ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే - వ్యక్తిత్వానికే స్వేచ్ఛ
🌹. ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే - వ్యక్తిత్వానికే స్వేచ్ఛ 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
ఏ రకమైన బానిసత్వంలో వున్నా అది అసహ్యకరమైనదే. అసలైన బానిసత్వం ఆత్మకు సంబంధించినది. దానికి గతం నుంచి, దేశం నుంచి, మతం నుంచి స్వేచ్ఛ కలిగించండి. ఎందుకంటే, మీరు అలా పెరిగారు.
మీ సత్యాన్వేషణే మీకు అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనదిగా అవాలి. మీకు ఇంకా శక్తి వుంటే రాజకీయ నిరంకుశత్వాలతో పోరాడండి. కానీ, మీకు నిరాశ తప్పదు. ఎందుకంటే, యుగయుగాలుగా ‘‘మేము స్వేచ్ఛగా ఉన్నాం’’ అని భావించిన వారందరూ నిరాశకు గురైనవారే. మీ గతం, మతం, దేశాల నుంచి మీ వ్యక్తిత్వానికి స్వేచ్ఛ దక్కడమే ముఖ్యంగా జరగవలసిన పరిణామం. ముఖ్యంగా ఇది ప్రతి రెబెల్‌కు ఉండవలసిన లక్షణం.
మీరొక విశిష్ట వ్యక్తిగా మారేందుకు ధ్యానం సహాయపడుతుంది. అలాంటి వ్యక్తుల సమూహానికి మాత్ర మే ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉం టుంది. గతానికి దారితీసే వంతెనలను విచ్ఛిన్నం చేసిన ఆధ్యాత్మిక స్వేచ్ఛ గల వ్యక్తులు మాత్రమే సుదూర తారల తీరాలపై దృష్టి పెట్టగలరు.
ఒక రకంగా కవులు, స్వాప్నికులు, మార్మికులు, ధ్యానులు అలాంటివారే. అలాంటి వ్యక్తులతో ఈ ప్రపంచం నిండిపోవాలి. అప్పుడే అందరికీ అసలైన స్వేచ్ఛ దక్కినట్లు. అంతవరకు ఈ ప్రపంచం ఒక నిరంకుశత్వం నుంచి మరొక నిరంకుశత్వంలోకి మారుతూ ఉంటుంది. అదొక అర్థంలేని వ్యర్థ వ్యాయామం. మీరే ముఖ్యం.
కాబట్టి, మీరు మీ మూలాలకు చేరుకుని, మిమ్మల్ని మీరే తెలుసుకుని, మీరే ఒక రెబెల్‌గా మారి వీలైనంతమందిని మీలా మార్చండి. భవిష్య మానవాళి బంగారు భవిష్యత్తుకు మీరు సాయం చెయ్యగల మార్గం అదొక్కటే.
బంధువులు, సన్యాసినులు, పూజారులు నన్ను తీర్చిదిద్దిన శిక్షణా విధానాలు పాతబడి ఎండిపోగా, వాటిలో చాలావరకు జీవాన్ని కోల్పోయాయి. మిగిలినవి ఆ నిస్సహాయ వృద్ధులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ఎందుకూ పనికిరావనిపిస్తోంది. పైగా, నాకు బాహ్యంగా ఉన్నవాటికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడమనేది కాలాన్ని వృధా చెయ్యడమే అవుతుంది.
ఇంకా వుంది...
🌹 🌹 🌹 🌹 🌹
24 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment