మైత్రేయ మహర్షి బోధనలు - 24


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 24 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 15. ప్రాథమిక దీక్ష -2🌻

సోదరత్వమను దీక్ష మా బృందమున శ్రేష్ఠమైన దీక్షగా భావింతుము. నీ కుటుంబమునందు, నీ పరిసరముల యందు యీ భావమును ప్రవేశపెట్టి జీవించుట ప్రయత్నించుము. క్రమశః ఈ భావము నిన్ను ఉన్నతునిగ చేయగలదు. మనోవికాసము కలిగించగలదు. సోదరత్వమును గూర్చి భాషించుట తగ్గించి జీవించుట మొదలిడుము. సోదరత్వ భావమును ధరించిన సాధకునకు మా సోదరబృందము అదృశ్యముగ సహాయ సహకారముల నందించును. అది కారణముగ మిక్కిలి బలవంతుడవై మహత్కార్యములు సాధింప గలవు.

యుధిష్ఠిరుని కందిన సహాయ, సహకారములు జ్ఞప్తికి తెచ్చు కొనుము. అతడు ధర్మదేవతను సహితము సోదర భావముతో రంజింప జేసెను. తన వెంట వచ్చు జాగిలమును సోదర భావముతో మన్నించుట వలననే కదా ధర్మదేవత సంతసించినది! మరణమును సహితము సోదర భావముతో జయించవచ్చును. అట్టి పటిష్ఠమైన దీక్ష కలవారందరు వైశాఖలోయలో వైశాఖ పౌర్ణమినాడు ఒక బృందముగ ఉత్సవములు జరుపుకొనుచున్నారు. నీవును సోదరదీక్ష నాధారముగ గొని బృందమున చేరుము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


08 Nov 2021

No comments:

Post a Comment