వివేక చూడామణి - 50 / Viveka Chudamani - 50
🌹. వివేక చూడామణి - 50 / Viveka Chudamani - 50 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 15. మనస్సు - 4 🍀
177. మనస్సు ఎల్లప్పుడు ఇంద్రియాలకు వశమై తత్ సంబంధ వస్తు సముదాయమును, భౌతిక మరియు సూక్ష్మ ప్రపంచములో; కుల, మత, జాతులకు సంబంధించిన విశేషములను ఉత్పత్తి చేస్తుంది.
178. జీవుని మోసగించి దానికి స్వచ్ఛమైన జ్ఞానము లేనందువలన, ఆ జీవుని మనస్సు శారీరక, ఇంద్రియ, ప్రాణ సంబంధమైన బంధనాలలో బంధించి సంచరిస్తూ ‘నేను’, ‘నాది’ అన్న అహంభావముతో వివిధములైన లౌకిక, ఆనందాల మధ్య సంచరించుచూ వాటి మంచి, చెడు ఫలితములను అనుభవింపజేస్తూంది.
179. కేవలము మనస్సు మాత్రమే మనిషి యొక్క బంధనాలకు, చెడువంచనలకు, మార్పులు చెందుటకు కారణమగుచున్నది. దాని వలననే దుఃఖాలకు, పుట్టుక, చావులకు కారణమగుచున్నది. ఇవన్నీ రాజస, తామస గుణాల ప్రభావమేనని అందువలన మంచి, చెడుల వివేకము నశిస్తుందని గమనించాలి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 50 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Mind - 4 🌻
177. The mind continually produces for the experiencer all sense-objects without exception, whether perceived as gross or fine, the differences of body, caste, order of life, and tribe, as well as the varieties of qualification, action, means and results.
178. Deluding the Jiva, which is unattached Pure Intelligence, and binding it by the ties of body, organs and Pranas, the mind causes it to wander, with ideas of "I" and "mine", amidst the varied enjoyment of results achieved by itself.
179. Man’s transmigration is due to the evil of superimposition, and the bondage of superimposition is created by the mind alone. It is this that causes the misery of birth etc., for the man of non-discrimination who is tainted by Rajas and Tamas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
24 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment