శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 542 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 542 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 542 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 542 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 542. 'పుణ్యకీర్తి' - 1 🌻


శ్రీమాత పుణ్యకీర్తి కలది అని ఒక అర్థము. ఆరాధించువారికి పుణ్యము నిచ్చుచూ కీర్తి కలిగించునని మరియొక అర్థము. శ్రీమాతను అనునిత్యము ఆరాధన చేయువారు క్రమముగ పుణ్య భావములను పొందుచుందురు. ఆ భావములు ఆచరణ రూపము దాల్చినపుడు లోకహితము కలుగును. చేయు కార్యముల వలన లోక హితము కలుగుచున్నప్పుడు చేయువానికి పుణ్య మబ్బుచుండును. లోకమున కీర్తియు కలుగుచుండును. ఇట్లు పుణ్య సుఖమును కలిగించుట, కీర్తి సుఖమును కలిగించుట శ్రీమాత చేయు కార్యమే. పుణ్యకార్యములు చేయువారు శ్రీమాతకు సమర్పణగ చేయవలెను. అహంకారముతో చేసినచో సుఖ ముండదు. కీర్తియు యుండదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 542 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 542. 'Punyakeerthi' - 1 🌻


Srimata has Punyakeerti. Another meaning is that she bestows virtue and brings glory to the worshippers. Those who worship Sri Mata daily will gradually attain pious feelings. When those feelings are put into practice, worldly good is done. When the good of the world arises due to one's actions, one attains virtue. There will also be glory in the world. It is the work of Srimata to bring happiness of virtue and happiness of fame. Those who do pious works should surrender to Srimata. If it is done with ego there is no happiness. Nor is there glory.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


మీ ఆదర్శాలపై, భగవంతునిపై విశ్వాసం దృఢంగా ఉంచండి / Have faith in your ideals, in God


🌹 మీ ఆదర్శాలపై, భగవంతునిపై విశ్వాసం దృఢంగా ఉంచండి. / Have faith in your ideals, in God. 🌹

✍️. ప్రసాద్‌ భరధ్వాజ


మాట మరియు చేతల ద్వారా ఎవరికీ బాధ కలిగించ వద్దు. మీ కోరికలు, భావోద్వేగాలు మరియు ప్రేరణలను నియంత్రించండి, ముఖ్యంగా కోపం, అసూయ మరియు దురాశ. వారు అహంతో అభివృద్ధి చెందుతారు మరియు దానిని ప్రమాదకరమైన ఆయుధంగా చేస్తారు. మీరు మీ అభిరుచులకు బానిసలుగా ఉన్నప్పుడు, మీరు ఎలా నిలబడి గౌరవాన్ని పొందగలరు? పిరికివాళ్ళు మాత్రమే తమ ఇంద్రియాలకు లేదా కోరికలకు లొంగిపోతారు. ధైర్యవంతులు వాటిని ఎదుర్కొని గెలుస్తారు. యోధుడు తన మనస్సును అధిగమిస్తాడు మరియు దాని ప్రేరణలను అరికడతాడు. వాటిచే అధిగమించ బడిన వాడుగా ఉంటాడు. అది కానివాడు వాటికి లొంగి వాటిచే నడప బడతాడు. అలలు ఎగసి పడినప్పుడు రాయిలాగా నిలుచోండి.

మీ ఆదర్శాలపై, భగవంతునిపై విశ్వాసం దృఢంగా ఉంచండి. వైఫల్యం మీ ద్వారంలోకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని క్షీణించ నివ్వవద్దు. దాన్ని కొత్త సవాలుగా ఎదుర్కొని, విజయం సాధించండి. మీ విశ్వాసం మీ శ్వాసలా ఉండకూడదు; ఎందుకంటే ఊపిరి లోపలికి వస్తుంది మరియు బయటకు వెళుతుంది, మరియు ఇటువంటి రావడం, పోవడం, ప్రవేశాలు మరియు నిష్క్రమణల వంటి ప్రత్యామ్నాయాలు లేకుండా మీ విశ్వాసమును దృఢంగానూ, శాశ్వతంగానూ ఉండనివ్వండి. విశ్వాసం అనేది ఒక నిరంతర పూర్ణ ప్రవాహం అయితే, దయ కూడా ఒక నిరంతర పూర్ణ ప్రవాహంలో మీపై కురుస్తుంది.

🌹🌹🌹🌹🌹




🌹 Have faith in your ideals, in God. 🌹

Do not inflict pain on any one, through word and deed. Control your passions, emotions and impulses, especially, anger, envy and greed. They thrive on the ego and make it a dangerous weapon. When you are enslaved by your passions, how can you stand forth and claim respect? Only cowards yield to their senses or passions. Brave men face up to them and win. The hero is he who overrules his mind and curbs his impulses; the zero is he who is overruled by them. Stand fast, like a rock, when the waves beat.

Have faith in your ideals, in God. Do not allow faith to falter when failure comes into your door. Meet it as a new challenge, and triumph. Your Vishwaasam must not be like your Breath; for Breath comes in and goes out, it is now in and now out. Let your vishwaas be firm, with no alternations of entrances and exits. If faith is one full continuous stream, Grace too will be showered on you in one full continuous stream.

🌹🌹🌹🌹🌹

సిద్దేశ్వరయానం - 44 Siddeshwarayanam - 44


🌹 సిద్దేశ్వరయానం - 44 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 5వ శతాబ్దం నుండి 🏵


హరసిద్ధుడు ఒక పూట ముందు బయలుదేరి ఇంటికి వెళ్ళి పెంపుడు తల్లిదండ్రులతో గడిపి రాత్రి కామాఖ్య కాళీమందిరంలో రాజవసతి స్థలంలో ఉన్నాడు. మొదటి జాము గడచి అర్ధరాత్రి అవుతున్న సమయంలో గదిలో ఏకాంతంగా ఉన్న ప్రశాంతవేళ మధురగానం దూరం నుంచి వినిపిస్తున్నది. నెమ్మదిగా దగ్గరవుతున్నది. ఎవరో తనను పిలుస్తున్నారు.ఆ నాదం మూసిన తలుపులలో నుండి కాంతి తరంగాల రూపంలో లోపలికి వచ్చింది. చూస్తుండగా సుందరమైన ఆకృతి ధరించింది. తనకు అస్త్రవిద్యలు నేర్పిన డాకిని, "మహాయోగినీ! దివ్యవిద్యాధరీ! స్వాగతం" అని లేచి హరసిద్ధుడు ఆహ్వానించాడు. ఆమె “హరా! నిన్ను చూచి సంతోషంగా ఉంది. కార్యార్థివై ఆంధ్రభూమికి వెళుతున్నావు. విజయం సాధించటానికి ప్రయత్నించు" అన్నది. అతడు "దేవీ! నీవు గాన గాంధర్వివి. నా యందు దయ, ప్రేమ కలదానివి. నేను దక్షిణ భారతానికి వెళ్ళి మరొక యుద్ధం, మారణకాండ జరగకుండా శాంతి నెలకొల్పాలని కోరుతున్నాను. నాకు యుద్ధవిద్యలలో ఉన్న నైపుణ్యం మంత్ర విద్యలలో లేదు. నీవు దివ్యాంగనవు. నా కోసం ఈ పని చేసి పెట్టు. నేను పుట్టిన తెలుగు నేలకు ఋణం తీర్చుకొంటాను” అన్నాడు.

డాకిని "వీరాగ్రణీ! నీకు తప్పక చేస్తాను సహాయం. నాకు కూడా నీ వల్ల మేలు జరిగింది. నీకు అస్త్రవిద్యలలో నైపుణ్యం కలిగించినందుకు సంతోషించి భైరవస్వామి నాకు గంధర్వత్వం ప్రసాదించాడు. నేనిప్పుడు భూత భూమికలు దాటి గాంధర్విగా ప్రకాశిస్తున్నాను. నీకు దివ్యశక్తులు వచ్చేలా చేస్తాను. ప్రస్తుతం నీకు స్వప్నమోహినీ విద్యనుపదేశిస్తాను. దానిని ఆంధ్ర నాగనాయకుల మీద ప్రయోగించు. వారి యిష్టదేవతల రూపంలో ఈ స్వప్న దేవత కనపడి యుద్ధం వద్దని శాంతిసంధి చేసుకోమని ఆదేశిస్తుంది. ప్రస్తుతానికి నీ కోరిక నెరవేరుతుంది. మీ మామగారి మనుషులతో అక్కడికి వెళ్ళి ఈ పని సానుకూలమైన తర్వాత వాళ్ళను వెనక్కు పంపించు. అప్పుడు నేను వచ్చి అనంతర కర్తవ్యం చెపుతాను ” అన్నది.

అనుకొన్న విధంగా ఆంధ్రసీమలో శాంతి నెలకొన్నది. గాంధర్వి వచ్చి హరసిద్ధుని కుర్తాళం తీసుకువెళ్ళింది. కుర్తాళనాథేశ్వరుని దర్శనం చేసుకొన్న తర్వాత పొదిగైజలపాతాల దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆమె ఒక సంఘటన తెలియజేసింది. “నీకు వజ్రయాన సాధనలు నేర్పిన బోయాంగ్ కొద్ది కాలం క్రింద ఇద్దరు శిష్యులను, ఒక శునకాన్ని తీసుకొని వచ్చి గురుస్థానమైన కుర్తాళం వచ్చాడు. పొదిగై కొండల మీద దిగి వారితో మృత్యువును జయించగలిగిన ఓషధిఘుటికలను నేను తయారు చేశాను. వాటిని మీకు ఇస్తాను. నేనూ వేసుకొంటాను. నాకెంతో సేవ చేసిన మీకు ఈ మేలు చేస్తున్నాను. అని ఒక మాత్ర కుక్కనోట్లో వేసి, తానొకటి మింగి ఇద్దరు శిష్యులకూ చెరొక మాత్ర యిచ్చాడు. ఒక శిష్యుడు మింగాడు. రెండోవాడు ఇంకా మింగలేదు. ఈ లోపు కుక్క స్పృహతప్పి పడిపోయింది. బోయాంగ్, మొదటి శిష్యుడు కూడా పడిపోయినారు. ఎవరిలోను ప్రాణమున్న లక్షణాలు లేవు. అయ్యో! ఎంత పని జరిగింది! గురువుగారు ఓషధి తయారు చేయటంలో ఏదో పొరపాటు పడినారు. అందరూ మరణించారు. నేను దీనిని మింగను అని ఆ మాత్రను పొదలలోకి విసిరివేసి ఏడుస్తూ క్రిందికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళను తీసుకొని మరణించిన వాళ్ళకు అంత్యక్రియలు చేయటం కోసం తిరిగి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. ఒక పెద్ద శిల మీద కొన్ని అక్షరాలు వ్రాయబడి ఉన్నవి. "నీవు మాత్ర వేసుకోలేదు. దురదృష్టవంతుడవు. మాకు విద్యున్మయమైన దివ్యదేహాలు వచ్చినవి. ఆకాశమార్గంలో వెళుతున్నాము" అని. రెండవ శిష్యుడు గ్రామస్థులు ఆ మాత్ర కోసం వెదికారు. దొరకలేదు. బాధపడుతూ వెళ్ళారు.

ఆ మాత్ర నీకు దొరుకుతుంది. అది ఇంకా చెడిపోలేదు. పద". ఆమె దివ్యజ్ఞానం వల్ల అది దొరికింది. ఆ మాత్రను అతని చేత మింగించింది. చూస్తూ ఉండగా అతని శరీరంలో అద్భుతమైన పరిణామం వచ్చింది. దాదాపు స్పృహ పోయింది. కాని గంధర్వ డాకిని ప్రక్కన ఉండి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వేగంగానే అతనికి విద్యున్మయమైన శరీరం వచ్చింది. ఆకాశ గమనశక్తి వచ్చింది. "గాంధర్వీ! నీ ఋణం ఎలా తీర్చుకో గలను ? నన్ను సామాన్య మానవుని దివ్యునిగా మార్చావు" అన్నాడతడు. ఆమె "నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇంకా చేయవలసింది ఉంది. మనం హిమాలయాలలో త్రివిష్టప భూములలోని వజ్రభైరవ గుహదగ్గరకు వెళ్ళాలి. అక్కడ నీవు మరికొన్ని సాధనలు చేయవలసి ఉంది. ఇంతకు ముందు నీవు చూచిన గుహయే అది” అన్నది. అక్కడకు చేరుకొన్న పిదప బహువిధములైన సాధనలు అతనిచేత చేయించింది. అతనికిప్పుడు ఎన్నో దివ్యశక్తులు వచ్చినవి.

"హరసిద్ధా! నీవిప్పుడు పరిపూర్ణ సిద్ధభైరవుడవు. నేను గంధర్వ లోకానికి వెళుతున్నాను. నీవు స్మరించినప్పుడు వస్తాను. నాయంతట నేను కూడా అప్పుడప్పుడు వస్తాను. భవిష్యత్తులో సాధకు లెందరికో నీవు సహాయపడవలసి ఉంది. కలియుగప్రభావం వల్ల మంత్రసిద్ధి ఎంత కష్టపడినారాదు. యోగ్యులను అనుగ్రహించు. భవిష్యత్తులో నేను కూడా మానవ జన్మ తీసుకోవలసి రావచ్చు. అప్పుడు నీవు నాకు సహాయ పడవలసి వస్తుంది. ప్రస్తుతం నీవు నాగభూమి కొకసారి వెళ్ళు. హిరణ్మయి నీ కోసం ఎదురు చూస్తున్నది.

ప్రతి జీవికి ప్రేమ కేంద్రములు మారుతుంటవి. చిన్నప్పుడు తల్లిప్రేమకేంద్రం. శిశువు అమ్మను విడచి ఉండలేదు. పెరుగుతుంటే స్నేహితులు ప్రేమ కేంద్రాలు. తరువాత ప్రియుడు లేక ప్రియురాలు. అనంతరం సంతానం. ఇప్పుడు నీ భార్యకు కుమారుడు ప్రేమ కేంద్రం. అయినా ఆమె నీయందు అనన్యప్రేమ సమన్విత. అప్పుడప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఉంటూ దేశసంచారం చేస్తూ దైవ సామ్రాజ్యాన్ని నిర్మించటానికి నిరంతరం కృషి చేస్తూ ఉండు. మరొక్క మాట. కొంతకాలం తర్వాత అమితాభ బుద్ధుని అంశతో పద్మసంభవుడనే యోగిపుట్టి వజ్రవైరోచనిని ఉపాసిస్తాడు. ఆమె సఖిని నేను. అతనిలో కొంతకాలం ఉండు. నీ ప్రవేశం వల్ల అతడు అద్భుతశక్తులు ప్రదర్శిస్తాడు. అది పరిమితసమయం మాత్రం. నీవు నీ మార్గంలో ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యి, సిద్ధాశ్రమ యోగులతో మైత్రి నీకు మేలు చేస్తుంది. అక్కడ మహనీయులు నీకు మార్గదర్శకులుగా ఉంటారు. భారతదేశంలోనే కాక వివిధ ద్వీపాలలో సిద్ధాశ్రమ కేంద్రాలున్నవి. అక్కడకు వెళ్ళి సిద్ధ సమావేశాలలో పాల్గొనవలసిన అవసరమున్నది. ముఖ్యంగా క్రౌంచద్వీపం భవిష్యత్తులో పెద్ద శక్తికేంద్రం కాబోతున్నది. అక్కడి సిద్ధ కేంద్రాలమీద ప్రత్యేక దృష్టి ఉంచు. నేను ఆత్మీయురాలిగా ఏదో చెపుతున్నాను. అన్నీ నీవింక స్వతంత్రంగా నిర్ణయించగలవు. నిర్వహించగలవు. విజయోస్తు!"

( సశేషం )

🌹🌹🌹🌹🌹


Osho Daily Meditations - 136. GOING INTO FEAR / ఓషో రోజువారీ ధ్యానాలు - 136. భయంలోకి వెళ్లడం




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 136 / Osho Daily Meditations - 136 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 136. భయంలోకి వెళ్లడం 🍀

🕉 భయం ఉన్నప్పుడల్లా దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. నిజానికి, భయం నుండి సూచనలు తీసుకోండి. అవి మీరు ప్రయాణించాల్సిన దిశలు. భయం కేవలం ఒక సవాలు. ఇది మిమ్మల్ని పిలుస్తుంది: 'రండి!' 🕉


ఏదైనా నిజంగా మంచిగా ఉన్నప్పుడు, అది భయానకంగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు కొన్ని అంతర్దృష్టులను తెస్తుంది. ఇది కొన్ని మార్పులకు మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఇది మిమ్మల్ని ఒక అంచుకు తీసుకువెళుతుంది, మీరు వెనక్కి వెళితే, మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించరు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ పిరికివాడిగానే గుర్తుంచుకుంటారు. ముందుకెళితే ప్రమాదమే. అదే భయంగా ఉంటుంది. కొంత భయం ఉన్నప్పుడల్లా, వెనక్కి వెళ్లకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే అది పరిష్కరించే మార్గం కాదు. అందులోకి వెళ్ళండి. మీరు చీకటి రాత్రికి భయపడితే, చీకటి రాత్రిలోకి వెళ్లండి-ఎందుకంటే దానిని అధిగమించడానికి అదే మార్గం.

భయాన్ని అధిగమించడానికి అదొక్కటే మార్గం. రాత్రిలోకి వెళ్లండి; అంతకన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. వేచి ఉండండి, అక్కడ ఒంటరిగా కూర్చోండి మరియు రాత్రిని పని చేయనివ్వండి. భయపడితే వణకండి. వణుకు ఉండనివ్వండి, కానీ రాత్రికి చెప్పండి, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయి. నేను ఇక్కడ ఉన్నాను.' కొన్ని నిమిషాల తర్వాత ప్రతిదీ స్థిరపడిందని మీరు చూస్తారు. చీకటి ఇప్పుడు చీకటి కాదు, అది ప్రకాశవంతంగా మారింది. మీరు దానిని ఆస్వాదిస్తారు. మీరు దానిని తాకవచ్చు- మృదువైన నిశ్శబ్దం, విశాలత, సంగీతం. మీరు దానిని ఆస్వాదించగలరు మరియు మీరు ఇలా అంటారు, 'ఇంత అందమైన అనుభవానికి నేను భయపడ్డాను ఎంత మూర్ఖుడిని!'


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 136 🌹

📚. Prasad Bharadwaj

🍀 136. GOING INTO FEAR 🍀

🕉 Whenever there is fear, never try to escape from it. In fact, take hints from fear. Those are the directions in which you need to travel. Fear is simply a challenge. It calls you: "Come!" 🕉


Whenever something is really good, it is also scary, because it brings you some insights. It forces you toward certain changes. It brings you to a brink from where, if you go back, you will never forgive yourself. You will always remember yourself as a coward. If you go ahead, it is dangerous. That's what is scary. Whenever there is some fear, always remember not to go back, because that is not the way to solve it. Go into it. If you are afraid of the dark night, go into the dark night-because that is the only way to overcome it.

That is the only way to transcend the fear. Go into the night; there is nothing more important than that. Wait, sit there alone, and let the night work. If you fear, tremble. Let the trembling be there, but tell the night, "Do whatever you want to do. I am here." After a few minutes you will see that everything has settled. The darkness is no longer dark, it has come to be luminous. You will enjoy it. You can touch it-the velvety silence, the vastness, the music. You will be able to enjoy it, and you will say, "How foolish I was to be afraid of such a beautiful experience!”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 877 / Sri Siva Maha Purana - 877


🌹 . శ్రీ శివ మహా పురాణము - 877 / Sri Siva Maha Purana - 877 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴

🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను- ఆమె యుద్ధ రంగమునకు వెళ్లి సింహనాదమును చేసెను. ఆ దేవియొక్క నాదమును తాళజాలక దానవులు మూర్ఛను పొందిరి (1). ఆమె అమంగళకరమగు అట్టహాసమును పలుమార్లు చేసి మధువును త్రాగి యుద్ధరంగములో నాట్యము చేసెను (2). ఉగ్రదంష్ట్ర, ఉగ్రదండ, కోటవి అను పేర్లుగల దేవీ మూర్తులు కూడ ఇతర దేవీమూర్తులతో గూడి ఆ యుద్ధములో మధువును అధికముగా త్రాగి నాట్యమాడిరి (3). శివగణములలో మరియు దేవతల దళములలో అపుడు పెద్ద కోలాహలము బయలు దేరెను. దేవతలు, గణములు మరియు ఇతరులు అందరు అధికముగా గర్జిస్తూ ఆనందించిరి (4). కాళిని చూచి శంఖచూడుడు వెంటనే యుద్ధమునకు వచ్చెను. భయమును పొందియున్న దానవులకు ఆ రాక్షసరాజు అభయమునిచ్చెను. (5) కాళి ప్రళయకాలాగ్నిని బోలిన అగ్నిని విరజిమ్మెను. కాని ఆ దానవేంద్రుడు దానిని వెంటనే వైష్ణవాస్త్రముతో అవలీలగా త్రిప్పికొట్టెను (6). అపుడా దేవి వెంటనే అతనిపై నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఆ దానవ వీరుని గాంచి ఆ అస్త్రము వర్ధిల్లెను (7).

ప్రళయకాలాగ్ని జ్వాలను బోలియున్న ఆ అగ్నిని గాంచి శంఖచూడుడు దండమువలె నేలపై బడి పలుమార్లు ప్రణమిల్లెను (8). వినీతుడై యున్న దానవుని ంచి ఆ ఆయుధము వెనుదిరిగెను. అపుడా దేవి మంత్రమును పఠించి బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను (9). ఆ దానవవీరుడు నిప్పులు గ్రక్కు చున్న దానిని గాంచి నేలపై నిలబడి ప్రణమిల్లి బ్రహ్మాస్త్రముతో దానిని తప్పించెను (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 877 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴

🌻 Kālī fights - 1 🌻


Sanatkumāra said:—

1. Going to the battle ground, the goddess Kālī roared like a lion. On hearing that the Dānavas fainted.

2. She laughed boisterously again and again boding ill to the Asuras. She drank the distilled grapewine and danced on the battle ground.

3. The manifestations of Durgā viz—Ugradaṃṣṭrā (one with fierce fangs) Ugradaṇḍā (one with fierce baton) and Kotavī (the naked) danced on the battle ground and drank wine.

4. There was great tumult on the side of the Gaṇas and the gods. All the gods and the Gaṇas roared and rejoiced.

5. On seeing Kālī, Śaṅkhacūḍa hastened to the battle ground. The Dānavas were frightened but the king Śaṅkhacūḍa assured them of protection.

6. Kālī hurled fire as fierce as the flame of dissolution which the king put out sportively by means of Vaiṣṇava missiles.

7. Immediately the goddess hurled the Nārāyaṇa missile at him. The missile developed its power on seeing the Dānava Śaṅkhacūḍa.

8. On realising it as fierce as the flame of fire of dissolution, the Dānava Śaṅkhacūḍa fell flat on the ground and bowed again and again.

9. On seeing the Dānava humbled the missile turned away. Then the goddess hurled the Brahmā missile with due invocation through the mantra.

10. On seeing the missile blazing he bowed and fell on the ground. The leader of the Dānavas thus prevented the Brahmā missile from attacking him.



Continues....

🌹🌹🌹🌹🌹





శ్రీమద్భగవద్గీత - 523: 13వ అధ్., శ్లో 34 / Bhagavad-Gita - 523: Chap. 13, Ver. 34

 

🌹. శ్రీమద్భగవద్గీత - 523 / Bhagavad-Gita - 523 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 34 🌴

34. యథా ప్రకాశయత్యేక: కృత్స్నం లోకమిమం రవి: |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ||


🌷. తాత్పర్యం : ఓ భరతవంశీయుడా! ఒక్కడేయైన సూర్యుడు లోకమునంతటిని ప్రకాశింపజేయునట్లు, దేహంనందలి ఆత్మ సమస్తదేహమును చైతన్యముతో ప్రకాశింప జేయును.

🌷. భాష్యము : చైతన్యము సంబంధించిన సిద్ధాంతములు పెక్కు గలవు. అట్టి చైతన్యమునకు భగవద్గీత యందు ఇచ్చట సూర్యుడు మరియు సూర్యకాంతి యొక్క ఉపమాన మొసగబడినది. సూర్యుడు ఒక్కచోటనే నిలిచియుండి సమస్త విశ్వమును ప్రకాశింప జేయునట్లు, దేహమునందలి హృదయములో నిలిచియున్నట్టి అణుఆత్మ చైతన్యముచే దేహము నంతటిని ప్రకాశింప జేయుచున్నది. కనుక సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని ఉనికిని నిదర్శమైనట్లే, దేహమునందలి చైతన్యము దేహమునందలి ఆత్మ యొక్క ఉనికికి నిదర్శమైయున్నది. ఆత్మ దేహము నందున్నంత కాలము చైతన్యము సైతము వెడలిపోవును.

అనగా ఆత్మలేని దేహము చైతన్యరహితమగును. తెలివిగల ఎవ్వరికైనను ఇది సులభగ్రాహ్యము. కనుకనే చైతన్యమనునది భౌతికపదార్థ సమ్మేళనముచే ఏర్పడినది కాదని, ఆది ఆత్మ యొక్క లక్షణమని తెలియబడు చున్నది. జీవుని ఈ చైతన్యము భగవానుని దివ్యచైతన్యముతో గుణరీతిగనే సమనముగాని దివ్యమైనది కాదు. ఏలయన జీవుని చైతన్యము ఒక దేహమునకే పరిమితమై యుండు అన్యదేహములను గూర్చి తెలియకుండును. కాని సర్వదేహములలో ఆత్మకు స్నేహితునిగా వర్తించుచు నిలిచియుండెడి పరమాత్ముడు మాత్రము సకల దేహముల నెరిగియుండును. ఇదియే దివ్యచైతన్యము మరియు వ్యక్తిగత చైతన్యము నడుమ గల భేదము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 523 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 34 🌴

34. yathā prakāśayaty ekaḥ kṛtsnaṁ lokam imaṁ raviḥ
kṣetraṁ kṣetrī tathā kṛtsnaṁ prakāśayati bhārata


🌷 Translation : O son of Bharata, as the sun alone illuminates all this universe, so does the living entity, one within the body, illuminate the entire body by consciousness.

🌹 Purport : There are various theories regarding consciousness. Here in Bhagavad-gītā the example of the sun and the sunshine is given. As the sun is situated in one place but is illuminating the whole universe, so a small particle of spirit soul, although situated in the heart of this body, is illuminating the whole body by consciousness. Thus consciousness is the proof of the presence of the soul, as sunshine or light is the proof of the presence of the sun. When the soul is present in the body, there is consciousness all over the body, and as soon as the soul has passed from the body there is no more consciousness.

This can be easily understood by any intelligent man. Therefore consciousness is not a product of the combinations of matter. It is the symptom of the living entity. The consciousness of the living entity, although qualitatively one with the supreme consciousness, is not supreme, because the consciousness of one particular body does not share that of another body. But the Supersoul, which is situated in all bodies as the friend of the individual soul, is conscious of all bodies. That is the difference between supreme consciousness and individual consciousness.

🌹 🌹 🌹 🌹 🌹