✍️. అవతార్ మెహర్ బాబా
📚. ప్రసాద్ భరద్వాజ
మానవులు ప్రపంచంలో ఎంత దూరం అయినా, ఖండాలు అయినా, గ్రహాంతర యానం అయినా చెయ్యవచ్చు, కాని తన లోపలికి తాను ప్రయాణించడం వీలుపడదు :
సూక్ష్మ లోకము, మానసిక లోకములు ఆకాశములో లేవు. అది ఒక అంతరిక ప్రయాణము. అందుచేత మనము ఆకాశములో చేసే, కనుగొనే వాటికి ఏమీ ప్రాధాన్యత లేదు. విశిష్టత లేదు. ఆకాశం వట్టి శూన్యం. అనంతమైన ఈ బ్రహ్మాండమే ఒక మాయ. ఎవరు తన లోపలికి తాను ప్రయాణము చేస్తారో అదే నిజమైన ప్రయాణం. చైతన్యం పరిపక్వత చెందటం.
సూక్ష్మ లోకమును అధిగమించి మానసిక లోకములోనికి అనగా తనలోనికి మరింత లోతుకి ప్రయాణిస్తే, ఒక లోయకు ఎదురుగా నిలబడి ఉంటాడు. రెండు శిఖరముల మధ్య ఒక అగాధము దర్శిస్తాడు. భగవంతుని చూస్తాడు, కాని భగవంతునితో ఒక్కటి కాలేడు. అనంతమైన ఆకాంక్ష, ఎడబాటు ఉంటాయి. అది సత్యమునకు, మాయకు మధ్య ఉన్న అగాధము. ఇంకా తన లోనికి లోతుగా వెళ్ళాలి అని నిక్షయించుకుంటే భగవంతుడై పోతాడు. మాయ అదృశ్యం అవుతుంది. అప్పుడు ఇక విశ్వం లేదు, ప్రపంచములు లేవు, శరీరము లేదు, ఆకాశం లేదు అని తెలుసుకొంటాడు.
భగవంతుని శక్తి, జ్ఞాన, ఆనందములు అనుభవిస్తాడు. అదే కృష్ణ చైతన్య స్థితి. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం అనుభవిస్తూ, ఈ మాయా జగత్తులో జీవించే ప్రతీ జీవి కోసము ఆ సచ్చిదానంద స్థితిని ఉపయోగిస్తాడు. మానవులకు భగవంతుని ప్రేమించడం చేతకాదని తెలిసి ఉన్నందున శ్రీకృష్ణుడు - నన్ను శరణు వేడండి, యోగిగా మారండి అన్నాడు. మెహెర్ బాబాగా వచ్చిన నేను నాకు విధేయులై, నా కొంగు మీరు గట్టిగా పట్టుకొని ఉండి, నన్ను ప్రేమిస్తూ ఉంటే, మీరు ఉన్నచోటనే ఉండి, మిమ్మల్ని మీ లోపలికి ప్రయాణింపజేసి మీ గమ్యస్థానం జేరుస్తాను అని వాగ్ధానం చేస్తున్నాను.
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అవతారమెహర్ #భక్తిసందేశాలు
24 Sep 2020
No comments:
Post a Comment