Bhagavad-Gita - 381 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 09 / Chapter 10 - Vibhuti Yoga - 09 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 228 / Agni Maha Purana - 228 🌹 
🌻. జీర్ణోద్ధారవిధి కథనము / Renovation of decayed images (jīrṇoddhāra) 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 093 / DAILY WISDOM - 093 🌹 
🌻 2. విశ్వవ్యాప్త కోరిక నిజంగా ఆధ్యాత్మిక ప్రేరణ / 2. The Universal Urge is Really the Spiritual Impetus 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 359 🌹
6) 🌹. శివ సూత్రములు - 95 / Siva Sutras - 95 🌹 
🌻 2-06. గురు రూపాయః - 2 / 2-06. guru Rupāyah   - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 07, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్ఠి చతుర్థి, Sankashti Chaturthi 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 24 🍀*

*సర్వత్రమాన్యం సకలావభాసకం సుజ్ఞైః శుభాదావశుభాదిపూజితమ్ |*
*పూజ్యం న తస్మాన్నిగమాదిసమ్మతం తం సర్వపూజ్యం ప్రణతోఽస్మి నిత్యమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవంతునితో సంయోగం - భగవంతునితో అంతస్సంయోగమే సర్వకాల సర్వావస్థలలోనూ స్థిరమైనది. బాహ్య సంయోగం సాధారణంగా అలా స్థిరం కానేరదు. కొందరు, భగవదారాధన చేస్తున్న సమయంలో తాము పూజించే పటంగాని, విగ్రహం గాని సచేతనమై తమకు పలుకుతున్నట్లనుభవం పొందవచ్చు. కొందరు భగవంతుడు నిత్యమూ తమ చెంతనే, తామున్న గదిలోనే తిరుగాడుతున్నట్లనుభవం పొందవచ్చు. కొందరాయన ఆలింగనాది స్పర్శలను సైతం అనుభవిస్తూ వుండవచ్చు. కాని, ఇవన్నీ అస్థిరములే. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ చవితి 21:52:04 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: ఉత్తరాషాఢ 21:03:23
వరకు తదుపరి శ్రవణ
యోగం: బ్రహ్మ 22:23:43 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: బవ 11:20:59 వరకు
వర్జ్యం: 06:30:20 - 07:57:36
మరియు 24:42:20 - 26:10:04
దుర్ముహూర్తం: 11:48:37 - 12:41:09
రాహు కాలం: 12:14:53 - 13:53:24
గుళిక కాలం: 10:36:22 - 12:14:53
యమ గండం: 07:19:21 - 08:57:52
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 15:13:56 - 16:41:12
సూర్యోదయం: 05:40:51
సూర్యాస్తమయం: 18:48:55
చంద్రోదయం: 22:20:11
చంద్రాస్తమయం: 08:38:14
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: వజ్ర యోగం - ఫల
ప్రాప్తి 15:34:59 వరకు తదుపరి
ముద్గర యోగం - కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 381 / Bhagavad-Gita - 381 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 09 🌴*

*09. మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్త: పరస్పరమ్ |*
*కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ||*

🌷. తాత్పర్యం :
*నా శుద్ధభక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై, వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై యుండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు.*

🌷. భాష్యము :
*శుద్ధభక్తుల వారి లక్షణములు ఇచ్చట పేర్కొనబడినవి. శ్రీకృష్ణభగవానుడు దివ్యమగు ప్రేమయుతసేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు. వారి మనస్సు లెన్నడును శ్రీకృష్ణచరణారవిందముల నుండి మరలవు. వారి చర్చలు ఆధ్యాత్మిక విషయముల పైననే పూర్ణముగా కేంద్రీకృతమై యుండును. కనుకనే వారి దివ్యలక్షణములు ఈ శ్లోకమున ప్రత్యేకముగా వర్ణింపబడినవి. అట్టి శుద్ధభక్తులు ఇరువదినాలుగుగంటలు శ్రీకృష్ణభగవానుని గుణములను మరియు లీలలను కీర్తించుట యందు లగ్నమై యుందురు. హృదయము మరియు ఆత్మ సదా శ్రీకృష్ణతత్పరములై యుండి వారు ఇతర భక్తులతో ఆ దేవదేవుని గూర్చి చర్చించుట యందు ఆనదమును ననుభవింతురు. భక్తియోగపు ప్రాథమికదశ యందు సేవ ద్వారా దివ్యానందము ననుభవించెడి భక్తులు పరిపక్వస్థితిలో భగవత్ప్రేమ యందే వాస్తవముగా స్థితులగుదురు.*

*అటువంటి దివ్యస్థితి యందు నెలకొనిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు తన ధామమునందు ప్రదర్శించు సంపూర్ణత్వమును వారు అనుభవింపగలరు. భక్తియుతసేవను జీవుని హృదయమునందు బీజమును నాటుటగా శ్రీచైతన్యమహాప్రభువు పోల్చియున్నారు. విశ్వమునందలి అసంఖ్యాకలోకములలో సదా పరిభ్రమించు అనంతకోటి జీవరాసులలో భాగ్యవంతులైన కొందరే శుద్ధభక్తుని సాంగత్యమును పొంది భక్తిని గూర్చి తెలియుట అవకాశమును పొందుదురు. ఈ భక్తియుతసేవ యనునది బీజము వంటిది. అట్టి భక్తిబీజము హృదయములో నాటబడిన పిమ్మట మనుజుడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను కృష్ణనామమును కీర్తించుటను, శ్రవణము చేయుటను నిరంతరము కొనసాగించినచో నిత్యము జలమొసగుటచే వృక్షబీజము మొలకెత్తు రీతి, ఆ భక్తిబీజము మొలకెత్తగలదు. పిమ్మట భక్తిలత క్రమముగా పెరిగి పెరిగి బ్రంహాండమును చేదించుకొని ఆధ్యాత్మికాకాశమునందలి బ్రహ్మజ్యోతిని చేరును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 381 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 09 🌴*

*09. mac-cittā mad-gata-prāṇā bodhayantaḥ parasparam*
*kathayantaś ca māṁ nityaṁ tuṣyanti ca ramanti ca*

🌷 Translation : 
*The thoughts of My pure devotees dwell in Me, their lives are fully devoted to My service, and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about Me.*

🌹 Purport :
*Pure devotees, whose characteristics are mentioned here, engage themselves fully in the transcendental loving service of the Lord. Their minds cannot be diverted from the lotus feet of Kṛṣṇa. Their talks are solely on the transcendental subjects. The symptoms of the pure devotees are described in this verse specifically. Devotees of the Supreme Lord are twenty-four hours daily engaged in glorifying the qualities and pastimes of the Supreme Lord. Their hearts and souls are constantly submerged in Kṛṣṇa, and they take pleasure in discussing Him with other devotees.*

*In the preliminary stage of devotional service they relish the transcendental pleasure from the service itself, and in the mature stage they are actually situated in love of God. Once situated in that transcendental position, they can relish the highest perfection which is exhibited by the Lord in His abode. Lord Caitanya likens transcendental devotional service to the sowing of a seed in the heart of the living entity. There are innumerable living entities traveling throughout the different planets of the universe, and out of them there are a few who are fortunate enough to meet a pure devotee and get the chance to understand devotional service.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 228 / Agni Maha Purana - 228 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 67*

*🌻. జీర్ణోద్ధారవిధి కథనము 🌻*

*హయగ్రీవుడు చెప్పెను - ఇప్పుడు జీర్ణోద్ధార విధిని చెప్పెను. ఆచార్యుడు మూర్తికి అలంకరించి స్నానము చేయించవలెను. అత్యంతము జీర్ణమైనది, అంగవిహీనము, భగ్నమైనది, శిలామాత్రావశిష్టమైనది, అగు ప్రతిమను పరిత్యజించవలెను. దీని స్థానమునందు వెనుకటి వలెనే నవీనమైన స్థిరమూర్తిని స్థాపింపవలెను. ఆచార్యుడు భూతశుద్ధిప్రకరణములో చెప్పిని విధమున, సంహారవిధిచే సకల తత్త్వముల సంహారము చేయవలెను. నృసింహా మంత్రముతో వేయి హోమము చేసి మూర్తిని పెకిలించవలెను. దారుమయ మూర్తియైనచో అగ్నిచే దహింపచేయవలెను. శిలా నిర్మితమూర్తియైనచో యైనచో జలములు విడువలెను. ధాతుమయమూర్తి గాని, రత్నమయమూర్తి గాని ఐనచో సముద్రములో ఆగాధ జలములో పడవేయవలెను. జీర్ణప్రతిమను వాహనముపై ఎక్కించి, వస్త్రాదులచే కప్పి, వాథ్యములతో తీసికొని వెళ్ళి నీటిలో విడువవలెను. పిమ్మట ఆచార్యునకు దక్షిణ ఈయవలెను. అదివసమునందే వెనుకటి ప్రతిమ దేనిచేత నిర్మింపబడినచో, ఎంత ప్రమాణము కలదో అదే ద్రవ్యముతో, అంతే ప్రమాణము గల మూర్తిని స్థాపించవలెను. ఈ విధముగనే జీర్ణ కూప-వాపీ-తడాగాదుల ఉద్ధారముచేయుటచే గొప్ప ఫలము లభించును.*

*శ్రీ అగ్నిమహాపురాణమునందు జీర్ణోద్ధారవిధి కథనమను ఆరువది యేడవ అధ్యాయము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 228 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 67*
*🌻Renovation of decayed images (jīrṇoddhāra) 🌻*

The Lord said:

1. I shall describe the process of replacing the old images. The priest should bathe the images with their ornaments on them. The fixed class of images should be put in a room and the extremely time-worn ones should be rejected.

2. A broken or mutilated stone (image) (should be cast aside) and a new one the same as the previous one should be installed (in its place) by the priest after merging the principles according to the process of merging (described earlier).

3. Having made one thousand oblations with the Narasiṃha (mantra), the priest should lift that image. The old image made of wood should be put into fire and the one made of stone should be thrown into water.

4. The old image made of a mineral or gem should be carried on a vehicle after covering it with cloth etc. and be discarded in the deep waters of the ocean.

5. It [i.e., jīrṇoddhāra] should be thrown into waters accompanied by the notes of music instruments. Fees should be paid to the priest.

6. New images of the same size and made of the same material should be installed on the same day. One accrues great merit by the renovation of wells, tanks and ponds.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 93 / DAILY WISDOM - 93 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 2. విశ్వవ్యాప్త కోరిక నిజంగా ఆధ్యాత్మిక ప్రేరణ 🌻*

*ఆధ్యాత్మికంగా ఎదగాలనేది విశ్వం మనకు ఎల్లప్పుడూ ఇచ్చే ప్రేరణ. నిజానికి ఆ ప్రెరణని నిర్దుష్టంగా ఆధ్యాత్మికం అని అనాల్సిన అవసరం లేదు. ఎదగాలనే ఇచ్ఛ, సంకల్పం విశ్వం లోని ప్రతి జీవికి ఉంటుంది. ఆ సామూహిక సంకల్పమే ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క ప్రేరణ అని చెప్పవచ్చు. భౌతికంగా చూస్తే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే ఆ సంకల్పం పైకి ప్రస్ఫుటంగా కనిపించకపోవచ్చు. కానీ కనిపించదు కాబట్టి లేదు అని మనం అనలేము.*

*కేవలం పైకీ కనిపించేది మాత్రమే మనం కాదు. అవసరం వచ్చినప్పుడు పైకి ప్రకటితమయ్యే మనలోని అంతర్లీన సమర్ధతలు, సంకల్పాలు సైతం మనలోని భాగమే. అవి ఈ జన్మలో ప్రకటితమవ్వచ్చు, పూర్వ లేదా వచ్చే జన్మలలో కావచ్చు. ఈ అధ్యామిక ఎదుగుదల పట్ల మనకున్న ప్రేరణ నిజానికి విశ్వవ్యాప్తమైనది. వ్యక్తిగతమైనది కాదు. కనీసం సమాజ స్థాయిలో సామూహికమైనది కూడా కాదు. విశ్వవ్యాప్తమైనది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 93 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 2. The Universal Urge is Really the Spiritual Impetus 🌻*

*The Universal Urge is really the Spiritual Impetus, and we need not use the word ‘spiritual’ to designate it. An all-consuming impulse towards a Common Aim is what may be regarded as the spiritual aspiration or the basic urge of the individual. It may not be visible in the proper intensity or proportion at certain given levels of experience, but that an expected percentage of it is not visible on the surface is not a reason why one should not give it the credit it deserves. *

*All that we are inside does not come to the surface of our conscious life, as we all very well know; yet, we are that which is there ready to come to the surface of our mind one day or the other as the motivating force of our lives, whether in this life or in the lives to come. The urges of human nature are really universal in their comprehension; they are not individual, they are not even social in the sense in which we try to define society.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 358 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనసన్నది ధ్యానం లేని స్థితి. నువ్వు మనసు గుండా జీవిస్తావు. మనసుగా జీవిస్తావు. కాబట్టి సమస్య అదొక్కటే. నువ్వు ధ్యానంలో ప్రవేశించిన క్షణం మనసు మాయమవుతుంది. 🍀*

*ఆలోచనలు చీకటిలాంటివి. అవి చీకటి వచ్చినట్టే వస్తాయి. నిజమనిపిస్తాయి. కాంతి రంగవేశం చేస్తే మాయమవుతాయి. అవి వున్నట్లనిపిస్తాయి. అది భ్రాంతి. కాబట్టే నువ్వు చీకటిని సరాసరి ఎదుర్కోలేవు. తరిమెయ్యలేవు. అట్లాగే నువ్వు చీకటిని తీసుకురాలేవు. అది లేనిది గనుక ముక్కు సూటిగా వ్యవహరించలేవు. అది కేవలం కాంతి లేకపోవడమే. అక్కడికి కాంతిని తీసుకు రావడమొక్కటే నువ్వు చేయాలి. మనసుకు సంబంధించిన విషయం కూడా అలాంటిదే. మనసన్నది ధ్యానం లేని స్థితి. నువ్వు ధ్యానంలో ప్రవేశించిన క్షణం మనసు మాయమవుతుంది. చీకటిలా మాయమవుతుంది.*

*మనం మనసనే భ్రమలో బ్రతుకుతూ వుంటాం. నిజమైన ప్రపంచం దూరంగా వుంటుంది. అది వాస్తవ ప్రపంచాన్ని అడ్డుకుంటుంది. తన ప్రపంచాన్ని ముందుకు తెచ్చి అదే నిజమైన ప్రపంచమని భ్రమపెడుతూ వుంటుంది. వాస్తవాన్ని చూడనియ్యడు. నిన్ను నువ్వు కూడా చూడాలంటే అడ్డుపడుతుంది. అంతర్భహి: ప్రపంచాల్ని అదృశ్యం చేస్తుంది. పునాది లేని ప్రపంచమే సర్వస్వం అవుతుంది. అది నీపై అజమాయిషీ చేస్తుంది. నువ్వు మనసు గుండా జీవిస్తావు. మనసుగా జీవిస్తావు. కాబట్టి సమస్య అదొక్కటే. భ్రమలో జీవించడం నిష్ఫలం అక్కడ అభివృద్ధి వుండదు. పరిణితి వుండదు. సంపన్నత వుండదు. అవగాహన వుండదు. ఆనందముండదు. సత్యముండదు. అందముండదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 095 / Siva Sutras - 095 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-06. గురు రూపాయః - 2 🌻*
*🌴. మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను అధిగమించడానికి, మాతృకలలో నివసించే మంత్ర శక్తులను మేల్కొల్పడానికి మరియు స్వయం యొక్క స్వచ్ఛమైన ఎరుకను పొందడానికి గురువు సాధనం. 🌴*

*ఆధ్యాత్మిక పురోగతి వివిధ దశలలో జరుగుతుంది. మొదట, ఇది సైద్ధాంతిక అధ్యయనం మరియు వాటిని అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల జ్ఞానం లభిస్తుంది. తదుపరి దశ అనుభవానికి దారితీసే ఆ సైద్ధాంతిక జ్ఞానాన్ని అమలు చేయడం. అనుభవం నుండి జ్ఞానం పొందబడుతుంది. పొందిన జ్ఞానంతో, బ్రహ్మాన్ని అన్వేషించడం ప్రారంభిస్తారు మరియు ఒక సమయంలో భగవంతుడు తన స్వయం అని అర్థం చేసుకుంటాడు. ఈ అవగాహన ధృవీకరణగా మారినప్పుడు, అతను స్వీయ-సాక్షాత్కారమైన వ్యక్తిగా పరిగణించబడతాడు. మొత్తం ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు, కొన్ని ప్రక్రియలను సిద్ధాంతాలు వివరించలేవు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 095 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-06. guru Rupāyah   - 2 🌻*
*🌴. The guru is the means to overcome the impurities of the mind and body, awaken the mantra shaktis who reside in the matrkas and attain the pure consciousness of the self.   🌴*

*Spiritual progression happens in different stages. First, it begins with theoretical study and understanding them. By doing so, one acquires knowledge. The next stage is the implementation of acquired theoretical knowledge that leads to experience. From experience one derives wisdom. With the attained wisdom, one begins to explore the Brahman and at one point of time he understands that God is his own self. When this understanding transforms into affirmation, he is considered as a Self-realised person.  The whole process is highly complicated and sometimes, theories cannot explain certain processes.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama