శ్రీ విష్ణు సహస్ర నామములు - 20 / Sri Vishnu Sahasra Namavali - 20


🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 20 / Sri Vishnu Sahasra Namavali - 20 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

వృషభరాశి- మృగశిర నక్షత్ర 4వ పాద శ్లోకం

20. మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః|
అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||

అర్ధము :

181) మహేష్వాసః -
బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు.

182) మహీభర్తా -
భూమిని భరించువాడు, భూభారమును వహించువాడు.

183) శ్రీనివాసః -
సిరికి నిలయమైనవాడు, సిరిని తన హృదయమున ధరించినవాడు.

184) సతాంగతిః -
సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.

185) అనిరుద్ధః -
ఎవరిచేతా నిరోధింపబడనివాడు, అపరిమిత శక్తిమంతుడు.

186) సురానందః -
దేవతలకు ఆనందము కలిగించువాడు.

187) గోవిందః -
గోవులను కాచే గోపాలుడు, వేదముల ద్వారా గ్రహింపబడువాడు, వేదవేద్యుడు.

188) గోవిదాం పతిః -
వేదార్ధము నెఱింగిన జ్ఞానులను రక్షించువాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Vishnu Sahasra Namavali - 20 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Vrushabha Rasi, Mrugasira 4th Padam

20. maheṣvāsō mahībhartā śrīnivāsaḥ satāṁ gatiḥ |
aniruddhaḥ surānandō gōvindō gōvidāṁ patiḥ || 20 ||


181) Maheṣvāsaḥ:
One equipped with the great bow.

182) Mahībhartā:
One who held up the earth submerged in Pralaya waters.

183) Śrīnivāsaḥ:
One on whose chest the Goddess Shri, eternal in nature, dwells.

184) Satāṁgatiḥ:
One who bestows the highest destiny attainable, to all holy men.

185) Aniruddhaḥ:
One who has never been obstructed by any one or anything from manifesting in various forms.

186) Surānandaḥ:
One who bestows joy on all divinities.

187) Govindaḥ:
Gau means words. Thou pervadest all words, giving them power. Therefore sages call the Govinda.

188) Govidāṁ patiḥ:
Gau means words. One who knows them is Govid. He who is the master of words is indicated by this name.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment