శివగీత - 𝟹̷𝟿̷ / 𝚃̷𝚑̷𝚎̷ 𝚂̷𝚒̷𝚟̷𝚊̷-𝙶̷𝚒̷𝚝̷𝚊̷ - 𝟹̷𝟿̷


🌹. శివగీత - 𝟹̷𝟿̷ / 𝚃̷𝚑̷𝚎̷ 𝚂̷𝚒̷𝚟̷𝚊̷-𝙶̷𝚒̷𝚝̷𝚊̷ - 𝟹̷𝟿̷ 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము

🌻. విభూతి యోగము - 3 🌻

సత్యోహం సర్వత శ్శాంత - స్త్రే తాగ్ని ర్గౌరవం గురు:
గౌరహం గహ్వరం చాపం - ద్యౌరహం జగతాం ప్రభు: 15

జ్యేష్ట స్సర్వ సుర శ్రేష్టో - వార్షి ష్టో హ మసాం పతి:,
ఆర్యోహం భగవా నీశ - స్తేజో హం చాది రప్యహమ్ .16

ఋగ్వేదో హం యజుర్వేదః - సామవేదో మాత్మభూ:,
అధర్వణశ్చ మంత్రోహం -తధా చాంగిర సోవరః 17

ఇతిహాస పురాణాని - కల్పోహం కల్పవానహమ్,
నారాశం సిచ గాధాహం -విద్యో పనిషదో స్మ్యహమ్ 18

శ్లోకా స్సూత్రాణి చైవాహ - మను వ్యాఖ్యాన మేవచ,
వ్యాఖ్యానాని తధా విద్యా - ఇష్టం హుత మధా హుతి: 19

దాతా దత్త మాయం లోకః - పరలోకో హమక్షరః,
క్షర స్సర్వాణి భూతాని - దాంతి శ్శాంతి రహం ఖగః 20

గుహ్యోహం సర్వేనే దేషు - అరణ్యో హమజో ప్యహమ్,
పుష్కరం చ పవిత్రం చ - మద్యం చాహ మతః పరమ్ 21

బహిశ్చాహం తధా చాంతః - పురస్తాద హమవ్యయః,
జ్యోతిశ్చాహ తమశ్చాహం - తన్మా త్రాణీం ద్రియాణ్యఃహమ్ 22

బుద్దిశ్చా హమ హంకారో - విషయాణ్య హమే వహి,
బ్రహ్మ విష్ణుర్మహేశో హ - ముమా స్కందో వినాయకః 23

ఇంద్రోగ్నిశ్చ యమ శ్చాహం - నిర్రుతి ర్వరుణో నిలః,
కుబేరో హంత దేశానో - భూర్భువ స్స్వర్మ హర్జనః 24

తప స్సత్యంచ పృధి నీ - చాప స్తేజో నిలోప్యహమ్,
ఆకాశో హం రవి స్సోమో - నక్షత్రాణి గ్రహాణ్యహమ్, 25

వేదమయుడను, ఆగసము, జగత్పతిని ,జ్యేష్టుడను, సర్వేశ్వరుడు ,భగవంతుడు, ఈశ్వరుడు, తేజస్సు ఇతిహాస పురాణాదులు, కల్పము, ఉపకల్పము, కల్ప వంతుడు, విద్య, ఉపనిషత్తు శ్లోకము సూత్రము, మంత్రము, వ్యాఖ్యానము, హతము, ఆహుతి, దాత, దానము, ఇహలోకము, పరలోకము, అక్షరము, క్షరము, సర్వ భూతములు , దాంతి, శాంతి, గుహ్యమును, నేనే.

సర్వతో ముఖుడను, అంతము మధ్యము, ద్వారము, బహిస్థానము, ముందు, వెనుక నేనే . మరియు నాశ రహితుడను. జ్యోతి స్వరూపుడను,

తమము, ఇంద్రియములు, బుడ్డి, అహంకారము , విషయములు, త్రిమూర్తులు దిక్పాలురు, పార్వతీ ,

షణ్యుకుడు, గణపతి, పంచ భూతములు, సప్తలోకములు, రవి, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, ప్రాణము, కాలము మృత్యువు, అమృతము ,భూతము, ఉన్నవి , కలుగబోవునవి, ఈ సర్వములు నేనే .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 39 🌹
🌴. Dialogue between Rama and Lord Siva
🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 06 :
🌻 Vibhooti Yoga - 3 🌻

I'm the one known through Vedas, I'm the truth, I'm peace, and I'm respect. I'm the lord of the universe, I'm the oldest, I'm the lord of all,

I'm the Bhagawan (supreme personality of godhead), I'm the Lord, I'm the divine light. I'm the Itihasa, and Purana.

I'm the Kalpa (eon), I'm the UpaKalpa (manvantara), I'm the one who create these Kalpas, I'm the knowledge, I'm in the hymns of Upanishads, I'm mantra, and I'm the Vyakhyana (commentary) also.

I'm the sacrificial offerings, I'm the donor, I'm the donation, I'm Ihaloka (this material world where jiva takes birth), I'm Paraloka (world where Jiva goes after departure),

I'm Akshara (imperishable) and I'm kshara (perishable) too, I'm all these creatures. Selfcontrol, serenity, and secrecy are also me. I'm the one having faces everywhere.

I'm the end, and middle, I'm the door, I'm outside, i'm inside, I'm the front and back as well. I'm the imperishable one. I'm light and also i'm darkness, I'm the Indriyas (organs) and the Tanmatras as well. I'm the mind, intellect and ego.

I'm the Vishayas (subjects) also. I'm Brahma, I'm Vishnu, I'm Maheshwara, I'm Uma, I'm Skanda, I'm Vinayaka. I'm Indra, Agni and Yama also.

I'm Nairuti, varuna and Vayo (anil). I'm Kubera, I'm the fourteen worlds. I'm the Sun, I'm the moon, I'm stars and planets as well, I'm all these creatures, I'm the Prana(soul), I'm the time, death, and eternity. I'm the past, present and future. I'm everything indeed!

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

22.Aug.2020

No comments:

Post a Comment