భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 21


🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 21 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 21 🌻

77. పరమాత్ముడే అనంత సర్వం.

78. అనంత సర్వమ్, అనంత అపార సాగరము వంటిది, అయినప్పుడు... సాగరమందలి ప్రతి బిందువు అత్యంత పరిమిత సర్వమ్ అగుచున్నది.

79. సర్వమ్ అయిన భగవంతునిలో, ఈ భగవల్లీల చలించిన తక్షణమే 'ఓం'కార బిందువు అత్యంత, పరిమిత సర్వమ్ గా వ్యక్తమయ్యెను.

80. అనంత సర్వమ్ లో, అనంత ఆభావము అంతర్నిహితమయున్నది. అనంత అభావములో భగవల్లీల చలించగా ఓం కార బిందువు ద్వారా, ఆభావము సృష్టిరూపములో ఆవిర్భవించెను.

"ఓమ్"

(లేక)

సృష్టిబిందువు.

81. అనంత పరమాత్మలో, పరమాణు ప్రమాణంలో అంతర్నిహితమైయున్న ఆదిప్రేరణము యొక్క పరమాణు ప్రమాణమైన ఆవిష్కారబిందువే 'ఓం' బిందువు.

82. ఓం బిందువు ద్వారా అభివ్యక్తమైన పరమాత్మ యొక్క ప్రతిబింబము (సృష్టి) క్రమక్రమముగా కన్పించి, వ్యాపించుచు పెరిగిపోయెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment