శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 344-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 344 -2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 344-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 344 -2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀


🌻 344-2. 'క్షయవృద్ధి వినిర్ముక్తా' 🌻

మానవుడు సహజముగ ఆత్మ స్వరూపుడు. అతని యందు సత్యము, శుద్ధ చైతన్యము సహజముగ నుండును. అతడు అట్టి స్థితిలో మూల ప్రకృతి యందే యుండును. అప్పుడతనికి సత్ చిత్ ఆనందమే యుండును. త్రిగుణములందు ప్రవేశించినపుడు అహంకార మేర్పడును. అపుడు తాను, ఇతరులు అనుభావము కలుగును. ఇతరులు కూడ తానే అను భావన మరచును. అపుడు తర తమ భేదములు పుట్టును.

అచ్చట నుండి ఇక వరుసగ ఏడు ప్రకృతుల లోనికి సంసరణము చెందును. నేను, నాది అను భావముతో తనను తాను బిగించుకొనును. క్రమముగ నేనును కూడ మరచి, నాది నేనుగ మిగులును. అపుడతడు క్షర భావమున బందీయై యుండును. దీని నుండి విమోచన మెట్లు కలుగును? తన నిజస్వరూపమును తాను నిత్యము జ్ఞప్తి చేసుకొనుటయే. అట్టి జ్ఞప్తి కలుగుటకు, స్థిరపడుటకు శ్రీమాత అనుగ్రహము ప్రధానము. కనుక ఆమెయే క్షయ వృద్ధుల నుండి ముక్తి నిచ్చునది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 344-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻

🌻 344-2. Kṣaya-vṛddhi-vinirmuktā क्षय-वृद्धि-विनिर्मुक्ता (344) 🌻


She is beyond growth and decay. These are associated with all mortals. One has to look at the beauty of this nāma. In nāma 341 She was addressed as the gross body, Kṣetra-svarūpā. In 342 She was addressed as Kṣtreśī, wife of Kṣetrajña (Śiva). In the next nāma 343 She was called as the protector of both the Kṣetra and Kṣetrajña (body and soul) and in this nāma Vāc Devi-s address Her as the One without growth or decay, the qualities of the Brahman. Without calling Her as the Brahman She is being addressed by Her various actions.

Kṛṣṇa explains soul thus (Bhagavad Gīta II.23): “The soul is never born or dies; nor does it become only after being born, imperishable, eternal and free from birth and decay.....”

Bṛrhadāraṇyaka Upaniṣad (IV.iv.22) says “It is the controller of all…It does not grow better through good work nor worse through bad work”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Feb 2022

No comments:

Post a Comment