నారద భక్తి సూత్రాలు - 73


🌹. నారద భక్తి సూత్రాలు - 73 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. చలాచలభోధ

తృతీయాధ్యాయము - సూత్రము - 42

🌻 42. తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతామ్‌ || 🌻

భగవంతుని పట్ల ప్రేమ సుస్థిరమవదడానికి ఉపయోగపడె ఏ సాధన అయినా అనుష్టించవలసిందే.

సానుకూలాలను అనుప్టిస్తూ ప్రతికూలాలను వదలివెస్తూ, కొంత సాధన ఈ విధంగా సాగుతున్నప్పుడు మహాత్ములు తారసపడి భగవదనుగ్రహాన్ని కలుగజేస్తారు. నిర్విరామంగా సర్వకాల సర్వావస్థలందు భక్తి ప్రపత్తులు సాధనగా జరుగుతూనే ఉండాలి.

భక్తి సాధనలో లోపాలను సరిదిద్దుకోవాలి. అహంకార మమకారాలను వదలదడంలో పరిక్షలనెదుర్కోవాలి.

అనుగ్రహం లభించే దాకా విసుగు చెందక వేచి ఉండాలి. పూర్తిగా భగవదర్పణ అయ్యారో లెదో పరిక్షించుకోవాలి. లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలి. తాను మిగిలి ఉంటే అది కైంకర్యం కాదు. తాను కూడా లేకపోవడమే కంకర్యం. తను, మన, ధనాదులను సర్వాన్ని సమర్పించడమే కైంకర్యమవుతుంది. కైంకర్యమైన భక్తుడె పరాభక్తుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment