1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03, గురువారం, ఫిబ్రవరి 2022 బృహస్పతి వాసరే 🌹 2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 22-5 - 316 🌹
3) 🌹. శివ మహా పురాణము - 514🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -144🌹
5) 🌹 Osho Daily Meditations - 133🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 344-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 344-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 03, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం - 8 🍀*
*8. యః స్వీయే గోకులేఽస్మిన్విదితనిజకులోద్భూతబాలైః సమేతో*
*మాతర్యేవం చకార ప్రసృతతమగుణాన్బాలలీలావిలాసాన్ |*
*హత్వా వత్సప్రలంబద్వివిదబకఖరాన్గోపబృందం జుగోప*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ*
🌻 🌻 🌻 🌻 🌻
*పండుగలు మరియు పర్వదినాలు : లేవు.*
*🍀. నేటి సూక్తి : నీదంటూ ఏదీ లేదు. వెళ్లవలసి వస్తే భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల తదియ 28:39:40 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: శతభిషం 16:36:01 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: పరిఘ 21:16:13 వరకు
తదుపరి శివ
కరణం: తైతిల 17:28:03 వరకు
సూర్యోదయం: 06:47:28
సూర్యాస్తమయం: 18:12:20
వైదిక సూర్యోదయం: 06:51:10
వైదిక సూర్యాస్తమయం: 18:08:36
చంద్రోదయం: 08:31:18
చంద్రాస్తమయం: 20:25:28
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కుంభం
వర్జ్యం: 00:41:36 - 02:12:24
మరియు 22:49:08 - 24:22:40
దుర్ముహూర్తం: 10:35:45 - 11:21:24
మరియు 15:09:42 - 15:55:21
రాహు కాలం: 13:55:30 - 15:21:06
గుళిక కాలం: 09:38:41 - 11:04:17
యమ గండం: 06:47:28 - 08:13:04
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 09:46:24 - 11:17:12
వజ్ర యోగం - ఫల ప్రాప్తి 16:36:01
వరకు తదుపరి ముద్గర యోగం - కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PANCHANGUM
#DAILYCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -316 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -5 📚*
*🍀 22-5. అభియుక్తుడు - చూడగలిగిన వారికి సమస్తము దైవము. ఇట్టి అపరిమితము, విశాలమగు చింతన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. అట్టి అనన్య చింతన గలవానికి అన్నిట, అంతట అనునిత్యము దైవము గోచరించుచునే యుండును. అట్టివాడు పరి ఉపాసకుడు. ఉపాసనమందు పూర్ణస్థాయికి చేరినవాడు. ఈ విధముగ సాధన చేయువాడు నిత్యము ఈశ్వరునితో కూడి యుండును. అభియుక్తుడై యుండును. విభక్తుడు కాక యుండును. అట్లు అభియుక్తుడైన వాడు దైవమువలెనే పూర్ణుడగును. అతని నుండి దివ్య సంకల్పము, దివ్య జ్ఞానము, క్రియ వ్యక్త మగు చుండును. 🍀*
*22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |*
*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||*
*తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.*
*వివరణము : రాముడే దైవమను కొనుట, శివుడే దైవమనుట, గణపతియే దైవమనుట, సూర్యుడే దైవమనుట, లలితయే దైవమనుట, విష్ణువే దైవమనుట అవివేకము. అట్టి రూపములందు, నామము లందు దైవమున్నాడు కాని, వాటికే పరిమితమై దైవము లేడు. చూడగలిగిన వారికి సమస్తము దైవము. ఇట్టి అపరిమితము, విశాలమగు చింతన ఆవశ్యకమని భగవానుడు బోధించుచున్నాడు. అట్టి అనన్య చింతన గలవానికి అన్నిట, అంతట అనునిత్యము దైవము గోచరించుచునే యుండును. అట్టివాడు పరి ఉపాసకుడు.*
*అనగా ఉపాసనమందు పూర్ణస్థాయికి చేరినవాడు. అట్టి వానికి లోపల బయట కూడ దైవమే గోచరించుచు నుండును. ఇతరములు గోచరింపవు. పై విధముగ సాధన చేయువాడు నిత్యము ఈశ్వరునితో కూడి యుండును. అభియుక్తుడై యుండును. విభక్తుడు కాక యుండును. అట్లు అభియుక్తుడైన వాడు దైవమువలెనే పూర్ణుడగును. దైవము పూర్ణుడు. అతనితో నిత్యము అభియుక్తుడైన వాడు కూడ పూర్ణుడే అగును. అట్లు పూర్ణముతో కూడి పూర్ణుడు కాగా, అతని నుండి దివ్యసంకల్పము, దివ్యజ్ఞానము, క్రియ వ్యక్త మగు చుండును. కనుక ఈ శ్లోకము సాధనకు పరాకాష్ఠ.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 514 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 43
*🌻. శివుని అద్భుత లీల - 6 🌻*
నారదుడిట్లు పలికెను -
ఓ మునీ! నీవు ఆమెతో 'ఓ సుందరీ! శివుని సేవకులను చూడుము, శివుని కూడ చూడుము' అని పలికి ఆమెకు రుద్ర గణములను వ్రేలితో చూపించితివి (57). ఓ మునీ! భూత ప్రేతాది గణములను లెక్కలేనంత మందిని చూచి ఆ మేనక తత్‌క్షణమే భయముచే కంగారు పడెను (58).
వారి మధ్యలో నిర్గుణుడు, సకల గుణాభిరాముడు, వృషభమునధిస్ఠించిన వాడు, అయిదు మోములు గలవాడు, ముక్కంటి, భస్మను అలంకరించుకున్నవాడు (59), జటా జూటధారి, చంద్రుని శిరస్సుపై ధరించినవాడు, పది చేతులవాడు, కపాలమును చేత బట్టిన వాడు, వ్యాఘ్ర చర్మమే ఉత్తరీయముగా గలవాడు, చేతి యందు పినాకమనే శ్రేష్ఠమగు ధనస్సు గలవాడు (60), శూలమును ధరించినవాడు, వికృతమగు ఆకారముతో గజిబిజిగా నుండువాడు, గజ చర్మమును వస్త్రముగా ధరించిన వాడు అగు శంకరుని చూచి పార్వతి యొక్క తల్లి భయపడెను (61).
అశ్చర్యముతో భయముతో వణకుతున్నది, భ్రమించిన బుద్ధి గలది అగు ఆమెకు 'ఈయనయే శివుడు' అని నీవు వ్రేలితో చూపుతూ పలికితివి (62). నీ ఆ మాటను విని దుఃఖమును సహింపజాలక ఆ మేన గాలిచే పెకలించబడిన తీగవలె వెంటనే నేలపైబడెను (63).
'ఓసి మొండి పట్టుదల గల పార్వతీ! ఏమి ఈ వికృతరూపము! నేను మోసపోతిని' అని పలికి ఆ మేనక అచట క్షణములో మూర్ఛను పొందెను (64). అపుడు సుఖురాండ్రు ఆమెకు వివిధములగు ఉపచారములను చేయగా, ఆ హిమవత్పత్నియగు మేన మెల్లగా తెలివిని పొందెను (65).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో శివుని అద్భుత లీలలను వర్ణించు నలుబది మూడవ అధ్యాయము ముగిసినది (43).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 144 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. జీవుని - నారాయణుని - నిద్ర -1 🌻*
*కల్పాంతమున తాను కూడ నిద్రలోనికి పోయినచో లోకములతో బాటు తాను గూడ నుండడు. అపుడు నారాయణుడు సృష్టికి మాత్రమే ఈశ్వరుడగును గాని సర్వేశ్వరుడు కాలేడు. నిద్రనుండి మెలకువ వచ్చిన తర్వాత తాముంటిమని జ్ఞప్తి గలిగి తమ ప్రకృతి ననుసరించి చరించువారు జీవులు.*
*వారు మరల నిద్రాసమయము వరకు మాత్రమే ఉందురు. నిద్రలో తాముండరు. ఉన్నపుడు కూడ తమ తెలివికి తాము అధిపతులు కాక , తమ స్వభావమునకు బద్ధులై, అసహాయులై జీవింతురు. అట్టి జీవుల యందు అంతర్యామిగా నున్న నారాయణుడు ప్రకృతి కూడ అతీతుడే కాని బద్ధుడు కాడు.*
✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 133 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 133. NOTHING HAPPENING 🍀*
*🕉 Feeling quiet is also a happening and it is a greater happening than other things that are noisy. 🕉*
*When you are crying or shouting, you feel that something is happening. When you are not crying, not shouting, not screaming, just feeling a deep silence, you think nothing is happening. You don't know that this too is a great happening, greater than the others. In fact, those other moments have paved the way for this one. This is the goal. They are just the means. But in the beginning it will look empty, everything gone. You are sitting, and nothing is happening. Nothing is happening, and "nothing" is very positive. It is the most positive thing in the world. Buddha has called that nothing is Nirvana, the Ultimate. So allow it, cherish it, and let it happen more, welcome it. When it happens just close your eyes and enjoy it so it comes more often. This is the treasure. But in the beginning, I can understand, it happens to everybody.*
*There are many things people call explosions. When they disappear and the real thing comes, they don't have any notion of what it is and they simply miss their explosions. They would like those explosions to happen again. They may even start forcing them, but they will destroy the whole thing. So wait. If something explodes on its own, it is okay, but don't force it. If silence is exploding, enjoy it. You should be happy about it ! This is the misery of the world-people don't know what is what, so sometimes they are happy when they are miserable and sometimes when they should be happy, when happiness is really close, they become miserable.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 344-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 344 -2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*
*🌻 344-2. 'క్షయవృద్ధి వినిర్ముక్తా' 🌻*
*మానవుడు సహజముగ ఆత్మ స్వరూపుడు. అతని యందు సత్యము, శుద్ధ చైతన్యము సహజముగ నుండును. అతడు అట్టి స్థితిలో మూల ప్రకృతి యందే యుండును. అప్పుడతనికి సత్ చిత్ ఆనందమే యుండును. త్రిగుణములందు ప్రవేశించినపుడు అహంకార మేర్పడును. అపుడు తాను, ఇతరులు అనుభావము కలుగును. ఇతరులు కూడ తానే అను భావన మరచును. అపుడు తర తమ భేదములు పుట్టును.*
*అచ్చట నుండి ఇక వరుసగ ఏడు ప్రకృతుల లోనికి సంసరణము చెందును. నేను, నాది అను భావముతో తనను తాను బిగించుకొనును. క్రమముగ నేనును కూడ మరచి, నాది నేనుగ మిగులును. అపుడతడు క్షర భావమున బందీయై యుండును. దీని నుండి విమోచన మెట్లు కలుగును? తన నిజస్వరూపమును తాను నిత్యము జ్ఞప్తి చేసుకొనుటయే. అట్టి జ్ఞప్తి కలుగుటకు, స్థిరపడుటకు శ్రీమాత అనుగ్రహము ప్రధానము. కనుక ఆమెయే క్షయ వృద్ధుల నుండి ముక్తి నిచ్చునది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 344-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*
*🌻 344-2. Kṣaya-vṛddhi-vinirmuktā क्षय-वृद्धि-विनिर्मुक्ता (344) 🌻*
*She is beyond growth and decay. These are associated with all mortals. One has to look at the beauty of this nāma. In nāma 341 She was addressed as the gross body, Kṣetra-svarūpā. In 342 She was addressed as Kṣtreśī, wife of Kṣetrajña (Śiva). In the next nāma 343 She was called as the protector of both the Kṣetra and Kṣetrajña (body and soul) and in this nāma Vāc Devi-s address Her as the One without growth or decay, the qualities of the Brahman. Without calling Her as the Brahman She is being addressed by Her various actions.*
*Kṛṣṇa explains soul thus (Bhagavad Gīta II.23): “The soul is never born or dies; nor does it become only after being born, imperishable, eternal and free from birth and decay.....”*
*Bṛrhadāraṇyaka Upaniṣad (IV.iv.22) says “It is the controller of all…It does not grow better through good work nor worse through bad work”*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹