శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర #1 / Sri Gajanan Maharaj Life History #1

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 1 / Sri Gajanan Maharaj Life History - 1 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
🌻. ప్రార్ధన - 1 🌻

శ్రీగణేశాయనమః ! 

శ్రీగణేశా, నీవు కరుణకు, వీరత్వానికి ప్రసిద్దుడివి. ఓ గౌరీపుత్రా మహామేధావులు, ప్రసిద్ధులు అందరూ కూడా ప్రతి పని ప్రారంభించేముందు నిన్ను స్మరిస్తారు. అన్ని విఘ్నాలు కూడా, నీ బలీయమైన ఆశీశులతో అగ్ని ముందు దూదిలా దూరమయి పోతాయి.

 అటువంటి ఆశీశ్శులే నాకు ఇచ్చి నేను అతి కమనీయమైన, శ్రేష్ఠమయిన కవితను చెప్ప గలిగేట్టు చెయ్యమని మీ పాదాలకు విమ్రతతో మొక్కుతున్నాను. ఏవిధమయిన కవిత్వం చెప్పేగుణాలు లేని, తెలివిలేని, బుద్ధి హీనుడను, అయినా మీఆశీర్వాదాలు ఉంటే కవిత రాసేపని తప్పక అవుతుంది. 

బ్రహ్మ నుండి ఉద్భవించిన మరియు కవులకు ప్రేరణ కలిగించే ఆదిమాయా సరస్వతి శారద కు ఇప్పుడు నానమస్సులు. నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని ఇప్పుడు జగదంబకు నానమస్సులు. ఈమె ఆశీర్వచనాలు ఎంత గొప్పవంటే వాటితో ఒక అవిటివాడుకూడా మేరుపర్వతం ఎక్కగలుగుతాడు మరియు ఒక అల్పబుద్ధివాడు కూడా మంచివక్త అవుతాడు. 

ఆ నమ్మకంతోనే ఈ శ్రీగజానన్ గ్రంధ వ్రాయడంలో దాసగణుకు సహకరించమని ప్రార్ధిస్తున్నాను. పండరిపురం పురాణపురుషుడయిన పాండురంగను తన కరుణావీక్షణాలు నాయందు ఉంచమని వేడుకుంటున్నాను.

ప్రతి చిన్నబిందువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతి దానిలో నిండిఉంటూ, ఈ విశ్వానికి నీవే ఆధారం. ప్రతి వస్తువు నీవల్లే ఉద్భవిస్తుంది, వాటి కదలికలు నీవే నిర్దేశిస్తావు. 

ఈప్రపంచము నీవే, ఇందులోని జీవ,నిర్జీవులు నీవే, తుది శక్తివీనీవే. సగుణ, నిర్గుణ, నాతండ్రి మరియు తల్లి నీవే. ఓ పురుషోత్తమా నీవెంత గొప్పవాడిఓ వర్నించడానికి నేను చాలాసూక్ష్మజీవిని. శ్రీరాముని ఆశీర్వాదాలతో కోతుల బలం పెరిగింది. గోకులం గొల్లపిల్లల విషయంలో అదేజరిగింది. 

మీ సహాయం పొందడానికి ధనం అవసరంలేదు, కానీ పూర్తిగా మీకే అర్పితమయిపోవాలి, అని ఋషులు కూడా చెప్పారు. నేను ఈకారణం వల్లనే మీద్వారం ముందుకు వచ్చాను. నన్ను నిరాశ పరచవద్దు అని ప్రార్ధిస్తున్నాను. ఓ పండరిపురి పాండురంగా మీరు నాలో పీఠం వేసుకొని ఈప్రఖ్యాత యోగి జీవితచరిత్ర వ్రాసేందుకు నాకు సహకరించండి. 

ఓభవానీవరా, నీలకంఠా, గంగాధరా, ఓంకారరూపా, త్రయంబకేశ్వరా నన్ను ఆశీర్వదించు. స్పర్శవేదమణి ఇనుముని బంగారంగా మారుస్తుంది, అదేవిధంగా నీకృప స్పర్శవేదమణ లాంటిది నేను ఇనుముని. దయతో సహకరించి నన్ను నిరాశపరచకు. నీకు అసంభవమయినది ఏదిలేదు, అందుకే ఇప్పుడు ఇంక ప్రతీది నీచేతులో ఉంది. దయచేసి త్వరగా వచ్చి మీఈసంతానం చేత ఈపుస్తకాన్ని రూపు దిద్దేందుకు సహకరించండి.
అన్ని శుభంగాజరిగేటట్టు ఆశీర్వదించమని కొల్హాపూర్లో ఉండే మా కులదేవతను వేడుకుంటూ ప్రార్ధిస్తున్నాను. 

తుల్జాపూర్ వాసి అయిన ఓ దుర్గామాతా, భవానీ మీ ఆశీర్వచనాలు నాశిరస్సుపై ఉంచమని వేడుకుంటున్నాను. శ్రీగజానన్ గొప్పతనాన్ని వర్ణించి పాడేందుకు స్ఫూర్తి కలిగించమని శ్రీదత్తాత్రేయుడుని వేడుకుంటూ మొక్కుకుంటున్నాను.

 మునీశ్వరులయిన శ్రీశాండిల్య, శ్రీవశిష్ఠ, శ్రీగౌతమ, శ్రీపరాసర మరియు
శ్రీశంకరాచార్యులకు నా వందనములు. నాచెయ్యి పట్టుకుని, నాచే ఈగ్రంధం పూర్తిచేయించవలసిందిగా అందరు మునులను, ఋషులను ప్రార్ధిస్తున్నాను. 

ఈజీవన వాహినిలో శ్రీగహిని, శ్రీనివృత్తి, శ్రీధ్యాణేశ్వర్, శ్రీతుకారాం ఓడ లాంటివారు వీరికి నా నమస్కారములు. ఓ షిరిడి సాయిబాబా మరియు వామనశా శ్రీ (దాసగణు కి గురువు) కరుణించి నన్ను పిరికి తనంనుండి ముక్తున్ని చెయ్యండి. 

మీ అందరి కృపాదృష్టివలనే నేను ఈగ్రంధం పూర్తిచేయగలను. కావున నన్ను కరుణించండి. పిల్లమీద ఉన్న ఏవిధమయిన సహజ ప్రేమవల్ల తల్లి మాట్లాడడం నేర్పిస్తుందో అదేవిధమయిన సంబంధం మీది నాది. 

కలం అక్షరాలు వ్రాస్తుంది, కాని అది కలం గొప్పతనంకాదు, వ్రాసేందుకు కలం ఓక ఉపకరణం మాత్రమే. అదేవిధంగా దాసగణు ఒక కలం, మునులందరినీ ఈకలం చేపట్టి ఈజీవతచరిత్రను అతిశ్రవణానంద కరంగా వ్రాయించమని ప్రార్ధిస్తునన్నాను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 1 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
🌻. Prayer - 1 🌻

 Shri Ganeshayanmah! 

Shri Ganesha, You are famous for your generosity and valour. O Gouriputra, all intellectuals and saints first remember you before starting any work. 

With your powerful Blessings all obstructions are just like cotton before fire. So I solemnly bow at your feet and invoke your blessings to bring out the best and the sweetest poetic recitation of my narration. 

I am ignorant, dull and have no qualities of a poet. But if you bless me, my work will be done. Now I give my obeisance to Adi Maya Saraswati-Sharada, who is born of Brahma and who is a great inspiration to the poets. 

Next I pay my obeisance to Jagadamba, to whom I pray for upholding my self-respect. Her blessings are so great that with her Ashis even a lame can climb a mountain and a dumb become a good orator. 

In keeping with that reputation kindly help Dasganu to write this book of Shri Gajanan. Now I beseech the Puran Purush Panduranga of Pandharpur to have an obliging glance at me.

You are the sole supporter of this universe and occupy every animate and inanimate object in it. You are the creator of everything, omnipotent and command all the actions in the universe. You are this world, the life in this world and also the ultimate power. 

You are Saguna, Nirguna, my father and also my mother. O Purushottama! You are so great that I am too small to comprehend You. Shri Rama blessed the monkeys who thereafter gained enormous strength. 

Same thing happened with the cowherd boys of Gokula. Saints have said that money is not required to receive Your favour, but a complete surrender at Your feet earns us Your support. That is why I have come to Your door. Please do not disappoint me. O Panduranga of Pandharpur, kindly help me write this great saint's biography, by residing in me. 

O Bhavanivara, Nilkantha, Gangadhara, Onkarrupa, Trimbakeshwara bless me. Paras changes iron into gold. Now Your favour is Paras and I am iron. Kindly help and do not disappoint me. Nothing is impossible for You since every thing is in Your hands. Kindly come quickly and help this child of Yours compose this book. Now I pay my obeisance to my family Deity who resides at Kolhapur. I beseech Her to bless me with everything auspicious. 

O Durgamata Bhavani of Tuljapur, I invoke Your blessings by having your hand on my head. Then I pay my obeisance to Lord Dattatraya and request Him for inspiration to sing in praise of Gajanan. Now I bow to the Saints of Saints Shri Shandilya, Shri Vashishta, Shri Goutam, Shri Parashar and Shri Shankaracharya the sun in the sky of wisdom. My obeisance to all the saints and sages who should, by holding my hand, get this writing done. 

Shri Gahani, Nivrutti, Shri Dyaneshwar, Shri Tukaram and Ramdas are dependable ships in the ocean of life. I bow to them. O Saibaba of Shirdi and Waman Shastri (Shri Dasganu's Guru) kindly free me of all fears. 

By the kind grace of You all only, I shall be able to write this book. So be kind to me. Only the real affection can teach a child to speak; and I share a relationship with you like that of a child with the mother. Pen writes letters, but receives no credit for writing them. 

A pen is only a means for writing; Dasganu is a pen and I beseech all the saints to hold it to write and make this biography melodious.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

23.Jul.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2 / Sri Gajanan Maharaj Life History - 2 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
🌻. పరిచయం - 1 🌻

శ్రోతలారా మీమంచి కోసమే ఈమహాయోగియొక్క జీవతచరిత్ర చిత్తశుద్ధితో వినేందుకు తయారుకమ్ము. ఈ భూప్రపంచంమీద ఇటువంటి యోగులే భగవత్ స్వరూపులు, కరుణాసముద్రులు, మోక్షంఇవ్వగలిగేవారు. ఈ యోగులు మంచి, పవిత్రత నిజాయితీ నిండి ఉన్నవారు. 

వీరు అత్యంత వివేకవంతులు, మనల్ని నిజాయితి అనేబాట మీదకు నడిపిస్తారు. ఇటువంటి యోగులకు పాదాక్రాంతులయినవారికి భగవంతుడు కుడా ఋణపడి ఉంటాడు. ఇక చిత్తశుద్ధితో శ్రీగజనన్ మహారాజ్ జీవితచరిత్ర వనండి..

అనేక యోగులకు జన్మస్థలము అయ్యే అదృష్టం భారతదేశానికే దక్కింది తప్ప మరి ఏ ఇతర దేశాలకి దొరకలేదు. అందువలనే ఇంతవరకు సుఖసంతోషాలకి కొరవలేదు. యుగయుగాలనుండి ఈ భారతావనికి వరసగా ఈయోగీశ్వరుల పాదస్పర్శ లభ్యం అవతూ ఉంది. శ్రీనారద, ధృవ, కాయద్ కుమార్, ఉర్దావ, సుధామ, శుభద్రావర్, అంజనీకుమార్, ధర్మరాజ్, జగత్ గురు శంకరాచార్యులు వీరందరూ కాడా ఈ భారతావనిలో జన్మించారు. మనసంస్కృతిని కాపాడిన మాధవ, వల్లభ, రామానుజులు కూడా ఇక్కడే పుట్టారు. నరశింహ మెహతా, తులసీదాసు, కబీర్, కమల్, శూరదాస్ మరియు గోరంగ ప్రభుల ప్రతిభ వర్ణింప నావల్ల కానిది. 

మీరాభాయి యొక్క ప్రగాఢభక్తి వల్ల అమెకోసం మహావిష్ణువు విషం మింగాడు. నవనాధ్ అనే పవిత్రగ్రంధంలో శ్రీగోరఖనాధ్, మశ్చీంద్ర మరియు జలంధర్ అనే మహాయోగుల గురించి వివరించబడింది.శ్రీనామదేవ్, నరహరి, జనాభాయీ నవ్, సకుభాయి, చోఖా, సవత, కుమార్దాస్ మరయు దామాజి పంత్ లు భక్తితోనే మహావిష్ణువును పోందారు. దామాజి పంత్ కొరకు భగవంతుడు మహర్ అయ్యాడు. ముకుందరజ్, జనార్ధన్, భోధాల, నిషత్ మరియు నిరంజన్ ల జీవితచరిత్రలు మహిపతి ఇంతకు ముందుగానే వివరించారు కనుక ఇక్కడ నేను తిరిగి ప్రస్థావంచటంలేదు. 

భక్తివిజయ మరియు భక్తిమాల అనే పవిత్ర గ్రంధాలు చదవమని మాత్రమే దాసగణు మీకు సలహా ఇస్తున్నాడు. మరో ముగ్గురు యోగుల గూర్చి, నేను ఆతరువాత వివరంగా పాటలు వ్రాసాను, ప్రజలను బాగా ప్రభావితం చేసిన శ్రీగజానన్ మహారజ్ కూడా వారికి సమానమయినవారే. ఈ మహాయోగి జీవితచరిత్ర వ్రాయడానికి అవకాసం నాకు పుణ్యంకొద్ది లభించింది. మొదటిసారి అసలు ఈయనను అకోట్లో చూసింది నేనే కాని ఇంతకు ముందు వివరించిన కారణాలవల్ల చివరిగా ఈయన జీవితచరిత్ర నాచేత వ్రాయబడింది.

ముందు హారం తయారుచేసి చిట్టచివర మేరుమణి (గుఛ్ఛం) మధ్యలో కడతాం అదేవిధంగా మహారజ్ జీవితచరిత్ర మధ్యలో గుచ్ఛంలాంటిది. గొప్పవ్యాపారకేంద్రం అయిన ఈ షేగాం బేరర్ లో ఖాంగాం తాలూకాలో ఒక చిన్న గ్రామం. చిన్న గ్రామం అయినప్పటికి ఈ మహాయోగి కారణంగా ఖ్యాతిపొంది ప్రపంచప్రఖ్యాత స్థానం అయింది. ఈ షేగాం అనే సరస్సులో శ్రీగజానన్ మహారాజ్ పద్మం రూపంలో ఉద్భవించి తన సుగంధాన్ని పూరిబ్రహ్మాండానికి వ్యాపింప చేసారు. షేగాం అనే ఘనిలో శ్రీగజానన్ మహారాజ్ ఒక వజ్రం. 

నా మితమయిన తెలివితో ఈయన అద్భుతాలను వర్నించాలని కోరుకుంటున్నాను. దయచేసి వినండి మరియు ఈయనకు పూర్తిగా ప్రాదాక్రాంతులయిన వారు మోక్షం పొందుతారనే విషయం మరువకండి. 

శ్రీగజానన్ చరిత్ర మేఘాలయితే మీరు నెమళ్ళు. వాన రూపంలో ఉండే శ్రీగజానన్ కధలు మిమ్మల్ని పరవశంతో నాట్యం చేయిస్తాయి. గజానన్ మహారాజ్ను పొందడం షేగాం ప్రజల అదృష్టం. భగవంతుని కంటే ఎక్కువఅయిన ఈ యోగుల ఆశీర్వచనాలు మంచిపనులు చెయ్యబట్టి ప్రాప్తిస్థాయి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 2 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
🌻. Introduction - 1 🌻

Now listeners, get ready and listen single-mindedly to the biography of a saint for your own good.  

On this earth, saints are Gods, ocean of renunciation, and giver of Moksha. Saints are the embodiment of all that is good and sacred and are full on sanctity. Now calmly listen to the life story of such a Saint. 

Saints never deceive anybody. They are full of wisdom that guides us on to the path leading to the ultimate truth. God Himself is indebted to those who surrender themselves at the feet of the saints. 

Now with an open mind, listen to the biography of Shri Gajanan Maharaj. No other country is as fortunate as Bharat in being a birthplace of so many saints and therefore it has never fallen short of any happiness so far. It is so because, since time immemorial, our land continuously has had the touch of sacred feet of saints. 

Shri Narad, Dhruva, Kayadhukumar, Uddhava, Sudama, Subhadravar, Anjanikumar, Dharma Raja, Jagatguru Shankaracharya were all born in this country. Madhawa, Vallabha and Ramanuja, the able defenders of our religion, too were born here. 

The greatness of Narsi Mehta, Tulsidas, Kabir, Kamal, Surdas and Gourang Prabhu is quite beyond my power to describe. Intense devotion of Princess Mirabai made lord Vishnu swallow poison for her. 

The great deeds performed by the supreme yogis like Shri Goraknath, Macchindra and Jalander are described in great detail in the sacred book Navanath. 

Shri Namdeo, Narahari, Janabai, Kanho, Sakhubai, Chokha, Savata, Kurmadas and Damajipanth won over Shri Hari by Bhakti only. God became Mahar for Damajipant. Since Mahipati has already written the biographies of Mukundraj, Janardan, Bodhala, Nipat and Niranjan, I do not repeat them here. I only suggest that you read the sacred books Bhakti Vijay and Bhaktimala. 

After that I have composed songs in the praise of three saints and equal to them is Shri Gajanan Maharaj who greatly influenced the public. With my good fortune, I am now getting an opportunity to write this detailed biography of this great saint. 

In fact, He was first seen by me at Akot, but His biography is being written by me last for the following reasons: When we prepare a plain garland, the middle gem (Merumani) in it is attached at last; so the story of Shri Gajanan Maharaj is like that Merumani. 

Shegaon, a small village in Khamgaon Taluka of Berar is a great market center. Though a small village, it gained importance due to Shri Gajanan Maharaj and became a world famous place. 

In this Shegaon Lake, a lotus in the form of Shri Gajanan Maharaj sprung up and its fragrance spread all over the universe. Shri Gajanan Maharaj is a diamond of Shegaon mine and I, with my limited intelligence, wish to narrate His glory. Please listen to it and do not forget that you can attain Moksha by complete surrender at His feet.

Shri Gajanan Maharaj’s biography is like a cloud and you the peacocks. The rain in the form of Shri Gajanan Maharaj’s stories will make you dance in happiness. People of Shegaon are really fortunate to get Shri Gajanan Maharaj. 

Good deeds only can invoke the blessings of Saints who are superior even to the Gods. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

24.07.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 3 / Sri Gajanan Maharaj Life History - 3 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
🌻. పరిచయం - 2 🌻

పండరపూర్ లో రామచంద్రపాటిల్ నన్ను కలసి, శ్రీగజానన్ మహారాజ్ జీవితచరిత్ర వ్రాయమని కోరినరోజు కార్తీక ఏకాదశి. చాలారోజులుగా నాకు శ్రీగజానన్ స్తుతి చెయ్యాలని కోరిక ఉన్నప్పటికీ అవకాశం దొరకలేదు. 

నాకోరిక శ్రీమహారాజ్ కు అర్ధం అయింది అందువల్ల శ్రీరామచంద్రపాటిల్ ను నాకోరిక పూర్తి అయ్యేందుకు కారణభూతుడ్ని చేసారు. యోగులలో మాణిక్యంలాంటి శ్రీగజానన్ మహారాజ్ వంటి యొగుల కదలికలు ఎవరు తెలుసుకోలేరు.

 బ్రహ్మ ఎట్లా ఉద్భవించింది ఎలా అయితే ఎవరికి తెలియదో, అదేవిధంగా చారిత్రకంగా ఈయన జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఏఘనినుండి వచ్చింది అని ఆలోచించకుండా వజ్రాన్ని మెచ్చుకుంటామో, అదేవధంగా ఈయన తేజస్సును స్థుతించాలి. 

18వ శతాబ్దంలో మాఘ బహుళ సప్తమి రోజున శ్రీగజానన్ మహారాజ్ షేగాం లో ప్రకటించారు.

 శ్రీరామదాసస్వామి స్థలమయిన సజ్జన్ఘడ్ నుండి వచ్చారని కొందరు అంటారు. ఈ విషయం నమ్మడానికి సరిఅయిన దాఖలా లేకపోయినా కొంతవరకు అర్ధంఉంది. భ్రష్టాచారం, దరిద్రం బాగా వ్యాపించి ఉండడంవల్ల శ్రీరామదాస్ స్వామి, శ్రీగజానన్ మహారాజ్ రూపంలో పునర్జన్మ తీసుకుని ఉండవచ్చు. 

యోగులు ఎవరి లోనయినా ప్రవేశించగలరు. ఇంతకు ముందుకూడా అనేకమంది యోగులు ఈవిధంగా చేస్తారు. సాధారణ మనుష్య జన్మలా కాకుండా, గోరఖ్ చెత్తకుండీనుండి, కనీఫా ఏనుగు చెవినుండి మరియు చాంగ్డియొ నారాయణదోహ నుండి ఉద్భవించారు. 

యోగులలో రాజయిన శ్రీగజానన్ మహారాజ్ విషయంకూడా అలానే అయి ఉండవచ్చు. ఇకముందు ఈయన చేష్టలనుబట్టి శ్రీమహారాజుకు యోగ గూర్చిన క్షుణ్ణ అవగాహన ఉన్నట్టు తెలుస్తుంది. యోగకు మరి దేనితోను పోల్చలేని అనూహ్యమయిన ప్రత్యేకత ఉంది.

 పాపులను ఉద్ధరించడానికి శ్రీగజానన్ మాఘ బహుళ సప్తమినాడు ప్రగటించారు. షేగాంలో దేవీదాస్ పాటుర్కర్ అనే బ్రాహ్మణుడు తన కుమారుని ఋతుశాంతి విధి కారణంగా తన స్నేహితులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాడు. ఎంగిలిఅకులు మిగిలి పోయిన తినుబండారాలతో సహాఇంటి బయట పారవేసారు. ఆచోట శ్రీగజానన్ మహారాజ్ కూర్చుని ఉండగా చూడడం తటస్థించింది. అతని శరీరంపై జీర్నావస్థలో ఉన్నచొక్కా, 

నీరు త్రాగడానికి ఒక కమండలం మరియు పొగత్రాగడానికి ఒక మట్టితో తయారుచేసిన గొట్టం తప్ప మరిఇంక ఏమీలేవు. ఉదయించే సూర్యుని తేజస్సు కల శరీరం, నాశికాగ్రంపై కేంద్రీకృతమయిన కళ్ళు అతని యోగికశక్తిని తెలియ పరుస్తున్నాయి. ఆవిధంగా పారవేసిన ఎంగిలి ఆకులనుండి మిగిలిన మెతుకులను రోడ్డు ప్రక్కన కూర్చుని అతను తీసుకుంటున్నాడు. సాధారణమానవునికి, ఈఅన్నమే బ్రహ్మ అని సూచించటమే అతని ఈచర్యకి కారణం. సూక్తులు, ఉపనిషత్తులు కూడా ఈవిషయమే చెపుతాయి.

 బనకటలాల్ అగర్ వాల్ మరియు దామోదర్ పంత్ అతని ఈవిధమయిన ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు. 

నిజంగా ఆకలి వేసిఉంటే ఇతను పాటుర్కర్ లాంటిమంచి బ్రాహ్మణున్ని అర్జించి ఉంటే వెంటనే భోజనం పెట్టి ఉండేవాడుకదా అని వీరిద్దరు అనుకున్నారు. బనకట్ తన స్నేహితునితో అతని ఇకముందు కదలికలు చూద్దాము అని అన్నాడు. 

నిజమయిన యోగులు ఒక్కోసారి పిచ్చివారిగా ప్రవర్తిస్తారని వ్యాసుడు భాగవతంలో అన్నాడు. ఇతని విషయం కుడా అలాంటిదే కావచ్చు. అనేకమంది ఆదారినుండి వెళ్ళారు కానీ వీరద్దరే ఈవ్యక్తిని పరిశీలించేందుకు ఆకర్షితులయ్యారు. 

తెలివయిన మరియు ప్రజ్ఞావంతులు మాత్రమే గుళకరాళ్ళలోని వజ్రాన్ని వెతకగలరు. ఆ రోడ్డు మీద పడిన అన్నం ఎందుకు తింటున్నావు అని అడుగుతూ నేను మంచి భోజనం పెడతాను అని అతనితో బనకటలాల్ అంటాడు. దానికి సమాధానంగా శ్రీగజానన్ కేవలం వారివైపుచూస్తాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 3 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
🌻. Introduction - 2 🌻

It was Kartik Ekadashi day when Ramchandra Patil met me at Pandharpur and requested me to write the biography of Shri Gajanan Maharaj. It was in fact my long cherished desire to sing in praise of Shri Gajanan, but was not getting the opportunity. 

Shri Gajanan Maharaj seemed to have understood my wish and so made Ramchandra Patil a tool for the fulfilment of that desire. Nobody can know the designs of great saints like Shri Gajanan Maharaj who was a gem amongst the saints. 

Historically, nothing is known about His caste, creed or place of origin, like Brahma whose origin nobody knows. Like a brilliant diamond we should only appreciate its brilliance and not bother about the mine of its origin. 

Shri Gajanan Maharaj appeared at Shegaon on 7th Vadya Magh of 1800 Saka. Some say that he came from Sajjangad the place of Shri Ramdas Swami. Though there is no sufficient proof to accept this fact, it may have some sense in it. 

There was wide spread corruption and misery and it is possible that Shri Ramdas Swami, for the good of the people, took rebirth as Gajanan Maharaj. 

Yogis can enter anybody and many saints have done so in the past. Gorakh was born in dustbin, Kanifa in the ear of elephant and Changdeo in the Narayan Doha: all unlike the traditional human birth. 

Same may be the case of Shri Gajanan Maharaj - the king of Yogis. It will be seen from His actions that Shri Gajanan Maharaj had detailed knowledge of all yogic feats. Yoga has got a unique importance incomparable with anything else. 

Shri Gajanan appeared in Shegaon on 7th Vadya Magh for the spiritual liberation of the sinners. It so happened that there was one pious Brahmin named Devidas Paturkar at Shegaon and, to celebrate the puberty function of his son, he had arranged a lunch for his friends. 

The leftover food from the plates was thrown outside the house and Shri Gajanan Maharaj was seen sitting near that food. He had a worn out old shirt on His body, a dry gourd for drinking water, a pipe of clay for smoking and nothing else. 

His body was lustrous like the rising sun and eyes with concentrated at the tip of nose indicative of His yogic strength. Sitting by the roadside He was picking up particles of food thrown there. 

His action of picking up the food particles from the leaf plates lying on road was to convey to the common man that food is Brahma. Shruti and Upanishad say the same thing. 

Bankatlal Agrawal and Damodar Pant, who were passing by, were surprised to see His behaviour. They thought that had this man been really hungry, He would have begged for food and Shri Paturkar, being a pious man, would have given the food to Him.

Thinking thus, Bankatlal said to his friend, Let us watch His actions. Vyas has said in Bhagawat that real saints, many a times, behave like mad men, and this can be a case like that.” 

Thousands of people must have passed that way but only these two persons were attracted to observe Maharaj. Only wise men and experts can detect a diamond lying in the heap of pebbles. 

Bankatlal asked Him as to why He was eating the food lying on the road and volunteered to serve good food. In reply Shri Gajanan simply looked at them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

25.Jul.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 4 / Sri Gajanan Maharaj Life History - 4 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
🌻. పరిచయం - 3 🌻

అతని ఆ విశాలమయిన వక్షస్థలం, కండలు తిరిగిన భుజాలు, నాసికాగ్రంపై కేంద్రీకృతమయిన కళ్ళు మరియు తేజోమయమయిన ముఖము వీరిరువురికి పరమ ఆనందం కలిగించాయి. అతి వినయంతో వీరు అతనికి నమస్కరించి, ఒక విస్తరలో భోజనం వెంటనే తేవలసిందిగా దేవీదాసు పంతను కోరారు. శ్రీదేవీదాసు తెచ్చి శ్రీమహారాజ్ ముందుఉంచాడు. 

అతను ఏవిధమయిన ఇష్టాఇష్టాలు లేక అన్నం, మిఠాయిలు కలిపివేసి తన ఆకలి తీర్చుకున్నాడు. ఒక మహారాజుకు చిన్న గ్రామం బహుమతిగా ఇచ్చినట్టుగానే ఈ భోజనంకూడా శ్రీమహారాజ్ కు అనిపిస్తుంది. 

బ్రహ్మరసంతో ఇంతకుముందే సంతృప్తి చెందిన శ్రీగజానన్ కు ఈ భోజనం ఒక మహారాజు కు చిన్న గ్రామం కానుకగా ఇచ్చినట్టు అనిపించింది. అతను పిచ్చివాడేమో అని పిలిచినందుకు బనకటలాల్ బాధపడ్డాడు. 

ఆ సమయంలో పక్షులు కూడా తమస్థావరాలను వదిలి బయటకు రావటానికి సాహసించలేని తీవ్రమయిన మధ్యాహ్నము. అటువంటి తీవ్రమయిన ఎండలో స్వయంగా బ్రహ్మవలే ఏవిధమయిన భయం లేకుండా పరమానందంగా శ్రీగజానన్ కుర్చున్నారు.

శ్రీమహారాజు భోజనం అయితేచేసారు కాని అతని కమండలంలో నీరు లేని విషయం దామోదర్పంత్ గమనించాడు. మహారాజ్ మీరు ఒప్పుకుంటే నేను మంచినీళ్ళు తీసుకువస్తాను అని బనకటలాల్ అన్నాడు. 

నీకు తేవాలని ఉంటే వెళ్ళి తీసుకురా అని మహారాజు నవ్వి అన్నారు. బ్రహ్మ ప్రతిచోటా ఉన్నాడు మరియు బ్రహ్మ నీకు నాకు మధ్య ఏవిధమయిన బేధభావం చూపడు. కాని మనం ఈప్రాపంచిక పద్ధతులు అనుసరించాలి. అందుకే భోజనం అయినతరువాత నీళ్ళు కూడా శరీరానికి అవసరం. 

ఈ విధమయిన సమాధానానికి బనకటలాల్ సంతోషించి శ్రీమహారాజు కొరకు త్రాగేనీరు తెచ్చేందుకు వెల్లాడు. ఇంతలో రోడ్డుప్రక్కన పశువుల కొరకు నింపిఉంచిన నీళ్ళకుండి దగ్గరకు శ్రీమహారాజు వెళ్ళి ఆ నీళ్ళతో దాహం తీర్చుకున్నారు.

 బనకటలాల్ చల్లటి నీళ్ళు ఉన్న కుండతో తిరిగివచ్చి శ్రీమహారాజును ఆ కుండినుండి మురికినీళ్ళు త్రాగవద్దని వేడుకున్నాడు. శుభ్రం-అశుభ్రం, మంచి-చెడు అనే బేధ భావం లేకుండా ప్రపంచంలోని ప్రతివస్తువులోనూ బ్రహ్మ వ్యాపించి ఉన్నాడు అని శ్రీమహారాజు అన్నారు. 

బ్రహ్మ మంచినీళ్ళలోనూ మురికినీళ్ళలోనూ మరియు వాటిని త్రాగే ప్రాణిలో కూడా బ్రహ్మ వ్యాపించిం ఉన్నాడు. ఈ విధమయిన విశ్వవ్యాపి అయిన భగవంతుని ప్రకృతిని, మరియు ఈప్రపంచం ఎలా ఉద్భవించింది అనే విషయం ప్రయత్నించి మీరు అర్ధంచేసుకోవాలి. దానికి బదులు మీరు ప్రాపంచిక అనుబంధాలలో నిమగ్నమవుతున్నారు. 

శ్రీమహారాజు నుండి ఈవిధంగావిన్న బనకటలాల్ మరియు దామోదరపంత్ ఇద్దరు కుడా వంగి శ్రీమహారాజుకు నమస్కరిద్దామనుకుంటే, వారి ఈ కోరిక తెలుసుకున్న శ్రీమహారాజు గాలివేగంతో పారిపోయారు. ఈగజానన్ విజయ గ్రంధం అందరికీ సంతోషాన్ని తెచ్చుగాక !
 
 శుభం భవతు
 1. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 4 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
🌻. Introduction - 3 🌻

They were delighted to see His broad chest, muscular shoulders, eyes concentrated at the tip of nose, and a joyful face. They respectfully bowed to Him and asked Devidaspant to immediately bring a dishful of food. 

Shri Devidas brought the food and put it before Shri Gajanan Maharaj . He having no likes and dislikes, mixed all the food and sweets together and satisfied His hunger. It was like an emperor being presented with a small village. 

So was this food presented to Shri Gajanan who had already satisfied Himself by consuming Brahma Rasa. Bankatlal regretted having called Him a mad man. It was a very hot noontime and even the birds did not dare come out of their nests. 

Under such unfavourable conditions, Shri Gajanan was sitting fearlessly and was full of joy as if He was Brahma Himself. So Shri Gajanan Maharaj had taken food but then Damodarpant observed that there was no water in His Tumba. 

Bankatlal said, Maharaj, if You permit me, I will go and bring water for You. Shri Gajanan Maharaj smiled and said, If you wish, go and bring water. Brahma is everywhere and he won't differentiate between you and me, but we have to follow the worldly traditions. 

So when food is taken the body needs water too. Bankatlal felt happy over this reply and rushed to bring the water for Shri Gajanan Maharaj . 

In the meantime, Shri Gajanan Maharaj went to the roadside tank where water was stored for the cattle and satisfied His thirst with that water. 

Bankatlal returned with a jar of cold water and requested Shri Gajanan Maharaj not to drink the dirty water from that tank. 

Shri Gajanan said, Everything in the universe is pervaded by Brahma without any differentiation of clean or dirty, good or bad. 

Brahma is in clean water as well as in dirty water and the one who drinks it is also occupied by Brahma Himself. 

You should try to understand the omnipotent nature of God and also to know the origin of this world. Instead of this, you are involving yourself in wordly attachments.” 

Hearing so from Shri Gajanan Maharaj , both Bankatlal and Damodarpant bent down to prostrate before Shri Gajanan Maharaj ; knowing their intentions, Shri Gajanan Maharaj ran away with the speed of wind. May this Gajanan Vijay Granth bring happiness to all. ||

SHUBHAM BHAVATU||

 Here ends Chapter One.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

26.Jul.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 5 / Sri Gajanan Maharaj Life History - 5 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః 

చంద్రభాగ నదీతీరమున నివసించే భగవంతులకు భగవంతుడవు, పేదలపెన్నిధివి, రుక్మిణివరా నన్ను దయతో చూడు. 

ఓ భగవంతుడా నీకృప లేనిదే ప్రతీది వ్యర్ధం. జీవంలేని శరీరాన్ని ఎవరూ లక్ష్యపెట్టరు. చెరువులో నీళ్ళు ఉంటేనే దానికి అందం. పళ్ళలో ఉండే రసం వల్లనే వాటి తొక్కలకు కూడా ప్రాధన్యత వస్తుంది. మీఆశీస్సులు కూడా అటువంటి పండ్లరసం వంటివే. 

నామొర దయచేసి ఆలకించి, నాపాపాలను, విపత్తులను, దారిద్రమును దూరంచెయ్యండి. ఇంతకుముందు అధ్యాయములో శ్రీగజానన్ బనకటలాల్ను ఒక్కసారిగా వదలి వెళ్ళిపోవడం మనం చూసాము. అప్పటినుండి శ్రీగజానన్ను మరల చూసేందుకు బనకటలాల్ అతిఆకాంక్ష పడుతున్నాడు. 

తల్లికోసం దూడలాగ అతను ప్రపంచక విషయాలయిన తిండి నీరు కూడా మర్చిపోయి శ్రీగజానన్ గూర్చే నిరంతరం ఆలోచిస్తు ఉన్నాడు. ఈతను తన మానసికస్థితిని ఎవరితోనూ, తన తండ్రితోకూడా పంచుకోలేక పోయాడు. అతను షేగాం అంతా వెతికినా శ్రీగజానన్ ను కనుక్కోలేకపోయాడు. 

కానీ అతని తండ్రి తన యవ్వనకుమారుని ముఖంమీద కనిపిస్తున్న ఆతృత, నిస్పృహ గమనిస్థాడు. అతని ఈవిషయానికి కారణం అడుగుతాడు. ఎందుకంటే భగవంతుని ఆశీర్వచనాలతో జీవితంలో సుఖంగా ఉండేందుకు కావలసిన అన్ని వస్తువులు వారికి సమృద్ధిగా ఉన్నాయి. 

దానికి బనకటలాల్ సమాధానం చెప్పలేదు మరియు శ్రీగజానన్ గురించి వెతుకుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు తన ఇరుగు పొరుగున ఉండే శ్రీరామాజిపంత్ దేష్ముఖ్ అనే భక్తిగల వృద్ధుడికి శ్రీగజానన్ గూర్చి, అతనిని వెతకడం గూర్చి అన్నివిషయాలూ బనకటలాల్ చెపుతాడు. 

అవన్నీ బనకటరాల్ నుండి విన్న రాజీపంత్ అతను ఒక గొప్పయోగి అని, అటువంటియోగులను కలుసుకోవడం పూర్వజన్మలోని పుణ్యకార్యాల వల్లనే సంభవం అవుతుంది అని అంటాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 5 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 1 🌻

 Shri Ganeshayanamah! 

O lord of Rukmini residing on the bank of Chandrabhaga (river), God of Gods, Friend of the poor, kindly look at me. O God! Everything is futile without Your favour. 

No one cares for a lifeless body. Beauty of a lake is due to the water in it. Juicy core of a fruit gives importance to its husk. Same is the case with Your blessings. 

Kindly oblige me by removing all my sins, woes and poverty. In the last chapter we have seen that Shri Gajanan suddenly left Bankatlal and went away. 

Since then Shri Bankatlal was craving to see Shri Gajanan again. Forgetting all worldly things like food and water he was constantly thinking of Shri Gajanan only, like a calf for its mother. 

But he could not share his mental condition with anybody not even with his father. His search continued throughout Shegaon but could not find Shri Gajanan.

 His father however, noticed the anxiety and despair written large on the face of his young son. He asked him the reason for his unhappiness especially because God had blessed them abundantly with every thing required for a happy life. 

Bankatlal did not reply and continued his search for Shri Gajanan. At last Bankatlal told everything about Shri Gajanan and his search for Him to a neighbour Ramajipant Deshmukh, a pious old man. 

Hearing the details from Bankatlal, Ramajipant noted that He must be some yogi, and meeting with such yogis is possible only if one has to his credit a lot of good deed from the previous birth.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Date: 27/Jul/2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 6 / Sri Gajanan Maharaj Life History - 6 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 2 🌻

అందువల్ల బనకటలాలను వెతకడం కొనసాగించమని ప్రోత్సహిస్తూ తనను కూడా ఆయోగి కనిపిస్తే దర్శనానికి తీసుకొని వెళ్ళమని అతను అన్నాడు. గోవింద్ బువా తాకళికర్ అనే ప్రసిద్ధ కీర్తనకారుడు కొద్దిరోజుల తరువాత షేగాం వస్తాడు. 

అతని కీర్తన శివాలయంలో ఏర్పాటు చేయబడింది, అది వినడానికి చాలామంది జనులు సమావేసం అయ్యారు. బనకటలాల్ కూడా వెళ్ళాడు. తన మిత్రుడయిన పీతాంబర్ ను ఆ గుడి లో కలుస్తాడు, మరియు శ్రీగజానన్ గూర్చి అన్ని విషయాలు వివరిస్తాడు. 

వాళ్ళు కీర్తన వినేందుకు కూర్చుంటారు. లో ! అక్కడే శ్రీగజానన్ కూడా ఏకాగ్రతతో గోవిందబువా ను వింటూ ఉన్నారు. ఒక లోభికి బంగారం కనిపంచినట్టుగా, నెమలికి మబ్బు కనిపించినట్టుగా వారు సంతోషపడ్డారు. 

బనకటలాల్ మరియు పీతాంబర్ లేచి శ్రీగజానన్ దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఏమయినా తినేందుకు కావాలా అని అడుగుతారు. శ్రీగజానన్ వారివైపు చూసి వెళ్ళి ఏ మాల ఇంటినుండి అయినా కొద్ది రొట్టె తెమ్మని అన్నారు. 

బనకటలాల్ వెంటనే రొట్టె కూరగాయలు తెచ్చి శ్రీగజానన్ కు ఇస్తాడు. అదితిని పీతాంబరేను నదిలోనుండి తన కమండలంలో నీళ్ళు తెమ్మని అతను అంటారు. నదిపూర్తిగా ఎండిపోయింది, అందువల్ల ఎవరి ఇంటినుండి అయినా నీళ్ళు తెస్తానని పీతాంబర్ అంటాడు. 

శ్రీగజానన్ ఆ నదినుండే నీళ్ళు తెమ్మని, అంతేకాక తనకమండలంలో నీళ్ళు చేతితోనింపకుండా, కమడంలాన్నే నీళ్ళలో ముంచి తెమ్మని వక్కాణిస్తారు. పీతాంబర్ నదికి వెళ్ళి చూస్తే, కమండలం తిన్నగా నీళ్ళలో నింపేందుకు సరిపడా నీళ్ళు కనిపించలేదు ఏమిచెయ్యాలి ? అతను సంఛిద్ధంలో పడ్డాడు. 

చివరికి సాహసించి కమండలాన్ని నీళ్ళలో ముంచుతాడు. ఒక మహద్భుతం జరిగింది. కమండలం తిన్నగా పూర్తిగా నీళ్ళలోకి పోయింది మరియు మురికినీరు స్వఛ్ఛమయిన నీరుగామారి కమండలం నిండింది. 

అతను మరొకసారి ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా ఎక్కడ నీళ్ళలో కమండలం తగిలించినా స్వఛ్ఛమయిన నీరు ఎగసి కమండలం నిండుతోంది. ఇది అంతా శ్రీగజానన్ యోగిక శక్తివల్లనే అని అతనికి అప్పుడు అర్ధంఅయింది. పీతాంబర్ నీళ్ళు తెచ్చి శ్రీగజానన్ కు ఇస్తాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 6 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 2 🌻

He, therefore, encouraged Bankatlal to continue his search and also to take him for the Darshan of that yogi when found. After a few days there came the renowned Kirtankar, Govindbua Taklikar to Shegaon. 

His Kirtan was arranged in the Shankarji's temple where a lot of people assembled to listen to him. Bankatlal also went there. 

He met his friend Pitambar in the temple and narrated to him everything about Shri Gajanan. They sat listening to the Kirtan and lo! There was Shri Gajanan Maharaj also attentively listening to Govind Bua. 

They were as delighted as does a miser at the sight of gold or a peacock at the glimpse of a cloud. Bankat and Pitambar got up, went to Shri Gajanan, bowed before Him and asked if He would like to eat something. 

Gajanan looked up and said, Go and bring some bread for me from the house of some Mali (Caste). Bankatlal immediately brought bread and vegetable and gave it to Shri Gajanan. He ate it and asked Pitambar to bring some water in His Tumba from the river. 

Pitambar said that the river was practically dry and offered to bring water from somebody's house. Shri Gajanan insisted on getting water from the river only and with a further condition that the water not be filled by hand, but taken directly by dipping the Tumba in the river. 

Pitambar went to the river and saw that the water was not at all sufficient for dipping the Tumba. What to do? He was in a fix. Ultimately he dared and lowered the Tumba in the water and lo! 

There was a miracle; the Tumba went straight full with water and the dirty water from the river became clean in the Tumba. 

He tried again and was surprised to see that wherever he dipped the Tumba in the water, clean water rushed into it to the brim. He now understood that it was due to the yogic power of Shri Gajanan. Pitambar brought and offered the water to Shri Gajanan.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Date: 28/Jul/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 7  / Sri Gajanan Maharaj Life History - 7 🌹 
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 3 🌻

అతను నీరుత్రాగి ఇలా అన్నారు - ఆమాలి దగ్గర నుండి తెచ్చిన రొట్టెతో నన్ను సంతృప్తి చేసేందుకు ప్రయత్నించకు, నాకు నీనుండి వక్కకావాలి. బనకటలాల్ అతనికి వక్క ఇచ్చి దానితోపాటు ఒక రాగి నాణెం దక్షిణగా ఇస్తాడు. తను వ్యాపారిని ఏమీ కాను (ఈ ధనం స్వీకరించడానికి) అని శ్రీగజానన్ అంటారు. భక్తి కావాలని అడుగుతారు. 

తరువాత చిత్తసుద్ధితో కీర్తన వినమని బనకట్ను, పీతాంబర్ ను శ్రీగజానన్ అడిగారు. భాగవతంలోని ఒక కీర్తనతో గోవిందబువా తన కీర్తన ప్రారంభించాడు. గోవిందబువా ఆ కీర్తనలోని మొదటి పంక్తి ఆలాపించగానే శ్రీగజానన్ తరువాత భాగాన్ని గట్టిగా ఆలాపిస్తారు. 

ఈ విధంగా ఆలాపించిన వ్యక్తి మహాగొప్ప పండితుడు అయి ఉండాలి అని గోవిందబువా ఆశ్చర్యపోయి అంటాడు. ఈవిధంగా అంటూ శ్రీగజానన్న మందిరంలోకి రావలసిందిగా విన్నవిస్తాడు. 

మిగిలిన వ్యక్తులుకూడా అదేవిధంగా విన్నతించినప్పటికీ వారిని శ్రీగజానన్ మహారాజు లక్ష్యపెట్టలేదు. తరువాత గోవిందబువా స్వయంగా మహారాజుతో మీరు సాక్షాత్తు శివుని అవతారం దయచేసి లోపలికి రండి అంటాడు. 

దానికి నువ్వు చెప్పినదానిమీద ధృఢంగా ఉండు. ఇప్పుడే నువ్వు భగవంతుడు ప్రతిచోటాఉన్నాడు అని అంటూ ఇప్పుడు నన్ను మందిరంలోకి రమ్మని ఎందుకు బలవంతంచేస్తున్నావు ? నువ్వు భోధించే విషయం నువ్వు పాటించాలి. అంతేకాక విద్యార్ధి మాటలతో ఆడడం అనేది వదలాలి. 

నువ్వు భోధించిన భాగవతంలోని శ్లోకానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఉచితంకాదు. నువ్వు ఒత్తి జీవన భత్యంకోసం భోధన చెయ్యటం అనేది నాకోరిక కాదు. ఇకవెళ్ళి నీ కీర్తన కొనసాగించు అని శ్రీమహారాజు ఈవిధంగా అంటారు. 

బువా వెనక్కివచ్చి షేగాంకి ఒక ఆణిముత్యం వచ్చింది జాగ్రత్తగా కాపాడండి. ఈ మానవ రూపంలో వచ్చిన పాండురంగ వలన షేగాం పండరపూర్ అవుతుంది. అతనికి అణకువగా ఉండి సేవచేస్తూ మీతో ఉండేలా చూసుకోండి, దీనివల్ల మీకు సంతోషం దొరుకుతుంది అని ప్రజలకి ప్రకటన చేసాడు. 

అత్యంతంగా పొంగివస్తున్న ఆనందంతో బనకటలాల్ ఇంటికి వచ్చి శ్రీగజానన్ గూర్చిన విషయం తన తండ్రి అయిన భవానీరాంకు చెప్పి మరియు శ్రీగజానన్ను తమ ఇంటికి తెచ్చేందుకు అనుమతి తీసుకున్నాడు. 4 రోజులుపాటు వెతికిన తరువాత మాణిక్ చౌక్ లో మహారాజును బనకటలాల్ చూస్తాడు. ఆసమయం సూర్యాస్థమాన సమయం కానీ, బనకటలాల్ కి అది శ్రీగజానన్ రుపంలో సుర్యోదయం అయింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 7 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 3 🌻

He drank the water and said Don't try to satisfy me with the bread of that Mali. I want a nut from you. Bankatlal gave Him a nut and along with it offered a copper coin as Dakshina (offering). Shri Gajanan said that He was not a businessman to accept money, and asked for Bhakti only. 

Then Shri Gajanan asked Bankat and Pitambar to listen to the Kirtan attentively. Govind-Bua started the Kirtan with a stanza from Shri Bhagavat. 

Govind-Bua recited the first part of the stanza and Shri Gajanan loudly recited the latter part of it. Govind-Bua was surprised and said that the man who recited this stanza must be a man of great authority. 

Saying so, he requested Shri Gajanan Maharaj to come inside the temple. Likewise other people also requested Shri Gajanan Maharaj , but Shri Gajanan Maharaj ignored them all. 

Then Govind-Bua himself came out and said to Maharaj, You are the incarnation of Lord Shankar. Please come in. The temple will be empty without You. By the grace of some good deeds of my previous birth I have come across saint like you. 

So kindly come into the temple.” Shri Gajanan Maharaj said, Be firm on what you say. Just now you have said that God is every where, then why force me to come in the temple? 

You should practice what you preach and a student should avoid playing with words. It is not proper for you to behave against the preaching of the stanza from Bhagavat that you just preached to these people. 

I don't wish for you to be preaching just for livelyhood. Now go and continue your Kirtan. Bua returned and announced to the audience, An invaluable gem has come to your Shegaon. 

Protect Him carefully. With the arrival of this Pandurang in human form, Shegaon has become Pandharpur. See that He lives with you, serve Him well and obey Him. That alone will bring you all immense happiness. 

Bankatlal brimming with joy returned home and told his father Bhavaniram about Shri Gajanan and received his consent to bring Shri Gajanan Maharaj home.

Then he started his search for Shri Gajanan. After four days of wondering, Bankatlal Saw Shri Gajanan Maharaj in Manik Chowk. It was evening time and the sun was setting, but for Shri Bankatlal it was the rising of sun in the form of Shri Gajanan.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 29/Jul/2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 8 / Sri Gajanan Maharaj Life History - 8 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 4 🌻

ఇంటికి చేరుతున్న ఆవులు శ్రీకృష్ణుడు అనుకుని శ్రీగజానన్ చుట్టూచేరాయి. దుకాణుదారులు సాయంత్రం దీపంపెట్టే సమయంలో శ్రీమహారాజును బనకటలాల్ తమ ఇంటికి తెస్తాడు. 

యోగిని చూచినంత మాత్రంలోనే అతి ఆనందంతో భవానీరాం అతనికి మొక్కి కూర్చునేందుకు ఒక చెక్కపీట ఇచ్చి ఇలా అన్నాడు: శివుని అవతారం అయిన మీరు ఈవిధంగా సాయంత్రం మాయింటికి విచ్చేసారు, నేను భోజనం పెడదామనుకుంటున్నాను, దయచేసి అంగీకరించండి. ఈవిధంగా సాయంత్రం సమయంలో మిమ్మల్ని ఇంటి దగ్గర పొందడానికి నేను చాలా అదృష్టవంతుడను. 

సాయంత్రం సమయంలో శివుని ఆరాధించే అవకాసం దొరకడము చాలా అదృష్టమని స్థందపురాణంలో కూడాచెప్ప బడింది. ఈవిధంగా అంటూ శ్రీమహరాజును భిల్వ పత్రంతో పూజిస్తాడు. బనకటలాల్ తండ్రి శ్రీమహరాజును భోజనానికి అయితే ఆహ్వనించాడు కానీ భోజనం ఇంకా తయారుకాలేదు. 

ఒకవేళ భోజనంతయారు అయ్యేవరకు ఈయోగి ఆగకపోతే చాలానిరాశ అవుతుంది. ఎందుకంటే భగవాన్ శివుడు ఈవిధంగా భోజనం తీసుకోకుండా తన ఇల్లు వదలి వెళ్ళిపోవడం. అందుచేత ఏమి చేయాలనే సంస్జిద్ధంలో పడ్డాడు. 

ఆలోచించి శ్రీమహరజుకు ఉదయం తయారుచేసిన పూరీలు పెడదామని నిర్ణయించాడు, కారణం వేగించిన వస్తువులు పాచి పట్టినవిగా భావించరని. దీనికంటే ముఖ్యంగా తను నిష్కల్మమయిన మనస్సుతో ఈవిధంగా భోజనం కోసం మహరాజును ఆహ్వనించాను అని అతనికి తెలుసు. 

అందుకని పూరీలు, బాదములు, ఎండు ద్రాక్షలు, అరటిపండ్లు మరియు నారింజలు ఒక పళ్ళెంలోతెచ్చి శ్రీమహారాజు ముందు పెడతాడు. నుదుటికి విభూధి పెట్టి మెడలో ఒకపూలహారం కూడావేసాడు. 

శ్రీగజానన్ వడ్డించిన ప్రతి వంటకం తింటూ, కనీసం ముగ్గురు తినగలిగే అహారంతిని ఆరాత్రికి బనకటలాల్ ఇంటిలోనే బసచేసారు. మరుసటి రోజు ఉదయం వంద బిందెలనీళ్ళతో బనకటలాల్ శ్రీగజానన్ కు మంగళ స్నానం చేయించాడు. 

పురుషులు, స్త్రీలు ఆయనకు సుగంధ తైలమర్దనం చేసి, సబ్బుతోతోమి, కడిగి స్నానం చేయించారు.స్నానం తరువాత మంచిఖరీదయిన కాషాయవస్త్రం ధరించేందుకు ఇచ్చి ఒకఎత్తయిన అలంకరించిన ఆసనంమీద కార్చుండబెట్టారు. 

తులసీదళాలు ఉన్న పూలహారాలు ఆయన మెడలో వేసి గంధం నుదుటి మీదపెట్టి, పండ్లు, మిఠాయిలు తినడంకోసం ఇచ్చారు. 

ఆవిధంగా బనకటలాల్ ఇల్లు భక్తులకు ద్వారకలా అయింది. న ఇచ్చారా ఆ వ్య యంత్రం, ఇళ్ళారా నవ్వేకరించి తిన్న తరువా ఆరోజు సోమవారం మహాశివునికి ప్రియమయిన రోజు. 

ఒకేఒక వ్యక్తితప్ప, మిగిలినవారు శ్రీగజానన్ను ఆరాధించి కోరిక నెరవేర్చుకున్నారు. ఆవ్యక్తి బనకటలాల్ కుటుంబీకుడయిన ఇఛ్ఛారాం. అతను శివభక్తుడు మరియు ఆరోజు శివుని ప్రియమైన సోమవారం కావడంవల్ల శ్రీగజానన్ శివస్వరూపం కాబట్టి సాయంత్రం పూజించాలని కోరుకున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 8 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 4 🌻

Cows returning home, gathered around Shri Gajanan thinking Him to be Shri Krishna.

Shopkeepers were preparing to light the lamps when Shri Bankatlal brought Shri Gajanan Maharaj to his house.

Bhavaniram, overjoyed at the sight of a saint, prostrated before Him, offered Him a wooden Pata to sit on and said You are an incarnation of Shri Shankar, coming to us at the evening. I wish to offer You food, so please kindly accept it. 

I am really very fortunate to have You at my place in the evening. Skandhapurana says that it is a great fortune to worship Lord Shankar in the evening.

Saying so, he respectfully worshipped Shri Gajanan Maharaj with Bilwapatra. 

Bankatlal's father was now worried because he had requested Shri Gajanan Maharaj to accept the food at his house; however, in fact the food was not yet ready, and if this saint did not wait till the food gets ready, it would be a great disappointment, as this would mean that Lord Shankar going away, without taking any food in the evening from his house. 

So he was in a fix. What to do? He thought over the matter and decided to offer Shri Gajanan Maharaj puris which were prepared in the morning, as fried food is not treated as stale. Moreover he knew that his mind was pious and sincere in offering food to Shri Gajanan. 

Accordingly he brought a thali full of puris, almonds, dates, bananas, and oranges and put it before Shri Gajanan. He applied Bukka on His forehead and put a garland around His neck. 

Shri Gajanan ate everything that was served, consumed about three seers of food and stayed that night with Bankatlal. Next morning Bankatlal gave Shri Gajanan a ceremonious bath with one hundred pitchers of water. Men and women washed Him with soap and massaged His body with scented oils. 

After the bath, a very costly Pitambar (yellow robe) was given to Him to wear and made Him sit on a well-decorated high seat. Garlands of flowers and Tulsi were put around His neck, Kesar paste was applied on His forehead and fruits and sweets were offered to Him to eat. Thus Bankat's house became Dwarka for all the devotees. 

That was Monday, the auspicious day of worshipping Lord Shankar. All the people fulfilled their desire of worshipping Shri Gajanan except one. 

That was Ichharam, a cousin of Bankatlal. He was a devotee of Lord Shankar and it being a Monday, the day of Lord Shiva, he wished to worship Shri Gajanan at evening time by treating Him to be Lord Shiva.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 30/Jul/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person, standing
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 9  /  Sri Gajanan Maharaj Life History - 9 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 5 🌻

సాయంత్రం, ఇఛ్ఛారాం స్నానంచేసి ప్రగాఢభక్తితో శ్రీగజానన్ను పూజించాడు. తను ఉదయంనుండి ఉపవాసం ఉండిఉండడం, మరియు తనుఇవ్వబోయే ఆహారం శ్రీగజానన్ స్వీకరించి తిన్న తరువాత తను ఆహారం తీసుకుంటానని శ్రీమహారాజుతో అంటూ కనీసం నలుగురు వ్యక్తులు తినగలిగే అన్నం, కూరలు, పూరీలూ, అనేకరకాలయిన మిఠాయిలు, నెయ్యి, పండ్లు ఇంకాఅనేక పదార్ధాలు ఒక విస్తరలోపెట్టి శ్రీగజానన్ ముందుఉంచుతాడు. 

ఆ విస్తర చూసిన శ్రీమహారాజు తనలోతాను ఈవిధంగా అనుకున్నారు. ఓకక్కుర్తి గణప్యా, ఎప్పుడూ తిండితిండి అనేదికదా ఇక ఆలోచించకుండా ఈవిస్తరలో పదార్ధాలుతిని నీ కక్కుర్తితనం ఎంతో వీళ్ళని చూడనీ. ఇలాఅనుకుంటూ ఆపదార్ధాలు తినడం ప్రారంభించి ఒక్క ఉప్పుతునక కూడా ఆవిస్తరలో మిగల్చలేదు. 

ఈ విధంగా బలవంతంగా తినడంవల్ల ఫలితం ఏమవుతుందో చూపించడానికి, శ్రీగజానన్ తనుతిన్న పదార్ధాలన్నీ వాంతి చేస్తారు.

శ్రీరామదాసుస్వామి కూడా ఒకసారి ఇదేవిధంగా చేస్తారు. 

ఒకసారి క్షీరాన్నం తినాలని బాగాకోరిక కలిగి, అడిగి కడుపునిండా తింటారు. అతిగా తినడంవల్ల ఫలితంగా వాంతిఅవుతుంది. అటువంటి కోరికను జయించడంకోసం ఆవాంతిచేసిన పదార్ధాలను శ్రీరామదాసు తిరిగి తినడం ప్రారంభించారు.

ఇదేవిధంగా శ్రీగజానన్ ఎటువంటి పదార్ధాలు, ఎంతఅయినా జీర్ణించుకోగల శక్తి సామర్ధ్యం ఉన్నవారు అయినా, ఈవిధంగా బలవంతంచేసి తినిపించేవారికి పాఠం చెప్పేందుకు ఇలాచేసారు. ఆతరువాత భక్తులు ఆస్థలం పూర్తిగా శుభ్రంగాకడిగి, తీగజానన్ కు కూడా స్నానంచేయించి, ఒక ఎత్తయిన ఆసనంమీద కూర్చుండపెడతారు. 

చాలా మంది వచ్చి శ్రీగజాననకు నమస్కరించారు. వాళ్ళు భక్తిగీతాలు కూడా పాడడం ప్రారంభించారు. శ్రీగజానన్ అవివింటూ, చాలా ఆనందపడుతూ, ఆతన్మయత్వంలో వాళ్ళభజనస్వరంలో గణ గణ గణాతబోతే అని పాడడం ప్రారంభించారు. 

ఈ విధమయిన ఈయన గణ గణ గణాతబోతే అనేపాట వలన భక్తులు ఈయనను గజానన్ అనిపిలవడం ప్రారంభించారు. స్వయానా బ్రహ్మ అవడంచేత ఆయనకు ఏవిధమయిన పేరు అవసరంలేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 9 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 5  🌻

At Sunset time, Ichharam took a bath and with great devotion offered Puja to Shri Gajanan. He told Shri Gajanan Maharaj that he had a fast since morning and would take food only if Shri Gajanan accepted and ate food offered by him. 

Saying so, Ichharam brought a thali full of rice, many varieties of Sweets, curry, puris, ghee, fruits and many other things, sufficient to feed at least four persons and put it before Shri Gajanan. 

Looking at that thali Shri Gajanan Maharaj said to Himself, You, greedy Ganpya, always want to eat and eat. Now eat all this food without hesitation and let all these people see Your greediness. Saying so, He started eating everything that was served to Him and did not leave even a grain of salt in the thali. 

Then to show the result of forceful eating, Shri Gajanan vomited everything that He ate. Shri Ramdas Swami once did the same thing. It so happened that he felt a craze to eat Sweet Kheer. He asked for it and ate it to His full. 

Overeating resulted in vomiting. Shri Ramdas started eating that what he vomited just to win over his desire. Similarly Shri Gajanan, though quite strong to digest anything, vomited only to teach a lesson to those who pressurize Him to eat. 

Thereafter the devotees cleaned the place, gave a bath to Shri Gajanan and made Him sit on a raised seat. Many people came to pay respect to Gajanan. They started singing devotional songs. 

Shri Gajanan Maharaj was very happy to listen to them and then He began chanting to Himself Gan Ganat Bote in the same tune in which the Bhajan was sung. It continued this way for the whole night. 

Because of His above utterance of Gan Gan Ganat Bote, people started calling him Gajanan. In fact He Himself being Brahma needs no name.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 31/Jul/2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 10  /  Sri Gajanan Maharaj Life History - 10 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 6 🌻

సాధారణంగా యోగులు తమయోగావస్థలో ధ్యానంలో ఉంటారు. అందులో వారికి దొరికే రసానందం దేనితోపోల్చలేనిది. భక్తులు ఆషాఢ మాసంలో పండరపూర్, సింహలగ్నంలో నాసిక్, కుంభమేళకు హరిద్వార్ వెళుతున్నట్టు శ్రీగజానన మహారాజు కోసం షేగాం వెళ్ళడం ప్రారంభించారు. 

స్వయంగా విఠల నారాయణుడయిన స్వామిసమర్ధ గజానన్ దృఢనిశ్చయంతో షేగాంలో ఉన్నారు. ఈయన మాటలు గోదావరి ఒడ్డు అయితే దానినుంచి వచ్చేఆనందం హరిద్వార్ లాంటిది. శ్రీగజానన్ మందిరంగా మారిన బనకటలాల్ ఇంటికి దర్శనం కోసం వెళ్ళేందుకు షేగాం అంతా భక్తులతో నిండి ఉంది. 

ఈ విధంగా బనకటలాల్ ఇంటికి అనేకమంది గజానన్ దర్శనార్ధం వస్తూఉన్నారు.

 బ్రహ్మజ్ఞానంపొందినవానికి కులంలేదు. సూర్యకిరణాలు అందరికీ ఒకేవిధంగా లభ్యంఅవుతాయి. కొత్తగుంపులు రోజూ షేగాం వస్తూ ఉండగా, రోజూ వందలాది భక్తులకు ప్రసాదం వడ్డించబడేది. 

నిజంగా నాలాంటి ఒకచిన్న కీటకానికి ఈవిషయం వర్ణించ సఖ్యంకానిది. ప్రతీదీ శ్రీగజానన్ వల్లనే చెప్పబడింది / వర్ణించబడింది. నేను కేవలం దీనికి ఒక సాధనంగా వాడబడ్డాను. ఈయన జీవితచరిత్ర చాలావిశాలమయినది. నేను చెప్పడంలో చాలావెనకబడతాను. 

అయినా సరే ఈయన దినచర్యగురించి ఇక వర్ణిస్తాను. ఒక్కొక్కసారి చక్కగా స్నానంచేసేవారు. మరోసారి మురికినీళ్ళు త్రాగేవారు. గాలివేగంలా ఈయన దినచర్య చాలాచంచల మయినది. పొగ త్రాగడానికి ఇష్టపడేవారు కానీ దానికి బానిస కాలేదు. ఇంక శ్రద్ధతో తరువాత అధ్యాయం వినండి. 

ఈగ్రంధం భక్తులకు ఒక అనుచిత మార్గదర్శిని కావాలని దాసగణు కోరుకుంటున్నాడు.
 
శుభం భవతు 
 2. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 10 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 6 🌻

Yogis are perpetually engrossed in their yogic trance and the joy that they derive out of that has no comparison. 

As people go to Pandharpur in Ashadha, to Nasik in Sinhastha or to Haridwar for Kumbhamela, they started going to Shegaon to worship Shri Gajanan Maharaj. Swami Samarth Gajanan is the incarnation of Vithal Narayan and is standing like a rock of determination at Shegaon. 

His words were the bank of holy Godavari, the joy begotten out of it was Haridwar and the whole Shegaon was crowded by people who wished to meet Shri Gajanan in this temple which was Bankatlal's house. 

Thus innumerable people were coming to Bankatlal's house for the Darshan of Shri Gajanan. One who has attained Brahmapada has no caste. The rays of the sun equally bless everything and everybody. 

Fresh batches of people were coming daily to Shegaon and food was served to hundreds of people. In fact it is all beyond the power of description of a small fly like me. 

Everything is being said and narrated by Shri Gajanan Himself by using me as a tool for that purpose. His life story is vast and I fall too short to describe it. However, I now narrate to you His daily routine. 

At times He took a good bath and some times used to drink dirty water. His daily routine was most uncertain like the speed of air. He loved smoking but had no craving for it. 

Now listen to the next chapter with faith. Dasganu desires this book to be an ideal guide for the devotees.

 ||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Two

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 01/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person, mountain, outdoor and nature
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 11  /  Sri Gajanan Maharaj Life History - 11 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 1 🌻

 శ్రీగణేశాయనమః ! ఓ సచ్చిదానందా శ్రీహరి నాయందు దయఉంచు, ఎందకంటే నువ్వు ఎప్పుడూ అల్పజీవులపైన క్రోధం చూపలేదు. నీవు దయాసాగరుడవు దుఖితులకు తల్లివంటివాడివి మరియు భక్తులకు కల్పతరువువంటి వాడవు. 

ఓరామా నీయొక్క ఈవిధమయిన ప్రతిభ మహామునులచేత చెప్పబడింది. అందుచే పురుషోత్తమా, విలంబం చేయకుండా ఈ దాసగణును కూడా ఆశీర్వదించండి.

 బనకటలాల్ ఇంటిలో శ్రీగజానన్ మహారాజు బసచేసారు. దూరప్రదేశాలనుండి కూడా ప్రజలు ఆయన దర్శనంకోసం రావడం ప్రారంభం అయింది. తేనె ఉన్నచోటుకు ఈగలు వాటిఅంతట అవేవస్తాయి. దానికి ఆహ్వనం అవసరంలేదు. 

ఇక ఒకరోజు ఏమయిందోవినండి. సూర్యోదయసమయం, తూర్పుదిశ ఎర్రగాఉంది, పక్షులు ఉదయరాగాలు తీస్తూఉండగా, చల్లటిగాలి వీస్తూఉండగా, వృద్ధులు తమ శయన కక్షలో ఉండి భగవంతుని నామస్మరణ చేస్తూఉన్న సమయంలో శ్రీమహారాజుకూడా మంచి ఆహ్లాదకరమయిన మనస్సుతో కూర్చునిఉన్నారు. 

సూర్యుడు కొద్దిగా తలఎత్తేటప్పటికి చీకటి పారిపోయింది. పతివ్రత స్త్రీలు ఆవుపేడకలిపిన నీళ్ళు ఇంటిముందర వాకిళ్ళలో చల్లుతున్నారు మరియు ఆవుదూడలు తల్లిపాలకోసం పరిగెడుతున్నాయి. 

ఇటువంటి ఆహ్లాదకరమయిన వాతావరణంలో ఒక బైరాగి శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వచ్చాడు. చినిగిపోయిన వస్త్రాలలో అతను ఒకభిక్షగాడిలా కనిపిస్తున్నాడు. శ్రీమహారాజు చుట్టూకూర్చున్న ధనవంతుల నుండి ఈభిక్షగాడిలా కనిపిస్తున్న వ్యక్తి ఎలా ఆహ్వనం పొందగలడు ? 

అతని దగ్గర ఒక జీర్నావస్తలో ఉన్న ఒకచిన్న వస్త్రం, తలకి ఒకరుమాలు మరియుభుజానికి ఒకసంచి వేలాడుతూ ఉంది. అస్తవ్యస్తమయిన జుత్తు వీపువైపువాలి ఉంది. అతను శ్రీగజానన్ ముందు ఒకమూల నిశ్శబ్ధంగాకూర్చున్నాడు. 

శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వస్తున్న అనేకమందిలో ఈబీదవాడిని ఎవరూ లక్ష్యపెట్టలేదు. అలాకూర్చునే శ్రీగజానన్ దగ్గరకి వెళ్ళి ఎలా పాదస్పర్శ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇతను శ్రీగజానన్ గొప్పతనంగురించి కాశీలోవిని గంజాయి శ్రీమహారాజుకు బహుమానంగా ఇద్దామని మొక్కుకుని వచ్చాడు. 

అతనిమొక్కు తీర్చుకునేందుకు మొదట ఆయనదగ్గరకు వెళ్ళడానికి అవకాశం దొరకటంలేదు, ఒకవేళ దొరికినా గంజాయి పేరువింటూనే అక్కడిప్రజలచేత తన్నులుతినవలసి వస్తుందేమో ? అసలు శ్రీగజానన్ దగ్గరకు రావడానికి ఉద్దేశం తను శ్రీమహారాజుకు మొక్కుకున్న గంజాయి ఇవ్వడమే. గంజాయి ఎందుకు అనుకున్నాడంటే తనకు స్వయంగా గంజాయిఅంటే ఇష్టం, అందువల్ల అదేగొప్ప బహుమానం అనుకున్నాడు. 

ఈవిధంగా అతను మనస్సులో అనుకుంటున్న విషయం శ్రీగజానన్ అర్ధంచేసుకుని, అక్కడచేరిన భక్తులతో ఈబైరాగిని తనదగ్గరకు తెమ్మని శ్రీమహారాజు అన్నారు. యోగులు భూత, భవిష్య మరియు వర్తమానాలు తెలిసినవారు, కనుక తను ఈ షేగాం రావడానికి కారణంకూడా శ్రీగజానన్ కు తెలిసిఉండాలి అని అనుకున్నాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 11 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 1 🌻

Shri Ganeshayanamah! O Sachhidananda Shri Hari, be kind to me as You have never been harsh to the fallen ones. You are the ocean of kindness, a mother to the sufferers and a Kalpataru to Your devotees. 

O Rama, such is Your reputation as sung by the saints. So, Purushottama, please bless this Dasganu without delay. Shri Gajanan Maharaj stayed at Bankatlals house. 

People from distant places started coming to Him for Darshan. Flies gather where there is honey with no invitation. Now listen to what happened one day. Shri Gajanan Maharaj was sitting in a jubilant mood. It was morning time. 

Eastern horizon was red and birds were singing. Soft breeze was blowing and old people, sitting in their beds, were chanting Gods name. The sun, peeping up from the east, drove away the darkness. 

Pious married ladies were sprinkling water in their courtyard and calves were running to the cows. At such a pleasant morning, an ascetic came for the Darshan of Shri Gajanan Maharaj. 

With his worn out clothes, he was looking like a beggar. How can such a beggarly looking person expect good reception from the rich people sitting around Shri Gajanan Maharaj ? He had a small loincloth, a kerchief around his head and a small bag hanging from his shoulder. His dry disorderly hair was hanging on his back. 

He quietly sat in one corner before Shri Gajanan. Amongst many people coming for the Darshan of Shri Gajanan Maharaj , this poor man was totally neglected. Sitting there, he was wondering as to how to get near Shri Gajanan to touch His feet.

Having heard of the greatness of Shri Gajanan at Kashi, he had vowed to present Ganja to Shri Gajanan Maharaj . In the first place, now he was finding it difficult to get a chance to fulfil his vow, and if at all he got a chance, the utterance of the word Ganja in the temple would make him face kicks from the people around. 

But after all, his coming to Shri Gajanan was only for the fulfilment of the vow of offering Ganja to Shri Gajanan Maharaj . His vow of offering Ganja was because he liked it the most and so he thought it to be the best offering. 

While he was thinking so, Shri Gajanan understood and pointing to him asked the devotees to bring forth that ascetic to him. 

He was happy to see that Shri Gajanan knew everything that was going on in his mind. Saints know everything about the past, present and future. So he now expected Shri Gajanan to know the purpose of his coming to Shegaon. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Date: 02/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 12  /  Sri Gajanan Maharaj Life History - 12 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 2 🌻

ఆ బైరాగిని తనదగ్గరకు తేగానే మూడునెలల నుండి నీసంచిలో ఉంచిన మూటబయటకు తియ్యి అని శ్రీమహారాజు అనడంతో ఆబైరాగి ఆనందంలో మునిగి దొర్లడం ప్రారంభించాడు. 

సిగ్గులేకుండా నాకు గంజాయి ఇద్దామనుకుని వచ్చి ఇప్పుడు సంచిలోంచి తీయడానికి సిగ్గుపడతావేమి అని శ్రీమహారాజు అన్నారు. 

నేను తీసి ఇస్తున్న ఈగంజాయి నాజ్ఞాపకార్ధం శాశ్వతంగా శ్రీమహారాజు అంగీకరించాలని నివేదిస్తున్నాను అని చురుకైనబధిగల ఆబైరాగి అన్నాడు. మీకు గంజాయి అవసరంలేదు అనినాకుతెలుసు కానీ నా నవ్రమయిన ఈకానుకను కృపయా స్వీకరించడి. 

భక్తులయొక్క కోరికలన్నీ భగవంతుడు పూర్తిచేస్తాడు, ఉదాహరణకు శివుని తనగర్భంనుండి పిల్లవానిగా జన్మించమని అంజని ప్రార్ధించగా శివుడు అంగీకరించి మహారుద్ర హనుమాన్గా పుట్టాడు. 

ఈవిధంగా కోతిరూపంలో భగవాన్ శివుడు పుట్టడం తనభక్తుని కోరిక నెరవేర్చడంకోసమే. శ్రీగజానన్ కొద్దిగాసంకోచించారు, కానీ తరువాత అంగీకరించారు. అప్పుడు ఆబైరాగి గంజాయి తీసి, చేతిలో నలిపి, పొగగొట్టంలో నింపి శ్రీమహారాజుకు త్రాగేందుకు ఇచ్చాడు. ఈవిధంగా శ్రీగజానన్ గంజాయి త్రాగడం మొదలుపెట్టారు, కానీ దీనికి బానిస ఎన్నటికికాలేదు. తామరఆకు వలె ఈయన మక్కువకు, అనురాగాలకు అతీతులు. 

ఆబైరాగి కొద్దిరోజులు అక్కడ ఉండి రామేశ్వరానికి వెళ్ళిపోయాడు. శ్రీమహారాజు ఒక్కోసారి చక్కటి మధురవాణితో వేదపఠనం చేసేవారు. ఒక్కోసారి నిశ్శబ్దం పాటించేవారు. వేదపఠనం చేస్తున్నప్పుడు ఈయన బ్రాహ్మణుడు అని అనిపించేది. ఒక్కోసారి తనుతయారు చేసిన గీతాలను వేరువేరు రాగాలలో పాడేవారు, లేదా గణ గణ గణాతబోతే అనే తన మంత్ర పఠనం చేసేవారు. 

మిగిలినవేళ నిశ్శబ్దం పాటించేవారు, లేదా నిద్రపోయేవారు. ఒక్కోసారి పిచ్చివానిగా ప్రవర్తించేవారు లేదా అడవిలో తిరిగేవారు, లేదా ఊహంచని రీతిగా ఎవరి ఇంటిలోకయినావెళ్ళేవారు. జానారావ్ దేష్ ముఖ్ అనే ప్రఖ్యాతమయిన వ్యక్తి షేగాంలో ఉండేవాడు. ఆయన మరణశయ్యపైన ఉన్నాడు. వైద్యులు అందరూకూడా ఈయన బతకడంమీద ఆశలు వదులుకోమని అతనిబంధువులకు చెప్పారు. 

వారికి ఇదివిచారకరమయినవార్త. వారు భగవంతుడిని ప్రార్ధించారు, మొక్కుకున్నారు కాని ఉపయోగం లేకపోయింది. యోగులు చమత్కారం చెయ్యగలరు అనే నమ్మకంతో చివరి ఉపాయంగా వారు శ్రీగజానన్ దరికి చేరదామని అనుకున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 12 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 2 🌻

When he was brought forth, Shri Gajanan Maharaj said, “Take Out that bundle which you have been keeping in your bag for the last three months.”

 Overwhelmed with joy, the ascetic started rolling like a child before Shri Gajanan Maharaj . Maharaj said, “Shamelessly you vowed to offer Ganja to me and now feel shy to take it out of your bag.” 

The shrewd ascetic said that he would take it out and offer Ganja with a request that Shri Gajanan Maharaj , as a token of his remembrance, accept the offering permanently. 

He further said, “I know that You don’t need Ganja, but kindly accept it as my humble offering. God fulfills all the desires of devotees. For example, Anjani prayed to Lord Shiva to come to her womb and take birth as her child. 

Lord Shiva accepted and took birth as Maharudra Hanuman. Taking the form of a monkey was accepted by Lord Shiva to fulfil the desire of His devotee.” Shri Gajanan hesitated a bit but then agreed. 

The ascetic, then, took out Ganja, rubbed it in his hand, filled in the pipe and gave it to Shri Gajanan Maharaj to smoke. This is how Shri Gajanan started smoking Ganja, but He never became an addict to it. Just like a lotus leaf, he was free from attachments. 

The ascetic stayed there for a few days and then went away to Rameshwar. Sometimes Shri Gajanan Maharaj used to recite Vedic verses in sweet clear tones, while other times observed silence. 

His Reciting of the Vedas indicated that He was a Brahmin. Sometimes he used to sing a composition in different ragas or go on singing His Mantra, “Gan Gan Ganat Bote”. 

At other times He observed silence or quietly slept. Sometimes He behaved like a mad man, wandered in the jungles or entered somebody’s house unexpectedly. 

At Shegaon there was a famous man named Janrao Deshmukh. He was on deathbed and all the doctors declared him to be as a hopeless case, and accordingly notified his relatives. 

They prayed to God, took vows in exchange of his life, but to no avail. So they thought of the last remedy i.e. of approaching Shri Gajanan Maharaj with the belief that saints can perform any miracle. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Date: 03/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 13  /  Sri Gajanan Maharaj Life History - 13 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 3 🌻

సచ్చిదానందుడిని జ్ఞానేశ్వర్ పునర్జీవిని చేసారు. అదేవిధంగా జానరావోను శ్రీగజానన్ చెయ్యగలరని వారినమ్మకం. అందువల్ల, శ్రీగజానన్ నివసించే బనకటలాల్ ఇంటికి జానరావ్ బంధువు ఒకరు వెళ్ళి, జానరావ్ వృత్తాంతం బనకటలాలకు వర్నించి, శ్రీగజానన్ పాదతీర్ధం జానరావుకు ఇచ్చేందుకు ఇవ్వ వలసిందిగా వేడుకుంటారు. 

తన తండ్రి అయిన భవానీరాం అనుమతితో ఒక గ్లాసునీళ్ళు శ్రీమహారాజు కాలికి తగిలించి, ఇది తీర్ధంగా జానరావుకు ఇస్తున్నామని దానికి శ్రీగజానన్ సమ్మతించగా బనకటలాల్ ఆతీర్ధం జానరావు కొరకుఇస్తాడు. అది త్రాగుతూనే జానరావుకు తెలివివస్తుంది. 

ఆతరువాత క్రమేణా జబ్బునుండి కోలుకున్నాడు. ఔషదాలన్నీ ఆపివేసి జానరావుకు శ్రీమహారాజు పాదతీర్ధం రోజూఔషదంగా ఇచ్చారు. జానరావు ఒక వారంరోజులకు పూర్తిగా కోలుకున్నాకా, భవానిరాం ఇంటికి వెళ్ళి శ్రీగజానన్ మహారాజు దర్శనం చేసుకున్నాడు. 

శ్రీమహారాజు పాదతీర్ధం అమృతంలా పనిచేసింది ఎందుకంటే ఈకలియుగంలో, ఈ యోగులే భగవంతులు. ఈవిధంగా జరగడంతో, శ్రీగజానన్ షేగాంలో ఉన్నంతవరకు ఎవరూ చనిపోరాదని ఎవరయినా అనవచ్చు. కానీ ఈతర్కంసరికాదు. యోగులు ప్రకృతిని వ్యతిరేకించరు, మరియు మృత్యువును ఆపరు.

అసహజము లేదా ఆకస్మిక మృత్యువును వీరు తప్పించగలరు. శ్రీజ్ఞానేశ్వర్, శ్రీసచ్చిదానందుని మృత్యువును నవాషాలో నిరోధించారు. తరువాత శ్రీసచ్చిదానందుడు అళందిలో మరణించవలసివచ్చింది. 

యోగులకు ఈవిధమయిన ఆకస్మిక మరియు అసహజ మృత్యువును పసికట్టడం కష్టంకాదు. మృత్యువులు మూడువిధాలుగా ఉన్నాయి: 

1. ఆధ్యాత్మిక కారణంవల్ల - సహజ లేదా ప్రారబ్ధంవల్ల 

2. ఆదిభౌతిక కారణంవల్ల - జీవన సరళి వలన . 

3. ఆదిదైవిక కారణంవల్ల - ఆకస్మిక లేదా అసహజ కారణంవల్ల. 

ఈమూడింటిలో మొదటిది చాలా శక్తివంతమైనది మరియు ఎవరూ ఆపసక్యంకానిది. 

రెండవది ఆదిభౌతిక మృత్యువు చెడు అలవాట్లు, క్రమశిక్షణలేని జీవన సరళి వల్ల శరీరంలో అనేకరోగాలు వల్ల వచ్చేది. మంచివైద్యుని సహాయంతో దీనిని ఆపవచ్చు. 

మూడవది ఆదిదైవిక మృత్యువు. యోగుల ప్రార్ధన మరియు ఆశీర్వచనాలవల్ల ఆపవచ్చు. ఇందులో మరల రెండువిధాలుగా చెయ్యవచ్చు. 1. భౌతిక - జీవనసరళి 2. దైవిక - భగవంతుని అప్రియతవలన ఆధ్యాత్మిక మృత్యువును ఎవరూ నిరోధించలేరు.

అర్జునుడు కుమారుడు అయిన అభిమన్యుడు స్వయానా శ్రీకృష్ణుని ఎదుట చనిపోయాడు. జానారావు మృత్యువు అసహజమయినది కనుక శ్రీగజానన్ మహారాజు నిరోధించారు. భగవంతుని మీద ధృడవిశ్వాసంతో ఆయనకు మొక్కుకుంటేకొన్ని మృత్యువులను తప్పించవచ్చు. 

ఈవిశ్వాస బలమే అసహజ మృత్యువును ఆపుతుంది. ఇదేమృత్యువు, జీవితంలో ఆరు అవలక్షణాలను జయించిన యోగుల పాదతీర్ధం వలన కూడా ఆపవచ్చు. నిజమయిన యోగికి పూర్తిగా అర్పించుకోవాలేతప్ప, అందరూ కపటి సన్యాసుల నుండి దూరంగా ఉండాలి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 13 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 3 🌻

Shri Dnyaneshwar brought Sachhidananda back to life, and the same can be done by Shri Gajanan for Janrao. So one of the relatives went to the house of Bankatlal, where Shri Gajanan was staying, and narrating the whole story of Janrao requested him to give Pada Tirtha of Shri Gajanan which they would give to Janrao Deshmukh. 

Shri Bankatlal with the permission of his father Bhavaniram, took a glass of water touched it to the feet of Shri Gajanan Maharaj and told Him that the Tirtha was being given to Janrao Deshmukh. Shri Gajanan Maharaj gave His consent. 

Thereafter the Tirtha was given to Janrao Deshmukh who immediately regained consciousness and thereafter slowly recovered from the illness. All the medicines were stopped and Janrao was kept on a daily dose of the Tirtha from the feet of Shri Gajanan Maharaj . 

He gained his normal health within a week and went to Shri Bhavaniram’s house for the Darshan of Shri Gajanan Maharaj. Look, the water from the feet of Shri Gajanan Maharaj had the effect of life saving nectar. 

This is so because the saints are the God incarnates in Kalyuga. With such a happening one may say that nobody should die in Shegaon as long as Shri Gajanan Maharaj is there. 

This statement, however, is not logical. Saints do not prevent death, nor do they behave against the laws of the nature. But they can avoid death if it is unnatural or accidental. Shri Dnyaneshwar avoided the death of Shri Sachhidananda at Newasha, but the same Sachhidananda later on had to die at Alandi. 

That means, the saints can check unnatural or accidental death and it is not at all difficult for them.

There are three types of deaths namely, Adhyatmic (subjective) meaning natural or destined, Adhibhoutic (Phenomenal) meaning by material effects and Adhidaivic (God sent) meaning accidental or un-natural. 

Of these three, the first, Adhyatmic, is most powerful and nobody can avoid it. The second i.e. Adhibhoutic is the result of bad eating and living habits and an undisciplined lifestyle which gives rise to various diseases in the body. 

This type of death, however, can be averted with the help of a competent doctor. The third i.e. Adhidaivic can be prevented by prayers and blessings of Saints. This category is further divided into two types: Bhoutic, caused by material effects, and Daivic, caused by the displeasure of God. Adhyatmic i.e. the natural death cannot be prevented by anybody.

Remember that Abhimanyu, the son of Arjuna, died in the presence of Shri Krishna Himself. Janrao’s death was of an unnatural type and so could be prevented by Shri Gajanan Maharaj. 

Some deaths can be averted by vows of offerings to God. But they should be taken with full faith in the Almighty. In fact it is the strength of the faith involved that works to prevent the unnatural type of death. 

This sort of death can also be avoided by the Pada Tirtha of a saint who is pious and free from the six hostile forces of life. One should surrender to a real saint and keep away from the hypocrites.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Date: 04/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 14  /  Sri Gajanan Maharaj Life History - 14 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 4 🌻

పూర్తిగా కోలుకున్నాక, శ్రీమహారాజు నివసించే మఠందగ్గర వందలాది భక్తులకు జానరావు అన్నసంతర్పణ చేసాడు. దేష్ ముఖేను కాపాడిన దృష్టాంతంతో శ్రీగజానన్ మహారాజుకు ఇబ్బందులు కలిగించాయి. వీటిని తొలగించుకోవడం కోసం శ్రీమహారాజు ప్రజలతో అసహజంగా, కఠినంగా అవవలసి వచ్చేది. 

శ్రీమహారాజు యొక్క ఈవిధమయిన ప్రవర్తనను ఆయన నిజమయిన భక్తులు భరించగలిగేవారు. నరసింహ భగవంతుని రూపానికి ప్రజలు భయభ్రాంతులు అయినా, ప్రహ్లాదుడు ఈయన బాహ్యరూపం వల్ల భయపడలేదు. ఆడపులి అంటే ప్రజలు భయపడతారు. కానీ పులిపిల్లలు ఆ ఆడపులితో ఆడుతూ ఉంటాయి. 

ఇదేవిధంగా శ్రీమహారాజు కఠినత్వానికి ఆయన నిజమయిన భక్తులు భయపడలేదు. ఇప్పుడు ఇంకొక కధ వినండి వాననీళ్ళు పడడంతోనే నేలకు సువాసన వస్తుంది. అదేవిధంగా గంధం చెక్కతో తాకగానే ఒక సాధారణ చెక్కకు కూడా సుగంధం వస్తుంది. ఇదిసహజం. 

కానీ అంతలోనే ఆసాధారణమయిన చెక్క తనేగంధపు చెక్కను అనుకోవడం వెర్రితనం. చెరకు మొక్కలతోపాటు చెత్త మొక్కలుకూడా పెరుగుతాయి. యోగులు, పిశాచకులు కూడా ఈభూమండలం మీద జన్మించారు. ఘనులలో వజ్రాలతోపాటు మామూలు గుళకరళ్ళుకూదా దొరుకుతాయి. 

ఇవిరెండూ ఒకేచోటదొరికినా వాటివాటి విలువవేరు. మామూలు గుళకరాయికి, వజ్రానికి ఉన్న వెలుగు ఎలావస్తుంది ? అందువల్ల ఈవజ్రాలను పట్టితీసి, గుళకరాళ్ళను కాళ్ళక్రింద పడేస్తారు. 

షేగాంలో శ్రీగజానన్ మహారాజు దగ్గర విఠోబాఘాటోల్ అనే ఒకకపటి సన్యాసి పైనచెప్పిన గుళకరాయి వంటివాడు. అవినీతి, దొంగప్రవృత్తులు కలవాడయినా గొప్పభక్తునిగా నటిస్తుండేవాడు. శ్రీగజానన్ భోజనానికి, పొగత్రాగడానికి మరియు ఇతర అవసరాలకు నాపైనే ఆధారపడతారు, నేను ఆయనకు కుడిభుజంవంటివాడిని అనిచెప్పుకునేవాడు. శివుడికి నంది ఎటువంటిదో నేను శ్రీగజాననకు అటువంటివాడను అని చెప్పుకుంటూ, అనేకమయిన వసతులు పొందేవాడు. 

విఠోబా ఏమిచేస్తున్నాడనే విషయం తనదైవజ్ఞానం వలన తెలుసుకున్న శ్రీగజానన్ ఈవిధంగా బుద్ధి చెప్పారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 14 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 4 🌻

After his full recovery, Deshmukh celebrated the blessings by feeding hundreds of people at the Math where Shri Gajanan Maharaj stayed. 

The incident of saving Deshmukh created problems for Shri Gajanan Maharaj and to avoid them, He had to become rather strict and indifferent to the people. 

His real devotees, however, could bear with that attitude of Shri Gajanan Maharaj . God Narsimha, by His very appearance, created terror in the minds of people, but Pralhad was not afraid of that outward look. 

Tigress is fearful to others, but not to her cubs playing in her lap. Likewise the real devotees were not afraid of the strictness showed by Shri Gajanan Maharaj . Now listen to another story. 

It is seen that the earth, when in contact with musk, gets its fragrance. Similarly by mere contact of sandal wood and ordinary wood also gets its fragrance. This is quite natural, but it will be absurd if the wood thinks itself to be sandalwood. 

Along with the Sugarcane also grows some useless bushes. Saints and Satan are both born on the same earth. Along with diamonds, ordinary pebbles too are found in the mines. 

Though found in one place they differ in value. An ordinary pebble cannot get the lustre of a diamond and will simply be trampled under our feet, while the diamond picked up. Vithoba Ghatol, like an above pebble, a hypocrite, was staying with Shri Gajanan Maharaj at Shegaon. 

He was dishonest and insincere, but showed off as being a great devotee of Shri Gajanan Maharaj . He used to call himself the Kalyan of Shri Gajanan Maharaj , and said that Shri Gajanan depended for everything, i.e. food, pipe and other comforts, on him. 

He was taking all sorts of advantages by his association with Shri Gajanan Maharaj and boasted himself to be a bull before Lord Shiva. 

By his divine vision, Shri Gajanan Maharaj knew what Vithoba was doing and so taught him a lesson by following incident.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Date: 05/Aug/2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person, text
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 15 / Sri Gajanan Maharaj Life History - 15 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 5 🌻

శ్రీమహారాజు ధర్శనానికి కొంతమంది షేగాంరావడం జరిగింది. శ్రీగజానన్ అసమయంలో నిద్రపోతూఉన్నారు. ఆయనను ఆనిద్రనుండి లేపడానికి ఎవరూ సాహసించరు. 

ఈవచ్చిన వ్యక్తులకు త్వరగా వెళ్ళిపోవాలని ఉంది, కానీ శ్రీమహారాజు దర్శనం కూడా చేసుకోవాలని ఉంది. వీరు విఠోబాను కలసి, విఠోబా మాకు త్వరగాతిరిగి వెళ్ళి పోవాలనిఉంది, కానీ దానికి ముందు శ్రీమహారాజు దర్శనం మాకుకావాలి. 

ఆయన శిష్యులందరిలో నువ్వే శ్రీమహారాజుకు అతి ప్రియమయిన, చేరువైన, తెలివైన వాడవు కావున శ్రీమహారాజును నిద్రలేపు, మేముదర్శనంచేసుకుంటాము అని అన్నారు. 

ఈ విధమయిన వీరి నివేదనకి, విఠోబా పొంగిపోయి వెంటనే వెళ్ళి శ్రీమహారాజును నిద్రలేపుతాడు. వచ్చిన వాళ్ళకి దర్శనం అయితేఅయింది కానీ విబాకి ముప్పు తెచ్చింది. ఒక కర్రతో శ్రీగజానన్ విఠోబాను తీవ్రంగా కొట్టి, ఓరి మూర్ఖుడా, నువ్వు ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టావు, దీనిని సహిస్తూ ఉంటే భగవంతుని ముందు నేను తప్పుచేసిన వాడిని అవుతాను. కనుక నిన్ను నేను శిక్షించవలసిందే. 

మధిరను పానకంగా పరిగణించరాదు, విషాన్ని తాకకూడదు మరియు దొంగలను స్నేహితులుగా చేయరాదు అని శ్రీమహారాజు అంటూ, ఆ కర్రతో మరల ఆయన విఠోబాను వెళ్ళగొట్టారు. ఆవిధంగా పారిపోయిన విఠోబా ఎప్పటికి తిరిగి రాలేదు. 

నిజమయిన యోగులు ఈవిధంగా ప్రవర్తిస్తారు. కపట సన్యాసులు, కొంతమంది స్వార్ధపరుల సహాయంతో అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. ఇది సంఘవిద్రోహక చర్య. సమాజం నుండి ఇటువంటి వారిని వెలివేసేందుకు నిజమయిన యోగులు ఎప్పుడూ ప్రయత్నిస్తూఉంటారు. 

పతివ్రత అయిన ఇల్లాలు, ఒక భోగం మనిషి ఇరుగు పొరుగుగా ఉంటే ఇష్టపడదు. బంగారంనగలు అల్యుమినియం నగలతో ఉండడానికి ఇష్టపడవు. చెడుబుద్ధి కలవారిని యోగులు స్వీకరించినా వారికి ప్రాధాన్యత ఇవ్వరు. 

వీరి పూర్వజన్మ వృత్తాంతం యోగులకు తెలుసు కాబట్టి ఏవిధంగా అయితే మల్లె మొక్కలు, ముళ్ళమొక్కలు ఒకేనేలమీద పెరిగినా వాటికి ఉండే ప్రాధాన్యతలో తేడాఉందో అదేవిధంగా యోగులు అందరినీ కాపాడుతున్నా ప్రతివారికి ఇచ్చే విలువ వేరేగానే ఉంటుంది. 

విఠోబా చాలాదురదృష్టవంతుడు. యోగీశ్వరుని పాదాల స్పర్శ తగిలినా, దురదృష్ట వశాత్తు పోగొట్టుకున్నాడు. అతను యోగి గొప్పతనం అర్ధంచేసుకోలేకపోయాడు. అదికనుక అతను తెలిసికొనిఉంటే దైవిక భోగం పొందిఉండేవాడు. అతను కల్పవృక్షం క్రిందకూర్చుని ఒక గుళకరాయిని కోరుకున్నాడు లేదా కామధేనువునుండి ఒక కొబ్బరి కాయకోరుకున్నాడు. 

యోగుల సహచర్యంలో ఎవ్వరూ ఇలాచెయ్యరాదు. భక్తులందరినీ ఈ గజానన్ విజయగ్రంధం రక్షించుగాక. 

శుభం భవతు. 

 3. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 15 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 5 🌻

It so happened that some people came to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj. 

At that time Shri Gajanan was sleeping, and no body could dare wake Him up. These people were in hurry to go, but at the same time wanted the Darshan of Shri Gajanan Maharaj . 

They approached Vithoba and said, “Vithoba, we are in hurry to go back and want the Darshan of Shri Gajanan Maharaj before going. Amongst all the disciples, you are the most intelligent, nearer and dearer to Shri Gajanan Maharaj . 

So kindly wake him up and let us have his Darshan.” This request flattered Vithoba and he immediately went and woke up Shri Gajanan Maharaj . The people got the Darshan, but it invited calamity for Vithoba. 

Shri Gajanan got a stick and thrashed Vithoba severely with it and said, “You rascal, you have started business here, and if I tolerate you, I shall be guilty before God. 

So I must punish you: Wine should not be treated as a sweet drink, poison should not be touched, and thieves should not be made friends.” Saying so, He knocked him again with the stick. Vithoba ran away and never returned again. 

This is how the real saints behave. Hypocrites pose as saints, with the help of selfish people, and misguide the public. This is an antisocial act. Real saints will always try to eliminate such elements from society. 

A chaste lady will not like a prostitute as a neighbor; gold will not like the ornaments of aluminium. Saints may accept bad people, but will not give them importance. 

It is so because the saints realise that these people are sufferers because of their sins of previous life. It is just like the earth, which allows a prickly-pear to grow along with Mogra. 

Mogra and prickly-pear are both the children of earth but they get different treatment. So also the saints will offer protection to all but have different values to individuals. Vithoba was most unfortunate. 

He got the touch of a Saint’s feet, but unfortunately lost the same. He failed to understand the greatness of a saint. Had he realised it, he would have attained divine pleasure. 

By sitting under the Kalpavriksha he desired for an ordinary pebble or asked for a coconut shell from Kamdhenu. 

Nobody, in association with saint, should do like this. May this Gajanan Vijay Granth be a saviour to all devotees. 

||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Three 

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

06/Aug/2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 16 / Sri Gajanan Maharaj Life History - 16 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 4వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమ ! ఓసర్వశక్తివంతా, అతిశక్తివంతమైన భగవంతుడా, నీలకంఠా, గంగాధరా, మహాకాళ, త్రయంబకేశ్వరా, శ్రీఓంకారా మీరు సాక్షాత్కారం ఇవ్వండి. మీరు, విష్ణువు జలము. జలచరము వంటివారు. ఎవరి ఇష్టప్రకారం వారు మిమ్మలను ఆరూపంలో పూజిస్తూ ఉంటారు. త్రికరణశుద్ధితో మిమ్మల్ని ప్రేమించినవారికి పిల్లలకు తల్లిప్రేమదొరికినట్టు మీఆప్యాయత పొందుతారు. 

నేను కల్మషంలేని, తప్పులేని, మీప్రేమను యాచిస్తున్న పిల్లవాడిని. నీవు అతిశక్తి వంతుడివి, కల్పతరువువి. నాకోరికలను దయతోనెరవేర్చు. స్వామిగజానన్, బనకటలాల్ ఇంటిలో ఉంటున్నారు. వైశాఖ శుద్ధ తదియ నాడు కుండడు నీళ్ళతో పితృదేవతలకు తర్పణం అర్పిస్తారు. దీనిని అక్షయతిదియ అని విదర్భ ప్రదేశంలో పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటారు. 

తన ప్రాకృతికమయిన శక్తులను చూపించేందుకు ఆరోజు శ్రీమహారాజు కొంతమంది పిల్లవాళ్ళతో కూర్చుని ఉన్నారు. ఆ పిల్లలతో తన పొగత్రాగడానికి పొగాకు గొట్టంలోనింపి అంటించమని ఆయన చెప్పారు. పిల్లలు పొగగొట్టం తయారు చేసి నిప్పు కోసం వెతకడంమొదలు పెట్టారు. కానీవారికి అదిదొరకలేదు. 

జానకిరాం అనే కంసాలి దగ్గరకు వెళ్ళవలసిందిగా బనకటలాల్ ఆపిల్లలకు సలహా ఇస్తాడు, ఎందుకంటే ఈకంసాలులు ఉదయాన్నే వేరేపని ప్రారంభించే ముందు నిప్పు అంటించుకున్న తరువాత మిగిలిన కార్యక్రమాలుచేస్తారు. ఆపిల్లలు వెళ్ళి జానకిరాంను చిన్ననిప్పు కణిక శ్రీమహారాజు చిలిం కోసం ఇవ్వవలసిందిగా అడుగుతారు. 

జనాకిరాం కోపం తెచ్చుకొని, నేను ఎవరికీ అక్షయతిదియ రోజున నిప్పు ఇవ్వడానికి ఇష్టపడను అని నిరాకరిస్తాడు. ఈనిప్పు దేవాది దేవుడయిన శ్రీగజానన్ కు కావాలి. కనుక ఆవిధమయిన మూఢనమ్మకాలు వదలమని ఆపిల్లలు అంటారు. 

అయినా వారి నివేదన తిరస్కరిస్తూ, శ్రీగజానన్ను నేను యోగిగా స్వీకరించను, అతనికి ఒక జాతిలేదు, ఎవరిచేతి తిండి అయినా తింటారు, పొగాకు / గంజాయి త్రాగుతారు, నగ్నంగా ఉంటారు, మురికినీళ్ళు తాగుతారు మరియు పిచ్చివాడిగా ప్రవర్తిస్తారు.

ఆయన వెనకపడడానికి బనకటలాల్ మూర్ఖుడు. ఆయన చిలిం కోసంనేను నిప్పు ఇవ్వను. నిజంగా యోగి అయితే, తనే స్వయంగా తన సహజ శత్తితో యోగి జలంధర్ లాగా నిప్పు పుట్టించాలి, కాబట్టి వెళ్ళిపొండి అని జానకిరాం అపిల్లలతో అంటాడు.. 

నిరాశ చెందిన పిల్లలు బనకటలాల్ ఇంటికి వచ్చి శ్రీమహారాజుకు అన్ని విషయాలు చెపుతారు. శ్రీగజానన్ మహారాజు దానికి మందహాసంచేసి, ఒక అగ్గిపుల్లను అంటించకుండా తన పొగగొట్టం దగ్గర పట్టుకు ఉండమని బనకటలాల్ను అంటారు. 

బనాకటలాల్ అదేవిధంగా చేస్తాడు, ఆశ్చర్యకరంగా ఆ అగ్గిపుల్ల దానిఅంతట అదే ఆ పొగగొట్టంమీద అంటుకుంటుంది. శ్రీగజానన్ మహారాజు ప్రాకృతికశక్తి అటువంటిది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 16 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - part 1 🌻

Shri Ganeshayanamah! O Almighty, All Powerful God! Nilkantha, Gangadhara, Mahakal Trimbakeshwara, Shri Omkara manifest Yourself to me. You and Vishnu are One and the same as water is to aqua. 

People worship either of Your forms as per their liking. One who sincerely loves You, gets Your affection as a child gets from his mother. I am an innocent child craving for Your love; You are all powerful, a Kalpataru. Kindly fulfil all my desires. 

Swami Gajanan was staying at the house of Bankatlal when the following incident occurred. On the third of Vaisakh Shudha day, people offer an earthen pitcher full of water to their dead forefathers. 

In Vidarbha, this day is known as Akshaya Tritiya and is celebrated on a large scale. On this day, Shri Gajanan Maharaj was sitting with some boys, probably to reveal some of His super natural power. 

He told the boys to fill up His pipe with tobacco and light it for smoking. The boys prepared the pipe and started searching for fire. They could not find it anywhere. 

So Bankatlal adviced them to go to Jankiram, the Goldsmith, to ask him to ignite the pipe for Maharaj, as all goldsmiths first ignite fire in the morning to start off with their business and then attend to other works. 

The children then went to Jankiram and asked him for an ignited piece of coal for the pipe of Shri Gajanan Maharaj. Jankiram got angry and refused to oblige to the children’s request saying that he did not like giving fire to any body on Akshaya Tritiya day.

The boys told him not to be superstitious as the fire was required for the pipe of Shri Gajanan Maharaj, the God of Gods. Jankiram turned down their request and said, I don't accept Shri Gajanan as a saint. He has no caste, eats from anybody's hand, smokes tobacco and Ganja, remains naked, drinks sewage water and behaves like a mad man. 

Bankatlal is a fool to go after Him. I will not give fire for His pipe. If He is really a Saint, He should be able to create fire by His super natural powers as was done by Saint Jalander. So get out. 

The boys, disappointed went back to Bankatlal's house and narrated everything to Shri Gajanan Maharaj . Shri Gajanan Maharaj smiled and took the pipe in His hand and asked Bankatlal to hold one matchstick, without igniting it, on the pipe. 

Bankatlal did it and was surprised to see the match stick igniting itself on the pipe! Such was the supernatural power of Shri Gajanan Maharaj! Now listen to what happened to Jankiram by this incident. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

07/Aug/2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 17 / Sri Gajanan Maharaj Life History - 17 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 4వ అధ్యాయము - 2 🌻
ఇక దీనివలన జానకిరాంకు ఏమయిందో వినండి: ఉగాది రోజున వేపచిగుళ్ళకు ఒక ప్రత్యేకత ఉన్నట్టు, అక్షయతిదియ రోజున చింతకాయ కూరకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. జానకిరాం ఆరోజున చాలామంది స్నేహితులకు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించాడు. 

ఆ భోజనంలో ముఖ్యవంటకం ఈ చింతకాయ కూర. ఈకూర వచ్చినవారికి వడ్డించినప్పుడు చూస్తే దానినిండా చిన్నపురుగులు ఉన్నట్టు కనిపించింది. దీనితో వచ్చినవారికి తలతిరిగినట్టు అయి, భోజనం చెయ్యకుండానే వచ్చిన అతిధులు వెళ్ళిపోయారు. 

దీనివల్ల ఈ కంసాలికి చాలానిరాశ కలిగి, తను నిప్పు శ్రీమహారాజుకు ఇవ్వక చేసినతప్పు వల్లనే ఇలా జరిగింది అని వెంటనే తట్టింది. వంటకాలన్నీ వృధాఅయ్యాయి. 

శ్రీగజానన్ స్వఛ్ఛమయిన నీటివంటివారు మరియు రాజాధిరాజు, అటువంటి వారినినేను ఒక ముష్టివానిగా చూసాను. భూత, భవిష్య వర్తమానాలు తెలిసిన ఆయనను నేను ఒక పిచ్చివానిగా భావించాను.

ఒక కల్పవృక్షాన్ని నేను ముళ్ళపొద అనుకున్నాను. అయన చింతామణి నేను అయనని ఒక దరిదృడు అనుకున్నాను. ఆయన దైవిక శక్తిని తెలుసుకోలేక పోయాను. నా దురదృష్టంవల్ల ఒక గొప్ప యోగి ఆశీర్వాదాలు పొందే అవకాశం పోగొట్టుకున్నాను. 

నేను ఈ భూమిమీద, అనవసరమయిన 2 కాళ్ళ జంతువుని, బరువుని మాత్రమే. ఇలా తనని తాను చాలా నిందించుకుంటాడు. శ్రీమహారాజు దగ్గరకి వెళ్ళ లొంగిపోవడానికి చివరకి నిశ్చయించు కుంటాడు. కొద్దిగా చింతకాయ కూర తనతో తీసుకొని, బనకటలాల్ ఇంటికి వెళ్ళి తన దురదృష్టాన్ని వర్నిస్తాడు. ఈ పురుగులతో నిండిఉన్న కూర చూడమని బనకటలాల్తో అంటాడు. 

అతిధులు అందరూ భోజనం చెయ్యకుండా వెళ్ళిపోవడంతో నేను పూర్తిగా అప్రతిష్ట పాలు అయ్యాను, ఇది అంతా నాస్వయంకృతంవల్లనే. ఈరోజు ఉదయం నేను శ్రీమహారాజుకు నిప్పు ఇవ్వడానికి నిరాకరించాను దానిఫలితం ఇది. మీరు వాడిన చింతకాయల లోనే పురుగులు ఉన్నాయేమో అని బనకటలాల్ అతనితో అన్నాడు. 

చింతకాయలు కొత్తవి, పురుగులు లేనివి అని జానకిరాం బదులు చెప్పాడు. నేను ఇప్పుడు కోరుకునేది ఏమంటే శ్రీగజానన్ కు సాష్టాంగపడి, నాతప్పు క్షమించమని వేడుకోవడం. శ్రీగజానన్ దగ్గరకు జానకిరాం వెళ్ళి, సాష్టాంగపడి, ఓ మహారాజ్ నాతప్పులకు నన్ను క్షమించమని వేడుకున్నాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 17 🌹 
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - part 2 🌻
Now listen to what happened to Jankiram by this incident. 

Neem leaves have a special significance on the New Year’s Day (Gudi Padwa), so does the tamarind curry on Akshaya Tritiya day. Shri Jankiram had invited many people for lunch on that day and the main dish was tamarind curry. 

When this curry was served to the people it was seen full of small dirty worms. It created nausea amongst the people gathered to eat and caused many people to leave the house without eating any food. 

The gold smith felt very sorry and it suddenly occurred to him that this happened because he had refused to provide fire for the pipe of Shri Gajanan Maharaj. He thought to himself, Shri Gajanan is the pure water of Janhavi, the king of Kings and I treated Him like a beggar. 

He is the knower of the past, the present and the future and I thought Him to be a mad person. A Kalpavriksha was thought by me to be a thorny bush. He is a Chintamani and I thought Him to be splint. 

I could not understand His divine power. By my ill luck I lost an opportunity of getting the Blessings from a great Saint. I am a mere burden to this earth, an animal of two legs.” Thinking so, he condemned himself again and again and at last he decided to go and surrender at the feet of Shri Gajanan Maharaj . 

He took some tamarind curry with him, went to Bankatlal's house and narrated his misfortune to Bankatlal. He said Bankatlalji look to this curry full of worms. I am completely disgraced as all the invitees for lunch had to go without food. It is all due to my own fault. 

This morning I had refused the fire for the pipe of Shri Gajanan Maharaj and this is the result. Bankatlal said that the tamarind used by him might have been infested by worms. Jankiram said, The tamarind was new and clear. 

Now all that I want is to prostrate before Shri Gajanan and beg His pardon for my blunder. Jankiram went and falling at the feet of Shri Gajanan said, O Maharaj I beg to be pardoned for all my mistakes. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

08.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 18 / Sri Gajanan Maharaj Life History - 18 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 4వ అధ్యాయము - 3 🌻

మీరు షేగాంలో శివుని వంటివారు కాని నేను మిమ్మల్ని తెలుసుకో లేక పోయాను. నా సందేహాలన్నీ దూరమయ్యాయి. ఇప్పుడు మీరు నాకు విధించిన శిక్ష నేను సరిఅయిన మార్గానికి వచ్చేందుకు సరిపడుతుంది. నాలాంటి అనాధను ఆదుకోగలింగింది మీరే, కావున దయచేసి క్షమించండి అని జానకిరాం ఆయనతో అంటాడు. నువ్వు అబద్ధం చెపుతున్నావు, నీకూర స్వఛ్ఛంగా ఉంది, దానిలో ఏవిధమయిన పురుగులు లేవు అని శ్రీమహారాజు సమాధానం చెప్పారు. 

అంతే నిజంగానే ఆకూర స్వచ్ఛంగా, పురుగులు లేకుండా ఉంది. పురుగులన్నీ ఒక్కక్షణంలో మాయం అయిపోయాయి. అక్కడ ఉన్నవాళ్ళు ఆ అద్భుతం చూసి, శ్రీమహారాజుకు వంగి నమస్కారంచేసారు. 

చందు ముకిన్ అనే శ్రీమహారాజు భక్తుని కధ ఇప్పుడు వినండి......... వేసవికాలం, జ్యేష్ఠమాసంలో శ్రీమహారాజు చుట్టూ ఆయన భక్తులు కూర్చునిఉన్నారు. ఆయనకు వీళ్ళు పండ్లు, చక్కెరఉండలు, పూలదండలు ఇచ్చి, గంధం ఆయన శరీరానికి రాస్తూ, కొంతమంది విని కర్రతో విసురుతూ చల్లదనం ఇస్తున్నారు. 

ఆ సమయంలో శ్రీమహారాజు తనకు మామిడి పండ్లు వద్దు, కానీ చందూ ఇంట్లో మట్టికుండలో ఉంచిన రెండు కజ్జికాయలు కావాలి అంటారు.

చందూ చేతులు కట్టుకొని తన ఇంటివద్ద కజ్జికాయలు ఏమీలేవని, కానీ అవసరమయితే తాజాగా తయారుచేయిస్తాను అంటాడు. నాకు తాజావికాదు నీఇంటిలో మట్టికుండలో ఉంచిన ఆ నిలవ కజ్జికాయలే కావాలి అని శ్రీమహారాజు దానికి బదులు చెప్పారు. 

చందూ ఇంటికి వెళ్ళి శ్రీమహారాజు అన్నవిషయం భార్యకు చెపుతాడు. ఒక నెలక్రితం అక్షయతిదియ నాడు కజ్జికాయలు తయారు చేసాము, మరియు అన్నీ ఆరోజే పూర్తి అయిపోయాయి. ఒకవేళ ఏమయినా మిగిలి ఉంటే ఈసరికి గట్టిపడి పాడయిపోయి ఉంటాయి అని అతని భార్య అంది. 

శ్రీమహారాజు కోసం తాజా కజ్జికాయలు చేసేందుకు తన సుముఖత తెలుపుతుంది. శ్రీమహారాజుకు ఆనిలవ ఉన్నవే కావాలిట కాని తాజావివద్దుట, సరిగ్గా గుర్తు చేసుకో, ఎందుకంటే శ్రీమహారాజు అబద్ధం చెప్పలేరు అని చందూ ఆంటాడు. 

కొద్దిసేపు ఆలోచించిన తరువాత శ్రీమహారాజు చెప్పినదినజమేనని ఆమెకు మెరుపులాగ జ్ఞాపకంవచ్చింది. మట్టికుండలో నిజంగానే 2 కజ్జికాయలు దాచిఉంచిన విషయం ఆమెకు గుర్తువచ్చింది. అవి తీసి ఆమె చందూకు ఇచ్చింది. ఆశ్ఛర్యం ఏమిటంటే అవి గట్టిపడలేదు, పాడవనూలేదు. 

అది చూసి ఇద్దరూ సంతోషపడ్డారు. వెనక్కి వెళ్ళి శ్రీమహారాజుకు ఆ కజ్జికాయలు చందూ సమర్పించాడు. శ్రీమహారాజు యొక్క దివ్యశక్తికి అందరూ ఆశ్చర్య పోయారు. శ్రీరాముడు శబరి ఇచ్చిన పండ్లు సంతోషంగా స్వీకరించిన విధంగా శ్రీగజానన్ ఆ కజ్జికాయలు తిన్నారు.

మాధవ్ అనే బ్రాహ్మణుడు షేగాం దగ్గర చించోలి లో ఉండేవాడు. అతను 60 ఏళ్ళు పైనఉండి బలహీనంగా ఉన్నాడు. అన్ని భోగ భాగ్యాలతో యుక్తవయస్సు అంతా గడిపాడు. ఎవరి అదృష్టాన్ని మార్చడం సఖ్యంకాదు. భార్య, పిల్లలు పోయి మాధవ్ ఈప్రపంచంలో ఒంటరిగా మిగిలాడు. 

జీవితం మీద విరక్తి కలిగి, అన్ని వస్తువులు అమ్మివేసి, ఈ భోగ భాగ్యాలలో పడి భగవంతుడిని ఎప్పుడూ తలుచుకోలేదు అని అతను చింతించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 18 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - part 3 🌻

You are Lord Shiva in Shegaon and I did not recognize You. Now I am free from all doubts, and whatever punishment is given to me today should be enough to improve me. You are the protector of orphans like me, so kindly pardon me. Shri Gajanan Maharaj replied, You are telling a lie. Your curry is fine and there are no worms in it. 

And really the curry was clean and fine. All the worms had disappeared in a moment! The people around, saw the miracle and bowed before Shri Gajanan Maharaj. Now listen to the story of Chandu Mukin, a devotee of Shri Gajanan Maharaj. In the month of Jeshta in summer all the devotees were sitting around Shri Gajanan Maharaj . 

They were offering Him fruits, sugar balls, garlands, applying sandalwood paste to his body were cooling air by hand fans. At that time Shri Gajanan Maharaj said that He did not want mangoes or fruits but two Kanholes that were kept in the earthen pitcher at Chandu’s House. 

Chandu, with folded hands said that there were no Kanholes at his house, but would get prepared fresh if necessary. Maharaj replied that He did not want fresh Kanholes, but only those stale ones that were lying in the earthen pitcher at his house. 

Chandu went home and told his wife what Shri Gajanan Maharaj had said. His wife said that the Kanholes were prepared a month ago on Akshaya Tritiya day and were all consumed the same day, and if at all some were left, they must be stale and hard by this time. 

She however, showed her readiness to prepare fresh Kanholes for Shri Gajanan Maharaj . But Chandu replied that Maharaj wanted only the stale ones and not fresh ones. He asked her to remember where she kept them since Swamiji could not lie. 

She paused and immediately remembered that what Swamiji had said was, in fact, correct. She remembered that two Kanholes were really kept by her in the earthen pitcher.

She took out the Kanholes and gave them to Chandu; the wonder was that they had not hardened or dried at all. Looking to it they both were happy. Chandu went back and offered the Kanholes to Shri Gajanan Maharaj . All were surprised at the divine knowledge of Shri Gajanan Maharaj . Shri Gajanan happily ate the Kanholes as fruits offered by Shabari to Shri Ram.

At Chincholi, a town near Shegaon, there was a Brahmin by the name of Madhao. He was over sixty years old and was very weak. 

He passed his youth in attaining material pleasure only. It is not possible to change ones fate. Madhao lost all his children and wife and was left alone in this world at an old age. He lost all interest in life, sold out all his possessions and regretted that while in material pursuits he never remembered the Almighty God. 

Continues
🌹 🌹 🌹 🌹 🌹

09.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 19 / Sri Gajanan Maharaj Life History - 19 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 4వ అధ్యాయము - 4 🌻

తన ఈజీవిత విషాదావస్థ నుండి క్షమించి కాపాడమని పదేపదే భగవంతుడిని ప్రార్ధించాడు. 

పూర్తి పశ్చాత్తాపంతో ఇతను శ్రీగజానన్ దగ్గరకు వచ్చి ఆహారంమాని ఆయన ద్వారం దగ్గరే భగవన్నామస్మరణ చేసాడు. ఒకరోజు పూర్తిగా ఈవిధంగా చేసినతరువాత, నువ్వు చేస్తున్నపని సరికాదు. భగవంతుడిని ఇంతకు ముందు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు ? 

మనిషి మరణించిన తరువాత వైద్యుని పిలిచినట్టు, లేదా యవ్వనం అంతా అయిపోయిన తరువాత ముసలి తనంలో పెళ్ళి చేసుకున్నట్టు ఉంది. ప్రతిపని సరిఅయిన సమయంలో చెయ్యాలి, లేకపోతే దానికి ఫలితంఉండదు. ఇల్లు అంటుకున్నాక నుయ్యి తవ్వడం నిరుపయోగం. 

ఏ సంసారంకోసం జీవితం అంతా తాపత్రయం పడ్డావో వాళ్ళు నిన్ను ఒంటరిని చేసి పోయారు. శాశ్వతమయిన దానిని వదలి, అశాశ్వతమయిన విషయాలలో నీ సమయంపూర్తిగా వృధాచేసావు. దానికి బదులుగా ఇప్పుడు ఫలితాలను అనుభవించకుండా తప్పించుకోలేవు, కావున మొండితనం వదలి సమంజసంగా ఉండు అని శ్రీగజానన్ అన్నారు. 

మిగిలిన వాళ్ళు కూడా అతనికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరిని లక్ష్య పెట్టక తన నిరాహారత, భగవన్నామస్మరణ కొనసాగించాడు. మధ్యరాత్రి బాగాచీకటిగానూ, ఎవరూ చుట్టుపక్కల లేని సమయంలో శ్రీమహారాజు మాధవు తో ఒక తమాషా చేసారు. 

భయానకమయిన యమునిరూపం దాల్చి, మృత్యుదేవతగా పెద్దగా నోరుతెరచుకొని మాధవ్ దగ్గరకు ఆయన తినేలా దూసుకు వస్తారు. మాధవ్ మాటలుడిగి, భయభ్రాంతుడయి, దడదడ లాడుతున్న హృదయంతో పరిగెత్తడం మొదలు పెట్టాడు. అతని ఆపరస్థితిచూసి శ్రీమహారాజు తన మామూలు రూపుధారణ దాల్చి, ఇదేనా నీకు ఉన్న ధైర్యం ? 

నువ్వు మృత్యువుకి ఆహారంవంటి వాడివి అనిగుర్తు ఉంచుకో, అది నిన్ను ఇలానే కబళించి తీరుతుంది. నువ్వు రాబోయే కాలంలో దీనినుండి తప్పించుకోలేవు, యమలోకంలో గడపబోయే విషయంగూర్చి నేను నీకు ఇప్పుడు చూపించాను అని గట్టిగా అంటారు. యమలోకంనుండి దయచేసి నన్ను రక్షించండి, ఈజీవితంకూడా నాకువద్దు. 

నన్ను వైకుంఠం పంపించమని నాచివరి నివేదన. ఒకసారి మీరు నాకు నరకం చూపించారు కనుక మరలా నన్ను అక్కడకు పంపకండి. నేను చేసిన పాపాలగురించి పూర్తిగా నేను పరిచితుడను, అయినా మీరు తలచుకుంటే నన్ను వాటినుండి విముక్తి చేయడం కష్టంకాదు. 

బహుశ కొద్ది పుణ్యకార్యాలవల్ల నాకు మీ పాదాల దగ్గర ఉండే అదృష్టం కలిగింది, మరియు యోగులతో సంగమం చేసిన వాళ్ళు యమలోకం వెళ్ళలేరు అని మాధవ్ అంటాడు. భగవన్నామస్మరణ చేస్తూఉండు, నీకు మృత్యువు అతి దగ్గరలో ఉంది. ఇంకా బతకాలి అనిఉంటే చెప్పు నీజీవిత కాలం నేను పొడిగిస్తాను అని శ్రీమహారాజు అన్నారు. 

నేను ఏమాత్రం ఇంక జీవించ దలచుకోలేదు, ఇది అంతా మిధ్య కావున నన్ను ఏమాత్రం దీనిలో ఇక ఇరికించకండి అని మాధవ్ అంటాడు. తధాస్తు నీవు కోరినదే నీకు ఇస్తున్నాను. నీవు తిరిగి ఈ పృధ్విపై జన్మించవు అని శ్రీమహారాజు అంటారు. అటువంటి రహస్యమయిన సంభాషణ వారి ఇరువురి మధ్య అయింది. 

దీనిని వర్నించడానికి నాదగ్గర మాటలు కరువవుతాయి. మాదవ్ తన దైనిక జీవిత విషయాలుకూడా మరచి పోయాడు. దీనికి కారణం అతను ఉపవాసాలు చేయడమే అని ప్రజలు అనుకున్నారు. శ్రీగజానన్ మహారాజు పాదాలవద్ద మాధవ్ మరణించి, చివరికి ఈ జీవన్మరణ చక్రవ్యూహంనుండి తప్పించుకున్నాడు. 

శ్రీమహారాజుకు ఒకసారి వేదాలు వినాలని కోరిక కలిగి, ఇవి చదవగలిగే బ్రాహ్మణులను తెమ్మని తన భక్తులతో అంటారు. వేదాలు చదవగలిగేటు వంటి చదువుకున్న బ్రాహ్మణులు ఈకాలంలో దొరకడంలేదు అని భక్తులు అంటారు. 

అయినా సరే బ్రాహ్మణులు మరుసటి రోజు వస్తారు, మీరు అన్నీ తయారు చేయండి అని స్వామీజీ అంటారు. భక్తులు ఆనందపడి తయారు ప్రారంభించి 100 రూపాయలు విరాళం పోగుచేస్తారు. మరుసటిరోజు మధ్యాహ్నం సమయంలో ఒక గుంపు చదువుకున్న బ్రాహ్మణులు షేగాం వచ్చి శ్రీగజానన్ మహారాజు ఎదుట వేదం చదువుతారు. 

వారందరికి దక్షిణ ఇవ్వబడింది. తరువాత వారు వెళ్ళిపోయారు. యోగుల కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు అని దీనినిబట్టి అర్థం అవుతుంది. బనకటలాల్, ఆ తరువాత అతని కుటుంబీకులు ప్రతి సంవత్సరం అదేరోజు ఈ వేద పఠనం కొనసాగిస్తున్నారు. 

శుభం భవతు

4. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 19 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - part 4 🌻

Again and again he begged pardon from God and prayed for helping him out of the tragedy of his life. Full of repentance he came to Shri Gajanan and squatted at His doors fasting and chanting the name of God. 

After one full day of his fasting Shri Gajanan said, What you are doing is not proper. Why did you not remember God before this? It is just like calling a doctor after the death of patient or like marrying in old age, after spending one’s youth being a bachelor. 

Everything should be done in its proper time. Otherwise the action bears no fruits. There is no use digging a well when the house is on fire. The family for whom you toiled in your good days has left you alone. You wasted all your time attaining things that were transient and forgot the One truth which is eternal. 

Consequently, you now have to bear the results of your actions from which there is no escape. So do not be obstinate. Be reasonable. Other people also tried to persuade him but he ignored them all, kept up his fast and the chanting of “Narayan, Narayan”. 

To teach Madaho a lesson, Shri Gajanan played a trick on Madhao. At mid night when it was pitch dark, and nobody was near about, He changed His human form into a fearful form of Yama, the God of death, and with a big open jaw rushed towards Madhao, as if to eat him. 

Madhao was dumb founded and with a throbbing heart, started to run away. Looking at his condition, Shri Gajanan Maharaj regained His normal self and loudly said, Is this the boldness that you have got? 

Remember that you are the food of death, and it will swallow you like this only. What I have shown is an indication of future happening of Yamalok wherefrom you will not be able to run away”. 

Madhao replied, “Kindly save me from Yamalok. I do not want this life also. My last request to You is to send me to Vaikunth. You have already shown me Yamalok once, so do not send me there again. I am fully aware of my sins and if you wish, it is not difficult for You to free me from them. 

I am fortunate enough to be at your feet, probably because of some good deeds to my credit. The one who meets a saint during his lifetime cannot go to Yamalok”. Shri Gajanan Maharaj said, “Keep on chanting the name of Narayan, as your death is quite near now. 

If you still want to live, tell me and I will extend your life span. Madhao said, “I do not want to live any more. This world is all unreal and so kindly don’t let me get involved in its attractions”. Upon which, Shri Gajanan Maharaj said, TATHASTU - I give you what you want. 

You will not be reborn on this earth.” Such was the secret conversation between them, for which my words fall short to describe. Madhao lost all the worldly responses, people thought it to be the effect of his fasting. 

Madhao died at the feet of Shri Gajanan Maharaj and finally escaped the cycle of birth and death. Once Shri Gajanan Maharaj wished to listen to the Vedas and so asked the devotees to get some learned Brahmins for their recitation. 

The devotees said that learned Brahmins, able to recite Vedas, were not available their days. Swamiji however, asked them to go ahead with the making of the necessary preparations saying that the Brahmins would come the next day. 

The devotees were happy; they started the preparations and collected a sum of one hundred rupees for that purpose. The next day, at noontime, a team of learned Brahmins really arrived at Shegaon! They recited the Vedas before Shri Gajanan Maharaj. All of them were given Dakshina. 

Then they went away. This shows that Almighty God fulfils all the desires of the saints. Bankatlal, and now his descendants, continued this recitation of Vedas on that particular day every year. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Four

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

10.Aug.2020
------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 20 / Sri Gajanan Maharaj Life History - 20 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 5వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓభగవంతుడా నీశతృవులకు నీవు అజేయుడవు. ఓ అద్వైతా, సచ్చిదానందా, కారుణ్యాలయా ఈ దాస్గణుని అన్ని భయాలనుండి విముక్తుడిని చేయండి. నేను పతనమయినవాడిని, బీదవాడిని, పాపిని మరియు ఏవిధమయిన అధికారం లేనివాడిని. అందుచేత పూర్తిగా దిక్కులేని వాడను. కానీ మహానుభావులు తరచు పేదలకు సహాయంచేస్తారు. శివుడు తన శరీరానికి బూడిద రాసుకున్నాడు. 

మహానుభావునులను చిన్నవారి చిన్నతనం కించపరచదు. కనుక ఈ గణుదాసును ఈవిధమయిన అవగాహనతో మీపాదాల దగ్గర ఉండనీయండి. తల్లి తనపిల్లల కోరికలన్నీ పూర్తిచేస్తుంది. నేను మీకృప కోసం వేచిఉన్నాను. మీఇష్టప్రకారం చెయ్యండి, కానీ నాతో ఉదారతతోఉండండి. నాఆశలు మీమీదే ఆధారపడి ఉన్నాయి. శ్రీమహారాజు దర్శనానికి అనేక వందలమంది షేగాం రావడం ప్రారంభం అయింది. 

ఆయన ప్రతిభ దూరదూరాలకు వ్యాపించింది, కానీ శ్రీగజానన్ వీటినుంచి దూరంగా ఉండదలచారు. అందువల్ల ఎవరికి ఏవిధమయిన జ్ఞానంలేకుండా నెలలతరబడి అడవులలో తిరిగేవారు. అలాతిరుగుతూ ఒకసారి పింపళాగాంకి వెళ్ళారు. పింపళాగాం దగ్గర అడవిలో భగవాన్ శివుని ఆలయంఉంది. 

శ్రీగజానన్ అక్కడికి వెళ్ళి పద్మాసనముద్రలో కూర్చున్నారు. ఆ ఆలయందగ్గర ఒకచిన్న నీటి ప్రవాహం ఉంది. అక్కడికి కొంతమంది గొల్లపిల్లలు తమ పశువులను తీసుకువచ్చారు. ఆవులు ఆప్రవాహంలో నీళ్ళు త్రాగుతూఉండగా పిల్ల వాళ్ళు భగవాన్ శివుని దర్శనానికి ఆలయానికి వెళ్ళారు. 

అక్కడ కళ్ళు మూసుకుని కూర్చున్న తీగజానన్ ను వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఆ ఆలయానికి వస్తూ ఉండేవారు కానీ ఎప్పుడూ ఎవరూ శ్రీగజానన్ లా అక్కడ కూర్చుని ఉండగా చూడలేదు. ఆయన ముందు కొంతమంది కూర్చున్నారు, కానీ ఆ యోగి కళ్ళు తెరవలేదు, ఏమీమాట్లాడలేదు. ఆ విధంగా ఆయన కూర్చుని ఉండడానికి కారణం వారికి అవగాహనకలేదు. 

బహుశా ఆయన అలసి పోయి ఉంటారు అందికే కళ్ళు, నోరు తెరవలేక పోవచ్చు అనివాళ్ళు ఆలోచించారు. కొంతమంది ఆయనకు ఆకలిగా ఉన్నదని ఆలోచించి కొంచెం రొట్టె ఆయన ముందుపెట్టి ఆయన్ని కదపడం మొదలు పెట్టారు. అయినా ఆయోగి దగ్గర నుండి ఏవిధమయిన ప్రత్యుత్తరంలేదు. 

ఇదంతా వాళ్ళకి ఆశ్ఛర్యంగా ఉంది. ఈయన కూర్చుని ఉన్నారు కనుక మరణించలేదు, ఈయన శరీరం కూడా వెచ్చగా ఉంది అని ఆ పిల్లలు అన్నారు. మరొక గత్యంతం వాళ్ళకి తోచింది ఏమిటంటే ఈయన దెయ్యం అయి ఉండవచ్చు అని. 

భగవాన్ శివుని దగ్గరకు దెయ్యం రాలేదు అని కొంతమంది వాదించారు. ఈయన స్వర్గంనుండి వచ్చిన భగవంతుడే అని తరువాత అనుకున్నారు. ఈ విచారంరాగానే, భగవంతుని దర్శనం కలగడం అదృష్టంగా తలచారు. అందువల్ల ఆయన్ని పూజించాలని నిశ్చయించి నీళ్ళు, పువ్వులు తెచ్చి ఆయన కాళ్ళు కడిగి తలపై పువ్వులు పెట్టి, మరియు కొంచెం రొట్టి, ఉల్లిపాయలు నైవేద్యంగా ఆయన ముందు ఉంచారు. 

అక్కడ కూర్చుని కొంతసేపు భజన చేసారు. వీళ్ళు ఆలస్యంగా ఇంటికి వెళ్ళడంవల్ల పెద్దలకు బహుశ ఆదుర్ధ కలిగించ వచ్చు, తమతల్లి తండ్రులు తమని వెతుకుతూ రావచ్చు అని భజన చేస్తున్న ఆనందంలో ఒక్కసారిగా వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. 

పైగా దూడలుకూడా తల్లి ఆవుకోసం ఎదురు చుస్తూఉంటాయి. అందువల్ల వెంటనే వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి, పెద్దలకు ఆయోగిగూర్చి అన్ని విషయాలు వర్ణిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 20 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 5 - part 1 🌻

Shri Ganeshayanmah! O God! You are unconquerable to the foes. O Adwait, Sachhidananda, Karunalaya, relieve this Dasganu of all his fears. I am a fallen and poor sinful person and possess no authority. Thus I am entirely helpless. But great people often help the poor. 

Look, Lord Shankar has applied ash to His body. The smallness of the small does not degrade the Great Ones. So with this understanding, let this Dasganu be at Your feet. A mother fulfils all desires of her child. I am at Your mercy. 

Do whatever you like, but be kind to me as all my aspirations depend on You. While Maharaj stayed at Shegaon, hundreds of people started coming there to receive His Darshan. His reputation spread far and wide; Shri Gajanan, however, wanted to keep away from all people. 

So he used to wander in forests for months without giving anybody any knowledge of His movements. In His wanderings, once, He went to Pimpalgaon. There was a temple of Lord Shiva in the forest near Pimpalgaon; Shri Gajanan went there and sat in Padmasan Mudra. 

There was a small stream near the temple where the cowherd boys came with their cattle. As the cows were drinking water at the stream, the boys went to the temple for the Darshan of Lord Shiva. 

They saw Shri Gajanan sitting there with closed eyes and were surprised. They used to visit that temple often, but had never seen anybody sitting there like Shri Gajanan Maharaj. Some of them sat before Him, but the saint did not open His eyes nor spoke anything. 

The boys could not understand the reason why He sat like that at the temple. They thought that He must be very tired and so must be unable to open His mouth or eyes. 

Some of them thought that He must be very hungry and so they put some bread before Him and started shaking Him. Even then there was no response from the saint. It was all very surprising for them. 

The boys said that He couldn't possibly be dead since He was sitting in an upright position and had a warm body. One of them suggested that He might be a ghost. Some, however, argued to that saying that a ghost couldn't dare come in the proximity of Lord Shiva. 

Then they thought to themselves that He must, therefore, be a God from heaven, and with this idea occurring to them, considered themselves to be fortunate to get the Darshan of God. So they decided to offer Him puja, and brought water and flowers to wash His feet. They put flowers on His head and some bread and onions before Him as Naivedyam. 

They performed Bhajan sitting there for some time. Being engrossed in performing the Bhajan, they forgot about returning home. Soon they remembered that they were late and that it might create anxiety amongst elders and their parents might even come out in search of the cowherds. Moreover the calves also might be lowing for the mother cows. So they returned home immediately and narrated everything about the Saint to the elders.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

11.Aug.2020

------------------------------------ x ------------------------------------

 

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 21 / Sri Gajanan Maharaj Life History - 21 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 5వ అధ్యాయము - 2 🌻

మరుసటి రోజు ఆగ్రామ ప్రజలంతా ఆలయానికి వచ్చి, ముందురోజు పెట్టిన రొట్టె కూడా ముట్టకుండా అదేఆసనంలో కూర్చునిఉన్న యోగిని చూస్తారు. కొంతమంది ఆయన్ని యోగి అనుకున్నారు, 

భగవాన్ శివుడే వారికి దర్శనం ఇవ్వడంకోసం లింగం నుండి వచ్చారని మరికొంత మంది అనుకున్నారు. ఈయోగి మహాసమాధిలో ఉన్నారు, ఆయన స్వయానా సమాధి నుండి బయటకు వస్తే తప్ప ఆయనకు భంగం కలిగించరాదు అనే విషయంపై వారంతా ఏకాభిప్రాయంతో ఉన్నారు. 12 ఏళ్ళ పాటు యోగి జలంధర్ బెంగాల్లో తపస్యలో ఉన్న విషయం వాళ్ళు గుర్తుచేసుకున్నారు. 

అప్పుడు ఒక పల్లకితెచ్చి, దానిలో ఆయనను పెట్టి పెద్ద అట్టహాసమయిన ఊరేగింపుతో, దారిలో రంగులు, పువ్వులు ఆయన పైన చల్లుతూ పింపళగాం తీసుకు వస్తారు. పింపళాగాం చేరినతరువాత ఆయనను శా స్ట్రోక్తంగా ఆంజనేయస్వామి వారిగుడిలో, ఒక ఎత్తయిన ఆసనంమీద పెడతారు. ఆరోజు కూడా పూర్తిగా గడిచింది. 

అయినా ఆయోగి దీక్షనుండి బయటకు రాలేదు. మరుసటిరోజున, ఆయోగి దీక్షనుండి బయటకు వచ్చేవరకూ ఆయనముందు ఉపవాసంతో భజన చేస్తూ కూర్చునేందుకు ఆగ్రామస్థులు నిర్ణయించుకునేసరికి ఆశ్చర్యకరంగా ఆయోగి వెంటనే కళ్ళు తెరిచి సమాధినుండి బయటకు వచ్చారు.

ఆనందితులయిన ఆగ్రామస్థులు, ఆయనకు గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహారం మరియు మిఠాయిలు ఇస్తారు. శ్రీగజానన్ గూర్చిన వార్త చుట్టుప్రక్కల గ్రామాలకు అందింది. మరుసటి మంగళవారం కొంతమంది ఖరీదులు చేసేందుకు పింపళగాం నుండి షేగాం వెళ్ళినపుడు యధాలాపంగా పింపళాగాం లోకూడా మాకు భగవస్వరూపుడయిన ఒక యోగి ఉన్నాడు అని అక్కడి వారితో అంటారు. 

ఈవార్త షేగాంలో వ్యాపించి బనకటలాల్కు తెలుస్తుంది. వెంటనే భార్యను తీసుకుని పింపళాగాం వెళ్ళి చేతులు కట్టుకొని, వెంటనే వస్తాను అని మీరు ప్రయాణంచేసారు, కానీ మీరు షేగాంవదలి ఇప్పటికి ఒక పక్షం రోజులు అయింది. మీరులేకుండా షేగాం నిర్జీవం అయింది, మరియు అందరూ మిమ్మల్ని అక్కడ తిరిగి చుడాలని ఆతృతతో ఉన్నారు.

నేను మీకోసం బండి తీసుకు వచ్చాను, పదండి వెనక్కి వెళదాము. పిల్లను తల్లినుంచి దూరంచేయడం మంచిది కాదు. మీరులేని కారణంగా క్రమంగా వచ్చే అనేకమంది భక్తులు భోజనం కూడా బహుశ చేసిఉండక పువచ్చు. అయినాసరే మీరు షేగాం రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, అని బనకటలాల్ అన్నాడు. 

అందుకని శ్రీగజానన్ షేగాం వెళ్ళేందుకు బండిలో కూర్చున్నారు. ఈదృశ్యానికి, శ్రీకృష్ణున్ని గోకులంకి తీసుకువెళ్ళేందుకు అక్రూరుడు వచ్చిన దృశ్యం పింపగాం వాసులు గుర్తు తెచ్చు కున్నారు. బనకటలాల్ను వాళ్ళు అక్రూరుడిగా భావించారు. 

శ్రీగజానన్ ఏమీచాలాదూరంగా వెళ్ళి పోవటంలేదు, షేగాంలోనే ఉంటారు, ఇష్టం అయినప్పుడల్లా, అక్కడికి వెళ్ళవచ్చు అని బనకటలాల్ అన్నాడు. పింపళాగాంలోని అనేకమంది బనకటలాల్కు కిరాయిదారులు కావడంవల్ల అతనిని నొప్పించ లేకపోయారు. 

బనకటలాల్ తోపాటు యోగి వెళ్ళి పోవడాన్ని వారు నిస్సహాయంగా చూసారు. ఇతరుల సొత్తును బలవంతంగా ఇలా తీసుకుని పోవడం సరిఅయిన పధ్ధతికాదు. నీఇంటి దగ్గర వ్యవహారం చూసే నేను రావడానికి భయపడ్డాను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 21 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 5 - part 2 🌻

Next morning the villagers came to the temple and saw the saint sitting in the same position without touching the bread that was offered to Him the previous day. Some said that He must be a yogi, while others thought that Lord Shiva Himself might have come out of Lingam to give them Darshan. 

They, however, were unanimous on one point that the saint was in deep Samadhi and should not be disturbed till He comes out of the trance. They remembered that in Bengal Saint Jalander was in Samadhi for full twelve years. 

Then a palanquin was brought and the saint put in it and brought to Pimpalgaon accompanied by a great fanfare of procession and on the way Gulal and flowers were scattered on Him. After reaching Pimpalgaon, He was ceremoniously put on a raised seat in Lord Hanuman's temple. 

That day also passed but the yogi did not come out of trance. Next day the villagers decided to sit in prayers observing complete fast till He came out of the trance, and surprisingly, the saint immediately opened His eyes and came out of the Samadhi. 

The jubilant villagers prostrated before Shri Gajanan as a mark of respect, and offered Him sweets and food. The news of Shri Gajanan spread to the neighbouring villages. 

The following Tuesday, people of Pimpalgaon went to Shegaon for marketing and incidentally told the people there that they too had got a saint at Pimpalgaon, who is a God incarnate. 

The news spread in Shegaon and reached Bankatlal, who immediately went to Pimpalgaon along with his wife and with folded hands said to Shri Gajanan Maharaj , You had promised to return soon, but it is now more than a fortnight since You left Shegaon. 

Shegaon is lifeless without You and all are anxious to see You back. I have brought the cart for You, so let us go back to Shegaon. It is not good to separate a child from his mother. 

Because of Your absence, many regular visiting devotees might not have taken food. And despite this, if You don't come to Shegaon, I will kill myself. So Shri Gajanan sat in the cart to leave for Shegaon. 

At this sight, the people of Pimpalgaon remembered the occasion when Akrura had come to Gokul to take away Shrikrishna. They thought of Bankatlal as Akrura, who however, told them that Shri Gajanan Maharaj was not going far away as He would stay in Shegaon only and they could very well visit Maharaj there whenever they liked. 

Most of the people from Pimpalgaon were tenants for Bankatlal and so were unable to displease him. They helplessly saw the saint go away with Bankatlal. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

12.Aug.2020

------------------------------------ x ------------------------------------

 

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 22 / 𝓢𝓻𝓲 𝓖𝓪𝓳𝓪𝓷𝓪𝓷 𝓜𝓪𝓱𝓪𝓻𝓪𝓳 𝓛𝓲𝓯𝓮 𝓗𝓲𝓼𝓽𝓸𝓻𝔂 - 22 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 5వ అధ్యాయము - 3 🌻

శ్రీమహావిష్ణువు సతీమణి, ప్రజలకు తల్లి, అత్యంత శక్తిగల దేవత అయిన లక్ష్మి నీచేత బంధించబడి ఉంది. ఆజగదంబ కరుణావస్థ చూసి నేను భయపడి పారిపోయాను, అని దారిలో శ్రీమహారాజు హాస్యంగా బనకటలాల్ తో అన్నారు. ఇదివిని, గురునాధ్ ఆతల్లి నాతాళం వల్ల భయపడలేదు, కానీ మీరు ఉండడం వల్ల ఉంది. తల్లి పిల్ల కలిసేఉండాలి. 

మీపాదాలే నాకు అసలయిన ఐశ్వర్యం. మరి ఏఐశ్వర్యాన్నీనేను లక్ష్య పెట్టను. అందువల్లనే దానిని వెతుకుతూ నేను పింపళగాంవచ్చాను. నాఇల్లు ఇప్పుడు నాది కాదు. అది మీపరం అయింది. ఇల్లు కాపలాకాసేవాడు ఇంటి యజమానిని ఎలా ఆపగలడు ? మీరు ఏదికావాలంటే అది చెయ్యండి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి, ప్రపంచం అంతటినీ దీవించండి కానీ ఈషేగాం వాసులను మరువకండి. 

ఆవులు ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చినట్టుగా మీరు మాకొరకు చెయ్యాలి అని బనకటలాల్ నవ్వి అంటాడు. ఆవిధంగా శ్రీమహారాజును బనకటలాల్ షేగాం తీసుకు వస్తాడు. కొన్నిరోజుల తరువాత మరల శ్రీమహారాజు వెళ్ళిపోయారు. 

శ్రీగజానన్ ఎవరికి తెలియకుండా ఒకరోజు ఉదయాన్నే అడగాలకు వెళ్ళడం తటస్థ పడుతుంది.

ఈయన వేగంకూడా, శ్రీహనుమంతునిలా గాలి వేగం. అది వైశాఖమాసం, తీవ్రమయిన వేసవి, ప్రతిచోటా నీరు ఎండిపోయింది. అటువంటి మధ్యాహ్నం ఎండలో శ్రీమహారాజు అకోలి చేరారు. చాలా చెమటలతో, ఎండిపోయిన పెదవులతో నీళ్ళకోసం చుట్టూచూసారు. 

ఆ సమయంలో భాస్కరు అనే పేరుగల ఒకరైతు తనపొలంలో పని చేసుకుంటున్నాడు. వేడిమి, చలి వల్లవచ్చే అన్ని బాధలు భరిస్తూ అందరికి ఆహారం ఇచ్చేరైతు సమాజానికి ముఖ్యమయిన వ్యక్తి. అకోలి చుట్టుప్రక్కల నెయ్యి ఎవరికి అయినా దొరకవచ్చు కానీ నీళ్ళు మాత్రం దొరకవు అన్నంత తీవ్రమయిన నీటికొరత ఉంది.

తనకోసం అని ఒక మట్టికుండలో నీళ్ళు తెచ్చుకుని, భాస్కరు ఒక పొద క్రింద పెట్టి ఉంచాడు. శ్రీమహారాజు అతని దగ్గరకు వచ్చి నాకు దాహంగా ఉంది, కాదనకుండా నాకు కొంచం నీళ్ళుఇయ్యి, నీళ్ళులేకుండా ఎవరు బ్రతకలేరు కావున దాహంగా ఉన్నవాళ్ళకి నీళ్ళుఇవ్వడం మహాపుణ్యం. 

అందుకే ధనవంతులు రహదారులపైన దాహంవేసినవారికి దాహంతీర్చడానికి చలివేంద్రాలు ప్రారంభిస్తారు అని శ్రీమహారాజు అంటారు. నీవంటి పనికిరాని, వివస్త్ర అయిన వ్యక్తికి నీళ్ళు ఇవ్వడం వలన ఎవరికయినా పుణ్యం ఎలాదొరుకుతుంది ? 

ఈ పుణ్యం అనేది ఎవరయినా అనాధలకుకానీ, అపంగులకుకానీ, సమాజసేవ చేసేవారికికానీ అయితే బాగుంటుంది. పురాణాలు కూడా ఇలానే చెపుతున్నాయి. నీలాంటి మురికి వాళ్ళకి ఇవ్వడం పాపం. మానవత్వంపేరు మీద ఎవరయినా పామును పోషించడంకాని, దొంగకు ఆశ్రయం ఇవ్వడంకాని చేస్తారా ? 

ఇలా ప్రతిఇంటా అడిగితిని బాగా లావు అయి, సమాజానికి బరువు అయ్యావు. కుండతోనీళ్ళు నేను నాకోసం తెచ్చుకున్నాను నీకోసం కాదు. నేను నీకు నీళ్ళు ఇవ్వను. ఓ పోరంబోకు వాడా వెంటనే ఇక్కడనుండి వెళ్ళిపో. నీలాంటి పనిదొంగల వలనే మనం ప్రపంచంలో పనికి రాకుండా పోయాం అని భాస్కరు అన్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 𝓢𝓻𝓲 𝓖𝓪𝓳𝓪𝓷𝓪𝓷 𝓜𝓪𝓱𝓪𝓻𝓪𝓳 𝓛𝓲𝓯𝓮 𝓗𝓲𝓼𝓽𝓸𝓻𝔂 - 22 🌹 
✍️. 𝓢𝔀𝓪𝓶𝔂 𝓓𝓪𝓼𝓪𝓰𝓪𝓷𝓾 
📚. 𝓟𝓻𝓪𝓼𝓪𝓭 𝓑𝓱𝓪𝓻𝓪𝓭𝔀𝓪𝓳

🌻 Chapter 5 - part 3 🌻

On the way Maharaj jokingly said to Bankatlal, It is not proper for a Savkar to forcibly take away others property. 

Looking to the affairs at your house, I am afraid to come with you. You have locked Lakshmi, the mother of the people, the wife of Lord Shri Mahavishnu, and the most powerful deity Herself, in your house. 

Looking to the plight of the Jagadamba, I got frightened and so ran away. Hearing that, Bankatlal laughed and said, Gurunath, the mother was not scared by my locks, but stayed in my house because of your presence there. Mother and child have to stay together. Your feet are the real wealth for me. I do not care for any other wealth. That is why I had to come to Pimpalgaon in its search.

My house is not mine any more. It now belongs to you. How can a watchman obstruct the owner of the house? You may do anything you like, go anywhere you want to go, and Bless the whole world, but do not forget us, the people of Shegaon. 

Cows go out in the morning to feed themselves in the woods, but return home in the evening. That is what You too should do with us. Thus Bankatlal brought Shri Gajanan Maharaj to Shegaon. However, after some days, Shri Gajanan Maharaj again went away. 

It so happened that one fine morning, Shri Gajanan left for Adgaon without anybody's knowledge. Like Lord Hanuman, His speed was that of the wind. It was the month of Vaishakh and the severe summer had dried up water everywhere. 

At such a hot noon, Shri Gajanan Maharaj reached Akola. Perspiring profusely with lips gone dry due to the thirst, He looked around for water. At that time a farmer, named Bhasker, was working in his field. 

A farmer is an important person in the society who provides food to all, bearing all the agonies of heat and cold. There was an acute shortage of water around Akola, so much so that one might get ghee under normal circumstances, but not water in that area. 

Bhaskar had brought water for himself in an earthen pitcher and had kept it under a bush. Shri Gajanan Maharaj came to him and said, I am thirsty. Give me water and do not say ‘No’. As one cannot live without water, it is a great ‘Punya’ to give water to the thirsty. 

That is why rich people during the summer open water booths on highways to quench the thirst of thirsty people. Bhaskar replied that, How can one get ‘Punya’ by giving water to the useless naked man like you? 

This talk of Punya is good only in context with orphans, disabled or social work; religious books too say the same thing. It is sin to give water to sluggish people like you. Will anybody nourish a snake on humanitarian grounds or give shelter to a thief in his house? You have become fat by begging from door to door and are a dead weight to the society by your actions. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

13.Aug.2020

------------------------------------ x ------------------------------------

 

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2̼3̼ / S̼r̼i̼ G̼a̼j̼a̼n̼a̼n̼ M̼a̼h̼a̼r̼a̼j̼ L̼i̼f̼e̼ H̼i̼s̼t̼o̼r̼y̼ - 2̼3̼ 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 5వ అధ్యాయము - 4 🌻

ఇలా భాస్కరు అన్నది విని శ్రీమహారాజు నవ్వుకుని వెళ్ళిపోయారు. కొద్దిదూరంలో ఒకనుయ్యి చూసి ఆయన అక్కడికి వెళ్ళారు. భాస్కరు ఆయన అక్కడకు వెళ్ళడంచూసి, ఆనూతి దగ్గరకు వెళ్ళకు అది ఎండిపోయింది. రెండు మైళ్ళ పరిధిలో ఎక్కడా ఒక్కనుయ్యి కూడాలేదు అని భాస్కరు గట్టిగా అరుస్తాడు. 

అది నిజమే కానీ అందులోకి నీళ్ళు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను. నీళ్ళకోసం నీవంటివారు కష్టపడుతూ ఉంటే, ఈసమాజానికి మేలు అయ్యేలా నేను ఏమయినా చెయ్యాలి. 

నా ఈకోరిక నిజమయినది అయితే భగవంతుడు నాకు సహాయంచేస్తాడు అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ, అనూతి దగ్గరకు వెళ్ళి శ్రీగజానన్ దానిలోకి తొంగిచూసారు. అది పూర్తిగా ఎండిపోయి ఉంది.

నిర్వికారమయిన మనస్సుతో దగ్గరలో ఒక చెట్టు క్రింద రాయిపై కూర్చుని, కళ్ళు మూసుకొని కొంచెంసేపు ధ్యానంచేసి, భక్తిగా భగవంతుడిని ఉద్దేశిస్తూ 

ఓభగవాన్ ! వామనా, వాసుదేవా, ప్రద్యుమ్నా, రాఘవా, విఠలా, నరహరి అకోలి ప్రజలు నీళ్ళకోసం చింతితులు. ఈగ్రామంలోని ఏ బావిలోను ఒక్కచుక్క నీరు మిగిలిలేదు. అన్ని విధములయిన మానవ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 

కావున నీవే వారిని కాపాడేందుకు రావాలి. అసాధ్యమయిన కార్యాలు నీవు చెయ్యగలవు. పాండురంగా మండుతున్న అగ్నిగుండం నుండి పిల్లులను నీవు రక్షించావు, ప్రహ్లాదుని మాటనిలిపేందుకు నీవు స్తంభంనుండి వెలుపలికి వచ్చావు, 

వైశ్వనారా ! నీవు 12 గ్రామాలను గోకులంలో కబళించావు, ఓమురారీ నీచిటికిన వేలిమీద పర్వతాన్ని ఎత్తావు, దామాజిపంతుకు నువ్వు మహారు అయ్యావు. 

సవతామాలికి నీవు ఒక ద్వారపాలకుడిగా పనిచేసి అతని పక్షులను కాపాడావు. నామదేవ్ కోసం బంజరుభూమి ప్రదేశం అయిన మార్వాడలో నీళ్ళు సృష్టించారు. 

నీవు కోరుకుంటే ఏపని అయినా జరుగుతుంది అని శ్రీమహారాజు అన్నారు. ఆవిధంగా భగవంతుడిని తపస్యించిన తరువాత, ఒక శక్తి వంతమయిన ధారఉబికి వచ్చి నిమిషాలలో ఆబావి నీటితోనిండింది.

భగవంతుని యొక్క అతీతమయిన శక్తి అయనకు కోరినదల్లా చేసేందుకు తోడ్పడుతోంది. శ్రీగజానన్ బావిలో నీరు త్రాగి దాహంతీర్చుకున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 S̼r̼i̼ G̼a̼j̼a̼n̼a̼n̼ M̼a̼h̼a̼r̼a̼j̼ L̼i̼f̼e̼ H̼i̼s̼t̼o̼r̼y̼ - 2̼3̼ 🌹 
✍️. S̼w̼a̼m̼y̼ D̼a̼s̼a̼g̼a̼n̼u̼ 
📚. P̼r̼a̼s̼a̼d̼ B̼h̼a̼r̼a̼d̼w̼a̼j̼

🌻 Chapter 5 - part 4 🌻

I have brought the pitcher of water on my head for me and not for you. I will not give water to you. Go away immediately from here, you rascal. Because of lazy people like you amongst us, we have become useless in the world. Hearing Bhaskar, Shri Gajanan Maharaj smiled and went away.

He saw one well at some distance and went there. Seeing Him go to that well, Bhaskar loudly shouted, Do not go to that well, it is dry. There is no well filled with water within two miles of radius from here.” Maharaj said, It is true, but I will try to fill water in it. 

When People like you get tormented due to the lack of water, I must do something in the interest of the society. God will help me if my intentions are honest. 

Saying so, Shri Gajanan went to the well and peeped into it. It was completely dry. In a dejected mood he sat on a nearby rock under the tree, closed his eyes, meditated for some time, and solemnly implored the Almighty to give water to the village. 

Shri Gajanan Maharaj said, O God, Wamana, Vasudeva, Pradyumna, Raghava, Vithala, Narahari, the people of Akola are worried about drinking water. There is not a drop left in any of the wells nearby. 

All human efforts have failed, so now You have to come to their rescue. You can do even the most impossible things. Panduranga, You saved cats in the burning furnace, You appeared out of a pillar to honour the words of Pralhad. 

Vaishwanara, You swallowed twelve villages in Gokul, O Murari, You lifted a mountain on Your finger tip, You became a Mahar for Damajipant, You did the work of Chokha Mahar, and protected the birds of Savata Mali. You created water for Namdeo in the dry land of Marwad. 

If You wish, anything can be done. After Gajanan Maharaj made such an imploration to the Almighty, a powerful spring burst in the well and in minutes it was full of water. The might of God is unlimited, enabling Him to do anything that is desired by His the devotees. 

Shri Gajanan drank the water from the well and quenched His thirst.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

14.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 24 / ֆʀɨ ɢǟʝǟռǟռ ʍǟɦǟʀǟʝ ʟɨʄɛ ɦɨֆtօʀʏ - 24 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 5వ అధ్యాయము - 5 🌻

భాస్కరు ఇది చూసాడు, తనకళ్ళను తనే నమ్మలేకపోయాడు. తనకి గత 12 సంవత్సరాలుగా ఆబావిలో నీళ్ళులేవని తెలుసు, కానీ ఇప్పుడు ఇది పూర్తిగా నిటితో నిండింది. ఇది ఎలాజరిగింది ? అంటే ఇతను ఒకపనికిరాని సాధారణ మానవుడు కాక, ఒక గొప్ప యోగి అవాలి. 

తన తప్పు తెలుసుకున్న భాస్కరు పొలంవదిలి, పరుగున వెళ్ళి ఆయోగి కాళ్ళమీద పడ్డాడు.

ఓ భగవత్స్వరూపా దయచేసి నన్నుక్షమించండి. నేను మీయొక్క ఒక అజ్ఞాన బాలకుడను, దయచేసి నన్ను కరుణించండి. మీనిజస్వరూపం తెలియక నేను అవమానించాను. ఇందుకు నేనుదుఖిస్తున్నాను. నన్ను దయచేసి మన్నించండి. పాలుపోసే స్త్రీలు ఒకోసారి కృష్ణభగవానున్ని అవమానించేవారు, కానీ దానిని ఆయన ఎప్పుడూ తీవ్రంగా తీసుకోలేదు. 

ఓభగవంతుడా నీయొక్క బహిర్గతరూపం నన్ను మోసంచేసింది. ఈ చమత్కారంతో నన్ను నా అవివేకం నుండి విముక్తుడను చేసి మీయొక్క సహాజశక్తిని చూపించారు. ఈవిధంగా మీరునీరు సృష్టించడంతో మీయొక్క శక్తిని గ్రహించగలిగాను. ఇక నేను ఈమీపాదాలు ఎప్పటికివదలను, మీరుకూడా తల్లిలా మీ ఈపిల్లవాడిని వదలకండి. ఈప్రాకృతిక సుఖాలు అశాశ్వతమయినవని నేను తెలుసుకున్నాను, కావున నన్ను విడువకండి అని భాస్కరు అన్నాడు. ఈవిధంగా విలపించకు.

దూరప్రాంతంనుండి నీళ్ళు తెచ్చే నీకష్టం దూరంచేసేందుకు నేను నీళ్ళు సృష్టించాను. దీనికోసం నీవు ప్రపంచాన్ని త్యజించడం ఎందుకు ? ఈనీళ్ళు నీకోసం వచ్చాయి, ఉపయోగించి చక్కటి తోట పెంచు, అని శ్రీగజానన్ మహారాజు అన్నారు.

గురుదేవా, ఈవిధంగా నన్ను ఊరించకండి. 

నా యొక్క సంకల్పం ఒక బావిలాంటిది. ఒక్క చుక్క నీరు లేక అది పూర్తిగా ఎండిఉంది. మీ ఈచమత్కారం ఒక విస్ఫోటంలా ఆబావిలోని రాతిని పగలగొట్టింది, దానిలోనుండి విశ్వాసం అనే ఒకధార బయటపడింది. 

ఆ విశ్వాసం అనే నీళ్ళతో నేను ఇక మీమీద గాఢమయిన భక్తి అనే ఉద్యానవనం పెంచుతాను. మీయొక్క ఆశీర్వాదంతో ప్రతిచోటా మంచి ప్రవర్తన అనే పండ్ల వృక్షాలు, మంచి పనులు అనే పూల మొక్కలు ఆ ఉద్యానవనంలో నాటుతాను. 

ఈ క్షణికానందమయిన ప్రపంచిక ఆస్తులను విసర్జిస్తాను అని భాస్కరు అన్నాడు.

ఓశ్రోతలారా, యోగితోటి అతికొద్ది సాన్నిధ్యంతోనే భాస్కరు ప్రవర్తనలో ఎటువంటి రూపాంతరం వచ్చిందో చూడండి. నిజమైన యోగియొక్క దర్శనం ఒక ప్రత్యేకమయినది అనేవిషయం వివరంగా తుకారాం తన పురాణంలో వ్రాసారు. 

అది చదివి, ధ్యానం చేస్తూ, మీమేలుకొరకు దాన్ని అనుభూతి పొందండి. బావిలో నీళ్ళు సృష్టించిన విషయం ఒక దావానలంలా వ్యాపించి, ఈగలు తేనె కోసం వెళ్ళిన మాదిరి, చీమలు చక్కెర వెనక పడినట్టు, ప్రజలు శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వచ్చారు. వారు నూతి దగ్గరకు వెళ్ళి, నీళ్ళు త్రాగి దాహంతీర్చుకున్నారు. 

ఆ నీళ్ళు స్వఛ్ఛంగా, చల్లగా, అమృతంకంటేకూడా తియ్యగా ఉన్నాయి. శ్రీగజానన్ మహారాజును వారు పదేపదే పొగిడారు. శ్రీమహారాజు అడగాం వెళ్ళకుండా భాస్కరుతో షేగాం తిరిగి వచ్చారు.

దాసగణు తయారు చేస్తున్న ఈ అద్భుత గజానన్ విజయ నిజమయిన యోగియొక్క ప్రతిభను భక్తులకు అర్ధమయ్యే మార్గదర్శని అగుగాక.

శుభం భవతు 

5. అధ్యాయము సంపూర్ణము.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 ֆʀɨ  ɢǟʝǟռǟռ  ʍǟɦǟʀǟʝ  ʟɨʄɛ  ɦɨֆtօʀʏ  -  24 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 5 - part 5 🌻

Bhaskar saw this miracle and could not believe his eyes. He knew that the well contained not a drop of water for last twelve years and now it is full of water. 

How can it be? It meant that this man was not an ordinary, useless person, but a great saint. Bhaskar, realising his fault, left his field, went running to the saint and fell at His feet. He said, O God incarnate, kindly pardon me. 

I am an ignorant child of Yours, please be kind to me. Not knowing Your real self I insulted you. I regret it now. Please excuse me. Milkmaids, at times, insulted lord Krishna, but He never took it seriously. 

O kindhearted God, Your external appearance has deceived me. By this act of miracle, You have freed me of ignorance and manifested Your true self to me. I now realise Your power by this creation of water. I will, now, never leave Your feet, and, You as a mother, should not desert this child of Yours. 

I have now fully realized that the material attachment is unreal, so do not discard me. Shri Gajanan said, Don't lament like this, I have created water in this well to save you the trouble of bringing water on your head from long distances.

Then why do you renounce prapanch? This water has come for you, use it and grow a nice garden. Bhaskar said, Gurudeo, don't tempt me like this. My determination itself is a well; It was absolutely dry without a drop of water. 

Your miracle was an explosive, which broke the rock inside that well, and out came a fine spring of faith. With that water, now, I will grow the garden of deep devotion to You. 

By Your kind blessing, I will plant the fruit trees of good moral and flower plants of good deeds everywhere. I will do away with all the monentary attachments of worldly property. 

Look, O listeners, what a transformation had taken place in Bhaskara's attitude with a brief association with a saint! Darshan of a real saint is unique in nature; it has been narrated in detail by Saint Tukaram in his hymns. 

Read those hymns, meditate over them, and experience the truth in your own interest. The news of creating water in a dry well spread like wild fire and people, like flies rushing to honey, or ants running after sugar, came for the Darshan of Shri Gajanan Maharaj in huge numbers.

They went to the well, drank the water and quenched their thirst. The water was clean, cold, tasty and sweeter than nectar. People cheered Shri Gajanan Maharaj again and again. Shri Gajanan Maharaj did not stay in Adgaon; He instead returned to Shegaon with Bhaskar. May the ‘Gajanan Vijay Granth’, composed by Dasganu, be an ideal guide for devotees to understand the greatness of a real saint. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Five 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

15.Aug.2020

------------------------------------ x ------------------------------------

  

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 𝟸𝟻 / 𝚂𝚛𝚒 𝙶𝚊𝚓𝚊𝚗𝚊𝚗 𝙼𝚊𝚑𝚊𝚛𝚊𝚓 𝙻𝚒𝚏𝚎 𝙷𝚒𝚜𝚝𝚘𝚛𝚢 - 𝟸𝟻 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 6వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓ అత్యంత శుభప్రదమయినవాడా, మీఆశీర్వచనాలు అన్ని అశుభాలను దూరం చేస్తాయని యోగుల అనుభవం. అదే నమ్ముకుని, ఓభగవంతుడా నేను చాలా ఆశతో మీద్వారం దగ్గరకు వచ్చాను. నన్ను ఒకవేళ నిరాశ పరిస్తే అదిమీకూ, యోగులకు కూడా అవమానకరం కనుక మాధవా మీయెక్క ఈ అమాయక పిల్లవాడి మీద కోపగించక గౌరవాన్ని కాపాడండి. పిల్లల అవకతవక పనులు వారి తల్లికి చెడ్డపేరు తెస్తాయి అనేది, కృపయా గుర్తు ఉంచుకోండి. 

ఒకసారి బనకటలాల్ తన పొలంలో జొన్నపొత్తులు తినడానికి శ్రీమహారాజును తీసుకు వెళతాడు. ఈజొన్న పొత్తుల విందుకు ఇతరులు అనేకమంది కూడా అక్కడికి చేరారు. వారికి కూర్చునేందుకు ఒక నుయ్యిదగ్గర ఏర్పాటు చెయ్యబడింది. 

ఆ నూతిలో కావలసినన్ని నీళ్ళు ఉన్నాయి. జొన్నపొత్తులు కాల్చడానికి 8/10 చోట్ల మంట పెట్టారు. దానివల్ల చాలా పొగ ఆకాశంలోకి లేచింది. ఈపొగవల్ల ఒక చింతచెట్టుకు ఉన్న పెద్ద తేనెపట్టు నుండి ఈగలు అక్కడ మనుషుల మీదికి వచ్చాయి. జొన్నపొత్తులు వదలి వారు పరిగెత్తడం మొదలు పెట్టారు. కొంతమంది అయితే తలకు కంబళ్ళు కప్పుకుని మరీపరిగెత్తారు. 

ఈప్రపంచంలో మనప్రాణంకంటే విలువయినది ఏదీలేదు. ఈ ప్రజల విషయంకూడా అంతే. ఈ గందరగోళంలో శ్రీగజానన్ మహారాజు మాత్రం కలవర పడకుండా కూర్చుని ఉండి ఆతేనెటీగల గూర్చి ఆలోచిస్తున్నారు. ఈ తేనెటీగలూనేనే, ఈ తేనెపట్టూనేనే. జొన్నపొత్తులు తినడానికి వచ్చింది నేనే మరియు జొన్నపొత్తునుకూడా నేనే అని ఆయన అనుకుంటున్నారు. 

తన్మయత్వంలో ఆయన అలాఅనుకుంటూ ఉండగా అనేక మయిన తేనెటీగలు ఆయన శరీరం మీద వాలి, ఒక ఈగల కంబళి పరిచినట్టుగా అగుపించింది. ఈగలు ఆయనను కుట్టి వాటిసూదివంటి ముళ్ళను ఆయన శరీరంలోకి గుచ్చుతున్నాయి. కానీ శ్రీమహారాజు దానిని ఏమీ లక్ష్య పెట్టలేదు. 

ఈప్రకరణ కొంతసేపు నడిచి నిస్సహాయులయిన భక్తులను కృంగదీసింది. శ్రీమహారాజును పొలానికి తీసుకు వచ్చినందుకు బనకటరాల్ చాలా దుఖించి, శ్రీగజానన్ కు ఈ తేనెటీగలకాట్లకు నేనే కారణం అని అనుకున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 𝚂𝚛𝚒 𝙶𝚊𝚓𝚊𝚗𝚊𝚗 𝙼𝚊𝚑𝚊𝚛𝚊𝚓 𝙻𝚒𝚏𝚎 𝙷𝚒𝚜𝚝𝚘𝚛𝚢 - 𝟸𝟻 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 6 - part 1 🌻

Shri Ganeshaya namah! O most auspicious One! It is the experience of saints that Your Blessings drive away everything that is inauspicious. Believing it, O God, I have come to Your door with great hopes. If You disappoint me, it will mean disrepute to You and the saints as well. 

So, Madhava, uphold my prestige and never be angry with this innocent child of Yours. Please remember that any shortcoming of a child brings blame to the mother. 

One time Bankatlal took Shri Gajanan Maharaj to his farm to eat maize corns. Many other people had gathered there for this party of corn and the seating arrangement was made near a well. 

The well had ample water and there were many tamarind trees around. 

Fire was lit at 8 to 10 places to fry the corn and a lot of smoke was rising up in the sky. There was a big honeycomb on the tamarind tree and. due to the smoke, the bees rushed out to attack the people seated below the tree. 

Leaving the corn the people started to flee the place. Some of them covered their heads with blankets. 

In this world nothing is more precious than one’s own life. So was the case with these people. In all this havoc, Shri Gajanan Maharaj sat undisturbed and thought about the honeybees. 

He thought to Himself, “I am the bees, I am honeycomb. The one who has come to eat corn is I, and the corn is also me.” While he was blissfully thinking this, innumerable bees landed on his body giving him an appearance of wearing a blanket of bees. 

The insects were biting and piercing their needle like thorns in His body, but Shri Gajanan Maharaj did not bother about it. This went on for some time making the helpless devotees miserable. 

Bankatlal felt very sorry for having brought Shri Gajanan Maharaj to the farm and felt that he himself was responsible for the bites inflicted by the bees on Shri Gajanan.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

16.Aug.2020

------------------------------------ x ------------------------------------

Image may contain: 1 person

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2͙6 / S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 2͙6 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 6వ అధ్యాయము - 2 🌻

బనకటలాల్ అలా అనుకుంటూ శ్రీమహారాజును కాపాడేందుకు వెళదామనుకుంటూ ఉండగా, శ్రీగజానన్ తన దివ్యశక్తితో ఈవిషయం తెలుసుకొని, ఓ ప్రాణులారా మీపట్టుమీదకు వెనక్కు వెళ్ళండి, మరియు ఇక్కడ చేరిన వాళ్ళలో ఒకే ఒక నిజమయిన భక్తుడయిన నాప్రియమయిన బనకటరాల్ ను కష్టించకండి అని ఆయన ఆ ఈగలతో అంటారు. 

నిజంగానే ఆ ఈగలు తేనెపట్టు మీదకు వెళ్ళి పోయాయి. శ్రీమహారాజు నవ్వి ఈ ఈగలతో నువ్వు నాకు మంచి విందు ఇచ్చావు. ఆవిషపుటీగలు నన్ను ఎదుర్కున్నాయి, మిగిలిన లడ్డూ భక్తులూ అందరు పరిగెత్తి పోయారు. ఇది కొద్దిగా ఆలోచించు. అకాల పరిస్థితులలో భగవంతుడు తప్ప మరి ఎవరూ నీకు సహాయ పడరని గుర్తుంచుకో. 

ఈ స్వార్ధపరులు విందుకోసం చేరారు కానీ ఆ ఈగలు దాడి చేసేసరికి అందరూ పరిగెత్తి పారి పోయారు అని బనకటలాల్తో అన్నారు. ఓమహారాజ్ ! నేను మిమ్మలను ఇక్కడకు తెచ్చినందుకు చాలా చింతిస్తున్నాను. ఈతేనెటీగల కాట్లు మీకు కలగడానికి నేనే బాధ్యుడను. నేను గొప్పపాపిని. నేను ఏమిచేస్తే మీకుఈ ఈగల కాట్లనుండి ఉపశమనం కలుగుతుందో దయచేసి చెప్పండి. 

కంసాలిని తన శ్రవణంతో ముళ్ళు తీసేందుకు నేను పిలవనా ? అని బనకటలాల్ అన్నాడు. బనకట్ కుట్టడం అనేది ఈ ఈగల ప్రకృతి అవి అదేవిధంగా చేస్తాయి, ఏమీవింత విషయం జరగలేదు. ఈ ఈగల కుట్ల అసరు నాకు ఏమీ ఉండదు అనినీకు ఆస్వాసన ఇస్తున్నాను, ఎందుకంటే వాటిలోని సచ్చిదానందుడను నేను ఎరుగుదును. ఆయన వాటిలో ఉన్నారు, నేను ఆయన అవతారాన్ని. నీళ్ళవలన నీళ్ళకు ఎలా హాని కలుగుతుంది ? అని శ్రీమహారాజు సమాధానం చెపుతారు. 

ఈ దివ్యజ్ఞానం విన్న బనకటలాల్ నిశ్శబ్దంగా ఉండి, ఈ ఈగల ముళ్ళు శ్రీమహారాజు శరీరంనుండి వెలికి తీసేందుకు ఒక కంసాలిని తీసుకు వచ్చాడు. ఒక జత శ్రవణాలతో వచ్చిన కంసాలి ఆయన శరీరంమీద ముళ్ళను వెతకడం మొదలు పెట్టాడు. శ్రీమహారాజు నవ్వి, ఆముళ్ళు కళ్ళకు కనిపించవు మరియు ఈశ్రవణాలు వాటిని బయటకు తీసేందుకు పనికిరావు అని అన్నారు. 

అది నిరూపించడానికి, ఆయన శ్వాశ తీసుకుని అలాపట్టి ఉంచారు. వెంటనే ఆముళ్ళు అన్నీ ఆయన శరీరం బయటకు వచ్చాయి. ఈ చమత్కారం చూసిన ప్రజలు, శ్రీమహారాజు గొప్పతనాన్ని తెలుసుకొని సంతోషించారు. 

తరువాత అందరూ జొన్నపొత్తుల విందు ఆరగించి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. కొటాషాఆలీ యొక్క శిష్యుడయిన, తన తోటి యోగి అయిన నరశింహజీని కలిసేందుకు, ఒకసారి శ్రీమహారాజు అకోట్ వెళ్ళారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 2͙6 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 6 - part 2 🌻

Thinking so, Bankatlal was about to rush to the rescue of Shri Gajanan Maharaj when by His divine power Shri Gajanan understood it and said to the bees, “Oh insects! Go back to the honey comb and don't harm my beloved Bankatlal, who is the only real devotee amongst all the people here”. 
Hearing this, the bees really flew back to the honeycomb. Shri Gajanan Maharaj laughes and said to Bankatlal, “You have given a good feast of these bees to Me. 

Those poisonous insects attacked and all the Laddu Bhakta ran away. Give a thought to it and remember that, in times of calamity, nobody, except God, helps you.” 

Bankatlal said, Oh Maharaj, I very much regret for having brought You here. I am responsible for causing You these bee bites today. I am a great sinner. Kindly tell me what I shall do to relieve You of these bee-bites; shall I call a goldsmith to pull out the bee thorns with his pincers? 
Shri Gajanan Maharaj replied Bankat, nothing extraordinary has happened, as it is the nature of bees to bite and they behaved accordingly. I assure you that these bites will not affect me as I know the Sachhidananda in those bees. 

He is in those bees and I am His incarnation. How can water hurt water? You have given a good feast of these bees to me. These poisonous insects attacked me and all the Laddu-Bhakta ran away. 

Give a thought to this and remember that in times of calamity nobody other than God helps you. These selfish people gathered here for a feast, and ran away when the bees attacked.
 
Hearing this divine knowledge, Bankatlal kept quiet and brought a gold smith to pull out the bee thorns from the body of Shri Gajanan Maharaj . The goldsmith came with a pair of pincers and started searching for the thorns in His body. 

Shri Gajanan Maharaj laughed and said that eyes would not see the thorns and the pincers are useless to pull them out. And in order to prove what he said, He inhaled the air and held His breath. The thorns immediately came out of the body. 

Looking at this miracle, people were glad to realise the greatness of Shri Gajanan Maharaj . After that, all the people enjoyed the feast of maize corns and returned home in the evening. 

Once, Shri Gajanan Maharaj went to Akot to meet his saint brother Narsinghji, who was a disciple of Kotasha. Although Maratha by caste, he had become dear to Shri Vithala by his Bhakti (devotion). Since I have narrated his detailed life in the Bhaktileelamrut, I don't repeat in here.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


17.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 𝟸̷𝟽̷ / 𝚂̷𝚛̷𝚒̷ 𝙶̷𝚊̷𝚓̷𝚊̷𝚗̷𝚊̷𝚗̷ 𝙼̷𝚊̷𝚑̷𝚊̷𝚛̷𝚊̷𝚓̷ 𝙻̷𝚒̷𝚏̷𝚎̷ 𝙷̷𝚒̷𝚜̷𝚝̷𝚘̷𝚛̷𝚢̷ - 𝟸̷𝟽̷ 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. 6వ అధ్యాయము - 3 🌻

భక్తితో శ్రీవిళల భగవానునికి ప్రియుడయిన ఇతను జాతిప్రకారం మరాఠుడు. ఈయన విపులమయిన జీవితం గురించి భక్తిలీలమృతి అనే పుస్తకంలో చెప్పబడింది కావున ఇక్కడ పునః వర్నించడంలేదు. షేగాంకు ఈశాణ్యంగా 36 మైళ్ళ దూరంలో ఈ అకోట్ ఉంది, అక్కడికి శ్రీమహారాజు వాయువేగంతో వెళ్ళారు. 

శ్రీనరసింహజి అకోట్ దగ్గరి ఆచిక్కటి అడవిలో ముక్తికోసం బసచేసారు. ఏవిధమయిన మానవసంచారం లేక, పెద్ద వృక్షాలు, తీగపొదలు, గడ్డి మరియు అనేక మయిన పాములతో ఈ అడవి దిట్టంగా ఉంది. 

ఇటువంటి అడవిలో శ్రీనంశింహజి ఒంటరిగా నివసిస్తున్నారు. శ్రీగజానన్ ఆయన్ని కలిసేందుకు వెళ్ళారు. నీళ్ళు నీళ్ళలో కలిసినట్టు, ఒకేజాతి వస్తువులు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఒకజాతివికానివి ఎప్పటికీ ఒకదానితో ఒకటి కలవవు. 

శ్రీగజానన్ను చూసిన శ్రీనరసింహజీ ఆనందం వర్ణించలేనిది. ఒకరు హరి అయితే ఇంకొకరు హర, ఒకరు రాముడు అయితే ఇంకొకరు వాసుదేవ్ - దేవకి కుమారుడు, ఒకరు ముని వశిష్టుడయితే ఇంకొకరు గోదావరి, ఒకరు కోహినూర్ అయితే ఇంకొకరు కౌస్థుభం, ఒకరు వైనతేవ్ అయితే ఇంకొకరు అంజని పుత్రుడు. 

వీరు ఇద్దరూ ఒకరిని ఒకరు కలుసుకొని చాలా ఆనందించారు. దగ్గరగా కూర్చుని ఒకరి అనుభవాలను ఇంకొకరికి చెప్పుకున్నారు. నంరసింహా నువ్వు సంసారిక జీవితం చేసి మంచిపనిచేససావు. నేను దానిని త్యజించి అసలయిన సత్యంఅయిన బ్రహ్మను తెలుసుకునేందుకు యోగ మార్గాన్ని పాటించాను. 

ఈ యోగమార్గంలో, సాధారణ మానవునికి అవగాహన కాని విషయాలు జరుగుతూ ఉంటాయి, వాటిని కప్పి ఉంచేందుకు అనేక మార్లు నేను పిచ్చివాడిగా ప్రవర్తిస్తాను. పరమాత్మను తెలుసుకునేందుకు కర్మ, భక్తి మరియు యోగ అనే మూడు మార్గాలు ఉన్నాయి. ఈమూడు మార్గాలూ వేరువేరుగా కనిపించినా నిజానికి ఇవి చేరేది ఒకే లక్ష్యానికి. 

యోగి తన మార్గంగూర్చి గొప్పపడితే పరమాత్మనుండి దూరంగా ఉండిపోతాడు. తామరాకులా, తన యోగక్రియ ఫలితం నుండి దూరంగా ఉండాలి. అప్పుడే అతను పరమాత్మను తెలుసుకోగలడు. సంసారిక జీవనంలో కూడా అంతే. కుటుంబంతో నీకు సంబంధం ఉండకూడదు. గుళకరాళ్ళు నీళ్ళలో ఉన్నా నీళ్ళను తనలోనికి రానివ్వవు. 

సంసారిక జీవితంలో నీ ప్రవర్తన కూడా అలానే ఏవిధమయిన కోరికలులేక పూర్తిగా బ్రహ్మాండునిమీద మనసు కేంద్రీకరించి ఉండాలి. ఇలా ఉంటే అసాధ్యమయినది ఇంక ఏమీ ఉండదు. నువ్వు, నేను, భగవంతుడూ ఒకరిమే, మిగిలిన ప్రజలు కూడా ఆయననుండి వేరు కాదు అని శ్రీగజానన్ అన్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 𝚂̷𝚛̷𝚒̷ 𝙶̷𝚊̷𝚓̷𝚊̷𝚗̷𝚊̷𝚗̷ 𝙼̷𝚊̷𝚑̷𝚊̷𝚛̷𝚊̷𝚓̷ 𝙻̷𝚒̷𝚏̷𝚎̷ 𝙷̷𝚒̷𝚜̷𝚝̷𝚘̷𝚛̷𝚢̷ - 𝟸̷𝟽̷ 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 6 - part 3 🌻

Akot is 36 miles to the north-east of Shegaon and Shri Gajanan Maharaj went there with the speed of wind. Shri Narsinghji was staying in the dense forest near Akot to get solitude. This forest, without any habitants, was very dense with big trees, creepers, wild grass and many snakes. 

In such a dreadful forest Shri Narsinghji was living all alone. Shri Gajanan went there to meet him. Water mixes with water and like things always merge with each other. Unlike things never mix with each other. So looking at Shri Gajanan, Shri Narsinghji was happy beyond description. 

One was Hari and the other Har, one was Rama, while other, the son of Vasudeo-Devaki. One was Ganga and the other Godavari. One was the Kohinoor, and the other Kaustubha. One was the Vashistha and the other, son of Anjani. 

Both of them met each other and were very happy. They sat near each other and exchanged their experiences. Shri Gajanan said, Narsingha, you have done well by leading a family life. I renounced that and followed the path of Yoga, to know the ultimate reality, the Brahma. 

In this path of yoga, many strange things, incomprehensible to the common man, happen, and to hide them I, many times, behave like a mad man. To know the ultimate Truth there are three paths - Karma, Bhakti and Yoga. Apparently they look like three different paths, but in reality they reach the same goal. 

If a yogi feels proud of his path, he will remain away from the ultimate Truth. He should keep himself clean from the effect of Yogakriya, like a lotus leaf. Then only he can know the ultimate Truth. Same is the case with family life. You should not have attachment with your family. 

A pebble remains in water, but does not allow the water to enter it. Such should be your behaviour in family life - free from any expectations and with full concentration in Almighty. Then nothing is impossible. You, I and God are one, and the people too are not different from Him.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

18.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 28 / 𝓢𝓻𝓲 𝓖𝓪𝓳𝓪𝓷𝓪𝓷 𝓜𝓪𝓱𝓪𝓻𝓪𝓳 𝓛𝓲𝓯𝓮 𝓗𝓲𝓼𝓽𝓸𝓻𝔂 - 28 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 6వ అధ్యాయము - 4 🌻

నన్ను కలిసినందుకు నేను కృతజ్ఞుడను. మద్యాహ్నం నీడలా ఈ ప్రపంచం అశాశ్వతమయినది. నేను మీసలహా పాటిస్తాను, కానీ మీరు ఇలా నాదగ్గరకు వస్తూ ఉండండి. ఈ ప్రపంచంలో ప్రతివిషయం ముందునుండి నిశ్చయించబడి ఉంటుంది, భగవంతుని కోరిక ప్రకారం మనం మన పనులు నిర్వర్తించాలి. 

నేను మీ తమ్ముడి వంటి వాడను, కావున నన్ను తరచు కలిసేందుకు మీరు రావాలి అనేది నా ఒకేఒక కోరిక. భరతుడు శ్రీరాముని కొరకు నందిగ్రామంలో ఎదురు చూస్తున్నట్టు నేను ఈ అకోట్ లో మీకోసం వేచి ఉంటాను. మీ యొక్క యోగశక్తితో మీకు ఇక్కడకు రావడం సులభం. 

యోగి ఏమీ ఎక్కడా ముట్ట కుండానే కొద్ది నిమిషాలలో బ్రహ్మాండం చుట్టు తిరిగి రాగలడు అని శ్రీనరసింహజి అన్నాడు. ఒకరిమీద ఒకరికి ఉన్న అతి సన్నిహిత ప్రేమతో, వారు రాత్రంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమయిన యోగులు ఈవిధంగా ప్రవర్తిస్తారు, కానీ కపటి యోగులు ఒకరితో ఒకరు పొట్లాడు కుంటారు. 

ఈ కపటి యోగులు సముద్రంలో విరిగిన ఓడలాంటి వారు, వీళ్ళను గురువుగా అంగీకరించరాదు. వీళ్ళకి చాలా ప్రాముఖ్యత లభిస్తుంది కానీ మనం వీళ్ళని జాగ్రత్తగా వెళ్ళతీయాలి. ఒక్క ఆత్మజ్ఞానం వల్లనే తప్ప, మఠంలో నివాసం చేయడంవల్ల కానీ, పద్యాలు రాయడం నేర్చుకున్నందు వల్ల కానీ ఎవరూ యోగులు కారు. బంగారం పూత పూసిన వస్తువులను మనం బంగారంగా అంగీకరిస్తామా ? ఈ ఇద్దరూ పవిత్రమయిన నిజమయిన యోగులు.

శ్రీగజానన మహారాజు శ్రీనంసింహజీని కలిసేందుకు వచ్చారని ప్రజలకు తెలిసి, వాళ్ళు అది గోదావరి, భగీరధి సంగమంగా భావించి మరియు అక్కడికి వెళితే ఆ సంగమంలో మునిగిన తృప్తి కలుగుతుంది అని భావించారు. అందుకని కొబ్బరి కాయలతో ఆ అడవి వైపు వెళ్ళడం మొదలు పెట్టారు. 

శ్రీనరశింహజి అనుమతితో శ్రీగజానన్ అప్పటికే వెళ్ళిపోయారు. దానితో ప్రజలంతా నిరాశపొందారు.

సాధారణ మయిన తన పరిక్రమణలో ఒకసారి శ్రీగజానన్ తన శిష్యులతో షివార్ అనే గ్రామం చేరారు. ఈ చోటు దర్యాపూరు దగ్గర ఉన్న చంద్రభాగ నదీతీరం దగ్గర ఉంది. అక్కడ తీవ్రజభూషన్ అనే పండితుడు నివసిస్తూ ఉన్నాడు. ఇతను 4 భాషలు ఎరిగి, విదర్భ అంతా ప్రఖ్యాతి పొందిన గొప్ప సూర్యభగవానుని భక్తుడు. 

ఉదయం త్వరగా లేచి, చంద్రభాగ నదిలో స్నానంచేసి సూర్యునికి ప్రార్ధన చేయటం ఇతని దినచర్య. ఈ షివార్ గ్రామానికి వ్రజభూషన్ ప్రార్ధనల ఫలం ఇచ్చేందుకన్నట్టు శ్రీగజానన్ వచ్చారు. తను యధాప్రకారం చంద్రభాగకు స్నానాకి వచ్చి, ఆనదీ తీరం దగ్గర శ్రీగజానన్ మహారాజును కూర్చుని ఉండడం చుస్తాడు. 

అది ఉదయం వేళ, ఆకాశం వెలుతురుతో నిండి, చుట్టు ప్రక్కలంతా కోళ్ళు కూతలు కూస్తూ ఉండగా, చాతక్ మరియు భరద్వాజ పక్షులు ఉదయిస్తున్న సూర్యునికి ప్రమాణం చేస్తున్నట్టు ఎగురుతున్నాయి. పండితులరాకతో పామరులు స్థలంవిడిచి వెళ్ళినట్టు, సూర్యుడు తూర్పున తలఎత్తేప్పటికి చీకటి త్వరగా అదృశ్యం అయ్యింది. 

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 𝓢𝓻𝓲 𝓖𝓪𝓳𝓪𝓷𝓪𝓷 𝓜𝓪𝓱𝓪𝓻𝓪𝓳 𝓛𝓲𝓯𝓮 𝓗𝓲𝓼𝓽𝓸𝓻𝔂 - 28 🌹 
✍️. 𝒮𝓌𝒶𝓂𝓎 𝒟𝒶𝓈𝒶𝑔𝒶𝓃𝓊 
📚. 𝒫𝓇𝒶𝓈𝒶𝒹 𝐵𝒽𝒶𝓇𝒶𝒹𝓌𝒶𝒿

🌻 Chapter 6 - part 4 🌻

Shri Narsinghji said, I am grateful to you for meeting me. This Prapanch is unreal like the shadow at noon. I will follow your advice, but keep on coming to me. Everything is predestined in this world, and we have to perform our duty in this life as per desire of God. 

My only request is that you should come frequently to meet me as I am your younger brother.

Just like Bharat, waiting at Nandigram for Shri Ram, I am here at Akot for you. With your yogic achievements, it is very easy for you to come here. A yogi, without touching anywhere, can traverse around the universe in minutes. With intimate love for each other, they were speaking all that night. 

Real saints behave like this only, but the hypocrites quarrel with each other. These hypocrites should not be accepted as Guru as they are like a broken ship on the sea. 

They receive a lot of publicity, but carefully we should discard them. Living in a ‘math’ or learning an art of composing poems does not make one a saint, but only self knowledge does. 

Can we accept gold coated articles as gold, or a prostitute as a house wife? These two saints were real and pious. When people knew that Shri Gajanan Maharaj had come to meet Shri Narsinghji, They thought it to be the confluence of Godavari and Bhagirathi and by going there they could get the satisfaction of taking a dip in that confluence. 

So the people with coconuts in their hands started rushing to the forest. But Shri Gajanan, with the permission of Shri Narsinghji had already left and all the people were disappointed. 

Once, in his usual wanderings, Shri Gajanan, with his disciples, reached a village named Shivar. This place is on the bank of Chandrabhaga (not of Pandharpur) near Daryapur and the place where Shri Vrajabhushan, a learned man, lived. He had knowledge pertaining to four various languages and was famous all over the Vidarbha; he was also a great devotee of the Sun God. 

It was his daily routine to get up early in the morning, take a bath in the Chandrabhaga and offer prayers to the Sun. He was respected by all the intellectuals. Shri Gajanan Maharaj came to this Shivar village as if to give Vrajabhushan the fruits of his prayers. He as usual came to the Chandrabhaga for his bath and saw Shri Gajanan Maharaj sitting on the bank of that river. 

It was morning time with twilight spreading all over the sky, cocks were crowing all around and the Chatak and Bharadwaj birds were flying as if they were paying their respects to the rising sun. With the sun peeping up the horizon, darkness quickly disappeared, like fools leaving the congregation at the sight of the learned.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

19.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 2̼9̼ / S̼r̼i̼ G̼a̼j̼a̼n̼a̼n̼ M̼a̼h̼a̼r̼a̼j̼ L̼i̼f̼e̼ H̼i̼s̼t̼o̼r̼y̼ - 2̼9̼ 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 


🌻. 6వ అధ్యాయము - 5 🌻

శ్రీగజానన్ అటువంటి అహ్లాదకరమయిన ఉదయాన్న పూర్తి బ్రహ్మానందంలో కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూ ఆయన శిష్యులు సూర్యకిరణాల వలె ఉన్నారు. సూర్యునికి పూజలు అర్పిస్తూ, తేజోవంతమయిన శరీరం, ఆజానుబాహువు, నాశికాగ్రంపై కేంద్రీకరించిన కండ్లు కల శ్రీగజానన్ మహారాజును వ్రజభూషన్ చూసాడు. 

అత్యంత ఆనందంతో అతను శ్రీగజానన్ మహారాజు దగ్గరకు పరుగున వెళ్ళి, నీళ్ళు ఆయన పాదాలకు పోసి, పూజలు అర్పించి, ఆయనకు ప్రదక్షిణచేసి, పవిత్రమయిన సూర్యనామాలు ఉఛ్ఛరిస్తూ 12 సార్లు ఆయన ముందు వంగి నమస్కరిస్తాడు. తరువాత వినయంతో హారతి ఇచ్చి, శ్రీగజానన్ పొగుడుతూ శ్లోకాలు పాడాడు. 

మీయొక్క ఈ పవిత్ర మయిన పాదాల దర్శనంతో నాకు ఈరోజు నాతపశ్యా ఫలం దొరికింది. ఇంతవరకూ నేను ఆకాశంలో ఉన్న సూర్యునకు పూజలు చేస్తూవచ్చాను, ఈరోజు ఆయనను శ్రీగజానన్ మహారాజు రూపంలో చుసాను.

ఓగజాననా పరిపూర్న మయిన జ్ఞానంగల బ్రహ్మవు మరియు ఈబ్రహ్మాండానికి ఆధారం నీవే. యుగ యుగాలలో మీరు అనేక జన్మలు ఎత్తారు. మీయొక్క దర్శనంతో పాపాలన్నీ పరిహరించ బడతాయి. దయతో నన్ను ఆశీర్వదించండి అని వ్రజభూషన్ అన్నాడు. 

ఇలా అంటూ ప్రజభూషన్ తన పూజలు పూర్తి చేసాడు. తల్లి తన పిల్లల్ని ఆలింగన చేసినట్టు, శ్రీగజానన్ అతనిని ఆలింగనచేసి, ఆతరువాత తన చేతులు వ్రజభూషన్ తలపై ఉంచి నువ్వు ప్రజలచేత పూజించబడతావు, ప్రేమించబడతావు. 

నీయొక్క కర్మ మార్గం వదలకు. ఈ దినచర్య అర్ధరహితం అనుకోవద్దు కానీ దానిలో నిమగ్నం కూడాకావద్దు. దీనివలన నీవు కృష్ణ భగవానున్ని దర్శిస్తావు మరియు నిన్ను నీ కర్మ ఫలంనుండి దూరంగా ఉంచుతారు. నామాటలు గుర్తు ఉంచుకుని ఇంటికి వెళ్ళు. నీ ధ్యానంలో, నేను ఎప్పుడూ నిన్ను కలుస్తూ ఉంటాను అని శ్రీమహారాజు అంటూ ప్రజభూషన్ కు కొబ్బరి కాయ ప్రసాదంగా ఇచ్చి, షేగాం తిరిగి వెళ్ళారు. 

ఈ షేగాం మొదటిలో షివార్గాం అనబడి చివరికి షేగాం అయింది. ఈ గ్రామంలో 17 మంది పాటిల్ కుటుంబాలు ఉండేవి. శ్రీమహారాజు షేగాం తిరిగి వచ్చారు కానీ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేదు. ఒకచోటు తరువాత ఒకచోటుకు అలా తిరుగుతూ ఉన్నారు. 

అకోట్, అకోలా, మల్కాపూర్ ఇంకా అనేక ప్రదేశాలు ఆయన దర్శించారు. జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు పూర్తి అయి శ్రావణం వచ్చింది. హనుమద్భగవానుని వార్షిక ఉత్సవాలు గుడిలో ప్రారంభం అయ్యాయి. 

షేగాంలో ఇది ఒక పెద్ద గుడి, మరియు పాటిల్ కుటుంబీకులు హనుమంతుని భక్తులు. పాటిల్ శక్తివంతమయిన అధికారి కావడంతో సాధారణంగా ప్రజలంతా వారు ఏపని చేసినా సహకరించేవారు. అభిషేకాలు, పవిత్ర గ్రంధ పఠనం, కీర్తనలు, భోజనసమారంభాలు లాంటి కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ఒక నెలరోజులు జరిగేవి. 

సహృదయుడయిన ఖాండుపాటిల్ ఈ ఉత్సవాలకు ప్రతినిధి. అధికారం అనేది పులిచర్మం లాంటిది. అది ఎవరు ధరించినా ప్రజలు దానికి భయపడతారు. రాజు ఒంటరిగా చెయ్యలేని పని, ప్రజలంతా కలసి చెయ్యగలరు అని మరాఠిలో ఒక సామెత ఉంది. ఇది సరిగ్గా ఇక్కడ వర్తిస్తుంది. 

శ్రీగజానన్ మహారాజు శ్రావణ మాసంలో ఈ ఉత్సవాలకు హాజరు అయ్యేందుకు ఆ గుడికి వచ్చి..............ఇకనుండి నేను ఈ గుడిలోనే బసచేస్తాను, నీవు అన్యదా భావించకు. సంసారిక జీవనం గడిపేవారితో మునులు, యోగులు శాశ్వతంగా నివాసం చెయ్యకూడదు. 

నేనొక యోగిని కావున మందిరంలోనే ఉండాలి, కానీ ఎప్పుడు నువ్వు నన్ను కావాలనుకుంటే అప్పుడు నేను నీఇంటికి వస్తాను. ఒక గుప్తమయిన విషయం చెపుతున్నాను, శ్రీశంకారాచార్యుడు ఒకచోటునుండి ఒకచోటుకి తిరుగుతూ ఉండేవారు, మచ్చీంద్రుడు, జలంధరుడు అనే మునీశ్వరులు సంసారిక జీవనం గడిపే వాళ్ళ ఇళ్ళలో ఉండడం మాని అడవులలో, చెట్లక్రింద ఉండేవారు. 

హిందువులను రక్షించి ముస్లింలను శిక్షించిన శివాజీ రామదాసుస్వామిని అభిమానించే వాడు కానీ స్వామీజీ సజ్జన్ఘడ లో ఉండేందుకు ఇష్టపడ్డారు. దీని గురించి చింతించకు. ఇది నీమంచి కొరకే అని బనకటలాల్ తో శ్రీగజానన్ అన్నారు. బనకటలాల్ నిశ్శహాయంగా శ్రీమహారాజు మాటకు అంగీకరించాడు. 

శ్రీమహారాజు గుడికి వచ్చారు. అందరూ చాలా సంతోషోంచారు. భాస్కరు పాటిల్ ఈయన అవసరాల కోసం అక్కడ ఉండేవాడు. దాసగణు వ్రాసిన ఈ గజానన్ విజయ యోగుల పాదాలను చేరకోరేవారికి మార్గదర్శి అగుగాక. 

శుభం భవతు

6. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 S̼r̼i̼ G̼a̼j̼a̼n̼a̼n̼ M̼a̼h̼a̼r̼a̼j̼ L̼i̼f̼e̼ H̼i̼s̼t̼o̼r̼y̼ - 2̼9̼ 🌹 
✍️. S̼w̼a̼m̼y̼ D̼a̼s̼a̼g̼a̼n̼u̼ 
📚. P̼r̼a̼s̼a̼d̼ B̼h̼a̼r̼a̼d̼w̼a̼j̼

🌻 Chapter 6 - part 5 🌻

At such a pleasant morning, Shri Gajanan was sitting there in full bliss of Brahminand with his disciples around him like the rays of the sun. While offering his usual prayers to the sun, Vrajabhushan saw Shri Gajanan Maharaj with his lustrous body, long arms and the eyes concentrated at the tip of his nose. 

With great joy he went running to Shri Gajanan Maharaj, poured water on his feet, offered puja, went round him, and prostrated before him twelve times reciting the holy names of the sun. Then respectfully performed Arati and prostrated before him singing hymns in the praise of Shri Gajanan. 

Vrajabhushan said, By the Darshan of these divine feet, I got today the fruits of my penance. So far I was offering prayers to the sun in the sky, but today I see him in the form of Shri Gajanan Maharaj. 

O Gajanan, you are the real Brahma full of knowledge and the supporter of this universe. You take many births, ages after ages, and by your Darshan all the woes vanish. Kindly bless me.” Saying so, Vrajabhushan finished his prayers and Shri Gajanan affectionately embraced him like a mother does to her child. 

Then placing his hand on the head of Vrajabhushan, Shri Gajanan Maharaj said, You will be respected and loved by the people. Don't leave the path of Karma (duty) nor think the rituals to be meaningless, but at the same time don't get too involved in them. 

Do your duty and renounce the fruit. This will enable you to meet Shri Krishna and keep you clean of the effects of your actions. Remember my words and go home. I will always meet you in meditations.” 

Saying so, Shri Gajanan Maharaj gave Vrajabhushan the prasad of a coconut and went back to Shegaon. This Shegaon was formerly known as Shivargaon and later on became Shegaon. There were seventeen Patils in this village. 

Shri Gajanan Maharaj returned to Shegaon but did not stay there for long. He kept on moving from place to place. He visited Akot, Akola, Malkapur and many other places. Months of Jeshta and Ashadha passed, Shravana came and the annual functions of Lord Hanuman started in the temple. 

This is a big temple at Shegaon and all the Patil families were devotees of Hanuman. Patil being a powerful authority in the village, all the people normally co-operated with everything that he did. The function lasts for a month with Abhishek, reading of holy books, Kirtan and feeding the people to their hearts content. 

Khandu Patil, noble hearted, was the leader of the function. The authority of the Patil is like a tiger's skin, and whoso-ever puts it on, becomes a terror to the people. There is a proverb in Marathi meaning that whatever a king cannot do, can be done by the united people. 

The proverb aptly applies here. So Shri Gajanan Maharaj came to this temple in the month of Shravana to attend the functions, and told Bankatlal,Henceforth I will stay in this temple and you should not mind it. Saints and sages are not supposed to stay permanently with men leading family life. 

I am a Sanyasi and so shall stay in this temple only, but whenever you want me I will visit your house. I am giving you this secret knowledge. Shri Shankaracharya had to move from place to place. 

Sages Macchindra and Jalander avoided the houses of people leading family life and stayed in forests under trees. Shivaji, who protected Hindus and punished Yavans, loved Ramdas Swami, but Swamiji preferred to stay away at Sajjangad. 

Think over this, obey me, and don't bother about my place of stay. This is in your own interest. Helplessly, Bankatlal gave his consent to what Shri Gajanan Maharaj said. Shri Gajanan Maharaj came to the temple and all were happy. 

Bhaskar Patil stayed there in His service. May the Gajanan Vijay Granth be an ideal guide for the devotees to understand the greatness of a real saint. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Six

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


20.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 30 / ŚŔĨ ĞĂĴĂŃĂŃ МĂĤĂŔĂĴ ĹĨŦĔ ĤĨŚŤŐŔŶ - 30 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 7వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! మీకుజై. రామా, మేఘశ్యామా, సీతాపతే, దశరధే నీవు యోగులకు శరణాగతుడవు. మీఆశీస్సులు వలన వానరులు బలంపొంది, లంకలో రావణుడిని ఓడించారు. నీ ఆశీస్సులతో ఎల్లప్పుడూ విజయము కలిగి, కోరికలు పరిపూర్ణం అవుతాయి. రాజుకు ప్రియమయిన మంత్రి ఎంత చేతకాని వాడయినా మిగిలిన మంత్రులకు ప్రియుడవుతాడు. ఈవిధమయిన అనుగ్రహానికి నేను అర్హుడనా ?

ఈ విధమయిన ప్రశ్నతో ఓపాండురంగా, నాకు భక్తి, తెలివితేటలూ కొరవగా ఉండి నాపరిస్థితి దయనీయంగా ఉన్నట్టు నేను తెలుసుకున్నాను. నామనస్సు ఎప్పుడూ అస్థిరంగా, అనుమానాలతో, కోరికలతో ఉంటుంది. ఇటువంటి వాటితో నేను మీఅనుగ్రహం ఎలా పొందగలను ? 

తర్కం ప్రకారం ఇది నిజమే, కాని మీకు పాపులమీద నిజమయిన కోరిక ఉంది అని పురాణాలు చెపుతున్నాయి. మీరు ఉత్తములను ముక్తులను చెయ్యడంలో వింతలేదు, పాపులకు ముక్తి ఇవ్వడంలో మీ నిజమయిన గొప్పతనం ఉంది. ఈ ప్రపంచంలో మీకంటే గొప్పవారు ఎవరూ లేరు, కావున నాపాపాలను క్షమించి, నన్ను దీవించమని నేను మిమ్మల్నే వేడుకుంటున్నాను. ఓనారాయణా మీపాదాల దగ్గర చేరిన ఈదాసగణును స్వీకరించి మీయొక్క గొప్పతనం నిలబెట్టుకోండి. 

ఖండేరావ్ పాటిల్ నాయకత్వం క్రింద, హనుమాన్ మందిరంలోని ఈ ఉత్సవాలలో గ్రామస్థులు చురుకుగా పాల్గొన్నారు. ఈపాటిల్ కుటుంబాలకి వారి పూర్వజుల ఆస్థిపాస్థులు ఉన్నాయి. యోగుల పైన, మునీశ్వరుల పైన వీరికి భక్తి ఆనవాయితీ. ఇప్పుడు గ్రామాధికారి కావడంతో ఇంకా ఉత్సాహంతో పూజించడం జరుగుతోంది.

మహద్జిపాటిల్కు కడత్జి మరియు కుకాజి అనే ఇద్దరు కుమారులు. చిన్నవాడయిన కుకాజి పండరిపూరు పాండురంగ యొక్క గొప్ప భక్తుడు. ఈకుటుంబానికి నాగ్టరివాసి అయిన శ్రీగోమాజి మహారాజు ఆశీర్వాదాలు ఉన్నాయి. కడత్జిపాటిల్ కు ఆరుగురు కుమారులుండగా, కుకాజికి పిల్లలులేరు. కడతజి మరణానంతరం ఆరుగురు పిల్లల్ని, కుకాజి తన స్వంత పిల్లల వలె పెద్దవాళ్ళను చేసాడు. అంతేకాక పూర్తి కుటుంబానికి మంచి అభివృద్ధి తెచ్చాడు. 

కుకాజి తరువాత ఖండుపాటిల్ కుటుంబానికి పెద్ద వాడయ్యాడు. గ్రామస్తులకు ఇతనంటే భయం మరియు తన అధికారాన్ని నిర్భయంగా ఉపయోగించేవాడు. ఇతనికి గణపతి, నారాయణ, మారుతి, హరి మరియు కృష్ణాజి అనే 5 గురు సోదరులు. ఇతనికి దొరికిన గ్రామాధికారి హోదాతోసహా ఇతనికి చాలా ఆస్థి కూడా ఉంది. ఈ అన్నదమ్ములకు నిత్యవ్యాయామం మీద ఉత్సుకత ఉంది. వీరు కత్తి మరియు కర్ర సాములు చేసేవారు. హరిపాటిల్ మల్లయుద్ధం ఇష్టపడేవాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 ŚŔĨ ĞĂĴĂŃĂŃ МĂĤĂŔĂĴ ĹĨŦĔ ĤĨŚŤŐŔŶ - 30 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 7 - part 1 🌻

Chapter 7


Shri Ganeshayanamah! Jai to You Rama, Meghashyama, Sitapate, Dasharathe! You are the refuge to the saints. It was by Your blessings that the monkeys gained strength and defeated Ravana in Lanka. Your blessings always bring victory and fulfilment of desires. 

A favorite of the King, howsoever incapable he may be, becomes lovable to the ministers. Am I suitable for such a favour? With this question, O Panduranga, I realise that my condition is most pitiable as I lack real knowledge and devotion. 

My mind is always unsteady, suspicious and full of desires. With all this, how can I expect to get your favor? Logically, it seems right, but O God, even the Puranas say that you have got a genuine liking for the sinners. It is no wonder if you liberate the pious ones.

But real greatness lies in saving a sinner. Since there is nobody greater than you in this world, I invoke you to ignore my sins and bless me. O Narayana, accept this Dasganu who has surrendered at your feet and uphold your greatness. 

Under the leadership of Khanderao Path, all the villagers actively participated in the function at Hanuman temple. These Patil people have an ancient heritage of wealth and landed property.

Devotion to saints and sages has been their family tradition and now with the authority as village head, this worshipping is done with greater enthusiasm. Mahadaji Patil had two sons, Kadtaji and Kukaji. 

Kukaji, the younger was a great devotee of Pandurang of Pandharpur. The family had the blessings of Shri Gomaji Maharaj of Nagzari. Kadtaji Patil had six sons and Kukaji none. 

After the death of Kadtaji Patil, Kukaji did the bringing up of these six children as his own, and also brought great prosperity to the family. After Kukaji, Khandu Patil became the head of the family. He was a terror to the village and used his authority fearlessly. 

He had five brothers, Ganpat, Narayan, Maruti, Hari and Krishnaji. In addition to the authority of Patil, wielded by him, he possessed a lot of wealth too. All the brothers were fond of regular exercise, playing swords and sticks. Hari Patil liked wrestling.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


21.Aug.2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 31 / Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 31 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 7వ అధ్యాయము - 2 🌻

నామకః ఈ ఉత్సవాలు హనుమంతుని కొరకు, కాని ప్రజలందరి కుతూహలం పాటిల్ ను సంతోషపెట్టడం కోసం. ఈపాటిల్ స్వభావం చాలా దురుసుగాను, అసమంజసంగాను ఉండి షేగాంలో తరుచుగా తగువులకు, వివాదాలకు దారితీసేది. 

అతను అందరినీ నిందించేవాడు. కనీసం యోగులను కూడా విడిచిపెట్టేవాడు కాదు. తన తమ్ములతో ఈ హనుమాన్ మందిరానికి వెళ్ళి శ్రీమహారాజును అనరాని మాటలతో అవహేళన చెయ్యడం మొదలు పెట్టాడు. ఇందులో ఒకళ్ళయితే మహారాజును బయటకువచ్చి మల్లయుద్ధం చేసి ప్రజలకు తన గొప్పతనం నిరూపించవలసిందిగా ప్రేరేపిస్తాడు.

ఈ అన్నదమ్ములు శ్రీమహారాజును తన గొప్పదనం నిరూపించమని లేని పక్షంలో తమచేతి దెబ్బలు తినేందుకు సిద్ధం కమ్మని అంటారు. శ్రీమహారాజు దీనికి కోపగించుకోకుండా నవ్వుతారు. బలం, డబ్బు, అధికారం ఉన్న ఈ ఆకతాయి పాటిల్ సోదరుల నుండి మనం దూరంగా అకోలి వెళిపోదాం అని భాస్కరు శ్రీమహారాజుతో అన్నాడు. భాస్కర్ కొద్దిగా ఆగు. 

ఈపాటిల్ సోదరులంతా నాయొక్క గొప్ప భక్తులు. వీరికి సరళత్వం తక్కువ కానీ నువ్వు జాగ్రత్తగా చూస్తే నాయందు వాళ్ళకు ఉన్న అభిమానం నీకు తెలుస్తుంది. వీళ్ళు యోగుల ఆశీర్వాదాలు ఇంతకు ముందే పొందారు, నాపిల్లలలాంటివారు.

అధికారానికి సాధారణంగా ఈదురుసుతనం తోడుగా ఉంటుంది. పులి ఆవులా ఎలా ప్రవర్తించగలదు ? నిప్పు ఎప్పుడయినా చల్లగా ఉంటుందా ? పదునులేని కత్తి నిరుపయోగం. వర్షాకాలంలోని బురద నీరు శీతాకాలం రాగానే స్వచ్ఛమయినట్టు, వీళ్ళ ఆకతాయితనం కూడా కొంత సమయంతరువాత కనిపించదు అని శ్రీమహారాజు సమాధానం చెపుతారు.

హరిపాటిల్ ఒకరోజు గుడికి వచ్చి, శ్రీమహారాజును తనతో మల్లయుద్ధం చెయ్యమని, అంతేకాక తను ఆయన్ని ఓడిస్తానని అంటాడు. గణ గణ గణాత బోతె అనుకుంటూ శాంతంగా కూర్చోకండి. అందరూ మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు, మీ గొప్పదనం ఈరోజు నేను పరీక్షించాలనుకున్నాను. నన్ను మల్లయుద్ధంలో మీరు ఓడిస్తే మీకు ' ఒక బహుమానం ఇస్తాను అని అన్నాడు. 

శ్రీమహారాజు అతని ఆహ్వానం అంగీకరించి క్రిందకూర్చుని, నిజంగా బలవంతుడవయితే నన్ను లేవదీయమని అన్నారు. హరీపాటిల్ తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించినా ఒక్క అంగుళంకూడా శ్రీమహారాజును కదపలేకపోయాడు. మల్లయుద్ధంలోని యుక్తులన్నీ మరియు పూర్తి శక్తిని ఉపయోగించినా అతని శరీరం చెమటలు పట్టడం మొదలయిందేతప్ప, శ్రీమహారాజును అసలు కదపలేక పోయాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 31  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 7 - part 2 🌻

For name's sake the celebrations were for Lord Hanuman, but in fact everybody was interested in pleasing the Patil. The attitude of the Patil was rude and unreasonable which frequently resulted in quarrels and disputes in Shegaon. 

He abused everybody and did not spare even the saints. Patil, with his brothers, went to the temple of Lord Hanuman and started jesting at Shri Gajanan Maharaj by making bad puns on his name. 

One of them even challenged Maharaj to come out for wrestling and prove the greatness bestowed upon Him by the people. The brothers asked Shri Gajanan Maharaj to prove His greatness or get ready to receive beatings at their hands. 

Shri Gajanan Maharaj just laughed away their remarks and never got angry. Looking at all this rude behaviour of Patil brothers, Shri Bhaskara said, Maharaj let us go to Akoli, away from these insolent boys, corrupted by their strength, money and power. Shri Gajanan Maharaj replied, Bhaskar, wait a bit. 

All these Patil brothers are my great devotees. They lack modesty, but observe them closely to know their affection for me. They are just like my sons and have already recieved blessings from the other saints. Executive power generally is accompanied by rudeness. 

How can a tiger behave like a cow? Can fire ever be cold? Sword will be useless if it is soft. After some time this insolence will disappear as muddy water of rainy seasons becomes clear in winter. One day Hari Patil came to the temple and said to Shri Gajanan, come on wrestle with me and I will defeat you, don't sit quietly chanting Gan Gan Ganat Bote. 

All people praise you and I want to test that greatness of yours. If you defeat me in wrestling, I will give you a prize. Maharaj accepted the challenge and sat down saying, Come on, if you are really strong, come and pull me up. 

Hari Patil wrestled and applied all his strength, but could not move Shri Gajanan Maharaj even an inch. He used all his strength and the tricks of wrestling and all his body started perspiring, but could not move Shri Gajanan Maharaj at all. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


23.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 32 / Sri Gajanan Maharaj Life History - 32 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 7వ అధ్యాయము - 3 🌻

అప్పుడు అతనికి అర్ధంఅయింది శ్రీమహారాజు సన్నగా, బక్కగా ఉన్నా ఆయనశక్తి ఒక పర్వతంలాంటిది. అందుకనే ఆయన ఒక ఏనుగులా మిగిలిన వారి వెక్కిరింతలు లెక్కచెయ్యలేదు. హరిపాటిల్ తననితాను ఏనుగు ముందు నక్కలాగా, లేక పులి ముందు మొరిగే కుక్కలాగా భావించు కున్నాడు. 

అంతవరుకు ఎవ్వరి ముందు తలవంచని అతను శ్రీమహారాజుకు లొంగిపోయేందుకు నిశ్చయించుకుని శ్రీమహారాజు ముందు వంగి నమస్కరిస్తాడు. 

శ్రీమహారాజు అతని అవస్థ చూసి నన్ను ఇప్పుడు ఓడించు లేదా నువ్వు వాదాచేసిన బహుమానం నాకు ఇవ్వు. మల్లయుద్ధం క్రీడలన్నిటిలో ఉత్తమమయింది. శ్రీకృష్ణుడు, బలరాముడు చిన్నతనంలో మల్లయుద్ధం చేసేవారు. గొప్ప మల్లయోద్ధలు మరియు కంసుని అంగరక్షకులు అయిన మస్తక్ మరియు చాణూర్ లు వీరిచే చంపబడ్డారు. 

మంచి ఆరోగ్యమే అశేషమయిన సంపద, రెండవది భూములు, మూడవది ధనం. యమునా నదితీరం వద్ద ఉంటూ, గోకులంలో ఉన్న పిల్లలందరినీ బలవంతులను చేసారు కృష్ణుడు. 

నువ్వు ఇదేవిధంగా ఈ షేగాం పిల్లల్ని బలవంతులను చేయాలని నాకోరిక అని శ్రీమహారాజు అన్నారు. ఇది ఒక్కటే నాకు కావలసిన బహుమానం అని శ్రీమహారాజు అన్నారు. అది మీయొక్క ఆశీర్వాదాలవల్ల మాత్రమే సంభవము అని హరి సూటిగా సమాధానం ఇచ్చాడు. 

కపట యోగులు, వేషంవేసుకొని, అమాయక ప్రజలను మోసంచేస్తారు. బంగారం సహజత్వం నిరూపించుకుందుకు ఆమ్ల పరీక్ష తట్టుకోవాలి. సంత్ తుకారాం మనసును అదుపులో ఉంచిన విషయం చక్కెర కండి ప్రకరణ వల్ల చూపించారు, దున్నపోతు చేత మాట్లాడించిన తరువాతనే జ్ఞానేశ్వరును యోగిగా అంగీకరించారు.

ఎలా అయితే ఎవరినీ సరి అయిన పరీక్ష లేకుండా గౌరవంచకూడదో, శ్రీగజానన్ మహారాజుకు కూడా పరీక్షకు పెట్టాలి అని వాళ్ళు అన్నారు. అలా అని వాళ్ళు ఒక చెక్కరకండ్ల మోపుతో గుడికి వచ్చారు. 

హరిపాటిల్ నెమ్మదిగా ఉన్నాడు, కానీ మిగిలిన అతని సోదరులు ఓమూర్ఖుడా ఈచక్కెరకండ్లతో మేము మిమ్మల్ని కొడతాము, ఈదెబ్బలవల్ల మీ శరీరం మీద గుర్తులు రాకుంటే, అప్పుడే మేము మిమ్మల్ని యోగిగా అంగీకరిస్తాము అని శ్రీమహారాజుతో అంటారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 32 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 7 - part 3 🌻

He realized that though Maharaj appeared thin and frail, His strength was like that of an immovable mountain and for that reason he, like an elephant, ignored all the teasing from others. 

Hari Patil felt himself like a jackal before an elephant or a barking dog before a tiger. Accepting the defeat he, who never bent before anybody, now decided to surrender and bow before Shri Gajanan Maharaj. Looking to his condition Shri Gajanan Maharaj said, Now, defeat me or give me the prize promised by you. Wrestling is the best of all manly sports. Shri Krishna and Balaram played wrestling in their childhood. 

Mushtik and Chanur, the great wrestlers and bodyguards of Kansa were killed by them. Good health is the best wealth, second is landed property and third is money. Shri Krishna, who was living on the banks of Yamuna, made all the boys of Gokul strong. I want you to do the same and make the boys of Shegaon strong. 

Shri Gajanan Maharaj said that this was the only prize he wanted. Hari shrewdly replied that it was possible only with His blessings. Since then Hari started behaving well with Shri Gajanan Maharaj . Looking to this, his other brothers started questioning his “cowardly” behavior. 

They said, We, being sons of Patils, the highest authority of the village, should not bow before such a naked man. This mad man is getting unnecessary popularity and we must take immediate steps to stop it in public interest. If we neglect our duty, people will go astray. It is our duty to caution the people in time. 

Hypocrites put on the garb of sages and innocent people are befooled. Gold has to stand an acid test to prove its genuineness. Incident of sugarcane showed saint Tukaram's control on His mind and Dnyaneshwar was accepted a saint only when he made a buffalo speak. 

As we should not respect anybody without proper test, Shri Gajanan Maharaj too should be put to test. Saying so, they came to the temple with a bundle of sugarcanes. 

Hari was quiet, but other brothers said to Shri Gajanan Maharaj , You fool! If you want to eat these sugarcanes, fulfil our condition: we shall beat you with these sugarcanes and if this beating does not raise marks on your body, then only we shall accept you as a yogi.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

24.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 33 / şŕί ģάјάήάή мάħάŕάј Ļίғέ ħίşţόŕч - 33 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 7వ అధ్యాయము - 4 🌻

శ్రీమహారాజు నవ్వి, వాళ్ళమాటలను చిలిపి చేష్టలుగా వదిలి వేసారు. చక్కెర కండ్ల దెబ్బలకు అతను భయపడుతున్నట్టు ఉంది అని మారుతి అన్నాడు. అతని మౌనం ఈదెబ్బలకు ఒప్పుకున్నట్టే అని గణలతి అన్నాడు. అలా అంటూ ఆసోదరులంతా శ్రీమహారాజు వైపు ఉరికి చక్కెర కండ్లతో కొట్టడం ప్రారంభించారు. ఒక్క భాస్కరు తప్ప మిగిలినవారంతా పారిపోవడం మొదలు పెట్టారు. 

శ్రీమహారాజును కొట్టడం ఆపమని బాస్కరు వాళ్ళను వేడుకున్నాడు. దయచేసి ఆయనను కొట్టకండి. పాటిల్ కుటుంబంలో పుట్టిన మీరు మిగిలిన వాళ్ళతో దయగా ఉండాలి. మీరు ఒక వేళ ఆయన్ని గొప్ప యోగిగా తలంచకపోతే, ఒక అమాయక మయిన పేద మనిషిగా భావించి వదిలివెయ్యండి. ధైర్యమయిన వేటగాళ్లు పులులను ఎదుర్కొంటారు తప్ప కీటకాలను ఎప్పటికీ గురిపెట్టరు. 

హనుమంతుడు రావణుడి లంక మీద దాడిచేసి నిప్పు అంటించాడు తప్ప బీదవాళ్ళ గుడిశెలకుకాదు అని అన్నాడు. ఈగ్రామ ప్రజలు ఈయనను ఒకగొప్ప యోగిగా పరిగణిస్తున్నారు, కావున మేము ఆయన గొప్పతనం పరీక్షిస్తున్నాం.

కనుక నువ్వుదూరంగా ఉండు అని ఆపిల్లలు అన్నారు. అలా అంటూ రైతు ధాన్యం వేరు చేయడానికి ధాన్యం కండ్లను కొట్టినట్టు, చెరకు కండ్లతో ఆపిల్లలు శ్రీమహారాజును కొట్టడం మొదలు పెట్టారు. శ్రీమహారాజు సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉన్నారు. ఒక్క దెబ్బ గుర్తు కూడా ఆయన శరీరంమీద ఈ దెబ్బలవల్ల రాలేదు. ఈనిజాన్ని చూసి ఆపిల్లలు భయపడి, ఆయనను నిజమయిన యోగివి అంటూ, శ్రీమహారాజు ముందు వంగి నమస్కరిస్తారు. 

మీచేతులు ఈవిధంగా నన్ను కొట్టడంవల్ల నెప్పిపెడుతూ ఉంటాయి, కనుక మిమ్మల్ని సేదతీర్చేందుకు మీకు ఈ చెరకు రసం ఇస్తాను అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ ఆయన ఒకొక్క చెరకు కర్ర తీసుకొని చేతులతోనే తిప్పి వాటినుండి రసం తీసి త్రాగేందుకు వాళ్ళకు ఇచ్చారు. ఆవిధంగా ఏవిధమయిన యంత్రం అవసరం లేకుండా చెరకు రసం పిండారు. ఆపిల్లలు చాలా సంతోషించారు.

శ్రీమహారాజులో ఉన్న యోగ శక్తివల్ల ఇది సాధ్యమయింది అని ప్రజలు అన్నారు. ఈ చమత్కారంతో దేశం బలపడాలంటే యోగ నేర్చుకోవడం తప్పనిసరి అని శ్రీమహారాజు తెలియపరిచారు. ఆపిల్లలు శ్రీమహారాజుకు నమస్కరించి వెళ్ళిపోయారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 şŕί ģάјάήάή мάħάŕάј Ļίғέ ħίşţόŕч - 33 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 7 - part 4 🌻

Shri Gajanan Maharaj smiled and ignored their talk like one ignores children's prattle. Maruti said, He appears to be afraid of the sugarcane beating.

Ganapati said, His silence implies acceptance to the beatings. Saying so all the brothers rushed and started beating Shri Gajanan Maharaj with the sugarcanes. All people in the temple, except Bhaskar, started running away. Bhaskar appealed to them to stop beating Shri Gajanan Maharaj . 

He said, Please do not beat him. You are born in the Patil family and so should be kind to others. If you do not think him to be a great saint, then treat him as an innocent man and ignore him. Brave hunters always attack the tigers and never shoot at insects. 

Hanuman attacked and burnt Ravana's Lanka and not hurt poor people. The boys replied, People of this village treat him as a great saint, and therefore, we want to test his greatness, so you keep away. So saying the boys continued beating Shri Gajanan Maharaj with sugarcanes like a farmers beating grain bunches for taking out the grain.

Shri Gajanan Maharaj kept smiling and did not reply. The beating did not raise a single mark on His body. Looking to this fact the boys got afraid and bowed before Shri Gajanan Maharaj saying that He was a real yogi.

Shri Gajanan Maharaj said, O boys, your hands must be aching by beating me, and so to refresh you I will give you sugarcane juice. Saying so he took sugarcanes one by one and with his hands squeezed the juice from the sugarcanes and gave it to them to drink. 

Thus Shri Gajanan Maharaj squeezed juice out of sugarcanes without any machine. The boys were very happy. People said that this was possible due to the yogic strength of Shri Gajanan Maharaj . 

By this miracle Shri Gajanan Maharaj conveyed that if we want to make our nation strong, we must learn yoga. The boys prostrated before Shri Gajanan Maharaj and went away. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

25.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹.  .o×X×o.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 𝟑𝟒 / 𝐒𝐫𝐢 𝐆𝐚𝐣𝐚𝐧𝐚𝐧 𝐌𝐚𝐡𝐚𝐫𝐚𝐣 𝐋𝐢𝐟𝐞 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 - 𝟑𝟒   .o×X×o.  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 7వ అధ్యాయము - 5 🌻

ఖాండుపాటిల్కు వారు ఈకధనం అంతాచెపుతూ శ్రీగజానన్ నిజంగా షేగాంలో ఒక భగవానుడు అన్నారు. ఇతను కూడా ఆశ్ఛర్యపోయి, శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళడం ప్రారంభించాడు. కానీ అతని మొరుటుగా శ్రీమహారాజుతో మాట్లాడడం మారలేదు. ఇతను శ్రీమహారాజును గణయా లేదా గజయా అని పిలుస్తూ ఉండేవాడు. ఈవిధంగా ఒకరిని ఏకవచనంతో పిలవడం అనేది రెండు పరిస్థితులలో అవుతుంది. 

ఒకటి తల్లి పిల్లల మధ్య ఉండే ఆత్మీయతవల్ల, రెండవది ఎవరయినా తమ నౌకర్లతో కాని, పేదవాళ్ళతో కాని మాట్లాడి నప్పుడు. పాటిల్ ఈవిధంగా ఏకవచన సంభోధనకు అలవాటు పడ్డవాడు ఎందుకంటే ఊరి ప్రజలందరూ తనకు కావలసినవారు. ఆకారణంవల్లనే ఖాండుపాటిల్ శ్రీమహారాజును గణయా లేదా గజయా అనిపిలిచాడు. 

కానీ ఆయన హృదయంలో శ్రీమహారాజు ఎడల గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఇది కొబ్బరికాయలా బయట గట్టి టెంక, లోపల తియ్యటి రుచికరమయిన మీగడలా ఉంది. ఒకసారి కుకాజి, ఖాండుపాటిల్ ను పిలిచి నువ్వు ఎప్పుడూ కూడా శ్రీగజానన్ గొప్పయోగి అని అంటావు, మరి ఆయన ముందు మూగవాడివి ఎందుకు అవుతావు ? నీకు పిల్లలులేరు, నేనేమో ముసిలివాడిని అవుతున్నాను, నాకు నా మనమలను తప్పక చూడాలని ఉంది, నువ్వు వెళ్ళి నీకు సంతానం కలగాలని ఆయనను అశీర్వదించమను. అతను నిజంగా యోగి అయితే మనకోరిక నెరవేరుస్తారు అని అంటారు. 

ఆ తరువాత ఖాండుపాటిల్ మారుతి మందిరానికి వెళ్ళి ఓగణయా, మాచిన్ననాన్న ముసలి వారు అవుతున్నారు, అందుకే నా సంతానం చూడాలని కోరుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని గొప్ప యోగి, తన భక్తుల కోరికలు పూర్తి చేయగలవారు అని అంటారు, నాకు సంతానం కలిగించి దానిని నిరూపించండి అని శ్రీమహారాజుతో అన్నాడు. 

నువ్వు నన్ను దేని గురించి అయినా అర్ధించావు, చాలామంచిది. నీకు అధికారం, ధనం ఉన్నాయి, నువ్వు నీస్వయంకృషి మీద నమ్మకం కలిగి ఉంటావు. అలాంటప్పుడు ఈ ఉపకారం కోసం నన్ను ఎందుకు అడుగుతున్నావు ? అధికారం, ధనం ఏమయినా నీకు ఇవ్వగలవని నువ్వు నమ్ముతావు, అలాంటప్పుడు నీ స్వప్రయత్నంమీద సంతానం ఎందుకు పొందలేవు ? నీకు అనేకములయిన భూములు, ధనం, దుకాణాలు, మిల్లులు ఉన్నాయి, నిన్ను ఎవరూ నిరాదరణ చెయ్యరు, అలాంటప్పుడు నీకు సంతానం ఇమ్మని బ్రహ్మను నువ్వు ఎందుకు ఆదేశించలేదు ? అని శ్రీమహారాజు అన్నారు. 

ఇది మానవ ప్రయత్నానికి అతీతమయిన విషయం. పంటలు పెరగడానికి నీరు కావాలి, కాని వర్షాలు తేవడం మనుష్యుల చేతులలోలేదు. అందుకే కరువుకాలంలో భూములు ఎండిపోతాయి. 

కానీ ఒకసారి వానలు వస్తే మానవప్రయత్నాలు సఫలమవుతాయి. నావిషయంకూడా అలానే అని ఖాండుపాటిల్ అన్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  𝐒𝐫𝐢 𝐆𝐚𝐣𝐚𝐧𝐚𝐧 𝐌𝐚𝐡𝐚𝐫𝐚𝐣 𝐋𝐢𝐟𝐞 𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐲 - 𝟑𝟒  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 7 - part 5 🌻

They told the whole story to Khandu Patil saying that Shri Gajanan is really a God in Shegaon. 

He was surprised and started going to Shri Gajanan Maharaj , but his rough way of speaking with Shri Gajanan Maharaj did not change. He used to call Shri Gajanan Maharaj as Ganya or Gajya. 

This type of addressing a person in a singular fashion occurs in two cases. First, when there is intimate love involved as is between a mother and child and second, when a person speaks to his servants or poor people. Patil is accustomed to speak in a singular manner as all the people in the village are his subjects. However, in his heart he had great respect and love for Shri Gajanan Maharaj . 

It was just like a coconut that has a hard and rough surface, but sweet and tasty fennel. Once Kukaji called Khandu Patil and said, “You always say that Shri Gajanan Maharaj is a great saint, then why are you dumb before him?

You have no children and since I am getting old, I would very much like to see a grandchild. You should go and request Him to bless you with a child; if he is a real saint he will fulfil our desire.”

You have no children and since I am getting old, I would very much like to see a grandchild. You should go and request Him to bless you with a child; if he is a real saint he will fulfil our desire.” 

Thereupon Khandu Patil went to the Lord Maruti temple and said to Shri Gajanan Maharaj , O Ganya, my uncle has grown old and desires to see me with a child. People call you a saint, able to fulfil the desires of His devotees, and I wish you to prove it by giving me a child.

Maharaj said, It is good that you have begged for something from me. You have got power, money and believe in your personal efforts, then why are you asking me for this favour? You behave like power or money can give you anything, then why not get a child by your own efforts? 

You have got a lot of land, money, mills and shops and nobody disobeys you, then why don't you order Brahma to give you a child? Khandu said, This is something beyond human efforts. Crops need water for their growth, but bringing rains is not in the hands of human beings. 

That is why during famine lands lie dry. But once the rains come, human efforts prove fruitful. Same is the case with me.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


26 Aug 2020

------------------------------------ x ------------------------------------



🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 3͙5͙ / S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 3͙5͙   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 7వ అధ్యాయము - 6 🌻

దీనికి మహారాజు నవ్వి నువ్వు ఇప్పుడు సంతానంకోసం అధించావు. ఇది అర్ధింపు కనుక, నీకు కొడుకు పుడతాడని నేను దీవిస్తున్నాను, వాడికి నువ్వు భికయ అని పేరు పెట్టాలి. నీకు సంతానం ఇవ్వడం అనేది పూర్తిగా నాచేతులలో లేదు కాని ఆ మహాత్ముడిని నీకోరిక నెరవేర్చమని నేను అర్ధిస్తాను. నీకు కొడుకు కలుగుతాడు, దానికి బదులుగా, నీకృతజ్ఞతకు ఒకచిన్నకానుకగా, బ్రాహ్మణలకు మామిడిపండ్ల రసం తినిపించమని నేను నిన్ను అడుగుతున్నాను అని అన్నారు. 

దానికి ఖాండు అంగీకరించాడు. ఇంటికి వెళ్ళి ఈసంభాషణను తన చిన్ననాన్నకి చెప్పాడు, కుకాజీ చాలా సంతోషించాడు. కొన్నిరోజుల తరువాత స్వామీజీ దీవెనలు నిజమని నిరూపించ బడ్డాయి, మరియు ఖాండుపాటిల్కు ఒక కొడుకు కలిగాడు. అతను చాలాసంతోషించాడు. కుకాజి సంతోషానికయితే అవధిలేదు. ఖాండుపాటిల్, బీదవాళ్ళకి ధాన్యం, మరియు గోధుమలు పిల్లలకు మిఠాయిలు షేగాంలో ఇచ్చారు. 

ఆపిల్ల వాడికి అన్న విధంగా భికు అని పేరు పెట్టారు. చంద్రుడిలా వాడు పెరుగుతున్నాడు. తన వాగ్దానం ప్రకారం ఖాండపాటిల్, బ్రాహ్మణులకు మామిడి పండ్లరసం తినిపించాడు, ఈ ఆనవాయితీని అతని కుటుంబం ఇంకా చేస్తూనే ఉంది. 

శ్రీగజానన్ మహారాజు కృపవల్ల ఆపిల్లవాడు ఖాండుపాటిల్ ఇంట్లో పాకడం మొదలు పెట్టాడు. పాటిల్ కుటుంబీకుల సంతోషానికి దేష్ ముఖ్ కుటుంబీకులు దుఖిఃతులయ్యారు, ఎందుకంటే షేగాం చాలా పూర్వ నుండి ఈవిధంగా విభజన చెందిన గ్రామం.

షేగాంలో రెండు పరస్పర విరోధ పార్టీలు ఉన్నాయి. ఒకటి పాటిల్ రెండవది దేష్ ముఖ్. వీళ్ళు ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వి, ఒకరినొకరు నాశనంచేసుకుందుకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరు పండితులు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు యోద్ధలు, ఇద్దరు మరమ్మత్తు చేసేవారు మరియు రెండుకుక్కలు ఎప్పుడు ఒకరికొకరు ఎదురు పడ్డా దెబ్బలాడు కుంటారు. 

ఈపాటిల్ దేష్ముఖే విషయం కూడా అలాంటిదే. కుకాజి తన మనుమడిని చూసిన తరువాత భీమానది తీరాన్న పండరిపూరులో మరణించారు. 

తన రక్షకుడిని పోగొట్టు కున్నందుకు థాండుపాటిల్ దుఖితుడయ్యాడు. ఈవిధమయిన ఖాండుపాటిల్ మానసిక అవస్థ చూసి, అతనిని ఇబ్బంది పెట్టడానికి దేష్ ముఖ్ ఏవిధంగా ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకున్నాడో మరుసటి అధ్యాయంలో వర్నించబడింది. 

దయచేసి చిత్తశుద్ధితో దాసగణు రచించిన ఈ గజానన్ విజయను వినండి. మీకు శుభములు కలుగుగాక. 

"శుభం భవతు"

7. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   S͙r͙i͙ G͙a͙j͙a͙n͙a͙n͙ M͙a͙h͙a͙r͙a͙j͙ L͙i͙f͙e͙ H͙i͙s͙t͙o͙r͙y͙ - 3͙5͙   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 7 - part 6 🌻
At this, Swamiji smiled and said, You have now begged for a child; since it is a begging, I bless that you will get a son. It is not entirely in my hands to bless you thus, but I will request the Almighty to fulfil your desire.

In return, I ask you to feed mango juice to Brahmins every year and name the son Bhikya, as a token of your gratefulness.”

Khandu Patil accepted these conditions, went home and told about this conversation to his uncle. 

Kukaji was very happy. After some days Swamiji's blessings proved true and Khandu Patil got a son. He was very happy and Kukaji’s happiness knew no bounds. Khandu Patil distributed jaggery and wheat to the poor and sweets to the children of Shegaon. 

The child was rightly named Bhikya who, like a moon, went on growing. Khandu Patil, as promised, fed Brahmins with mango juice and continued this practice throughout his life; his decendents still continue this practice. 

The child, by the grace of Shri Gajanan Maharaj, started crawling in the house of Khandu Patil. The happiness of the Patils made the Deshmukhs unhappy. Shegaon was a divided village since long; there were two rival groups in Shegaon: one of the Patils and the other of the Deshmukhs. 

They were always searching for an opportunity to destroy each other. Two Pundits, two ministers, two fighters, two mechanics and two dogs when face-to-face, always fight. Same was the case with Patils and Deshmukhs. 

After seeing his grandchild, Kukaji died at Pandharpur on the bank of the river Bhima; Khandu Patil was sad to have lost his protector.

Looking to Khandu Patil's state of mind, the Deshmukh exploited the opportunity to put Patil into trouble, the details of which will be narrated in the next chapter. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Seven

Continues..
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

27 Aug 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 36 / Sri Gajanan Maharaj Life History - 36🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓ దేవకీ వసుదేవుల కుమారుడా, ఓగోపికలకు, గోపాలులకు ప్రియమైనవాడా, ఓ రాక్షసులను సంహరించినవాడా, శ్రీహరీ నన్ను ఆశీర్వదించు. మీ ఆదరణ పొందడానికి భక్తి, తపస్య అవసరం. కానీ ఇందులో దేనినీ నేను పొందలేక పోతున్నాను. 

మీ గాధలన్నీ నాకుతెలియని పురాతన భాషలో ఉన్నాయి. నేను మందబుద్ధి వాడిని అవటంచేత ఆభాష చదవడం నేర్చుకోలేను. కప్పకు తామరపువ్వు లోని తేనె ఎలా దొరుకు తుంది ? ప్రజలకు అన్నదానం చేసి మీ ఆదరణ పొందుదామంటే, నాకు మీరొసంగిన ఈ బీదరికం వల్ల అదికూడా నాకు కుదరదు. 

క్షీణంచిన శరీరావస్త మరియు దృష్టి వల్ల మీపుణ్యక్షేత్రాలు దర్శించి మీఆశీర్వాదం పొందడంకూడా కుదరదు. ఈవిధంగా అన్ని విధాలా నేను నిస్సహాయుడను. బీదవాళ్ళ ఆశలు ఎప్పటికి పూర్తికావు అనిపిస్తోంది. చూడ్డానికి ఇదినిజమే కాని మీరు కోరుకుంటే మీఆశీశ్శులు నాకు మోక్షంపొందేలా చేస్తాయి. 

మీ ఆశీర్వాదాలు పొందడానికి ధనం అవసరంలేదు. మేఘం వర్షించినప్పుడు నదులు, సరస్సులు నీళ్ళతో నిండుతాయి, అటువంటి మీఆశీర్వాదంకోసం నేను ఆకలిగా ఉన్నాను. దయచేసి నాకు కించింతయినా ఇచ్చి నన్ను సంతోష పెట్టండి. ఒక్కచుక్క అమృతం పూర్తి జబ్బును మాయం చేస్తుంది. ఇదంతా ఇలా ఉండనివ్వండి. 

క్రిందటి అధ్యాయంలో పాటిల్, దేష్ ముఖ్లు విడిపోయి ఉండడం చూసాం. ఎప్పుడు అటువంటి విభజన ఉన్నా, పూర్తి సంతోషాన్నిఅది నాశనం చేస్తుంది. శరీరానికి క్షయరోగం, సమాజానికి ఈవిభజన మృత్యువుకు దారితీస్తాయి. అన్ని ప్రయత్నాలు వ్యర్ధం అవుతాయి. గ్రామానికి ముఖ్యఅధికారి అయిన ఖాండుపాటిల్ తో ఒక మహార్, తనకు, పాటిల్ ఇచ్చిన పనిగూర్చి, సరస్సు ఒడ్డున వాదంచేసాడు. 

ఈ మార్యామహర్కు, దేష్ ముఖ్ల అండఉంది. పాటిల్ అతనికి ఒక పనిచెప్పాడు, దానికి అతను, ఆపని చెయ్యనని చాలాదురుసు భాషలో నిరాకరిస్తాడు. గ్రామ పెద్దతో సరిగా ప్రవర్తించమని పాటిల్ అతనిని హెచ్చరిస్తాడు. మార్యా దానిని ఆదరించకుండా పాటిల్ ను అనాదరణ చెయ్యడం మొదలు పెట్టాడు. 

ఈ వాగ్వివాదానికి కారణం అతి సామాన్యమయినది. పాటిల్ అకోలా పోలీసు స్టేషనుకు ఒక ప్రాధాన్యతగల తంతి పంపవలసి, మార్యాను తీసుకు వెళ్ళమంటాడు. మర్యాదానికి గట్టిగా నిరాకరిస్తూ, తను దేష్ ముఖీకు మాత్రమే జవాబుదారుడనని అంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 36 🌹
  
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 1 🌻

Shri Ganeshayanamah! O Son of Vasudeo and Devaki! O Beloved one of Gopa and Gopis! O Killer of demons! Bless me Shri Hari. Devotion and penance is required to get your favor, but I am not suitable to attain any of these. 

I do not know all your gospels as they written in an ancient language, not known to me; I am also dull and so cannot study that language. Tell me how can a frog get honey from a lotus? If I try to get your favor by feeding people, that too is not possible due to the poverty bestowed upon me by you. 

Getting your blessings by visiting holy shrines and places is also not possible due to my poor health and fading eyesight. Thus I am helpless all around. It is seen that the hopes of the poor are never fulfilled. 

Apparently it is true, but if You wish, Your blessings can enable me to attain all the bliss. The speciality of Your blessings is that they do not require money to obtain them. When clouds pour water, all the rivers and lakes get filled with it. I am hungry for such blessings from You. 

Please give me atleast a morsel of it and make me happy. A drop of nectar can remove all the diseases. Let it be as it is. In the previous chapter we have seen that the Patil and the Deshmukh were divided. 

Whenever there is such division in society, it destroys all happiness. Tuberculosis to the body and divisions in the society entail death and all attempts prove futile. On the bank of a lake, one Mahar was arguing with Khandu Patil regarding some work given to him by Patil, who was the highest authority in the village. 

That Marya Mahar had the support of the Deshmukhs. Patil told him to do some work, but he refused to do it in very rough language. Patil asked him to behave himself reminding him that he was addressing the head of the village and admonished Marya thereby.

Marya did not obey Patil and instead started to ridicule him. The cause of the argument was very simple; Patil wanted to send some important dak to the Police Station in Akola and had asked Marya to carry it for him.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 37 / 𝙎𝙧𝙞 𝙂𝙖𝙟𝙖𝙣𝙖𝙣 𝙈𝙖𝙝𝙖𝙧𝙖𝙟 𝙇𝙞𝙛𝙚 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙮 - 37  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 8వ అధ్యాయము - 2 🌻

పాటిల్ ఉద్రిక్తుడయ్యేట్టు, అతను పాటిల్ పైన అసభ్యకరమైన సూచనలు చేస్తాడు. ఆకోపంలో పాటిల్ మార్యా చేతిమీద కర్రతో ఒక బలమయిన దెబ్బ కొట్టాడు. పాటిల్ లాంటి బలమయిన వ్యక్తి యొక్క గట్టి దెబ్బకి మార్యా చెయ్యవిరిగి, నిస్పృహుడిని చేసింది. మార్యా బంధువులు అతనని దేష్ ముఖ్ దగ్గరికి తీసుకు వెళ్ళారు, ఈ అవకాశాన్ని అందుకుని ఇతను ఖాండుపాటిల్ ను ఇరికించి, బాధించాడు. 

మార్యను, దేష్ ముఖ్ పోలీసు స్టేషను తీసుకు వెళ్ళి అక్కడ అధికారికి ఈవిషయం నివేదిస్తాడు. సమాజంలో ఎప్పుడు ఈవిభజన ఉందో, చాలాచిన్నచిన్న విషయాలుకూడా, ఒకరినొకరు అతిగా తూలనాడేందుకు, కించపరచడానికి చూస్తారు. ఆ ఆఫీసరు పిర్యాదు స్వీకరించి, పుస్తకంలో వ్రాసి, మార్యా చెయ్యంలో పాటిల్ మా జవాబుదారుడనని కరు అతిగా ఊడ అధికారికి అవకాశాన్ని అందుకు ఖాండుపాటిల్ ను నిర్భందిచేందుకు సూచనలు జారీచేసాడు. 

ఈ వార్త షేగాంలో దావానలంలా వ్యాపించింది. దీనికి సహజంగా పాటిల్ కూడాభయపడ్డాడు. అతను ఈ నిర్భందింపబడడం అనే అవమానంనుండి రక్షించమని శక్తిసాలి అయిన భగవంతుని ప్రార్ధించాడు. గౌరవనీయమయిన వ్యక్తికి అవమానం చావుకంటే కనిష్ట మయినది. ఇతని సోదరులు కూడా చింతితులయి అసహాయులుగా భావంచారు. 

అప్పుడు ఖాండుపాటిల్ కు అకస్మాత్తుగా తట్టింది, తను శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళి ఆయనసహాయం కోరడం మంచిది అని. ఈయన తప్ప వేరెవరు ఈఉపద్రవం నుండి కాపాడలేరు అని. న్యాయపరమయిన మానవ ప్రయత్నాలకు అతని సోదరులు అకోలా వెళ్ళారు. రాత్రి తిన్నగా ఖాండుపాటిల్ శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళాడు. 

శ్రీమహారాజుకు నమస్కరించి, మొత్తం వృత్తాంతం అంతా వర్ణించాడు. ప్రభుత్వ కార్యంనిరాకరించిన కారణంగా నేను మాహర్ ను కొట్టాను. దీనిని అవకాశంగా తీసుకొని, దేష్ముఖ్ నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. వీళ్ళు నన్ను నింర్భందించడానికి ఏర్పాటు చేస్తున్నారు, మీరుతప్ప మరివేరెవరు నన్ను రక్షించడానికి లేరు. 

రేపు నన్ను నిర్భందిచడానికి పొలీసు రావచ్చు. దయచేసి దానికి ముందు నన్ను చంపండి. నేను పరువుగల వ్యక్తిని, కావున ఈవిధమయిన నిర్భంధం చావుకు సరిసమానం వంటిది. నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాను, కానీ దీనిని వీళ్ళు ఉన్నదానికన్నా చాలా అతిగా చిత్రిస్తున్నారు. దయచేసి నన్ను ఈ నిరాదరణ నుండి కాపాడండి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹  𝙎𝙧𝙞 𝙂𝙖𝙟𝙖𝙣𝙖𝙣 𝙈𝙖𝙝𝙖𝙧𝙖𝙟 𝙇𝙞𝙛𝙚 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙮 - 37  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 8 - part 2 🌻

Marya had blatantly refused to go saying that he was a subordinate to the Deshmukh only. He made some nasty gesticulations at Patil, which infuriated him. In the fury, Patil gave a forceful blow with a stick on Marya's hand. 

This blow fractured Marya's hand, making him unconscious. Patil sent the dak with some other man. The relatives of the Marya took him to the Deshmukh, who grabbed this opportunity to corner and trouble Khandu Patil. 

Deshmukh took Marya to the police station and reported the matter to the officer. Whenever there are conflicting groups in the society, even the small things are magnified by the individual groups to denounce each other. 

The Officer registered the complaint and issued orders to arrest Khandu Patil. The news spread like wildfire in Shegaon and Patil, naturally, got frightened and worried over the impending danger. He prayed to the Almighty God to save him from the humiliation of arrest. 

For a man of dignity, an insult is worse than death. All his brothers too were worried and were feeling helpless. Then it suddenly occurred to Khandu Patil that he should surrender himself to Shri Gajanan Maharaj and seek His help as none else would be able to save him from this calamity. 

His brothers went to Akola for legal and personal efforts. Khandu Patil went straight to Shri Gajanan Maharaj that night. He prostrated before Shri Gajanan Maharaj and narrated the whole episode. He said, I gave a beating to one Mahar as he refused to do Government work and that matter is being used by the Deshmukh to put me in trouble. 

They are arranging to get me arrested and there is nobody to save me except you. Tomorrow the policemen will come to arrest me. Please kill me before that. I am a man of dignity and an insult, such as arrest, is as good as death to me.

I do accept my mistake, but that is being exaggerated out of proportion. Please save me from this contempt.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

29 Aug 2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 38 /  Sri Gajanan Maharaj Life History - 38  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 3 🌻

అర్జునుడు, జయద్రధుడి విషయంలో తన ప్రతిష్ఠ కాపాడోకోడానికి స్వయంగా అగ్నికి ఆహుతి అయ్యేందుకు సిద్ధం అవుతాడు. భగవంతుడు అతనిని రక్షించి, అతని గౌరవం కాపాడారు. భగవంతుడు ఒకచీర తరువాత ఒకచీర ఇస్తూ ద్రౌపది పరువు ప్రతిష్టలు కాపాడారు. 

ఇదేవిధంగా ఆత్మగౌరవం అనే ఆద్రౌపదిని ఈ దేష్ముఖ్ అనే కౌరవులు వివస్త్రను చేస్తున్నారు. ఇలా అంటూ పాటిల్ ఘోరున విలపిస్తాడు. అతని సోదరులంతా కూడా రాబోయే అవమానానికి చాలాచింతిస్తున్నారు. 

శ్రీమహారాజు ఖాండుపాటిల్ ను తన చేతులతో దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ.... భాద్యతలుగల అధికారి ఈవిధమయిన పరిస్థితులు పదేపదే ఎదుదర్కోవలసి వస్తుంది కనుక పెద్దగా పట్టించుకోరాదు. ఇది స్వార్ధం వల్ల వచ్చిన ఫలితం. 

మరియు మంచి ఆలోచన లేకపోవడం. మీరిరువురు పాటిల్ దేష్ ముఖ్లు ఒకేజాతికి చెందినవారు అయినా స్వార్ధంతో ఒకరినొకరు నాశనం చేసుకునే ప్రయత్నంచేస్తున్నారు. పూర్వంలో కౌరవుల, పాండవుల మధ్య వైరంకూడా స్వార్ధం ఫలితం వల్లనే. పాండవులు న్యాయరీత్యా సరిఅయినవారు కనుక వారికి భగవంతుని సహాయందొరికింది. 

నిజాయితీని నిలపడానికి చివరికి కౌరవులు చంపబడ్డారు. కనుక భయపడకు, నిన్ను నిర్భందించడానికి దేష్ ముఖ్ చేస్తున్న అన్ని ప్రయత్నాలు వ్యర్ధం అవుతాయిఅని శ్రీమహారాజు అన్నారు. అదేనిజం అయింది. పాటిల్ ను నిర్దోషిగా ఘోషించారు. యోగుల మాటలు ఎప్పటికి తప్పుకావు. ఈసంఘటన తరువాత పాటిల్ సోదరులు శ్రీమహారాజు ప్రతి అధిక భక్తి గలవారయ్యారు. 

అమృతం త్రాగడం ఎవరికి ఇష్టం ఉండదు ? ఖాండపాటిల్ కొద్దిరోజుల తరువాత శ్రీమహారాజును అర్ధించి ఆప్యాయతతో తన ఇంటి దగ్గర ఉండేందుకు తీసుకు వెళ్ళాడు. కొంతమంది తెలంగి బ్రాహ్మణులు, ఖాండుపాటిల్ ఇంటిదగ్గర శ్రీమహారాజు ఉండగా వచ్చారు. ఈబ్రాహ్మణులు చాలా ఆచార వ్యవహారాలతో, పాండిత్యంలో మరియు వేదాలమీద మంచి అధికారంకలవారు. కానీ వీరికి ధనంమీద లోభత్వం ఉంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 38 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 3 🌻
Arjun had prepared to burn himself to save his dignity in the episode of Jaydratha. God saved him and protected his honour. God also saved the honour and respect of Draupadi by covering her by sari after sari. Similarly my self respect, like Draupadi's, is being stripped off by these Deshmukh Kaurawas. Saying so Patil wept bitterly. 

All his brothers too were very much worried over the impending humiliation to the family. Shri Gajanan Maharaj took Khandu Patil in his embrace to pacify him and said A man with responsibilities has got to face such situations frequently, and so should not mind it. 

Such things are the outcome of selfishness, and a lack of pious thinking. Both of you, Patil and Deshmukh, belong to the same caste, but due to selfishness, are trying to destroy each other. In the past the enmity between the Kaurawas and the Pandawas was also the result of selfishness only. 

But since the Pandawas were legally right, they had received God’s blessings for the upkeep of truth. Consequently the Kaurawas were all killed. So don't be afraid. All of Deshmukh’s efforts to arrest you will fail. 

This prediction, made by Shree Gajanan Maharaj, came true. Patil was declared innocent by the court of law. The words uttered by true saints can never be futile. After this incident, the Patil brothers became more devoted to Shri Gajanan Maharaj . 

Who will not like to drink nectar? After some days, Khandu Patil requested and affectionately took Maharaj to stay at his house. While Maharaj lived at the house of Khandu Patil, some Telangi Brahmins also visited there. 

These Telangi Brahmins were known to be quite orthodox, learned and in charge of the authority of Vedic knowledge, but their biggest drawback was that they were somewhat greedy for money.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

30.Aug.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 39 / Sri Gajanan Maharaj Life History - 39 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 4 🌻

శ్రీమహారాజు దగ్గర నుండి వీళ్ళు కొంత ధనం పొందే ఆశతో వచ్చారు. వీళ్ళు వచ్చినప్పటికి శ్రీమహారాజు నిద్రపోతున్నారు. శ్రీమహారాజును లేపేందుకు ఈ బ్రాహ్మణులు, గట్టిగా వేదపఠనం చెయ్యడం మొదలు పెడతారు. వారి ఆపఠనంలో ఒకచోట కొద్దిగా తప్పు అవుతుంది, కాని దానిని వాళ్ళు సరిదిద్దలేదు. 

అందుకని శ్రీమహారాజు లేచి, మీరు వైదికులు ఎందుకు అయ్యారు ? వేదంయొక్క ప్రాముఖ్యతను మీరు అనవసరంగా దిగజార్చు తున్నారు. ఈవిద్య వ్యాపారం చేసేందుకు కాదు, మనుష్యులను ఉద్ధరించడానికి. మిమ్మల్ని వైదికులుగా సూచించే మీతలకున్న అలంకరణ కయినా కనీసం కొంత గౌరవం ఇవ్వండి. 

ఇప్పుడు నేను చదువుతాను మీరు మరల దానిని నేను ఎలాచదివేనో అలా అనండి. అమాయకులను మోసగించకండి, అని వాళ్ళతో అన్నారు. అలా అంటూ, ఈ బ్రాహ్మణులు తప్పుగా చదివిన వేద అధ్యాయాన్ని శ్రీమహారాజు పఠించారు. ఈయన ఉఛ్ఛారణ స్వఛ్ఛంగా, గట్టిగా ఉంది. మరియు ఈయన పఠనంలో ఒక్కతప్పు కూడాలేదు. 

వశిష్ఠుడు స్వయంగా ఈపవిత్ర వేదపఠనం చేస్తున్నట్టు అనిపించింది. బ్రాహ్మణులు దిగ్ర్భాంతిచెంది తలలు ఎత్తడానికి కూడా సిగ్గుపడ్డారు. సూర్యుని ముందు క్రొవొత్తిలా అనిపించింది. శ్రీమహారాజును, బ్రాహ్మణులు ముందు ఒక పిచ్చివానిగా భావించారు, ఇప్పుడు తెలిసింది. ఆయన ఒక గొప్ప పండితుడని. 

శ్రీమహారాజు భగవంతుని అవతారమని, బ్రాహ్మణ కులస్తుడని, అన్నిటికి అతీతుడయిన ఒక గొప్ప యోగి అని, తమయొక్క పూర్వజన్మ కృతులవల్ల ఇటువంటి భగవంతుడి లాటి యోగి దర్శన భాగ్యంకలిగిందని వారికి అనిపించింది.

ఖాండుపాటిల్ను వీళ్ళకు ఒక్కొక్క రూపాయి ఇవ్వవలసిందిగా శ్రీమహారాజు కోరారు. బ్రాహ్మణులు దానిని స్వీకరించి సంతోషంగా వెళ్ళిపోయారు. శ్రీమహారాజు నిజమయిన యోగుల వలె, షేగాం వాసులతో ఎక్కువ సంబంధం ఇష్టపడేవారు కాదు.

షేగాంకు ఉత్తరంగా ఒకతోట ఉంది. అక్కడ పుష్కళంగా కాయగూరలు పండించబడుతూ ఉండేవి. ఆతోటలో ఒక వేపచెట్టు యొక్క చల్లని నీడలో ఒక శివమందిరం ఉండేది. కృష్ణాజిపాటిల్ దాని యజమాని. శ్రీమహారాజు అక్కడకు వెళ్ళి ఆ శివమందిరం దగ్గర ఒక చెట్టుచుట్టూ ఉన్న బండమీద కూర్చుని - నేను కొద్దిరోజులు శివుని దగ్గర ఉండేందుకు నీఈతోటకి వచ్చాను. 

దేవాది దేవుడయిన శివభగవానుడు ఈతోటలో ఉండడానికి ఇష్టపడ్డారు కనుక నేను కూడా ఆయన దగ్గర ఉండేందుకు కోరుకున్నాను. కనుక నాకొక చిన్నపందిరి నిలబెట్టమని కృష్ణాజితో అన్నారు. వెంటనే కృష్ణాజి ఒక చక్కని పందిరి నిలబెట్టించాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 39 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 4 🌻

They came to Shri Gajanan Maharaj with the hope of getting some money from Him. When they came, Shri Gajanan Maharaj was sleeping. The Brahmins started reciting Vedic hymns loudly to awaken Shri Gajanan Maharaj .

There was some mistake in their recitation, but they did not correct it, so Shri Gajanan Maharaj got up and said to them, Why have you become Vedic? You are lowering the greatness of Vedas unnecessarily. 

This knowledge is not for the purpose of running a business but for the salvation 0f human beings. At least show some respect to the saffron head dress, which indicates that you are a Vedic. I will now recite the hymns and you repeat the same as I pronounce. Do not misguide innocent poor believers. 

Saying so Shri Gajanan Maharaj recited the same chapter of Vedas that was recited incorrectly by these Brahmins; his pronunciation was clear, loud and his recitation, errorless. It appeared as if Vashistha himself was reciting the holy Vedas. 

The Brahmins were astonished and felt embarrassed to even lift their faces. The analogy can be compared to a lit candle fantasizing that it has better capacity to spread light around itself than the mighty sun. 

The Brahmins first thought that Shri Gajanan Maharaj was a mad person, but now found Him to be a learned saint. They were convinced that all the four Vedas were on the tip of His tongue. 

They took Shri Gajanan Maharaj a to be a God incarnate and a Brahmin by caste - a yogi free of any bondage or attachment, and because of their good deeds of previous life, they believed they were fortunate enough to get the Darshan of such a Godly saint.

Shri Gajanan Maharaj a asked Khandu Patil to give them a rupee each as dakshina. The Brahmins accepted this dakshina and happily went away. Shri Gajanan Maharaj , like a true saint, disliked the attachment of Shegaon’s locals. In the northern region of Shegaon there was a garden where vegetables were grown in abundance. 

Under the cool dark shade of a neem tree, there was a temple of Lord Shiva in the Garden. Krishnaji Patil owned the temple. Shri Gajanan Maharaj went there and sat on a platform under a tree near the Shiva temple and said to Krishnaji, I have come to your garden to stay here for a few days near Lord Shiva.

Lord Shiva is the God of all Gods and since He liked to stay in your garden, I too wish to be near Him. So erect a small shade for me here. Krishnaji thereupon got erected a tin shade on the platform.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

31.Aug.2020

------------------------------------ x ------------------------------------



🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 40 / Sri Gajanan Maharaj Life History - 40  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 5 🌻

శ్రీమహారాజు అక్కడ ఉండడంతో ఆతోట ఒక పుణ్యస్థలం అయింది. రాజు ఉన్నప్రదేశమే రాజధాని అయినట్టుగా అయింది. శ్రీమహారాజు అవసరాలు తీర్చడానికి భాస్కరు మరియు తుకారాం అక్కడే ఉన్నారు. 

కృష్ణాజి స్వయంగా, శ్రీమహారాజు భోజనం వగైరా విషయాలు చూస్తూ, శ్రీమహారాజు భుజించిన తరువాతనే తను తినేవాడు. ఆతోటలో ఉంటూ ఉండగా, ముందునుండి శ్రీమహారాజు గూర్చి విన్న 15/20 మంది ఆస్తికులు అక్కడికి వచ్చారు. పవిత్రమయిన గంగాజలంతో, తీర్ధయాత్రలలో వీళ్ళు రామేశ్వరం వెళుతున్నట్టు కృష్ణాజికి చెప్పారు. 

తాము శ్రీబ్రహ్మగిరి మహారాజు శిష్యులమని, ఆయనకూడా తమతో ఉన్నారని, ఆయనతో గంగోత్రి, జమునోత్రి, హింగళాజ్ , గిరినార్, డాకోరు వంటి అనేక పుణ్యక్షేత్రాలు నడకన దర్శించామని అంటారు. ఇంకా మాబ్రహ్మగిరి భగవత్ స్వరూపుడని, బహుశ మీ పూర్వజన్మ పుణ్యఫలంవల్ల మీదగ్గరకు వచ్చారని అంటారు. 

కావున మాకు షిరా, పూరీలు భుజింపచెయ్యి, మరియు పొగత్రాగేందుకు కొద్దిగా గంజాయి ఇవ్వు, మేము 3 రోజులు ఇక్కడ ఉంటాము, 4వ రోజున వెళ్ళిపోతాము, ఆపిచ్చి వాడికి ఆతిధ్యం ఇచ్చేబదులు మాకు సేవచేసే ఈ అవకాశాన్ని తీసుకుందుకు సంకోచించకు, లేకపోతే ఆవును వెళ్ళగొట్టి గాడిదను మేపినట్టు అవుతుంది. 

మేము అన్నీత్యజించిన పూర్తి వేదాలు తెలిసిన ఆస్తికులం, నీకు ఇష్టంఉంటే మా ప్రవచనాలువిను అని అన్నారు. ఈరోజుకు రొట్టె / శెనగపిండి కూరతినండి రేపు మీకు షిరా, పూరీలు తినిపిస్తాను, శివుడు స్వయానా శ్రీగజానన్ మహారాజు రూపంలో అక్కడ కూర్చుని ఉన్నారు కావున మీకు కావలసినంత గంజాయ త్రాగడానికి దొరుకుతుంది అని కృష్ణాజి అన్నాడు. 

మధ్యహ్నసమయంలో నూతిదగ్గర ఆఆస్తికులు రొట్టెలు శెనగపిండి కూర తిన్నారు. సాయంత్రం వారంతా శ్రీగజానన్ మహారాజు ముందు ఆ పందిరి క్రింద కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళ ముఖ్యుడు శ్రీబ్రహ్మగిరి గీతాధ్యయనం మొదలు పెట్టాడు. ఆస్తికులు మరి కొంతమంది ఊరిప్రజలు బ్రహ్మగిరి ప్రవచనం వింటున్నారు. ఇతను నైనంచిందంతి అన్న మొదటి శ్లోకంమీద ప్రవచించటం మొదలు పెట్టాడు. 

బ్రహ్మచారి ఒత్తి కపటయోగి, మరియు ఏవిధమయిన దైవిక జ్ఞానం లేనివాడు. కావున అక్కడ వింటున్న ప్రజలు, సహజంగా అతని ప్రవచనంతో సంతృప్తి పొందక ఈయన మాటలతో గారడి చేస్తున్నాడు అని అంటారు. అతని ప్రవచనం పూర్తిఅయిన తరువాత వారంతా శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వెళ్ళారు. 

అక్కడ మేము వేదాంతం విన్నాము కాని ఇక్కడ శ్రీమహారాజు రూపంలో నిజమయిన వేదాంతిని చూస్తున్నాం. అక్కడ చరిత్ర విన్నాం, ఇక్కడ చరిత్రకారుడిని చూస్తున్నాం అని అన్నారు. గంజాయి పొగ పీల్చుతున్న ఆస్తికులకు ఈమాటలు చికాకు కలిగించాయి. 

శ్రీమహారాజు ఒక మంచంమీద కూర్చుని ఉండగా, భాస్కరు ఆయనకు గంజాయి గొట్టం పొగ పీల్చడానికి ఇస్తూ ఉన్నాడు. ఒక నిప్పుతునక దానినుండి ఆమంచంమీద పడి, నెమ్మదిగా పొగరావడం మొదలయి, మరికొద్ది సేపటిలో మంచం మొత్తం మంటలతో నిండింది. భాస్కరు అది చూసి, ఆమంచం టేకుతోచేసింది, నీళ్ళుపోస్తే తప్ప మంటలు ఆపలేము అని శ్రీమహారాజును మంచం దిగిరమ్మని అన్నాడు. 

ఆ తరువాత మంటలు ఆపడానికి నీళ్ళు తేకండి. ఓబ్రహ్మచారి మాహారాజు వచ్చి ఈమంచంమీద నాతోకూర్చో. గీత ఆర్ధంతోసహా తెలిసినవాడవు నువ్వ, ఇప్పుడు దానిని పరీక్షించే సమయంవచ్చింది. మంటలు బ్రహ్మను మండించవని నిరూపించు. ఒక గంటసేపు నీవు నైనంచిందంతి పై ప్రవచనం ఇచ్చావు, కనుక నువ్వు ఈమండుతున్న మంచంమీద నాతో కూర్చోడానికి భయపడకూడదు, భాస్కర వెళ్ళి అతనిని మర్యాదతో నాతో ఇక్కడ కూర్చునేందుకు తీసుకురా అని శ్రీమహారాజు అన్నారు. 

మంచి దృఢమయిన శరీరంకల భాస్కరు, శ్రీమహారాజు యొక్క ఈఆదేశంతో శ్రీమహారాజు దగ్గరకు తీసుకు వెళ్ళడానికి బ్రహ్మగిరి చెయ్యపట్టుకున్నాడు. మంచం పూర్తిగా మంటలతో నిండి, అన్ని వైపులనుండి మంటలు పెద్దఎత్తున పైకి ఎగసి వస్తున్నాయి, కాని శ్రీమహారాజు ఒక్కింత ఇటు అటు కదలకుండా దృఢంగా దానిమీద కూర్చుని ఉన్నారు. కయాదు కుమారుడయిన శ్రీప్రహ్లాదుని ఈవిధంగా మంటలమధ్య నిలబెట్టినట్టు శ్రీవ్యాసుడు భాగవతంలో వ్రాసారు, 

అదేవిధమైన దృశ్యం శ్రీగజానన్ మహారాజు, కృష్ణాజిపాటిల్ తోటలో చూపించారు. శ్రీమహారాజు దగ్గరకు తీసుకు రావడానికి భాస్కరు, బ్రహ్మగిరి చెయ్యి పట్టుకున్నాడు. దయచేసి నన్ను ఆ మండుతున్న మంచం దగ్గరకు తీసుకుపోకు, శ్రీగజానన్ మహారాజు గొప్పతనం, అధికారం నేను గుర్తించలేదు అని అంగీకరిస్తున్నాను అని అతను, భాస్కరును ప్రాధేయపడ్డాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹  Sri Gajanan Maharaj Life History - 40  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 5 🌻

The Garden became a holy place due to the presence of Shri Gajanan Maharaj there. This is so because a place of the king's stay becomes the capital of the Kingdom. 

Bhaskar and Tukaram Kokatya stayed with Shri Gajanan Maharaj to render Him necessary service. Krishnaji used to attend personally to Shri Gajanan Maharaj ’s food and ate only after Maharaj had taken His meals. 

While Maharaj lived thus in Krishnaji’s garden, some 15 to 20 ascetics, who had heard about Shri Gajanan Maharaj, arrived there. They told Krishnaji Patil that they were on a pilgrimage and were on their way to Rameshwar with the holy water from the Ganga with them. 

They also said that they were the disciples of Shri Brahmagiri Maharaj, who was also with them, and with him they had visited, on foot, several holy places like Gangotri, Jamnotri, Hinglal and Girnar Dakur. 

They further said, Our Brahmagiri, who enslaved God Himself, has come to you probably due to the good deeds of your past life. So feed us ‘Shira Puri’ and give us some Ganja to smoke. 

We shall stay here for three days and leave on the fourth day. Do not hesitate to take this opportunity to serve us instead of this mad man whom you are feeding here. It is like kicking a cow and feeding a donkey. 

We are ascetics who know all the Vedas and have renounced everything. If you would like, come and listen to our discourse. Krishnaji said, I will entertain you with Shira Puri tomorrow. 

For today, please take these breads and besan. You will get a lot of Ganja to smoke as Shri Shiva Himself is sitting here in the form of Shri Gajanan Maharaj. In the noon time the ascetics took their meals of bread and besan near the well. 

In the evening they sat under the shade before Shri Gajanan Maharaj and their mahant, Shri Brahmagiri, started reading the Bhagwad Geeta. The ascetics and some people from town were listening to the discourse of Brahmagiri, who started to preach on the first stanza of Nainam Chindanti. 

The Bramhachari was a pure hypocrite with no personal spiritual attainment. The people, therefore, were naturally not impressed by his talk and said that he was only playing with words. 

When his discourse was over, all the people went to Shri Gajanan Maharaj for His Darshan. They said, We heard the philosophy over there, but see here in Shri Gajanan Maharaj the reality itself. There we heard the history and here is the Man himself. 

The ascetics who were smoking Ganja were irritated by these remarks. Shri Gajanan Maharaj , at that time, was sitting on a cot and Bhaskar was giving him a Ganja pipe to smoke. A spark from the pipe fell on the cot and slowly smoke started coming out of it; in a little while, the entire cot was in flames. 

Looking at the sight, Bhaskar requested Shri Gajanan Maharaj to leave the cot, saying that the cot was of teak wood and won't extinguish without water. Thereupon Shri Gajanan Maharaj said, Don't bring water to extinguish the fire. 

O Brahmachari Maharaj! Come and sit with me on this cot! You know the entire Geeta with its meaning; now the time has come to put your knowledge of Geeta to test. Prove that the element of fire does not burn a true Brahmin. 

You have just imparted a discourse on Nainam Chindanti for an hour, so you should not be afraid of sitting with me on this burning cot. Bhaskar, go and bring him with due respect to sit with me here.” Bhaskar was a well-built strong man and at the orders of Shri Gajanan Maharaj caught hold of Brahmagiri's hand to bring him to Shri Gajanan Maharaj . 

The entire cot was on fire and the flames were leaping up from all around it; however, Shri Gajanan Maharaj did not move a bit and was sitting firm on it. Shri Vyas has written in the Bhagwat that Shri Pralhad, son of Kayadhu, was made to stand in fire and in a way the same scene was relived by Shri Gajanan Maharaj in the garden of Krishnaji Patil. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

01 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 41 / Sri Gajanan Maharaj Life History - 41🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 8వ అధ్యాయము - 6 🌻

కాని భాస్కరు అది లక్ష్య పెట్టకుండా ఈడ్చి అతనిని శ్రీమహారాజు దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నైనందహతి పావకహః అని నిరూపించు అని శ్రీమహారాజు అన్నారు. దానికి బ్రహ్మగిరి భయపడి, నిజం చెప్పాలంటే, మంచి తిండికోసమే నేను ఆస్తికుడను అయ్యాను, కనుక నన్ను క్షమించు. 

నేను నిష్ఫలితంగా గీతను నేర్చుకుందుకు ప్రయత్నంచేస్తూ మిమ్మల్ని పిచ్చివాడని అన్నాను, కాని దీని కంతటకి నేను చింతిస్తూ మీకు లొంగిపోతున్నాను, దయచేసి క్షమించండి అని అన్నాడు. షేగాం ప్రజలు, ఆయనను ఆవిధంగా మంటలలో కాలిపోతారేమో అని భయపడి కాలుతున్న మంచంమీద నుండి దిగిరమ్మని అర్ధించారు. 

బ్రహ్మగిరి సిగ్గుతో తలవంచుకుని ఏమీ అనలేదు. ప్రజల మాటలు గౌరవిస్తూ శ్రీమహారాజు మంచం దిగి వస్తారు. వెంటనే ఆమండుతున్న మంచం కుప్పకూలిపోతోంది. మొత్తం మంచం అంతా కాలిపోయింది. కాని కొద్ది భాగం అయినా, మిగిలిన ప్రజలకు చూపించ వచ్చునని, నీళ్ళుపోసి ఆమంటలను ఆపుతారు. 

బ్రహ్మగిరి మొత్తం తన గర్వం వదలి శ్రీమహరాజు ముందు వంగి నమస్కరిస్తాడు. గంగనీళ్ళని తాకిన తరువాత పాపాలు మిగలడం అనేది జరగదు. తరువాత శ్రీమహారాజు అర్ధరాత్రి, ఈ కపటి తనం అంతా వదులు, ఆస్తికుడనేవాడు ఈ ప్రాపంచిక సుఖాలను పూర్తిగా త్యజించాలి. 

స్వయంగా బ్రహ్మజ్ఞానం పొందితేగాని ఇతరులకు భోధించరాదు. మాటల నిజమయిన అర్ధాన్ని తెలుసుకొని, పాటించకుండా, ఒత్తిగా మాటలు తెలుసుకోవడం వ్యర్ధం. మన సంస్కృతి కాపాడడానికి మనం నేర్చుకుంటున్న విషయాల వెనుక గూడార్ధం తెలుసుకోవడం అవసరం. మచ్ఛింద్ర, జలంధర్, ఘోరక్, గహిణినాధ్ మరియు జ్ఞాణేశ్వర్ వంటి యోగులు గొప్ప అధికారం కలిగినవారు. 

శ్రీశంకరాచార్య ఆత్మసిద్ధి పొందిన ఒక యోగి. సంసారిక జీవనం గడిపిన ఏకనాధ్ కూడా బ్రహ్మజ్ఞానం పొందారు. స్వామిసమర్ధ బ్రహ్మచారి కూడా ఆత్మసిద్ధి పొందారు. ఈగొప్ప యోగులను నీవు గుర్తు చేసుకుంటూ ఉండి, పనికిరాని, ఫలితంలేని ఈ పూరీలు షీరా కోసం తిరగడం మానాలి అని శ్రీమహారాజు అన్నారు. 

శాంతంగా ఇవి విన్న బ్రహ్మగిరి, నిజంగా ఈ ప్రాపంచిక అవసరాలు త్యజించాలి అని అనుకున్నాడు. మరి ఎవరిని కలవకుండా మరుసటి రోజు ఉదయాన్నే తన శిష్యులతో ఆచోటు వదిలి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఈ ప్రకరణ విన్న ప్రజలు ఆకాలిన మంచం చూసేందుకు తోటకు వచ్చారు. అందరిని ఈ ప్రాపంచిక బంధనాలనుండి ఈ గజానన్ విజయ గ్రంధం ముక్తులను చెయ్యాలని దాసగణు కోరిక. హరి మరియు హరకి నమస్కారములు. పవిత్రత అందరిలో రాగాక శుభం భవతు 

8. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 41 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 8 - part 6 🌻

When Bhaskar caught hold of Brahmagiri to take him to Maharaj, Brahmagiri started praying to Bhaskar to let him go by saying, Please do not take me to the burning cot. I accept that I failed to appreciate the authority and greatness of Shri Gajanan Maharaj. 

But Bhaskar, not paying any heed to Brahmagiri’s requests, dragged and brought him before Shri Gajanan Maharaj. Shri Gajanan Maharaj said Now prove that ‘Nainam Dahti Pawak’! 

At this, Brahmagiri got frightened and said, To tell Yout the truth, I became an ascetic to enjoy good food only, so excuse me. I fruitlessly tried to learn the Geeta and called you mad, but now I regret all this and surrender before you. 

Please forgive me. People of Shegaon begged Shri Gajanan Maharaj to leave the burning cot for their sake, as they were afraid to see Him engulfed in flames. Brahmagiri hung his head in shame and said nothing. 

Shri Gajanan Maharaj got down from the cot to respect the public sentiments and immediately thereafter the burning cot collapsed. Practically all of the cot was burnt, but people poured water and extinguished it, thereby salvaging a portion of it as evidence to demonstrate Maharaj’s greatness to other people. 

After this incidence, Brahmagiri shed away his entire ego and prostrated before Shri Gajanan Maharaj . The objects that Ganga water touches cannot remain impure. Then at midnight Shri Gajanan Maharaj advised Brahmagiri and said Leave all your hypocrisy; an ascetic has to denounce all worldly attachments. 

Without self-realization one should not preach anything to others. Learning of words without understanding or practicing the spirit behind is useless. To save our culture from destruction it is necessary to understand the spirit behind the things we learn. Saints like Macchindra, Jalander, Gorakh Gahaninath and Dnyaneshwar were of great authority. 

Shri Shankaracharya was a saint who had attained self-realization and Eknatha, though a man of family had attained Brahmapada. Swami Samarth Brahmachari too had attained selfrealization. 

You should remember all these great sages and stop wandering for Shira Puri, as it will be a useless and fruitless wandering.” Brahmagiri calmly listened to all this advice and felt real detachment for the material things. 

Early next morning he left the place along with his disciples without meeting anybody. Next day, when people heard of the happenings in the garden, they came to see the burnt cot. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Eight

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

02 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 42 / Sri Gajanan Maharaj Life History - 42  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 9వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓరుక్మిణివరా, చంద్రభాగనదీ తీరంవద్ద నివసించే ఓభగవంతుడా, మురళి చేతబట్టి, యోగులను దీవించేవాడా, పతితులను రక్షించి దీవంచే వాడవు నీవే. చిన్న వాళ్ళ అస్థిత్వం లేకపోతే గొప్పవాళ్ళ గొప్పతనం ఉండనే ఉండదు, మరియు పాపులు లేనిదే భగవంతునికి ప్రాధాన్యత దొరకదు. ఓభగవంతుడా మావంటి పాపుల కారణంగానే నీవు రక్షకుడవని పిలవబడుతున్నావని గుర్తుంచుకో. 

స్పర్శవేదమణికి గొప్పతనం, ఇనుమును తాకగానే బంగారంగా మార్చడంవల్ల లభించింది. ప్రతిచిన్న సెలయేరునుండి నీటిని తనలోకి రానిస్తుంది కావున గోదావరి పవిత్రనది అని పిలవబడింది. ఓమాధవా ఈవిషయం మీద ఆలోచించి ఈదాసగణును మునిగిపోకుండా కాపాడడానికి చేయూతను ఇమ్ము .

గోవిందబువా తకిళికర్ అనే పేరుగల ఒక కీర్తనకారుడు ఒకసారి షేగాంలో కీర్తన చేసేందుకు వచ్చాడు. షేగాంలో శివభగవానుని పురాతన దేవాలయం ఒకటి ఉంది. దానిని మాటే అనే ధనవంతుడు పునరుద్ధరణ చేయించాడు. ఈకాలంలో ధనవంతులకు మందిరాలయందు ఆసక్తిలేదు. ద్విచక్ర వాహనాలు, మోటరుకారులు ఇష్టపడుతున్నారు. 

మొటేషాహుకారు ఆవిధమయిన వ్యక్తికాదు. ధనవంతుడయినప్పటికీ, భగవంతుడంటే నమ్మకం కలవాడు. అందువల్ల ఆమందిరం మోటోగారి మందిరంగా పిలవబడింది. ఇక కధవినండి: గోవిందబువా తకిళికర్ పైన ఉదాహరించిన గుడిలో బసచేసి తన గుర్రాన్ని ముఖద్వారం ఎదురుగా కట్టాడు. దగ్గరకు ఎవరు వచ్చినా తన్నడం, కరవడం వంటి చెడు లక్షణాలు ఈగుర్రానికి ఉన్నాయి. ఇది తరచు తాళ్ళుతెంచుకుని, ఒకచోట స్థిరంగా ఉండక, ఒక్కొక్క సారి అయితే అడవులలోకి పారిపోయేది. రాత్రి పగలు తింటూ చాలా చెడ్డ అలవాట్లు నేర్చుకుంది. 

గోవిందబువా దీనికోసం ప్రత్యేకంగా ఒక ఇనుప గొలుసు తయారు చేయించాడు కాని, దురదృష్టవశాత్తు ఈసారి షేగాం వచ్చినప్పుడు తేవడం మరచిపోయాడు. ఈగుర్రాన్ని ఏదో ఒక విధంగా తాడుతో కట్టి తను గుడిలో పడుకున్నాడు. అది అర్ధరాత్రి సమయం, ప్రతీది చిక్కటి అంధకారంలో మునిగి ఉన్నాయి. రాత్రి తిరిగే పక్షులు తమ ఆహారం కోసం వెతుకుతూ భయానక ధ్వనులు చేస్తున్నాయి. అన్నిఇళ్ళ తలుపులు మూసిఉండి, చుట్టుప్రక్కలంతా నిశ్శబ్దంగా ఉంది. 

ఆ సమయంలో శ్రీగజానన్ ఆగుర్రం కట్టి ఉన్న స్థలానికి వచ్చారు. చెడ్డవారిని ఉద్ధరించడానికే, యోగులను జన్మించడం భగవంతుని ఉద్దేశ్యం. ఔషదం జబ్బును నయంచేసినట్టు, యోగులు బ్రష్టుల క్రూరత్వం తొలిగించేందుకు సహాయ పడతారు. కావున ఆరోజు రాత్రి, శ్రీగజానన్ మహారాజు ఆ గుర్రం దగ్గరకివచ్చి దాని నాలుగు కాళ్ళ మధ్యలో హాయిగా పడుకున్నారు. ఆయన తను సాధారణంగా వర్ణించే మంత్రం గణ గణ గణాత బోతె వర్ణించుకుంటున్నారు. దీని అర్ధం ఎవరికీ తెలియదు. 

ఈ భజనకి నా అనువాదం ఏమంటే గణి అంటే లెక్క. ప్రతివారి ఆత్మ, గణ అంటే భక్తుడు, ఎవరూ బ్రహ్మనుండి వేరుకారు అని సూచించడానికి గణత్ అనే పదం వాడబడింది. బోతే అనేది బహుశ భేట్ కు బదులుగా యాశగా వాడబడింది. అర్ధం ఏమంటే ప్రతి ఆత్మ స్వయాన బ్రహ్మయే కాని దానినుండి వేరుకాదు అని. ఈ భజన గూర్చి రెండు విధాలయిన కధనాలు ఉన్నాయి, కాని మనకు వాటి గురించి చింతించనవసరం లేదు ఎందుకంటే మనకు కావలసింది ఆ కధ గురించే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 42 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 9 - part 1 🌻

Shri Ganeshayanamah! O Rukmini's consort! O You, who lives on the bank of Chandrabhaga, adores flute and blesses saints! You are the saviour of the fallen and the giver of blessings. 

Greatness of the great cannot exist without the presence of small ones, and God cannot get his importance without the existence of sinners. Oh God! Please remember that because of us, the sinners, you are called the savior. 

A paras has importance because its touch turns iron into gold. Godavari is called a holy river because it accepts water from small brooks. Oh, Madhava think over this and give a helping hand to this Dasganu to save him from drowning. 

One Kirtankar named Govindbua Taklikar once came to Shegaon to perform kirtan. There was an ancient temple of God Shiva at Shegaon and it was renovated by a rich man named Mote. Nowadays the rich are not very fond of spending money over buildings or renovating religious institutions like temples, instead they like investing their money on motors, cars and cycles. 

Mote Saokar was not that kind of a person. Though rich, he was a believer in God, and that was why he got the temple renovated. So the temple was called Mote's temple. Now listen to the story. Govindbua Taklikar camped in the above mentioned Mote's temple and had tied his horse in front of the main door. 

The horse had very bad habits like kicking anybody coming near it, and of biting. It frequently snapped the ropes holding it, never stayed steady and at times used to run away in the jungles. Day and night it used to neigh, creating a lot of noise. Govindbua had gotten an iron chain prepared for it, but had forgotten to bring the same with him during his trip to Shegaon. 

The horse was some how tied with a rope while Govindbua slept in the temple monitoring the horse at all times. It was past midnight and everything, had drowned in pitch darkness. Night birds, creating fearful sounds, were searching for their feed. All the doors in the villages were closed and there was a fearful dead silence all around. Nobody was seen on the roads. 

At that time Shri Gajanan came to the place where the horse was tied. Saints' birth on this earth is ordained by Gods to improve the bad people, and as medicine cures disease, the saints help remove the wickedness from the disillusioned people. 

So Shri Gajanan Maharaj, on that particular night, came to the horse and happily slept under its four legs. He was reciting His usual Mantra, Gana Gan Ganat Bote, the meaning of which nobody knew. 

My interpretation of this symbolic Bhajan is as follows - Gani means count, Individual soul, (Gana) means devotee, who is not different from Brahma and to suggest it the word Ganat is used. 

Bote appears to be the corrupt form of Bate meaning individual soul in Brahma Himself and not anything different from it. There are two versions of this Bhajan, but we need not bother about it, as we are concerned about the story at this moment. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

04.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 43 / Sri Gajanan Maharaj Life History - 43  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 9వ అధ్యాయము - 2 🌻

ఆ విధంగా శ్రీమహారాజు ఆ గుర్రం నాలుగు కాళ్ళ మధ్య పడుకుని పైన చెప్పిన మంత్రం భజన చేస్తున్నారు. ఆ గుర్రం భజన అనే గొలుసుతో కట్టినట్టు స్థిరంగా నిలబడి ఉంది. గోవిందబువా ఈ గుర్రం వల్ల ఎప్పటికి భయపడుతున్న వాడవడం వల్ల, మాటిమాటికి లేచి చూస్తూండేవాడు. ఆ గుర్రం స్థిరంగా నిలబడి ఉండడం చూసి అతను ఆశ్ఛర్యపోయాడు. ఇది బహుశ ఏదయినా అనారోగ్యం వల్లనే అని అనుకున్నాడు. ఇది చాలా అసహజమైన విషయం, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ ఇది ఇలా శాంతంగా లేదు. 

కావున ఆదుర్దతో అతను ఆగుర్రం దగ్గరకి వెళ్ళాడు. అక్కడ దాని కడుపుక్రింద ఎవరో పడుకుని ఉండడం చూసి దిగ్ర్భాంతి చెందాడు. అతను పరిశీలనగా క్రింద చూసేసరికి, శ్రీగజానన్ మహారాజు నిద్రపోతూ అతనికి కనిపించారు. ఆ గుర్రం ఎందువల్ల అలా నిశ్శబ్దంగా నిలబడి ఉందో, ఇప్పుడు అతనికి అర్ధం అయింది. 

ఏవిధంగా అయితే సుగంధం చెడువాసనను దూరంచేస్తుందో, శ్రీమహారాజు వల్ల ఈ గుర్రం నిశ్శబ్ధంగా ఉంది. గోవిందబువ, తనతల శ్రీమహారాజు కాళ్ళమీద పెట్టి, నమస్కరించి ఓ మహారాజు మీరు నిజంగా అన్ని విఘ్నానులు తొలిగించే గజాననుడవు. ఇది నేను ఈరోజుచూసాను, అనుభవించాను. నా ఈ గుర్రం చాలా పెంకిది అవడంతో అందరూ దీనికి భయపడుతూ ఉంటారు. అందువల్ల మీరు దీని ఈ పెంకితనాన్ని పారద్రోలడానికి వచ్చారు. 

దీనికి నడుస్తూ అకస్మాత్తుగా మధ్యలో ఎగరడం, తన్నడం వంటి చెడు అలవాటు ఉంది. నేను దీనితో విసిగిపోయి అమ్మడానికి కూడా చూసాను, కాని ఎవరూ దీనిని కొనడానికి తయారు కాలేదు. ఉత్తినే తీసుకుందుకు కూడా ఎవరూ తయారు కాలేదు. ఈ జంతువును శాంతపరచి, నన్ను అనుగ్రహించారు. చాలా మంచిది. నావంటి బోధకుడి గుర్రం సౌమ్యంగా ఉండాలి. ఆవులకాపరి ఇంట్లో పులి హానికరం, అని అన్నాడు. ఆవిధంగా, ఆకస్మికంగా గుర్రం సౌమ్యంగా అయింది. 

దీనితో శ్రీమహారాజు, జంతువులను కూడా చెడ్డదారులనుండి రక్షించ గలిగే తన శక్తిని తెలియపరిచారు. అప్పుడు ఆ గుర్రంతో ఓ స్నేహితుడా ! ఇకనుండి పెంకిగా ఉండకు, చెడు అలవాట్లన్నీ ఇక్కడ వదిలివేయి. నువ్వు శివుడి ముందు నిలబడ్డావు కావున నంది లాగ ప్రవర్తించాలని గుర్తుంచుకో. ఇకమీదట ఎవరికీ ఇబ్బంది కలిగించకు అని ఆయన అన్నారు. జంతువు నడవడికను స్వాధీనపరిచిన శ్రీగజానన్, ఆవిధంగా అంటూ వెళ్ళిపోయారు. 

మరుసటి రోజు, శ్రీమహారాజు తోటలో ఉండగా, గోవిందబువ తన గుర్రం మీద సవారి చేస్తూ అక్కడికి వస్తాడు. గోవిందబువ గుర్రం గూర్చి షేగాం ప్రజలందరికీ బాగా తెలిసి అది అంటే భయపడే వారు. అది వస్తూ ఉండడం చూసి, గోవిందబువా ఈ ఇబ్బందిని నువ్వు, కూడాఎందుకు తెచ్చావు ? ఈగుర్రం ఇక్కడ ఉన్న స్త్రీలకు, పిల్లలకు హానికలిగిస్తుంది, అని ఒకళ్ళు అన్నారు. శ్రీమహారాజు దీనిని గతరాత్రి శాంతపరిచారు, ఇది దీని చెడు అలవాట్లన్నీ వదిలి వేసింది. ఎవరు ఇకమీదట దీనివల్ల భయపడ నవసరంలేదు అని గోవిందబువా అన్నాడు. 

ఆ గుర్రాన్ని ఒక చెట్టు క్రింద వదిలివేసారు. అది ఒకగంట వరకు ఏతాడు, గొలుసు లేకపోయినా అలాగే నిలబడి ఉంది. చుట్టుప్రక్కల చాలా గడ్డి, కాయగూరలు ఉన్నా వేటినీ అది ముట్టలేదు. యోగులు ఎంత శక్తి వంతులో చూడండి, జంతువుల నడవడిని స్వాధీనం చేసి చెడు అలవాట్లను కూడా మాన్పించారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  Sri Gajanan Maharaj Life History - 43  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 9 - part 2 🌻

So Shri Gajanan Maharaj slept under the four legs of the horse and was reciting the above mentioned Bhajan. The horse stood still as if restrained by the means of the chain of this Bhajan. 

Govindbua was anxious about his violent horse and so frequently used to get up to see whether the horse was properly restrained and not creating any havoc in the neighborhood. When he saw that his horse was standing still, he was surprised and feared that his horse might have inflicted some sort of an illness. 

The horse’s silence was quite unusual as it had never been silent like this before. So, anxiously, he went to the horse and was astonished to see that somebody was sleeping under its stomach. When he carefully looked down, he found that Shri Gajanan Maharaj was sleeping there. 

It dawned on him that it was due to Shri Gajanan Maharaj ’s presence that the horse kept quiet. Just like the fragrance of Musk driving away the bad smell, the divine power emanating from Maharaj drove away all the sins surrounding the horse. 

Govindbua prostrated before Maharaj, placed his forehead on Maharaj’s feet and said, O Maharaj, you are really Gajanan, who clears all the obstructions. I have seen and experienced this today. My horse, being very wicked, caused all the people a lot of worry and anxiety, and so You have come to drive away its wickedness. It had possessed several bad habits like jumping and kicking while someone was riding it. I was fed up with it and had offered to sell it, but nobody wanted it, not even for free. It is reallygood that you have obliged me by calming down this animal. 

Horse owned by a preacher like me should be a gentle one, since it is the sole means of transportation for us. A Tiger is harmful in the house of a cowherd. Thus the horse suddenly became gentle and thereby Shri Gajanan Maharaj manifested His power to save even the animal life from straying away to the wrong path. 

Then He said to the Horse O friend, don't be naughty hereafter and quit all your bad habits from this moment on. Remember that you are standing here before Shiva and so should behave like a bull. Do not trouble anybody henceforth. Saying so, Shri Gajanan, who controlled the behaviour of an animal, went away.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

05.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 44 / Sri Gajanan Maharaj Life History - 44🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 9వ అధ్యాయము - 3 🌻

శ్రీమహారాజును శ్రుతిస్తూ, ప్రపంచంలో ఎవరూ మీప్రవర్తన అర్ధంచేసుకోలేరు, మీ ఆశీర్వచనాలు ఎటువంటి దుష్టుడినయినా సరిచేస్తాయి. నాఉద్ధారకుడిగా, కృపయా నాతలపై మీచేతులు ఉంచండి అని అంటూ, గోవిందబువా తన గుర్రంమీద తకిళి వెళ్ళిపోయాడు. తమకోరికలు నెరవేరాలి అనే కోరికతో, ప్రతిరోజు ప్రజలు షేగాం వస్తూ ఉండేవారు.

అటువంటి వారిలో ఒక ఇద్దరు బాలాపూరు నుండి వచ్చారు. వీళ్ళు తమ ముందు ప్రయాణంలో, తమకోరిక నెరవేరేందుకు శ్రీమహారాజుకు గంజాయి తెచ్చి ఇస్తామని మొక్కు కుంటారు. శ్రీమహారాజు మిఠాయిల కంటే గంజాయ అంటే ఎక్కువ ఇష్టపడతారని వీళ్ళు అనుకున్నారు. మరుసటి సారి షేగాం వచ్చినప్పుడు గంజాయ తేవడం మరచిపోయారు. వీళ్ళు దీనికి సిగ్గుపడి, మరుసటి సారి వచ్చినప్పుడు రెండింతలు గంజాయ తెస్తామని అనుకొని, మరల వచ్చినప్పుడు తిరిగి మరచి పోయారు. 

వీళ్ళని చూసి, మనుష్యులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడు, ఒకపని చేస్తాం అని మొక్కుకుని మర్చిపోతారు. వీళ్ళు బ్రాహ్మణ కులస్తులు, కాని బ్రాహ్మణులు ఎవరికయినా ఏదయినా చెప్పేముందు, తామే ఆచరణలో పెట్టాలి అని వీళ్ళకి తెలియదు. అందుకే ఈజాతి ఆధిక్యత కోల్పోయింది. 

ఏదయినా మొక్కుకుని మరిచిపోతే, మరి వారి కోరిక ఎలా పూర్తి అవుతుందనుకుంటున్నారు ? ప్రతివాళ్ళు తమ మాటమీద ఉండాలి, అప్పుడే భగవంతుని ఆశీర్వాదం లభిస్తుంది అని శ్రీమహారాజు భాస్కరుతో అన్నారు. ఈమాటలు వారిని నొప్పించాయి.

శ్రీమహారాజుకు తమ మనస్సులో విషయం అంతా తెలుసని, వారిద్దరు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఈవిధంగా శ్రీమహారాజుకు తమ మనస్సులోని ప్రతివిషయం తెలిసి, తరువాత ఆమొక్కు తీర్చడంలో విఫలం అయినందున వాళ్ళు వెంటనే బజారునుండి గంజాయ తెచ్చేందుకు లేచారు. అప్పుడు ఒలికిపోయిన పాల గురించి ఇప్పుడు విచారిస్తారెందుకు ? నాకు గంజాయ అంటే ఏమీ వెర్రికోరిక లేదు, కావున మీరు ఇప్పుడు బజారు వెళ్ళకండి. 

భగవంతుని ఆశీర్వాదం పొందడానికి తాము చేసిన మొక్కులు, ఒప్పందాలు నిలబెట్టు కోవాలని మాత్రమే గుర్తుంచుకోండి. అబద్ధాలు చెప్పేవాళ్ళకు ఇది ప్రాప్తంకాదు. మీరు ఇక ఇప్పుడు వెళ్ళి, మీకోరిక ఫలించిన తరువాతనే గంజాయ తెండి. అది వచ్చే వారం ఫలిస్తుంది. 

కాని ఏశివుని వల్ల అయితే కుబేరుడు ధనవంతుడయ్యాడో ఆయన దర్శనానికి, ఐదుసార్లు ఇక్కడకు రావాలని గుర్తుంచుకోండి. వెళ్ళి ఆయనకు నమస్కరించి, ఈసారి వచ్చినప్పుడు గంజాయ తేవడం మరువకండి. మనిషి అన్నవాడు భగవంతునికి, యోగులకు అనుకున్న మొక్కును నిరాదరించరాదు అని శ్రీమహారాజు అన్నారు. అదేవిధంగా వాళ్ళు భగవాన్ శివుని ముందు నమస్కరించి బాలాపూరు తిరిగి వచ్చారు. 

మరుసటి వారం, తమ కోరిక ఫలించిన తరువాత మాటప్రకారం గంజాయ సమర్పించేందుకు షేగాం వస్తారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 44    🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 9 - part 3 🌻

The next day, while Shri Gajanan Maharaj was in the garden, Govindbua came there riding his horse. All the people of Shegaon knew the misbehaving horse of Govindbua very well and feared it greatly. 

When they saw it coming one of them said, Govindbua, why have you brought this trouble with you? This horse will harm the ladies and children here. Thereupon Govindbua said that Shri Gajanan Maharaj had made the horse sober last night and forced it to abandon all its bad habits and that there was no need for anyone to fear it anymore. The horse was allowed to stand unrestrained under a tree and it stood there for an hour in a well behaved manner. 

There was lot of vegetables and grass around the horse but he did not touch them at all. See, how powerful are the saints, who can control the mannerisms of even the animals and change their habits.

In praise of Shri Gajanan Maharaj , Govindbua chanted as follows, “Nobody in the world is able to understand your actions.Your Blessings can bring around any villain. 

Please place your hand on my head as my benefactor.” So praising Him, Govindbua left for Takli on his horse. Every day people used to come to Shegaon with the intentions of fulfilling their desires. 

Among them were two persons from Balapur, who, on their way, vowed to offer Ganja to Shri Gajanan Maharaj , the next time they visited Shegaon, in exchange for the completion of their desires. They believed that Shri Gajanan Maharaj liked Ganja more than sweets. The next time they visited Shegaon, however, they forgot to bring the Ganja along with them. 

They felt shy and vowed to bring twice the quantity the next time they visited Shegaon. The next time they, they again forgot to bring Ganja with them. 

Referring to them Shri Gajanan Maharaj said to Bhaskar, Look at the way people behave these days. They vow to do something enthusiastically and then forget all about it. 

They are Brahmins by caste and yet do not know the fact that Brahmins are expected to practise as they preach. That is why this caste has lost its superiority. When they vow something and forget about fulfilling it, how can they expect to get their desires fulfilled? 

Bhaskar, one should adhere to what he speaks or vows in order to get the blessings of God. These words hurt the two Brahmins very much and they looked at each other in surprise to realize that Maharaj knew everything that was in their mind. 

When they saw that Shri Gajanan Maharaj knew everything about their vow and subsequently having failed to fulfil it, they were guilt struck and immediately got up to go to the market to shop for Ganja and thereby bring the Ganja to Maharaj right away to correct their mistakes. 

Thereupon Shri Gajanan Maharaj said, Why are you now crying over the spilt milk? I do no craze for Ganja; so don't go to the market now. Only remember the lesson that one should keep up his vows and promises made before God or saints in order to deserve God's blessings, as liars don't get them. 

Now you go, and bring Ganja only after the fulfilment of your desires. It will be fulfilled by next week. But remember to come here five times for the Darshan of Shri Shiva, by whose blessings Kubera became rich. Go, prostrate before Him and do not forget to bring Ganja next time you visit Shegaon.

One should not violate the vows made to Gods and saints. They accordingly bowed before Lord Shiva and returned to Balapur. Next week, after the fulfilment of their wishes, they came to Shegaon to offer Ganja as per their vow. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


06.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 45 / Sri Gajanan Maharaj Life History - 45   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 9వ అధ్యాయము - 4 🌻

బాలాపూరుదే మరోకధ వినండి: బాలాపూరువాసి అయిన బాలకృష్ణ శ్రీరామదాసుస్వామి యొక్క గొప్ప భక్తుడు. ఇతని భార్య పుతలాబాయి కూడా సరిసమానమైన పతివ్రత. వీరిద్దరు ప్రతిఏటా నడకన సజ్జనఘడు దర్శించేవారు. వీళ్ళప్రయాణం పుష్యమాసంలో తమసామాను మోసేందుకు ఒకగుర్రంతో ప్రారంభంఅయేది. మరియు మూడు వస్తువులు, ఒక కట్టమంచం, ఒక చిన్నకర్ర మరియు పవిత్రగ్రంధం దాస్బోధ వీళ్ళతో ఉండేవి. ఇతని పవిత్రత ఏవిధమయిన అహంకారంలేనిది. 

వీళ్ళు దారిలో గ్రామంలో తమకు లభించే భిక్ష స్వీకరిస్తూ, అది తినేముందు శ్రీరామునికి సమర్పించేవారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ నవమి రోజున తన భార్యతో ఈయన బాలాపూరునుండి రవాణ అయ్యేవారు. దారిలో వీరు రామనామం విడవకుండా అంటూ ఉండేవారు. పెదవులపై ఈనిర్విరామ రామనామంతో, వీళ్ళు షేగాం, ఖాంగాం, మెహకర్, దెవుల్గాం, రాజా మరియు శ్రీఆనందస్వామి గ్రామం అయిన జాలనా మీదుగా ప్రయాణించేవారు. 

జాలనా నుండి శ్రీరామదాసుస్వామి జన్మస్థలమయిన జాంబు వెళ్ళి అక్కడ మూడురోజులు ఉండేవేరు. అక్కడ నుండి వారు దివారు, భీడ్, మెహర్, భళేశ్వర్ మరియు శ్రీరామదాసుస్వామి ప్రముఖ శిష్యుడు కళ్యాణ్ స్థలమయిన డోంగాం వెళ్ళేవారు. 

తరువాత నరశింగపూర్, ఫండరుపూరు, నాటే పోటే సింగణాపూరు, సతారా మీదుగా సజ్జనఘడు మాఘ బహుళ నవమి ఉత్సవాలలో పాల్గొందుకు మాఘ బహుళపాడ్యమికి చేరేవారు.

శ్రీరామదాసుగారికి కానుకగా అతను తన శక్తికొలది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించేవాడు. ఇతను నిజమయిన రామదాసి. ఈకాలంలో ఇటువంటివారిని చూడడం కష్టం. దాసునవమి ఉత్సవాలు అయిన తరువాత వెళ్ళిన దారినే తిరిగి వచ్చేవారు. అతని వయస్సు 60 సం. అయ్యేవరకు ఇలా ఏళ్ళతరబడి ఈపధ్ధతి జరిగింది. 

ఈసారి తిరుగు ప్రయాణం అయ్యేముందు శ్రీరామదాసుస్వామి సమాధి దగ్గర కళ్ళనీళ్ళతో కూర్చుని ఓ సర్వశక్తివంతమయిన రామదాసుస్వామి ఓగురువరా, మార్గదర్శకా, నేను ముసలివాడిని అయ్యాను, అందువల్ల ఇకముందు ఇంతదూరం కాలినడకన రావడం సంభవం కాదు. వాహనంమీద ప్రయాణించి రావడం కూడా కష్టం అయ్యేలా కనిపిస్తోంది. ఇంతవరకు నేను ప్రతి సంవత్సరం రావడం అనే ప్రక్రియ చేయగలిగాను కాని ఇకముందు ఇది సంభవం కాదని పిస్తోంది.

ఏవిధ మయిన పుణ్యకార్యంగాని, భగవకార్యంకాని వారానుసారంగా చెయ్యడానికి ఆరోగ్యం అవసరం అని మీకుతెలుసు అని ప్రార్ధిస్తూ బాలకృష్ణ నిద్రపోయాడు. అతనికి కలలో నిరాశచెందకు, నువ్వు ఇకనుండి సజ్జనుఘడు రానవసరంలేదు, నీభక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే వచ్చే ఏడాది నవమి ఉత్సవాలు నీఇంట్లోనే జరిపించు. అప్పుడు నేను నీదగ్గరకు వస్తాను. ఇది నావాగ్దానం. నవమి ఉత్సవాలకి ఖర్చు నీ పరిధిలోనే ఉండాలి అని తనతో శ్రీరామదాసస్వామి అన్నట్టు బాలకృష్ణ చూసాడు. 

బాలకృష్ణ ఈకలకు చాలాసంతోషించాడు. తన భార్యతో తిరిగి బాలాపూరు వచ్చాడు. ఇక మరుసటి సంవత్సరం బాలాపూరులో ఏమి జరిగిందో వినండి. మాఘబహుళ పాడ్యమినాడు బాలకృష్ణ రామదాసు నవమి ఉత్సవాలు ప్రారంభించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 45   🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 9 - part 4 🌻

Now listen to another story from Balapur. Balkrishana of Balapur was a great devotee of Shri Ramdas Swami. His wife Putalabai was an equally pious lady, and she, with her husband, used to visit Sajjangad every year on foot. 

Their journey started in the month of Poush with a horse to carry their luggage. They carried three things with them - A kubadi, a small dari and the sacred book of Dasbodh. His piety was free from any form of ego. They accepted alms for food from the villages on way and offered the same food to Shri Ram before eating it. Every year they used to leave Balapur on the 9th Vadya of 'Poush' month. 

On the way, they continuously chanted the name of Rama and thus with the chant of Shri Ram Nama emanating from their lips they travelled via Shegaon, Khamgaon, Mehkar, Deulgaon Raja and Jalna, where they paid respects to Shri Anand Swami. 

Then from Jalna they went to Jamb, the birthplace of Shri Ramdas Swami, where they used to stay for three days. From there, they went to Divara, Bid, Mohari, Beleshwar and Domgaon, the place of Kalyan, the arch devotee of Shri Ramdas Swami. 

Thereafter to Narsingpur, Pandharpur, Nate Pote Shingnapur, Wai and Satara; thus they used to reach Sajjangad on the 1st Vadya of Magh month to attend the celebrations of Navami (Magh).

As an offering to Shri Ramdas Swami, Balkrishana used to feed the Brahmins to the best extent possible for him. He was a real Ramdasi; it is really difficult to find any Ramdasi like him nowadays. After the celebrations of Ram Navami he used to return the same way he followed while going there. 

This routine of his continued till he became 60 years old. On the eve of starting his return journey, he sat near the Samadhi of Shri Ramdas Swami with tears in his eyes; with extreme grief said, O all powerful Ramdas Swami! 

O my teacher and guide! I have become old now and as such it will not be possible for me to come here all the way hereafter on foot. Even journeying here by a vehicle appears difficult for me. I could follow this routine of an annual visit so far, but it may not be possible hereafter. You know that to follow any sacred or devotional routine, good health is required of the follower.” 

Praying thus, Balkrishna went to sleep. In the dream he saw Shri Ramdas Swami saying to him, Don't despair. You need not come to Sajjangad hereafter. I am very much pleased by your devotion and so wish you to celebrate Navami at your home next year. I will come to you at that time. This is my promise. Expenditure for the celebration of Navami should be within your means.” Balkrishna was very happy about the dream. 

He returned to Balapur with his wife. Now listen to what happened next year at Balapur. Balkrishna started the celebration of Ramdas Navami on the first day of Magh Vadya at Balapur.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

07.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 46 / Sri Gajanan Maharaj Life History - 46  🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 9వ అధ్యాయము - 5 🌻

ప్రతిరోజు కార్యక్రమంగా, పగలు దాస్బోధ పఠనం, రాత్రికీర్తనలు, మధ్యాహ్నం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి సాయంత్రం హారతి ఇచ్చేవారు. కాని బాలకృష్ణమాత్రం ఎల్లప్పుడు రామదాసుస్వామి తన వాగ్దానం ప్రకారం రావడంకోసం ఉత్సుకతతో వేచిచూస్తున్నాడు. 

గ్రామప్రజలు ఈ ఉత్సవాలకు బాలకృష్ణ అర్ధించగా విరాళాలు ఇచ్చారు. ఈవిధంగా ఉత్సవాలు 9 రోజులు బాలాపూరులో జరిగాయి. తొమ్మిదవరోజున ఒక ఆశ్చర్యం జరిగింది. ఆరోజు మధ్యాహ్నం బాలకృష్ణ మిగిలిన వారితో శ్రీరామునికి పూజచేస్తూండగా ద్వారందగ్గర శ్రీగజానన్ ప్రత్యక్షం అవుతారు. శ్రీమహారాజుకు స్వాగతం చెప్పేందుకు ద్వారందగ్గర ఉన్నవారు బాలకృష్ణను పిలుస్తారు. 

శ్రీగజానన్ మహారాజును చూసినందుకు అతను సంతోషించాడు. కానీ అదేసమయంలో అతను శ్రీరామదాసుస్వామి తన వాగ్దానం ప్రకారం తన ఇంటికి రావడం కొరకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాడు. అతని మాటలు వ్యర్ధంకావని ఇతనికి విశ్వాసం. 

శ్రీగజానన్ మహారాజు దాస్బోధ నుండి శ్లోకాలు చదవడం మొదలు పెట్టారు. ఆ పంక్తులు విని బాలకృష్ణ ఉరుకుతూ ద్వారం దగ్గరకు వచ్చి ఆజాను బాహువు, శరీరంపై ఏమి వస్త్రాలులేని శ్రీగజానన్ మహారాజును చూస్తాడు. అతని ముందు వంగి నమస్కరించి పైకి చూసేసరికి శ్రీగజానన్ స్థానంలో శ్రీరామదాసుస్వామిని చూసాడు. 

తన ఉద్ధారకుడు తన వాగ్దానం నిలబెట్టు కున్నందుకు బాలకృష్ణ ప్రేమతో, ఆత్మీయతలో తన్మయం అయ్యాడు. మరియు అతని కళ్ళు అమిత ఆనందంవల్ల ఆనంద భాష్పాలతో నిండాయి. క్షణంతరువాత మరల అతనికి శ్రీరామదాసు స్థానంలో శ్రీగజానన్ మహారాజు కనిపించేసరికి, శ్రీరామదాసు అదృశ్యం అవడం కారణంగా అతను నిరాశచెందాడు. 

మరల శ్రీస్వామీజీ, శ్రీగజానన్ స్థానంలో కనిపించారు. ఇలా ఒకసారి తరువాత ఒకసారి శ్రీరామదాసుస్వామి మరియు శ్రీగజానన్ మహారాజు సినిమాలో బొమ్మల్లాగా కనిపించారు. అతనికి ఈవిచిత్రం అర్ధంకాక విచలితుడయ్యాడు. అలా విచలితుడవుకాకు అని మహారాజు అన్నారు. నేనే నీ రామదాసుస్వామిని. 

ఇదివరకు సజ్జనఘడులో ఉండేవాడిని, ఇప్పుడు షేగాంలో ఉద్యానవనంలో ఉంటున్నాను. గత సంవత్సరం నీకు సజ్జనఘడులో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను నీదగ్గరకు వచ్చాను. నేనే రామదాసును, ఏవిధంగా శంకించకు. ఆత్మను మాత్రమే తెలుసుకో, కానీ దాని మీదఉన్న బాహ్యశరీరాన్ని మర్చిపో. 

గీతలో ఏమి చెప్పారో గుర్తు తెచ్చుకో. ఇకరా నాకొక పీట కూర్చుందుకు ఇయ్యి అని శ్రీమహారాజు అన్నారు. శ్రీగజానన్ మహారాజు, అతని చెయ్యి పట్టుకుని, అతనితో ఇంటిలో ప్రవేశించి, ఒక పీటమీద కూర్చున్నారు. ఈయోగి వచ్చిన వార్త బాలాపూరులో వ్యాపించి ప్రజలు ఆయన దర్శనం కోసం రావడం ప్రారంభించారు. బాలకృష్ణ శ్రీమహారాజును పూజించాడు, కానీ ఆరోజంతా శ్రీమహారాజు అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రి శ్రీరామదాసు కలలో కనిపించి, శ్రీగజానన్ మహారాజు నా అవతారమే, కనుక దీనిగురించి ఏవిధమయిన శంక ఉంచకు, లేదా అది నీ అధోగతికి దారి తీస్తుంది. ఆయనకు చేసిన పూజలు నాకు చేసినట్టే అని అన్నారు. 

ఆ కల చూసిన పిదప, బాలకృష్ణ అతి మర్యాదతో శ్రీమహారాజుకు నమస్కరించి, నాకలలో కనిపించి నా శంకలన్నీ తీసి వేసారు. నేను ఇప్పుడు ఈ ఉత్సవాలతో పూర్తిగా సంతృప్తి చెందాను, మరియు నేను మీకు చాలాకృతజ్ఞుడను. మీరు దయచేసి మరి కొద్దిరోజులు నాతోఉండి నాకు ఉపకారం చెయ్యండి అని అన్నాడు. 

దానికి మరి కొన్ని రోజుల తరువాత మరల వస్తానని వాగ్దానం చేసి శ్రీమహారాజు వెళ్ళిపోయారు. ఆయన దారిలో ఎవరూ చూడకుండా క్షణంలో షేగాం చేరిపోయారు. ఈ గజానన్ విజయయ గ్రంధం భక్తులకు సంతోషాలు తెచ్చుగాక. ఇదే దాసగణు కోరిక. అందరికి శుభం కలుగుగాక. 

శుభం భవతు 

9. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Gajanan Maharaj Life History - 46   🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 9 - part 5 🌻

The daily routine was the reading of the Dasbodh during the day, and the performing of the Kirtan at night. At noon he offered food to the Brahmins and performed Arati in the evening. But all the while Balkrishna was eagerly waiting to see Shri Swami come and visit him as per His promise. 

The villagers contributed money for this celebration upon the request of Balkrishana, and thus the ‘Utsava’ continued for nine days at Balapur. On the 9th day there was a surprise. 

At noon on that day Shri Gajanan Maharaj appeared at the door of Balkrishna Bua’s house when he, along with other people, was offering worship to Shri Ram. People at the door called Shri Balkrishna so that he could properly receive Shri Gajanan Maharaj .

He said that he was very happy to know about the arrival of Shri Gajanan Maharaj, but at the same time was eagerly waiting for Shri Ramdas Swami to come to his house as per His promise. 

He was certain that the Swamiji’s words would not go waste. At that moment, Shri Gajanan Maharaj started reciting shlokas from the Dasbodh. Upon hearing those lines, Balkrishna rushed to the door and saw Shri Gajanan Maharaj with his long arms and usual self, without any clothes adorning the body. 

He prostrated before Shri Gajanan Maharaj and when he looked up he saw Shri Ramdas Swami in place of Shri Gajanan Maharaj. Balkrishna Bua was overwhelmed with the love and affection for his benefactor for keeping up the promise, and his eyes were full of tears due to the extreme happiness. 

Moments later, Swamiji appeared to him to be Shri Gajanan Maharaj and as he was disappointed at the disappearance of Shri Ramdas, again Shri Swamiji appeared in place of Shri Gajanan Maharaj. 

Thus alternately Ramdas Swami and Gajanan Maharaj would appear before him like images in a cinema. He was confused and could not understand this mystery. 

Then Maharaj said, Don't get confused, I am your Ramdas Swami. In the past I was staying at Sajjangad and now I reside in the garden at Shegaon. As per my promise given to you last year at Sajjangad, I have come to you. Do not have any doubts, I am Ramdas. 

Know the Atman only and forget its covering of a body. Remember what is said in the Geeta. Come on now and offer me a paat to sit on. 

Shri Gajanan Maharaj gotahold of Balakrishna’s hand, entered his house and sat on a paat. The news of the Saint's arrival spread in Balapur and people started coming to get His glimpse. 

Balkrishna worshipped Shri Gajanan Maharaj , but the whole day was thinking about what Shri Gajanan Maharaj had said. At night Shri Ramdas appeared in his dream and said, Shri Gajanan Maharaj is My incarnation, and so do not have any doubt about it. 

Otherwise it will entail your downfall. Your worship to Him is the same as worship to Me. On seeing the dream, Balkrishna most respectfully prostrated before Shri Gajanan Maharaj and said, You have removed all my doubts by appearing in my dream. I am now fully satisfied with the celebrations of Navami, and feel very much grateful to You. 

Now please do me a favor by staying with me for a few days. Thereupon Shri Gajanan Maharaj promised to come again after some days and went away. He reached Shegaon in a moment and was not seen by anybody on the way. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Nine 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

08.Sep.2020

------------------------------------ x ------------------------------------



🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 47 / Sri Gajanan Maharaj Life History - 47   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 10వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమహః ! ఓపండరపూరి పూర్ణబ్రహ్మా, పవిత్రులకు మీరు ఛాయవంటివారు. కృపయా మీపాదాల దగ్గరనుండి నన్ను దూరంగా పంపకండి. ఓ నారాయణా ఈదాసగణును త్యజించవద్దు లేదా నాపాపాలగూర్చి తలవవద్దు. నాఖాతాలో పుణ్యం అనేది లేదని, నేను మీదగ్గరకు రాతగనని నాకు తెలుసు. అలా అయినప్పటికి, పవిత్ర గోదావరి చిన్నచిన్న ప్రవాహాలను తనలోకి రానిచ్చినట్టు, నన్ను స్వీకరించి, కనికరించండి. ఈవిధంగా కృపయా నన్ను పాపాలనుండి, దుఖంనుండి కాపాడండి. మీరు అత్యంత శక్తి స్వరూపులు, మీరు కోరుకుంటే ఏపని అయినా చేయగలరు. భిక్షగాడు కూడా మీఆశీర్వాదాలతో ధనవంతుడు అవుతాడు. 

శ్రీగజానన్ మహారాజు ఒకసారి అమరావతి వెళ్ళి, శ్రీఆత్మారాం భికాజి ఇంటిలో బసచేసారు. కాయస్థప్రభు కులానికి చెందిన ఈ ఆత్మారాం అమరావతిలో ఒకపెద్ద అధికారి. ఇతను మంచి నడవడిక, పవిత్రత కలిగి యోగులను బాగా ఆదరించేవాడు. శ్రీమహారాజు ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆత్మారాం ఆయనను పూర్తిభక్తితో, శ్రద్ధతో ఆరాధించాడు. ఈయనకు వేడినీళ్ళ స్నానం చేయించి, గంధపులేపనం శరీరానికి రాసారు. ఉమెరేడు తయారీ అయిన ఒక పట్టుపంచ ఇచ్చి నుదిటిపై కేశరి తిలకం పెడతారు. 

తరువాత శ్రీమహారాజుకు హారం వేసి అనేకమైన మిఠాయిలు తినడానికి అందచేసాడు. దీని వెనుక దక్షిణగా వంద రూపాయలు హారతి, మంచి సుగంధమయిన అగరవత్తులు ఇచ్చి, తలపైన పువ్వులు ఉంచాడు. ఆత్మారాం అత్యంత ప్రేమతోను, భక్తితోను ఇవి అన్నీ చేసాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు, ఆత్మారాం దగ్గరకు శ్రీమహారాజు దర్శనానికి వచ్చారు. 

ప్రతివారు శ్రీమహారాజును తమ ఇంటికి పూజించడం కోసం తీసుకు వెళ్ళాలని కోరుకున్నారు. అలా అనేకమంది అనుకున్నా, కొంతమందే ఆ భాగ్యం పొందారు, ఎందుకంటే ఇటువంటి యోగుల పవిత్ర పాదశ్పర్శ ఇంటికి అంటాలంటే చాలాపుణ్యం కలిగి ఉండాలి. ఎవరయితే ఈవిధమయిన పుణ్యం కలిగి ఉన్నారో వారిఇళ్ళకు శ్రీమహారాజు వెళ్ళారు. 

యోగులు తమ దివ్యశక్తి వల్ల అన్ని విషయాలు అర్ధం చేసుకుంటారు. అమరావతిలో దాదాసాహెబు అనబడే గణేశ్ శ్రీకృష్ణ ఖాపరడే అనే పేరుగల ఒకమంచి ప్లీడరు. ఇతను పవిత్రమయిన శుక్ల యజుర్వేద బ్రాహ్మణుడు. ఈయన అర్ధించిన మీదట శ్రీమహారాజు ఈయన దగ్గరకు వెళ్ళి ఈయన పూజలు స్వీకరించారు. గణేశప్ప ఆలింగయాతవాణి అనబడే ఒకతను ఉండేవాడు. చంద్రాబాయి అతని భార్య. ఈయోగిని ఏవిధంగా అయినా సరే తమ ఇంటికి తీసుకు వెళ్ళాలని, శ్రీమహారాజును ఆవిధంగా అర్జించమని ఆమె తనభర్తతో అంది. 

మన మనస్సు పవిత్రమయింది. అయితే మనఇంటికి శ్రీమహారాజు తప్పక విచ్చేస్తారు అని ఆమె అంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ తన భక్తులకు సహాయంచేస్తూ ఉంటారు. ఈవిధంగా ఆలోచించడం ఆమె మూర్ఖత్వం అనీ, ఎందుకంటే యోగుల రాకకోసం, పేరు గడించిన వ్యక్తుల సిఫారసు పత్రం కావలసి ఉంటుంది అనీ గణేశప్ప అంటాడు. 

ఇతను ఇంకా ఈయోగిని తమ ఇంటికి తీసుకు వెళ్ళడంకోసం శ్రీఖపారడే పడిన కష్టాలు ఆమెకు గుర్తుచేస్తూ, ఈవిషయంపై ఇక ఎప్పటికి బలవంతం చెయ్యవద్దని అన్నాడు. మీతోనేను అంగీకరించను. ఆయన మన ఇంటికి వస్తారని నామనసు చెపుతోంది, పేదవాళ్ళంటే యోగులకు ప్రత్యేకమయిన అభిమానం ఉంటుంది, కనుక వెళ్ళి ఆయనను మనవద్దకు రమ్మని అర్ధించు అని ఆమెఅంది. 

అప్ప శ్రీమహారాజుతో మాట్లాడడానికి సాహసించలేక పోయాడు. కానీ శ్రీమహారాజుకు వారి మనసులో ఉన్న విషయం తెలుసు కావున, నేను మీఇంటికి రావాలనుకుంటున్నాను, ఇక్కడనుండి ఎంతదూరమో నాకు చెప్పండి. మీమనసు నాముందు విప్పడానికి సంకోచించకూడదు, అని శ్రీమహారాజు అన్నారు. 

ఇదివిన్న గణేశప్ప ఆనందానికి అవధులులేవు. శ్రీమహారాజును తమఇంటికి తీసుకు వెళ్ళి శ్రద్ధగా పూజించాడు. తమ వస్తుసామాగ్రి అంతా శ్రీమహారాజు పాదాలకు అర్పిస్తాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 47   🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 10 - part 1 🌻

Shri Ganeshayanamah! O Poorna Brahma of Pandharpur! You are a shelter for pious people. Please do not send me away from Your feet. O Narayana, do not disown this Dasganu nor think of my sins. I know that there is no Punya to my credit and as such I don’t deserve to come to you. Inspite of this, please accept and oblige me like that holy Godavari does to the small nalas entering her. Please do so and save me from all grief and sins. You are all powerful and if You wish, can do anything. Even a pauper becomes rich by Your blessings. 

Once Shri Gajanan Maharaj went to Amravati and stayed with Shri Atmaram Bhikaji. This Atmaram, Kayastha Prabhu by caste, was a big officer at Amravati. He was a well behaved, pious man who loved and respected saints very much. 

Shri Gajanan Maharaj went to him and Shri Atmaram worshipped him with full faith and devotion. He bathed Him with hot water, applied Chandan paste to His body, offered Him a silk bordered Dhoti of Umred and applied Keshari Tilak on His forehead. 

Then he garlanded Shri Gajanan Maharaj , gave an offering of many sweet dishes and a Dakshina of one hundred rupees, followed by an Aarti, which was scented by Agarbathis and placed flowers on His head. Atmaram did all this with great love and devotion. People of Amravati came in great numbers to get a glimpse of Shri Gajanan Maharaj . 

Everybody wished to take Shri Gajanan Maharaj to his house for worship. Though many desired so, only a few could get the favor of doing so, as it requires a lot of Punya to one’s credit to feel the presence of the holy feet of the saint in their house. 

Whosoever had that Punya to their credit, Shri Gajanan Maharaj went to their houses. The saints understand everything by their divine power. There was one leading pleader at Amravati by the name of Ganesh Shri Krishna Khaparde alias Dadasaheb. 

He was a pious Shukla Yajurvedi Brahmin, at whose request Shri Gajanan Maharaj went to him and accepted his worship. There was one Ganeshappa, a Lingayat Wani who had a devoted wife by name Chandrabhai. She said to her husband that the saint must somehow be taken to their house and asked him to request Shri Gajanan Maharaj accordingly. 

She said, “If our minds are pious then our house will be graced by Shri Gajanan Maharaj as God always helps his devotees.” Ganeshappa said that it was foolish on her part to think so, as it requires a lot of recommendation from influential people to arrange the saint’s visit. 

He further reminded her of the troubles Shri Khaparde had to face in order to invite the saint to his house and in view of that wished her not to press the matter any more. But Chandrabai said, “I don’t agree with you. 

My mind says that he will come to our house. You know that saints have special affection for the poor. So just request him to come to us.” Inspite of her constant urging, Ganesappa could not gather enough courage to invite Shri Gajanan Maharaj to his house. 

But Shri Gajanan Maharaj read their minds and eventually said, “I wish to come to your house. Tell me how far it is from here. You should not hesitate to open your mind before me.” Hearing this Ganeshappa’s happiness knew no bounds. He took Shri Gajanan Maharaj to his house and reverently worshipped him.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

09.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 48 / Sri Gajanan Maharaj Life History - 48 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 10వ అధ్యాయము - 2 🌻

ఈవిధమయిన చాలాపూజలు శ్రీమహారాజుకు అమరావతిలో ఇవ్వబడ్డాయి, మరియు ఇటువంటి ప్రతిచోటా ఒక సజ్జనుడు ఉపస్తితుడు అయ్యాడు. 

ఇతను శ్రీఆత్మారాం భిఖాజి మేనల్లుడు మరియు ముంబయి పోస్టాఫీసులో టెలిగ్రాఫిస్టుగా పనిచేసేవాడు. ఇతనిపేరు బాలాభవ్. శలవుమీద తన మేనమామను చూసేందుకు వచ్చాడు. ఇతను శ్రీమహారాజుతో గొప్ప సంబంధం ఉన్న అనుభూతి పొందుతూ, ఈయనను విడిచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇతను సంసారిక జీవితాన్ని త్యజించడానికి ఆలోచించడం మొదలు పెట్టాడు, ఎందుకంటే అది ఉత్తి మిధ్య అని. ఈవిధమయిన ఆలోచనే ఇతన్ని శ్రీమహారాజుతో ఉండడానికి ప్రోత్సహించింది. 

అమృతం తిరస్కరించి విషం ఎవరు తీసుకుంటారు అని ఇతను అలోచించాడు. అందుకే ఇతను అమరావతిలో ఆయన ప్రతిపూజకు హాజరు అయ్యాడు తప్ప మరెవేరే ఏకారణంలేదు. శ్రీమహారాజు కొద్దిరోజుల తరువాత షేగాం తిరిగి వచ్చి, ఉద్యానవనానికి కాకుండా సరాసరి మోటే మందిరానికి వెళ్ళారు.

ఈమందిరానికి తూర్పుగా ఒక ఖాళీస్థలం ఉంది. శ్రీమహారాజు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. శ్రీమహారాజు ఈవిధంగా తిరిగివచ్చి తన ఉద్యానవనంలో ఉండేచోటు త్యజించారని కృష్ణాపాటిల్ కు వార్త అందుతుంది. అందుకోసం అతను పరుగునవచ్చి పాదాలకు నమస్కరించి, తలవంచుకుని ఆయన ముందు కూర్చున్నాడు. కళ్ళ నీళ్ళు రావడం మొదలయి ఛాతీమీద బట్టలు తడిసాయి. ఎందుకు ఏడుస్తునావు ? ఏమిటి దుఖం ? నాతో వెంటనే చెప్పు అని శ్రీమహారాజు అన్నారు. 

చేతులు కట్టుకుని, పాటిల్ ఆయనను ఈవిధంగా ఉద్యానవనం విడిచిరావడానికి కారణం అడిగి, నేను చేసిన క్షమించరాని అపరాధం ఏమిటి ? ఓజ్ఞానీ నేను మీపిల్ల వాడిని, కారణం చెప్పండి. మీరు ఇప్పుడు కూర్చున్న స్థలం ఒక మాలిది, అతను దేష్ముఖ్ల సంబంధి. కృపయా ఇక్కడ ఉండకండి. ఇష్టమయితే మా ఇంటికిరండి, నేను మీకోసం ఖాళీచేసి ఇస్తాను. మిమ్మల్ని పొందడానికి ప్రతిదాన్ని పరిత్యగిండానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు.

ఈవిషయం పాటిల్ సోదరులందరికి తెలిసి వాళ్ళుకూడా అందరూ శ్రీమహారాజుతో వాళ్ళలో ఎవరితో నయినా ఉండమని అర్ధిస్తారు. ఈస్థలానికి నేను రావడం మీమేలుకోరే. ఈ సంగతి మీకు తరువాత తెలుస్తుంది. కనుక ఇప్పుడు ఇంక ఏవిషయం అడగకండి. పాటిల్ మరియు దేషముళ్ల మధ్య ఉన్న తగాదా శాంతియుతంగా కుదురుతుంది అనినేను హామీ ఇస్తున్నాను. అధికారులందరికీ వాళ్ళు చేస్తున్న పనివల్ల కలిగే ఫలితాన్ని ముందునుండి చూసే శక్తి లేకపోవడం అనే సమస్య ఉంది. 

ఇప్పుడు వెళ్ళి బనకటలాల్ను తీసుకురండి. నేను అతని ఇల్లు విడిచినప్పుడు అతను కోపగించుకోలేదు. వెళ్ళి మీరు దానికి కారణం అతనిని అడగండి, నా ఆశీర్వచనాలు ఎప్పుడూ మీతో ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి అని శ్రీమహాజారజు అన్నారు. 

ఆయన కోరికకు వ్యతిరేకంగా దయచేసి ఆయనను ఆ ఉద్యానవనానికి తీసుకు వెళ్ళవద్దు. నాఇంటినుండి ఆయన వెళ్ళనప్పుడు నేను ఏవిధమయిన అభ్యంతరం చెయ్యలేదని గుర్తుంచుకోండి. మనం అందరం ఆయన సంతానమే, ఆయన ప్రేమకూడా మన అందరిమీద సమానంగా ఉంది. 

సుఖరాం ఆసోల్కరు ఉదార హృదయుడు కనుక అతను ఈస్థలం శ్రీమహారాజుకు ఇవ్వడానికి సంకోచించడు అనినేను అనుకుంటున్నాను. అతను స్థలం ఇచ్చాక తదుపరి కార్యక్రమానికి మనం అందరం ఒకళ్ళం కావచ్చు అని బనకటలాల్ వచ్చి అన్నాడు. ఆవిధంగా ఒప్పందం అయి అక్కడ శ్రీమహారాజు కొరకు పరశురాం సావ్జి, కృషితో ఒక మఠం నిర్మించడం అయింది. 

శ్రీమహారాజు మరియు ఆయన ఐదుగురు అత్యంత భక్తులు ఆయన దగ్గర ఉన్నారు. భాస్కరు, బాలాభవ్, పీతాంబరు, అమరావతి నివాసి గణేశ మరియు రామచంద్ర గురావు. వీరు ఐదుగురు పంచపాండవులుగా మరియు శ్రీమహారాజు వాళ్ళ మధ్య శ్రీహరిలాగా ఉన్నారు. 

బాలాభవ్ ప్రాపంచిక జీవితాన్ని త్యజించి తన ఉద్యోగం అసలు లెఖ చెయ్యటంలేదు. అతనికి తరచుగా వెనక్కి రమ్మని ఉత్తరాలు వస్తున్నా వ్యర్ధం అయ్యాయి. గురుదేవా ఈబాలాభవ్ ఇక్కడ చాలా పాలకోవాలు దొరుకుతాయని మనల్ని వదలటలేదు. మీనుంచి నమ్మకంగా దెబ్బలు తగిలితేతప్ప ఇతను మనల్ని వదలడని నేను అనుకుంటున్నాను. కోతులను కర్రలతోనే లొంగదీయగలం, పర్వతాలు పెద్దపెద్ద పిడుగులతోనే లొంగుతాయి, అని భాస్కరు అన్నాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 48    🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 10 - part 2 🌻

Appa offered all his belongings at the feet of Shri Gajanan Maharaj . Many such Pujas were offered to Shri Gajanan Maharaj at Amravati and for every such puja one particular gentleman was present. 

He was a nephew of Shri Atmaram Bhikaji and a telegraphist in a post office at Bombay. His name was Balabhau and he had come to Amravati on a leave from his job, to see his maternal uncle. 

He felt great attachment to Shri Gajanan Maharaj because of that did not wish to leave Him. He started thinking that it is better to renounce the family life as it was purely transient. This thinking made him desire to stay with Shri Gajanan Maharaj . 

He thought, “Who will reject the nectar and take to poison?” That is why he attended all the Pujas at Amravati with no other reason behind it. After some days Shri Gajanan Maharaj returned to Shegaon and went straight to Mote’s temple instead of the garden where he formerly stayed. 

To the east of this temple there was a vacant plot of land. Shri Gajanan Maharaj went and sat there. Krishna Patil got the news of the arrival of Shri Gajanan Maharaj and also of His having abandoned the former place in His garden. 

So he came rushing to Shri Gajanan Maharaj , prostrated at His feet and sat with bowed head before Him. Tears started coming from his eyes and the clothes on his chest got wet. Shri Gajanan Maharaj said, “Why are you weeping? What is the grief? Tell me immediately.” 

Patil, with folded hands asked Him the reason for leaving the garden and said, “What is that unpardonable offence committed by me? O learned one! I am your child, tell me the reason; this land where You are sitting belongs to one Mali and he is of the Deshmukh group. 

Please do not stay here. If You like, come to my house, which I will vacate it for You. Let me tell You that I can sacrifice everything to get You.” All Patil brothers knew about this and they too came to request Shri Gajanan Maharaj to stay with any of them. 

Shri Gajanan Maharaj said, “My coming to this place for stay is in your own interest, and you will realize it later on. So don’t ask Me any questions now. I assure you that the dispute between you two (Patil and Deshmukh) will be settled amicably. 

All the executive officers in the world have one defect in them, and that is, they fail to foresee the consequences of their actions. Go and ask Bankatlal. He was not angry at my leaving his house. You go and ask him why he was comfortable about the fact that I left his home. 

My Blessings are always with you and will always be so in the future. Later Bankatlal arrived at the scene and said, “Please don’t take Him back to the garden against His wish; remember that I did nothing to obstruct Him when He left my house. We are all His children and His love is the same for each and every one of us.

Sakharam Asolkar is generous at heart and, I think, he will not hesitate to give this land to Shri Gajanan Maharaj . Once he gives the land, our future planning will enable all of us to come together.” 

Thus there was compromise and a Matth was built for Shri Gajanan Maharaj , with great efforts by Parashram Saoji. Shri Gajanan Maharaj had five deeply devoted devotees with him: Bhaskar, Balabhau, Pitambar, Ganesh Appa of Amravati and Ramchandra Guravu.

They were like five Pandavas and Shri Gajanan Maharaj was Shri Hari amongst them. Balabhau felt completely detached from the worldly life and cared least about being late to report for his job. 

He frequently received letters from his work asking him to return immediately, but he paid no head to them. 

Bhaskar finally had a talk with Maharaj and said to him, “Gurudeo, this Balabhau is not leaving us simply because he gets a lot of Pedhas (Sweets) to eat here. 

I am afraid that he will leave this place only when he receives a good beating at your hands. Monkey’s are tames with a stick and big mountains are afraid of thunderbolts.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

10.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 49 / Sri Gajanan Maharaj Life History - 49 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 10వ అధ్యాయము - 3 🌻

ఒకసారి బాలాభవోను అతని కోరికకు వ్యతిరేకంగా బయటకు పంపుతారు, కానీ అతను ఉద్యోగంనుండి రాజీనామాచేసి వెనక్కి వస్తాడు, అప్పుడు సిగ్గులేని ఎద్దు మాటిమాటికీ పచ్చికమైదానాలవైపు వెళ్ళినట్టు, ఎందుకు నువ్వు మాటిమాటికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతావు. జీవితంలో అన్నీ త్యజించినవాళ్ళు మాత్రమే ఇక్కడకు రావాలి అని భాస్కరు అతనితో అన్నాడు. ఈవిధంగా భాస్కరు వెటకారంగా మాట్లాడడం శ్రీమహారాజుకు నచ్చలేదు. అందుకని అతని తెలివితక్కువ తనం తొలగించడానికి శ్రీమహారాజు ఇలాచేసారు: 

అక్కడ కూర్చున్న ఒక సత్పురుషుని చేతిలో ఒక పెద్ద గొడుగు ఉంది. శ్రీమహారాజు ఆగొడుగు తీసుకొని అదివిరిగే వరకు బాలభవను కొట్టడం మొదలు పెట్టారు. ఆతరువాత ఒకబెత్తం తీసుకొని కొట్టడం కొనసాగించారు. చుట్టు ప్రక్కలవాళ్ళు భయపడి పరిగెత్తడం మొదలు పెట్టారు, కానీ బాలాభవ్ స్థిరంగా శ్రీమహారాజు ముందు పడిఉన్నాడు. ఆదెబ్బలకి అతను చనిపోయి ఉంటాడని చాలామంది అనుకున్నారు. 

భాస్కరు కూడా జరుగుతున్న దానికి చింతించడం మొదలు పెట్టాడు కానీ శ్రీమహారాజుతో ఏమీ అనడానికి సాహసించలేక పోయాడు. ఆబెత్తం కూడా ఆదయాహీనమైన దెబ్బలకి విరిగిపోయింది. అప్పుడు శ్రీమహారాజు కుమ్మరి మట్టిని కుమ్మినట్టు కాళ్ళతో కుమ్మడం మొదలు పెట్టారు. 

ఇదిఇలా అవుతూ ఉండగా కొంతమంది శిష్యులు, శ్రీమహారాజు అధికంగా ప్రేమించే భక్తులను పిలవడానికి వెళ్ళారు. బనకటలాల్ మరియు కృష్ణాజి పరుగున అక్కడికి వచ్చారు కానీ శ్రీమహారాజు చేస్తున్నదానిని నిరోధించడానికి వాళ్ళుకూడా సాహసించ లేకపాయారు. చిట్టచివరికి, చాలాజంకుతూ బాలాభవోను కొట్టడం ఆపండి, అతనుకూడా మీ భక్తుడే అని శ్రీమహారాజుతో బనకటలాల్ అన్నాడు. 

దానికి శ్రీమహారాజు నవ్వి, నువ్వు అసందర్భంగా మాట్లాడుతున్నావు. నేను బాలాభవోను కొట్టనూలేదు, కుమ్మనూలేదు. స్వయంగా నీవే అతని శరీరం పరిశీలించు. ఓప్రియమైన బాలాభద్ లేచి నీశరీరం వీళ్ళకి చూపించు అని అన్నారు. దానికి బాలాభద్ లేచాడు. అక్కడి ప్రజలు అతని శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఒక్క దెబ్బగుర్తు కూడా కనబడలేదు. అతను ఎప్పటిలాగా హుషారుగా, సంతోషంగా ఉన్నాడు. ఈ సంఘటనతో భాస్కరుకు బాలాభవ్ యొక్క అధికారం, గొప్పతనం శ్రీమహారాజు చూపించారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Gajanan Maharaj Life History - 49  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 10 - part 3 🌻

Once Balabhau was driven out against his wish, but he returned back to Maharaj having resigned from his service. At that time Bhaskar said to him in an agitated tone, “Why are you troubling us by frequently visiting this place like a shameless bullock who keeps returning to the green pastures? Only those who have renounced everything in life can rightly visit this place so frequently.” 

Shri Gajanan Maharaj did not like this egotistic talk of Bhaskar and so decided to remove his ignorance by doing the following: There was a big umbrella in the hands of a gentleman sitting nearby. 

Shri Gajanan Maharaj got a hold of that umbrella and beat Balabhau with it till it broke. He continued the beating by the means of a cane. The people who were around got scared and some of them even ran away, but Balabhau was lying still before Shri Gajanan Maharaj . 

Many thought that he must have died owing to such a beating and even Bhaskar now got worried about what was happening, but he did not dare to say anything to Shri Gajanan Maharaj . That cane also broke by the merciless beating. 

Then Maharaj started trampling Balabhau with both His feet like a potter trampling the mud. While this was going on, some of the disciples went to call the devotees whom Shri Gajanan Maharaj loved the most. Bankatlal and Krishnaji came running to the temple, but they too could not dare restrict Shri Gajanan Maharaj from what he was doing. 

At last Bankatlal, most hesitantly, requested Shri Gajanan Maharaj to stop beating Balabhau, saying that he too was His devotee. At that Shri Gajanan Maharaj laughed and said, “You are speaking something irrelevant; I have not beaten nor trampled Balabhau. 

You can see for yourself and examine his body. O My dear Balabhau, get up and show your body to these people!” Balabhau got up and people examined his body carefully. There was no trace of beating on it. He was as happy as ever. With this incident Shri Gajanan Maharaj proved the authority and greatness of Balabhau’s devotion.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

11.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 50 / Sri Gajanan Maharaj Life History - 50 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 10వ అధ్యాయము - 4 🌻

అప్పటినుండి భాస్కరు అతనితో మంచిగా ప్రవర్తించాడు. ఆమ్లపరీక్ష తరువాతనే బంగారం గుర్తించ బడుతుంది. బాలాపూరులో శుఖలాల్ అగర్వాలు అనే ఒకవ్యక్తి ఉండేవాడు.

అతనికి ఒక పెంకి ఆవు ఉండేది. అది ఊళ్ళో విచ్చలవిడిగా తిరుగుతూ, కొమ్ములతో ప్రజలను గాయపరచేది. ఏ దుకాణం లోకయినా వెళ్ళి కడుపు నిండా ధాన్యంతిని మిగిలినవి తోసి రోడ్డుమీద పోసేది. అది నూనె, నెయ్యి డబ్బాలను తన్ని అందులోని పదార్ధాలు బయట రోడ్డుమీద పడేలా చేసేది. ఒక వేళ ఇంటి దగ్గర కట్టి ఉంచితే, తాళ్ళులాగేసి గొలుసులు తెంచేసేది. అది పులి మాదిరి ప్రవర్తించేది. 

బాలాపూరు ప్రజలు దాని ఆకతాయితనంతో విసిగు చెందారు. అది గర్భిణీ కావడంలేదు. ఇంటిలో ఉండటంలేదు. చాలామంది దానిని కసాయికి ఇచ్చేయమని లేదా తుపాకితో కాల్చమని శుఖలాల్ కు సలహాఇచ్చారు. ఏమి చెయ్యగలిగితే అది చెయ్యడానికి వాళ్ళకు అతను అనుమతి ఇచ్చాడు. ఒక ముస్లిం ఒకసారి దానిని తుపాకితో చంపడానికి ప్రయత్నిస్తే, ఎలాగో దానికి తెలిసి అతనిని ఎదుర్కుని కొమ్ములతో విసిరి పడేసింది. 

అప్పుడు శుఖలాల్ దానిని తీసుకు వెళ్ళి వేరేగ్రామంలో వదలి వస్తే అదితిరిగి బాలాపూరు వచ్చేసింది. గోవిందబువా గురాన్ని శ్రీమహారాజు శాంతపరచిన విషయం ఒకరికి గుర్తువచ్చి ఈఆవును కూడా, షేగాం తీసుకువెళ్ళి శ్రీమహారాజుకు కానుకగా ఇచ్చి దీని బాధనుండి విముక్తి పొందడం మరియు యోగికి గోదానం చేసిన పుణ్యం దక్కించుకోడం వంటి రెండు పనులు పొందవచ్చని శుఖలాలకు సలహా ఇస్తాడు. 

ఈసలహా అందరికి నచ్చింది కానీ ప్రతిసారి దాన్ని పట్టుకోడానికి ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. అప్పుడు పెద్ద పచ్చగడ్డి గుట్టలాపోసి, దూదిగింజలు ఖాళీ స్థలంలో పోసి పెట్టారు. అవి తినడానికి ఆఆవు రాగానే 10/15 మంది చుట్టుముట్టి తాళ్ళతో బంధించారు. ఆతరువాత దాన్ని మోసి ఒక ఎడ్లబండి మీద ఇనుప గొలుసులతో కట్టి శ్రీమహారాజుకు ఇచ్చేందుకు షేగాం తీసుకు వచ్చారు. 

షేగాం దగ్గరపడుతూండగానే దానిలో మార్పువస్తున్నట్టు కనిపించడం మొదలయింది. శ్రీమహారాజు ముందుకు తెచ్చేసరికి అతి అమాయకంగా కనిపించింది. కళ్ళనీళ్ళతో అది శ్రీమహారాజును చూసింది. అప్పుడు ..... ఒక అమాయకమైన ఆవును ఈవిధంగా కట్టి హింసించడం మీమూర్ఖత్వం. దాని మెడ, కొమ్ములు మరియు కాళ్ళు తాళ్ళతో గొలుసులతో బంధించారు. 

అటువంటి బందోబస్తు ఒకపులి కొరకు అయితే సరిగానీ, ఇటువంటి అమాయక మయిన ఆవుకు తగదు, ఓమూర్ఖుడా, ఇది ఒకఆవు, అందరికీ తల్లివంటిది అని నీకు తెలిసి ఉండాలి. ఈవిధంగా కట్టి నువ్వు పాపం చేసావు. వెంటనే దాన్ని వదలండి, ఎవ్వరినీ అది ఇబ్బంది పెట్టదు అని శ్రీమహారాజు అన్నారు. 

అటువంటి ఆశ్వాసన తరువాత కూడా ఎవరూ దానిని ముట్టుకుందుకు సాహసించలేదు. శ్రీమహారాజు అప్పుడు స్వయంగా తన పవిత్రహస్తాలతో ఆతాళ్ళను, గొలోసులను పూర్తిగా విప్పుతారు. అలా బంధనాలు తొలగగానే ఆవు కిందికిదిగి, ఆయన చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ముందు కాళ్ళమీద కూర్చుని తలవంచి నమస్కరించి ఆయన పాదాలను నాకడం మొదలు పెట్టింది. ఈ అద్భుతం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు.

ఓగోమాతా ఇకనుండి ఎవరినీ ఇబ్బంది పెట్టకు, అంతేకాక ఈస్థలం ఎప్పటికి వదలకు అని శ్రీమహారాజు ఆ ఆవుతో అన్నారు. ఈసంఘటన జరిగినప్పుడు ప్రజలు శ్రీమహారాజును పొగుడుతూ ధన్యవాదాలు చేసారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Gajanan Maharaj Life History - 50   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 10 - part 4 🌻

Bhaskar, thereafter, treated Balabhau with due respect. Gold has to go through an acid test to be accepted as an object of value. There was a man named Sukhlal Agarwal at Balapur who owned a wicked cow. 

She used to wander in the town trampling and hurting people by the means of her horns. She would enter any shop, eat grains to her heart’s content and then push and spilled the remaining on road. She even kicked oil and ghee containers thereby spilling the contents everywhere. If tied down at home, she snapped the ropes and broke the chains. 

She behaved like a tiger and the people of Balapur got fed up with her nuisance. She was not getting pregnant and never remained indoors. Many folks advised Sukhlal to hand her over to a butcher or get her shot down by a bullet. 

He permitted them to do whatever they liked to her. One Muslim man once tried to kill her by gun, but somehow she came to know about it and attacked and threw him away by her horns. Sukhlal then took her and abandoned her in another village, but she returned back to Balapur again. 

Somebody then, remembering the fact that it was Shri Gajanan Maharaj who had tamed Govindbua’s horse, advised Sukhlal to take her to Shegaon and offer her to Shri Gajanan Maharaj , thereby serving dual purpose of getting rid of her and obtain Punya for giving a gift of a cow to a saint. 

All liked the idea, but their attempts to catch her failed every time. Then they kept a heap of green grass and some cotton seeds on an open ground. As the cow rushed to eat it, 10 to 15 people surrounded and trapped her by ropes. 

Then she was lifted and tied on a bullockcart with iron chains and brought to Shegaon as an offering to Shri Gajanan Maharaj . As Shegaon was approaching, there appeared to be a significant change in her behavior, and when brought before Shri Gajanan Maharaj , she appeared to be an extremely tame creature. 

With tears in her eyes, she looked at Shri Gajanan Maharaj . Thereupon Shri Gajanan Maharaj said, “It is foolish of you all to have tied and tortured a poor cow like this. Her neck, horns and legs are tied with rope and chains. Such type of ‘Bandobast’ is all right for a tiger, but not for a poor cow like this. 

You fools! You should know that this is a cow, a mother of all, and by tying her like this you have committed a sin. Release her at once, she will not trouble anybody.” 

Even with Maharaj’s assurance, no one dared to go close to her. So Maharaj, with His sacred hands, released her of all the restraining chains and ropes. As soon as she was free, the cow came down, went round Shri Gajanan Maharaj three times, folded her forelegs and with a bowed head and started rubbing His feet by her tongue. All the people saw this miracle and were surprised. 

Shri Gajanan Maharaj said to the cow, “O cow! Do not trouble anybody hereafter and don’t leave this place at all.” When this happened all the people prasent raised cheers in praise of Shri Gajanan Maharaj.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

12.Sep.2020

------------------------------------ x ------------------------------------




🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 51 / Sri Gajanan Maharaj Life History - 51 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 10వ అధ్యాయము - 5 🌻

అప్పటినుండి ఆఆవును ఏవిధమయిన తాడుతో కట్టడంలేదు. అదిచాలా మించితెలివిగల ఆవుగా అయింది. 

ఇప్పటికీ షేగాంలో దాని సంతతి ఉంది. దీనిని బట్టి యోగులు ఏది అంటే అది నిజం అవుతుంది అని ఋజువు అవుతోంది. ఇక లక్ష్మణఘుడే కధ ! ఇతను కారంజాలో ఒక ధనవంతుడయిన బ్రహ్మణుడు. ఇతనికి ఉదర సంబంధమయిన వ్యాధి ఉంది. చాలా ధనం దీనికొరకు ఖర్చుపెట్టి నివారణకోసం ప్రయత్నాలు చేసాడు కానీ ఫలించలేదు. 

శ్రీమహారాజు గొప్పతనంవిని, భార్యతో అతను షేగాం వచ్చాడు. ఆవ్యాధి ఎంత తీవ్రంగా ఉందంటే అతను నడవలేక 2/3 వ్యక్తులు అతనిని మోసుకుని మఠానికి తీసుకు వచ్చారు. శ్రీమహారాజుకు కనీసం నమస్కరించడానికి కూడా అతను శరీరం వంచలేని పరిస్థితిలో ఉన్నాడు. అతని భార్య వంగి నమస్కరించి తన భర్త ఆరోగ్యంకోసం అర్ధించింది. 

ఓమహారాజ్ నేను మీకూతురువంటి దానిని, నాభర్తను ఈవ్యాధి బాధనుండి నివారణచెయ్యండి. అమృతం ఉన్నచోటునుండి మృత్యువు వెళ్ళిపోవాలి. కృపయా నా భర్తను కాపాడండి అని ఆమెఅంది. ఆ సమయంలో శ్రీమహారాజు ఒక మామిడిపండు తింటున్నారు. ఆపండుని ఆమె వైపుకి విసురుతూ ఇకవెళ్ళి ఈ మామిడిపండు నీభర్తకు తినిపించు, అది ఆవ్యాధిని నివారిస్తుంది, నువ్వు ఒకమంచి భక్తిగల అతని భార్యవు అని శ్రీమహారాజు అన్నారు. తరువాత నిశ్శబ్దంగా కూర్చుని తన పొగపీల్చడం మొదలు పెట్టారు. 

ఇంకా ఆమె అక్కడే కూర్చునిఉండడం చూసి, ఓతల్లీ ఇక ఇక్కడ కూర్చోకు. నీభర్తను కారంజా వెనక్కు తీసుకు వెళ్ళి శ్రీమహారాజు ఇచ్చిన ఆమామిడిపండు ప్రసాదం అతనికి తినిపించు. మామిడిపండు తిన్న వెంటనే అతని వ్యాధి నయమవుతుంది అని భాస్కరు ఆమెతో అన్నాడు. ఆమె తన భర్తతో కారంజావచ్చి లక్ష్మణుకు మామిడిపండు తినిపిస్తుంది. ఈ దంపతులు కారంజా చేరినతరువాత అక్కడి ప్రజలు షేగాంలో ఏమి జరిగిందని అడగడం మొదలు పెట్టారు. తను లక్ష్మణుకు తినిపించిన మామిడిపండు ప్రసాదంతో సహా అన్ని విషయాలు ఆమె వివరించింది. దానికి వైద్యులు లక్ష్మణు ఈవిధంగా మామిడిపండు తినడం తప్పని, అది ఇంకా ఉదరసంబంధమయిన వ్యాధిని పెంచుతుందని అంటారు. 

గొప్పవైద్యులయిన మహానిధి, శుష్ప్రూత్, నిఘంతు మరియు సారంగధరులు ఉదర సంబంధమయిన వ్యాధికి మామిడిపండు బహిష్కృతమైనదని చెప్పారని ఆవైద్యులు అంటారు. తనభర్త బదులు ఆమె ప్రసాదం తినిఉంటే, ఆమె పుణ్యం లక్ష్మణుకు ఉపయోగపడేదని ఆవైద్యులు ఆన్నారు. 

ఆమెచేసిన పనికి ప్రతివాళ్ళు హేళణచేయడం మొదలు పెట్టారు. కానీ ఒక అద్భుతవింత జరిగింది..... లక్ష్మణు అకస్మాత్తుగా మలవిసర్జన చేస్తాడు, దానితో అతని కడుపు సేదదీరుతుంది. క్రమేణా అతను పూర్తిగా కోలుకుని ఆరోగ్యంపొందుతాడు. అతని వ్యాధులన్నీ ఆ మలం ద్వారా బయటకు పోయాయి. 

విషయాలు చెయ్యజారితే వైద్యులు ఏమీ సహాయంచెయ్యలేరు, కానీ అటువంటి సమయంలో భగవంతుని మరియు యోగుల ఆశీర్వాదాలు పనికి వస్తాయి. లక్ష్మణు పూర్తిగా కోలుకున్నాక షేగాం వెళ్ళి గౌరవంతో శ్రీమహారాజును తనఇంటిని మీయొక్క పాదశ్పర్శతో పావనం చెయ్యండి అంటూ ఆహ్వనించాడు. 

శ్రీమహారాజు అయిష్టతగా ఉన్నా, లక్ష్మణు పదేపదే అర్ధించగా చివరికి అంగీకరిస్తారు.

శ్రీమహారాజు అయిష్టతగా ఉన్నా, లక్ష్మణు పదేపదే అర్ధించగా చివరికి అంగీకరిస్తారు. శ్రీమహారాజు, శంకరు, భవ్ మరియు పీతాంబరు కలసి కారంజా వెళ్ళారు. లక్ష్మణు శ్రీమహారాజును తనఇంటి దగ్గర గౌరవంతో ఎదురుపలికి ఆయనకు పూజను నిర్వర్తించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹  Sri Gajanan Maharaj Life History - 51  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 10 - part 5 🌻

Since then, she was never tied by any rope and became a wise cow. Even today, her progeny exists in Shegaon. This incidence shows that whatever is said by the saints always comes true. Now read the story of Laxman Ghude. 

He was a rich Brahmin of Karanja who had some disease of the stomach for which he had taken lot of treatment, spending much money to no effect. Hearing the fame of Shri Gajanan Maharaj, he came to Shegaon with his wife. 

The ailment was so acute that he could not even walk and so 2 to3 persons had to lift him and bring him to the Matth. He was not even able to bend his body to bow before Shri Gajanan Maharaj . His wife bowed and begged for the health of her husband. 

She said, “O Maharaj, I am like a daughter to you and request you to cure my husband from the agonies of the disease. When nectar is present, death must go away; kindly save my husband.” At that time, Shri Gajanan Maharaj was eating a mango and he threw the same at Laxman's wife saying, “Now go and feed this mango to your husband. It will cure him of the disease; you are a good, devoted wife to him.” 

Then he kept quiet and started smoking his pipe. Since the lady was still sitting there Bhaskar said, “O Lady! Now do not sit here. Take your husband back to Karanja and feed him the Prasad of mango given to you by Shri Gajanan Maharaj ; as soon as he eats the mango it will cure his ailment.” 

Upon hearing this from Bhaskar, she returned to Karanja with her husband and fed that mango to Laxman. When this she reached Karanja, people began asking her as to what had happened at Shegaon. She told all the details and also about the prasad mango, which she had fed to Laxman. 

There upon the doctors said that it was wrong for Laxman to eat the mango as it would aggravate the ailment of the stomach. They pointed out that the great Vaidyas like Mahaonid, Sushrut, Nighant and Sharangdhar clearly stated in their writings that the mango is a prohibited fruit for stomach ailment. 

They further said that if she had eaten the Prasad, instead of her husband, her Punya would have been useful for curing Laxman. Everybody started criticizing her for what she had done, but a miracle happened. Laxman suddenly excreted stools and his stomach became soft. 

Gradually, he recovered completely. His ailment passed away through the stools. Doctors can’t help when things are beyond nature; at such times only the blessings of God and the saints are useful. When Laxman was fully recovered, he went to Shegaon and respectfully invited Shri Gajanan Maharaj to his house, while sayinng “Please purify my house by the touch of Your feet.” 

Shri Gajanan Maharaj was reluctant, but with Laxman’s fervent requests agreed. Shri Gajanan Maharaj went to Karanja along with Shankar, Bhau and Pitambar. Laxman very warmly received Shri Gajanan Maharaj at his house and performed the detailed Puja. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

13 Sep 2020

------------------------------------ x ------------------------------------

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 52 / Sri Gajanan Maharaj Life History - 52 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 10వ అధ్యాయము - 6 🌻

దక్షిణగా అతను ఇలా అన్నాడు...... మహారజ్ నాదగ్గర ఉన్నవన్నీ మీవే, కావున మీకు ఇవ్వడానికి నేను ఎవడిని ?అని అంటూ కొన్ని రూపాయలు పళ్ళెంలో ఉంచి శ్రీమహారాజుకు ఇస్తాడు. 

అది చూసి.. నీవు నీదగ్గర ఏమీ లేదన్నావు మరి ఈరూపాయలు ఎక్కడనుండితెచ్చావు ? లక్ష్మణు నీకపటితనంతో నాతో గమ్మత్తులు చేయకు. నీకు ఉన్న సర్వశ్వం నాకు అర్పించావు కనుక, తలుపులన్నీ తెరచి తాళాళు పారవెయ్యి అని శ్రీమహారాజు అన్నారు. 

లక్ష్మణు నిశ్శబ్ధంగా ఉన్నాడు. కానీ శ్రీమహారాజు అతని ధనం భద్రపరిచే స్థలాన్ని తెరవమని బలవంతం చేసారు. అనుమాన పడుతూ లక్ష్మణు దానిని తెరచి, దాని తలుపుల దగ్గరకూర్చుని శ్రీమహారాజును ఏదికావాలంటే అది తీసుకోవచసిందిగా అంటాడు. అలా అన్నాకూడా అతని మనస్సులో నిజాయితీగాని, నిష్కల్మషంగాని లేవు.

అతని కపటితనం శ్రీమహారాజు అర్ధం చేసుకోగలిగారు. రాజులా వేషంవేసుకున్న అభినేత, ఎక్కువసేపు దానిని దాచిఉంచలేడు. బయటకు బాగుగా కనిపిస్తున్నా ఒక పుల్లటిపండు లోపల పులుపుతప్ప వేరేఏమీ ఉండదు. యోగులు కపటుల ఇంటి దగ్గర సంతోషంగా ఉండరు, కావున శ్రీమహారాజు లక్ష్మణు ఇంటి దగ్గరనుండి ఏమీ తినకుండా వెళ్ళిపోయారు. 

ఆయన లక్ష్మణు ఇంటినికానీ, ధనాన్నికానీ లెఖ చెయ్యలేదు, ఎందుకంటే తనుస్వయంగా వీటితో నిండిన ఒక మహాసముద్రం వంటివారు. ఆయన కోరినదల్లా, లక్ష్మణు అన్నదాంట్లో నిజాయితీ ఎంతఉందని. 

అతని కపటితనం తెలుసుకున్నాక ఆస్థలం వదలి వెళుతూ...నీవు ప్రతీది స్వంతంచేసుకుందుకు ప్రయత్నించే చాలా స్వార్ధివి. ఇప్పుడు దాని పరిణామం ఎదుర్కునేందుకు తయారుకా, నేను నిన్ను ఆశీర్వదించి, నీకుఉన్న దానికి రెండింతలు ఇద్దామని అనుకున్నాను, కానీ నీకు అది పొందడానికి ప్రాప్తిలేదు అని శ్రీమహారాజు అన్నారు. 

అది నిజమయి, ఆరు నెలలో లక్ష్మణు తనకున్నదల్లా పోగొట్టుకొని, ఒక బికారి స్థితికి దిగజారిపోయాడు. 

ఈ కధనంతో ఎవరూ పరమార్ధంలో, కల్మషం, మోసంచేసే గుణం లేకుండా ఉండాలని చూపడమే శ్రీమహారాజు ఉద్దేశ్యం. శ్రీమహారాజు చింతామణి, ఏదికావాలంటే అది పొందగలిగే శక్తి కలవారు, అందుకే అసలు లక్ష్మణు గుళకరాళ్ళను లక్ష్యపెట్టలేదు. అల్యుమినియం భగవంతున్ని అలంకరించగలదా ? భక్తులందరూ తమ మంచికోసం ఈ గజానన్ విజయ కధ వినురుగాక. 

శుభం భవతు

10. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Sri Gajanan Maharaj Life History - 52   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 10 - part 6 🌻

As for Dakshina (offering) he said, “Maharaj, every thing that belongs to me is Your’s, so who am I to give you anything?” Saying so, he placed some money in a plate and offered it to Shri Gajanan Maharaj . 

Looking at that Maharaj said, “When you say that you possess nothing, then wherefrom have you brought these rupees? Laxman don’t try to trick me by your hypocrisy. Since you have given me everything of yours, open all the doors and throw away all the locks.”

Laxman kept quiet, but Shri Gajanan Maharaj insisted upon his opening the safe. Hesitatingly, Laxman opened the locks of his safe, sat at its door and asked Shri Gajanan Maharaj to take whatever he liked from it. Though he said this, he was not that honest or sincere from his mind. 

Shri Gajanan Maharaj could understand his hypocrisy. An actor cannot keep up his disguise for long. A bitter fruit appears fine from outside but inside of it there is nothing but bitterness. Saints are never happy at the house of hypocrites, so Shri Gajanan Maharaj left Laxman’s house without eating anything. 

He did not care for Laxrnan’s house or his money as He was the ocean of renunciation himself. He only wanted to find the truth in what Laxman had said, and when found his falsehood, He just left the place and while leaving said, “You are most selfish, trying to own everything. 

Now get ready to face its consequences. I had come to bless you and give you double of what you have, but it appears that you are not destined to get it.” It proved true and within six months of the above mentioned incident, Laxman lost everything and was reduced to a beggar’s state. 

By this incident, Shri Gajanan Maharaj wanted to show that one should not be insincere and dishonest in the Parmarth. Shri Gajanan Maharaj was Chintamani i.e. capable of getting anything and as such did rot care for the pebbles of Laxman. Can aluminium decorate the God? May all devotees listen to this Gajanan Vijay Katha for their own good. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Ten

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

14.Sep.2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 53 / Sri Gajanan Maharaj Life History - 53  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 11వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓపశుపతి, భవానీపతి మీకు ప్రపంచంలో ఎంతమంది మనుష్యులున్నారో అన్ని రకముల రూపాలు ఉన్నాయి. మీఈస్వరూపం బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉంది మరియు అది మీ మాయ యొక్క అసలు స్వరూపం. ఓప్రియమైన భగవంతుడా మీయొక్క స్వరూపాన్ని ఊహించడం అసాధ్యం. 

అందుకనే మీరు దయామయులై అనేక రూపాలలో కనిపిస్తున్నారు. భక్తులు వారివారి ఇష్టం ప్రకారం మీకు పేరుపెట్టారు. ఆపేర్లు మీకు ఏవిధమయిన బేధం చెయ్యలేవు. శైవులు మిమ్మల్ని శివ అని, వేదాంతులు బ్రహ్మ అని, రామానుజులు సీతాపతి అని, వైష్ణవులు విష్ణువు అని పిలుచుకుంటున్నారు. పలు విధములయిన ఆరాధన మీకు ఈపేర్లు తెచ్చిందికానీ మీరు ప్రతిచోటా ఒక్కరే. 

మీరు సోమనాద్లో విశ్వేశ్వర్, హిమాలయాలలో కేదార్, క్షిప్రానదీ తీరాన్న మహంకాళ్, నాగానాద్, వైద్యనాద్ వెరుల్లో గ్రుషుణేశ్వర్ మరియు గోదావరీ నదీతీరాన్న త్రయంబక్. మీరు గోకర్ణ రూపంలో శంకరులు మరియు శింగణాపూరులో మహాదేవులు. వీరందరి ముందునేను వంగి నమస్కరిస్తున్నాను. 

ఓదయామయా, భగవంతుడా, దయచేసి నన్ను ప్రాకృతిక బాధలు కలిగించే గుణాలనుండి ముక్తుడిని చేయ్యండి. ఓగిరిజాపతే ! మీరు కుబేరుడిని ఒక్క క్షణంలో ధనవంతుడిని చేసారు, మరి నాకొరకు ఎందుకు ఈ సంకోచం ? 

మరుసటి సంవత్సరం శ్రీసమర్ధ, బాలాపూరులో బాలకృష్ణ దగ్గరకు దాస్ నవమికి వచ్చారు. అక్కడ ఆయన యందు అత్యంత భక్తిగల ఇద్దరు భక్తులు శుఖలాల్, బాలకృష్ణ ఉన్నారు. 

శ్రీమహారాజుతో పాటు భాస్కరుపాటిల్, బాలాభవ్, పీతాంబరు, గణు జగడ్యో మరియు దిండోకర్ ఉన్నారు. దాస్ నవమి ఉత్సవాలు చాలా సంతృప్తికరంగా జరిగాయి, కానీ విధిరాత భాస్కరుకు వేరే విధంగా పొంచిఉంది. 

ఒక రేబిస్ వ్యాధిగల కుక్క అతనిని కరుస్తుంది. దానితో అక్కడి ప్రజలు ఇతనికి త్వరలో రేబిస్ వ్యాపిస్తుందని భయపడ్డారు. సాధ్యమయినన్ని నివారణలు అతనికి చేసారు. తరువాత ఎవరయినా వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్ళవలసిందిగా సలహాయిచ్చారు. 

తనని ఏవైద్యుని దగ్గరకు తీసుకు వెళ్ళనవసరం లేదనీ, అసలైన తన వైద్యుడు అయిన శ్రీమహారాజు దగ్గరకు వెంటనే తీసుకు వెళ్ళవలసిందిగా భాస్కరు కోరాడు. ఆప్రకారంగానే శ్రీమహారాజు దగ్గరకు భాస్కరును తెస్తారు. బాలాభవ్ ఆ కుక్క కరవడం గూర్చి పూర్తి విషయాలు ఆయనకు వర్నించాడు.

శ్రీమహారాజు నవ్వి .......... హత్య, శతృత్వం మరియు ఋణం వీటి ఫలితాన్ని ఎవరూ తప్పించుకోలేరు. శుఖలాల్ ఆవు క్రూరత్వం భాస్కరు షేగాంలో తొలగించాడు, అదే క్రూరత్వం ఈకుక్క రూపంలో వచ్చి అతనిని కరిచింది. భాస్కరు ఎంత స్వార్ధపరుడంటే, ఆ ఆవుపాలు తనే స్వయంగా పొందేందుకు ఆ ఆవు క్రూరత్వాన్ని తొలగించమని నన్ను అర్ధించాడు. 

నువ్వు ఆ ఆవుపాలు త్రాగి ఆనందించావు, ఇప్పుడు కుక్కకరిచిందని చింతిస్తున్నావు. నిన్ను నేను రక్షించాలని కోరుకుంటున్నావా ? నిజాయితీగా ఉండు. నీ జీవితం అంతంచేయడానికి ఈకుక్కకాటు ఒక కారణం మాత్రమే. నీజీవితం ఇక పూర్తి అయింది, త్వరలో నీవు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలి. 

ఇంకా ఎక్కువ బ్రతకాలనుకుంటే నేను నిన్ను రక్షించగలను కానీ ఈమిధ్యా ప్రపంచలో అది ఒక ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం లాంటిది. కనుక త్వరగా ఆలోచించుకుని నాకు తెలియచెయ్యి. ఇటువంటి అవకాశం మరల దొరకదు అని శ్రీమహారాజు అన్నారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 53   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 11 - part 1 🌻

Shri Ganeshayanmah! O Pashupati! O Bhavanipati! You have as many forms as the number of people in the universe. Your formless form occupies the entire universe and it is also the manifestation of maya in its original form. 

O Dear God! It is impossible to apprehend Your form and so You have been kind enough to manifest Yourself in forms with different attributes. 

Devotees name you as they like, and these names do not make any difference for You. Shaiva call You Shiva, Vedantis call You Brahma, Ramanujas call You Sitapati and You are Vishnu of Vaishnavas. 

Various methods of worshipping have given You these names, but You are the same everywhere. You are Vishveshwar at Somnath, Kedar in Himalaya, Mahankal on the bank of Kshipra, Naganath, Vaijanath, Ghrushneswar at Verul and Tryambak on the bank of Godavari. 

You are Bhimashankar, Mallikarjuna and Rameshwar. You are Shankar in the form of Gokarna and Mahadeo at Shinganapur. I bow before them all. O

Benevolenl God! Please rid me of the troublesome elements of nature. O Girijapate! it is You who made Kubera wealthy in a moment; then why this hesitation for me? 

Next year Shri Samartha came to Balapur for Das Navami. At that place there were His two most devoted devotees: Sukhlal and Balkrishna. Bhaskar Patil, Balabhau, Pitambar, Ganu, Jagdeo and Dindokar accompanied Shri Gajanan Maharaj . 

The celebration of Das Navami was most satisfying, but fate had something else in store for Bhaskar. A rabid dog bit him and people were afraid that he would soon go rabid. 

All the possible treatment was given to him, and it was also suggested that he be taken to some doctor, but Bhaskar said that he did not need any doctor as Shri Gajanan Maharaj was his real doctor, whom he wanted to be taken to soon. 

Accordingly, Bhaskar was brought before Shri Gajanan Maharaj and Balabhau narrated everything about the dog bite to Him. Shri Gajanan Maharaj heard the incident and smilingly said, Nobody can escape the effects of murder, enmity and debt. 

This Bhaskar removed the wickedness of Shukhlal's cow at Shegaon, but that wickedness has now come in the form of the dog to bite him. Bhaskar is so selfish that he had requested me to remove that wickedness from the cow so that he could get her milk for himself. 

You enjoyed drinking her milk, and now feel sorry for the dog bite? Do you really want me to save you? Be frank. This dog bite is only an excuse to end your life. Your life is now over and soon you will have to leave this material world. 

If you wish to live more, I can save you, but that will be a sort of a give and take affair in this illusive world. So be quick and let me know your mind. You will not get such a chance again. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

15.Sep.2020

------------------------------------ x ------------------------------------

🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 54 / Sri Gajanan Maharaj Life History - 54   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 11వ అధ్యాయము - 2 🌻

నేను మీయొక్క అవివేకమయిన పిల్లవాడిని. నాకు ఏది మంచిదో అది మీరే చెయ్యండి. తన పిల్లలకు ఏది మంచిదో తల్లి మాత్రమే అర్ధం చేసు కుంటుందని శ్రీతుకారాం తన కధనంలో అన్నారు. 

నేను మీ పిల్లవాడిని మరి నేను మిమ్మల్ని అర్ధించడం ఎందుకు ? మీరు జ్ఞానంఅనే మహాసముద్రం, అన్ని విషయాలు తెలిసినవారు అని భాస్కరు అన్నాడు. ఇదివిన్న శ్రీమహారాజు చాలా సఇతోషించారు. స్వయానా నిజాయితీ పరులైనవారికి, ఇతరుల నిజాయితీ సంతృప్తిని కలిగిస్తుంది. 

భాస్కరు తమ అత్యంత ప్రియమైన భక్తులలో ఒకరు కావున భాస్కరును రక్షించమని కొంతమంది భక్తులు శ్రీమహారాజును అర్ధించారు. 

సజ్జనులారా మీయొక్క తెలివి తక్కువ తనం వల్లనే మీకు ఈవిధంగా అనిపిస్తోంది. జీవన్మరణం అనేది అసత్యం అని తెలుసుకోండి. ఎవరూ జన్మించలేదు, మరణించలేదు. ఈమధ్యను గూర్చి అవగాహన చేసుకుందుకు అత్యంత గొప్పదయిన, ఆత్మగురించిన జ్ఞానం అవసరం అని మేధావులు సలహా ఇచ్చారు. 

పూర్వజన్మ కర్మఫలితాన్ని అనుభవించకుండా మీకు ఈజన్మనుండి విముక్తి లేదు. క్రిందటి జన్మలో మీరు ఏదో చేస్తారు, దానిఫలితాన్ని అనుభవించేందుకు మరల జన్మ ఎత్తుతారు, మరలా ఈజన్మలో చేసిన పనుల ఫలితాన్ని అనుభవించేందుకు మరలా జన్మఎత్తుతారు, ఇలా ఈచక్రం ముందుకు కొనసాగుతుంది. ఎంతకాలం ఈగొలుసును కొనసాగించడం ? 

భాస్కరు తన పూర్వజన్మ ఫలితాలను అనుభవించడం పూర్తిచేసాడు, ఇక మోక్షం పొందడం కోసం విముక్తుడయ్యాడు. కావున దయచేసి అతనిదారిలోకి రాక అతనిని వెళ్ళనివ్వండి. భాస్కరులాంటి భక్తుడు దొరకడం కష్టమే. 

ఈ కుక్క క్రితం జన్మలో భాస్కరుకు శత్రువు, కనుక అది ఈజన్మలో బాలాపూరులో ఇతనిని కరిచింది అని తెలుసుకోండి. ప్రతీకారం పూర్తి అయింది, కానీ ఈ సంఘటన వలన భాస్కరు మనసులో ఏమాత్రమయినా చేదు మిగిలితే, ఆకాటుకు ప్రతీకారం తీర్చుకోడంకోసం మరోజన్మ ఎత్తడానికి కారణం అవుతుంది. 

కావున ఈ రోజుతో క్రితం జన్మల శతృత్వాలన్నీ పూర్తి అయి, భాస్కరు ఆజన్మలన్నిటి నుండి పరిశుద్దుడయ్యాడు అని అర్ధంచేసుకోండి. 

ఇక ఇతనికి రెండు నెలలు ఆయుర్దాయం ఉంది, నేను ఇతనిని ఈ రెండు నెలలూ ఈ కుక్క కాటు పరిణామాలనుండి రక్షిస్తాను, అలా నేను చెయ్యకపోతే తిరిగి ఇతను రెండి నెలలు జీవించడం కోసం జన్మించాలి అని శ్రీమహారాజు అన్నారు. 

శ్రీమహారాజు చెప్పిన ఈబ్రహ్మజ్ఞానం గురించి చాలామంది అర్ధంచేసుకోలేక పోయారు, కానీ బాలాభవ్ చేసుకోగలిగి చాలా సంతోషించాడు. అతను భాస్కరు యొక్క నిష్కలమైన భక్తికీ, దానివల్ల జీవన మరణ చక్రంనుండి ముక్తి పొందడాన్ని పదేపదే పొగిడాడు. అప్పుడు అందరూ షేగాం తిరిగి వచ్చారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 54   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 11 - part 2 🌻

Bhaskar said, I am an ignorant child of Yours. You do whatever is good for me. Shri Tukaram, in his Abhang, has said that only a mother understands everything that is good for her child; I am your child, so why should I request You? You are the ocean of all knowledge! 

Hearing this, Shri Gajanan Maharaj felt very happy, as truth always satisfies people who are themselves truthful. Some devotees requested Shri Gajanan Maharaj to save Bhaskar as he was one of the most dedicated disciples. 

Shri Gajanan Maharaj said, Gentlemen, it is your ignorance that makes you say so. Know that, this life and death themselves are unreal. Nobody is born and nobody dies. 

The intellectuals have advised the knowledge of the Supreme self to understand this illusion. You cannot be liberated from the present life, without suffering the effects of the deeds of your previous life. 

You do something in your past life and take birth to suffer the effects of those deeds and then you again take birth for the deeds of the present life and so on the cycle goes on. How long will you continue this chain? 

Bhaskar has finished suffering the effects of the deeds of his past life and now is liberated to attain Moksha (to merge with the Brahma). So please do not come in his way; let him go. It is difficult to get a devotee like Bhaskar. 

Know that, this dog was his enemy in the previous life and so it has bitten him in this life at Balapur. The revenge is now over. However, if this incident leaves any bitterness in the mind of Bhaskar, it will cause him to take another birth to avenge the bite. 

So understand that, as of today, the enmity of Bhaskar’s previous life is over and he is cleansed of all effects of that life. He is left with two more months of life, and I will save him from the effects of that dog bite for two months. 

If I do not do that, he will have to take birth again and live for two months. Many people were unable to understand this supreme knowledge given out by Shri Gajanan Maharaj , but Balabhau could comprehend and so was happy. 

He praised Bhaskar again and again for his sincere devotion to the saint and thereby againing the ultimate liberation from the cycle of life and death. Then all of them returned to Shegaon.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


16 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 55 / Sri Gajanan Maharaj Life History - 55 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 11వ అధ్యాయము - 3 🌻

బాలాపూరులో జరిగిన విషయాలన్నీ భాస్కరు మఠంలోని మిగిలిన భక్తులందరికీ వర్నించి, చేతులు కట్టుకుని వారిని ఈవిధంగా ప్రార్ధించాడు: శ్రీగజానన్ మహారాజును పొందడం షేగాం యొక్క గొప్ప అదృష్టం, కావున అమూల్యమయిన ఈమఠాన్ని, ఒక శాశ్వతమయిన కట్టడం రూపంలో మనం భద్రపరచాలి. ఆయనకు స్వయంగా అటువంటి కట్టడం అవసరంలేదు, కానీ మన భావి ప్రజలకోసం ఇది అవసరం. 

ఆళందిలో సంత్ ధ్యానేశ్వర్, సజ్జనఘడ్లో శ్రీరామదాసుస్వామి మరియు దీన్లో శ్రీతుకారాం మహారాజు భవనాలు మాదిరి షేగాంలో శ్రీగజానన్ మహారాజు కొరకు ఒక గొప్పకట్టడం ఉండాలి. భాస్కరు ఈవిషయం ప్రతి వాళ్ళతో చెపుతున్నా, అతనికి వాళ్ళ అవగాహన మీద అనుమానంగా ఉండేది. 

అందుకే శ్రీమహారాజు లేని సమయం చూసి, భక్తులందరినీ ఒక సభకోసం షేగాం పిలిచాడు. బనకటలాల్, హరిపాటిల్, మారుతి, చంద్రబాన్, శ్రీపతిరావు వావికర్, తారాచంద్ షాహుకార్లు దానికి హాజరు అయ్యారు. మీతోనేను ఇక కలిసి ఉండేది రెండు నెలలు మాత్రమే, కావున షేగాంలో ఒక గొప్పసంస్థానం శ్రీమహారాజు కొరకు నిర్మించబడాలని నాకోరిక. మీరు ఇది చేస్తామని వాగ్దానంచేస్తే, నేను సంతోషంగా వైకుంఠం వెళ్ళిపోతాను. పుణ్యాత్ములకు చేసిన సేవ వృధాకాదని గుర్తుంచుకోండి. 

ఆయన మీ కోరికలన్నీ పూర్తి చేస్తారు. ఇది నాచివరి కోరిక, మీరు ఆవిధంగా శ్రీమహారాజు కోసం సంస్థానం నిర్మాణం చేస్తామని ఒట్టు పెట్టండి అని భాస్కరు వారితో అన్నాడు. అతని కోరిక నెరవేర్చేందుకు అందరూ వాగ్దానం చేస్తారు. శ్రీభాస్కరు సంతృప్తి పొందాడు. 

పిల్లలు రాబోయే పండుగ సంబరాలకోసం ఎదురు చూస్తున్నట్టు, భాస్కరు రోజురోజుకూ ఆహ్లాదపూరితుడవుతున్నాడు.

మాఘబహుళ త్రయోదశినాడు...... భాస్కరా, మనం శివరాత్రికి త్రయంబకేశ్వర్ వెళదాం, అక్కడ గోదావరీ తీరంలో భవానీవరుడయిన శివుడు నివసిస్తున్నాడు.

అక్కడ ఉన్న జ్యోతిర్లింగం చాలా ఆహ్లాదకరమయినది మరియు ఏవిధమయిన పాపాన్నయినా తొలగించగలది. ఆలశ్యం చెయ్యకు. అక్కడికి వెళ్ళి పవిత్ర గోదావరిలో స్నానం చేద్దాంపద. 

అంతే కాక త్రయంబకేశ్వర్ దగ్గర బ్రహ్మగిరి అని పిలవబడే ఒక కొండఉంది. దానిమీద అనేకములయిన ఔషదీయ జడీబుట్టీలు ఉన్నాయి. ఈ జడీబుట్టీలు అన్నీ తెలిసిన గహీణినాధ్ కూడా ఆకొండమీద ఉన్నాడు. నీ రేబిస్ విరుగుడుకోసం అతని దగ్గరనుండి కొన్ని జడీబుట్టీలు పొందవచ్చు అని శ్రీమహారాజు అన్నారు. 

నాకు ఔషదాలు అవసరం ఏమి ఉంది ? ఏ విధమయిన ఔషదం కంటేకూడా నాకు మీ ఆశీర్వాదాలే ఉపయోగకరం. మరియు మీ దయవల్ల నేను బాలాపూరులో విషంనుండి విముక్తి పొందాను, మరియు ఇక నేను రెండు నెలలు మాత్రమే జీవంచాలి. నామటుకు అయితే మీరే త్రయంబకేశ్వరుడు, మీపాదాలే గోదావరి, అక్కడే నేను స్నానం చేస్తాను కనుక నన్ను ఈ షేగాంలోనే ఉండేందుకు అనుమతించండి. కావున నాకు వేరే పుణ్యక్షేత్రాలు దర్శించనవసరం లేదు అని భాస్కరు అన్నాడు. దానికి. 

అది అంతా నిజమే కానీ ఎవరూ ఆ పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయకూడదు. భాస్కరును ఆయన తయారు అవమని, తనతో పాటు పీతాంబరు, బాలాబవోను కూడా తీసుకు వెళదామని అన్నారు. 

వీరంతా శివరాత్రి రోజున త్రయంబకేశ్వరు వెళ్ళరు. పవిత్ర కుశవర్గలో స్నానంచేసారు. ఆలయంలో శివుని దర్శనం చేసుకుని, గంగాద్వార్ దగ్గర గౌతమికి, మా నీలాంబికకు, నివృత్తికి, గహణినాధకు పూజలు అర్పించారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 55    🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 11 - part 3 🌻

Bhaskar narrated everything that happened at Balapur, to other devotees in the Math and with folded hands requested them as follows, “Shegaon is very fortunate to get Shri Gajanan Maharaj and so we, in the form of some permanent memorial, should retain this invaluable Trust.

In fact He himself does not need any memorial, but it is necessary in the interest of the future generations. Like the monuments of Sant Dnyaneshwar at Alandi, Shri Ramdas Swami at Sajjangad and Shri Tukaram Maharaj at Dehu, we also should have a grand memorial of Shri Gajanan Maharaj at Shegaon. 

Bhaskar went on telling this to everybody, but was doubtful about their conviction. So he, in the absence of Shri Gajanan Maharaj , called a meeting of all devotees at Shegaon. 

Bankatlal, Hari Patil, Maroti, Chandrabhan, Shripatrao Vavikar, Tarachand Saokar and many others attended. Bhaskar said to them, Now my stay with you is for two months only and I wish that a grand memorial for Shri Gajanan Maharaj should come up at Shegaon. 

If you promise me this, I shall leave for Vaikunth with real happiness.

Remember that service to a saint never goes waste. He will fulfill all your desires. The memorial should be such that it attracts praise from everybody. This is my last desire. Do you all vow to raise such monument for Shri Gajanan Maharaj ? All promised to fulfill his desire, so Bhaskar was satisfied. 

Day by day, Bhaskar was getting gay as a child waiting for the gaiety of some ensuing festival. On Magh Vadya 13th Shri Gajanan Maharaj said, Bhaskar, let us go to Trimbakeshwar for Shri Mahashivaratri; there resides on the bank of Godavari, Shri Shiva the Bhavanivara. 

The Jyotirling at that place is most pleasant and capable of dispelling all sins. Don't delay. Let us go there and have a holy bath in the sacred Godavari. Moreover, there is a hill named Brahmagiri near Tryambakeshwar and on it are a lot of medicinal herbs. 

Gahininath, who knows all the medicinal herbs, also resides there. We can get some herbs for your anti rabid treatment from him. Bhaskar replied, Why should I need any medicine now? Your blessings are more useful for me, than any medicine. 

By Your grace I was freed of the poison at Balapur, and have to live for another two months only. So permit me to stay at Shegaon; for me, You are Trimbakeshwar, and Your feet the Godavari where I shall take bath. 

Thus I don't need to visit any other holy place.” Thereupon Shri Gajanan Maharaj said that it was all true, but one should not ignore the importance of the holy and sacred places. He asked Bhaskar to get ready and also to take Pitambar and Balabhau with them.

They all went to Tryambakeshwar on Shivaratri day, took bath at sacred Kushavarth, had darshana of Shri Shiva at the temple, and then offered Pujas to Goutami at Gangadwara, Ma Nilambika, Nivrutti and Gahaninath.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


17 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 56 / Sri Gajanan Maharaj Life History - 56 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 11వ అధ్యాయము - 4 🌻

అక్కడనుండి పంచవటిలో కాలారాం ఆలయద్వారంలో ఎదురుగా ఒక రావిచెట్టు చుట్టూ గట్టుతోఉంది. శ్రీమహారాజు తన శిష్యలతో అక్కడికి వెళ్ళి దానిమీద కూర్చున్నారు. గోపాల్ దాసు చాలా సంతోషంచి తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఇలా అన్నారు.విదర్భ నుండి ఈరోజు మాసోదరుడు వచ్చాడు. ఆయన పేరు గజానన్, వెళ్ళి వినయంగా ఆయన దర్శనం చేసుకోండి. 

నా తరఫున కొబ్బరి, చక్కర సమర్పంచి ఈపూలమాల హారం ఆయన మెడలో వెయ్యండి. మాఇద్దరికీ వేరే శరీరాలు ఉన్నప్పటికీ మేము ఒకళ్ళమే. ఆప్రకారంగానే అతని శిష్యులు శ్రీమహారాజుకు కొబ్బరి, చక్కెర మరియు పూలహారం సమర్పించారు. అది చూసిన శ్రీమహారాజు.. భాస్కర ఈ ప్రసాదాన్ని అందరికీ పంచు. 

ఈ పంచవటీలో నేను ఈరోజు మాసోదరున్ని కలుసుకున్నాను. ఇక ఇక్కడ పని అయిపోయింది. నాశిక్ నివాసి అయిన శ్రీధుమాల్ లాయరు దగ్గరకి వెళదాము అని అన్నారు. . 

శ్రీమహారాజు నాశిక్ వచ్చారు. అక్కడ చాలామంది ఆయన దర్శనం చేసుకున్నారు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నాక ఆయన షేగాం తిరిగి వచ్చారు. జ్యాంసింగ్ షేగాం వచ్చి, తనతో పాటు అడగాం రావలసిందిగా అర్ధిస్తాడు. శ్రీమహారాజు విముఖంగాఉన్నా, జ్యాంసింగ్ దీనంగా అర్ధించడంచూసి, రామనవమి తరువాత తను అడగాం వస్తానని అంటారు. 

శ్రీమహారాజు ఇష్టప్రకారమే జ్యాంసింగ్ అడగాం వెళ్ళిపోయి, రామనవమి తరువాత తిరిగి షేగాం వచ్చాడు. రామనవమి ఉత్సవాల తరువాత శ్రీమహారాజును ఆయన శిష్యులతో కూడా హనుమాన్ జయంతికి జ్యాంసింగ్ అడగాం తీసుకు వచ్చాడు. 

అడగంలో ఉండగా శ్రీమహారాజు అనేకమయిన అద్భుతాలు చేసారు. ఒకరోజు మధ్యాహ్నంపూట భాస్కరును ఆయన నేల మీద పడేసి అతని ఛాతీమీద కూర్చుని కొట్టడం మొదలు పెడతారు. అందరూ అది చూస్తున్నారు తప్ప, ఆదెబ్బలనుండి భాస్కరును రక్షించడానికి ఎవరూ వెళ్ళటంలేదు. అప్పుడు, దయచేసి భాస్కరును వదిలివెయ్యండి, క్రిందఉన్న వేడినేలతో అతను మాడిపోతున్నాడు అని శ్రీమహారాజుతో అన్నాడు. 

దానికి, ఆవిధంగా ఆయనకు అంతరాయం కలిగించకండి, ఆయన ఇష్టప్రకారం చెయ్యనివ్వండి. ఆయన నాభగవంతుడు. ఆయన నన్ను కొడుతున్నారని మీరు అనుకుంటున్నారు కానీ, ఆయన నాతో ఆడుతున్నారు. ఈసంగతి, ఆయన్ని తెలిసిన వారికే అర్ధం అవుతుంది అని భాస్కరు అన్నాడు. 

పిదప, భాస్కరు మరియు మిగిలిన శిష్యులతో కలసి శ్రీమహారాజు అడగాం వచ్చి ఉన్నారు. ఇంక భాస్కరుకు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పంచమి రోజున అతను ఈప్రపంచాన్ని విడిచి పెడతాడు. ఈరోజు నేను అతనిని కొట్టడానికి కారణం నువ్వు అర్ధం చేసుకుని ఉండాలి. నీకు గుర్తుందా ? షేగాంలో ఈ భాస్కరు నన్ను గొడుగుతో నిన్ను కొట్టేటట్టు చేసాడు, ఆప్రకరణకు విరుగుడుగా నేను ఈరోజు భాస్కరును కొట్టాను. వేరే ఉద్దేశ్యం ఏమీలేదు అని శ్రీమహారాజు బాలాభవోతో అన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 56 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 11 - part 4 🌻

From there, they came to Nasik to meet Shri Gopaldas who was always sitting at the entrance of Kalaram Temple in Panchavati. In front of the temple was a pipal tree surrounded by a platform. Shri Gajanan Maharaj, along with his disciples, went and sat on it. 

Shri Gopaldas was very happy, and said to the people around him, Today My brother has come from Vidarbha and His name is Gajanan. Go and have His darshan respectfully. Offer Him coconut and sugar as a present from Me, and put this garland around His neck. 

Though We have two bodies, still We are one.” The disciples accordingly offered coconut, sugar and a garland to Shri Gajanan Maharaj and had his darshan. Looking to that Shri Gajanan Maharaj said to Bhaskar, Bhaskar, distribute this prasad to all. 

In this Panchavati I have met My brother today. So our work over here is finished. Let us now go to Shri Dhumal Lawyer of Nasik. Shri Gajanan Maharaj , then, came to Nasik where many people took his darshan. After staying there for few days, He returned to Shegaon. 

Zyam Singh came to Shegaon and requested Him to go with him to Adgaon. Shri Gajanan Maharaj was reluctant, but looking to the fervent request of Zyam Singh, said that he would go to Adgaon after Ramnavami. 

Zyam Singh went back to Adgaon and returned to Shegaon again after Ramnavami as per the wish of Shri Gajanan Maharaj . After the celebrations of Ramnavami, Zyam Singh brought Shri Gajanan Maharaj , alongwith other disciples, to Adgaon for the ‘Hanuman Jayanti’ celebrations. 

While at Adgaon, Shri Gajanan Maharaj performed many miracles. One afternoon, He pushed Bhaskar flat on ground, sat on his chest and started beating him. All people were looking at it, but nobody could go to rescue Bhaskar from that beating. 

Then Balabhau said, “Maharaj, kindly leave Bhaskar; he is getting scorched on hot earth below him. Thereupon Bhaskar said, Don't obstruct Him like that. Let Him do as He likes. He is my God. You think that He is beating me? Infact, He is playing with me. 

This experience can only be understood by those who know Him. Then Maharaj, along with Bhaskar and other disciples, came to Adgaon where they stayed.

Shri Gajanan Maharaj said, Balabhau, now only two days are left for Bhaskar as he will leave this world on Panchami. You must have understood the reason for My beating him today. 

Do you remember that this Bhaskar had made Me beat you with an umbrella at Shegaon? To dispel the effect of that act, I beat Bhaskar today. There was no other intention. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

18 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 57 / Sri Gajanan Maharaj Life History - 57 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 11వ అధ్యాయము - 5 🌻

ఇక హనుమాన్ జయంతి ఉత్సవాల తరువాత అడగంలో ఏమి జరిగిందో వినండి: కాలా ప్రసాదం పంచడం అయింది, పంచమి ఉదయం అయింది. ఆరోజు ఉదయం భాస్కరా నీకు వెళ్ళడానికి ఈరోజు నిశ్చయం అయింది. తూర్పు ముఖంగా పద్మాశన ముద్రలో కూర్చో. నీమనస్సును స్థిరంచేసి మహాశక్తి వంతుడయిన హరి మీద ధ్యానం చెయ్యి. నీవు వెళ్ళ వలసిన సమయానికి దగ్గర అవుతున్నావు. తయారుకా అని శ్రీమహారాజు భాస్కరుతో అన్నారు. గట్టిగా విఠల, విఠల నారాయణ అని జపించండి. 

మీ ఈసోదరుడు ఈరోజు వైకుంఠానికి వెళుతున్నాడు. పువ్వులుతో, బుక్కాతో పూజించండి అని మిగిలిన వాళ్ళతో అన్నారు. భాస్కరు పద్మాశన ముద్రలో కూర్చుని, నాశికాగ్రంపై కళ్ళు కేంద్రీకరించి, తన మనస్సును ఆ మహాశక్తి వంతునికి అర్పించి శాంతపరిచాడు. 

భక్తులందరూ భాస్కరుకు పూజలు అర్పిస్తున్నారు, శ్రీమహారాజు సంతోషంగా వారిని చూస్తున్నారు. పవిత్ర మంత్రోఛ్ఛారణ, భజనలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అప్పుడు హరహర అని శ్రీమహారాజు గట్టిగా అన్నారు. ఈశబ్దాలతో భాస్కరు ఆత్మ వైకుంఠానికి వెళ్ళింది. 

మహాత్ముల ఆశీర్వాదం పొందిన వాళ్ళు మాత్రమే ఈవిధంగా తిన్నగా వైకుంఠానికి వెళతారు. భాస్కరును సమాధి చేసే స్థలం కోసం, శ్రీమహారాజును ప్రజలు అడుగుతారు. దానికి అతనిని శివ పార్వతి ఆలయం దగ్గర సమాధి చేయవలసిందిగా ఆయన సలహా ఇస్తారు. 

పిదప వాళ్ళు ఒక పల్లకి తెచ్చి, ఆకులతో అరటి మొక్కలతో అలంకరించారు. భాస్కరు భౌతిక దేహాన్ని అందులో పెట్టి, భక్తులు దానిముందు భజనలు చేస్తూ, పాడుతూండగా ఊరేగింపుగా మోసుకు వెళ్ళారు. వాళ్ళు ద్వారకేశ్వర్ ఆలయంచేరి సమాధిస్థలం దగ్గర సమాధి కొరకు చెయ్యవలసిన విధులు అన్నీ చేస్తారు. 

శ్రీమహారాజు యొక్క అత్యుత్తమ భక్తుడు, తమని విడిచి వెళ్ళిపోయాడని దుఖంతో అక్కడి ప్రజలు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మరుసటి రోజునుండి భాస్కరుకి స్మృతిగా పేదప్రజలకు అన్నదానం మొదలు పెట్టారు. అడగంకి ఒకమైలు దూరం ఉత్తరంగా ఈ శ్రీకృష్ణ శంకరపార్వతి మందిరం ఉంది. 

శ్రీకృష్ణ మందిరం పరిసరప్రాంతం అంతా అశ్వద్ధ, నింబ్, మందారు, అవుడంబరు వంటి వృక్షాలతోనూ, ఇంకా అనేక పువ్వుల మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆప్రదేశం అకోలి , అడగాం మధ్యలో ఉంది. సంతభండార అనబడే ఈ అన్నదానం 10 రోజులు సాగింది. 

ప్రజలు చింతచెట్టు క్రింద భోజనాలకి కూర్చున్నారు. కానీ కాకులు అరవడంతోనూ, తినే పదార్ధాలు విస్తర్లనుండి ఎత్తుకు పోవడం, వాళ్ళ మీద రెట్టలు వెయ్యడంతో విసిగించాయి. వీటివల్ల ప్రజలు విసుగు చెంది, వాటిపై బాణాలు వేసేందుకు, పిట్టలను కొట్టే బోయవాళ్ళని పిలుస్తారు. అదిచూసి........... కాకులను కొట్టకండి. 

మీలాగే అవికూడా భండారా యొక్క ప్రసాదంకోసం వచ్చాయే తప్ప, అవి ఏమీ తప్పుచేయలేదు. పిత్రు లోకంలో ఆగకుండా, భాస్కరు ఆత్మ తిన్నగా వైకుంఠం వెళ్ళిపోయింది. సాధారణంగా మరణించినవారి ఆత్మ 10 రోజులు ఆకాశంలో భ్రమిస్తూ ఉంటుంది. 

11వ రోజున అన్నంతో చేసిన ఉండలు (పిండం) కాకులకు ప్రదానం చేసి, కాకులు దానిని ముట్టుకున్న తరువాతే ఆ ఆత్మ ముందుకి ప్రయాణం అవుతుంది. భాస్కరు విషయంలో అతని ఆత్మ తిన్నగా వైకుంఠానికి వెళ్ళి పోయింది కావున, కాకులకు ఈవిధమయిన పిండప్రదానం అవసరంలేదు, అందుకనే కాకులు కోపంగా ఉన్నాయి. 

అతని ఆత్మ వెంటనే ముక్తిపొందింది, మరియు ఈపాటికి వైకుంఠం చేరి ఉంటుంది. ఈ భూప్రపంచం మీద ఉన్నపుడు సర్వం త్యజించాడు కావున, పిండప్రదానం అవసరంలేదు. ఎవరికయితే స్వర్గానికి తిన్నగా వెళ్ళడానికి అనుమతి ఉండదో వాళ్ళకొరకు ఈపిండప్రదానం చెయ్యబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 57 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 11 - part 5 🌻
Now listen to what happened after Hanuman Jayanti celebrations at Adgaon. 

The prasad of 'Kala' was distributed and the day of Panchami dawned. On that day, in the morning, Shri Gajanan Maharaj said to Bhaskar, Bhaskar, your departure is scheduled for today. Facing east, sit in the ‘Padmasan’ posture. 

Make your mind steady and concentrate on Almighty Hari. You are nearing the time of departure. Get prepared!” To others He said, “Keep on loudly chanting ‘Vithal, Vithal, Narayan!’ This brother of yours is going to Vaikunth today. 

Worship him by offering flowers and ‘Bukka’.” Bhaskar sat in the Padmasan posture, concentrated both eyes on the tip of his nose and calmed his mind in a complete surrender to the Almighty. 

All the devotees were offering Puja to Bhaskar and Shri Gajanan Maharaj was happily looking at them. The chanting of holy verses and Bhajan continued till noon when Shri Gajanan Maharaj loudly said, “Har! Har!” and with those words, Bhaskar's soul left for Vaikunth. 

Only those who are blessed by saints go straight to Vaikunth. People asked Shri Gajanan Maharaj about the place for Shri Bhaskar's burial, and He advised them to bury him near the Shiva Parvati temple. 

Then they brought a palanquin and decorated it with leaves of the banana tree. Bhaskar's body was kept in it and carried in a procession with devotees singing Bhajan’s in the front. 

They reached the Dwarkeshwar temple and all rites of Samadhi were performed, near the place of burial. People were weeping with grief, saying that the greatest disciple of Shri Gajanan Maharaj had left them forever. 

From the next day the feeding of poor people in memory of Bhaskar was started. This Shri Krishna Shankar Parvati temple is about a mile to the north of Adgaon. The surroundings of this Shri Krishna temple were very lively with the greenary of trees like Neem, Ashwath, Mandar, Audumbur and many flower plants.

The place is between Akola and Adgaon. The feeding of people, called ‘Sant Bhandara’ continued for ten days. People sat under the tamarind tree for their food, but the crows started to trouble them by continuously cawing, lifting away food from their plates, and even dropping dirt on them. 

All this annoyed the people very much and they called the Bhil to shoot arrows at them. Seeing that, Shri Gajanan Maharaj said, “Don't shoot at the crows. They have done nothing wrong, as they have come here to get the Prasad of the Bhandara, just like you. 

Bhaskar’s soul has ascended straight to Vaikunth without any break on Pitrulok. Normally the soul of a dead person keeps on wandering in the sky for ten days. 

On eleventh day, a ball of rice (Pind) is offered to crows, on whose touching it only, the soul goes ahead. 

In Bhaskar's case, his soul went straight to Vaikunth and so there was no need of offering the rice ball (Pind) to the crows. 

That is why the crows are angry. His soul has been liberated immediately and by this time, has reached Vaikunth. While on earth, he had attained detachment and so needs no offering of rice (Pind). Rice ball offering is given those persons who are not favored with direct ascent to the heaven. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

19 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 58 / Sri Gajanan Maharaj Life History - 58 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 11వ అధ్యాయము - 6 🌻

భాస్కరు ఆత్మ తిన్నగా వైకుంఠానికి వెళ్ళిపోయింది అని ఇప్పుడు కాకులకు తెలిసి అవి కోపంగా ఉన్నాయి, అటువంటి వాటి ప్రవర్తనతో, మాకుకూడా మిగిలిన ప్రజలమాదిరి భాస్కరు ప్రసాదం ఇవ్వవలసింది అని తెలియచేయడమే. 

కావున వాటిని బాణాలతో కొట్టకండి, నేను వాటికి చెపుతాను.....ఓకాకులారా నేను చెప్పేది వినండి. రేపటినుండి ఈస్థలానికి మరల రాకండి, ఎందుకంటే దానివల్ల మా భాస్కరు గౌరవం తగ్గించినట్టు అవుతుంది. ఈరోజు తనివితీరా ప్రసాదం తినండి, కానీ రేపటినుండి ఇక్కడికి రాకండి అని శ్రీమహారాజు అన్నారు. 

శ్రీమహారాజు అన్నది విని భక్తులందరూ సంతృప్తి చెందారు, కానీ కొంతమంది నమ్మకంలేనివారు ఇది అంతా ఒక రభస అని హేళణగా అన్నారు. మనుష్యుల ఆజ్ఞలను పక్షులు ఎలా పాటిస్తాయి ? అని వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకున్నారు. 

మరుసటి రోజు ఆ ప్రదేశానికి శ్రీమహారాజు అన్నమాటల ప్రభావం చూసేందుకు వెళ్ళారు కూడా. అక్కడ ఒక్క కాకి కూడా లేదు. వాళ్ళు ఆశ్ఛర్యపోయి శ్రీమహారాజుకు లొంగిపోయారు. 12 సంవత్సరాలవరకు ఆ స్థలానికి కాకులు తిరిగి రాలేదు. 

14 రోజులు తరువాత తమ మిగిలిన శిష్యులతో శ్రీమహారాజు షేగాం తిరిగి వచ్చారు. ఇప్పుడు మరొక కధ వినండి. ఆ సంవత్సరం దుష్కాలం అవడంవల్ల నీళ్ళకోసం బావి తవ్వడం పని కొనసాగుతోంది. 

సుమారు 10 అడుగులు తవ్వినతరువాత ఒక గట్టి నల్లరాయి తగలడం వల్ల ఇకముందు తవ్వడం అసంభవం అయింది. అందుకని విస్ఫోటకం కోసం గొట్టంలో 4 కన్నాలు చేసారు. ఒకచివరను కన్నంలోకి పోనిచ్చి, విస్ఫోటక సామాగ్రి దానిలో నింపారు. అవిస్ఫోటకాన్ని అంటించడంకోసం చిన్నచిన్న మండుతున్న చెక్కముక్కలను రెండవ చివరనుండి ఆ గొట్టంలోకి జారవిడుస్తారు. 

ఏదో కారణం చేత ఆ చెక్కముక్కలు క్రిందకు వెళ్ళకుండా అడ్డుకున్నాయి. క్రిందనున్న నీరు నెమ్మదిగా ఆవిస్ఫోటకాన్ని చెమ్మ చెయ్యడం మొదలు పెట్టింది. దీనితో ఆవిస్ఫోటకం ఇక పనికిరాకుండా అవుతుంది. ఎవరయినా వెళ్ళి ఆచెక్కముక్కలను గొట్టంలో ముందుకు తోసి పరిస్థితిని కాపాడాలి. 

కానీ ఎవరూ ఆవిధమయిన ప్రమాదమైన పనికి సాహసించడానికి తయారుగాలేరు. గణుజవర్యా అనే పనివాడిని అక్కడ ఉన్న కాంట్రాక్టరు వెంటనే క్రిందికి వెళ్ళమని అంటాడు. అతని బీదరికంవల్ల ఆ ఆజ్ఞ పాటించవలసిందే. అమాయకమైన గొర్రెలను మనం బలి ఇవ్వడం చూస్తాం. 

శ్రీమహారాజు మీద గణుకు అపారమైన విశ్వాసం, కావున ఆయన్ని తలుచుకుని గణు నూతిలోకి వెళ్ళి గొట్టంలో అడ్డుకున్న ఒకదానిని లాగుతాడు. అతను ఇంకొకటి లాగేలోపలే ఆ చెక్కముక్క జారి వెంటనే విస్పోటకం దగ్గరకు చేరింది. మొదటిది ప్రేలుతుంది. గణు నూతిలో ఇరుక్కుపోయాడు. తనని రక్షించవలసిందిగా శ్రీమహారాజును అతను తీవ్రంగా ప్రార్ధించాడు. 

మొత్తం నుయ్యి అంతా పొగతో నిండి పోయింది. రెండవ విస్ఫోటకం అయ్యేలోపల ఒకప్రక్క రాయిని గణు పట్టుకున్నాడు. దానిక్రింద సొరంగంలా ఉంది. గణు వెంటనే దానిలోకి జారిపోయాడు. ఒకదాని తరువాత ఒకటిగా మిగిలిన విస్ఫోటకాలతో చాలా రాళ్ళు బయటకు విసరబడ్డాయి. అక్కడ ఉన్న ప్రజలు గణు కూడా అదే విధంగా ముక్కలు అయిఉంటాడని అనుకున్నారు. 

కాంట్రాక్టరు అతని శరీరం కోసం చుట్టు ప్రక్కల వెతకమని మిగిలిన పనివాళ్ళని అడిగాడు. అదివిని, గణు ఆనూతిలోపలినుండి అరిచాడు. ఓ మి స్త్రీ గణు చనిపోలేదు, నూతిలో క్షేమంగా ఉన్నాడు. శ్రీగజానన్ మహారాజు కృపతో నేను ఒక సొరంగంలో ఉన్నాను. ఒక పెద్దరాయి నేను బయటకు రావడానికి అడ్డంగా ఉంది అని అన్నాడు. 

గణు మాటలు విన్న పనివాళ్ళు చాలా సంతోషించి, క్రిందికి వళ్ళి గునపాలతో ఆరాయిని తొలగించి గణును పైకితీసుకు వచ్చారు. వెంటనే గణు పరుగున శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ సొరంగంలో కూర్చుని ఎన్ని రాళ్ళు నువ్వు బయటకు విసిరావు ? నువ్వు బయటకు రాకుండా అడ్డుపడ్డ ఆపెద్ద రాయే నిన్ను కాపాడింది, భవిష్యత్యులో ఎప్పుడూ కూడా ఇంక ఇటువంటి మండుతున్న గొట్టాలను ఒకసారి అవిక్రిందికి జారినతరువాత ముట్టుకోవడం వంటి సాహసం చెయ్యకు. 

ఒక గొప్పప్రమాదం నుండి నువ్వు రక్షించబడ్డావు, ఇక వెళ్ళు అని శ్రీమహారాజు అన్నారు. ఓ మాహారాజు ఆ విస్ఫోటకాలు ప్రేలినప్పుడు మీరే నాచెయ్య పట్టుకొని సురక్షితంగా ఆ సొరంగంలో పెట్టారు, నన్ను మృత్యవునుండి కాపాడారు అని గణు అన్నాడు. శ్రీమహారాజు గొప్పతనం అటువంటిది, దీనిని వర్ణించడానికి నాదగ్గర మాటలు లేవు. ఈ గజానన్ విజయగ్రంధం భక్తులందరికీ సుఖాన్ని తెచ్చుగాక ఇదే దాసగణు కోరికి. 

శుభం భవతు 

11. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 58 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 11 - part 6 🌻

Now knowing that Bhaskar's soul has gone straight to heaven, the crows are angry and by such behavior, they only want to say that they too be given the Prasad of Bhaskar as was given to other people. So don't shoot at them. I will tell them. Crows listen to what I say; don't come to this place from tomorrow, as it may lower the prestige of My Bhaskar. 

Eat the prasad today to your heart content and don't come here from tomorrow.” All the devotees were pleased to hear Shri Gajanan Maharaj , but a few nonbelievers were sarcastic and said that it was all nonsense. 

“How can birds obey the orders of human beings?” said they to each other. Next day, they even went to that place to see effect of what Shri Gajanan Maharaj had said. There was not single crow there. 

They were surprised and then surrendered to Shri Gajanan Maharaj . The crows did not visit that place for twelve years.After 14 days Shri Gajanan Maharaj returned to Shegaon with his remaining disciples. 

Now listen to another story. It was a year of famine and so the work of digging a well was going on. Digging of about 10 feet was done and then came up a hard black rock making it impossible to dig further. 

So four holes were made for dynamites, and putting the end of string inside, gunpowder was packed in them. The other ends of the strings were taken up and through them were passed small burning wooden pipes, so that they would slide down and ignite the gunpowder.

Somehow, however, the wooden pipes got stuck on the string knots in between; they were not sliding down and the water in the well was about to enter the gunpowder holes, thereby making it ineffective to explode. Somebody had to go down and push the pipe down to save the situation, but nobody was ready to take such a risk. 

The contractor asked Ganu Lavarya to go down the well immediately. Because of his poverty, Ganu had to obey. It is always seen that a poor sheep is killed as an offering to God. 

Ganu had great faith in Shri Gajanan Maharaj and so, remembering Him, he went down the well and pulled one obstructed pipe, which immediately slid down and touched the gunpowder. Before he could pull another one, the first one exploded. Ganu Lavarya was caught inside the well. 

He fervently prayed to Shri Gajanan Maharaj to save him. The whole well got filled with smoke and before the next dynamite exploded, Ganu got hold of one rock on the side below which there was a cavern. Ganu immediately slid into that cavern. 

One after the other, all the remaining dynamites exploded and a lot of stones were thrown out. People thought that Ganu must have been split into pieces and thrown out. The contractor asked other workers to search for the body around. 

Ganu heard him and shouted from inside the well, “O mistry! Ganu is not dead! He is perfectly alive in the well. By the grace of Shri Gajanan Maharaj, I am safe in a cavern here, but there is a big rock obstructing me from coming out. 

People were rejoiced to hear the voice of Ganu and went down the well. They, removing the stones by spades, brought him up. Ganu at once went running to Shri Gajanan Maharaj and prostrated at His feet. 

Shri Gajanan Maharaj smilingly said, “Ganu, hiding inside the cavern, how many stones have you thrown out? It is the big stone, which obstructed you from coming out, that intact saved you. Don't repeat such feats again in the future and never touch an ignited pipe once it has slid down a string. 

Now go! You have been saved from a great disaster today. When people came to know about Ganu, he said O Maharaj! When the dynamite exploded, it was you who, holding my hand, put me inside that safe cavern and saved me from death. 

Such is the greatness of Maharaj for which I have no words to express 

||SHUBHAM BHAVATU||


Here ends Chapter Eleven

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 59 / Sri Gajanan Maharaj Life History - 59 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 12వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓగణపతి, మయూరేశ్వరా వచ్చి నా హృదయంలో కూర్చుని నేను ఈగ్రంధం పూర్తి చెయ్యడంలో నాకు సహాయం చెయ్యండి. మీరు విద్య, తెలివితేటలు ఇచ్చేవారు, మీరే అన్ని విఘ్నాలు తొలగించి భక్తులకోరికలు పూర్తి చేసేది మీరొక్కరే. పురాణాలుకూడా అదే చెపుతున్నాయి. 

ఓ ఏకదంతా, లంబోదరా, పార్వతీసుతా, బాలచంద్రా, సింధూరా నన్ను అన్ని ఆదుర్ధలనుండి బయట పడనివ్వండి. ధనవంతుడు, ఉదారుడు అయిన ఒక బచులాల్ అగరవాల్ అనే వ్యక్తి అకోలాలో ఉండేవాడు. కారంజావాసి లక్ష్మణగుడే వృత్తాంతం విన్నాక అతని మనసులో కొన్ని అనుమానాలు కలిగాయి. 

అతను ఇంకా దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుందాము అని అనుకుంటూ ఉండగా, శ్రీమహారాజు స్వయంగా అకోలా వచ్చి అతని ఇంటికి చేరారు. బచులాల్ అమిత ఆనందంపొంది, శ్రీమహారాజును పూజించాలన్న తన కోరికను ఆయనకు వ్యక్తపరిచాడు. ఆయన తన అనుమతి ఇచ్చారు. 

శ్రీబచులాల్ పూజకొరకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసాడు. మొదట శ్రీమహారాజుకు సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి, తరువాత ఒక పట్టుపంచ, ఒక కాశ్మీరీషాలు మరియు పట్టుబట్టతో చేసిన ఒక ముకుటం ఇచ్చాడు. ఒక బంగారం గొలుసు మెడలో వేసి, అన్ని వేళ్ళకీ బంగారం ఉంగరాలు పెట్టాడు. ఒక వజ్రాల కంకణం ఎడమ చేతికి పెట్టి అత్తరు శరీరంమీద చల్లాడు. తరువాత జిలేబి మరియు ఇతర మిఠాయిలతో భోజనం పెట్టారు. ఆతరువాత ఒక బంగారు పళ్ళెంనిండా సుమారు పదివేల రూపాయలు, నాణాలు ఒక కొబ్బరికాయతో సహా శ్రీమహారాజుకు దక్షిణగా అందించాడు. 

తరువాత చేతులుకట్టుకుని, మహారాజ్ ! రామనవమి ఉత్సవాలు జరిపేందకు నాఇంటి ప్రాంగణంలో స్థలం సరిపోవడం లేదు, కావున నేను శ్రీరాముని మందిరం కట్టాలనుకుంటున్నాను, దయచేసి నాకోరిక పూర్తి చెయ్యండి అని బదులాల్ అన్నాడు. అలాఅంటూ అతివినయంగా తన తలను శ్రీమహారాజు పాదాలమీద పెడతాడు. 

శ్రీ రామచంద్ర భగవానుడు నీకోరిక తీరుస్తారు అని నేను నిన్ను దీవిస్తున్నాను. కానీ ఇన్ని ఆభరణాలు నాశరీరంమీద పెట్టి ఏమిటినువ్వు చేసింది ? నువ్వు నన్ను పోలానాటి ఎద్దును చేసావు. 

నేను ఇలా పోలానాటి ఎద్దునుకాని, దశరానాటి గుర్రాన్ని కాని కాను. ఈ ఆభరణాలు నాకు నిరుపయోగం. ఇవి నాకు ఒక విషంలాంటివి. నేను కనీసం వాటిని ముట్టుకోకూడదు. నన్ను ఇటువంటి ప్రాపంచిక వస్తువులతో ప్రలోభితం చెయ్యడానికి ప్రయత్నించకు. లేక ఇవన్నీ నీసంపత్తిని ప్రదర్శించేందుకు చేసావా ? 

ఎదుటి మనిషి తీసుకుందుకు ఇష్టపడే వస్తువులు మాత్రమే నీవు ఇవ్వాలి. నేను ఒక పిచ్చగా , నగ్నంగా తిరిగే సన్యాసిని. ఇవన్నీ నీవద్దనే ఉండనీ, నీలా సంసారికజీవనం గడిపేవారికి ఇవి ఉపయోగపడతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 59 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 12 - part 1 🌻

Shri Ganeshayanmah! O Ganapati! Mayureshwar! Come, sit in my heart and help me complete this book. You are the giver of knowledge and intelligence and the only one to fulfill the desires of His devotees by removing all the obstacles. Puranas also say so. 

O Ekdanta! Lambodara! Parvatisuta! Bhalchandra! Sindura! Please rid me of all anxieties. There was one Bachchulal Agrawal at Akola a rich and generous person. He had heard about the episode of Laxman Ghude of Karanja which had created some doubts in his mind. 

As he was thinking to find the real fact behind it, Shri Gajana Maharaj, himself, came to Akola and reached his house. Bachchulal was immensely happy and expressed to Maharaj the desire to worship Him. 

Shri Gajanan Maharaj gave his consent. Shri Bachchulal made elaborate arrangements for the Puja; first Shri Gajanan Maharaj was given a bath with scented water and then offered a fine silken pitambar, a Kashmiri shal and a silken pheta. 

A gold chain was placed around His neck and gold rings on all His fingers. A bracelet of diamonds was put on his left arm and perfumes were sprinkled on the body. Then, meals with jalebi and other sweets were given to him. 

Thereafter a golden thali full of rupees and moharas was offered to Shri Gajanan Maharaj as Dakshina which amounted to about Rs. Ten thousands and on it was put a coconut. 

Then, with folded hands, Bachchulal said, Maharaj, I wish to construct a Shri Ram temple as the space in my courtyard is insufficient for the annual celebration of Ram Navami. Kindly fulfill my desire.” 

Saying so he, most reverently, put his head on the feet of Shri Gajanan Maharaj . Then upon Shri Gajanan Maharaj said, “I bless you that God Shri Ramchandra will fulfill your desire. But what have you done this by putting so many ornaments on my body? 

You have made me look like a bullock of the ‘Pola’ festival. You see, I am neither a bullock of Pola nor a horse of Dasherra. These ornaments are of no use to me, or rather they are poison for me and I should not have even a touch of them. 

Don't try to tempt me by all these material attachments or Bachchulal have you done all this exhibit your wealth? You should offer only those things which can be liked by the receiver. I am a mad, wandering, naked saint. Let these things be with you only. It is useful for people leading a family life like you.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

22 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 60 / Sri Gajanan Maharaj Life History - 60 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 12వ అధ్యాయము - 2 🌻

భీమానదీతీరాన్న నిలుచుని ఉన్న నాభగవానుడు నేను కోరుకుంటే ఎంత సంపత్తి అయినా నాకు ఇవ్వగలరు అని శ్రీమహారాజు అన్నారు. 

అలా అంటూ ఆ ఆభరణాలు, బట్టలు తీసిపారవేసి, ఒక చిన్న మిఠాయి ముక్క తీసుకుని వెళ్ళిపోయారు. చాలామంది అకోలావాసులు శ్రీమహారాజు ఈవిధంగా వదలిపోవడం చూసి నిరాశపోందారు. అందులో కొంతమంది కారంజావాసులు కూడా ఉన్నారు. వారు లక్ష్మణగుడే మీద జాలిపడ్డారు, ఎందుకంటే అతనుకూడా బచులాల్ లాగా శ్రీమహారాజును పూజించాడు కానీ, దక్షిణ ఇవ్వడంలో నిష్కపటంగాలేడు.

శ్రీమహారాజుకు ఈవిధమయిన కపటత్వం, మాటలాడడం, దొంగవినయం పసిగట్టడం ఏమీ కష్టమయిన పనికాదు. గుడే పూజ ఉత్తి మాటలమూట. అటువంటి వాళ్ళు దేవుడిని ఆరాధిస్తూ, ఓభగవంతుడా ఈ మహావస్త్రం స్వీకరించు అంటూ నిజంగా అయితే కొన్ని బియ్యంగింజలు ఇస్తారు లేదా ఓభగవంతుడా ఈవిధమయిన మిఠాయిలు స్వీకరించండి అని కొన్ని వేరుశెనగలు అతని ముందు ఉంచుతారు. 

అటువంటి నిజాయితీలేని, కపట పూజలకు అటువంటి ఫలాలే ఆపూజలు చేసినవారికి దొరుకుతాయి. బచులాల్ మాటలు చేష్టలూ ఎలా అయితే ఒకటో అలాకాక లక్ష్మణగుడే ఇటువంటి ప్రవర్తనకు చెందినవాడు. ఎవరయితే యోగుల ఆశీర్వాదాలు పొందుతారో వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. 

బచులాల్ ఆతరువాత అకోలా అంతా శ్రీమహారాజు కొరకు వెతికాడు కానీ ఆయన లభ్యంకాలేదు. షేగాంలో శ్రీమహారాజువారి మఠంలో షింపికులానికి చెందిన పీతాంబరు అనేపేరుగల ఒక భక్తుడు ఉండేవాడు. అతను శ్రీమహారాజుకు అత్యంత నిజాయితీతో సేవలు చేసాడు, దానికి ఫలితం పొందేకాలం వచ్చింది. ఒకరోజు అతను ఓర్నావస్థలో ఉన్న ఒక ధోతి కట్టుకుని ఉంటాడు. అది చూసి శ్రీమహారాజు...నీపేరు పీతాంబరు కానీ ఒకమంచి పీతాంబరంకూడా నీకు కట్టుకుందుకు లేదా ? కనీసం నీపిరుదలు అయినా ఎవరూ చూడకుండా ఉండేలా కప్పబడేట్టు కట్టుకో. 

ఇది ఎలా ఉందంటే సోనూబాయి అన్నపేరుగల స్త్రీ దగ్గర కనీసం అల్యుమినియం గాజులయినా లేనట్టు, లేదా గంగాబాయి అనే పేరుగల స్త్రీ నీళ్ళకోసం చనిపోయినట్టు, నీవిషయం అలానే ఉంది. నీవు కట్టుకున్న ధోతర ఇల్లు అలకడానికి మాత్రమే పనికి వస్తుంది. అటువంటి బట్టలు వేసుకోవడంవల్ల నీ పిరుదలను ప్రదర్శిస్తున్నావు. 

నేను ఇస్తున్న ఈధోతర తీసుకుని, ఏవిధమయిన సంకోచం లేకుండా కట్టుకో, మరి ఎవరు తీయమన్నా తీయకు అని అన్నారు. పీతాంబరు ఆయన మాటపాటించి ఆధోతర కట్టుకుంటాడు, కానీ ఇతరులు దీనిని సహించలేక పోయారు. ప్రాపంచిక వ్యవహారాలు ఇలానే ఉంటాయి. స్వార్ధంకలిగి ఉండడంవల్ల స్వంత అన్నదమ్ములే శత్రువులవుతారు. ఈవిషయం మీదమాట్లాడుకొని ప్రయోజనం లేదు, ఎందుకంటే మురికి కుండి మూతతీస్తే చెడువాసన మాత్రమేవస్తుంది. 

అక్కడ చాలామంది తమను తాము శ్రీమహారాజు శిష్యులమని ఊహించుకొనేవారు ఉన్నారు కానీ అందులో నిజమయిన శిష్యులు మాత్రంచాలా తక్కువ. అటువంటి వారిని వేళ్ళమీద లెఖ పెట్టవచ్చు. ఇది, అడవులో అనేకమయిన వృక్షాలమధ్య కొన్ని గంధం చెట్లున్న మాదిరిగా ఉంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam


🌹 Sri Gajanan Maharaj Life History - 60 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 12 - part 2 🌻

My lord standing on a brick on the bank of Bhima can give me any wealth I want.” Saying so, He removed all the ornaments and clothes and threw them away and took only a piece of sweet and went away. Many people of Akola witnessed this and were unhappy to see Shri Gajanan Maharaj leaving like that. 

Amongst them, some were from Karanja, who felt sorry for Lakshman Ghude who worshipped Maharaj like Bachchulal, but was not sincere while offering Dakshina. It was not difficult for Shri Gajanan Maharaj to understand his hypocrisy, how talk, and false modest. Ghude's Puja was of only words. 

Such people while worshipping say O God! Accept this Mahavastra and actually may offer some grains of rice only, or O God! Accept these sweets, may put before Him some grains of groundnut. Such dishonest and hypocritical worship gives the same type of fruit to the worshipper. Laxman was a victim of such behavior unlike Bachchulal, whose actions and words were the same. 

So Bachchulal's prosperity never receded; he, who gets blessings of saint, ever remains happy. Bachchulal thereaft searched for Shri Gajanan Maharaj in whole of Akola, but could not get him. At Shegaon, in the Matth of Shri Gajanan Maharaj , there was one devotee named Pitambar, a Shimpi by caste.

He rendered most sincere service to Shri Gajanan Maharaj whereby his devotion bore fruit. Once, it so happened, that he was wearing a dhoti which was in tattered condition. 

Looking to that Shri Gajanan Maharaj said, “Eh, your name is Pitambar and you don't have even a good dhoti to wear! Atleast try to cover your buttocks which are being seen by others. It is just like woman by the name Sonubai going without even aluminium bangles, or a lady by the name Gangabai dying for want of water. 

Same is the case with you. This dhoti is useful only for making a duster. By wearing such clothes, you are exposing your buttocks. Take this Dupatta, which I am giving you, and wear it without hesitation. Never remove it at anybody's asking you to do so.” 

Pitambar obeyed and wore the Dupatta, but the others could not tolerate it. It is the way of the world that, in the wake of selfishness, your own brothers become your enemies. There is no use talking over this subject as by opening the drainage you get bad smell only.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

23 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 61 / Sri Gajanan Maharaj Life History - 61 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 12వ అధ్యాయము - 3 🌻

శ్రీమహారాజు చుట్టూ ఉన్న ప్రజలవిషయం కూడా ఇలానేఉంది. శ్రీమహారాజు ఈవిధంగా పీతాంబరుకు దుప్పట్ట ఇవ్వడంచూసి, మిగిలిన శిష్యులు ఈర్ష్యతో పీతాంబరును ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టారు, మరియు శ్రీమహారాజు కోసం నిర్దేశించబడ్డ దుప్పట్ట తను ధరించరాదని అంటారు. జవాబుగా శ్రీమహారాజే తనను ప్రత్యేకంగా దానిని కట్టుకోమన్నారు. ఆయన ఆజ్ఞను అమలు పరిచాను అని పీతాంబరు అన్నాడు. 

ఇలా శ్రీమహారాజు శిష్యులమధ్య గొడవ ప్రారంభం అయింది. దీనినుండి బయట పడడానికి పీతాంబరుతో. పీతాంబరా తల్లి తన ఎదిగిన, తెలివయిన పిల్లవాడిని వేరేఉంచినట్టు నువ్వు ఇప్పుడు ఇక్కడనుండి దూరంగా వెళ్ళు. నా ఆశీర్వాదాలు నీతో ఎల్లప్పుడూ ఉంటాయి. వెళ్ళి దిగజారుతున్న వారిని రక్షించు అని శ్రీమహారాజు అన్నారు.

కళ్ళనీళ్ళతో పీతాంబరు శ్రీమహారాజుకు నమస్కరించి తరువాత మాటిమాటికీ వెనక్కి చూస్తూ, బరువైన కళ్ళతో మఠాన్ని వదిలి పెట్టాడు. అతను కొండలి చేరి, శ్రీమహారాజు యొక్క నామజపంచేస్తూ ఒక చెట్టుక్రింద ధ్యానంలో కూర్చున్నాడు. రాత్రి అంతా ఆవిధంగా చెట్టుక్రింద కూర్చున్నాడు, కానీ ఉదయం అయ్యేసరికి చీమలు శరీరంమీదకి ఎక్కడం మొదలు పెట్టడంవల్ల చెట్టుమీదకు ఎక్కి ఒకకొమ్మ మీద కూర్చున్నాడు. 

అక్కడకూడా ఈ చీమల భాద అతను ఎదుర్కోవలసి వచ్చింది. అందువల్ల అతను సురక్షితంఅయిన స్థలంకోసం, చిన్నలేదా పెద్ద కొమ్మలమీదకు వెళతాడు, కానీ అతనికి అటువంటి స్థలం దొరకలేదు. అక్కడ దగ్గరలో కొంతమంది గొల్లపిల్లవాళ్ళు ఉన్నారు. పీతాంబరు ఈవిధంగా చెట్టుమీద కదలడంచూసి వాళ్ళు ఆశ్ఛర్యపోయారు. ఈవిధంగా అతను ఒకకొమ్మ మీదనుండి ఇంకొక కొమ్మమీదకు వెళ్ళడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరియు అతను అతిచిన్న కొమ్మమీదకి వెళ్ళినా పడిపోక పోవడంతో వీళ్ళు మరింత ఆశ్చర్యపోయారు.

శ్రీగజానన్ మహారాజు శిష్యులు ఈవిధమయిన చమత్కారాలు చేస్తూఉంటారు, కావున ఇతనుకూడా శ్రీమహారాజు శిష్యుడయి ఉండాలి అని అందులో ఒకరు అన్నారు. తరువాత వాళ్ళు గ్రామంలోకి తిరిగి వెళ్ళి, ఆమామిడి చెట్టు దగ్గర వాళ్ళుచూసిన విషయంగూర్చి మిగిలినవాళ్ళకి చెపుతారు. ఆవిధంగా ఆగొల్లపిల్లల ద్వారా కధనంవిన్న కొండలి ప్రజలు, ఆమనిషి ఎవరో తెలుసు కుందుకు ఆమామిడి చెట్టుదగ్గరకు వచ్చారు. 

పీతాంబరును వాళ్ళుచూసి, అతను ఒకకపటి అనీ, ఇటువంటి తమాషాలతో మనల్ని తను శ్రీమహారాజు శిష్యుడని అనుకునేలా చెయ్యడానికి చేస్తున్నాడని అనుకున్నారు. భాస్కరుపాటిల్ అనే ఒక నిజమయిన శ్రీమహారాజు శిష్యుడు ఉండేవాడు కానీ అతను ఈమధ్యకాలంలోనే చనిపోయాడు. శ్రీమహారాజు శిష్యులు షేగాంలో దొరికే మిఠాయిలు విడిచి పెట్టిరారని కొందరు అన్నారు. చివరికి వాళ్ళు ఒక అభిప్రాయం ఏర్పరుచుకునేముందు, పీతాంబరునే తను ఎవరయినదీ, ఎక్కడనుండి వచ్చినదీ మరియు తన గురువు ఎవరు అన్నదీ వాళ్ళలో ఒకరు అడుగుతారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 61 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 12 - part 3 🌻

There were many people claiming to be the disciples of Shri Gajanan Maharaj , but real devotees were very few who could be counted on finger tips. It was like a few sandalwood trees in the midst of scores of other trees in the forest. 

Same was the case with people around Shri Gajanan Maharaj. Seeing that a Dupatta was given to Pitambar by Shri Gajanan Maharaj , the other disciples started teasing Pitambar out of jealousy; they said that he should not wear the Dupatta which in fact was meant for Shri Gajanan Maharaj . 

In reply Pitambar said that he only obeyed the orders of Shri Gajanan Maharaj who had specifically told him to wear it. Thus, the incident created rift among the disciples of Shri Gajanan Maharaj , who to overcome it, said to Pitambar, “Pitambar, now you go away from here, as a grown up and wise child is kept aloof by his mother. My blessings are with you. Go and save the fallen ones. 

With tears in his eyes, Pitambar prostrated before Shri Gajanan Maharaj and with lingering eyes, looking back again and again, left the Matth. He reached Kondholi and sat under a tree meditating with the name of Shri Gajanan Maharaj on his lips. He was sitting there for the whole night; as ants started climbing his body in the morning, he went up the tree and sat on a branch. 

There too he had to face the menace of ants, and so went from branch to branch, small or big, to find out a safer place to sit, but could not get any. There were some cowheards nearby who were surprised to see Pitambar moving like that on the tree.

They could not understand the reasons for his such going from branch to branch like a monkey, and were more surprised to see that he did not fall down even by going on smallest of the branches. 

One of them said that disciples of Shri Gajanan Maharaj do perform miracles like this, and so he thought that this man must be a disciple of Shri Gajanan Maharaj . Then they went back to the village and told other people about what they had seen near that mango tree. 

Hearing the story from the cowherds, the people of Kondholi came to the mango tree to find out who this person was. Seeing Pitambar, they thought that he must be hypocrite doing all these tricks to make them believe that he was a disciple of Shri Gajanan Maharaj. 

There was one Bhaskar Patil, a real disciple of Shri Gajanan Maharaj, but recently he had passed away. Some said, disciples of Shri Gajanan Maharaj are not likely to come here, leaving the sweets they get at Shegaon.

Ultimately they thought it better to ask Pitambar himself about him before forming any opinion. So one of them asked Pitambar as to who he was, why he had come there and who his Guru was.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

24 Sep 2020

------------------------------------ x ------------------------------------




🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 62 / Sri Gajanan Maharaj Life History - 62 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 12వ అధ్యాయము - 4 🌻

నేను షేగాంనివాసి షింపి పీతాంబరును. శ్రీగజానన్ మహారాజు శిష్యుడను, ఇక్కడికి మాగురువు ఆదేశానుసారం వచ్చాను, నేను ముందు మామిడి చెట్టు క్రిందకూర్చున్నాను కానీ చీమలు నావంటిమీద ఎక్కడంతో నేను చెట్టు ఎక్కి కొమ్మలమీద కూర్చున్నాను అని పీతాంబరు అన్నాడు. ఈ జవాబుకి ప్రజలకు కోపంవచ్చింది. ఆమాహాయోగి పేరు ఉపయోగించుకుని తమని వెర్రివాళ్ళను చెయ్యవద్దని వాళ్ళు అతనిని హెఛ్ఛరిస్తారు. నేను, ఒక రాజుగారి మాహారాణిని, ఇక్కడకు బ్రతుకు తెరువుకోసం పనిచెయ్యడానికి వచ్చాను అన్నట్టు ఉంది నీమాట అని అతనిని ఇంకా గదమాయించారు. వెర్రివాడా నేను చెప్పేదివిను..... శ్రీగజానన్ మహారాజు స్వయానభగవంతుడు, నువ్వు ఆయన పేరు కించపరుస్తున్నావు.

శ్రీ మహారాజు ఒకసారి మామిడిపళ్ళు వచ్చేసమయంకాని సమయంలో ఒక మామిడి చెట్టుమీద మామిడిపళ్ళు సృష్టించారు, ఇప్పుడు ఈఎండి పోయిన బలిరాంపాటిల్ మామిడి చెట్టుమీద కనీసం ఆకులయినా సృష్టించమని నిన్ను మేము సవాలు చేస్తున్నాం. ఆవిధంగా చెయ్యి, లేదా మాచేత దెబ్బలకు తయారుగా ఉండు. నువ్వు అలాచేస్తే మానుండి పూర్తి గౌరవం పొందుతావు, 

సాధారణంగా మాహాయోగుల శిష్యులకూడా కొంతవరకు తమగురువు శక్తులను పొందడంచూస్తాం. కావున ఆలస్యం చెయ్యకు. ఈ చెట్టును ఆకులతో ఆకుపచ్చగా చెయ్యి అని ఆగ్రామానికి చెందిన షామారావ్ దేశ్ ముఖ్ అన్నాడు. పీతాంబరు భయపడి, దయచేసి నన్ను ఇలా ఇరికించకండి. 

నేను చెప్పేది వినండి. వజ్రాలు గుళకరాళ్ళు ఒకే ఘనిలో ఉండడం మీరు చూస్తారు. నాగురించి మీతో నిజం చెప్పాను. శ్రీగాజనన్ మహారాజు శిష్యులలో నన్ను ఒక గుళకరాయిగా భావించి నిర్లక్షించండి. నేను చెప్పినది ఏమీ అబద్ధం కాదు. ఒకగుళకరాయి ఘని ప్రాముఖ్యతను తగ్గించలేదు. నాగురువు పేరునునేను దాపరికం చెయ్యలేను అని అన్నాడు. అర్ధంలేని మాటలు అనకు. 

శిష్యుడు ఎప్పుడయినా ఆపదలో ఉండి సహాయంకోసం ప్రార్ధిస్తే, అవసరమయిన గుణాలు పూర్తిగా లేకపోయినా శిష్యుడిని కాపాడడానికి ఆయన ఆదుకుందుకు వస్తాడు అని షామరావ్ అన్నాడు. దానితో పీతాంబరు పరిస్థితి, ముందు నుయ్యి, వెనుక గొయ్యి మధ్య ఇరుకున్నట్టు అయి చింతితుడయ్యాడు. నిశ్సహాయంగా అనిపించింది. ఇకముందు ఏమి అవుతుందో చూసేందుకు ప్రజలంతా ఆమామిడి చెట్టుచుట్టూ చేరారు. 

పీతాంబరు నిశ్సహాయంగా చేతులు కట్టుకుని శ్రీమహారాజును ప్రార్ధించడం మొదలు పెట్టాడు. ఓ స్వామి గజాననా, నానారాయణా నా రక్షణకు పరుగురండి. నావలన వీళ్ళు మిమ్మల్ని నిందిస్తున్నారు. మీగొప్పతనం నిలబెట్టడం కోసం ఈ చెట్టును ఆకులతో ఆకుపచ్చగా చెయ్యండి, నేను పూర్తిగా మీమీద ఆధారపడి ఉన్నాను. నన్ను కాపాడేందుకు రండి, లేదా నేను ఇక్కడ మృత్యువును ఎదుర్కోవలసి వస్తుంది. 

ప్రహ్లాదుని మాటలు నిలబెట్టడానికి సంబంలో నరహరి ప్రత్యక్షం అయ్యారు మరియు ఏ సూదయిన స్థంబంపై జానాబాయిని చంపదలుచుకున్నారో అది నీళ్ళవలె మారింది. జానాబాయి భగవంతుని మీద ఆధారపడింది, నన్ను నేను మీకు అప్పగించు కుంటున్నాను. భగవంతునికీ యోగికీ మధ్య తేడాలేదు. భగవంతుడే యోగి, యోగే భగవంతుడు.

నాకు శ్రీగజానన్ మహారాజు శిష్యునిగా తప్ప, స్వయంగా వేరే ఏమీ అస్థిత్వంలేదు. కనుక మీగౌరవం ఇప్పుడు పరీక్షకు పెట్టబడింది. హారంలోని పువ్వులవల్ల దారానికి ప్రాముఖ్యత దొరుకుతుంది. మీరు పువ్వు, నేను దారాన్ని, మీరు కస్తూరి నేను మట్టిని. మీవల్లనే నేను ఈ ఉపద్రవంలో చిక్కుకున్నాను, దయచేసి ఇక ఎంతమాత్రం నన్ను పరీక్షించక పరుగున వచ్చి ఈ చెట్టుమీద చక్కని పచ్చని ఆకులు సృష్టించండి. ఇలా ప్రార్ధిస్తూ అక్కడివారినందరిని షేగాం శ్రీగజానన్ మహారాజు యొక్క నామస్మరణ భజనగా చెయ్యడానికి పీతాంబరు పిలుస్తాడు. 

అలా జైగజానన్ జైగజానన్ అనే భజన ప్రారంభం అయింది. ఇది కొంతసమయం వరకు సాగిన తరువాత ఒక చమత్కారం జరిగింది. నాజూకయిన చిగుళ్ళు ఆచెట్టుమీద రావడం మొదలయి, కొద్దిసేపటిలో పూర్తిగా ఆచెట్టు ఆకుపచ్చగా అయింది. ఆ పారిస్తూ అక్కడి అనే భజన ప్రా, కొద్దిసేప ప్రజలు ఆశ్చర్యంతో చూసారు. కొంతమంది అదికల అనుకుని, ఒకరినొకరు గిల్లుకొని చయాసుకొని, అదికల కాదని సంతృప్తిపడ్డారు. మిగిలిన వాళ్ళు అది ఒకగారడి అనుకున్నారు. ఆచిగుళ్ళు తెంపితే పాలు వచ్చేసరికి ఆసందేహం కూడా తొలగిపోయింది. 

అప్పుడు వాళ్ళకి శ్రీగజానన్ మహారాజు వల్లనే ఆచెట్టుమీద ఆకులు వచ్చాయని సమ్మతించారు. ఇది పీతాంబరు గొప్పదనాన్ని వాళ్ళు అంగీకరించేలా చేసింది. ఆవు దూడకోసం వెళ్ళినట్టు, శ్రీమహారాజు ఎప్పటికయినా తన శిష్యుని చూసేందుకు కొండలి రావచ్చనే ఆశతో, వాళ్ళు పీతాంబరును కొండలి తీసుకు వెళ్ళారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 62 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 12 - part 4 🌻

Pitambar said, “I am resident of Shegaon named Shimpi Pitambar, and a disciple of Shri Gajanan Maharaj. I have come here as per my Guru's orders. I first sat under the mango tree, but due to a lot of ants climbing my body, went up the tree and sat on the branches. 

The people assembled there got angry at this reply and warned him not to fool them by using the name of a great saint. They further taunted that it was like saying he was a queen of a king and had come there to do a laborer's job for livelyhood. Shamrao Deshmukh of that village said, “You impostor! Listen to me, Shri Gajanan Maharaj is God himself and you are tarnishing His name.

You fool! Do you know that once Shri Gajanan Maharaj created mangoes on a mango tree out of season? He created mangoes and now we challenge you to create atleast leaves on this dried up tree of Baliram Patil. Do it or get prepared for a beating from us. 

If you do so you will get all the respect from us. It is generally seen that disciples of great saints, to some extent, attain the heights of their Guru. So don't delay! Make this tree green with leaves.” 

Pitambar got frightened and said, “Please don't corner me like this. Listen to what I say. You see, diamonds and pebbles are found in the same mine. I told you the truth about me. You can very well treat me a pebble amongst the disciples of Shri Gajanan Maharaj and ignore. 

What I said is not a lie at all. A pebble does not lower the importance of the mine. I cannot hide the name of my Guru. Thereupon Shamrao said, “Don't talk nonsense! Whenever a disciple is in difficulty, he prays for the favor of his Guru, who does come to the rescue of the disciple even if he has not attained the real height required for a disciple.”

Thus Pitambar was caught between the devil and the sea; he got worried and felt helpless. All the people gathered around the mango tree to see what would happen further. Helplessly Pitambar folded his hands and started praying Shri Gajanan Maharaj , “O Swami Gajanan! My Narayana! Come running for my rescue. 

Because of me they are blaming You. Make this tree green with leaves for the sake of Your greatness. I am entirely depending on You. Come for my sake, else I will have to face death here. Narhari appeared in a pillar to uphold the worlds of Pralhad and the pointed piller on which Jananbai had to be killed, turned into water.

Janabai depended on God and I entrust myself to You. There is no difference between God and saint. God is saint and saint is God. I am recognized as a disciple of Gajanan Maharaj and have no individual existence. So it is You whose honor is at stake. 

Thread gets importance because of the flowers in the garland. You are the flowers and I am the thread. You are musk (kasturi) and I am mere dust. I am caught in this calamity because of You. Please don't test me any more, and come running to create fine green leaves on this tree.” 

Praying thus, he called upon the peple to chant, in chorus, the name of Shri Gajanan Maharaj of Shegaon. So the bhajan started saying “Jai Gajanan” – “Jai Gajanan”. This continued for some time, and there was the miracle! Delicate green leaves started shooting out on the tree and soon it was all green. 

People looked at it in wonder. Some of them thought that it could be a dream, so they just pinched each other and were satisfied that it was not a dream. Others thought it to be some sort of an illusion. Howver, that doubt too was removed as white liquid drops came out on plucking the leaves. 

Then they were convinced that the leaves came on the tree because of Shri Gajanan Maharaj. This made them accept the greatness of Pitambar; they took him to Kondholi with hope that some day, like a cow going to its calf, Shri Gajanan Maharaj may too come to Kondholi to see His disciple. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #GajananMaharaj #గజాననమహరాజ్

25 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 63 / Sri Gajanan Maharaj Life History - 63 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 12వ అధ్యాయము - 5 🌻

శ్రీరామదాసు స్వామి తన శిష్యుడయిన కళ్యాణోను డోంగంలో ప్రజలను ఉద్ధరిచడంకోసం పంపినట్టు, శ్రీమహారాజు పీతాంబరును కొండలి పంపించారు. ఇది కొండలి అదృష్టం. ఆమామిడి చెట్టు ఇప్పటికీ కొండలి లో ఉంది. ఇది చుట్టుప్రక్కల ఉన్న మామిడి చెట్లు అన్నిటికంటే కూడా ఎక్కువ కాస్తుంది. కొండలి ప్రజలు పీతాంబరును గౌరవించడం మొదలు పెట్టారు. అతను అక్కడ ఒక మఠం స్థాపించి అక్కడనే మరణించాడు. 

ఒకసారి షేగాంలో శ్రీమహారాజు అసహనంగా ఉండడం చూసి, ఆయన శిష్యులు ఆయనను దానికి కారణం అడిగారు. రోజానాకు వక్క ఇచ్చే కృష్ణా పాటిల్ పోయాడు. ఈరోజునేను అతనిని తలుచు కుంటున్నాను. అతని కొడుకు అయిన రాం చాలాచిన్నవాడు. మరినాకు అలా వక్కఇచ్చే వాళ్ళు ఎవరూలేరు, రాం పెద్దవాడయిన తరువాత బహుశ నాకు సేవచెయ్యవచ్చు, కాబట్టి ఈమఠంలో ఇకనుండి ఉండదలుచుకోలేదు అని శ్రీమహారాజు జవాబు ఇచ్చారు. 

ఈమాటలు ప్రజలకు ఆదుర్దా కలిగించాయి, ఎందుకంటే ఆయన మఠం విడిచి పెడతాననడానికి ఇది చక్కటి సంకేతం. ఆయన కాళ్ళు పట్టుకుని, ఆయనను షేగాం విడవవద్దని అనడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. శ్రీపతిరావు, బనకటలాల్, తారాచందు, మారుతి మరియు ఇతరులు వచ్చి శ్రీమహారాజు కాళ్ళు పట్టుకొని... మహారాజ్ దయచేసి మానుండి దూరంగా వెళ్ళి మమ్మల్ని విడవకండి. మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉండండి కానీ షేగాం వదలకండి అన్నారు. 

ఈ షేగాం ప్రజలలో విభజనలు అయ్యాయి. కావున నేను ఎవరి ఇంటిలో ఉండడానికి ఇష్టపడటంలేదు. ఎవరి సొంతంకాని స్థలం ఇస్తే బహుశా షేగాంలో ఉంటాను అని తదుపరి ఆయన అన్నారు. ఆయన ఈకోరిక ప్రజలను చిక్కు పరిస్థితిలో పెట్టింది. ఎవరి స్థలంలో ఆయన ఉండేందుకు తయారుగాలేరు. అంటే ఇక ప్రభుత్వంనుండి స్థలంపొందడం ఒక్కటే ఉపాయం. 

కానీ విదేశీయుల ప్రభుత్వానికి మనయోగుల మీద గౌరవం ఎలా ఉంటుంది ? కావున అటువంటి విషయావస్థలో పెట్టవద్దని శ్రీమహారాజును బనకటలాల్ అన్నాడు, ఎందుకంటే ఈ పరదేశ ప్రభుత్వం స్థలం విరాళంగా ఇస్తుందని నమ్మకంలేదు. తమలో ఎవరి స్థలం అయినా అడగండి అని మరోసారి వాళ్ళు శ్రీమహారాజును వేడుకున్నారు. దానికి.మీరు అవివేకులు. ఈస్థలం అంతా ఆమహాశక్తి వంతుడిది అని తెలుసుకోండి. చాలామంది రాజులు వచ్చారు, నశించారు కానీ ఈ స్థలం, భూమి ఎప్పటికి పాండురంగకు చెందిందే. 

రాజులు ఆనవాయితీ ప్రకారం భూములు పొందుతారుతప్ప వేరే ఏమీలేదు. వెళ్ళి హరిపాటిల్ చేత ప్రయత్నం చెయ్యించండి. ఈప్రభుత్వంనుండి స్థలం పొందడంలో మీరు సఫలీకృతులు అవుతారు అని శ్రీమహారాజు అన్నారు. ప్రజలు హరిపాటిల్ దగ్గరకువచ్చి, ఆయన సలహాతో ప్రభుత్వానికి స్థలంకోసం అర్జీ ఇస్తారు. బులదానా జిల్లాకి కరి కలక్టరు. అతను అంగీకరించి ఒక ఎకరం స్థలం ఆ అర్జీకి ఇస్తాడు. 

మొదటిగా ఒక ఎకరం స్థలం కేటాయిస్తున్నాను, కానీ దానిని సరిగా ఉపయోగించి, ఒక సంవత్సరంలో అభివృద్ధి చేస్తే ఎక్కువ స్థలం కేటాయిస్తానని తన అధికార పత్రంలో అన్నాడు. ఆ కలెక్టరు యొక్క ఆ నిర్ణయం ఇప్పటికీ రికార్డులో ఉంది. ఇదంతా శ్రీగజానన్ మహారాజు మాటవల్ల అయింది. తరువాత హరి మరియు బనకటలాల్ విరాళాలు సంపాదించడం మొదలు పెట్టి త్వరలోనే అవసరమయిన సొమ్ము పోగుచేసారు. తరువాత కట్టడంమొదలు పెట్టారు.తరువాత కధ మరుసటి అధ్యాయంలో వర్ణించబడింది. 

భగవంతుడు యోగులకోరికలు తీర్చేందుకు ఎల్లప్పుడూ తయారుగా ఉంటాడు. డోంగరగాం విరూపాటిల్, వాడెగాం లక్ష్మణపాటిల్ మరియు షేగాం జగ్గుఅబ్బాలు విరాళ సేకరణకి ప్రతినిధులు. ఓ శ్రోతలారా మీ స్వయంఅభివృద్ధికి అమూల్యమయిన ఈ గజానన్ విజయను చిత్తశుద్ధితో వినండి. ఓం శ్రీహరిహరార్పణమస్తు. 

శుభం భవతు 

12. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 63 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 12 - part 5 🌻

Shri Ramdas Swami had sent His disciple Kalyan to Domgaon for the spiritual upliftment of the people there, likewise this Pitambar was sent to Kondholi by Shri Gajanan Maharaj. It was the good luck of Kondholi. 

That mango tree is still there at Kondholi and bears more mangoes than any other in the vicinity. People of Kondholi started respecting Pitmaber. He established a Matth at Kondholi and also died there. At Shegaon, once, Shri Gajanan Maharaj was found to be restless, so His disciples asked him the reason for it. 

Shri Gajanan Maharaj replied, Krishna Patil, who used to give me a nut (supari) daily, is gone and today I am remembering him. His son, Ram, is now very young, and as such there is nobody to give me a supari. Ram may render me his services when he grows up. 

So I do not wish to stay in this Matth hereafter. These words created anxiety in the minds of people as it was a clear indication of His intention to leave the place. They decided to catch His feet and desist Him from leaving Shegaon. 

Shripatrao, Bankatlal, Tarachand, Maroti and others came and touching the feet of Shri Gajanan Maharaj , said, Maharaj, please don't leave us by going away from here. You may stay wherever you like, but don't leave Shegaon. 

Shri Gajanan Maharaj replied that since the people of Shegaon were divided amongst themselves, he did not wish to stay in anybody's house. He, however, added that He might stay in Shegaon if given a place not owned by anybody. 

This demand put the people in a very awkward position. He is not ready to stay in anybody's place, so the only alternative is to get land from the government. But how could a foreign government have respect for our saint? 

So Bankatlal requested Shri Gajanan Maharaj to not put them in such a difficulty as there was no guarantee of this alien govenment donating land for the religious purpose. They again requested Shri Gajanan Maharaj to ask for anybody's place from amongst them. 

Shri Gajanan Maharaj said, You are ignorant people. Know that the land is fully owned by Almighty. Many Kings came and vanished, but this land always belonged to Pandurang. Kings own land by the way of tradition and nothing more than that. 

Go and try at the hands of Hari Patil. You will succeed in getting the land from the government. People came to Hari Patil and, after consultation with him, applied to the government for land. Mr. Kari was the District Collector at Buldana. He agreed and gave one acre of land on that application.

In his order he had said that initially he had sanctioned only one acre of land, but if they used and developed it properly, within year, more land would be sanctioned. That decision of the Collector is still there on record. This was all due to the ‘word’ of Shri Gajanan Maharaj . 

Then Hari Patil and Bankatlal started the collection of funds and the required amount was soon collected. Thereafter, the construction was started. Subsequent story will be narrated in the next chapter. 

God is always ready to fulfill the wishes of saints. Vithu Patil of Dongargaon, Laxman Patil of Wadegaon and Jagu Aba of Shegaon were the leaders in the collection of donations. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Twelve

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

26 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 64 / Sri Gajanan Maharaj Life History - 64 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 13వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశయనమః ! ఓశ్రీహరీ మీరు మహాయోగి, దయాసాగరుడవు మరియు గోప, గోపికలకు స్నేహితులు. ఓశ్రీహరి దయచేసి మీరు నాకు ప్రత్యక్షం కండి. మీదైవత్వం చూసేందుకు బ్రహ్మదేవుడు గోకులంనుండి ఆవులను దూడలను దొంగిలించవలసి వచ్చింది. ఆసమయంలో మీరు స్వయంగా ఆవులు దూడలుగా అయి మీ దైవత్వాన్ని బ్రహ్మదేవునకు ప్రత్యక్షించారు. 

యమున లోని కాళీయ అనే తాచుపామును చిత్తుచేసి అక్కడనుండి అతనిని రమణిక ద్వీపం పంపించి గోపాలులకు అతని బాధనుండి ముక్తి కలిగించారు. అదేవిధంగా నాదురదృష్టాన్ని అణచివేసి నన్ను అన్ని భయాలనుండి విముక్తుడిని చెయ్యమని వేడుకుంటున్నాను.

ఓహరీ నేను అతి తెలివితక్కువయిన మీభక్తుడను, మీదీవెనలకు అర్హుడను, తగినవాడినీ కాను అయినా మీసహకారం, కృపయానాయందు ఉంచి నన్ను ఈచింతలన్నిటినుండి వెంటనే ముక్తుడిని చెయ్యమని కోరుకుంటున్నాను. 

ఇప్పుడు వినండి.... బనకట్, హరి, లక్ష్మణ్ విథు మరియి జగదియోలు కలిసి శ్రీమహారాజు మఠానికి విరాళాలు కోసం తిరిగారు. నమ్మకం ఉన్నవాళ్ళు వెంటనే ఇచ్చారు, మరికొంతంమంది ఆకతాయి ప్రజలు మీయోగికి విరాళం అవసరం ఎందుకు ? శ్రీగజానన్ మహారాజు గొప్ప యోగి, ఏవిధమయిన చమత్కారమైనా చెయ్యగలవాడు అని మీరు ఎప్పుడూ అంటూఉంటారు కదా, మరి తన మఠం కోసం డబ్బు అవసరం ఎందుకు వచ్చింది ? 

కుబేరుడు ఆయన బ్యాంకరు, ఈ విధంగా ప్రతిగుమ్మం దగ్గరకూ డబ్బుకోసం వెళ్ళనవసరంలేకుండా కుబేరుని పేర ఒక హుండీ తీస్తే సరిపోతుంది అని అన్నారు. దానికి జగదియో నవ్వి, ఈ విధంగా విరాళాల కోసం యాచించడం మీమంచికోసమే.శ్రీమహారాజుకోసం మఠం కానీ మందిరం కానీ నిర్మించవలసిన అవసరంలేదు. ఈ ప్రయాస అంతా మీ సుఖసంతోషాల కోసమే. ఈ ప్రపంచం అంతా శ్రీమహారాజుకు మఠం, ఈ అడవులన్నీ ఆయనకి ఉద్యానవనాలు, మరియు భూమి ఆయనకు శయనశయ్య. 

ఎనిమిది సిద్దులు ఆయనకు సేవలు చేస్తూఉంటాయి. నీగురించి ఆయన లక్ష్యపెట్టరు, ఎందుకంటే ఆయన గొప్పతనం నీవు ఊహించుతున్న దానికంటే పూర్తిగా భిన్నమయినది. చీకటి పారద్రోలడానికి సూర్యునికి క్రొవ్వొత్తి ఏమి సహాయం చెయ్యగలదు ? సూర్యుడు స్వయనా కాంతివంతుడు, క్రొవ్వొత్తి అవసరం లేనేలేదు. ఒక గూర్ఖా మహారాజుకి ఏమి విశిష్టత తేగలడు ? 

మానవులకి ప్రాపంచిక సుఖాలు, కోరికలు ఇటువంటి మంచిపనులు చెయ్యటంవలన పూర్తి అవుతాయి. ఔషధం శారీరిక రోగాన్ని నయంచెయ్యడానికి కానీ ఆత్మ కోసం కాదు అని గుర్తుంచుకోండి. శరీరం రోగ గ్రస్తం అవచ్చుకానీ ఆత్మకాదు. ఇంత ఎందుకు జీవన్మరణాల వల్లకూడా ఈ ఆత్మకు ఏవిధమయిన పరిణామంఉండదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 64 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 13 - part 1 🌻

Shri Ganeshayanmah! O Shri Hari! You are the supreme saint, the ocean of kindness and an intimate friend of the Gopa and Gopis. O Shri Hari! Please manifest Yourself to me. 

Brahmadeo had to steal cows and calfs in Gokul to see the Godliness in You. At that time You Yourself became cows of calfs and manifested the Godliness in You to Brahmadeo. 

You crushed Kaliya Cobra in Yamuna and sent him to Ramanakdweep to free the Gopas of his menace. Likewise, I request You to trample my misfortune and to rid me of all fears. O Hari! I am the most ignorant devotee of Yours: undeserving and not suitable for Your blessings, but, even then, I request You to please oblige me by Your favor to free me from all worries immediately. 

Now listen. Bankat, Hari, Laxman Vithu and Jagdeo together went around collecting donations for the Matth of Shri Gajanan Maharaj . Believers readily subscribed while some mischievous people taunted them saying, Why should your saint need donations? 

You always say that Shri Gajanan Maharaj is a great saint capable of performing any miracle, then why should He need money for His Matth? Kuber is his banker Just draw a Hundi in the name of Kuber instead of going from door to door for money. 

At this Jagdeo laughed and said, This begging for donations is for your good. There is no need to build Matth or temple for Shri Gajanan Maharaj. All this exercise is meant for bringing happiness to you. 

This whole universe is a Matth for Shri Gajanan Maharaj . All these forests are gardens and the earth a cot for him. Eight Siddhis serve him like maids. He does not care for you, as his glory is entirely different from what you imagine it to be. 

How can a candle help the sun in diffusing darkness? The sun is, itself, light and does not need a candle at all. 

How can a watchman bring grandeur to an emperor? Human beings desire material pleasure and that can be fulfilled by this good deed.

Remember that the medicine is required to cure the disease of the body and not of soul. Body is susceptible to disease and not the soul. What of that, even birth and death does not affect the soul. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


27 Sep 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 65 / Sri Gajanan Maharaj Life History - 65 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 13వ అధ్యాయము - 2 🌻

కావున ఈపుణ్యం అనేఔషధం మీశరీరంలో ఉన్న ప్రాపంచిక సుఖాలను, పాపం అనే జబ్బుని రక్షించేందుకు అవసరం. ఈపుణ్యం అనే ఔషధం ఆపాపం అనే రోగాన్ని నాశనం చేస్తుంది. కావున ఈ మీ వెర్రి ఆలోచనలు ఆపడానికి పుణ్యాన్ని పెంచండి. మంచిపనులు అనేవిత్తనాలు నాటి, సుఖాలు అనే పంటను పొందండి. 

రాళ్ళమీద నాటిన విత్తనాలు ఎప్పటికి మొలకెత్తవు. చెడుకోరికలు, కార్యాలు ఇటువంటి రాళ్ళవంటివి, వాటిమీద విసిరిన విత్తనాలు పక్షులు, క్రిమికీటకాలు భక్షిస్తాయి. యోగులకు సేవ చెయ్యడంకంటే మించిన పుణ్యం వేరొకటిలేదు. ప్రస్తుతం శ్రీగజానన్ మహారాజు, యోగులలో మాణిక్యం వంటివారు. ఒక్కగింజ నాటితే అనేకములయిన గింజలు వస్తాయి. 

అలానే యోగులకొరకు ఏదయినా ఇస్తే అది మీపుణ్యాన్ని లెఖ్కలేనన్నిసార్లు పెంచుతుంది. ఒకగింజ వెనక్కి ఎలా అయితే అనేకమయిన గింజలు ఇస్తుందో అలానే పుణ్యం విషయంలో కూడా అని అన్నాడు. ఇదివిన్న ఆ ఆకతాయి మనుషులు నిశ్శబ్ధంగా ఉండిపోయరు. నిజం అన్ని వాగ్వివాదాలను ఒకకొలిక్కి తెస్తుంది. 

సంఘంలో గౌరవంవున్న వ్యక్తులనుండి మాత్రమే విరాళాలు సేకరించవచ్చు. సాధారణ వ్యక్తులు ఆకార్యానికి ఏమీ ఉపయోగం ఉండదు. అప్పడు శ్రీమహారాజు కొరకు సంపాదించిన స్థలంచుట్టూ గోడకట్టడం ప్రజలు ప్రారంభించారు. 

షేగాంలో ప్రతీవాళ్ళు దీనికి చేయూతనిచ్చారు. రాళ్ళు, సున్నం, ఇసుక వంటి పనికి కావలసిన వస్తువులు ఎడ్లబండి మీద మోసుకు వెళ్ళబడ్డాయి. ఆసమయంలో శ్రీమహారాజు తమ పాతమఠంలో కూర్చుండేవారు. తను స్వయంగా వెళ్ళి ఆక్రొత్త స్థలంలో కూర్చుంటేతప్ప కట్టడం పని త్వరగా కాదని ఆయన అనుకున్నారు. 

అలా ఆలోచించి మఠానికి ఇసుక మోసుకు వెళుతున్న ఒక ఎడ్లబండిమీద ఎక్కి కూర్చున్నారు. ఆబండి తోలేవాడు ఒక మహార్ కులానికి చెందినవాడు అవడంతో వెంటనే ఆబండికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆవిధంగా అతను ప్రవర్తించడానికి శ్రీమహారాజు కారణం అడుగుతూ, తను పరమహంసననీ, అచ్చుతులను ముట్టుకోవడం వల్ల తనకు ఏమీ పరిణామం ఉండదని అన్నారు.

అది నిజమేకానీ బండిమీద మీప్రక్కన కూర్చోడం నాకు సమంజసంకాదు, మారుతి శ్రీరామునితో ఒకడయ్యాడు కానీ ఎప్పడూ ఆయన ప్రక్కన కూర్చోలేదు. ఎప్పుడూ అతను ఆయనముందు చేతులు కట్టుకు నిలబడ్డాడు అని ఆ మహర్ అన్నాడు. 

శ్రీమహారాజు దానికి సమ్మతించి, ఆఎద్దులను ఆబండి తోలేవాడిని అనుసరించ వలసిందిగా అన్నారు. అవి నిజంగా చాలాబాగా ప్రవర్తించి బండి తోలేవాడు లేకపోయినా కోరుకున్న స్థలానికి బండిని తెచ్చాయి. శ్రీమహారాజు దిగి ప్రస్తుతం మందిరం నిలబడ్డ స్థలంలో మధ్యలో కూర్చున్నారు. ఈస్థలం రెండు సర్వేనంబర్లలో ఉంది 43/45. శ్రీమహారాజు కూర్చున్న చోటుని మందిరనిర్మాణానికి కేంద్రంగా పరిగణించాలి. 

అలా చెయ్యాలంటే వాళ్ళు రెండు సర్వేనంబర్లనుండి స్థలం ఉపయోగించాలి. వాళ్ళకి ఒక ఎకరం మాత్రమే ఇవ్వబడింది కానీ ఈవిధంగా కేంద్రంనిర్ణయించడం వల్ల, 11 గజాలస్థలం వేరే స్థలంనుండి మఠం నిర్మాణానికి ఆక్రమించబడింది. కలక్టరు నిర్మాణంగతి చూసినతరువాత ఇంకా ఎక్కువ స్థలం ఇస్తానని హామీ ఇచ్చినకారణంగా వీళ్ళు ఈసాహసం చేసారు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 65 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 13 - part 2 🌻

Thus this medicine of Punya (good deeds) is required to protect your material pleasures, which are in your body, and sin is its disease. 

This medicine of Punya will destroy the sin. Therefore, increase, your Punya and stop all this perverse thinking sow the wealth of good deeds to reap the crop of happiness. Grains sown on rocks get wasted and they never germinate. Bad desires and acts are like rocks and grains thrown on them will be consumed by birds and insects only. 

There is no better Punya than rendering service to saints. At present, Shri Gajanan Maharaj is a gem amongst saints. A single grain sown gives out a bunch of grains; likewise anything given for cause of a saint adds to your Punya countless times. 

One grain gives back multiple of grains same is the case with Punya.” Hearing this, the slanderers kept quiet, as truth puts an end to all arguments. Donations can be collected only with the help of men having prestige in this society. Ordinary persons are of no use for such work. 

People, then, started the work of constructing a compound wall around the plot acquired for Shri Gajanan Maharaj . Everybody in Shegaon extended help for this work. The material like stone, lime and sand for the work was carried in bullock carts. At that time Shri Gajanan Maharaj was sitting in the old Matth. 

He thought that unless He, Himself, went and sat in the new place, the work of the construction would not be expedited. Thinking so, he climbed a bullock cart carrying sand to the new place of Matth. The cartman, being a Mahar by caste, immediately moved away from the cart. 

Shri Gajanan Maharaj asked him the reason for his behavior and added that He being a sainta Paramhansa was not affected by the contact of untouchables. There upon the Mahar said, It is true, but even then that is not proper for me to sit beside You on the cart. 

Maroti became one with Shri Ram, but never sat by His side. He always stood before Him with folded hands. Shri Gajanan Maharaj agreed and asked the bullocks to follow the cartman. They really behaved well, and brought the cart, without the cartman, to the desired place. 

Shri Gajanan Maharaj got down and sat in the center of the plot where the temple stands at present. This place is in two survey numbers: 43/45. The spot where Shri Gajanan Maharaj sat was treated as the centre for construction and for doing so they had to take land from both the survey numbers.

In fact they were sanctioned only one acre of land, but due to the centre already being fixed as above, an encroachment of eleven gunthas of land was done for the construction ol the Matth. They dared do this because the Collector had promised to allot more land after looking to the progress of construction. However, some mischeuous elements reported the matter to the Government. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 66 / Sri Gajanan Maharaj Life History - 66 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 13వ అధ్యాయము - 3 🌻

కానీ కొంతమంది తుంటరులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు. ఈ వార్తకి శ్రీమహారాజు భక్తులు కలతచెంది, జోషీ అనే ఆఫీసరు ఈ ఆక్రమణ విషయంలో విచారణకోసం వస్తున్నట్టు చెపుతారు. శ్రీమహారాజు నవ్వి, ఈఆక్రమణ కొరకు విధించిన జరిమానా రద్దు చేయబడుతుందని అన్నారు. అది నిజమయింది. జోషీ విచారణ పత్రాలు చూసిన పిదప శ్రీగజానన మహారాజు ట్రస్టుమీద వేసిన జరిమానా రద్దుచేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసారు. 

ఈ ఉత్తర్వుల పత్రాలు అందినప్పుడు హరిపాటిల్ కు తనని మహార్ ను కొట్టినప్పటి కధనం గుర్తువచ్చింది. అప్పుడు కూడా శ్రీమహారాజు తనని రక్షిస్తానని వాగ్దానంచేసి, హరిపాటిల్ను నిర్భంధం కాకుండా కాపాడారు. ఇలా శ్రీమహరాజు అన్నదల్లా నిజమని నిరూపించబడింది. ఇప్పుడు శ్రీమహారాజు కొత్తమఠానికి వచ్చిన తరువాత చేసిన చమత్కారాలను నేను వర్నిస్తాను: 

గంగాభారతి అనే అతను మెహకర్ దగ్గర సావదాద్ అనే గ్రామంనుండి షేగాం వచ్చాడు. ఇతను కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు. ఇతని శరీరంకుళ్ళి, రెండు కాళ్ళుకూడా చాలాపగిలి ఉన్నాయి. ఈరోగం అతని వేళ్ళచివర్లను పూర్తిగా తినేసింది. మరియు మొత్తం శరీరం అంతా ఎర్రగా మారి, అతనికి శరీరం అంతా దురదగా ఉంది. 

గంగాభారతి ఈబాధకు విసుగుచెంది, శ్రీమహారాజు గూర్చి విన్నతరువాత, షేగాం వచ్చాడు. ఈవ్యాధి అంటువ్యాధి కాబట్టి అతన్ని శ్రీమహారాజు దగ్గరకు భక్తులు వెళ్ళనివ్వటలేదు. దూరంనుండి శ్రీమహారాజు దర్శనం చేసుకోవలసిందని వాళ్ళు అతనికి సలహా ఇచ్చారు. ఈవిధయిన సలహా తరువాతకూడా, ఒకరోజు గంగాభారతి అవకాసం తీసుకొని, త్వరగా వెళ్ళి శ్రీమహారాజుకు నమస్కరించి, ఆయన పాదాలమీద తలఉంచి దర్శనం చేసుకున్నాడు. 

శ్రీమహారాజు అతని తలమీద పెద్దదెబ్బ కొట్టారు, దీనికి అతను తలఎత్తి చూసేసరికి మరల రెండుచెంపల మీద కొట్టారు. ఆతరువాత అతనిని కాళ్ళతో తన్ని, అతనిమీద ఉమ్ముతారు. శరీరంమీద పడిన ఆఉమ్మును గంగాభారతి ప్రసాదంగా భావించి, దాన్ని లేపనంగా శరీరం అంతా ఆమ్మును రాసుకున్నాడు. అది చూస్తున్న ఒక వ్యక్తి ఆవిధంగా ఉమ్మును అప్పటికేకుళ్ళిన ఆశరీరం మీద రాసుకున్నందుకు హేళన చేస్తాడు. సబ్బుతో ఆణిమ్మును కడుగుకొని, అటువంటి మూఢనమ్మకాల నుండి దూరంగా ఉండమని అతను సలహా ఇస్తాడు. 

అతను ఇంకా ఎంతవరకు వెళ్ళాడంటే, గంగాభారతి శ్రీగజానన మహారాజు వంటి పిచ్చివాని దగ్గరకు రావడంకంటే, మంచి ఔషదం తీసుకోడం మంచిది అని అంటాడు. నీవు అన్నది తప్పు అని గంగాభారతి నవ్వుతూ అన్నాడు. యోగులలో అశుభ్రమయినది ఏదీ ఉండదు. కస్తూరి ఎప్పుడూ చెడ్డవాసన ఇవ్వదు. నీకు ఉమ్ములాకనిపించినది నిజంగా కస్తూరివాసన ఇచ్చే ఒక ఔషదీయ లేపనం. నువ్వు అనుమానిస్తూఉంటే నాశరీరం ఒకసారి తాకి వాసన చూడు, నీకు ఏవిధమయిన ఉమ్ముతునక కూడా కనిపించదు. అది మొత్తం ఔషదమే. 

ఈ ఉమ్మును ఔషదంగా భావించడానికి నేను ఏమీ వెర్రివాడనుకాను. శ్రీమహారాజు గొప్పతనం నీకు తెలియదు. నామాట నిరూపించాలంటే మనం ఇద్దరం శ్రీమహారాజు స్నానంచేసే ఏచోటునుండి నేను మట్టితీసి నాశరీరానికి రాసుకుంటానో ఆస్థలానికి ఇద్దరం వెళదాం అని వాళ్ళు ఇద్దరూ ఆయన స్నానంచేసే స్థలానికి వెళ్ళారు.

గంగాభారతి అక్కడ మట్టి తీసుకున్నాడు అది అతనిచేతిలో లేపనంగా మారింది. ఆ వెటకారి అదేపని చేసాడు కానీ అతని చేతిలో అది మట్టిగానే మిగిలింది. ఇది అతనని అసలు విషయంగ్రహించేలా చేసింది, దానితో అతను శ్రీమహారాజుకు లొంగిపోయాడు. ఎవరుకూడా గంగాభారతిని శ్రీమహారాజు దగ్గరకు వెళ్ళనిచ్చేవారు కాదు. 

అందుకే అతను ఆయన దగ్గరనుండి దూరంగా కూర్చుని భజనలు పాడుతుండేవాడు. అతనికి మధురమైన స్వరంఉంది. మంచి గాయకుడుకూడా. ఇలా ఒక 15 రోజులు జరిగిన తరువాత ఒక అద్భుతం జరిగింది. అతని శరీరంమీద ఎర్రదనం మాయంఅయింది, చెవులకొసలు మామూలు రూపానికి వచ్చాయి, కాళ్ళమీద పగుళ్ళు పోయి శరీరంనుండి దుర్గంధం రావడం మాయం అయింది. గంగాభారతి తీయని ధ్వనితో భజనలు పాడడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇది అందరినీ సంతోషపరిచింది. 

గంగాభారతి భార్య అనసూయ తన తనయుడు సంతోషభారతితో తన భర్తను ఇంటికి వెనక్కి తీసుకు వెళ్ళడానికి షేగాం వచ్చింది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 66  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 13 - part 3 🌻

The devotees were disturbed at the news and informed Shri Gajanan Maharaj that an Officer by name Joshi was coming to enquire the matter of encroachment. Shri Gajanan Maharaj laughed and said that the fine imposed on the encroachment would be exempted. It proved true. 

Shri Joshi on going through the enquiry passed orders exempting the fine imposed on Shri Gajanan Maharaj Trust. When this order was received, Hari Patil remembered the episode when he had beaten a Mahar. At that time also Shri Gajanan Maharaj had promised him protection and had ultimately saved Hari Patil from prosecution. 

Thus whatever Shri Gajanan Maharaj had said proved true. Now I will narrate the miracles performed by Shri Gajanan Maharaj after coming to the new Matth. A man named Gangabharti came to Shegaon from a village Savadad near Mehkar. 

He was suffering from leprosy and his whole body had become rotten with cracks on his both legs. The disease had eaten away his finger tips, reddened all skin and had produced an itching sensation all over his body. Gangabharati was tired of the suffering and so when he heard of Shri Gajanan Maharaj, came to Shegaon. The devotees there did not allow him to go near Shri Gajanan Maharaj as the disease was contageous.

They advised him to get the Darshan of Shri Gajanan Maharaj from a distance. Despite this advise one day Gangabharati took an opportunity, rushed and took direct Darshan of Shri Gajanan Maharaj by prostrating and putting his head on Maharaj’s feet. 

At this, Shri Gajanan Maharaj gave him a big slap on his head; as he got up to look at Shri Gajanan Maharaj , he again got slaps on both his cheeks. Thereafter Shri Gajanan Maharaj kicked him by His feet and spat on him. 

The spittle that fell on Gangabharti’s body was treated by him as a gift (Prasad) and, like an ointment, massaged all his body by that spittle. Looking to that a person, standing nearby, criticised him fo applying the spittle to his already rotten body. He advised to wash it away by soap and to keep away from such actions of blind faith. 

He even went to the extent of saying that Gangabharati should better take some medicine instead of coming to such mad men like Shri Gajanan Maharaj. Gangabharati smiled and said, “You are wrong. There is nothing unclean with saints. Kasturi (Musk) will never emit bad smell. 

What appeared like spittle to you was infact a medicinal ointment and it smells like musk. If you doubt it, just touch my body and smell; you will find that there is no trace of spittle in it. It is all medicine. I am not a fool to treat this spittle as an ointment. 

Since it was not meant for you, it looked like a spittle to you. You do not know the greatness Shri Gajanan Maharaj ! To prove my statement, let us go to the place where Shri Gajanan Maharaj takes his daily bath and wherefrom I will take the mud and apply it to my body.”

Both of them went to that bathing place; Gangabharati took the mud from tha place and it turned in to ointment in his hand. The critic did the same thing but it remained only mud in his hand.This made him realize the real thing and made him surrendered to Shri Gajanan Maharaj. 

Nobody allowed Gangabharati to go near Shri Gajanan Maharaj , so he used to sing bhajans sitting away from Him. He had a melodious voice and was a good singer too. This continued for a fortnight and then there was a miracle. The redness on his body disappared, the earlaps regained normal luster and shape, cracks on the feet closed and the stinking from body vanished. 

Gangabharati continued singing bhajans in his sweet voice, It pleased everybody. Anasuya, Gangabharati’s wife, alongwith her son, Santosh Bharati, came to Shegaon to take her husband back home. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


29 Sep 2020

------------------------------------ x ------------------------------------





🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 67 / Sri Gajanan Maharaj Life History - 67  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 13వ అధ్యాయము - 4 🌻

వాళ్ళు చేతులు కట్టుకుని, మీజబ్బు శ్రీమహారాజు దయవల్ల నయమయింది, కాబట్టి మాతో ఇంటికి వెళ్ళడానికి ఆయన నుండి అనుమతి అర్ధించమని అన్నారు. దయచేసి నన్ను ప్రార్ధించకండి. నేను ఎంతమాత్రం ఇక మీకు చెందినవాడినికాను. 

శ్రీమహారాజు నన్ను చెంపమీద కొట్టి, నేను వేసుకున్న కాషాయ వస్త్రాలను కించపరచ కూడదని నన్ను స్పృహలోకి తెచ్చారు. నాకళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి, అందుచే నేను ఈసంసారిక జీవనంనుండి దూరంగా ఉండదలచాను. సంతోషభారతి నీవు వినయంగాఉంటూ తల్లి సేవ చెయ్యి. ఇకమీరు ఇంటికి వెళితేమంచిది. తల్లి సేవ చేయడానికి పుండలీకుని నడవడి అనుసరించు. అదినీకు వాసుదేవుని ఆశీర్వాదాలు తెస్తుంది. నేను తిరిగి సావదాద్ వస్తే ఆవ్యాధి తిరిగి నన్ను పట్టుకుంటుంది. 

కావున నన్ను బలవంతం పెట్టకండి. ఇంతవరకు నేను మీకు సంబంధితుడను, ఇకనుండి నేను భగవంతునికి అర్పించుకుంటున్నాను. ఈవిధమయిన నా ఆలోచన సరళిలో మార్పు శ్రీమహారాజు దయవల్ల వచ్చింది. దయచేసి నన్ను ఇంకఏమాత్రం మోహించకండి అని గంగాభారతి జవాబు చెప్పాడు. 

ఇలా అంటూ వాళ్ళని సావదాద్ వెనక్కి పంపి, తను షేగాంలో ఉండిపోయాడు. రోజూ సాయంత్రం, శ్రీమహారాజు ముందుకూర్చుని, భజనలు పాడేవాడు. ఇవి అందరినీ ఆహ్లాదపరిచేవి. అతను ఆ జబ్బునుండి పూర్తిగా నయమయి, శ్రీమహారాజు ఆజ్ఞానుసారం మల్కాపూరు వెళ్ళాడు. ఒకసారి పుష్యమాసంలో జాంసింగ్ షేగాం వచ్చి శ్రీమహారాజును తనతో తనగ్రామం రమ్మని అర్ధిస్తాడు. తను ఇదివరకు ఇలానే అర్ధిస్తే మరొకసారి రమ్మని అన్నమాట శ్రీమహారాజుకు గుర్తు చేసాడు.

అందుకని అతను శ్రీమహారాజును ఇప్పుడు ముండగాం తీసుకు వెళ్ళేందుకు వచ్చాడు. శ్రీమహారాజు అతనితో వెళ్ళారు. చాలామంది ప్రజలు ముండగాం చేరి ఆయన దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జాంసింగ్ ఒక గొప్పవిందు ఏర్పాటు చేసాడు. ముండగాం రెండో పైఠాన్గా అయింది. షేగాంలో శ్రీగజానన మహారాజు ఎలాగన్ పైఠాన్లో యోగి ఏకనాధ్ అలానే. 

చాలా మంది పాటల గుంపులు, దేవుని పొగుడుతూ పాడేందుకు అక్కడికి చేరాయి. వంటవాళ్ళు పెద్దఎత్తున వంటకాలు తయారు చెయ్యడం ప్రారంభించారు. అవి సగంలో ఉండగా, జాంసింగ్ ఈరోజు చతుర్దశి, సహజంగా ఇది ఖాళీగా ఉండే తిధి(విశేషమయిన పనులు చెయ్యరు) కాబట్టి ప్రజలకోసం విందు రేపు పౌర్ణిమ నాడు ఏర్పాటు చేస్తే మంచిది అని శ్రీమహారాజు జాంసింగ్తో అన్నారు. వంటకాలు అన్నీ తయారయ్యాయి, మరియు అతిధులు అందరూకూడా ప్రసాదానికి వచ్చారు అని జాంసింగ్ అప్పుడు ఆయనతో అన్నాడు. 

నీదృష్టిలో నీవు అంటున్నది నిజమే కానీ భగవంతునికి అది అంగీకారంకాదు. జాంసిగ్ ఈ వంటకాలు వృధాకావలసిందే, మీసంసారికులంతా ఎప్పుడూ కార్యక్రమాలు మీఇష్ట ప్రకారమే అవ్వాలనుకుంటారు, కానీ అదిసాధ్యంకాదు అని శ్రీమహారాజు జవాబు చెప్పారు. 

అయినాసరే ప్రజలు భోజనంకోసం పంక్తులలో కూర్చున్నారు. ఒక్కసారిగా మేఘాలు గుమిగూడి, ఉరుములతో పెద్దగా వానపడింది. మెరుపులు, ఉరుములు, దుమారంతో చెట్లు పెకళించబడ్డాయి. ఈకుండపోతతో కొద్ది సేపట్లోనే వంటకాలతోసహా అంతటా నీరు నిండింది. మొత్తంవంట అంతా వృధాఅయింది. అప్పుడు ఓమాహారాజ్ ప్రజలంతా ఈవానతో చాలానిరాశ చెందారు. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 67   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 13 - part 4 🌻

They with folded hands, said, “Your disease is now cured by the grace of Shri Gajanan Maharaj , so we request you to take permission from Him to go home with us.” 

Gangabharati replied, “Please don't pray to me. I don’t belong to you anymore. Shri Gajanan Maharaj slapped me and brought me to senses, saying that I should not defame the saffron robes I wear. My eyes are opened now and so wish to keep away from family life. 

Santoshbharati, now you better go home with your mother; be obedient to her and keep her happy. Follow the ideal of Pundalika for rendering service to the mother. That will bring you blessings from Vasudeo. If I return to Savdad, the disease will catch me again. So do not force me.

Till now I belonged to you, but hereater I will devote myself to almighty God to free me from the cycle of life and death. This change in my thinking has come by the grace of Shri Gajanan Maharaj . Please don't tempt me anymore.” Saying so, he sent them back to Savadad and himself stayed at Shegaon. 

Daily evening, sitting before Shri Gajanan Maharaj he used to sing Bhajans, which enchanted every one. He was completely cured of the disease and then went to Malkapur as per the orders of Shri Gajanan Maharaj . Once, in the month of Poush, Zyam Singh came to Shegaon and requested Shri Gajanan Maharaj to come with him to his village. 

He reminded Shri Gajanan Maharaj that when he had come some time back with the same invitation, he was told to come later on. Accordingly he had come now to take Shri Gajanan Maharaj to Mundgaon. Shri Gajanan Maharaj went with him. Many People gathered at Mundgaon and took His Darshan. 

Zyam Singh arranged a grand feast to celebrate the visit and Mundgaon became second Paithan. At Paithan there was saint Eknath, as Shri Gajanan Maharaj was at Mundgaon. Many singers’ groups reached there to sing Bhajans in praise of God.

Cooks started preparation of food on large scale, and when it was halfway through, Shri Gajanan Maharaj said to Zyam Singh, Today is Chathurdashi which by nature is an empty Tithi, so it is better to arrange feeding the people tomorrow which is Pornima. 

Whereupon Zyam Singh said that the food was nearly ready and people had gathered to take prasad. Shri Gajanan Maharaj replied, What you say is correct in your own way, but it is not acceptable to Almighty God. Zyam Singh, this food has to go to waste. You, men of family, always wish things to happen as per your desires, but it is not possible.” 

Even then, people sat in rows to take food. Suddenly clouds gathered in the sky and it started raining heavily with a thunderstorm. The roaring lightening and the storm uprooted many trees and in a short time, the downpour spread water everywhere; even in the food. All food was wasted. 

Zyam Singh then said to Shri Gajanan Maharaj , O Maharaj! All people are greatly disappointed by these rains.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

------------------------------------ x ------------------------------------


🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 68 / Sri Gajanan Maharaj Life History - 68   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 13వ అధ్యాయము - 5 🌻

కనీసం ఇంక రేపు ఈవిధంగా కాకుండా ఉండాలి. ఇది వాన పడడానికి వానాకాలం కూడా కాదు. చూస్తూఉంటే ఒక్క మనతయారీని నాశనం చేసేందుకే వచ్చినట్టు కనిపిస్తోంది. ఇటువంటి అకాల వర్షాలు పంటలను పాడుచేస్తాయి, మరియు ప్రజలు ఇదేనా జాంసింగ్ పుణ్యఫలం అని నన్ను హేళన చేస్తారు అని జాంసింగ్ శ్రీమహారాజుతో అన్నాడు. 

దానికి మరుసటి రోజు ఈవిధంగా అవదు అని శ్రీమహారాజు ఆశ్వాసన ఇస్తూ ఒక్కసారి ఆయన ఉండాలి. అయింది.

అప్పుడు ఓమాహారాజు కుండపోతతో కొ మామూలుగా తలఎత్తి ఆమేఘాల వైపు చూసారు. ఒక్కక్షణంలో ఆ మేఘాలన్నీ మాయంఅయి చక్కటి సూర్యకాంతి బయటకు వచ్చింది. శ్రీగజానన్ మహారాజు మనఃశక్తి అటువంటిది. మరుసటిరోజు జాంసింగ్ భండారా చేసి ఆగ్రామ ప్రజలందరికీ భోజనాలు పెట్టాడు. ఇప్పటికీ ఈవిధంగా భోజనసమారంభం ఆరోజున ముండగాంలో జరుగుతోంది. 

జాంసింగ్ మొత్తం తన యావదాస్థిని శ్రీమహారాజు పాదాలకు సమర్పించాడు. శ్రీమహారాజు యొక్క ఈయాత్రతో ముండగాంలో అనేకమంది ప్రజలు ఆయన శిష్యులు అయ్యారు. వీళ్ళలో పుండలీక భోకరే అనే యువకుడు ఉన్నాడు. ఈతను ఉకిర్దా అనే కుంభి కులానికి చెందిన వ్యక్తికి ఏకైక కుమారుడు. బెరారులో ఎవరయినా పిల్లలు బ్రతకరని సందేహం ఉంటే ఈవిధంగా వాళ్ళకి ఉకిర్దా అనిపేరు పెట్టడం రివాజు. 

ఇదేవిధంగా తెలంగాణాలో పెంటయ్య, మహారాష్ట్రలో కెరుపుంజా అనేపేర్లు పిల్లలు బ్రతకడానికి ఇచ్చేవారు. భక్తులు క్రమంతప్పకుండా ఎలాఅయితే పండరపూరు, దేహు, మరియు అళందీ వెళతారో, ఈ పుండలీకుడు క్రమతప్పకుండా ప్రతీ బహుళ ఏకాదశి నాడు షేగాం సందర్శించేవాడు. 

ఈవిధంగా ప్రతీనెలా శ్రీమహారాజు దర్శనం కోసం షేగాం వెళ్ళడం పుండలీకుడికి కార్యక్రమం. ఒకసారి బెరారులో ప్లేగు వ్యాపించింది, ప్రజలంతా ఇళ్ళు వదలి గ్రామానికి, ఊరుకి దూరంగా బహిరంగ స్థలాలలో నివశించడం మొదలు పెట్టారు. ఈ వ్యాధిలో మొదట రోగికి వణుకు ప్రారంభం అవుతుంది, తరువాత జ్వరం వస్తుంది. కళ్ళు రక్తంలా ఎర్రబడి శరీరంలో ఏదోఒక కీళ్ళదగ్గర ఒకగడ్డలా వస్తుంది. 

అప్పడు ఆరోగి చలనం కోల్పోయి మరణిస్తాడు. గతంలో ఎప్పుడూ ఇటువంటి వ్యాధి భారతదేశంలో చూడలేదు. ఇది యూరోప్లో బాగా విజృభించి ఉంది. అక్కడనుండి భారతదేశం వచ్చి దేశంఅంతా వ్యాపించింది. ఇది ప్రజలని తమ ఇళ్ళువదలి బహిరంగ స్థలాలో తమనితాము రక్షించుకుని నివశించేలా చేసింది. ఈ మహామ్మారి ముండగాం కూడా వచ్చింది. 

ఆ రోజు బహుళ ఏకాదశి, పుండలీకుడు తన నియమయిన కార్యక్రమం ప్రకారం షేగాం వెళ్ళలి. అతనికి కొద్దిగా జ్వరంలా అనిపించిది, అయినాసరే తన తండ్రితో షేగాంకోసం బయలుదేరాడు. ఒక 10 మైళ్ళు నడిచినతరువాత బాగా జ్వరంతో వేడిఎక్కి ఒక్క అడుగు కూడా ఇక ముందుకు వెయ్యలేక పోతున్నాడు. 

ఒక గడ్డ కూడా చంకలో లేచింది. పూర్తిగా అలసిపోయినట్టు అనిపించింది. అతని పరిస్థితిచూసి తండ్రి ఆదుర్దాగా అతని ఆరోగ్యం ఎలాఉందని అడిగాడు. బాగా ఎక్కువ జ్వరంగా ఉందనీ, చంకలో గడ్డలేచిందని, తీవ్రమయిన నీరసంగా ఉందనీ పుండలీకుడు అన్నాడు. పుండలీకుడు చేతులు కట్టుకుని ఓగజాననా నాక్రమం తప్పకుండా బహుళ ఏకాదశి నాడు మీవద్దకు వచ్చే కార్యక్రమానికి అంతరాయం రాకుండా దయచేసి చూడండి. నన్ను ఈరోజు మీపాదాల దగ్గరకు చేరనియ్యండి. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 68 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 13 - part 5 🌻

Now tomorrow, atleast, it should not happen like this. It is not rainy season to rain. So it appears to have come just to destroy our preparations. Such untimely rains may rain the crops and the people will taunt me saying this to be the fruit of Zyam Singh's Punya. 

Thereupon Shri Gajanan Maharaj assured him that it will not happen like this the next day, and then he just looked up towards the cloulds and in a moment they all vanished and clear sunlight came out. Such was the will power of Shri Gajanan Maharaj . The next day, Zyam Singh held a ‘bhandara’ and fed all the people of the village. 

This tradition of feeding the people on this particular day still continues at Mundgaon. Zyam Singh surrendered all his estate at the feet of Shri Gajanan Maharaj. On this occasion of the visit of Shri Gajanan Maharaj , many people of Mundgaon became his shishyas (disciples), among who was a young boy by name Pundalik Bhokre. 

He was the only son of Ukirda a Kunbi by caste. It is customary in Berar to name a child as Ukirda when the survival of such children was doubtful. Similarly Pentayya in Telengana and Kerpunja in Maharashtra are the names given to children to ensure their survival. 

This Pundalik was visiting Shegaon regularly on every Vadya Ekadashi, like a Varkari going regularly to Pundharpur, Dehu and Alandi. So was the routine of Pundalik to go to Shegaon every month for the Darshan of Shri Gajanan Maharaj . Once there was a spread of plague epidemic in Berar. 

In this disease the patient first gets shivering and then temperature. Eyes become blood red followed by eruption of tumours on some of the joints of the body. Then the patient loses his senses and dies. 

This disease was never seen in India in the past. It was rempant in Europe from where it came to India and had spread all over the country. It made people to leave their houses and reside in open fields to protect themselves.

This terrible killer disease came to Mundgaon also. It was the day of Vadya Ekadashi and Pundalik had to go to Shegaon as per his routine. He was feeling feverish but even then left for Shegaon with his father. After walking about ten miles he was hot with fever and could not walk a step ahead. 

A tumour also erupted in his armpit and felt completely exhausted. Looking to his condition, his father anxiously enquired about his health. Pundalik said that he han a high fever, a tumour in the armpit and the feeling of extreme weakness.

Pundalik, with folded hands said, “O Gajanana! Please see that my Vari (routine of coming to you on Vadya Ekadashi) is not distrubed. Let me reach at your feet today. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


01 Oct 2020

------------------------------------ x ------------------------------------


🌹.  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 69 / Sri Gajanan Maharaj Life History - 69  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 13వ అధ్యాయము - 6 🌻

ఒకసారి షేగాం చేరినతరువాత మరణించినా నేను ఏమీ అనుకోను. దయచేసి నేను షేగాం చేరేంతవరకూ నన్ను ఈప్లేగు అనే శతృవునుండి రక్షించండి. మంచి ఆరోగ్యం ఉంటేనే పుణ్యక్షేత్ర దర్శనం వీలవుతుంది అని అన్నాడు. పుండలీకుని ఈపరిస్థితి చూసి, అతని తండ్రి చింతితుడై కళ్ళనుండి నీళ్ళు వచ్చాయి. తన ఏకైక కుమారుని ఈ వినాశనం నుండి కాపాడమని భగవంతుడిని ప్రార్ధించాడు. 

ఒక ఎడ్లబండి ప్రయాణానికి తీసుకుందామని, పుండలీకునితో అతను నేను మంచి ఆరోగ్యం ఉంటేనే భగవంతుడిని ర్ధించాడు. అతని తండ్రి చింతితుడై అన్నాడు. 

దానికి పుండలీకుడు...వద్దు నేను షేగాం నడకమీదనే వెళ్ళాలి, నేను నెమ్మదిగా నడిచి ఎలాగయినా షేగాం చేరతాను. ఒకవేళ దారిలో చనిపోతే కనుక నాశరీరం షేగాం మోసుకు వెళ్ళండి, చింతించకండి అన్నాడు. అలా అంటూ నెమ్మదిగా నడుచుకుంటూ అతి కష్టం మీద షేగాం చేరాడు.

అతను శ్రీమహారాజును చూసి పాదాలకు నమస్కరించాడు. శ్రీమహారాజు పుండలీకుని చూసి, తన చంకక్రింద నొక్కుకుని, పుండలీకా నీప్రమాదం తప్పింది కావున అసలు చింతించకు అని అన్నారు. అలా శ్రీమహారాజు అనగానే పుండలీకుడి చంకక్రింద గడ్డ అకస్మాత్తుగా అదృశ్యం అయింది. కానీ అతనికి కొంత నీరసంగా అనిపించింది. పుండలీకుని తల్లి సమర్పించిన నైవేద్యం రెండు ముద్దలు శ్రీమహారాజు తినేసరికి అదికూడా మాయం అయింది. 

పుండలీకుడు మామూలుగా ఉన్నట్టు అనుభూతి పొందాడు. ఇదంతా గురుభక్తి ఫలితం, మరియు నమ్మకం లేనివాళ్ళు గమనించదగ్గ విషయం. సరిఅయిన గురువుమీద భక్తి ఎప్పటికీ వృధాకాదు అని ఇద తెలియచేస్తోంది. నిజమయిన గురువు ఇంట్లో కామధేనువు ఉండి మనకోరికలన్నీ తీర్చినట్టు. పుండలీకుడు తన కార్యక్రమంలోని పనులు పూర్తి చేసుకుని ముండగాం తిరిగి వచ్చాడు. 

మీరు ఈ చరిత్ర చదివితే మీకు వచ్చే ప్రమాదాలన్నీ తొలుగుతాయి. ఇది ఒక గొప్ప యోగి జీవిత చరిత్ర కానీ ఏదో ఊహించిన కధకాదు. ఈ పుస్తకంలో వివరించినవి అన్నీ నిజంగా జరిగిన విషయాలు. ఈయోగి యొక్క కధలపై ఎవరూ అపనమ్మకం చూపరాదు. దాసగణు రచించిన ఈ గజానన్ విజయ గ్రంధం అందరికీ సుఖాలు తెచ్చుగాక. ఈ విధంగా దాసగణు ప్రార్ధిస్తున్నాడు. అందరికీ శుభంకలుగుగాక. హర మరియు హరి కి నానమస్కారములు. 

శుభం భవతు 

13. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 69   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 13 - part 6 🌻

Once I reach Shegaon I won't mid death thereafter. Please protect me from this plague enemy till I reach Shegaon. Visit to shrines is possible only if you are in good health.” 

Looking to the condition of Pundalik, his father felt sorry and tears rolled from his eyes. He prayed to God to save his only sons from this calamity. He offered Pundalik to get a bullock cart for his journey to Shegaon. Pundalik replied, “No, I must go to Shegaon on foot only. Slowly I will walk and reach Shegaon. 

If I die on way, please carry my body to Shegaon and don't worry.” Saying so, Pundalik started walking slowly and with great difficulty reached Shegaon. He saw Shri Gajanan Maharaj and prostrated at his feet. 

Looking to Pundalik Shri Gajanan Maharaj pressed His own armpit by another hand and said, “Pundalik, your danger is averted, so do not worry at all.” When Shri Gajanan Maharaj said so, the tumour in the armpit of Pundalik suddenly vanished. 

He was, however, feeling a bit of weakness, but that too disappeared when Shri Gajanan Maharaj ate two morsels of Naivedya offered by Pundalikas mother. Pundalik began feeling normal. This was the result of Gurubhakti, and an example to be noted by disbelievers. 

It shows that devotion to proper Guru never goes waste. Real Guru is like having a Kamdhenu at home, to fulfil all your desires. After completing his rituals of the Vari, Pundalik returned to Mundgaon. 

If you read this Chaitra, all the dangers to you will be averted. It is a biography of a great saint and not any imaginary story. Everything given in this book is real and actually happened. Nobody should show any disbelief in this story of the great saint. 

May this Gajanan Vijay Granth, written by Dasganu, bring happiness to all! Thus prays Dasganu. May good come to you all. My obeisance to both Har and Hari. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Thrirteen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


02 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 70 / Sri Gajanan Maharaj Life History - 70   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 14వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! 

కౌశల్యతనయా రామా ఓ రఘుకులంలోని రత్నమా ఓ సీతాపతే. మీ ఈ పిల్లవాని మీద దయఉంచండి. మీరు త్రతికను ఉధ్ధరించి రాతి రూపంలో ఉన్న అహల్యకు జీవితం ఒసగేరు. శబరి దగ్గరకు వెళ్ళి ఆమెకోరిక నెరవేర్చారు. ఓ దశరధ తనయా మీరు మీభక్తుని రక్షించేందుకు సింహాసనం త్యజించారు మరియు వానరులు మీదయవల్ల శక్తి పొందారు. 

ఓ రావణసంహారా మీపేరు మాత్రంతోటే రాళ్ళు నీటిలో తేలాయి. మీరే మీభక్తుడయిన విభీషణునిని సింహాసనం పైన కూర్చుండబెట్టారు. మీకు ఎవరయితే సమర్పించుకున్నారో వాళ్ళు దరిద్రంనుండి, దుఖంనుండి, ఉపద్రవాలనుండి ముక్తి పొందారు. అది గుర్తుఉంచుకొని ఈ దాసగణును ఆదుకోండి. తల్లి నుండి పిల్ల దూరంగా ఎలా వెళ్ళ గలదు ? మీరే నా తల్లి తండ్రి మరియు గురువు. మీరు భక్తులకోరికలు నెరవేర్చే కల్పతరువులు. 

ఓ రామా మీరు జీవితమనే సముద్రంలో తేలుతున్న ఓడ.. బండుతత్యా అనే బ్రాహ్మణుడు మెహకరులో ఉండేవాడు. అతను చాలా పుణ్యాత్ముడు, ఉదార హృదయుడు. సంసారిక జీవితంలో అనేక వినాశకాలు ఎదురు వస్తూఉంటాయి, అయినా ఇతను ఈ జీవితానికి, దాని సుఖాలకి ఉన్న సంబంధం విడవలేదు. చాలామంది అతిధులు ఈ బండుతత్యా దగ్గరకు వచ్చేవారు. వారి అవసరాలు తనే స్వయంగా చూసేవాడు. ఇదిఇలా చాలాకాలం జరిగింది. అతను ధనంఅంతా ఖర్చుపెట్టాడు. తనఇల్లు తాకట్టు పెట్టి వడ్డీలకు డబ్బు ఇచ్చే వాళ్ళ దగ్గరనుండి కూడా ధనం అప్పుగా తెచ్చాడు. 

ఈ పెరుగుతున్న అప్పులవల్ల అతను మనుషుల ఎదుట పడడానికి సిగ్గుపడ్డాడు. ఇంటిలో ఉన్న వస్తువులు, వంటసామాగ్రి కూడా అమ్మేసాడు. ఇంక ఏమీ మిగలలేదు. ఇతను పూర్తిగా బీదవాడయ్యాడు. అప్పులవాళ్ళు తమధనం కోసం ఇతని వెనక పడ్డారు. రెండుపూటలా కనీసం తిండికూడా సమకూర్చలేక భార్యా పిల్లల అవమానం ఇతను ఎదుర్కోవలసి వచ్చింది. ఈవిధంగా పూర్తిగా గౌరవం పోయినందువల్ల ఎవరూ డబ్బు అప్పు ఇవ్వడంలేదు. 

ఇతను జీవితంమీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందుకు ఆలోచించడం ప్రారంభించాడు. ధనంలేకుండా ఈ ప్రపంచంలో ఎవరికీ విలువలేదు, మరియు ఇల్లే దుఖాలతోనిండిన స్థలం అవుతుంది. ఇది ప్రాపంచిక పద్ధతి. నూతిలోకి దూకితే ఎవరయినా చూసి తనని బయటకు తీస్తారు. అటువంటి పరిస్థితులలో చావు దొరకదు పైగా ఆత్మహత్యా ప్రయత్నంకారణంగా కోర్టువిచారణ ఎదుర్కోవలసి వస్తుంది అని అతను ఆలోచించాడు.

అందుకని అతను హిమాలయాలకు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న పాపంనుండి కూడా విముక్తి కలుగుతుందని నిశ్చయించు కున్నాడు. ఆవిధంగా ఆలోచిస్తూ చివరికి ఒకజీర్నవస్త్రంతో తనని ఎవరూ గుర్తుపట్టలేకుండా శరీరం అంతా విభూదిరాసుకుని అతను ఇల్లు వదిలిపెట్టాడు. గౌరవనీయ కుటుంబంలో వారు బహిరంగంగా నిరశించబడడానికి భయపడతారు అనేది బాగా ఎరిగిన సత్యం.

అతను తన మనసులో.. కొరకదు వెళ్ళి కి జ్వ రు బ ఓ భగవంతుడా నామీద ఎందుకు ఇంత అసంతుష్టిగా ఉన్నారు ? మీమీద పూర్తి నమ్మకంతో జీవించాను, మరియు మీదయతో బికారులు కూడా ధనవంతులవుతారని పురాణాలు చెపుతున్నాయి. కానీ నా అనుభవం అది తప్పని నిరూపిస్తోంది, మరియు కవులు మిమ్మల్ని పేదవాని పెన్నిధి అని చేసిన వర్ణన తప్పు అనుకునేలా నన్ను ఆలోచించేట్టు చేస్తోంది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 70   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 14 - part 1 🌻

Shri Ganeshayanmah! O Kausalya's son Rama! O Gem of Raghu Dynesty! O Sitapati! Have compassion for this child of Yours. You have liberated Tratika and given life to Ahilya, who was lying in the form of a stone. You have fulfilled the desire of Shabari by visiting her.

O son of Dasharatha! You renounced the throne to protect your devotee, and by your grace, the monkeys gained strength. O Killer of Ravana! Your mere name made stones float on the sea and it is you, who installed on the throne your devotee, Vibhishan. 

Whosoever surrendered at your feet got rid of poverty, sorrow and calamities. Please remember it and protect this Dasganu. How can a child go away from its mother? You are my mother, father and Guru (Preceptor). 

You are the Kalpataru the tree that meets every desire of devotees. O Rama! you are the ship to float in this ocean of life. There was a brahmin named Bandu Tatya at Mehkar. He was most pious and liberal at heart. 

In family life one comes across many calamities, but even then he does not leave the attachment for life and its pleasures. Many guests used to come to this Bandu Tatya and he personally looked after their comforts. This continued for long and he spent all his money. He even borrowed money from money lenders by mortgaging his house. 

Due to mounting debts, he was ashamed to face people. He even sold the utensils in the house and there remained nothing more to sell. He was completely bankrupt and the creditors were after him to get the money back. He could not afford even two times meals and had to bear insult from wife and childern. 

Thus losing all his credit nobody would land him any money. He got frustrated with life and started thinking of commiting suicide. Without money one has no value in this world, and the sweet home becomes a place of sorrow. This is the way of the world.

He thought that if he jumps in the well, somebody may see it and bring him out, under which circumstances, instead of death, he would be required to face prosecution for committing suicide. So he decided to go to the Himalayas to kill himself and get absolved of the sin of suicide. Thinking thus, he finally left the house with only lioncloth and ash applied all over the body to hide his identity.

It is a well know fact that people of respectful families are always afraid of public condemntion. In his mind Bandu Tatya prayed, “O God! Why are You so displeased with me? I lived with full faith in You, and Puranas say that even a beggar becomes rich by Your grace. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 71 / Sri Gajanan Maharaj Life History - 71 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 14వ అధ్యాయము - 2 🌻

ఓశ్రీహరి నేను ఇకఇప్పుడు నాజీవితం అంతం చెయ్యబోతున్నాను. మిమ్మల్నే నాచావుకి నిందిస్తారు, కనుక ఈవిధమయిన నిందలనుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని మిమ్మల్ని అర్ధిస్తున్నాను అని బండుతత్యా అనుకున్నాడు. అలా తనలోతాను అనుకుంటూ టిక్కెట్టు కొనడంకోసం బండుతత్యా రైల్వే ఆఫీసుకు వెళ్ళాడు. ఒకబ్రాహ్మడు అతన్ని చేరి.. ........ హరిద్వారు కొరకు టిక్కెట్టుకొనకు. మొదట వెళ్ళి యోగి దర్శనం చేసుకుని తరువాత హరిద్వారు వెళ్ళు. 

గజానన్ మహారాజు అనే గొప్ప యోగి షేగాంలో ఉన్నారు. వెళ్ళి ముందు ఆయనని కలువు. క్షణిక విరక్తివల్ల ఇటువంటి అర్ధంలేని అడుగు వెయ్యకు. యోగుల దర్శనం ఎప్పటికీ వృధాకాదని తెలుసుకో అని అన్నాడు. బండుతత్యా దీనికి కలవరపడ్డాడు, బ్రాహ్మడు తనని గుర్తుపట్టినట్టు ఉన్నాడని అతనికి అనుమానం వచ్చింది. కానీ అతనిని ఎవరూ, ఏమిటి అని అడగడానికి సిగ్గు అనిపించింది. ఆయన ఎవరో అతనికి తెలియదుకూడా. కానీ షేగాం వెళ్ళి శ్రీగజానన్ మహారాజుకు నమస్కరించేందుకు అతను నిశ్చయించుకున్నాడు. 

అతను అక్కడికి చేరి శ్రీమహారాజుకు వంగి నమస్కరించినప్పుడు, మహారాజు నవ్వి...బండుతత్యా ఆత్మహత్య చేసుకోడం కోసం హిమాలయాలకు ఎందుకు వెళుతున్నావు ? ఓకుర్రవాడా ఎవరూ స్వయంగా జీవితం అంతం చేసుకోకూడదు. ఆశ వదులుకోకు, మరియు కోరుకున్నవి పొందడానికి ప్రయత్నాలుమానకు. సంసారిక జీవితంలోని వినాశకాలవల్ల నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఈజన్మలో అనుభవించవలసిన బాధలు ఈ ఆత్మహత్యవల్ల నువ్వు ఎగవేస్తే అవి అనుభవించడానికి తిరిగి జన్మించవలసి వస్తుంది. 

ఇప్పుడు నీజీవితం ఆగంగలో అంతం చేసుకుందుకు హిమాలయాలకు వెళ్ళకు. దాని బదులు వెంటనే ఇంటికి వెళ్ళు. నిన్ను రైల్వేస్టేషనులో కలిసిన బ్రాహ్మణున్ని గుర్తుపట్టావా ? ఇక్కడ ఇంకఉండకుండా ఇంటికి వెళ్ళు. మీఇంటిలో తోటలో ఒకపాత మసోబా విగ్రహంఉంది. అక్కడికి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళి, మనోబా విగ్రహానికి తూర్పుగాఉన్న బబుల్ చెట్టుదగ్గర 3అడుగులు లోతువరకు త్రవ్వు. నీకు కొంతధనం దొరుకుతుంది. అందులోంచి కొంత నీ అప్పులవాళ్ళకి ఇచ్చి మిగిలినది నువ్వు ఉంచుకో. నీ భార్య పిల్లలను విడిచిపోకు, ఈ పనికిరాని త్యాగాలని వదులు అని అన్నారు. 

ఇదివిని ఆ బండుతత్యా బ్రాహ్మడు తన స్వగ్రామం అయిన ఖేరడా తిరిగి వచ్చి, శ్రీమహారాజు సలహాప్రకారం ఆ బబుల్ చెట్టు దగ్గర అర్ధరాత్రి తవ్వడం మొదలుపెడతాడు. అతను అడుగులు తవ్వేసరికి, మూతకట్టి ఉన్న ఒకరాగిపాత్ర అందులో కనిపించింది. అది విప్పి తీస్తే అందలో 400 బంగారు నాణాలు(మోహరలు) అతను చూసాడు. అది పైకితీసి సంతోషంతో జైగజానన్ జైగజానన్ అని నాట్యంచెయ్యడం మొదలు పెట్టాడు. అప్పుడు అతను తనఅప్పు తీర్చి తాకట్టు పెట్టిన తోట, వాడ తిరిగి పొందాడు.

శ్రీగజానన్ మహారాజు దయవల్ల తన పరిస్థితులు సరిగా అయి తిరిగి సంతోషవంతుడు అయ్యాడు. చనిపోయేముందు సమయానికి అమృతందొరికినట్టు, మునిగిపోయేముందు రక్షించడానికి వచ్చిననావలాగా ఉంది బండుతత్యా పరిస్థితి మరియు అతనికి చెడ్డరోజులు వెళ్ళిపోయాయి. అప్పుడు అతను షేగాం వచ్చి చాలాధనం సంఘసేవకు ఖర్చుపెట్టాడు. శ్రీమహారాజుకు నమస్కరించాడు. నాముందు ఎందుకు వంగుతావు ? దానిబదులు ఎవరయితే నీకు ఈసంపద ఇచ్చారో ఆయన ముందు వంగు. ధనం విచక్షణతో ఖర్చుపెట్టాలన్న పాఠంనేర్చకో. అతికనికరం పనికిరాదు, నీమంచి రోజులలోనే ప్రజలు నీదగ్గరకు వస్తారు, కానీ భగవంతుడు అయిన నారాయణుడు ఎల్లప్పుడూ, చెడుకాలంలోకూడా నీతో ఉంటాడు. ఎప్పుడా ఆయనను ప్రార్ధిస్తూ ఉండు. ఆయన నిన్ను నిర్లక్ష్యంచెయ్యరు అని శ్రీమహారాజు అన్నారు. 

ఈ సలహా విన్న బండుతత్యా మరోసారి శ్రీమహారాజు పాదాలకు నమస్కరించి సంతోషంతో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఒకసారి సోమవారం అమావాస్య (సోమావతి అనబడే రోజు) అయిన ఒక శుభసమయం వచ్చింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 71   🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj



🌻 Chapter 14 - part 2 🌻

But my present experience proves it to be false and makes me think that the poets have wrongly described You to be the benefactor of the poor. O Shri Hari! Now I lay down my life and you will be blamed for my death. So I request you to save yourself from this blame.” Saying thus to himself Bandu Tatya went to the Railway Booking Office to purchase a ticket. 

A brahmin approached him and said, “Don't purchase ticket for Haridwar. First go and take the darshan of a saint and then go to Haridwar. There is a great saint Shri Gajanan Maharaj at Shegaon. Go and meet Him first. Don't take hasty steps by monetary frustration. Know that the darshan of saint is never wasted.” 

At that Bandu Tatya got confused, fearing that the Brahmin might have recognised him. But he felt shy to ask him about his identity, nor could he know as to who He was. He, however, decided to go to Shegaon and pay respects to Shri Gajanan Maharaj. When he reached there and bowed before Shri Gajanan Maharaj, Shri Gajanan Maharaj laughed and said, “Bandu Tatya, why are you going to Himalayas to commit suicide? 

O boy! One should not kill himself! Never lose hope and don't stop trying to get the desired things. If you now commit suicide due to the calamities in family life, you will be required to take birth again to undergo the sufferings which you may avoid by suicide in this birth. 

Now don't go to Himalayas to end your life in the holy Ganga. Instead, go home immediately. Did you recognize the brahmin who met you at the Railway Station? Go home, and don't stay here anymore. 

There is an idol of Mhasoba in your garden. Go there at midnight alone, and dig three feet deep near the Babul tree which is to the east of the Mhasoba idol. You will get some money there. Give some of it to your creditors and keep the rest for you. 

Don't leave your wife and children, and forget this false renunciation.” Hearing thus, the brahmin returned to his village Kherda and, as per advice of Shri Gajanan Maharaj , started digging near that Babul tree at midnight. He dug three feet deep, and inside found a copper pitcher with a covered mouth. He opened it and saw that there were about 400 Moharas (gold coins) in it.

He lifted it and started dancing with happiness saying, “Jai Gajanan! Jai Gajanan!” He then paid his creditors and got released his mortgaged garden. By the grace of Shri Gajanan Maharaj, he set his affairs right and was very happy once again. It was just like getting nectar at the time of death, or like seeing a life saving boat while drowning in the sea. So was the state of Bandu Tatya; gone were the bad days for him. 

Then he came to Shegaon and spent lot on charity. He prostrated at the feet of Shri Gajanan Maharaj , Who said to him, “Why do you bow before Me? Instead, go and bow before Him, who gave you all this wealth. Now take a lesson and be judicious in spending money hereafter; it is useless to be over liberal. People come to you only in your good days, but Almighty Narayan is always with you in bad times also. 

Always pray to Him and He will never neglect you.” Hearing this advice, Bandu Tatya again prostrated at the feet of Shri Gajanan Maharaj and happily returned to his village. Once there was an auspicious occasion of Somavati (when there is coincidence of Monday and Amavasya). 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

04 Oct 2020


------------------------------------ x ------------------------------------





🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 72 / Sri Gajanan Maharaj Life History - 72 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 14వ అధ్యాయము - 3 🌻

ఈరోజు మహాత్యాన్ని పురాణాలు చాలా వివరంగా చెప్పాయి. ఈరోజున ప్రతివాళ్ళు తప్పక పుణ్యనది నర్మదలో స్నానం చెయ్యాలని చెప్పబడింది. కావున షేగాంప్రజలు ఈసోమావతికి నర్మదానదికి వెళ్ళాలని విచారించారు. వీళ్ళలో మార్తాండపాటిల్, బనకటలాల్, మారుతి, చంద్రబాను మరియు భజరంగలాల్ ఉన్నారు. వీళ్ళు ఓంకారేశ్వరు వెళ్ళేందుకు నిశ్చయిస్తారు. శ్రీమహారాజుకూడా తమతో ఈ నర్మదాస్నానాననికి వస్తే బాగుంటుందని బనకటలాల్ ఆలోచించాడు. కావున ఈనలుగురూ శ్రీమహారాజు దగ్గరకు చేరి తమతో ఓంకారేశ్వరు రావలసిందిగా అర్ధించారు.

మీరు ఉపస్థితులయితే అన్ని వికల్పాలనుండి మేము రక్షించబడతాము అని ఆయనతో అంటారు. పదేపదే శ్రీమహారాజును తమ అర్ధింపు అంగీకరించి మన్నంచమని వీళ్ళు అన్నారు. అప్పుడు.... పవిత్రమయిన నర్మద నాతోనే ఉంది కాబట్టి మరలనేను తన దగ్గరకి వెళ్ళిఇబ్బంది పెట్టనవసరంలేదు. నేను ఇక్కడే నర్మదాస్నానం చేస్తాను. కానీ మీరందరూ ఓంకారేశ్వరు వెళ్ళండి. మంధాత అనే ధైర్యశాలి అయిన గొప్పరాజు పూర్వకాలంలో ఆ ప్రదేశాన్ని పాలించాడు. 

ఓంకారేశ్వరులోనే శ్రీశంకరాచార్యుడు మొదట సన్యాసానికి మొక్కు పెట్టుకున్నాడు. తరువాత అక్కడనుండి ఆయన ప్రజలను ఈ ప్రాపంచిక బంధనాలనుండి విముక్తి చెయ్యడానికి పూనుకున్నాడు. కావున మీరు అక్కడికి వెళ్ళి నర్మదను కలుసుకోండి, నన్ను మీతోపాటు రమ్మని బలవంతం చెయ్యకండి. ఇక ఇప్పుడు నాకు ఇటువంటి కార్యాలు చెయ్యనవసరంలేదు అని శ్రీమహరాజు వాళ్ళతో అన్నారు.

కానీ వాళ్ళు ఆయన మాట వినకుండా, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని మరొకసారి అర్ధిస్తారు. మీరు చూస్తూఉంటే దొంగభక్తులులా ఉన్నారు. ఇక్కడ నూతిలో నీళ్ళలో నర్మదఉంది.

నేను తనని ఇక్కడ వదలి ఓంకారేశ్వరు వెళితే నాప్రియమయిన నర్మదకు కోపంవస్తుంది. కాబట్టి మీమంచికోసం నన్ను ఇక్కడనే వదిలేయమని మీకు సలహాఇస్తున్నాను, నన్ను నమ్మండి అది మీమంచికోసమే అని శ్రీమహారాజు అన్నారు.

కాని మారుతి మరియు చంద్రబానులు ఆయన లేకుండా వెళ్ళము అన్నారు. దానికి తనువాళ్ళతో వెళ్ళడంవల్ల ఏదయినా చెడుజరిగితే తనని నిందించవద్దని శ్రీమహారాజు వాళ్ళను హెఛ్ఛరించారు. శ్రీమహారాజుతో వాళ్ళంతా ఓంకారేశ్వరు వచ్చారు. చాలామంది ప్రజలు ఆ పుణ్యపర్వం అయిన సోమావతికి అక్కడ గుమిగూడారు. ఆడ, మగ అంతా నదీతీరానికి రెండుప్రక్కలా ఆక్రమించి ఉన్నారు. 

కొంతమంది పవిత్రస్నానం చేస్తున్నారు, కొంతమంది పవిత్ర మంత్రోఛ్చారణ చేస్తున్నారు మరి కొంతమంది చేతులలో పువ్వులు తీసుకొని మందిరంలోకి వెళుతున్నారు. చాలామంది మిఠాయిలు తింటూ కనిపించారు. భజన గుంపులు చాలా కొల్లలుగా వస్తున్నాయి. ఆ పవిత్రసమయంలో శ్రీఓంకారేశ్వరుకు అభిషేకం చేస్తున్న భక్తులతో మందిరం నిండిఉంది. అటువంటి ప్రశాంతస్థలం అయిన ఓంకారేశ్వరులో పవిత్ర నర్మదాతటాకం ఒడ్డుమీద పద్మాసనముద్రలో శ్రీమహారాజు కూర్చున్నారు. 

ఆయన నలుగురు భక్తులు ఓంకారేశ్వరుని దర్శనం చేసుకుని శ్రీమహారాజు దగ్గరకు వెనక్కి వచ్చారు. చాలా ఎక్కువ వాహనాలు రోడ్డుమీద ఉండడంవల్ల, రోడ్డుదారిన వెనక్కి వెళ్ళడం క్షేమంకాదనీ, అంతేకాక తమ ఎడ్లుకూడా అంతభరోసా ఉంచదగినవి కావని వాళ్ళుసూచించారు. కావున చిన్నపడవలో ఆనదిలో వెనక్కి వెళితేమంచిదని వాళ్ళు కోరారు. శ్రీమహారాజు ఏవిధమయిన అభిప్రాయం ఇవ్వకుండా వాళ్ళు ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యమని అన్నారు. అలా అని శ్రీమహారాజు వాళ్ళతో పడవలో కూర్చున్నారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 72 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 14 - part 3 🌻

Puranas describe its importance at great length. it is said that one must take a bath in the holy Narmada river on this day. So People of Shegaon planned a trip to Narmada for Somavati. Amongst them were Martand Patil, Bankatlal, Maruti, Chandrabhan and Bajaranglal who decided to go to Omkareshwar. Bankatlal thought that it would be better if Shri Gajanan Maharaj also accompanied them for a holy dip in the Narmada. So all four of them approached Shri Gajanan Maharaj and requested His company to Omkareshwar.

They said that His presence would fully protect them from evil and so again and again requested Shri Gajanan Maharaj to oblige them by conceeding to their request. Thereupon Shri Gajanan Maharaj said, “Holy Narmada is already with me and as such there is no need for me to go and trouble her. 

I will have the Narmada bath here, but you all go to Omkareshwar. In the ancient days, there ruled a brave and famous king named Mandhata at that place. Shri Shankaracharya took His first vow of renunciation at Omkareshwar only, and then started on His mission of liberating people from their worldly bonds. 

So, you go to that place and meet my Narmada, but do not force me to go with You. Now there is no need for me to undergo such rituals.” But they won't listen to him, and firmly caught hold of his feet and again requested their request. Shri Gajanan Maharaj said, “You people appear to be hypocrite! 

This well here contains the water of Narmada, and if I go to Omkareshwar, leaving her here, My dear Narmada will be angry. So, in your own interest, I again advise you to go, leaving Me here. Believe Me it is for your good.” But Maroti and Chandrabhan said that they won't go without Him.

Thereupon Shri Gajanan Maharaj warned them, that they should not blame Him if something bad happened by His accompanying them. They all came to Omkareshwar with Shri Gajanan Maharaj . Lot of people had gathered here on that auspicious occasion of Somavati, and all the men and women vere spread on both the banks of the river. 

Some were taking holy dip, some vere chanting holy hymns, while others were going to the temple with flowers in their hands. Many people were seen eating sweets and ‘Bhajan Dindis’ vere coming in scores. During that auspicious period, the temple was full of devotees offering ‘Abhishek’ to Shri Omkareshwar. 

At that pleasent place of Omkareshwar, Shri Gajanan Maharaj sat in Padmasan posture on the bank of the holy Narmada. His four devotees took Darshan and came back to Shri Gajanan Maharaj . They suggested that it was not safe to travel back by road, as there was lot of traffic, and the bullocks of their cart were not dependable. 

So they thought it woud be better to go back by river in a small boat. Shri Gajanan Maharaj , instead of giving any opinion, asked them to do as they liked. Saying so Shri Gajanan Maharaj sat in the boat with them and the journey to Khedighat started by river. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 73 / Sri Gajanan Maharaj Life History - 73  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 14వ అధ్యాయము - 4 🌻

నదిలో భేదార్ ఘాట్ కు తిరుగు ప్రయాణం ప్రారంభమయింది. దారిలో ఆపడవ ఒకరాయిని కొట్టుకుని పడవ క్రిందిభాగంలో ఒకచెక్క నీళ్ళలో కొట్టుకుపోయింది. నీళ్ళు పడవలోనికి దూసుకు రావడం మొదలు పెట్టాయి. ఇది చూసి పడవ నడిపేవాడు వాళ్ళజీవితాలు రక్షించేందుకు నదిలోకి దూకుతాడు. కానీ శ్రీమహారాజు ప్రశాంతంగా కూర్చుని గణ గణ గణాత బోతే అని నిర్విరామంగా భజించడం మొదలు పెట్టారు. 

మారుతి, భజరంగ్, మార్తాండ్ మరియు బనకటలాల్ భయపడి వాళ్ళ గుండెలు భయంతో బిగుసు కోవడం మొదలు పెట్టాయి. వాళ్ళు చేతులు కట్టుకుని ఓకరుణా హృదయుడైన మహారాజ్ షేగాంలో మీమాట అలక్ష్యం చేసినందుకు మేము సిగ్గు పడుతున్నాం, దానిఫలితంగానే నర్మద మమ్మల్ని ముంచి శిక్షిస్తోంది. 

ఓ స్వామీ ఇక నుండి మేము మీయొక్క ప్రతిమాట వేదవాక్కులా అనుకరిస్తాము. కావున ఈ ప్రమాదంనుండి మమ్మల్ని కాపాడి క్షేమంగా షేగాం తీసుకు వెళ్ళండి అన్నారు. వాళ్ళు అలా ప్రార్ధిస్తూండగానే అప్పటికే సగంపడవ నీళ్ళలోకి పోయింది. దానిని చూస్తున్న వాళ్ళు, ఈ ఐదుగురూ త్వరలో మునిగి పోతారు అని అంటున్నారు. కలవరపడకండి ఈ పవిత్ర నర్మద మీకు హానిచేయదు అని అప్పడు శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ నర్మదని పొగుడుతూ శ్రీమహారాజు ఇలా వర్ణించడం మొదలు పెట్టారు. 

ప్రతిచెడునూ నాశనంచేసే ఓ పవిత్రమైన నర్మదాదేవీ మీదయతో వీళ్ళతప్పును క్షమించు అని ఆయన ప్రార్ధిస్తూండగానే పడవలోనుండి నీళ్ళు బయటకు వెళ్ళిపోయాయి, నర్మద తన చేతితో పడవక్రింద కన్నాన్ని మూసివేసింది. పడవ మామూలుగా ఇదివరకటిలాగా నదిలో పైకితేలింది. దానితో పాటు నర్మదకూడా మనుష్యరూపంలో కనిపించింది. 

ఆమె ఒక మశ్చకన్య రూపంలో రింగుల జుత్తుతో నడుంవరకు తడిగా ఉంది. పడవ ఒడ్డుకు చేరింది. అందరూ పడవ క్రిందిభాగం చూసి, ఓదేవీ మీరు మమ్మల్ని రక్షించారు. దయచేసి మీరు ఎవరో మాకు చెప్పండి. దయచేసి ఈ తడిబట్టలు మార్చుకోండి. మాదగ్గర మీకుఇచ్చేందుకు పొడిబట్టలు ఉన్నాయి అన్నారు. నేను ఓంకార్ అనే చేపలు పట్టేవాని కుమార్తెను, నాపేరు నర్మద, నాకు ఇలా తడిబట్టలలో ఉండడం అలవాటు, నేను ఎప్పుడూ తడిగానే ఉంటాను, నారూపమే నీళ్ళు అని పవిత్రమైన నర్మద అంది. అలా అంటూ శ్రీమహారాజుకు నమస్కరించి, ఆకాశంలో మెరుపులా అకస్మాత్తుగా అదృశ్యం అయింది. 

ఇదంతా చూసిన ఈ నలుగురూ స్వయంగా నర్మద ఆయన దర్శనానికి వచ్చినందుకు శ్రీమహారాజు ఆధిక్యానికి పరవసులయ్యారు. అయినాసరే బనకట్ శ్రీమహారాజును అ స్త్రీ ఎవరో తమకు చెప్పవలసిందిగా అడిగాడు. నువ్వు అడుగుతున్నది నర్మద నీకు ఇదివరకే చెప్పింది. 

ఓంకార్ మశ్చ్యకారుడు ఈ ఓంకారేశ్వరుడు, నాస్వరూపం నీళ్ళు అని ఆమెఅంది, అంటే తనే స్వయంగా నర్మద. మనసులో ఏవిధమయిన సంకోచం పెట్టుకోకు, ఆమె ఎప్పడూ కష్టంలో ఉన్న తన భక్తులకు చేయూతనిస్తుంది. కావున గట్టిగా ఆమెకు జేజేలు చేస్తూ ఎప్పడూ మమ్మల్ని ప్రమాదస్థితుల నుండి కాపాడమని ప్రార్ధించండి అని శ్రీమహారాజు వాళ్ళతో అన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 73 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 14 - part 4 🌻

On their way, the boat dashed against a rock and a plank at the bottom of the boat was washed away. The water started rushing in through that hole and looking to it, the boatmen jumped out in the river for the safety of their lives. But Shri Gajanan Maharaj was sitting quietly and started chanting, “Gan Gan Ganat Bote” continously. Maroti, Bajarang, Martand and Bankatlal got scared and their hearts began throbbing with fright. 

They, with folded hands, said, “O kind hearted Maharaj! We are guilty of disobeying You at Shegaon, as a result of which this holy Narmada is punishing by drowning us. O swami! We shall hereafter obey every word of Yours as if it were a directive from the Vedas. So kindly save us from this danger by taking us safely back to Sheagaon.” 

As they were praying so, half of the boat had already gone under water. Onlookers were saying that these five persons would soon be drowned. Thereupon Shri Gajanan Maharaj said, “Don't get panicky! This holy Narmada will not hurt you at all.” Saying so, Shri Gajanan Maharaj started reciting the following in the praise of Narmada, “O Sacred Narmada Devi! Destroyer of everything that is inauspicious! Pardon their fault by your kindness.” 

As He was reciting the above prayer, the water went away from the boat, and the hole was closed by the hand of Narmada. The Boat came up floating on the water as before and alongwith it was seen Narmada herself in human form. She, in the dress of a fisher woman, and with curly hair, was wet upto her waist. 

The boat reached the shore and all of them looked surprisingly at the bottom of the boat and said, “O lady! You have saved us. Kindly tell us who You are. Please change Your wet clothes. We have dry clothing to offer You.” Holy Narmada said, “I am the daughter of Omkar fisherman. 

My name is Narmada and it is my habit to be in wet clothes. I always remain wet as my form is water.” Saying so, she bowed before Shri Gajanan Maharaj, and suddenly disappeared like a lightening in the sky. Looking to that, all the four were overjoyed to see the authority wielded by Shri Gajanan Maharaj , as the holy Narmada, herself, had come for his Darshan.

Even then Bankatlal asked Shri Gajanan Maharaj to tell them as to who the lady was. Shri Gajanan Maharaj said, “What you are asking has already been told by Narmada to you. The fisherman Omkar, is this Omkareshwar. When She said that the water is Her form, She means that she, herself, is the Narmada river. 

Do not have any doubt in your mind. She always extends Her helping hand to Her devotees in the times of danger. So, say loudly Jai! to Her with a prayer requesting you to save us in times of danger.” 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


06 Oct 2020

------------------------------------ x ------------------------------------





🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 74 / Sri Gajanan Maharaj Life History - 74   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. 14వ అధ్యాయము - 5 🌻

ఇది విన్న బనకటలాల్ మరియు మిగిలిన ముగ్గురూ పదేపదే శ్రీమహారాజుకు మొక్కారు. వాళ్ళు క్షేమంగా షేగాం చేరి ఈ వృత్తాంతాన్ని సంతోషంగా అక్కడి ప్రజలకు చెప్పారు. సదాశివ రంగనాధ్ వానవలె తన స్నేహితునితో ఒకసారి, శ్రీగజానన్ మహారాజు దర్శనానికి షేగాం వచ్చాడు. తాత్యా ముద్దుపేరుగల ఈ సదాశివ, మాల్వాలో అనేకమంది అనుచరులున్న, యోగవిద్యలో ప్రావీణ్యతగల, చిత్రకూట్ వాసిఅయిన శ్రీమాధవనాధ్ మహరాజు శిష్యుడు. 

సదాశివ్ శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వచ్చినప్పడు ఆయన తన భోజనం తీసుకుంటున్నారు. సదాశివ్ కనిపించగానే, శ్రీమహారాజు శ్రీమాధవనాధ్ మహారాజును గుర్తు చేసుకున్నారు. యోగులు కలవకుండానే ఒకరిగురించి ఒకరికి తెలుస్తుంది. శ్రీనాధ్ శిష్యులను నాముందుకు తెండి, భోజనం చేసి ఇప్పడే వాళ్ళగురువు వెళ్ళిపోయారు. కొద్దిగా కనక ముందు వచ్చిఉంటే వాళ్ళ గురువును వాళ్ళు ఇక్కడే కలిసి ఉండేవారు. ఇప్పడు వీళ్ళు తమగురువు తాంబూలం మర్చిపోయి వెళ్ళినతరువాత వచ్చారు అని శ్రీమహారాజు అన్నారు. 

తన సహోదరుని పిల్లలవడంతో శ్రీమహారాజు వానవలెను ఆలింగనం చేసుకుని ఆనవాయితీ ప్రకారం ఆహ్వనించారు. శ్రీనాధ్ కు ఇచ్చేందుకు రెండు తమలపాకులు ఆయన అప్పడు వాళ్ళకి ఇచ్చి, మాటలు మార్చకుండా ఉదహరించిన సందేసం ఇయ్యమని అన్నారు. మనం కలిసి భోజనంచేసాం, కానీ మీకిళ్ళీ ఇక్కడ మర్చిపోయారు, ఇప్పుడు మేము దానిని మీకోసం తెచ్చాము. వానవలె అదివిని ఆరెండు తమలపాకులతో తిరిగి వచ్చాడు. 

శ్రీనాధ్ కు షేగాంలో జరిగిన చర్చలు వివరంగా వర్నించి, మీరు నిజంగా షేగాం ఆరోజు వెళ్ళారా అని అడిగాడు. శ్రీగజానన్ ఏమి చెప్పారో అది నిజం. తను భోజనం చేస్తున్నప్పుడు నన్ను గుర్తు చేసుకోవడమే మేము కలుసుకోవడం. ఈ విధంగా మేము తరచు కలుసుకుంటూ ఉంటాం. దీనిగురించి ఏవిధమయిన శంక లేకుండా ఉండు. ఒకళ్ళని ఒకళ్ళు గుర్తుచేసుకోవడమే మేము కలుసుకోవడం. మాఇద్దరి శరీరాలు వేరుగా ఉన్నా, మా జీవనధార ఒక్కటే. ఇది చాలా గూఢమయిన జ్ఞానం, దీనిని అర్ధం చేసుకోవడానికి నీకు ఇంకా కొంత సమయం కావాలి.

నేను షేగాంలో మర్చిపోయిన తాంబూలం తెచ్చి మంచిపని చేసావు అని శ్రీనాధ్ అన్నారు. శ్రీనాధ్ ఆ తమలపాకులు తీసుకొని నూరి తిన్నారు, ఆయన కొంత వానవలకి కూడా ప్రసాదంగా ఇచ్చారు. శ్రీధ్యానేశ్వరు మాహారాజు తన చాందోపనిషత్తులో యోగులు ఈవిధంగా కలుసుకోవడం గురించి వివరంగా వర్నించారు. వారు ఆవిధంగా కలుసుకునే పద్ధతి తెలుసుకుందుకు అది చదవాలి.

యోగులు ఒకరికొకరు ఎంతదూరంగా ఉన్నా తమ స్థానం వదలకుండా కలుసుకోడం అనే సంగతి తెలుసుకోడం కుతూహలమైన విషయం. షేక్ మహమ్మద్ శ్రీగోండాలోను, తుకారాం దేహులోను ఉన్నారు, కానీ శ్రీతుకారాం దేహులో కీర్తన చేస్తున్న మండపానికి నిప్పు అంటుకున్నప్పుడు శ్రీగోండానుండి షేక్ మహమ్మద్ దానిని ఆపుతారు. దీనిని భక్తి విజయలో మహిపాల్ వర్నించారు.

శ్రీమాణిక్ ప్రభు హలి గ్రామంచేరి పాటిల్ కొడుకును బావిలో మునగకుండా రక్షించారు. నిజమైన యోగులే ఇటువంటి చమత్కారాలు చెయ్యగలరు. యోగ అన్నిటికంటే కుడా శక్తివంతమయినది. కాబట్టి దేశాన్ని పటిష్ఠం చెయ్యడానికి యోగ నేర్చుకోండి. ఈ మహాకావ్యమయిన గజానన్ విజయను ప్రియమైన భక్తులు పూర్తి విశ్వాసంతో వినుగాక. అందరికీ సంతోషంకలుగుగాక. హర మరియు హరికి నమస్సులు. 

శుభం భవతు 

14. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Gajanan Maharaj Life History - 74 🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 14 - part 5 🌻

Hearing this, Bankatlal and the three others again and again prostrated before Shri Gajanan Maharaj . They returned to Shegaon and, with great happiness, narrated the incident to the people there. Once Sadashiv Ranganath Wanawale, alongwith his friend, came to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj. 

This Sadashiv, nicknamed as Tatya, was the disciple of Shri Madhaonath Maharaj of Chitrakut, who had mastered the art of yoga and had a large following in Malwa. When Sadashiv came for the darshan of Shri Gajanan Maharaj, Maharaj was taking His meals. 

At the sight of Sadashiv, Shri Gajanan Maharaj remembered Shri Madhaonath Maharaj. Saints know each other even without meeting. Shri Gajanan Maharaj said, “Bring those disciples of Shri Nath before Me. Their Guru just went away after taking meals with Me. 

Had they come a bit earlier, they would have met their Guru here only. Now they have come after their Guru went away without taking the Paan. Being the children of a brother, Shri Gajanan Maharaj embraced Wanawale and gave him the traditional reception. Then He gave him two leaves of betel for giving to Shri Nath and asked to convey the message as follows without a change of word, “We had meals together but You forgot your Paan here. We have now brought it for You.” 

Wanawale heard this message and returned with those two leaves of betel. He narrated the detailed talk at Shegaon to Shri Nath and asked if He had really gone to Shegaon that day. Shri Nath said, What Shri Gajanan said is true. His remembering Me at the time of meals is Our meeting. 

We meet each other like that quite frequently. Don't have any doubt about it. Remembering each other is Our meeting. Though We have different bodies, Our life breath is the same. This is a deep knowledge and you may require some time to understand it. It is good that you brought the Paan, which I had forgotten at Shegaon.” 

Then Shri Nath took the betel leaves, crushed and ate it. He also gave some to Wanawale as Prasad. Shri Dyaneshwar Maharaj, in his ‘Changdeo Pasasti’, has described in great detail the way saints meet each other. One should read that to understand their manner of meeting. It is interesting to know that Yogis meet each other from any distance without leaving their places. 

Sheik Mohamed was in Shri Gonda and Shri Tukaram at Dehu, but when the pendal at Dehu where Shri Tukaram was doing Kirtan caught fire, Sheik Mohamed extinguished if from Shri Gonda. This has been narrated by Mahipal in the ‘Bhaktivijay’. Shri Manik Prabhu saved Patil's son from drowning in a well, by reaching Hali village. 

Only true yogis can perform such Miracle. Yoga is more powerful than anything else. So learn Yoga to make the nation strong. May the affectionate devotees with full faith, listen to this Gajanan Vijay epic! Let Joy be to all! Obeisance to Har and Hari. 

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Fourteen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


07 Oct 2020

------------------------------------ x ------------------------------------



🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 75 / Sri Gajanan Maharaj Life History - 75 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 15వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! 

ఓ కశ్యపకుమారా వామనా, ఓచిన్న నారాయాణా, రాజా బలి ఇచ్చిన బహుమానాన్ని స్వీకరించి మీరు అతనిని అనుగ్రహించారు. ఈలోకంలోని అతని రాజ్యాన్ని తీసుకుని, పాతాళలోకాన్ని అతనికి ఇచ్చారు. ఈపని చెయ్యడంతో మీరు అతని దగ్గరనుండి రాతిఉసిరికాయ తీసుకొని, ఆ మునిలాంటి రాజా బలికి కొబ్బరికాయ ఇచ్చారు. 

అంతేకాక అతని అత్యంత భక్తివల్ల మీరు అతని ద్వారపాలకునిగా ఉండేందుకు అంగీకరించారు. మీ ఆశీర్వచనాల వల్లనే ఈకధనంచివర రాజా బలి దేవతలకు రాజు అయ్యాడు. ఓ అనంతా మీరు వేదాలన్నిటినీ ఒక్కక్షణంలో నేర్చుకున్నారు. మీ అవతారాలన్నిటిలోనూ మీ ఈశ్రీహరి అవతారం చాలా పవిత్రమయినది. ఎందుకంటే మీరు ఎవరినీ సంహరించకుండా, స్నేహితులను, శత్రువులనుకూడా సంతోషపరిచారు. అందువల్లనే మీరు దేవతలచేతా, దానవులచేతా గౌరవించబడ్డారు. 

మీరు ఈ అవతారంలో దేవతలను సంతోషపెట్టి, దానవులను రక్షించి మీదైవత్వానికి సమర్ధన కలిగించారు. ఓవామనా నేను మరోసారి మీకు నమస్కరిస్తున్నాను. దయచేసి మీపవిత్ర హస్తాలను ఈదాసగణు తలపై ఉంచండి. శ్రీబాలగంగాధర తిలక్ మహారాష్ట్రమొక్క కొహినూరు. మంచి దూరదృష్టి కలిగి, రాజకీయాలలో రాణించాడు. ఈయన చాలా ధైర్యంకలవాడు, మనదేశ స్వాతంత్రం కోసం చాలా కష్టపడి పనిచేసాడు. 

మనదేశం యొక్క దయనీయ పరిస్థితిచూసి, భీష్మునివలె దృఢంగా విదేశీయుల పాలననుండి విముక్తి కలిగించడానికి ఒట్టుపెట్టుకున్నాడు. మరియు తనపని మీదఉన్న నిజాయితీ వలన ఏవిధమయిన భయంలేకుండా ఉండేవాడు. భృహస్పతి లాంటి వాక్చాతుర్యం కలిగి తన నిప్పులాంటి వ్రాతలతో బ్రిటిషు వారిమనస్సులో ఆందోళన సృష్టించాడు. తిలక్ ఎంత ధైర్యస్థుడంటే తన చేతలవల్ల లోకమాన్య అనే బిరుదు సంపాదించాడే తప్ప ఎవరూ ఆయనకి ప్రదానం చెయ్యలేదు.

ప్రజల అర్ధింపు మీద ఒకసారి శివాజీజయంతి సందర్భంగా ఉపన్యసించేందుకు ఆయన అకోలా వచ్చారు. ఈ ఉత్సవానికి చాలామంది పండితులు తమ చేయూతనిచ్చారు. వారిలో దామ, కొలాట్కర్, ఖపారడే ఇంకా అనేక ఇతరులు ప్రత్యేకం శివాజీ జయంతి కోసం అకోలా చేరారు. శ్రీతిలక్ ను ఈ కార్యక్రమానాకి అధ్యక్షునిగా ఆహ్వనించారని తెలిసి బెరారు ప్రజలు సంతోషించారు. 

శివాజీ జన్మదినోత్సవం ఇంకా చాలా ముందు బెరారులో జరిగి ఉండవలసింది, ఎందుకంటే శివాజీ తల్లి జీజాబాయి బెరారులోని ఇంద్ఖేడ్ లో పుట్టి పెరిగింది. ఈమె శివాజీ లాంటి ధైర్యస్తుడికి జన్మనిచ్చి తనయొక్క కౌశలంతో బెరారును, మహారాష్ట్రను ఒకటిచేసింది. తల్లి బెరారునుండి, తండ్రి మహారాష్ట్రనుండి అవడంతో ఈజోడి అద్భుతమైన మరియు తోలలేని జోడి. శివాజీ ఉత్సవాలు మహారాష్ట్రలో ఒక గొప్ప సంఘటన, దాని ప్రాధాన్యత తిలక్ అధ్యక్షత వహించడంతో మరింత పెరిగింది. 

ఒక నెలముందు నుండి ఈ ఉత్సవాల తయారీ ప్రారంభమయింది. అందరూకూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈకార్యనిర్వాహణ సమితికి అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని ఎన్నుకున్నారు, మరియు కార్యకర్తలను ఎంచుకున్నారు. కార్యక్రమం ఘనత పెంచేందుకు శ్రీగజానన్ మహారాజును ఈ ఉత్సవాలకు అహ్వనించాలని అనేకమంది కోరుకున్నారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Gajanan Maharaj Life History - 75  🌹 

✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj


🌻 Chapter 15 - part 1 🌻

Shri Ganeshayanmah! O Kashyapa's son Wamana! O little Narayana! You have obliged Bali Raja by accepting an offering from him. You took away his kingdom of this earth, but gave him that of the other world (Patala). You, by this action, took an Amla from him and in return gave a coconut to that saintly Bali Raja. 

Moreover, due to his extreme devotion, You accepted to remain as guard at his doors.vBy your blessing, Bali Raja is to become the King of Gods at the end of this epoch. O Ananta! You learnt all the Vedas in a moment. 

Amongst all your incarnations, this is, Shri Hari, the most pious, as You killed nobody and have pleased both, friends and foes. That is why You are respected both by the Gods and the Demons. You have, in this incarnation, given happiness to the Gods, protected the Demons and thus justified your Godliness. 

O Wamana! I again bow before You. Kindly put Your blessing hand on the head of this Dasganu. 

Shri Bal Gangadhar Tilak - the Kohinoor of Maharashtra - had keen foresight and excelled in politics. He was brave and worked hard for the independence of our country. Stubborn like Bhishma, looking to the plight of our country, he took a vow for its liberation from foreign rule, and being true to his cause, was fearless. 

Orator like Brihaspati, he created panic in the minds of Britishers by his fiery writings. Tilak was such a brave man that he earned the title of ‘Lokmanya’ by his deeds and not by anybody’s offering. Once, he came to Akola to deliver a speech on the occasion of Shivaji Jayantiby public request. 

Many learned people extended their helping hand for this celebration. Among them were Damle, Kolhatkar, Khaparde and many others who reached Akola especially for Shiv Jayanti. 

People of Berar were happy to know that Shri Tilak was invited to preside over this function. In fact the birth anniversary of Shivaji should have been celebrated in Berar much before this, for the reason that the mother of Shivaji - Jijabai - was born and brought up at Sindkhed in Berar. 

She gave birth to brave Shivaji and united Berar and Maharashtra by dint of her ability. Mother from Berar and father from Maharashtra was an excellent and incomparable couple. 

The celebration for Shivaji Jayantiwas a great occasion for Maharashtra and its greatness was enhanced manifold by Tilak presiding over it. The preparations for the celebrations started one month in advance and everybody was happily participating in it. President and Vice President of the Reception committee were elected and volunteers selected. 

To make the function more majestic, many people expressed their desire to invite Gajanan Maharaj for the celebrations. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj 


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


08 Oct 2020

------------------------------------ x ------------------------------------




For next of messages, please click on the following link , or click here







--- x ---



No comments:

Post a Comment