శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 240 / Sri Lalitha Chaitanya Vijnanam - 240



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 240 / Sri Lalitha Chaitanya Vijnanam - 240 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀

🌻 240. 'చంద్రమండల మధ్యగా' 🌻

చంద్రమండలము యొక్క మధ్యభాగమున స్థితి గొన్నది శ్రీదేవి అని అర్థము. సహస్రార కమల కర్ణిక యందలి మధ్యభాగము చంద్ర మండలము. పదహారు కళలతో శ్రీదేవి అచ్చట శివాంకమున స్థితయై యుండును.

అనగా ఇది శ్రీమాత సహజ సిద్ధమైన స్థానము. అటుపైన నుండునది శివుడే. ఆమె శివతత్త్వముతో కూడి సృష్టి నిర్మాణము చేయుచున్నది. ఆమె అధ్యక్షతనే మనువిద్య, చంద్రవిద్య, మహా చతుషష్టి యోగినీ గణములు, చతుషష్టి కళలతో సృష్టి నిర్మాణము గావించుచున్నారు.

శివ పురాణమునందు శ్రీదేవితో శివు డిట్లనును. “నేను అగ్ని శిరమును, నీవు చంద్రశిరము. అగ్ని సోమాత్మకమైన విశ్వము, మన వలన వృద్ధి చెందుచున్నది".

శివుడు ప్రాణము, అగ్ని స్వరూపుడై సూర్యుని ద్వారా ప్రాణశక్తి అందింపబడుచున్నది. జీవుడు ప్రధానముగ స్పందించు ప్రాణశక్తి. చంద్రుడు మనస్సు లేక చైతన్యము. అది సోమాత్మక ప్రజ్ఞ. చంద్ర మండలముల ద్వారా మనయందు తెలివివలె ప్రకాశించుచున్నది.

ఇటొకరు ప్రాణముగను మరియొకరు తెలివిగను మనయందు పనిచేయు చున్నారు. ఒకరు ఆత్మగను మరియొకరు బుద్ధిగను జీవుల యందున్నారు. బ్రహ్మాండము నుండి అణువు వరకు అన్నిటి యందు వీరు కేంద్రస్థానమున నున్నారు. కేంద్ర స్థానమే మధ్యభాగము. సృష్టి చంద్రమండల మగుటచే దానికి కేంద్రము శ్రీదేవియే. శ్రీదేవికి శివుడు, శివుడికి శ్రీదేవి పరస్పరమైన తత్త్వములు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 240 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Candra-maṇḍala-madhyagā चन्द्र-मण्डल-मध्यगा (240) 🌻

Candra-maṇḍala refers to the sahasrāra. She is in the middle of the sahasrāra. In the middle of the crown cakra there is an orifice called bindu. She is in the form of this bindu.

In fact, in ritual worship of Śrī Cakra, this bindu is the focal point where She is worshipped. The Candra-maṇḍala itself is Śrī Cakra. The moon has sixteen kalā-s and on the full moon day, She is said to be in the form of moon with all the sixteen kalā-s. Reciting this Sahasranāma on full moon days will bring in all auspiciousness.

Śiva is said to reside in the head of agni (fire) and Śaktī is said to reside in the head of the moon and together they sustain this universe (it means that the universe is being sustained by fire and moon referring to Śiva and Śaktī.) This leads to the conclusion that Candra-maṇḍala is Śrī Cakra Itself.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


24 Mar 2021

No comments:

Post a Comment