దేవాపి మహర్షి బోధనలు - 61


🌹. దేవాపి మహర్షి బోధనలు - 61 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 42. తుమ్మ ముళ్ళు 🌻


ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగి జీవితమును నిర్వర్తించు కొన్నచో బాగుండునని సర్వసామాన్యముగ ప్రతి సాధకుడును భావించును. తన హృదయమున సద్గురువు నిలచి సరియగు స్ఫూర్తినిచ్చి కార్యములను సర్వశుభప్రదములుగ నిర్వర్తించవలెనని ఆశ పడుట కూడ సహజము.

అట్టి ఆశ సద్గురువులకు కూడ నుండును. కాని నీ హృదయమను సింహాసనమున ముళ్ళకంపలు పేర్చి యుండుటచే సద్గురువు ఆసీనుడు కాలేడు. ముళ్ళకంపను తీసి మెత్తని, చల్లని ఆసనము వేసి ఆహ్వానించుట సదాచారము.

నీలోని ముళ్ళకంపలు నీ భావపరంపరయే ! ఇతరులపై నీకు గల దురభిప్రాయములు ముళ్ళ వంటివి. సహాధ్యాయి యెడల అట్టి భావము లున్నచో అవి ముళ్ళలో తుమ్మ ముళ్ళ వంటివి. అవి తీవ్రముగా బాధ పెట్టగలవు. కావుననే “సహాధ్యాయి యెడల సోదర భావము” అను ఒక నియమమును అందించి యున్నాము.

నియమమును తప్పక ప్రవర్తించు వారి హృదయము, నిర్మలత్వమునకు అవకాశమేర్పరచును. మనసున యితరులను గూర్చిన అభిప్రాయములు సమసినచో అట్టి హృదయము గురుపీఠము కాగలదు. ధర్మక్షేత్రము కాగలదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Mar 2021

No comments:

Post a Comment