శ్రీ మదగ్ని మహాపురాణము - 126 / Agni Maha Purana - 126


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 126 / Agni Maha Purana - 126 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 39

🌻. విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠకై భూపరిగ్రహము - 3🌻


భూమిశోధనానంతరము భూపరిగ్రహము చేయవలెను. పిమ్మట ప్రాకారము సరిహద్దువరకు మినుములు, పసుపు, పేలాలు, పెరుగు, సక్తువులు-వీటితో భూతబలి ఇవ్వవలెను. అష్టాక్షరమంత్రము చదువుచు, ''ఈ ప్రదేశమునందు నివసించు రాక్షసపిశాచాదులు ఇచటినుండి తొలగిపోవుగాక. నే నిచట మహావిష్ణ్వాలయమును నిర్మింపనున్నాను'' అని చెప్పుచు, ఎనిమిది దిక్కులందును సక్తువులు చల్లవలెను.

భూమిని నాగలిచే దున్నించి ఆవులను దానిపై నడిపింపవలెను. ఎనిమిది పరమాణువులు ఒక రథరేణువు. ఎనిమిది రథరేణువులు ఒక త్రసరేణువు. ఎనిమిది త్రసరేణువులు ఒక వాలాగ్రము. ఎనిమిది వాలాగ్రముటు ఒక లిక్ష. ఎనిమిది లిక్షలు ఒక మూర. ఎనిమిది మూరలు ఒక యవమధ్యము, ఎనిమిది యవలు ఒక అంగుళము. ఇరువదినాలుగు అంగుళములు ఒక కరము. ఇరువది యెనిమిది అంగుళములు ఒక పద్మహస్తము.

శ్రీ అగ్నిమహాపురాణమునందు విష్ణ్వాదిదేవతాప్రతిష్ఠకై భూపరిగ్రహము అను ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 126 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 39

🌻 Preparations of ground for constructing temples - 3 🌻


16. The offerings to the (presiding) goblins should be offered upto the outer enclosing wall (with a mixture of) black gram, turmeric powder, fried grains, curd and flour.

17-18. Having dropped the flour in all directions along with (the recitation of) eight syllables: (one has to say), “The demons and goblins who remain on this ground may go away. I am making a place for Hari.” Having cleaved the earth with the plough one should cleave it with oxen.

19. Eight Paramāṇus make one rathāṇu. Eight rathāṇus are said to make one trasareṇu. Eight times that (makes) one bālāgra and eight times that is known as likhyā. Eight times that is known as yūka. Eight times that is a yavamadhyama. Eight times yava (makes) one aṅgula. Twenty-four aṅgulas (make) one kara. Four aṅgulas make one padmahastaka.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment