🌹 10, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 10, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 10, OCTOBER 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 440 / Bhagavad-Gita - 440 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 26 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 26 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 801 / Sri Siva Maha Purana - 801 🌹
🌻. శివ జలంధరుల యుద్ధము - 5 / Description of Jalandhara’s Battle - 5 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 54 / Osho Daily Meditations  - 54 🌹
🍀 54. సంబంధం / 54. RELATING 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 - 6 🌹 
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 6 / Description of Nos. 485 to 494 Names - 6 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 10, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఇందిరా ఏకాదశి, Indira Ekadashi. 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 24 🍀*

*48. ఏకోఽనేకో జనః శుక్లః స్వయంజ్యోతిరనాకులః |*
*జ్యోతిర్జ్యోతిరనాదిశ్చ సాత్త్వికో రాజసస్తమః*
*49. తమోహర్తా నిరాలంబో నిరాకారో గుణాకరః |*
*గుణాశ్రయో గుణమయో బృహత్కాయో బృహద్యశాః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : శిష్యుడు విడనాడితే తప్ప గురువు విడనాడడు - ఏదో విధాన పని చేస్తూ గురుకృప ఎల్లరి యెడలా ఉండనే ఉంటుంది. తిరుగుబాటు చేసియో, స్వతంత్రతను ప్రకటించు కొనియో, తన అంతరాత్మనే తనకు దూర మొనర్చు కొనెడి విద్రోహ ప్రవృత్తి ఫలితంగానో, శిష్యుడే దానిని విడనాడితే తప్ప అది శిష్యుడి నెన్నడూ విడనాడ జాలదు. అప్పుడైనా చివరిదైన ఆత్మవిద్రోహం మితిమీరి పోయినప్పుడు దక్క గురుకృపను తిరిగి పొందడం అసాధ్యం కానేరదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 15:10:42 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: మఘ 32:46:18 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: సద్య 07:47:00 వరకు
తదుపరి శుభ
కరణం: బాలవ 15:08:42 వరకు
వర్జ్యం: 19:15:30 - 21:03:34
దుర్ముహూర్తం: 08:29:54 - 09:17:16
రాహు కాలం: 15:00:39 - 16:29:27
గుళిక కాలం: 12:03:02 - 13:31:50
యమ గండం: 09:05:25 - 10:34:14
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:26
అమృత కాలం: 30:03:54 - 31:51:58
మరియు 28:27:24 - 30:14:48
సూర్యోదయం: 06:07:48
సూర్యాస్తమయం: 17:58:15
చంద్రోదయం: 02:25:36
చంద్రాస్తమయం: 15:32:04
సూర్య సంచార రాశి: కన్య 
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: కాలదండ యోగం -మృత్యు
భయం 32:46:18 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 440 / Bhagavad-Gita - 440 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 26 🌴*

*26. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రా: సర్వే సహైవావనిపాలసఙ్ఘై: |*
*భీష్మో ద్రోణ: సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై: ||*

*🌷. తాత్పర్యం : ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు తలకిందులుగా నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు.*

*🌷. భాష్యము : అర్జునుడు చెప్పే ఈ భగవంతుని యొక్క దంతములు అంటే ఏంటి? ఇంతకు క్రితం శ్లోకంలో కూడా వీటిని గురించి చెప్పాడు. మనం మన పళ్ళను ఆహారాన్ని నమలటానికి వాడుతాము. భగవంతుని దంతములు అంటే, అవి అందరినీ కాల క్రమంలో మృత్యువు దిశగా చూర్ణం చేసే శక్తి స్వరూపములు.*

*గొప్పగొప్ప కౌరవ యోధులు — భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు కర్ణుడు — మరియు మరెందరో పాండవ పక్షయోధులు కూడా, భగవంతుని నోటిలోనికి తలకిందులుగా త్వరగా వేగగతిన పోయి, ఆయన పళ్ళ మధ్య నలిగి పోవటం అర్జునుడు గమనించాడు. అతి త్వరలో జరగబోయే పరిణామాలని ఆ భగవంతుని యొక్క విశ్వరూపములో దర్శిస్తున్నాడు. భగవంతుడు కాల పరిమితికి అతీతుడు కాబట్టి, భూత-వర్తమాన-భవిష్యత్తులన్నీ ఆయన యందు ఇప్పుడే కనిపిస్తుంటాయి.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 440 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 26 🌴*

*26. amī ca tvāṁ dhṛtarāṣṭrasya putrāḥ sarve sahaivāvani-pāla-saṅghaiḥ*
*bhīṣmo droṇaḥ sūta-putras tathāsau sahāsmadīyair api yodha-mukhyaiḥ*

*🌷 Translation : All the sons of Dhṛtarāṣṭra, along with their allied kings, and Bhīṣma, Droṇa, Karṇa are rushing into Your fearful mouths.*

*🌹 Purport : What are the teeth of God that Arjun is referring to? He mentioned them in the previous verse as well. We use our teeth to grind our food. God’s teeth are his force of destruction that grinds everyone to death with the passage of time.*

*Arjun sees the great Kaurava generals—Bheeshma, Dronacharya, and Karn—and also many of the Pandava generals rushing headlong into the mouth of the Lord, to be ground between his teeth. He is beholding the imminent future in the cosmic form of God. Since God is beyond the limits of time, so the past, present, and future are visible within him in the present.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 801 / Sri Siva Maha Purana - 801 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 22 🌴*

*🌻. శివ జలంధరుల యుద్ధము - 5 🌻*

*అపుడు జలంధరాసురుడు బలములో రుద్రుడు అధికుడని గ్రహించి రుద్రుని మోహింపజేసే అద్భుతమగు గాంధర్వమాయను సృష్టించెను (33). వాని మాయా ప్రభావముచే అనేకములగు గందర్వ-అప్సరసల గణములు రుద్రుని మోహింప జేయుట కొరకై ఆవిర్భవించినవి (34). అపుడు గంధర్వ-అప్సరసల గణములు గానమును, నాట్యమును చేసిరి. మరి కొందరు తాళమలను, వేణువులను, మృదంగములను వాదనము చేసిరి (35). ఆ గణములు చూపించిన ఆ మహాశ్చర్యమును గాంచి రుద్రుడు మోహమును పొందెను. ఆయన చేతులనుండి ఆయుధములు జారిననూ, ఆయన ఎరుంగలేక పోయెను (36). రుద్రుడు ఏకాగ్రతతో వారిని చూచుచుండగా గాంచిన జలంధరాసురుడు మాయావేషముతో వేంటనే గౌరీదేవి ఉన్నచోటకు వెళ్లెను (37).*

*ఆతడు యుద్ధములో మహాబలశాలురగు, శుంభ నిశుంభులను వారిని నిలబెట్టెను. పది చేతులు అయిదు ముఖములు, మూడు కన్నులు, జటలు గల వాడై (38). గొప్ప వృషభమునధిష్ఠించి అన్ని విధములుగా రుద్రుని పోలియున్న వాడై ఆ జలంధరుడు అచటకు వెళ్లెను. ఓ వ్యాసా! రాక్షసమాయచే జలంధరుడు అట్లు కాగల్గెను (39). అపుడు భవాని రుద్రుడు వచ్చుచుండుటను గాంచి సఖురాండ్ర మధ్యనుండి లేచి ఎదురేగెను. ఆమె ఆయన దృష్టి ప్రసరించు స్థలమునకు వచ్చియుండెను (40). ఆ రాక్షసేశ్వరుడు సుందరియగు పార్వతిని చూచెను. వెంటనే ఆతని అవయవములు శక్తిని గోల్పోవుటచే ఆతడు జడునివలె ఆయెను (41).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 801 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 22 🌴*

*🌻 Description of Jalandhara’s Battle - 5 🌻*

33. Then, considering Śiva more powerful, Jalandhara the Daitya, created the illusion of Gandharvas that mysteriously fascinated even Śiva.

34. By the power of his Māyā, hosts of Gandharvas and celestial damsels came into view for fascinating Śiva.

35. The Gandharvas and celestial damsels sang and danced. Others played on flutes, mṛdaṅgas and cymbals.

36. On seeing that wonderful feat, Śiva was fascinated by the Gaṇas. He was not conscious of even the garments let down from the hands.

37. On seeing Śiva concentrated in the dance Jalandhara urged by lust immediately went to the place where Gaurī stood.

38-39. He entrusted the powerful Śumbha and Niśumbha with the conduct of war. With his demonaic Māyā he assumed the form of Śiva—with ten brawny arms, five faces, three eyes, and matted hair. He was seated on the great bull. In every respect, O Vyāsa, Jalandhara appeared like Śiva.

40. On seeing Śiva coming, the beloved of Śiva came out from the midst of her female friends within the range of his vision.

41. When the lord of Asuras saw the bauntiful Pārvatī, he let drops of semen fall and his limbs became benumbed.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 54 / Osho Daily Meditations  - 54 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 54. సంబంధం 🍀*

*🕉. మీరు ఎంత ఎక్కువ కేంద్రీకృతమై ఉంటే, మీరు అంత విశ్రాంతిగా ఉంటారు, లోతుగా సంబంధంలోకి ప్రవేశించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 🕉*

*సంబంధంలోకి వెళ్లేది మీరే. మీరు అక్కడ లేకుంటే-మీరు ఉద్విగ్నతతో, అంగవైకల్యంతో, ఆందోళనతో మరియు విచ్ఛిన్నమై ఉంటే-ఎవరు లోతుగా సంబంధంలోకి వెళతారు? మన విచ్ఛిన్నత కారణంగా, సంబంధం యొక్క లోతైన పొరలలోకి ప్రవేశించడానికి మనము నిజంగా భయపడతాము, ఎందుకంటే అప్పుడు మన వాస్తవికత వెల్లడవుతుంది. అప్పుడు మీరు మీ హృదయాన్ని తెరవవలసి ఉంటుంది మరియు మీ హృదయం కేవలం శకలాలు మాత్రమే. మీలో ఒక్కరే లేరు - మీరు ఒక గుంపు. మీరు నిజంగా మరొకరిని ప్రేమిస్తే మరియు మీరు మీ హృదయాన్ని విప్పితే, ఇతరులు మిమ్మల్ని ఒక బాహ్యమైన విషయం అని అనుకుంటారు, కానీ ఒక వ్యక్తి అనుకోరు. అదే మీ భయం. అందుకే మనుషులు నిబద్దత లేని సంబంధాలు సాగిస్తున్నారు.*

*వారు లోతుగా వెళ్లడానికి ఇష్టపడరు; అది కేవలం ఉపరితలం తాకడం మరియు ఏదైనా నిబద్ధతగా మారక ముందే తప్పించుకోవడం. మీకు ఒక సంబంధం ఉంది మరియు అది కూడా దరిద్రం, ఉపరితలం. సరిహద్దులు మాత్రమే కలుస్తాయి, కానీ అది ప్రేమ కాదు; అది శారీరక విడుదల కావచ్చు, భావోద్వేగ విడుదల కావచ్చు, కానీ అది అంతకన్నా ఎక్కువ కాదు. సంబంధం చాలా సన్నిహితంగా లేకుంటే మనం మన ముసుగులు ఉంచుకోవచ్చు. అప్పుడు మీరు నవ్వినప్పుడు, మీరు నవ్వాల్సిన అవసరం లేదు, ముసుగు మాత్రమే నవ్వుతుంది. మీరు నిజంగా లోతుగా వెళ్లాలనుకుంటే, ప్రమాదాలు ఉన్నాయి. ముసుగులు లేకుండా కేవలం మీరుగా వెళ్లవలసి ఉంటుంది, అంటే లోపల ఉన్న అన్ని సమస్యలను మరొకరికి తెలియజేయ వలసి వస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 54 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 54. RELATING 🍀*

*🕉 The more centered you become, the more relaxed you become, the more possibility there is to enter into a relationship deeply.  🕉*

*It is you who goes into a relationship. If you are not there-if you are tense, crippled, worried, and fragmented-who is going to go deeply into a relationship? Because of our fragmentedness, we are really afraid of getting into the deeper layers of a relationship, because then our reality will be revealed. Then you will have to open your heart, and your heart is just fragments. There is not one person inside you-you are a crowd. If you really love another and you open your heart, the other will think you are a public, not a person-that is the fear. That's why people go on having casual affairs.* 

*They don't want to go deep; just hit-and-run, just touching the surface and escaping before anything becomes a commitment. You only have relation and that too is impoverished, superficial. Only boundaries meet, but that is not love at all; it may be a bodily release, a catharsis, but it is no more than that.  We can keep our masks if a relationship is not very intimate. Then when you smile, there is no need for you to smile, just the mask smiles. If you really want to go deep, there are dangers. You will have to go naked-and naked means with all the problems inside made known to the other.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 485 - 494 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam  - 490 - 494 - 6🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।*
*దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*
*🍀  101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।*
*మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*

*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 6 🌻*

*హృదయ కేంద్రమున నున్న శ్రీమాత ప్రాణశక్తిగా రక్తమందు వశించును. అందువలన ఆమె రుధిర సంస్థిత. ప్రాణమునకు హృదయమే కేంద్రము. హృదయమే రక్త ప్రసారము గావించు చుండును. చెడు రక్తమును హరించుచు, మంచి రక్తమును ప్రసరించుచు, ఏక కాలమున రక్తమును నిర్వహించుచూ నుండును. రక్త ప్రసారము చేయుట, రక్తమును శుద్ధి చేయుట రెండు కోరలుగ దర్శించిన శ్రీమాత భక్తులు ఆమెను ఎఱ్ఱని దంతములతో ప్రకాశించు మాత (దంష్టోజ్వలా) అని ప్రశంసించిరి. ఇడ, పింగళ నాడులను కూడ రెండు దంతములుగా తెలుపుదురు. ఇవియు కాంతివంతమగు ప్రజ్ఞా ప్రవాహములే. ఉజ్జ్వలమగు దంతము లతో ఇట్లు శ్రీమాత ప్రకాశించుచుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 485 to 494 - 6 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya*
*danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*
*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya*
*mahavirendra varada rakinyanba svarupini  ॥ 101 ॥ 🌻*

*🌻 Description of Nos. 485 to 494 Names - 6 🌻*

*Sri Mata at the center of the heart resides in the blood as the life force. So she is Rudhira Samsthita. The heart is the center of life. The heart circulates the blood. It drains the bad blood, circulates the good blood and maintains the blood at the same time. Seeing her doing the two rituals of blood transmission and blood purification, devotees of Sri Mata, hailed her as the Radiant Mother (Damshtojwala) with red teeth. Ida and Pingala Nadi are also known as two teeth. These are also streams of light and wisdom. Srimata shines with bright teeth.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 154 : 3-5 nadi samhara bhutajaya bhutakaivalya bhuta-prithaktvani - 3 / శివ సూత్రములు - 154 : 3-5 నాడి సంహార భూతజయ భూతకైవల్య భూత-పృథక్త్వాని - 3


🌹. శివ సూత్రములు - 154 / Siva Sutras - 154 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-5 నాడి సంహార భూతజయ భూతకైవల్య భూత-పృథక్త్వాని - 3 🌻

🌴. నాడులలోని మలినాలను కరిగించి, వాటిలోని అడ్డంకులను తొలగించడం ద్వారా, తనలోని మరియు సృష్టిలోని మూలకాలను నియంత్రించి, కరిగించి, వేరుచేసే శక్తిని పొందుతాడు. 🌴


ఇంద్రియ ప్రభావానికి కారణమైన స్థూల మూలకాల ప్రభావం నుండి అతను తన చైతన్యాన్ని వేరుచేయ గలిగినప్పుడు, అభిలాషి తన చైతన్యాన్ని తన స్థూల శరీరం నుండి వేరు చేయగలడు, తద్వారా శారీరక దుఃఖాన్ని అనుభవించడు. దుఃఖం భౌతిక శరీరం మరియు మనస్సు రెండింటినీ ఇబ్బంది పెడుతుంది. వ్యక్తి తన శరీరం గురించి ఎరుకలో ఉన్నప్పుడే శారీరక బాధలు తెలుస్తాయి. అతను ఈ ప్రక్రియ నుండి శారీరక అనుభూతులను వేరు చేయగలిగితే, శరీరం యొక్క బాధలు గ్రహించబడవు. శారీరక బాధలను మనస్సు గ్రహించనప్పుడు, అది మొదటి శుద్ధీకరణ ప్రక్రియకు లోనవుతుంది. సుషుమ్నా సరిగ్గా సక్రియం చేయబడినప్పుడు, నిజమైన సాధకునికి మిగిలిన సాక్షాత్కార ప్రక్రియ స్వయం చాలకంగా విశదమౌతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 154 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-5 nādī samhāra bhūtajaya bhūtakaivalya bhūta-prithaktvāni - 3 🌻

🌴. By dissolving the impurities in the nadis and removing the blockages in them, one gains the power to control, dissolve and separate the elements in oneself and in creation. 🌴


When he is able to isolate his consciousness from the influence of gross elements that are responsible for sensory influence, an aspirant is able to detach his consciousness from his gross body, leading to non-realisation of bodily miseries. Misery plays havoc both on physical body and mind. Bodily miseries are realised only when one is aware of his body. If he is able to detach bodily sensations from this though process, the sufferings of the body are not realised. When bodily sufferings are not realised by the mind, it undergoes the first purification process. When suṣumna is properly activated, rest of the process of realisation automatically unfolds for a true aspirant.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



DAILY WISDOM - 152 : 31. The Absolute is Beyond Thought / నిత్య ప్రజ్ఞా సందేశములు - 152 : 31. సంపూర్ణమైనది ఆలోచనకు మించినది



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 152 / DAILY WISDOM - 152 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 31. సంపూర్ణమైనది ఆలోచనకు మించినది 🌻


కనిపించేవాటిలో వాస్తవికత ఉంటుంది, కానీ వాస్తవికత కనిపించకుండా భిన్నంగా ఉంటుంది. సంపూర్ణత యొక్క విశేషణాలుగా కూడా స్వరూపాలు ఉండవు. ఎందుకంటే తనకు తాను తప్ప సంపూర్ణతను ఇంకేదీ వర్ణించలేదు. ఇంద్రియ ప్రపంచంలోనే లక్షణాలకు అర్థం ఉంటుంది. సంబంధాలు లేకుండా లక్షణాలు లేవు, మరియు అన్ని సంబంధాలు అనుభావికమైనవి మాత్రమే. లక్షణాలు ఉన్న సంపూర్ణత మనుగడలో ఉండలేదు. ఎందుకంటే అది ఇంకొకదాని కంటే వేరుగా ఉండాలి. ఈ భేదం ఒక నిర్దుష్టమైన వ్యక్తిత్వానికి దారి తీస్తుంది.

వ్యక్తిత్వం సంపూర్ణత ఈ రెండూ విషయాలు ఒకదానితో ఒకటి జత చేయలేనివి. మీరు ఎంత ప్రయత్నించినా సంపూర్ణ వ్యక్తిత్వం, లేదా వ్యక్తిత్వ సంపూర్ణత సాధ్య పడేవి కావు. ఈ రెండు పదాలు ఒక దానినే సూచిస్తే, అప్పుడు అవి రెండూ ఒకటే కాబట్టి ఒకటే అయి ఉన్న వాటి మధ్య ఒక సంబంధాన్ని మనం ఊహించలేము. కానీ రెండు పదాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటే, అవి వారి మధ్య ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. సంపూర్ణతకు లక్షణాలు లేదా సంబంధాలు లేవు, ఎందుకంటే ఇది ఆలోచనకు మించినది. దాని ఉనికికి తానే సాక్ష్యం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 152 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 31. The Absolute is Beyond Thought 🌻


Appearances have reality in them, but reality is different from appearances. Appearances do not exist in the Absolute even as its adjectives, for it can have no adjectives other than itself. Qualities have a meaning only in the sense world. There is no quality without relations, and all relations are empirical. A relational Absolute must be perishable, for, here, its very essence is said to include distinction, and all distinction presupposes individuality.

The two terms of a relation are really separated by an unbridgeable gulf, and no stretch of imagination can intelligibly bring out their connection. If the two terms are identical, there is no relation, for there will then be no two things to be related. But if the two terms are different from each other, they can bear no relation. The Absolute has no qualities or relations, for it is beyond thought. The proof of its existence is itself.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 839 / Vishnu Sahasranama Contemplation - 839


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 839 / Vishnu Sahasranama Contemplation - 839🌹

🌻839. గుణభృత్, गुणभृत्, Guṇabhr‌t🌻

ఓం గుణభృతే నమః | ॐ गुणभृते नमः | OM Guṇabhr‌te namaḥ


సత్వరజస్తమసాం యస్యాధిష్ఠాతృత్వమిష్యతే ।
సృష్టి స్థితి లయకర్మా గుణభృద్ధరిరుచ్యతే ॥

సృష్టి స్థితి లయ దశల యందు మాయోపాధి వశమున సత్త్వరజస్తమో గుణములకు అధిష్ఠాతగా అనగా ఆశ్రయముగా నుండుటచే 'గుణాన్ భిభర్తి' అనగా 'గుణములను భరించును' అను వ్యుత్పత్తిచే పరమాత్మ 'గుణభృత్‍' అనబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 839🌹

🌻839. Guṇabhr‌t🌻

OM Guṇabhr‌te namaḥ


सत्वरजस्तमसां यस्याधिष्ठातृत्वमिष्यते ।
सृष्टि स्थिति लयकर्मा गुणभृद्धरिरुच्यते ॥

Satvarajastamasāṃ yasyādhiṣṭhātr‌tvamiṣyate,
Sr‌ṣṭi sthiti layakarmā guṇabhr‌ddharirucyate.


Presiding over śruṣṭi, sthiti and laya i.e., creation, preservation and dissolution by the virtue of of the guṇas or qualities sattva, rajas and tamas, the Lord is Guṇabhr‌t - the bearer of guṇas.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥

Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥



Continues....

🌹 🌹 🌹 🌹



కపిల గీత - 247 / Kapila Gita - 247


🌹. కపిల గీత - 247 / Kapila Gita - 247 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 12 🌴

12. కుటుంబభరణాకల్పో మందభాగ్యో వృథోద్యమః|
శ్రియా విహీనః కృపణో ధ్యాయన్ శ్వసితి మూఢధీః॥


తాత్పర్యము : దురదృష్ట వశమున అతని ప్రయత్నములన్నియు విఫలమగుటతో, ఆ మందబుద్ధి ధనహీనుడై కుటుంబ పోషణకు అసమర్థుడగును. అంతట అతడు మిగుల దైన్యమునకు లోనై, అంతులేని చింతలలో మునిగి నిట్టూర్పులు విడుచు చుండును.


వ్యాఖ్య :


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 247 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 12 🌴


12. kuṭumba-bharaṇākalpo manda-bhāgyo vṛthodyamaḥ
śriyā vihīnaḥ kṛpaṇo dhyāyañ chvasiti mūḍha-dhīḥ

MEANING : Thus the unfortunate man, unsuccessful in maintaining his family members, is bereft of all beauty. He always thinks of his failure, grieving very deeply.


PURPORT :


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




09 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 09, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 49 🍀

99. నివేదనః సుఖాజాతః సుగంధారో మహాధనుః |
గంధపాలీ చ భగవానుత్థానః సర్వకర్మణామ్

100. మంథానో బహుళో వాయుః సకలః సర్వలోచనః |
తలస్తాలః కరస్థాలీ ఊర్ధ్వసంహననో మహాన్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మర్కటకిశోర పద్ధతిలో గురుకృప - మర్కటకిశోర పద్ధతి ననుసరించే శిష్యుని కూడ గురుకృప కనిపెట్టియే ఉంటుంది, కష్టంలో ఆదుకొంటుంది. అపాయంలో కాపాడుతుంది. శిష్యుడు తనయందూ తన ప్రయత్నమందూ నిమగ్నుడై వున్న కారణాన అతనికి తరచుగా ఇదేమీ తెలియనే తెలియదు. కాని, ఇట్టి వారియెడ, మూలప్రతిబంధ విచ్ఛేదకమైన గురుని విశేషకృపా ప్రసరణకు మాత్రం కొంత దీర్ఘకాలమే పట్టక తప్పదు.🍀

🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

భాద్రపద మాసం

తిథి: కృష్ణ దశమి 12:38:44 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: ఆశ్లేష 29:45:48 వరకు

తదుపరి మఘ

యోగం: సిధ్ధ 06:51:23 వరకు

తదుపరి సద్య

కరణం: విష్టి 12:37:44 వరకు

వర్జ్యం: 17:09:00 - 18:57:00

దుర్ముహూర్తం: 12:27:01 - 13:14:27

మరియు 14:49:18 - 15:36:44

రాహు కాలం: 07:36:32 - 09:05:28

గుళిక కాలం: 13:32:14 - 15:01:10

యమ గండం: 10:34:23 - 12:03:19

అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:26

అమృత కాలం: 27:57:00 - 29:45:00

మరియు 30:03:54 - 31:51:58

సూర్యోదయం: 06:07:36

సూర్యాస్తమయం: 17:59:01

చంద్రోదయం: 01:34:33

చంద్రాస్తమయం: 14:55:05

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: సౌమ్య యోగం - సర్వసౌఖ్యం

29:45:48 వరకు తదుపరి ధ్వాo క్ష

యోగం - ధన నాశనం, కార్య హాని

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹