శివగీత - 72 / The Siva-Gita - 72




🌹. శివగీత - 72 / The Siva-Gita - 72 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

నవమాధ్యాయము

🌻. శరీర నిరూపణము - 6 🌻

వ్యానోక్షి శ్రోత్ర గుల్పేషు - జిహ్వ ఘ్రాణే షు తిష్టతి
ప్రాణాయా మధ్రు తిత్యాగ - గ్రహణా ద్య స్య కర్మచ 31

సమానో వ్యాప్య నిఖిలం - శరీరం వహ్నినా సమ
ద్విసప్త తి సహస్రేషు - నాదీ రంధ్రే షు సంచర న్ 32

భుక్త పీత రసా న్సమ్య - గానయన్ దేహ పుష్టి కృత్,
ఉదానః పాసయోరాస్తే - హస్త యో రంగ సందీషు 33

కర్మాస్య దే హొ న్నయనో - త్క్రమణాది ప్రకీర్తిత మ్
త్వగాడి ద్రూతూ నాశ్రిత్య - పంచ నాగాద య స్స్థితా 34

ఉద్గారాది నిమేషాది క్షుత్పిపాసాది క క్రమాత్
తంద్రీ ప్రకృతి శోకాది - తేషాం కర్మ ప్రకీర్తితమ్ 35

(వ్యానము యొక్క స్థానము కరమను చెప్పుచున్నాడు) చక్షు: శ్రోత్ జిహ్వ ఘ్రాణములందును, గుల్ఫ ములందును ఉండునది సమాన వాయువు.\

దాని పని రేచక - పూరక - కుంభకములు, సమాన వాయువు అగ్నితో కూడి శరీర మంతట వ్యాపించి డెబ్బది రెండువేల నాడుల రంధ్రములందును సంచరించుచుండును. తినిన ఆహారము యొక్క మరియు త్రావబడిన రసపాదార్ధముల యొక్క సారమును గైకొని శరీర పుష్టిని క్రమ పద్ధతిలో నుంచును.

ఉదాన వాయువు కరచరణముల యొక్క సందులందుండును, ఉదాన వాయువు కర్తవ్యకర్మ యేమనగా శరీరమును లేవనెత్తుట, ఉత్క్రమణము మొదలగునవి. ఇకపోతే ఉపానవాయువులగు నాగాదుల స్థితిని దెల్పును,

ఇవి చర్మమందున్న త్వగింద్రియములోన, మాంసమునందును, రక్తములోను, ఎముకలందును , క్రొవ్వుయందును, నరములందును, వ్యాపించియుండును,

ఎక్కిళ్ళు, వాంతి, మొదలగునవి నాగ వాయు గుణములు, కన్నులు మూయుట, తెరచుట, చూచుట మొదలగునవి కూర్మవాయు గుణములు.\

ఆకలి, దాహము, తుమ్ముట, మొదలగునవి కృకర వాయు గుణములు.

అలసత్వము, నిద్ర, - అనవహిత్వము మొదలగునవి దేవదత్త వాయుగుణములు ప్రకృతిచేత (సహజముగా స్వాభావికముగా) దుఃఖించుట, నవ్వుట మొదలగునవి ధనంజయ వాయుగుణములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 The Siva-Gita - 72 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 09 :
🌻 Deha Svarupa Nirnayam - 6
🌻

Eyes, ears, tongue, etc organs are the place of Vyana wind. it helps in Rechaka, Pooraka, Kumbhaka kind of pranayama activities.

Samana wind combines with the fire of the body (heat) and spreads all over the body through the 72000 nerve cells and keeps circulating there in. It balances the body health by regulating the metabolism of body after eating food or drinking water.

Udana wind remains in the joints of limbs, its primary functions are to lift the body, move the body parts etc kind of movements are governed by this wind. Now coming to the subwinds, their locations and functions; they remain spread inside the skin, flesh, blood, bones, fats, and nerves.

Hiccups, vomiting etc functions are done by Naga wind. Closure and opening of eyelids, vision etc are the functions of Kurma wind.

Hunger, thirst, sneezing etc are are the functions of Krukura wind. Laziness, sleep etc are the functions of Devadatta wind. Crying, laughing, etc are the functions of Dhananjaya wind.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

24 Sep 2020

No comments:

Post a Comment