శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 411. 'శిష్టేష్టా’- 3 🌻


"ఆచారమున ధర్మము లేనప్పుడు ఆరాధన లెన్ని చేసిననూ దైవమునకు ప్రియులు కాలేరు.” 'శిష్టు' అనగా ధర్మాచార పరాయణులు. వీరికి చపలత్వముండదు. చపలత్వము కలవారు ముందుగ ఆచారమును సరిచేసు కొనవలెను. అందులకు ప్రార్థనలు చేయవచ్చును. కేవలము ప్రార్థనలే చేయుచు ఆచారమున మెరుగునకై ప్రయత్నింపనివారు కేవలము డంబాచారులై యుందురు. డంబాచారము అనాచారము కన్న హీనము. సదాచారులను రక్షించుట శ్రీమాత పని. వారామెకు ప్రియులు. వారి పూజలను ఆమె స్వీకరించును. వారికి శ్రియములే కాక ప్రియములు కూడ కలిగించును. అనగా మిక్కుటమగు వైభవమును కలిగించును. శివుని సాన్నిధ్యమును కూడ కల్పించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 411. 'Sishteshta'- 3 🌻


'When there is no dharma in practice, even if you do worship, you will not be loved by God.' 'Sishtu' means the practitioners of dharma. They have no fickle mindeness. Those who are fickle should correct their dharmic practices. Prayer helps for that. Those who only pray and do not try to improve their practices are just hypocrites. Hypocrisy is worse than ignorance. Srimata's job is to protect the righteous. They are Her loved ones. She accepts their worship. It not only makes them prosper but also makes them happy. That is, She grants more glory in their life. She also brings them closer to Lord Shiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 261. పరుగు / Osho Daily Meditations - 261. RUNNING

 

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 261 / Osho Daily Meditations - 261 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 261. పరుగు 🍀

🕉. మీరు సుదూర దూరం పరుగు పెట్టగలిగితే, అది పరిపూర్ణ ధ్యానం. వేగంగా నడవడం, పరుగు, ఈత కొట్టడం - ఏదైనా మీరు పూర్తిగా పాల్గొనవచ్చు. చాలా మంచిది. 🕉


మీరు కాదు, కార్యాచరణ మాత్రమే మిగిలి ఉండాలి. ఎందుకంటే అప్పుడు అహం పని చేయదు. మీరు నడుస్తున్నప్పుడు నిజంగా పరుగు మాత్రమే ఉంటుంది, పరుగు పెట్టేవాడు లేడు. ధ్యానం అంటే అదే.

నాట్యం మాత్రమే ఉండి, నర్తకి లేకపోతే అది ధ్యానం. మీరు పెయింటింగ్ చేస్తుంటే, పెయింటింగ్ మాత్రమే ఉంది మరియు చిత్రకారుడు లేకపోతే, అది ధ్యానం. సంపూర్ణంగా మరియు చేసే వారికి మరియు చేసిన వారికి మధ్య విభజన లేని కార్యాచరణ ఏదైనా ధ్యానం అవుతుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 261 🌹

📚. Prasad Bharadwaj

🍀 261. RUNNING 🍀

🕉. If you can do long-distance running, it is a perfect meditation. Jogging, running, swimming-anything in which you can get totally involved--is very good. 🕉


Only the activity remains, you are not, because the ego cannot function. When you are running there is really only running, there is no runner. And that's what meditation is.

If there is only dance and no dancer, that's meditation. If you are painting and there is only painting and no painter, then it is meditation. Any activity that is total and in which there is no division between the doer and the done becomes meditation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 126 / Agni Maha Purana - 126


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 126 / Agni Maha Purana - 126 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 39

🌻. విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠకై భూపరిగ్రహము - 3🌻


భూమిశోధనానంతరము భూపరిగ్రహము చేయవలెను. పిమ్మట ప్రాకారము సరిహద్దువరకు మినుములు, పసుపు, పేలాలు, పెరుగు, సక్తువులు-వీటితో భూతబలి ఇవ్వవలెను. అష్టాక్షరమంత్రము చదువుచు, ''ఈ ప్రదేశమునందు నివసించు రాక్షసపిశాచాదులు ఇచటినుండి తొలగిపోవుగాక. నే నిచట మహావిష్ణ్వాలయమును నిర్మింపనున్నాను'' అని చెప్పుచు, ఎనిమిది దిక్కులందును సక్తువులు చల్లవలెను.

భూమిని నాగలిచే దున్నించి ఆవులను దానిపై నడిపింపవలెను. ఎనిమిది పరమాణువులు ఒక రథరేణువు. ఎనిమిది రథరేణువులు ఒక త్రసరేణువు. ఎనిమిది త్రసరేణువులు ఒక వాలాగ్రము. ఎనిమిది వాలాగ్రముటు ఒక లిక్ష. ఎనిమిది లిక్షలు ఒక మూర. ఎనిమిది మూరలు ఒక యవమధ్యము, ఎనిమిది యవలు ఒక అంగుళము. ఇరువదినాలుగు అంగుళములు ఒక కరము. ఇరువది యెనిమిది అంగుళములు ఒక పద్మహస్తము.

శ్రీ అగ్నిమహాపురాణమునందు విష్ణ్వాదిదేవతాప్రతిష్ఠకై భూపరిగ్రహము అను ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 126 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 39

🌻 Preparations of ground for constructing temples - 3 🌻


16. The offerings to the (presiding) goblins should be offered upto the outer enclosing wall (with a mixture of) black gram, turmeric powder, fried grains, curd and flour.

17-18. Having dropped the flour in all directions along with (the recitation of) eight syllables: (one has to say), “The demons and goblins who remain on this ground may go away. I am making a place for Hari.” Having cleaved the earth with the plough one should cleave it with oxen.

19. Eight Paramāṇus make one rathāṇu. Eight rathāṇus are said to make one trasareṇu. Eight times that (makes) one bālāgra and eight times that is known as likhyā. Eight times that is known as yūka. Eight times that is a yavamadhyama. Eight times yava (makes) one aṅgula. Twenty-four aṅgulas (make) one kara. Four aṅgulas make one padmahastaka.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

కపిల గీత - 87 / Kapila Gita - 87


🌹. కపిల గీత - 87 / Kapila Gita - 87🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 43 🌴

43. క్లేదనం పిండనం తృప్తిః ప్రాణనాప్యాయనోందనమ్|
తాపాపనోదో భూయస్త్వమంభసో వృత్తయస్త్విమాః॥


తడుపుట, మట్టి మొదలగువాటికి ముద్ద ఆకృతిని కలిగించుట, తృప్తిని కలిగించుట, జీవలక్షణమును నిలుపుట, దాహమును నివారించుట, పదార్థములకు మెత్తదనమును కలిగించుట, తాపమును నివారించుట, కూపాదుల నుండి ఎంతగా తోడినను మరల మరల ఊరుచుండుట అనునవి జలము యొక్క వృత్తులు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Kapila Gita - 87 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 43 🌴

43. kledanaṁ piṇḍanaṁ tṛptiḥ prāṇanāpyāyanondanam
tāpāpanodo bhūyastvam ambhaso vṛttayas tv imāḥ

The characteristics of water are exhibited by its moistening other substances, coagulating various mixtures, causing satisfaction, maintaining life, softening things, driving away heat, incessantly supplying itself to reservoirs of water, and refreshing by slaking thirst.

Starvation can be mitigated by drinking water. It is sometimes found that if a person who has taken a vow to fast takes a little water at intervals, the exhaustion of fasting is at once mitigated. In the Vedas it is also stated, āpomayaḥ prāṇaḥ: "Life depends on water." With water, anything can be moistened or dampened. Flour dough can be prepared with a mixture of water. Mud is made by mixing earth with water.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

10 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹10, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతం, Rohini Vrat 🌻

🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 16 🍀


15. అపి క్షణార్ధం కలయంతి యే త్వాం ఆప్లావయంతం విశదైర్మయూఖైః
వాచాం ప్రవాహైరనివారితైస్తే మందాకినీం మందయితుం క్షమంతే ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : భూతకాలపు మూసలను అవసరమైతే విచ్ఛిన్నం చెయ్యి. కాని, దాని మూలతత్త్వాన్నీ, ఆత్మనూ మాత్రం భద్రపరుచు, లేని యెడల, నీకు భవిష్య త్తే ఉండదు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ విదియ 18:34:31 వరకు

తదుపరి కృష్ణ తదియ

నక్షత్రం: రోహిణి 29:08:24 వరకు

తదుపరి మృగశిర

యోగం: పరిఘ 21:12:30 వరకు

తదుపరి శివ

కరణం: గార 18:36:31 వరకు

వర్జ్యం: 20:28:20 - 22:12:16

దుర్ముహూర్తం: 10:05:58 - 10:51:31

మరియు 14:39:13 - 15:24:46

రాహు కాలం: 13:25:13 - 14:50:37

గుళిక కాలం: 09:09:02 - 10:34:26

యమ గండం: 06:18:15 - 07:43:39

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21

అమృత కాలం: 25:40:08 - 27:24:04

సూర్యోదయం: 06:18:15

సూర్యాస్తమయం: 17:41:24

చంద్రోదయం: 19:06:36

చంద్రాస్తమయం: 07:47:15

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు : ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 29:08:24 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹