Showing posts with label స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు. Show all posts
Showing posts with label స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు. Show all posts

వ్యక్తిత్వాన్ని త్యజించడమే స్వేచ్ఛ.


🌹. వ్యక్తిత్వాన్ని త్యజించడమే స్వేచ్ఛ. 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


అసలైన స్వేచ్ఛను తెలుసుకోవాలంటే మీరు మీ వ్యక్తిత్వాన్ని కొద్దికొద్దిగా త్యజిస్తూ పోవాలి. మీరు శూద్రులు కాదు బ్రాహ్మణులని, మీరు మామూలు మనుషులు కాదు క్రైస్తవులనే విషయాలను మీరు పూర్తిగా మరచిపోవాలి. చివరికి మీ పేరు కూడా మీ వాస్తవం కాదని, అది కేవలం మిమ్మల్ని తెలిపేందుకు వినియోగించే సాధనం మాత్రమేనని, మీ జ్ఞానం కూడా అరువు తెచ్చుకున్నదే కానీ, మీ స్వానుభవంతో సంపాదించుకున్నది కాదని మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే ‘‘అసలైన స్వేచ్ఛ’’అంటే ఏమిటో మీకు తెలుస్తుంది.

మీ లోలోపల చిన్న వెలుగు కూడా లేకుండా కటిక చీకటిలో మీరు జీవిస్తుంటే ప్రపంచమంతా ప్రకాశంతో నిండి ఉన్నా ప్రయోజనమేముంది? కాబట్టి, మీరు పుట్టిన తరువాత మీకు జోడించినదేదైనా మీ నిజ స్వరూపం కాదని తెలుసుకునేందుకు మీరు నిదానంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో మీ వ్యక్తిత్వం మెల్లమెల్లగా అదృశ్యమవుతుంది. వెంటనే మీరు సువిశాల వినీలాకాశాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే, అస్తిత్వపు బాహ్య, అంతర్గతాలు ఎప్పుడూ సరిసమానంగా ఉంటాయి.

ఏదైతే మీ శరీరానికి మాత్రమే పరిమితమై ఉంటుందో అది మీ వ్యక్తిత్వం కాదు. మీ శరీరం దహనమైనా ఏదైతే దహనం కాకుండా ఉంటుందో అదే మీ అసలైన ఆత్మ. అందుకే కృష్ణుడు ‘‘ఏ అస్త్రము నన్ను ఛేదించజాలదు. అగ్ని దహించ జాలదు’’ అన్నాడు. అది నిజమే. కానీ, దహనమయ్యే శరీరము, మెదడు, వ్యక్తిత్వాల గురించి అతను మాట్లాడలేదు.

మీలో మరణం లేనిది, నాశనం కానిది, శాశ్వతమైనది ఏదో ఉంది. దాని గురించే అతను మాట్లాడుతున్నాడు. మీరు పుట్టకముందు, పుట్టిన తరువాత మీతో ఉండేదే అది. ఎందుకంటే, అదే మీరు అదే మీ ఉనికి.

అసలైన స్వేచ్ఛ గురించి మీకు తెలియాలంటే మీరు మీ శారీరక, మానసిక, బాహ్య బంధనాల నుంచి బయటపడాలి. మీరు మీ జీవితాన్ని అస్తిత్వమిచ్చిన బహుమతిగా భావించి ఆనందంతో పండగ చేసుకుంటూ హాయిగా జీవించండి. ఎండలో, వానలో, గాలిలో మీరు చెట్లతో ఆడుతూ, పాడుతూ, నాట్యం చెయ్యండి.

చెట్లకు, పక్షులకు, జంతువులకు, నక్షత్రాలకు ఎలాంటి ధర్మగ్రంథాలు లేవు. మరణించిన వారి పీడ వెంట పడడం కేవలం మనిషికే తప్ప వేరెవరికీ లేదు. ‘‘యుగయుగాలుగా, తరతరాలుగా మనిషి చేస్తున్న తప్పు అదే’’అని నేనంటున్నాను. వెంటనే దానిని పూర్తిగా ఆపవలసిన సమయం ఇదే, ఇప్పుడే.

సత్యాన్ని తెలుసుకునేందుకు, అన్వేషించేందుకు ప్రతి నూతన తరానికి అవకాశమివ్వండి. ఎందుకంటే, సత్యాన్వేషణ కన్నా సత్యాన్ని తెలుసుకోవడంలో ఆనందం తక్కువగా ఉంటుంది. అదే అసలైన తీర్థయాత్ర. అది దేవాలయానికి చేరుకుంటున్నట్లుగా ఉండదు. మీ పిల్లలు అణకువగా, బానిసలుగా ఉండేందుకు కాకుండా స్వేచ్ఛగా, గర్వపడేలా ఉండేందుకు మీరు సహాయపడండి. భావప్రకటనా స్వాతంత్య్రంతో స్వేచ్ఛగా జీవించడం కన్నా ఉత్తమమైనది ఏదీ లేదని మీరు మీ పిల్లలకు బోధించండి. బానిసత్వాన్ని అంగీకరించడం కన్నా అవసరమైతే మరణించేందుకు సిద్ధపడేలా వారిని మీరు తయారుచేయండి.

కానీ, ఎక్కడా అలా జరగట్లేదు. అలా జరగనంత వరకు క్రూర నిరంకుశ, నియంతల- హిట్లర్లు, స్టాలిన్లు, మావోలు-వారి నుంచి ప్రపంచ మానవాళిని మీరు రక్షించ లేరు. నిజానికి, మీ జీవితాన్ని నియంత్రించే నియంతలను మీరు మీ అంతర్గతంలో కోరుకుంటున్నారు.

ఎందుకంటే, మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటే మీరు అనేక తప్పులు చేస్తారు. అది సహజమే అయినా, అలా తప్పులు చెయ్యాలంటే మీకు చాలా భయం. కానీ, జీవితం అలాగే ఉంటుంది.

మీరు చాలా సార్లు కింద పడిపోతారు. అయినా పరవాలేదు. పైకి లేవండి. చాలా అప్రమత్తంగా ఉంటూ మళ్లీ అలా పడిపోకుండా ఎలాగో తెలుసుకోండి. మీరు తప్పులు చేస్తారు. కానీ, చేసిన తప్పులనే మళ్ళీ చెయ్యకండి. అప్పుడే మీరు తెలివైన వ్యక్తిగా ఎదుగుతారు. ఎప్పుడూ తక్కువ స్థాయిలో ఉండకుండా, మీరు చేరుకోగలిగినంత అత్యున్నత స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నించండి.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


05 Apr 2021

అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో ఉంది.


🌹. అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో ఉంది. 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


మీరు గతం, భవిష్యత్తుల నుంచి బయటపడి ఒక చెట్టు దగ్గర కూర్చుని, రోజూ దానితో మాట్లాడితే అది మీ మాటలకు స్పందిస్తున్నట్లు మీకు త్వరలోనే తెలుస్తుంది. కానీ, దాని స్పందన మాటల్లో ఉండదు. మీరు ప్రేమతో దానిని ఆనుకుని కూర్చుంటే అది గాలిలో ఊగుతూ మీపై పూలు కురిపిస్తుంది. వెంటనే మీలో ఇంతకు ముందెప్పుడూ కలగని ఒక నూతన అనుభూతి చోటుచేసుకుంటుంది. అలా ఆ చెట్టు మీకోసం ప్రేమతో స్పందిస్తుంది.

బాధపడే మానవుడు తప్ప మొత్తం అస్తిత్వమంతా ప్రేమతో, స్వేచ్ఛతో నిండి ఉంది. అందుకు మీరే బాధ్యులు తప్ప ఇతరులెవరూ కారు. నాతో చాలా మంది ‘‘మీరు చెప్పేది మాకు అర్థమయింది. మా బాధలను మేము నిదానంగా వదిలించు కుంటాము’’ అనేవారు. కానీ, అలా ఎప్పటికీ జరగదు.

ఎందుకంటే, బానిసత్వమనేది ఎప్పుడూ నినాదంగా పోయేది కాదు. దానిని అర్థం చేసుకునైనా మీరు అందులోంచి బయటపడాలి లేదా అది అర్థం కాకపోయినా అర్థమైనట్లుగా మీరు నటిస్తూనైనా ఉండాలి. స్వేచ్ఛ చిన్న చిన్న ముక్కలుగా రాదు. అలాగే, బానిసత్వం చిన్న చిన్న ముక్కలుగా పోదు.

గదిలో ఉన్న చీకటి దీపం వెలిగించిన వెంటనే పోతుంది. అంతేకానీ, కొద్దికొద్దిగా చీకటిపోవడం, కొద్దికొద్దిగా వెలుగు రావడం జరగదు. స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయట పడినట్లు. అంతేకానీ, అది కాలానికో, నిదానానికో సంబంధించిన విషయం కాదు.

బంధనాలన్నింటినీ తెంచు కోవడం తప్ప మీకు మరొక దారి లేదు.

వాటిని మీరే మీ చిన్నప్పటి నుంచి ‘‘పెద్దల పట్ల అణకువ, తల్లిదండ్రల పట్ల ప్రేమ, పూజారుల పట్ల నమ్మకం, గురువుల పట్ల గౌరవం’’ లాంటి మంచి మంచి పేర్లతో మీ చుట్టూ సృష్టించు కోవడం మొదలుపెట్టారు. మీరు బాగా లోతుగా పరిశీలించి చూస్తే అందమైన పేర్లతో బానిసత్వాన్ని మీకు బాగా అంటగట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అది బానిసత్వం కాదని, మిమ్మల్ని బంధించే అందమైన పేర్లకు మీరు అతుక్కుపోయారని తెలుసుకోనంత వరకు వాటిని వదిలించుకోవడం మీకు చాలా కష్టమవుతుంది.

మా నాన్నతో నాకు ఎప్పుడూ గొడవే. ఆయన చాలా అవగాహన కలిగిన ప్రేమికుడే అయినా ‘‘నువ్వు ఆ పని చెయ్యాల్సిందే’’ అని నన్ను ఆజ్ఞాపించేవారు. అది నాకు నచ్చేది కాదు. అందుకే నేను ఆయనతో ‘‘అలా ఆజ్ఞాపించకండి. అది బానిసత్వ దుర్గంధం కొడుతోంది. ఆ కంపు నేను భరించలేను.

కావాలంటే ‘‘నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చెయ్యకు’’ అనండి. ఆ పని చెయ్యాలా, వద్దా అనేది నా ఇష్టం కానీ, మీ ఇష్టం కాదు. మీరు చెప్పిన పని చెయ్యాలో, వద్దో నన్ను ఆలోచించు కోనివ్వండి. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఒకవేళ, ఆ పని నేను చెయ్యకపోతే మీరు కోపగించుకోకండి. నేను ‘‘మీ మాట పాటించను అనట్లేదు. అలా ఆజ్ఞాపించకండి, అంటున్నాను.

నేను సత్యానికి, స్వేచ్ఛకు, ప్రేమకే తల వంచుతాను. వాటికోసం నేను అన్నింటినీ త్యాగం చేస్తాను. అంతేకానీ, బానిసత్వానికి నేను ఏమాత్రం తల వంచను. ఈ జీవితం నాది. నా బతుకు నన్ను బతకనివ్వండి. ఆ హక్కు నాకుంది. మీరు చాలా అనుభవజ్ఞులే. కాబట్టి, మీరు నాకు మంచి సలహాలు ఇవ్వవచ్చు, సూచనలు చెయ్యవచ్చు. అంతేకానీ, నన్ను ఆజ్ఞాపించకండి. ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఎవరి నుంచి ఎలాంటి ఆజ్ఞలను స్వీకరించలేను, వాటిని పాటించలేను’’ అనేవాడిని.

నేను ఎవరికీ తలవంచనని ఆయన త్వరగానే అర్థం చేసుకున్నారు. దాంతో ఆయన నన్ను ఆజ్ఞాపించడం మానుకుని ‘‘ఈ పని చెయ్యాలి. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే, నీ ఇష్టం’’ అనేవారు నాతో. వెంటనే నేను ‘‘అసలైన ప్రేమ ఇలా ఉండాలి’’ అనే వాడిని ఆయనతో.

ఏది అసలైన స్వేచ్ఛ?... చాలావరకు రాజకీయ పరమైన, ఆర్థికపరమైన, బాహ్య స్వేచ్ఛలు మీకు ఎవరో ఇచ్చినవే కాబట్టి, అవి ఏ క్షణంలోనైనా మీ నుంచి పోయేవే. అందుకే అవి ఎప్పుడూ మీ చేతుల్లో ఉండవు.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


03 Apr 2021

జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండండి


🌹. జీవితం పట్ల నిర్ణయాత్మకంగా ఉండండి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ

40

మీ లోలోపల ఎదిగిన దానిని మీ నుంచి ఎవరూ దోచుకోలేరు. మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి, దాని పట్ల చాలా నిర్ణయాత్మకంగా ఉండండి. మీరు మీ ఆత్మలో స్వేచ్ఛగా ఉండాలి. అదే అసలైన స్వేచ్ఛ.

మనిషి ఆత్మతో జన్మించాడు కానీ, వ్యక్తిత్వంతో జన్మించలేదు. ఆత్మకు (సోల్), వ్యక్తిత్వానికి (సెల్ఫ్) నిఘంటువులలో ఒకే అర్థం చెప్పడం జరిగింది. కానీ, అది నిజం కాదు. మీరు మీ ఆత్మను మీతో పాటు తెచ్చుకుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సమాజం మీకు ఒక వ్యక్తిత్వాన్ని సృష్టిస్తుంది.

అందువల్ల మీకొక గుర్తింపు లేదని భావించ వలసిన అవసరం లేదు. ఎందుకంటే, ఆత్మాన్వేషణకు అనేక సంవత్సరాల తీర్థయాత్ర చెయ్యాల్సి వస్తుంది. అంతవరకు మీరు ‘‘ఒక ఊరు, పేరు లేని, ఎవరో ఏమిటో తెలియని బికారిలా, ఏమీ లేకుండా ఉండడాన్ని’’ ఏ మాత్రం భరించలేరు.

కేవలం ప్రేమ వల్లనే వ్యక్తిత్వాన్ని సృష్టించడం జరిగింది. అందుకే ఆది నుంచి మీరొక వ్యక్తిగా భావించడం ప్రారంభించారు. లేకపోతే, మీరెలా జీవిస్తారు? మిమ్మల్ని ఎలా సంబోధించాలి? వ్యక్తిత్వ భావనను సృష్టించిన వారందరూ సదభిప్రాయాలున్న వారే. ఎందుకంటే, వారి ఆత్మల గురించి వారికి ఏ మాత్రం తెలియదు. అందుకే వారు అవాస్తవ వ్యక్తిత్వాన్ని సృష్టించి అలాంటి వ్యక్తిత్వంతోనే మరణించారు. అందుకే ఈ అస్తిత్వం వారిని ఎందుకు అలా తయారు చేసిందో వారు ఎప్పటికీ తెలుసుకోలేక పోయారు.

మీ ఆత్మ ఈ అస్తిత్వంలో ఒక భాగం. మీ వ్యక్తిత్వం ఒక సామాజిక వ్యవస్థ. కాబట్టి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎప్పటికీ పూడ్చలేమని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. మీరెవరో నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు సమూలంగా నాశనం చెయ్యాల్సిందే.

అలా కాకుండా, ఏదో యాదృచ్ఛికంగా మీరు ఆత్మను కనుక్కున్నట్లైతే మీరు విభజించ బడతారే కానీ, అస్తిత్వంతో ఏకమవలేరు. దానినే మానసిక వైకల్యమంటారు మనస్తత్వ శాస్తవ్రేత్తలు. అందువల్ల మీరు ఒక్కొక్కప్పుడు ఆత్మగానూ, ఒక్కొక్కప్పుడు వ్యక్తిత్వంగానూ ప్రవర్తిస్తారు. అలా విభజించ బడడం వల్ల మీరు నిరంతర ఒత్తిడిలో ఉంటారు. అందువల్ల మీ జీవితం చాలా ఆదుర్దాగా, బాధాకరంగా తయారవుతుంది. అలాంటి జీవితాన్ని మీరు ఎప్పటికీ జీవించలేరు, భరించలేరు.

అందుకే తల్లిదండ్రులు, విద్యావిధానం, పూజారులు- సమాజం- ఇలా మీ చుట్టూ ఉన్నవన్నీ మీరు మీ లోపల దాగి ఉన్న ఆత్మను ఎప్పటికీ తెలుసుకోకుండా ఉండేందుకు కావలసిన దృఢమైన వ్యక్తిత్వాన్ని సృష్టించేందుకు అన్ని రకాల మార్గాలలో ప్రయత్నిస్తారు.

ఆ ప్రయాణం ఏమంత దూరం కాకపోయినా, అది కచ్చితంగా చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయాణమే. వ్యక్తిత్వమనేది చిన్న విషయం కాదు. అది చాలా క్లిష్టమైనది. మీరొక వైద్యుడు, న్యాయవాది, రాష్టప్రతి, ధనవంతులు, అందమైన వారు, అనుభవజ్ఞులు, తెలివైనవారు- ఇలా ఏదైనా కావచ్చు. అవన్నీ వ్యక్తిత్వ పార్శ్వాలే. అలాంటి వ్యక్తిత్వం అధిక ధనాన్ని, అధికారాన్ని, పరువు, ప్రతిష్టలను పోగుచేస్తూనే ఉంటుంది. దాని ఆశలకు అంతుండదు.

అలా మీరు మీ వ్యక్తిత్వానికి అనేక హంగులు తగిలిస్తూనే ఉంటారు. మనిషిని ముఖ్యంగా బాధపెట్టేది అదే. తానెవరో మనిషికి తెలియదు. అయినా ‘‘తాను ఇది, తాను అది’’ అని మనిషి నమ్ముతూనే ఉంటాడు. ఉదాహరణకు, మీరొక వైద్యుడు, న్యాయవాది, చెప్పులు కుట్టేవారు, ప్రధానమంత్రి, చివరికి రాష్టప్రతి అయినా అవి మీరు చేసే పనులే తప్ప మీ వాస్తవాలు కాదు.

ఎందుకంటే, ఎవరు ఎవరైనప్పటికీ వారికి వారి వాస్తవ స్వరూపాలు తెలియవు. మీరు పుట్టిన మరుక్షణం నుంచే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వారికి కావలసినట్లుగా తయారు చేయడం ప్రారంభిస్తారు. అలా అవాస్తవ అహం, అవాస్తవ వ్యక్తిత్వాలు మీలో ప్రవేశించి మిమ్మల్ని అలాగే తయారుచేస్తాయి. అందువల్ల మీరు మీ వాస్తవాన్ని మరచిపోవడం జరుగుతుంది.

మీ వ్యక్తిత్వాన్ని బానిసగా చెయ్యగలము కానీ, మీ ఆత్మను బానిసగా చెయ్యలేము. ఎందుకంటే, మీ వ్యక్తిత్వాన్ని అమ్మగలం కానీ, ఆత్మను అమ్మలేము. కాబట్టి, ఆధ్యాత్మికపరమైన స్వేచ్ఛను ఎవరూ ఏమీ చెయ్యలేరు.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


01 Apr 2021

వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది


🌹. వెలుగు కంటే చీకటి శాశ్వతమైనది 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ

39


నాకు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది. కానీ, దాని గురించి ఆలోచించిన వెంటనే నాలో చాలా భయం కలుగుతోందని ఇటీవలే నాకు తెలిసింది. అయితే అది కేవలం ఒంటరితనం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే తప్ప వేరే ఏదీ కాదు. కాబట్టి, స్వేచ్ఛ గురించి ఎందుకు అంతగా భయపడుతున్నానో దయచేసి కాస్త వివరంగా చెప్పండి.

మీరు ఇతరులపై ఆధారపడి వారి సలహాలు, సూచనలను పాటించాలని మీకు బాగా చిన్నప్పటి నుంచే బోధించారు. అందుకే మీకు స్వేచ్ఛ అంటే భయం. అది సహజమే. మీకు వయసు పెరిగిందే కానీ, బుద్ధి పెరగలేదు. అన్ని జంతువులకూ వయసు మాత్రమే పెరుగుతుంది కానీ, బుద్ధి పెరగదు. బుద్ధి పెరగడమంటే ఆధారపడే తత్వం నుంచి బయటపడడం. అది మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.

దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని ఆది నుంచే మీకు బోధించారు. అందువల్ల మీరు ఆయన రక్షణ వలయంలో ఉన్నారనుకుంటారు. మీ లెక్కలు మీకుంటాయి. ‘‘ భయపడకండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి, ఆయనను తలచుకుంటూ పడుకోండి’’ అని చిన్న పిల్లలకు కూడా రాత్రి పడుకునే ముందు బోధిస్తారు.

మీకు వయసు పెరిగినా మీ పసితనంలో నాటిన ఆ భావన మీలో అలాగే ఉండిపోతుంది. కానీ, ఎవరూ మిమ్మల్ని రక్షించ వలసిన అవసరం లేదని, చీకటిలో కూడా మీరు హాయిగా పడుకోవచ్చని’’ నేనంటాను. అంటే ‘‘మీరు భయపడుతున్నారని, అందుకే మిమ్మల్ని రక్షించేందుకు ఎవరో ఒకరు కావాలని, లేకపోతే మీరు పడుకోలేరని’’ అర్థం. .

ఒకవేళ మీ రోగం కేవలం ఊహాత్మకమైతే- అలాంటి రోగులు మీ చుట్టూ అనేకమంది ఉంటారు. ఒక చిన్న విషయం చాలు, వారికే తెలియకుండా వారు దానిని పెద్దది చేస్తారు- దానికి ఊహాత్మకమైన మందు అవసరమవుతుంది. ఒక మాయ చెయ్యడమే వాటికి మందు. ‘‘దేవుడు’’ అలాంటి మందే.

నిశ్శబ్దంగా ఉండే అనంతమైన కటిక చీకటి చాలా అందంగా ఉంటుంది. వెలుగు వస్తుంది, పోతుంది. కానీ, చీకటి ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది వెలుగుకన్నా ఎక్కువ శాశ్వతమైనది. వెలుగు కావాలంటే మీకు ఇంధనం అవసరం. కానీ, చీకటికి ఇంధనం అవసరం లేదు. ఎందుకంటే, అది ఎప్పుడూ ఉండేదే. వెలుగు ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్ల మీకు నిద్ర పట్టదు. విశ్రాంతి లభించదు. కాబట్టి, విశ్రాంతి కోసం వెలుగును ఎంచుకోవడం సరియైన పని కాదు. అసలైన విశ్రాంతి చీకటిలోనే లభిస్తుంది.

కాబట్టి, అందులోకే వెళ్ళండి. నిజానికి, చీకటిలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ లేదు. అనవసరంగా ఆ విషయంలో మిమ్మల్ని భయపెట్టారు. అందుకే చీకటిలో మిమ్మల్ని రక్షించేందుకు ఆ దేవుడు మీకు అవసరమవుతాడు. ఒక అబద్ధానికి మరొక అబద్దం చెప్పాల్సి వస్తుంది. అలా మీరు అంతులేని అబద్ధాలు చెప్తూనే ఉంటారు.

స్వేచ్ఛ మిమ్మల్ని అనేక విషయాలలో కచ్చితంగా భయపెడుతుంది. కాబట్టి, ఆ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని భయపెట్టే విషయాలపై లోతుగా దృష్టి సారించండి. వెంటనే వాటిపై మీకున్న భయం పోతుంది. మీరు భయపడేందుకు ఈ ప్రపంచంలో ఏదీ లేనప్పుడే మీరు స్వేచ్ఛగా ఆనందించగలరు, దాని బాధ్యతను స్వీకరించగలరు.

బాధ్యత మీరు ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. అందువల్ల మీరు ప్రతి పనిలో, ఆలోచనలో, భావనలో మరింత బాధ్యతాయుతంగా ఉంటారు. అలా అది మీకు, మీ మనస్తత్వానికి ఉన్న బంధనాలన్నింటినీ తొలగించి, మిమ్మల్ని మరింత పారదర్శకంగా చేస్తుంది.

మీరు మీ భయాలను మరీ ఎక్కువగా ఊహించుకున్నారు. అందుకే వాటినుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో అసలు వాటివైపే చూడకుండా వాటికి వ్యతిరేకమైన వాటిని మీరు సృష్టిస్తున్నారు. వెంటనే అవి వడగళ్ళలా కరిగిపోతూ తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. వాటి గురించి మీకు పూర్తి అవగాహన కలిగే సమయానికి అవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. గుర్తుంచుకోండి.

మన అభిప్రాయాలను పిల్లలపై రుద్దకుండా, వారి స్వేచ్ఛలో మనం జోక్యం చేసుకోకుండా, వారి సామర్థ్యం పూర్తిగా ఎదిగేందుకు మనం ఎలా సహాయపడగలం?

పిల్లలు పూర్తి సామర్థ్యంతో ఎదిగేందుకు మనం ఎలా సహాయపడాలి? అని ఆలోచించడమే మీరు తప్పుదారిలో ఉన్నట్లు నిరూపిస్తోంది. అలా మీరు పిల్లలకు ఏది చెయ్యాలనుకున్నా అది కూడా మీకు కావలసిన రీతిలో మలచబడ్డ ప్రణాళికే అవుతుంది.

అది మీరు మీ పెద్దలనుంచి స్వీకరించిన నిబద్ధీకరణ ప్రణాళికకన్నా భిన్నమైనదే కావచ్చు, మీది సదుద్దేశమే కావచ్చు. ఏదేమైనా, మీరు పిల్లలను ఏదో ఒక రకంగా నిబద్ధీకరిస్తున్నారు.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2021

కేవలం ఒక సాక్షిగా ఉండండి.


🌹. కేవలం ఒక సాక్షిగా ఉండండి. 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ

38


ఉదాహరణకు, స్నేహితులతో కూర్చుని ఒక సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు అది బాగుందని కొందరు, బాగా లేదని మరికొందరు వాదిస్తారు. చివరికి ఆ వాదోపవాదాలు హద్దులు దాటి అనేక ఘర్షణలకు, పోరాటాలకు దారితీస్తాయి. పోరాడుతున్నారంటే అర్థం మీరు ఒక హద్దును దాటి మరొక హద్దు చివరకు చేరుతున్నారన్నమాట. పోరాటంలో అలా చెయ్యక తప్పదు.

నిబద్ధీకరణలతో పోరాడమని నేను మీకు బోధించట్లేదు. వాటిని సరిగా అర్థం చేసుకోండి. వాటి పట్ల చాలా తెలివిగా ఉండండి. అవి మిమ్మల్ని ఎలా శాసిస్తున్నాయో, అవి మీ ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తున్నాయో, అవి మీ వ్యక్తిత్వాన్ని ఎలా తయారుచేశాయో, అవి మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో ధ్యాన పూర్వకంగా గమనించండి.

అలా చేస్తే ఏదో ఒక రోజు వాటి పట్ల మీకు సరియైన అవగాహన కలుగుతుంది. అప్పుడే వాటి నుంచి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. అలాంటి అవగాహనే అసలైన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛనే నేను ‘తిరుగుబాటు’ అంటాను. అసలైన తిరుగుబాటు యోధుడు పూర్తి అవగాహనతో ఉంటాడు. అందుకే అతడు ఎప్పుడూ పోరాడకుండా తెలివిలో ఎదుగుతాడే కానీ, కోపోద్రేకాలకు లోనవడు. ఎందుకంటే, అవి గతానికి చెందినవి.

కాబట్టి, మీరు కోపంలో ఉన్నంత వరకు మీ గతం మీ ఉనికి కేంద్రంలోకి చేరి మిమ్మల్ని శాసిస్తూనే ఉంటుంది. కోపంలో సహజంగానే మీరు ఒక హద్దు చివరి నుంచి మరొక హద్దు చివరకు చేరుకుంటారు. అయినా అక్కడ కూడా మీరు గతాన్ని అంటిపెట్టుకునే ఉంటారు. అందువల్ల కోపంలో ఉన్నంత వరకు మీరు ఎప్పటికీ పరిణామం చెందలేరు. కాబట్టి, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి అవగాహనతో తిరుగుబాటు చేసే యోధునికి, ధ్యాస సాధకులకు అది మార్గం కాదని అర్థం చేసుకోండి.

నిబద్ధీకరణలతో పోరాడమని నేను మీకు చెప్పట్లేదు. వాస్తవాలను గమనించ మంటున్నాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు నిశితంగా గమనిస్తే ‘‘మరమనిషిలా మీరు చెప్పింది చేస్తున్నారే కానీ, ‘‘అలా ఎందుకు చెయ్యాలి?’’ అని మీరు ఏమాత్రం ఆలోచించట్లేదని’’ మీకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మీ మెదడులో నిక్షిప్తం చేయబడిన కార్యక్రమ ప్రణాళిక, దానికి సంబంధించిన ఆనవాలు కూడా మీలో ఏమాత్రం మిగల్చకుండా వెంటనే అదృశ్యమవుతుంది.

ప్రతిస్పందనలో స్పందనకు సంబంధించిన నకలు మిగిలి ఉంటుంది. కానీ, తిరుగుబాటులో ఎలాంటి నకలు ఉండదు. ఎందుకంటే, అదే అసలైన స్వేచ్ఛ. అయితే ‘‘ఎవరు ఎవరితో పోరాడాలి?’’ అని కూడా మీరు అడగవచ్చు. పోరాడవలసిన అవసరం ఉన్నప్పుడే ఆ ప్రశ్న ఉదయిస్తుంది. కానీ, అలాంటి అవసరమే లేదు.

మీరు కేవలం ఒక సాక్షిగా ఉండండి. అప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో అదే మీ నిబద్ధీకరణ. అదే మీ అసలు స్వరూపం. అదే మీ వాస్తవ చైతన్యం. ఏదైతే సాక్షిగా ఉంటుందో అదే మీ ఉనికి ఇంద్రియాతీత మూలాధారం.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


28 Mar 2021

మనస్సు మోసాలపై ఆత్మ తిరుగుబాటు సాధ్యమా?


🌹. మనస్సు మోసాలపై ఆత్మ తిరుగుబాటు సాధ్యమా? 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ

అది అర్థం లేని పని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఇపుడు నేనొక పూజారిని, సిద్ధాంతకర్తను. అదే నాకు మరింత నిరాశ కలిగిస్తోంది. అందువల్ల నేనే నా ఆత్మకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాననిపిస్తోంది. కాబట్టి, అది నాకు ఉండవలసిన తిరుగుబాటు చెయ్యగల ఆత్మ-నిజస్వరూపం-కాదని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే, నాది మోసపూరిత శిక్షణ పొందిన ఆత్మ. కానీ, నాకు తెలిసి, నాకున్న ఆత్మ అదే. దానితోనే నేను తిరుగుబాటు చేస్తున్నా.

మోసపూరిత శిక్షణ పొందిన ఆత్మ మోసానికి వ్యతిరేకంగా ఎలా తిరుగుబాటు చేస్తుంది?

నేను మాట్లాడుతున్న తిరుగుబాటు ఎవరికీ వ్యతిరేకంగాచేసేది కాదు. అసలు అది నిజంగా తిరుగుబాటు కాదు. అది కేవలం ఒక అవగాహన. మీరు మీ బాహ్య, అంతర్గత పూజారులు, సన్యాసినులు, బంధువులతో పోరాడకూడదు. ఎందుకంటే, వారు మీ నుంచి వేరుగా ఉన్నారు. అంటే బాహ్య, అంతర్గతాలు వేరు వేరుగా ఉన్నట్లే కదా!అంతేకాదు, అంతర్గతంలో ఉన్నవి బాహ్యంగా ఉన్న వాటి ప్రతిబింబాలే. అందువల్ల బాహ్య, అంతర్గతాలు ఒక విషయమే కాదు.

‘‘ఆ నిస్సహాయ వృద్ధులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడమనేది కాలాన్ని వృధా చేసే అర్థం లేని పని అనుకుంటున్నాను’’ అని మీరు వాస్తవాన్ని చాలా చక్కగా చెప్పారు. నేను కూడా ‘‘వారికి, వారు మీకు బోధించిన వాటికి వ్యతిరేకంగా పోరాడమని’’ మీకు చెప్పట్లేదు. మీరు మీ మనసుకు వ్యతిరేకంగా పోరాడితే అది ప్రతిస్పందన అవుతుందే కానీ, తిరుగుబాటుకాదు. తేడా గమనించండి. కోపం నుంచి ప్రతిస్పందన పుడుతుంది. అందుకే అది హింసాత్మకంగా ఉంటుంది. అపుడు మీరు గుడ్డిగా ఆవేశపడుతూ ఒక హద్దును దాటి మరొక హద్దుకు వెళ్లడం ప్రారంభిస్తారు.

ఉదాహరణకు, ‘‘పరిశుభ్రంగా ఉండమని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పదే పదే పీడిస్తుంటే ఏదో ఒక రోజు అది మీకు విసుగనిపిస్తుంది. అప్పటినుంచి మీరు చాలా మురికిగా ఉండడం ప్రారంభిస్తారు. అంటే మీరు ఒక హద్దు నుంచి మరొక హద్దుకు చేరుకున్నట్లు. అది కోపంతో, ఆవేశంతో చేసిన ప్రతీకారమే. అదే ప్రతిస్పందన. అంతేకానీ, అది తిరుగుబాటు కాదు.

అయితే తిరుగుబాటు అంటే ఏమిటి? తిరుగుబాటు అంటే స్వచ్ఛమైన అవగాహన. మీరు అసలు విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. అందువల్ల మీరు ఎలాంటి ఆవేశానికీ, కోపానికీ గురి కాకుండా పరిశుభ్రంగా ఉంటారే కానీ, మురికిగా ఉండరు. కాబట్టి, ఎవరూ ఎలాంటి మానసిక దౌర్బల్యానికి గురికాకూడదు. ఎందుకంటే, మానసిక దౌర్బల్యం ఒక రోగం.

ఉదాహరణకు, ఒక వ్యక్తి అదేపనిగా రోజంతా చేతులు కడుగుతూ ఉంటే, అది ఒక మానసిక దౌర్బల్యం. చేతులు కడుక్కోవడం మంచి పని. కానీ, రోజంతా చేతులు కడుక్కోవడం పిచ్చి పని. అలాగే అసలు చేతులు కడుక్కోకపోవడం కూడా పిచ్చిపని. అవగాహన కలిగిన వ్యక్తి అవసరమైనపుడు చేతులు కడుక్కుంటాడు, లేకపోతే మానేస్తాడు. సహజమైన సమయస్ఫూర్తితో అవసరానికి తగినట్లు తెలివిగా జీవించడమంటే అదే.

తెలివికి, ఎక్కువగా ఆలోచించే అతి తెలివికి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. ఉదాహరణకు, దారిలో పాము కనపడగానే తెలివైన వ్యక్తి భయంతో దూరంగా పారిపోతాడు. ఆ తెలివి లేని మూర్ఖుడు పాము దగ్గరే ఉండి ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటాడు. కాబట్టి, పామును చూడగానే భయపడడం తెలివి. అయితే అతిగా ఆలోచిస్తూ అనవసరంగా అతిగా భయపడడం అతి తెలివి.

ఉదాహరణకు, ‘‘ఏ క్షణంలో అయినా ఇల్లు కూలిపోవచ్చు’’ అని అనుక్షణం భయపడడం తెలివి కాదు, అతి తెలివి. అలా ఎవరైనా ప్రతి దాని గురించి ఆలోచించగలగరు. అతిగా ప్రతిస్పందించడమంటే అదే. అలా చేస్తే పిచ్చి పడుతుంది. కాబట్టి, తిరుగుబాటు అంటే ఒక విషయంపై చాలా లోతైన అవగాహన కలిగి ఉండడం.

అది ఎప్పుడూ మిమ్మల్ని మధ్యలో సమతుల్యంగా ఉంచుతుంది. మీరు ఎవరితోనూ- బాహ్య, అంతర్గతాలలో ఉన్న- పోరాడకూడదు. అందుకు కారణం పోరు ఎప్పుడు ఆపాలో మీకు తెలియదు కాబట్టి. ఎందుకంటే, పోరులో ఎవరికీ ఎరుక ఉండదు. అందువల్ల ఎవరైనా ఎంతకైనా తెగిస్తారు. అది మీరు గమనించే ఉంటారు.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


26 Mar 2021

ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే - వ్యక్తిత్వానికే స్వేచ్ఛ


🌹. ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే - వ్యక్తిత్వానికే స్వేచ్ఛ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


ఏ రకమైన బానిసత్వంలో వున్నా అది అసహ్యకరమైనదే. అసలైన బానిసత్వం ఆత్మకు సంబంధించినది. దానికి గతం నుంచి, దేశం నుంచి, మతం నుంచి స్వేచ్ఛ కలిగించండి. ఎందుకంటే, మీరు అలా పెరిగారు.

మీ సత్యాన్వేషణే మీకు అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనదిగా అవాలి. మీకు ఇంకా శక్తి వుంటే రాజకీయ నిరంకుశత్వాలతో పోరాడండి. కానీ, మీకు నిరాశ తప్పదు. ఎందుకంటే, యుగయుగాలుగా ‘‘మేము స్వేచ్ఛగా ఉన్నాం’’ అని భావించిన వారందరూ నిరాశకు గురైనవారే. మీ గతం, మతం, దేశాల నుంచి మీ వ్యక్తిత్వానికి స్వేచ్ఛ దక్కడమే ముఖ్యంగా జరగవలసిన పరిణామం. ముఖ్యంగా ఇది ప్రతి రెబెల్‌కు ఉండవలసిన లక్షణం.

మీరొక విశిష్ట వ్యక్తిగా మారేందుకు ధ్యానం సహాయపడుతుంది. అలాంటి వ్యక్తుల సమూహానికి మాత్ర మే ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉం టుంది. గతానికి దారితీసే వంతెనలను విచ్ఛిన్నం చేసిన ఆధ్యాత్మిక స్వేచ్ఛ గల వ్యక్తులు మాత్రమే సుదూర తారల తీరాలపై దృష్టి పెట్టగలరు.

ఒక రకంగా కవులు, స్వాప్నికులు, మార్మికులు, ధ్యానులు అలాంటివారే. అలాంటి వ్యక్తులతో ఈ ప్రపంచం నిండిపోవాలి. అప్పుడే అందరికీ అసలైన స్వేచ్ఛ దక్కినట్లు. అంతవరకు ఈ ప్రపంచం ఒక నిరంకుశత్వం నుంచి మరొక నిరంకుశత్వంలోకి మారుతూ ఉంటుంది. అదొక అర్థంలేని వ్యర్థ వ్యాయామం. మీరే ముఖ్యం.

కాబట్టి, మీరు మీ మూలాలకు చేరుకుని, మిమ్మల్ని మీరే తెలుసుకుని, మీరే ఒక రెబెల్‌గా మారి వీలైనంతమందిని మీలా మార్చండి. భవిష్య మానవాళి బంగారు భవిష్యత్తుకు మీరు సాయం చెయ్యగల మార్గం అదొక్కటే.

బంధువులు, సన్యాసినులు, పూజారులు నన్ను తీర్చిదిద్దిన శిక్షణా విధానాలు పాతబడి ఎండిపోగా, వాటిలో చాలావరకు జీవాన్ని కోల్పోయాయి. మిగిలినవి ఆ నిస్సహాయ వృద్ధులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ఎందుకూ పనికిరావనిపిస్తోంది. పైగా, నాకు బాహ్యంగా ఉన్నవాటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడమనేది కాలాన్ని వృధా చెయ్యడమే అవుతుంది.

ఇంకా వుంది...

🌹 🌹 🌹 🌹 🌹


24 Mar 2021

మీరే సమీక్షించుకోవాలి


🌹. మీరే సమీక్షించుకోవాలి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


ఏదో ఒకటి వెతికేందుకు, అన్వేషించేందుకు, సృష్టించేందుకు మీరు సిద్ధంగా ఉండాలి. కానీ, చాలా కొద్దిమంది మాత్రమే తీర్థయాత్రకు వెళ్ళాలని లేదా గుండె లోతుల్లోని నిశ్శబ్దంలోకి వెళ్ళాలని లేదా ప్రేమ బాధ్యతను స్వీకరించాలని కోరుకుంటారు. ఎందుకంటే, వాటివల్ల ఎదురయ్యే చిక్కులు చాలా గొప్పగా ఉంటాయి.

మీరు బాధను భరించలేరు. కాబట్టి, వెంటనే మీరు దానిని తరిమెయ్యాలి. లేకపోతే, అది భరించ లేనంతగా తయారై మిమ్మల్ని బానిసత్వపు బందిఖానాలోకి బలవంతంగా నెట్టేస్తుంది. అలా మీరు అతి త్వరలో ఏదో ఒక జైలులోకి ప్రవేశిస్తారు. అలా జరగక ముందు మీరు సృజనాత్మకమైన వ్యక్తిగా మారి పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలి.

జీవితంలో మీకు ఏది ఆనందాన్నిస్తుందో, మీరు ఏది సృష్టించాలనుకుంటున్నారో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, జీవితానికి నిర్వచనం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ముందుగా మీరు తెలుసుకోండి. అసలైన, ప్రామాణికమైన మీరేమిటో, మీ వ్యక్తిత్వమేమిటో తెలుసుకునేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశం.

మీ చుట్టూఉన్న ప్రపంచాన్ని మరి కాస్త మెరుగ్గా, మరింత సుందరంగా చెయ్యడంలో ఉన్న ఆనందం మీ జీవితాన్ని మరిన్ని ఒయాసిస్సులతో పచ్చదనాన్ని సంతరించుకున్న తోటగా మార్చి, అందులో అందరి కోసం మరిన్ని గులాబీలు వికసించేలా చేస్తుంది.

ఈ సందర్భంగా థియొసాఫికల్ సొసైటీని స్థాపించిన ‘‘మేడమ్ బ్లావట్‌స్కీ’’ నాకు గుర్తుకొస్తోంది. ఆమె దగ్గర ఎప్పుడూ ఒక సంచీ నిండా పూలమొక్కల విత్తనాలుండేవి. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా నడిచే దారికి రెండు వైపులా ఆ విత్తనాలను చల్లేది. ‘‘ఎందుకలా చేస్తున్నారు?’’ అని అడిగిన వారితో ఆవిడ ‘‘అది నా అలవాటు. నేను మళ్ళీ ఈ దారిలో రాకపోవచ్చు.

కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. నేను చల్లిన విత్తనాలు మొక్కలై ఈ దారిలో వెళ్ళేవారికి వికసించిన రంగురంగుల పువ్వులతో స్వాగతం పలుకుతూ ఆనందం కలిగిస్తాయి. అలాగే వాటిలో కొన్ని పువ్వులు ప్రేమికుల బహుమతులు కావచ్చు. కొంతమంది పిల్లలు వాటిని కోసుకుని ఇంటికి తీసుకెళ్ళచ్చు లేదా వాటితో ఆడుకోవచ్చు.

అలా నేను ఎక్కడో ఒకచోట కొంత మందికి ఆనందం కలిగిస్తాను. నేనెవరో వారికి తెలియదు. అయినా పరవాలేదు. ఎందుకంటే, ఆ రకంగా నేను కొంతమంది ప్రేమలో, కొంతమంది ఆనందంలో వారికే తెలియకుండా భాగస్వామవుతాను. అదే నాకు ఆనందం’’ అనేది.

ఈ ప్రపంచాన్ని మరికాస్త సుందరంగా మరికాస్త చైతన్యవంతంగా చేసేందుకు స్వేచ్ఛ ఒక చక్కని అవకాశమని అర్థం చేసుకునేవారికి ఎలాంటి బాధ ఉండదు. మీరు నన్ను ప్రశ్నించడం మంచికే జరిగింది. లేకపోతే ఆ బాధను మీరు భరించక తప్పదు. ప్రతికూల ధోరణి మెల్లమెల్లగా మీ స్వేచ్ఛను విషతుల్యం చేస్తుంది కాబట్టి అదృశ్యమై పోయే ప్రతికూల స్వేచ్చకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే దానికి ఉనికి లేదు. కాబట్టి స్వేచ్ఛ సానుకూలంగా మారాలి.

నిరంకుశత్వం నుంచి స్వదేశానికి స్వేచ్ఛ కలిగించడం సత్యమార్గాన్ని అన్వేషించడం సాధ్యమేనా? రాజకీయ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మీరు చేసే పోరాటం ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం మీరు చేసే సత్యాన్వేషణలు మరింత క్లిష్టమైన విషయాలుగా తయారైనప్పటికీ వాటి మధ్య ఎలాంటి సంఘర్షణ లేదు. ముఖ్యంగా మీరు ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసమే సాధన చేయాలి. ఎందుకంటే రాజకీయ నిరంకుశత్వాలు వస్తూ పోతూ ఉంటాయి.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2021

ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు.


🌹. ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు. 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


స్వేచ్ఛ మీ జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా మారాలి. అంతే కానీ, అది మీ జీవితానికి ప్రతికూలంగా ఉండకూడదు. ఇప్పుడు మీరు జైలులో లేరని, అంతా పోగొట్టుకుని ఆకాశం కింద స్వేచ్ఛగా నిలబడ్డారని తెలుసుకున్నారు.

బందీ ఎప్పుడూ బందీగా ఉండాలనే కోరుకుంటాడు. బహుశా ఈ సత్యాన్ని ఇంతకు ముందెప్పుడూ మీరు తెలుసుకుని ఉండరు. ఎందుకంటే, వాడికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఏదీ సృష్టించే పని ఉండదు. వాడికి కావలసినవన్నీ ఇతరులే సమకూరుస్తూ ఉంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది జనాలు కులానికో, మతానికో, వర్ణానికో, తెగకో, దేశానికో, సంప్రదాయానికో బందీలుగా ఉండాలనే కోరుకుంటారు.

ఎందుకంటే, ఎలాంటి బాధ్యత స్వీకరించకుండానే వారికి కావలసినవన్నీ ఇతరుల ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అందుకే వారు జీవితాంతం ఆ బందిఖానాలను భరిస్తూనే ఉంటారు. కాబట్టి, స్వేచ్ఛకు సంబంధించినంత వరకు ‘‘స్వేచ్ఛ, బాధ్యతలు కలిసే ప్రయాణిస్తాయి’ ’అనే మౌలిక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. బాధ్యత వద్దనుకుంటే మీకు స్వేచ్ఛ దక్కదు. అవి రెండు కలిస్తే వస్తాయి, కలిసే పోతాయి.

మీరు బాధ్యతను వదిలించు కోవాలనుకుంటే ఏదో విధంగా మీరు బానిసత్వాన్ని అంగీకరించ వలసిందే. తరువాత వచ్చే బృహత్తర బాధ్యత గురించి ఏమాత్రం ఆలోచించకుండా స్వేచ్ఛ గురించి ఇప్పటి వరకు మీరు కలలు కన్నారు. ఇప్పుడు మీకు స్వేచ్ఛ దక్కింది. కానీ, మీరు ఇంతవరకు మీ బాధ్యతను నిర్వర్తించలేదు. అందుకే బాధ మిమ్మల్ని వెంటాడుతోంది. దానిని మీరు నాశనం చెయ్యగలరు.

బానిసత్వం నుంచి మీరు బయట పడగలిగితే కచ్చితంగా మీరు సృజనాత్మకులవుతారు. మీ జైళ్ళను మీరు ధ్వంసం చెయ్యగలిగితే కచ్చితంగా మీరు ఎంతో కొంత అందమైన దానిని సృష్టించగలుగుతారు. ఏదో విధంగా మీరు సృజనాత్మకులు కాకపోతే మీ జీవితం శూన్యంగానే మిగిలిపోతుంది. అప్పుడు మీకు బాధ తప్పదు. ఇది నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సత్యం.

ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు. అది మరింత చైతన్యమో మరింత సత్యానుభవమో, మరింత ఆనందమో సృష్టించడం కావచ్చు లేదా బాహ్య, అంతర్గత ప్రపంచాల సృజనాత్మకత కావచ్చు. ఏదేమైనా స్వేచ్ఛ ఒక బాధ్యతగా, సానుకూలంగా మారాలి.

మీకు దక్కిన స్వేచ్ఛ ఇంకా ప్రతికూలంగానే ఉంది. మీరు బందిఖానా నుంచి బయటపడడం మంచిదే. కానీ, అది చాలదు. ఇప్పుడు మీ కూడు, గుడ్డ మీరే సంపాదించు కోవాలి. ఇంతవరకు, జైలు అధికారులే వాటిని మీకు సమకూర్చారు. అనేక మంది చర్చిలు, సినగాగులు, దేవాలయాలకు సంబంధించిన వారే. దాదాపు అందరూ ఏదో ఒక మతం, దేశం, కుటుంబం, సంఘం, రాజకీయ పక్షం, రోటరీ లేదా లయన్స్‌క్లబ్‌లలో సభ్యులే. అలా తమని తాము బంధించు కునేందుకు ఎవరికివారే సంకెళ్ళు వెతుక్కుంటారు.

ఎందుకంటే, మీకు ఎలాంటి బాధ్యత ఉండదు. అయినా మీకు పూర్తిరక్షణ ఉంటుంది. అందుకే అలాంటి జైళ్ళలో మీకు హాయిగానే ఉంటుంది. అదే స్వేచ్ఛ విషయంలో అయితే మీరు ఏ పని చేసినా, చెయ్యక పోయినా ప్రతి విషయంలోనూ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అందరూ స్వేచ్ఛ గురించి మాట్లాడేవారే. కానీ, నిజానికి, అదంటే అందరికీ భయమే. అందుకే అందరూ సుఖమైన జైలులో హాయిగా ఉండేందుకే సిద్ధపడతారు.

నా అనుభవం మేరకు చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఎందుకంటే, స్వేచ్ఛ వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా లేమన్న సత్యం వారికి చాలా స్పష్టంగా తెలుసు. మీకున్న స్వేచ్ఛతో మీరు ఏదో ఒకటి చెయ్యడమే దానికి ప్రత్యామ్నాయం.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2021

సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకోండి!


🌹. సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకోండి! 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్‌,

📚. ప్రసాద్ భరద్వాజ


జాతీయత, ప్రాంతీయత, స్వీయ వ్యక్తిగత చరిత్రలకు బందీ కాకుండా నేను అనేక సంవత్సరాలుగా అద్భుతమైన స్వేచ్ఛానుభూతిలో జీవిస్తున్నాను. అయినా ఆ అనుభూతిలో ఏదో బాధకూడా ఇమిడి ఉంది. ఈ బాధ ఏమిటి?

స్వేచ్ఛకు రెండు పార్శ్వాలుంటాయి. వాటిలో ఒక పార్శ్వం మాత్రమే మీ అనుభవంలోకి వస్తే ఆ స్వేచ్ఛలో ఏదో బాధ కూడా ఉన్నట్లు మీరు భావిస్తారు. కాబట్టి, స్వేచ్ఛ మనస్తత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి.

స్వేచ్ఛకున్న రెండు పార్శ్వాలలో మొదటిది ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’. అంటే, జాతి, జాతీయత, చర్చి, రాజకీయ భావజాలాలనుంచి స్వేచ్ఛ. స్వేచ్ఛ మొదటి పార్శ్వం, దాని పునాది ఇదే. అలాంటి స్వేచ్ఛ ఎప్పుడూ ఏదో ఒక దాని నుంచి వస్తుంది. ఒకసారి అలాంటి స్వేచ్ఛ మీకు లభించగానే మీకు చాలా హాయిగా, తేలికగా, సంతోషంగా ఉంటుంది.

ఎందుకంటే, వాటి ముసుగులో ఉన్న మీ వ్యక్తిత్వానికి ఒక్కసారిగా స్వేచ్ఛ లభించడంతో తొలిసారిగా మీరు మీ స్వీయ వ్యక్తిత్వంలో ఆనందించడం ప్రారంభిస్తారు. ‘‘దేనినుంచో స్వేచ్ఛ’’ మీకు లభించింది. అందుకే మీలో ఆ ఆనందం. కానీ, అది సగం స్వేచ్ఛ మాత్రమే.

మిగిలిన సగం ‘‘దేనికోసమో స్వేచ్ఛ’’. ఇది మీకు దక్కలేదు. అదే మీలోని బాధ.

‘‘దేని కోసం స్వేచ్ఛ?’’అనేది లేకపోతే స్వేచ్ఛకు పూర్తి అర్థం లేనట్లే. సృజనాత్మకతకు అవకాశమున్న ఏదో ఒక దాని కోసం- శిల్పం చెక్కాలన్నా, నాట్యం చెయ్యాలన్నా, సంగీతం పాడాలన్నా, కవిత్వం రాయాలన్నా, వర్ణచిత్రాలు వెయ్యాలన్నా- మీకు స్వేచ్ఛకావాలి.

మీ స్వేచ్ఛ సృజనాత్మక జ్ఞానంగా మారనంత వరకు మీకు బాధ తప్పదు. ఎందుకంటే, బంధనాలు తెంచుకుని బందిఖానా నుంచి బయటపడి కటిక చీకటిలో పూర్తి స్వేచ్ఛతో నిలబడ్డ మీకు ఎక్కడికి వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో తెలియదు. అందుకే మీకు వెంటనే బాధ కలుగుతుంది.

ఇంతవరకు మీరు జైలులో ఉన్నారు కాబట్టి, ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం మీకు రాలేదు. పైగా, మీ చైతన్యం అందులోంచి బయటపడాలని తపించి పోయింది. ఇప్పుడు మీరు అందులోంచి బయటపడ్డారు. మీకు పూర్తి స్వేచ్ఛ దక్కింది. అయినా మీకు ‘‘ఇప్పుడేం చెయ్యాలి?’’ అనే కొత్తరకం సమస్య తలెత్తింది.

కాబట్టి, మీరు సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకునే వరకు మీకు దక్కిన స్వేచ్ఛకు అర్థముండదు. ఆత్మజ్ఞానం కోసం మీరు గాఢమైన ధ్యానంలోకి వెళ్ళండి లేదా మీకు నాట్యం చేసే ప్రతిభ ఉంటే నర్తకునిగా మారండి. అప్పుడే మీ స్వేచ్ఛకు సంపూర్ణత్వం సిద్ధించి వృత్తం పూర్తవుతుంది.

కేవలం సంకెళ్ళ కారణంగా మీ చేతులు సంగీతాన్ని సృష్టించ లేకపోయాయి. మీ కాళ్ళు నాట్యం చెయ్యలేక పోయాయి. అందుకే మీ ప్రతిభ అభివృద్ధి చెందలేదు.

తొలిసారి స్వేచ్ఛకోసం పోరాడే వ్యక్తి ‘‘దేనినుంచో స్వేచ్చ, దేనికోసం స్వేచ్ఛ’’అనే గందరగోళంలో పడక తప్పదు. అందుకే అతనికి స్వేచ్ఛ లభించగానే ‘‘ఇప్పుడేం చెయ్యాలి?’’ అనిపిస్తుంది.

ఎందుకంటే, ఇంతవరకు అతను పోరాడే పనిలో ఉన్నాడు. చివరికి అతని కలల్లో కూడా స్వేచ్ఛ గురించిన ఆలోచనలే. అందుకే ‘‘స్వేచ్ఛ లభించిన తరువాత ఏం చెయ్యాలి?’’అనే దాని గురించి అతను ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా ఇంకా ఏదో కావాలి. మీరు సృజనాత్మకునిగా మారాలి. మీ స్వేచ్ఛ సఫలీకృత మయేందుకు మీరు ఏదో ఒకటి సృష్టించాలి. లేకపోతే, ఆ స్వేచ్ఛ ఏమీలేని శూన్యమవుతుంది.

మీరు ఏదో ఒకటి సృష్టించడమో, ఆవిష్కరించడమో లేదా మీ సామర్థ్యానికి వాస్తవరూపాన్ని తీసుకురావడమో లేదా మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు మీరు మీ అంతర్గతంలోకి ప్రయాణించడమో చెయ్యవలసిన అవసరముంది. అందుకు మీకున్న స్వేచ్ఛతో మీరు ఏదో ఒకటి చెయ్యాలి.

మీరు చెయ్యాలనుకున్నది చేసేందుకు స్వేచ్ఛ మీకు చక్కని అవకాశాన్నిస్తుందే కానీ. అదే దాని లక్ష్యం కాదు. మీరు స్వేచ్ఛగాఉన్నా బాధపడుతున్నారు. ఎందుకంటే, మీకు దక్కిన అవకాశాన్ని మీరు సరిగా వినియోగించుకోలేదు.

కాబట్టి, ఊరికే కూర్చోకుండా మీకున్న స్వేచ్ఛతో మీరు ధ్యానం చెయ్యండి. సంగీతం పాడండి. శిల్పాలు చెక్కండి. వర్ణ చిత్రాలు వెయ్యండి, నాట్యం చెయ్యండి. ప్రేమించండి లేదా ఏదో ఒకటి చెయ్యండి. లేకపోతే మీకు బాధ తప్పదు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2021

బాహ్య పరస్పరాధీనత తప్పదు


🌹. బాహ్య పరస్పరాధీనత తప్పదు 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌,
📚. ప్రసాద్ భరద్వాజ


భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కాబట్టి, భారతదేశంలో మీరు ఏమైనా చెయ్యొచ్చు. మీరు స్వేచ్ఛగా ఉండండి. కానీ, అది ఇతరులకు సమస్యగా మారకూడదు. అలాగే మీరు ఇతరుల జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకండి. అవగాహన కలిగిన వ్యక్తి ఇతరుల స్వేచ్ఛను ఎంత గౌరవిస్తాడో తన స్వేచ్ఛను కూడా అంతగానే గౌరవిస్తాడు.

ఎందుకంటే, ఇతరులు మీ స్వేచ్ఛను గౌరవించకపోతే మీ స్వేచ్ఛ నాశనమైనట్లేకదా! కాబట్టి, అది పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ‘‘నేను మీ స్వేచ్ఛను గౌరవిస్తాను, మీరు నా స్వేచ్ఛను గౌరవించండి. అప్పుడు ఇద్దరమూ స్వేచ్ఛగా ఉంటాం’’అనేది ఎవరూ హద్దులు మీరని రాజీవ్యవహారం. ఉదాహరణకు, మీ సొంత ఇంట్లో మీరు అర్థరాత్రి గట్టిగా పాడాలనుకున్నా పాడలేరు. ఎందుకంటే, అది పొరుగువారికి నిద్రాభంగం కలిగిస్తుంది. కాబట్టి, మీరు రాజీపడక తప్పదు.

బాహ్య ప్రపంచంలో మనం మనుషులతో మాత్రమే కాదు, అన్ని విషయాలలోనూ పరస్పరాధీనులమే. చెట్లు మీరు వదిలిన కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకుని మీకు కావలసిన ఆక్సిజన్‌ను అందిస్తాయి. వాటిని నరికేస్తే మీరు చనిపోతారు. ధూమపానం ద్వారా మీరు చెట్లకు కావలసిన కార్బన్ డైయాక్సైడ్‌ను అందించినప్పుడు అవి చాలా సంతోష పడతాయి. అందుకు మూలకారణం తెలుసుకోమని నేను మీకు చెప్తే వెంటనే మీరు ధూమపానం మానేస్తారు. అప్పుడు చెట్లు చాలా బాధపడతాయి.

కాబట్టి, మన పరస్పరాధీనత కేవలం చెట్లతో మాత్రమే కాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో కూడా ఉంది. నిజానికి, అన్నీ పరస్పరాధీనమైనవే. ఆ పరస్పరాధీనతను ఆనందించండి. అంతేకానీ, దానిని బానిసత్వంగా భావించకండి. పరస్పరాధీనత బానిసత్వంకాదు. మీరు ఇతరులపై, ఇతరులు మీపై ఆధారపడి ఉన్నారు. అది సోదరభావ సంబంధం. చిన్న గడ్డిపరకకు కూడా నక్షత్రాలతో సంబంధముంది.

కానీ, మీ అంతర్గత ప్రపంచంలో, మీ అంతర్గత సామ్రాజ్యంలో మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండగలరు. అక్కడ మీరు దేనికోసమో బాధపడవలసిన, దేనిపైనో తిరుగుబాటు చెయ్యవలసిన అవసరముండదు. బాహ్య పరస్పరాధీనత తప్పదని, అనివార్యమని తెలుసుకోండి. జరిగే వాటిలో అది ఒక భాగం. దానిని ఏమీ చెయ్యలేము. ఏమీ చెయ్యలేని దానిని అంగీకరించడమొక్కటే మార్గం.

కాబట్టి, ఏదో ఇష్టం లేని రాజీనామా ఇచ్చినట్లు కాకుండా, మనస్ఫూర్తిగా, ఆనందంగా దానిని అంగీకరించండి. ఇది మన విశ్వం. మనం అందులో భాగం. మనం ద్వీపాలం కాదు, మొత్తం ఖండంలో భాగం.

మీ స్వేచ్ఛ్భావన మీ అహంభావం మూలాలలో ఎక్కడో నాటుకుని ఉంది. మనం అహాలం కాదు. అహానిది అవాస్తవ అస్తిత్వం. ఎందుకంటే, మనం విడిగా లేము. అప్పుడు మనకు అహాలు ఎలా ఉంటాయి?

‘‘నేను’’ అనేది కేవలం భాషకు ఉపయోగపడే పదం మాత్రమే. అంతేకానీ, దానికి ఎలాంటి సారంలేదు, వాస్తవికత లేదు. అది కేవలం ఏమీలేని నీడ మాత్రమే.

మీరు మీ ఎరుక లోతుల్లోకి వెళ్తున్నప్పుడు అంతర్గత స్వేచ్ఛ మీకు తప్పక లభిస్తుంది. మీరు మీ శరీరాన్ని, ఆలోచనా పద్ధతులను నిశితంగా పరిశీలిస్తూ సాక్షిగా ఉండండి.

అప్పుడు మెల్లమెల్లగా మీరు హిందు, మహమ్మదీయ, క్రైస్తవ, సామ్యవాదులు కాదని, అసలు మీరు ఎలాంటి ఆలోచన కాదని, చివరికి మీరు మనసు, కోపము, దురాశలు కూడా కాదని మీకు తెలుస్తుంది.

నిర్మల సాక్షీతత్వానుభవమే సంపూర్ణ స్వేచ్చానుభవం. కానీ, అది అంతర్గతానికి సంబంధించిన విషయం. అంతర్గతంలో పూర్తి స్వేచ్ఛతో ఉన్న వ్యక్తి బాహ్య స్వేచ్ఛను ఆశించడు. అలాంటి వ్యక్తికి ప్రకృతిని యథాతథంగా స్వీకరించగల సామర్థ్యముంటుంది.

సాక్షిగా ఉండడం ద్వారా అంతర్గత స్వేచ్ఛను సృష్టించి అందులో జీవించండి. అప్పుడు మీరు బాహ్య పరస్పరాధీనతను తెలుసుకో గలుగుతారు. అది ఒక అందమైన ఆశీర్వాదం. దానికి తల వొంచి అందులో విశ్రాంతి పొందండి. అంతేకానీ, దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యవలసిన అవసరంలేదు. గుర్తుంచుకోండి: అసలైన స్వేచ్ఛాపరుడు మాత్రమే తల వొంచగలడు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

15 Mar 2021

అంతర్గత చైతన్యమే స్వేచ్ఛ


🌹. అంతర్గత చైతన్యమే స్వేచ్ఛ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


మనుషులు స్వేచ్ఛ గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ, వారికి కావలసినది అసలైన స్వేచ్ఛకాదు, బాధ్యతా రాహిత్యం. వారు స్వేచ్ఛ కావాలంటారు. కానీ, లోలోపల వారు అచేతనంగా కోరుకునేది బాధ్యతా రాహిత్యం. విచ్చలవిడి తనానికి అనుమతి పత్రాలే. అది మరీ పిల్లచేష్ట.

పరిణతి చెందడమే స్వేచ్ఛ. బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే స్వేచ్ఛ లభిస్తుంది. ప్రపంచం స్వేచ్ఛగా లేదు. ఎందుకంటే, మనుషులు పరిణతి చెందలేదు. విప్లవకారులు అనేక శతాబ్దాలుగా అనేక విషయాలపై చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఆదర్శవాదులందరూ ‘‘మనిషికి ఎలా స్వేచ్ఛ కలిగించాలి?’’ అని ఎప్పుడూ ఆలోచిస్తుంటే, దాని గురించి ఎవరూ ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే, అన్నీ ఏకమైతే తప్ప మనిషి స్వేచ్ఛగా ఉండలేడు. బుద్ధుడు, మహావీరుడు, జరతూష్టల్రు లాంటి వారు మాత్రమే స్వేచ్ఛగా ఉండగలరు.

ఎందుకంటే, వర్తమానంలో ఎరుకతో ఉండడమే స్వేచ్ఛ. ఎరుక లేని వారికే ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానాలు అవసరమవుతాయి. అప్పుడు స్వేచ్ఛ తగ్గిపోతుంది. అంటే, కేవలం పేరుకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది తప్ప, నిజానికి అది ఎప్పుడూ ఉండదు. ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్వేచ్ఛ ఎలా ఉంటుంది? అది అసంభవం. అయితే స్వేచ్ఛకోసం ఏం చెయ్యాలి?

ప్రభుత్వాలు లేకపోతే అరాచకత్వ ముంటుంది. అది స్వేచ్ఛకాదు, పిచ్చి. ఇప్పుడున్న దానికన్న అది మరీ అధ్వాన్నంగా ఉంటుంది. మీరు అప్రమత్తంగా ఉండరు కాబట్టి, పోలీసులు అవసరం. లేకపోతే, రహదారుల కూడలిలో వారు ఉండవలసిన అవసరమేముంది? ప్రజలందరూ అప్రమత్తులైతే పోలీసుల అవసరముండదు. కాబట్టి, వారిని తొలగించవచ్చు. కానీ, ప్రజలు చైతన్యవంతులు కారు. అందుకే పోలీసులు అవసరమయ్యారు.

కాబట్టి, నేను స్వేచ్ఛ గురించి చెప్తున్నానంటే అర్థం బాధ్యతాయుతంగా ఉండమని. మీరు ఎంత ఎక్కువ బాధ్యతతో ఉంటారో అంత ఎక్కువ స్వేచ్ఛగా ఉంటారు. అలాగే, మీరు ఎంత ఎక్కువ స్వేచ్ఛగా ఉంటారో అంత ఎక్కువ బాధ్యతతో ఉంటారు. అప్పుడు ‘‘మీరు చేసే పని పట్ల, మీరు మాట్లాడే మాట పట్ల ’’ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. చివరికి మీ హావభావాలపట్ల కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, మిమ్మల్ని నియంత్రించేందుకు ఎవరూ ఉండరు.

‘‘మీరు స్వేచ్ఛగా ఉన్నారు’’ అని నేనంటున్నానంటే అర్థం ‘‘మీరే దేవుడు’’ అని. అంతే కానీ, ‘‘స్వేచ్ఛ ’’ విచ్చలవిడితనానికి ఇచ్చే అనుమతి పత్రం కాదు. అదొక అద్భుతమైన క్రమశిక్షణ. నలభైయ్యైదేళ్ళుగా నేను నిర్మించుకున్న జైలులోనే చాలాకాలం జీవించాను. అయితే మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని ఇప్పుడు నాకు తెలిసింది.

కానీ, సురక్షితమైన ప్రదేశంతో పాటు మంచి వాతావరణం కూడా ఎదిగేందుకు అవసరమని మీకనిపిస్తే, అప్పుడేం చెయ్యాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండేదెలా? దాని గురించి నాలో తిరుగుబాటు కలుగుతోంది. అందుకు నేను బాధపడుతున్నాను.

స్వేచ్ఛకు బాహ్యంతో ఎలాంటి సంబంధం లేదు. అది అంతర్గత చైతన్యానికి సంబంధించినది. మీ చైతన్యం స్వేచ్ఛగా ఉంటే ఎప్పుడైనా, ఎక్కడైనా - చివరికి సంకెళ్ళతో బంధించి జైలులో పెట్టినా- మీరు స్వేచ్ఛగా ఉండగలరు. అలాగే మీ చైతన్యానికి స్వేచ్ఛలేకపోతే మీకు సంకెళ్ళు లేకపోయినా, మీరు జైలులో లేకపోయినా, చివరికి మీరు మీ సొంత ఇంట్లోనే ఉన్నా మీరు ఖైదీయే.

మీరు బాహ్య స్వేచ్ఛ, అంతర్గత స్వేచ్ఛలతో తికమక పడుతున్నారు. బాహ్య స్వేచ్ఛకు సంబంధించినంత వరకు మీరు ఎప్పటికీ పూర్తిగా స్వేచ్ఛగా ఉండలేరు.

ఎందుకంటే, మీరు ఒంటరి వారు కాదు. మీ చుట్టూ అనేక మంది ఉంటారు. అందువల్ల మీరు జీవితంలో రాజీపడవలసి వస్తుంది. ఈ భూమిపై మీరొక్కరే ఉన్నట్లైతే మీకు పూర్తిస్వేచ్ఛ దక్కేది. కానీ, మీరు ఒంటరి వారు కాదుకదా!

రహదారిలో మీరు ఎడమవైపే నడవాలి. అది ఒక నిబంధన. దానినే మీరు బానిసత్వమని, బలవంత పెడుతున్నారని అనుకుంటే ఎలా? ఏ దేశంలో అయినా మీరు అక్కడి నిబంధనల ప్రకారమే రహదారిలో నడవాలి కానీ, మీ ఇష్టమొచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ నడవకూడదు. ఒక్క భారతదేశంలో మాత్రమే మీరు అలా చెయ్యగలరు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2021

స్వేచ్ఛ బాధ్యతా రాహిత్యమా?


🌹. స్వేచ్ఛ బాధ్యతా రాహిత్యమా? 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ పూర్తి స్వేచ్ఛ కాదు. ఆ ‘నుంచి’ అనేది మీరు గతంలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. అందువల్ల ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ అసలైన స్వేచ్ఛ కాదు.

అడ్డంకులను అధిగమించే సోపానాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక-ఇలా అనేక రకాల స్వేచ్ఛలున్నాయి. కానీ, అవన్నీ పైపైవి మాత్రమే. అసలైన స్వేచ్ఛకు పూర్తి భిన్నమైన పార్శ్వముంటుంది. అది ఏమాత్రం బయట ప్రపంచానికి సంబంధించినది కాదు. అది మీలో ఉదయిస్తుంది. అన్నిరకాల నిబద్ధీకరణలు, ధార్మిక సిద్ధాంతాలు, రాజకీయ వేదాంతాలనుంచి బయటపడేదే అసలైన ‘స్వేచ్ఛ.’

ఇతరులు మీపై విధించినవన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మిక బానిసత్వంలో బంధించేందుకు వేసిన సంకెళ్ళే. వాటినుంచి విముక్తి కలిగించి మిమ్మల్ని స్వేచ్ఛావిహారిగా చేసేదే ధ్యానం. అప్పుడే మీరు మళ్ళీ అస్తిత్వపు నీడలో, నక్షత్రాల వాడలో హాయిగా విహరించగలరు.

ఎప్పుడైతే మీరు అస్తిత్వానికి అందుబాటులో ఉంటారో అప్పుడు అస్తిత్వం మీకు అందుబాటులోకి వస్తుంది. మీ ఇద్దరి కలయికే పరమానందానికి పరాకాష్ట. అది కేవలం స్వేచ్ఛలో మాత్రమే జరుగుతుంది. అందుకే స్వేచ్ఛ అత్యంత విలువైనది. అంతకన్నా విలువైనది ఏదీ లేదు.


🌷. ‘స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత’’ 🌷

చెయ్యాలనుకున్నది చేసేటంత పూర్తి స్వేచ్ఛ మనకు ఉండాలని ఒకపక్క మీరు సూచిస్తూనే, దాని బాధ్యతను కూడా మనం స్వీకరించాలని మీరంటున్నారు. బాధ్యతను స్వీకరించే పక్షంలో కోరుకున్నంత స్వేచ్ఛగా నేనుండలేను. మీరు చెప్పేది అర్థమైనప్పుడు మాత్రం నాలో మీపట్ల కృతజ్ఞతా భావం కలుగుతోంది. కానీ, చాలావరకు నేను స్వేచ్ఛను విచ్చలవిడి తనానికిచ్చిన అనుమతి పత్రంగానే భావిస్తున్నాననిపిస్తోంది.

‘‘స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత’’- తరతరాలుగా మానవాళిని వెంటాడుతున్న శాశ్వతమైన ప్రశ్నలలో ఇది ఒకటి. ‘‘బాధ్యత లేకపోవడమే స్వేచ్ఛ’’అని మీరు అనుకుంటున్నారు.

ఒక శతాబ్దం క్రితం ఫ్రెడరిక్ నీషే ‘‘దేవుడు మరణించాడు, మనిషి స్వేచ్ఛ పొందాడు’’అంటూనే ‘‘ ఇప్పుడు మీరు ఏమైనా చెయ్యొచ్చు. ఎలాంటి బాధ్యత లేదు’’ అని కూడా అన్నాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. దేవుడే లేనప్పుడు మొత్తం బాధ్యత మీపై పడుతుంది.

ఒకవేళ దేవుడు ఉన్నట్లైతే ‘ఈ ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు. పాప చింతనలు, అవినీతి విత్తనాలు మొదటినుంచి నువ్వే నాలో నాటావు. నువ్వే నన్ను అలా తయారుచేశావు. కాబట్టి, అన్నింటికీ బాధ్యత నీదేకానీ, నాది కాదు. నేనొక చిన్న జీవాన్ని. నువ్వు సృష్టికర్తవు. కాబట్టి, బాధ్యత నాదెలా అవుతుంది?’’ అంటూ మీ బాధ్యతను ఆయనపైకి నెట్టేస్తారు.

నిజంగా దేవుడు ఉన్నట్లైతే మీరన్నట్లు మీ బాధ్యతను ఆయన పంచుకోక తప్పదు. ఒకవేళ ఆయన లేకపోతే ఎవరు చేసే పనులకు వారే బాధ్యులవుతారు. ఎందుకంటే, మీ బాధ్యతలను మరొకరిపై వేసేందుకు వేరే దారిలేదు.

మీరు స్వేచ్ఛగా ఉండండని నేనంటున్నానంటే అర్థం ‘‘మీరు చేసే పని పట్ల బాధ్యతాయుతంగా ఉండండి’’ అని. ఎందుకంటే, ఆ పని చేసేది మీరే కాబట్టి, దాని బాధ్యత కూడా మీదే అవుతుంది. అంతేకానీ, ఆ బాధ్యతను మీరు ఇతరులపై వెయ్యలేరు.

మీరు ఏ పనిచేసినా దాని బాధ్యత కూడా మీదే. అంతేకానీ, ఎవరో బలవంతంగా మీచేత ఆ పని చేయించారని మీరు చెప్పలేరు. ఎందుకంటే, మీరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరూ మిమ్మల్ని బలవంత పెట్టలేరు. ఒక పని చెయ్యాలో, వద్దో నిర్ణయించేది మీరే.

స్వేచ్ఛతోపాటే బాధ్యతకూడా వస్తుంది. నిజానికి, స్వేచ్ఛే బాధ్యత. కానీ, మనసు మహామోసకారి. అది ఎప్పుడూ దాని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది. అలాగే అది ఎప్పుడూ ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకుని దానినే వింటుంది కానీ, సత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


11 Mar 2021

కావాల్సింది సృజనాత్మకత


🌹. కావాల్సింది సృజనాత్మకత 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


క్రొత్తవాటి కోసం పాతవి కచ్చితంగా అంతరించాలి. దయచేసి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ పాతవి మీలో ఉన్నవే కానీ, లేనివి కాదు. అంటే, నేను చెప్పేది మీ లోపల ఉన్న కుళ్ళిన పాత భావాలు అంతరించాలని మాత్రమే.

కానీ, మీలో లేని వాటి గురించి, పాత సామాజిక నిర్మాణం గురించి నేను మాట్లాడట్లేదు. పాత భావాలతో నిండిన మీ మానసిక స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. నూతన భావాలతో కూడుకున్న మానసిక స్థితి మీలో కలిగేందుకు ఆ పాత మానసిక స్థితి అంతరించాలి.

అలా ఒక్క మనిషి మారినా, అతని ఉనికి అనేకమంది తమ జీవితాలను ఊహించలేనంత, నమ్మలేనంత అపురూపంగా మార్చుకునేందుకు ప్రేరేపిస్తుంది. అప్పుడు అనేకమంది అలా మారడం ప్రారంభిస్తారు.

కాబట్టి, పేరాశల నుంచి, పురాతన ఆదర్శవాదాల నుంచి బయటపడి, నిశ్శబ్దంగా, ధ్యాన పూర్వకంగా, ప్రేమాస్పదునిగా మారి, ఆనందంగా నాట్యం చేస్తూ జరిగే దానిని గమినించండి. త్వరలో అనేకమంది, ఆ తరువాత ఇంకా చాలామంది మీతో కలిసి నాట్యం చేస్తారు. ఇదే నేను మీకు బోధించే తిరుగుబాటు.

నేను రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకిని, కాబట్టి, వాటిపై నాకు ఎలాంటి ఆసక్తిలేదు. అవును, కొత్త వాటికోసం పాతవి నశించాలి. అది మీలో జరగాలి. అప్పుడే అక్కడ కొత్తవి పుట్టుకొస్తాయి. కొత్తవి ఎప్పుడూ అంటువ్యాధి లాంటివే. అందుకే అవి త్వరగా ఇతరులకు వ్యాపిస్తాయి.

ఆనందం ఒక అంటువ్యాధి. మీరు నవ్వడం ప్రారంభిస్తే మీతో పాటు ఇతరులు కూడా నవ్వడం ప్రారంభిస్తారు. అలాగే ఏడుపు కూడా. మనం విడిగా లేము. అందరం కలిసే ఉన్నాం. కాబట్టి, ఎవరి హృదయం ఉప్పొంగినా అది ఇతరుల హృదయాలను- ఒక్కొక్క సారి సుదూర తీరాలలో ఉన్న హృదయాలను కూడా- తాకుతుంది.

ఏదో విధంగా మార్మికమైన మార్గంలో నా నవ్వు, నా ప్రేమ మిమ్మల్ని చేరింది, నా ఉనికి మీ ఉనికిని తాకింది. అందుకే అనేక ప్రయాసలుపడి చాలా దూరాలనుంచి కూడా మీరు ఇక్కడకొచ్చారు. ప్రతి దానికి వ్యతిరేకంగా పోరాడమని నేను మీకు బోధించట్లేదు. అలా చేస్తే మీరొక అభివృద్ధి నిరోధకునిగా మారతారు.

ఎందుకంటే, మీ చర్యకు ప్రతి చర్య అదే. అప్పుడు మీకు వ్యతిరేకమైన దాని ఉచ్చులో మీరు చిక్కుకుంటారు. అది మిమ్మల్ని శాసిస్తుంది- బహుశా ప్రతికూల మార్గంలో కావచ్చు. అయినా అది మిమ్మల్ని శాసిస్తుంది.

నేను దేనికీ, ఎవరికీ వ్యతిరేకిని కాను. మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటానే కానీ, ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ పొందాలని నేను కోరుకోను. తేడాను గమనించండి.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2021

‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’


🌹.‘‘ఎంపిక లేని ఎరుకతోనే పూర్తి స్వేచ్ఛ’’ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


ఒకడు ఒక గురువును కలిసి ‘‘మనిషి పూర్తి స్వతంత్రుడు, స్వేచ్ఛాపరుడేనా లేక అందుకు పరిమితులేమైనా ఉన్నాయా లేక స్వేచ్ఛను హరించే అలాంటి పరిమితులను మించిన దేవుడు, విధి, అదృష్టం, ప్రారబ్ధం లాంటివి ఉన్నాయా?’ ’అని అడిగాడు.

వెంటనే ఆ గురువు తనదైన పద్ధతిలో ‘‘లేచి నిలబడు’’ అన్నాడు.

వెంటనే అతను గురువు చెప్పినట్లు లేచి నిలబడ్డాడు.

‘‘ఇప్పుడు నీ రెండు కాళ్ళలో ఒక కాలు పైకెత్తు’’అన్నాడు గురువు.

వెంటనే అతను కుడి కాలు పైకెత్తి ఒంటి కాలిపై నిలబడ్డాడు.

‘‘ఇప్పుడు ఆ రెండవ కాలు కూడా పైకెత్తు’’ అన్నాడు గురువు. వెంటనే అతను ‘‘నేను చెయ్యలేని పనిని మీరు చెయ్యమంటున్నారు’’ అన్నాడు.

ఇంతకుముందు ‘‘నీ రెండు కాళ్ళలో ఒక కాలు పైకెత్తు’’ అని నేను అన్నప్పుడు నీకు పూర్తిస్వేచ్ఛ ఉంది కాబట్టి నీ కుడి కాలును పైకెత్తావు. నువ్వు తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు నీ ఎడమ కాలును పైకెత్తలేకుండా చేసింది.

కాబట్టి, మీరు ఏ పనిచేసినా అది దానికి వ్యతిరేకమైన పని చెయ్యకుండా మిమ్మల్ని అడ్డుకుంటుంది. అంటే ప్రతి పనికి పరిమితి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది కదా! కానీ, జీవితంలో ఎవరూ ఒంటి కాలిపై నిలబడలేరు కాబట్టి, అది అంత స్పష్టంగా కనిపించదు. అయినా ప్రతి పనికి, ప్రతి నిర్ణయానికి పరిమితులుంటాయి.

కాబట్టి, దేవుడు, విధి, ప్రారబ్ధం, అదృష్టాల గురించి అనవసరంగా చింతించకుండా మామూలు విషయాలపై మనసు పెట్టు’ అన్నాడు గురువు అతనితో.

నిర్ణయం తీసుకునేముందు మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకోగానే, ఆ నిర్ణయమే, ఆ ఎంపికే దాని పరిమితులను మీ ముందు ఉంచుతుంది. అది సహజం.

అంతేకానీ, పరస్పర విరుద్ధమైన నిర్ణయాలను మీరు ఏక కాలంలో ఒక్కసారిగా తీసుకోలేరు. అలా తీసుకోలేక పోవడం మంచిదే. అది కేవలం అస్తిత్వపరమైన సురక్షిత కొలమానం. లేకపోతే అసలే గందరగోళంలో ఉన్న మీరు మరింత గందరగోళంలో పడతారు. అప్పుడు మీకు పిచ్చెక్కుతుంది. కాబట్టి, మీ నిర్ణయానికి ఎవరూ బాధ్యులు కారు.

ఎంపిక విషయంలో మౌలికంగా మీరు పూర్తి స్వేచ్ఛాపరులే అయినా, ఆ ఎంపికే మీకు పరిమితులను విధిస్తుంది. కాబట్టి, మీరు పూర్తి స్వేచ్ఛాపరులుగా ఉండాలనుకుంటే ఎంపిక చెయ్యడం మానండి. అప్పుడే ఎలాంటి ఎంపికలు లేని ఎరుకకు సంబంధించిన బోధనలు మీ తలకెక్కుతాయి.

‘‘ఎంపికలు మాని ఎప్పుడూ ఎరుకలో ఉండండి’’ అని గొప్ప గొప్ప గురువులందరూ ఎందుకన్నారో తెలుసా? ఎంపిక చేసిన మరుక్షణం మీరు మీ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతారు. అప్పుడు ఎంపిక చేసుకున్నది మాత్రమే మీ దగ్గర మిగులుతుంది.

కాబట్టి, మీరు ఎలాంటి ఎంపికలు లేని వారైతే, మీ స్వేచ్ఛ మీకు పూర్తిగా దక్కుతుంది. కాబట్టి, ఎలాంటి ఎంపికలులేని ఎరుకకు మాత్రమే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మిగిలినవన్నీ పరిమితులతో కూడుకున్నవే.

మీ ముందు చాలా అందమైన నిరుపేద స్త్రీ, చాలా వికారంగా ఉండే ధనవంతురాలైన స్త్రీ ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకుని ఆమెను మీరు ప్రేమించాలి. ఎవరిని ఎంచుకున్నా మీకు బాధ తప్పదు. ఎందుకంటే, ఒకవేళ మీరు చాలా అందంగా ఉండే నిరుపేద స్త్రీని ఎంచుకుంటే దరిద్ర బాధలు తప్పవు. మీరు కారు కొనలేరు, ఇల్లు కొనలేరు, ఏమీ చెయ్యలేరు. పైగా, అనవసరంగా అనేక సంపదలు వచ్చే అవకాశాన్ని కోల్పోయారని తరువాత బాధపడతారు.

ఎందుకంటే, కొన్ని రోజుల తరువాత ఆ అందం పాతదైపోతుంది. తరువాత దానితో ఏం చెయ్యాలో తెలియక తల బాదుకుంటారు. అంతకన్నా మీరు ఏమి చెయ్యగలరు? అప్పుడు మీ మనసు ‘‘అనవసరంగా తప్పుగా ఎంచుకున్నాను’’ అని భావించడం ప్రారంభిస్తుంది.

ఒకవేళ మీరు చాలా అసహ్యంగా ఉండే ధనవంతురాలైన స్ర్తిని ఎంచుకుంటే ఆమె డబ్బుతో మీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు. కానీ, చాలా వికారంగా ఉండే ఆమె రూపాన్ని మీరు ఏమాత్రం అసహ్యించుకోకుండా భరించాల్సి వస్తుంది.

ఎందుకంటే, అసహ్యించుకోవడం కూడా ఒక రకమైన అనుబంధమే. అంతేకాదు, ‘‘నిన్ను ప్రేమిస్తున్నాను’’ అని కూడా ఆమెతో చెప్పాల్సివస్తుంది. కానీ, ఆమె డబ్బుతో కొన్నవాటితో మీరు ఏమాత్రం ఆనందించ లేరు. ఎందుకంటే, ఆమె వికార రూపం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. మీరు కేవలం డబ్బుకోసమే ఆమెను పెళ్ళిచేసుకున్నారన్న సంగతి ఆమెకు తెలుసు.

అందువల్ల ఆమె మిమ్మల్ని ఒక పనిమనిషిగానే చూస్తుంది తప్ప, ప్రియునిగా చూడలేదు. అప్పుడు మీరు ఆమెను ప్రేమించలేదని, అందంగా ఉండే డబ్బులేని అమ్మాయిని ప్రేమిస్తే కనీసం ఆమె అందమైనా దక్కేదని, కేవలం డబ్బుకోసం కురూపిని కోరుకోవడం మూర్ఖత్వమని భావిస్తారు. ఇది సత్యం.

కాబట్టి, వారిలో ఎవరిని ఎంచుకున్నా మరొకరు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. అందువల్ల మీకు పశ్చాత్తాపం తప్పదు. కాబట్టి, పూర్తి స్వేచ్ఛ కోరుకునే వారికి ఉన్న ఏకైక మార్గం ‘‘ఎంపికలేని ఎరుక’’ ఒక్కటే.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021

సృజనాత్మకత - ‘‘దేని కోసం స్వేచ్ఛ- దేని నుంచి స్వేచ్ఛ’’


🌹. సృజనాత్మకత - ‘‘దేని కోసం స్వేచ్ఛ- దేని నుంచి స్వేచ్ఛ’’ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


పనిచెయ్యడమంటే అందరికీ అసహ్యమే. అందుకే పని చేసేందుకు ఎవరూ ఇష్టపడరు. కాబట్టి, పని విషయంలో అందరికీ ఇతరుల సహాయం ఎక్కువగా అవసరమవుతుంది. అందుకే పనులన్నీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూ ఉంటాయి. కార్యాలయాలలో అది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. లంచమిస్తేనే పేరుకుపోయిన గుట్టలో ఎక్కడో అడుగున ఉన్న మీ దస్త్రం పైకి వస్తుంది. లేకపోతే అది అక్కడే ఉంటుంది. పెత్తందార్ల అధికారానికి ఆనందాన్నిచ్చేవి, వారి ప్రాముఖ్యాన్ని పెంచేవి పేరుకుపోయిన ఆ దస్త్రాల గుట్టలే.

నేను కూడా అరాచకవాదినే అయినా గతంలోని వారిలా కాదు. నా వైఖరి నాదే. ఎందుకంటే, విభిన్న ప్రాతిపదికతో కూడిన నా శైలి చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు నేను ఎప్పుడూ వ్యతిరేకిని కాదు. కానీ, అవి అవసరమయ్యే విధానాలకు నేను పూర్తిగా వ్యతిరేకిని. మనిషి ఎలాంటి నియంత్రణలకు- ధార్మిక, రాజకీయ- గురి కాకుండా జీవించే సమయం ఏదో ఒకరోజు తప్పక వస్తుందని నాకు తెలుస్తోంది. ఎందుకంటే, అప్పుడు మనిషి తనకు తానే ఒక ప్రవర్తనా నియమావళి అవుతాడు.

ప్రియతమ ఓషో, ‘‘దేనికోసం స్వేచ్ఛ- దేనినుంచి స్వేచ్ఛ’’- వీటి మధ్యగల తేడాలను దయచేసి వివరించండి.

మీకొక దార్శనికత ఉంటుంది. అది వాస్తవరూపం దాల్చాలని మీరు కోరుకుంటారు. దాని కోసం మీకు స్వేచ్ఛ కావాలి. ఎందుకంటే, మీకు తెలియని దానిలోకి అడుగు పెడుతున్నారు, బహుశా, ఏదో ఒకరోజు మీరు తెలుసుకోలేని దానిలోకి కూడా అడుగుపెడతారు. అదే దాని ఆధ్యాత్మిక పార్శ్వం. అందుకే స్వేచ్ఛగా ఎగిరేందుకు మీకు రెక్కలొస్తాయి.

కాబట్టి, ‘‘దేనికోసం స్వేచ్ఛ’’అనేది ఎప్పుడూ సృజనాత్మకమైనది, భవిష్యత్తుకు సంబంధించినదే. ‘‘దేని నుంచి స్వేచ్ఛ’’ అనేది సాధారణ లౌకిక విషయం. మనిషి ఎప్పుడూ అనేక విషయాల నుంచి స్వేచ్ఛ కోసం ప్రయత్నించాడు.

కాబట్టి, అది సృజనాత్మకమైనది కాదు. అది స్వేచ్ఛకు ప్రతికూల పార్శ్వం. అందుకే ‘‘దేని నుంచి స్వేచ్ఛ’’అనేది ఎప్పుడూ గతానికి సంబంధించినదే. మహా అయితే, అది మీ చేతి సంకెళ్ళను తొలగించగలదు. అంత మాత్రాన, అది లాభదాయకమైనదేమీ కాదు. గతించిన చరిత్ర అంతా అందుకు నిదర్శనమే.

మనుషులు నేను చెప్తున్న స్వేచ్ఛ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే, దానిని అర్థం చేసుకునే పరిజ్ఞానం వారికి లేదు. కంటికి కనిపించే బంధనాలైన చేతి సంకెళ్ళు, కాళ్ళ సంకెళ్ళనుంచి స్వేచ్ఛ పొందడం గురించే వారు నిరంతరం ఆలోచిస్తారు. తరువాత వాటితో ఏం చెయ్యాలో మీకు తెలియదు. పైగా, వాటి నుంచి స్వేచ్ఛ కోరుకున్నందుకు మీరు పశ్చాత్తాపం కూడా పడవచ్చు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

అన్నింటా చైతన్యం రావాలి


🌹. అన్నింటా చైతన్యం రావాలి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


అలాంటి ధ్యానం నుంచి ఎలాంటి బలవంతాలు లేని క్రమశిక్షణ భావన ఎవరూ నేర్పకుండా దానంతటదే సహజ సుమవికాసంలా మీలో కలిగినట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మీ జీవితం, మీ ఉనికి పూర్తిగా మీ సొంతమవుతాయి. వాటి కలయికలో ఉదయించేదే అసలైన స్వేచ్చ. అదే నిర్వాణం.

🌻. తిరుగుబాటు కాదు విప్లవం: 🌻

ప్రభుత్వాలనేవి లేని సమాజస్థాయికి మనిషి చేరుకోలేదు. ‘క్రోపోట్కిన్’ లాంటి అరాచక వాదులందరూ ప్రభుత్వానికి, చట్టానికి వ్యతిరేకులే. నేను కూడా అతనిలా అరాచక వాదినే. కానీ, నా విధానం అతనికి పూర్తిగా వ్యతిరేకమైనది. ప్రభుత్వాలను, చట్టాలను రద్దుచెయ్యాలన్నాడు ‘క్రోపోట్కిన్’.

ఎవరూ హత్యలకు, మానభంగాలకు, హింసలకు, చిత్రహింసలకు గురికాని స్థాయికి మానవ చైతన్యం ఎదగాలని నేను కోరుకుంటున్నా. అప్పుడు పోలీసులకు పని లేక, చట్టాలు, న్యాయమూర్తుల అవసరం లేక, న్యాయస్థానాలు ఖాళీ అవడంతో, ప్రభుత్వాలు వృథా అనిపిస్తాయి. కానీ, మనిషి ఎంత అసహ్యకరమైన ఆటవికుడంటే, అతనిని బలవంతంగా అడ్డుకోకపోతే, మొత్తం సమాజాన్ని అతను గందరగోళంలోకి నెట్టేస్తాడు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని.

ప్రపంచంలోని మానవులందరూ ఎవరినీ అధిగమించాలని కోరుకోకుండా, తాము అందరి కంటే చాలా ప్రత్యేకమనే భావనను త్యజించి, చాలా గొప్పవారుగా నిరూపించుకునే ప్రయత్నాన్ని మానుకుని, ఆత్మస్తుతి, పరనిందలు చెయ్యకుండా, ఎలాంటి ఆత్మన్యూనతా భావానికి, అపరాధ భావనకు గురికాకుండా, చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ధ్యానం చేస్తూ పరమానందంతో ఆడుతూ, పాడుతూ, సమరస భావనతో కలిసిమెలసి జీవించేందుకు సిద్ధపడాలి. అదే నా కోరిక. అప్పుడు ప్రభుత్వాలు వాటంతటవే అదృశ్యమవుతాయి. అది వేరే విషయం. కానీ, అంతవరకు ప్రభుత్వాల అవసరం ఎంతైనా ఉంది. నిజానికి, కొన్ని ముఖ్యమైన అవసరాలను ప్రభుత్వాలు చాలా చక్కగా నెరవేరుస్తున్నాయి. కాబట్టి, నేను వాటికి వ్యతిరేకిని కాను.

ఒక చిన్న విషయం. మీకు జబ్బు చేస్తే మందులు అవసరమవుతాయి. ‘క్రోపోట్కిన్’ లాంటి అరాచక వాదులందరూ వాటిని నాశనం చెయ్యాలంటారు. వారిలా నేను మందులకు వ్యతిరేకిని కాదు. కానీ, మందులు అవసరమయ్యే మానవాళి రోగాలకు నేను పూర్తిగా వ్యతిరేకిని. ఎందుకంటే, మందులన్నీ చాలా ప్రమాదకరమైనవి. పైగా, వాటిలో చాలా మందులు విషపూరితాలే.

అందుకే అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.

ముఖ్యంగా, జన్యుపరమైన మార్పులు చెయ్యడం ద్వారా పుట్టుక తోటే మనుషులు జీవితాలలో ఎప్పుడూ ఎలాంటి రోగాలు రాకుండా చెయ్యవచ్చు.

అప్పుడు ఎవరికీ మందులు, వైద్యుల అవసరముండదు. అందువల్ల మందుల దుకాణాలు, వైద్య కళాశాలలు మూసుకుపోతాయి. వైద్యులు ఎక్కడా కనిపించరు. ఇవన్నీ కేవలం నేను వాటిని వ్యతిరేకించినందు వల్ల జరగవు.

మనుషులందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులైనప్పుడు ఫలితాలు అలాగే ఉంటాయి. నాకు ఒకే భాష, ఒకే ప్రభుత్వం, ఒకే ధార్మికత కలిగిన మానవాళితో కూడిన ఒకే ప్రపంచం కావాలి. మానవ చైతన్యం నిజంగా ఆ స్థాయికి ఎదిగినప్పుడే అది సాధ్యపడుతుంది.

ప్రభుత్వమనేది గొప్పలు చెప్పుకునేదిగా ఉండకూడదు. అది చాలా అవమానకరమైన విషయం. మీరు ఇంకా ఆటవికులుగానే ఉన్నారని, నాగరికత ఇంకా ఏర్పడలేదని దాని అస్తిత్వమే స్పష్టం చేస్తోంది కదా లేకపోతే మిమ్మల్ని పాలించేందుకు ప్రభుత్వం అవసరమేముంది? ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా దోచుకుంటారని, హత్య చేస్తారనే భయాలు లేనప్పుడు, అసలు ఎలాంటి నేరాలూ జరగనప్పుడు పెత్తందారీ ప్రభుత్వంతో మీకు పనేముంటుంది? కాబట్టి, దానిని మీరు కొనసాగించలేరు. ఎందుకంటే, దేశ ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద భారంగా తయారై, పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. పరంపరానుగత ఆధిపత్యాల వైఖరి ఎప్పుడూ అలాగే ఉంటుంది.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు


🌹. ఎరుకతో ఉన్న స్వేచ్ఛలో నియంత్రణ విచ్ఛలవిడితనం రెండూ ఉండవు 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


మీలో వేడి ఉంటే, భయం కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఏదో ఒకటి చెయ్యక తప్పదు. అందుకే నియంత్రించు కోవడమనే విష ప్రయోగంతో ఎవరిని వారే చంపుకుంటారు.

‘‘ఎప్పటికీ హాయిగా జీవించకూడదు’’ అనేది నియంత్రణలో ఉన్నవారికి తెలిసే ఏకైక జీవిత పరిష్కారం. కాబట్టి, బుద్ధ విగ్రహంలా ఉండండి. అప్పుడు మీరు క్రమశిక్షణ పొందిన సహనశీలిగా నటించగలరు. కానీ నేను ఇక్కడ బోధించేది అది కాదు. విచ్చలవిడి తనాన్ని విడిచి పెట్టినట్లే నియంత్రణను కూడా మీరు విడిచి పెట్టాలంటాను. అంటే మీరు చిక్కులో పడినట్లే.

ఎందుకంటే, విచ్చలవిడితనం, నియంత్రణలలో ఏదో ఒక దానిని మాత్రమే మీరు ఎంచుకోగలరు. ఎలాగంటే, ‘‘నియంత్రణను వదిలి విచ్చలవిడిగాను, విచ్చలవిడిని విడిచిపెట్టి నియంత్రణలోను ఉండొచ్చు’’ కదా!’’ అని మీరు అడగవచ్చు. నిజమే.

కానీ, మీరు ఎరుకలో ఉన్నట్లైతే నియంత్రణ, విచ్చలవిడితనాలు రెండూ మీ నుంచి వాటంతటవే తొలగిపోతాయి. ఎందుకంటే, అవి రెండూ ఒకే విషయానికి సంబంధించిన రెండు అంశాలు. ఎరుకలో ఉంటే వాటి అవసరముండదు.

పద్దెనిమిదేళ్ళ కుర్రాడు ఒకరోజు తన తండ్రితో ‘‘ఇంతకాలం మీ నియంత్రణలో నలిగిపోయాను. నా వయసు కుర్రాళ్ళందరూ చక్కగా తాగుతూ, అమ్మాయిలతో తిరుగుతూ హాయిగా ఆనందిస్తున్నారు. నేను కూడా అలాంటి సాహసాలుచేసి, వాటి అనుభూతిని ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇల్లు విడిచి వెళ్తున్నా. నన్ను ఆపేందుకు ప్రయత్నించకండి. వెళ్ళొస్తా’’ అన్నాడు. వెంటనే అతని తండ్రి ‘‘ఉండరా బాబూ! నేను కూడా నీతో వస్తాను. ఇంత కాలం నేనుకూడా నా తల్లిదండ్రుల నియంత్రణలో అలాంటి సాహసాలు చెయ్యలేదు’’ అన్నాడు కొడుకుతో.

నియంత్రించ బడిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. వారు లోలోపల రగిలిపోతూ, విచ్చలవిడిగా తిరిగే అవకాశం కోసం నిరంతరం నిరీక్షిస్తూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితిని సరిగా అర్థంచేసుకోవాలి. అందరూ తమకు తాముగా ఉంటూనే, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను మనస్ఫూర్తిగా అంగీకరించేందుకు, అనుభవించేందుకు, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

అయితే మీరు ఎప్పుడూ పరిపూర్ణ చైతన్యంతో కూడిన ఎరుకతో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీరు ఎప్పుడూ ఆత్మస్మృతిలోనే ఉండాలి. ఇదే మీరు ఎప్పుడూ గుర్తుంచు కోవలసిన ముఖ్య విషయం. మిమ్మల్ని మీరు ఎప్పుడూ మరచిపోకూడదు.

అలాగే మీరు ఎప్పుడూ మీ ఉనికి అంతర్గత కేంద్రంనుంచే ముందుకు కదలాలి. మీరుచేసే పనులన్నీ అక్కడినుంచే జరగాలి. అప్పుడు మీరుచేసే ప్రతి పని ధర్మమవుతుంది.

ఎరుక చేసే పనులలో ఒకటి ధర్మం. పైపైన మీరు చేసే పని పైకి పాప కార్యంలా కనిపించక పోవచ్చు. అందువల్ల అది సమాజానికి నచ్చవచ్చు. సమాజం మిమ్మల్ని కీర్తించవచ్చు. అయినా అది పాపకార్యమే. ఎందుకంటే, మీకు తెలుసు ఆ పని చేసినందువల్ల అనవసరంగా మీరు మీ జీవితాన్ని కోల్పోయారని.

అందువల్ల మీలో మీరు మిమ్మల్ని నిందించుకుంటూనే ఉంటారు. కాబట్టి, మీలో మీరు సంతోషంగా ఉండలేరు.

సమాజం మిమ్మల్ని కీర్తించడంలో అర్థమేముంది, అందువల్ల మీకు దక్కేదేముంది? అన్నీ సొల్లుకబుర్లే.

వాటి కోసం, మీ చుట్టూ ఉన్న మూర్ఖుల మెప్పు కోసం మీరు మీ జీవితంతో పాటు దివ్యత్వాన్ని కూడా కోల్పోయారు. అందువల్ల అవి ముఖ్యవిషయాలు ఎలా అవుతాయి? జీవితాన్ని మీ అంతర్గత కేంద్రం నుంచి జీవించడం ప్రారంభించండి. ధ్యానమంటే అదే.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2021

యథాతథమే మేలు - ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది


🌹. యథాతథమే మేలు - ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ



ఎందుకంటే, అతనికి ‘‘ఏంచెయ్యాలి, ఎలాచెయ్యాలి, అలా చెయ్యాలా, ఇలా చెయ్యాలా’’ లాంటి ప్రత్యామ్నాయాలు ఏమాత్రముండవు. కచ్చితంగా జరిగే వాటి కోసం అన్ని తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కాబట్టి, ప్రతి క్షణం నిర్ణయాత్మకమవుతుంది.

గతం ప్రభావానికి ఏమాత్రం లోను కాకుండా, సిద్ధంగా ఉన్న నిర్ణయాలను ఎప్పుడూ పాటించని, పూర్వ నిశ్చిత నిర్ణయాలు ఏ మాత్రం లేని స్వేచ్ఛాయుతమైన చైతన్యవంతుడు తాజాగా, మచ్చలేని మనిషిగా, ఏమాత్రం కలుషితం కాకుండా పూర్తి ఎరుకతో ముందుకెళ్తాడు. అలాంటి ఎరుక మీకు కలిగితే అన్నీ మిమ్మల్ని అనుసరిస్తాయి. ఎందుకంటే, అన్నింటికీ ఎరుకే అసలైన కీలకం.

ప్రేమికునిగా, సహనశీలిగా, అహింసాయుతునిగా, శాంతమూర్తిగా- ఇలా ఏదోలా అయేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. అలా చేస్తే మిమ్మల్నిమీరు బలవంతపెట్టినట్లే. మీరు కపటిగా మారినట్లే. అదే విధంగా మతాలన్నీ పూర్తిగా మోసపూరితంగా మారిపోయాయి. అందుకే మీరు పైకి ఒకలా, లోపల మరొకలా ఉంటారు. పైకి, మీరు చాలా చక్కగా నవ్వుతూ కనిపించినా, మీ అంతరంగంలో చంపాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. మీ అంతరంగం పరమచెత్తతో నిండి దుర్గంధం చిమ్ముతున్నా, పైకి మీరు గులాబీలా పరిమళాలు వెదజల్లుతూ ఉంటారు.

అణచివేత అనేది మనిషి జీవితానికి సంభవించిన ఘోర విపత్తు. కాబట్టి, ఎప్పుడూ దేనినీ అణచకండి. అతి చక్కని కారణాలకోసమే అణచివేత జరిగింది. చాలా నిశ్శబ్దంగా కదలకుండా ఉన్న బుద్ధుణ్ని చూడగానే, అలా అవాలనే దురాశ మీలో కలుగుతుంది. వెంటనే మీరు రాతి విగ్రహంలా ఏమాత్రం కదలకుండా చాలా నిశ్శబ్దంగా ఉండేందుకు ప్రయత్నించడం ప్రారంభిస్తారు. ఒకవేళ కదిలే పరిస్థితి ఎదురైతే వెంటనే మీరు అణచివేతను ఆశ్రయించి, ఎలాగోలా మిమ్మల్ని మీరు నియంత్రించు కుంటారు.

కాబట్టి, ‘నియంత్రణ’ అనేది చాలా అసహ్యమైన పదం.

‘స్వేచ్ఛ’ చాలా అందమైన పదం. దానిని మీరు చాలా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, నా దృష్టిలో అది ‘‘విచ్చలవిడిగా తిరిగేందుకు ఇచ్చిన అనుమతి పత్రం’’ కాదు. కానీ, అందరూ దానిని అలాగే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, నియంత్రించ బడిన మనసు ‘స్వేచ్ఛ’ గురించి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. పరిస్థితులు కూడా దానికి తగినట్లే ఉన్నాయి.

కానీ, నేను చెప్పే ‘స్వేచ్ఛ’అలాంటిది కాదు. ‘నియంత్రణ’ వ్యతిరేక ధృవమే ‘విచ్చలవిడితనం’. సరిగ్గా వాటి మధ్యలో ఉండేదే స్వేచ్ఛ. అంటే, ఎలాంటి నియంత్రణ, విచ్చలవిడితనం లేనిదే నేను చెప్పే స్వేచ్ఛ.

స్వేచ్ఛకు స్వీయ క్రమశిక్షణ ఉంది. అది మీ ఎరుక, ప్రామాణికతల నుంచి పుడుతుందే కానీ, ఏ అధికారి ద్వారానో అమలు చేసేది కాదు. అందువల్ల ‘విచ్చలవిడితనమే స్వేచ్ఛ’అని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలాచేస్తే ‘స్వేచ్ఛ’ అసలు అర్థాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.

ఎరుక మీకు స్వేచ్ఛ నిస్తుంది. అలాంటి స్వేచ్ఛలో ఎలాంటి నియంత్రణల అవసరము ఉండదు కాబట్టి, ఎలాంటి అనుమతి పత్రాలకు చోటుండదు. నిజానికి, అనుమతి పత్రాల కారణంగానే మీరు బలవంతంగా నియంత్రించ బడుతున్నారు. మీరు ఏమాత్రం మారని పక్షంలో విచ్చలవిడి సమాజం మిమ్మల్ని ఎప్పుడూ నియంత్రిస్తూనే ఉంటుంది.

మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలని ఎప్పుడూ బలవంతపెట్టే రాజకీయ నాయకులు, రక్షక భటులు, న్యాయమూర్తులు, న్యాయస్థానాల అస్తిత్వానికి మీ విచ్చలవిడితనమే కారణం. అలా మిమ్మల్నిమీరు నియంత్రించు కోవడంలో, వేడుక చేసుకుంటూ హాయిగా జీవించాలనే అసలు విషయాన్ని మీరు మరచిపోతారు. అయినా, అంతగా నియంత్రణలో చిక్కుకున్న మీరు వేడుక ఎలా చేసుకోగలరు? దాదాపు ప్రతిరోజూ అలాగే జరుగుతుంది.

క్రమశిక్షణలో ఎక్కువగా నియంత్రించ బడిన అనేక మంది నన్ను చూసేందుకు వస్తుంటారు. కానీ, వారు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఎందుకంటే, వారి చుట్టూ బలమైన గోడలుంటాయి. అందువల్ల వారిలో వేడి నశించి రాయిలా గడ్డకట్టి పోతారు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2021

అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం


🌹. అసలైన స్పందన అవగాహనతోనే సాధ్యం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


ఏదైనా ఛలోక్తిని మీరు ఒక ఆంగ్లేయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే ఆ ఛలోక్తిని మీరు అతనికి మళ్ళీ వివరిస్తారు. అప్పుడు కూడా అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తించేలా ఆంగ్లేయులందరికీ శిక్షణ ఇస్తారు. అర్థరాత్రి నిద్రాభంగమైనప్పుడు ఆ ఛలోక్తి అతనికి మళ్ళీ గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ప్రతి ఆంగ్లేయుడు మూడుసార్లు నవ్వుతాడు.

అదే ఛలోక్తిని మీరు ఒక జర్మనీయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలాగే దానిని మీరు వివరించినప్పుడు కూడా అతను రెండవసారి మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. కానీ, ఏ జర్మనీయుడూ మూడవసారి నవ్వడు. ఎందుకంటే, ఆ విషయం అతనికి గుర్తుంచదు. ఆ రకంగా వారు నిబద్ధీకరించబడతారు.

అదే ఛలోక్తిని మీరు ఒక అమెరికన్‌కు చెప్పగానే అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వు నవ్వి వెంటనే దాని గురించి పూర్తిగా మర్చిపోతాడు. అందుకే ఏ అమెరికన్ రెండవసారి నవ్వడు.

అదే ఛలోక్తిని మీరు ఒక యూదునికి చెప్పినప్పుడు అతను ఏమాత్రం నవ్వకపోగా ‘‘పాత ఛలోక్తిని కూడా మీరు చాలా తప్పుగా చెప్తున్నారు’’అంటాడు. అది అతనికి కేవలం ఛలోక్తే కావచ్చు లేదా గొప్ప వేదాంతమో లేదా అతి చిన్న విషయమో లేదా చివరికి దేవుడైనా కావచ్చు. ఏదేమైనా పెద్ద తేడా ఏముండదు.

ఎందుకంటే, అందరూ పెద్దల కోరిక ప్రకారం తమ సహజత్వాన్ని కూడా అణచుకుంటూ, వారు బోధించిన నిబద్ధీకరణలను పాటిస్తూ, పెరిగి పెద్దవారై, వారు ఆశించినట్లుగానే ప్రవర్తిస్తారు. వాస్తవానికి, ఎవరైనా తమ సహజత్వాన్ని మాత్రమే పని చెయ్యనివ్వాలి. కానీ, ఎవరూ అలా చెయ్యరు. పైగా, తమకు నూరిపోసిన దానినే అందరూ అనుసరిస్తారు. అందుకే అలాంటివారిని నేను ‘బానిసలు’ అంటాను.

మీకు బోధించిన నిబద్ధీకరణలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన మరుక్షణం వాటి ప్రభావం మీపై ఏమాత్రం ఉండక పోవడంతో మీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. వెంటనే మీరు తొలిసారిగా మీ జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించడం ప్రారంభిస్తారు.

అందువల్ల మీరు ఎలా ప్రవర్తిస్తారో, తరువాత ఏమి జరుగుతుందో ఎవరూ ఏమాత్రం ఊహించలేరు. ఎందుకంటే, అస్తిత్వం మీ ద్వారా స్పందిస్తోంది. అందువల్ల మీరు ఇప్పుడు మునుపటిలా లేరు.

ఇంతవరకు కేవలం సమాజం మాత్రమే మీ ద్వారా స్పందిస్తూ వచ్చింది. కాబట్టి, ఎలాంటి ప్రణాళికలు, స్థిరమైన పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా, ఏ క్షణంలో ఏమి జరిగినా అప్రమత్తతతో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లైతే, మీరు ప్రామాణికంగా, వాస్తవంగా మారినట్లే. కాబట్టి, ‘‘అధికారికత, ప్రామాణికత’’అనే పదాలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.

మామూలుగా మీరు మతాచార్యుడు, రాజకీయ నాయకుడు, తల్లిదండ్రుల అధికారిక నిబద్ధీకరణల ప్రకారమే స్పందిస్తారు. సవాలు చేసే పరిస్థితి ఎప్పుడు ఎలాంటిది ఎదురైనా, స్వేచ్ఛాపరుడు ఎప్పుడూ తన ప్రామాణికతకు అనుగుణంగా పూర్తిగా స్పందిస్తూ ప్రవర్తిస్తాడే కానీ, ఏ అధికారానికీ తలవంచి ప్రవర్తించడు. కనీసం అలా జరుగుతుందని కూడా అతను ఏమాత్రం ఊహించలేదు.

ఎందుకంటే, అతనికే తెలియకుండా అంతా జరిగిపోతుంది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏ సమాధానం చెప్తానో నాకే తెలియదు. నేను సమాధానం చెప్పిన తరువాత మాత్రమే ‘‘ఓహో, ఇదా మీ ప్రశ్నకు నా సమాధానం’’అని నాకు తెలుస్తుంది.

నేను ఉన్నాను, మీరు అడిగిన ప్రశ్న ఉంది. కాబట్టి, మీ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది. అడిగిన దానికి వెంటనే చక్కగా స్పందిస్తూ సమాధానం చెప్పడమనేది ఒక ప్రామాణికమైన బాధ్యత. చైతన్యరహితులైన వ్యక్తులు-పిరికిగా, ధైర్యంగా, సహనంగా, అసహనంగా- ఇలా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మీరు ఏమాత్రం ఊహించలేరు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2021