🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 8 🌹
సహస్ర నామముల తత్వ విచారణ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత
రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల
🌻. 8. 'రాగస్వరూపపాశాఢ్యా' 🌻
అమ్మవారి సృష్టి నిర్మాణ కార్యక్రమమున అత్యంత ప్రతిభావంతమైనది అనురాగ మను పాశము. ఈ పాశమే లేకున్నచో సృష్టి కథయే లేదు. దేవి నుండి ఈ అనురాగ పాశమే ఇచ్ఛాశక్తిగా స్రవించి సృష్టి కథను నడుపును.
జీవునియందు కూడ ఈ శక్తి కోరికగా పనిచేసి, తనదైన జీవితమును అల్లుకొనుచుండును. సమస్త ప్రపంచమును దేవి ఇచ్ఛాశక్తిచే నడుపబడుచున్నది. ప్రతి జీవియును తన వ్యక్తిగతమైన కోరికలచే నడుప బడుచున్నాడు కదా! కోరిక తనదని అనుకొనుచు సృష్టి కార్యమును చేయుచున్నాడు కదా! నిజమునకు తన కోరికగా వ్యక్తమగుచున్నది దేవి ఇచ్ఛాశక్తియే.
.
ఇచ్ఛ సృష్టి నిర్మాణమునకు గాని, వ్యక్తిగత జీవన నిర్మాణమునకు గాని పునాదిరాయియై నిలచును.
ఇచ్ఛ యుండరాదను కొనుట మెట్ట వేదాంతమగును. ఇచ్ఛను సృష్టి యందు ధర్మముతో జతపరచుట వలన జీవనము ప్రశాంతముగ జరుగగలదు. కోరికయే చెడ్డది
అనుకొనరాదు. ఎట్లు కోరుకొనవలెనో తెలియవలెను.
డబ్బు పాపిష్ఠిది అందురు. ఇది చేతకానివాడు పలుకు మాట. డబ్బు నెట్లు వినియోగ పరచవలెనో తెలిసినవాని చేతిలో అదే ధనము శోభను, వైభవమును కూర్చును. చేతకాని వానిని భ్రష్టుని చేయును.
అట్లే కోరిక కూడ. కోరికయే లేనిచో భగవంతునితో యోగము చెందుట కూడ ఉండదు కదా! సత్యమును కోరి దానికి సంబంధించిన మార్గమును తపనతో అన్వేషించి, మార్గమున అందింపబడిన నియమములను తీవ్రమైన నిష్ఠతో నిర్వర్తించినగాని, దైవమును పొందలేడు కదా !
దైవమును పొందు తీవ్రమైన కోరికనే తపస్సందురు. తపన లేని వానికి ఏదియును అందదు. పదార్థము వైపునకుగానీ, పరమార్థము వైపునకు గాని పయనించుటకు వానియందనురాగ ముండవలెను. అనురాగ మనగా ఎడతెరిపిలేని రాగము. ప్రియునికి ప్రేయసిపై ఎట్లహర్నిశలు ఉండునో, అట్లు తాను పొందదలచిన విషయమున రాగ ముండవలెను.
రాగమను పాశమును దేనిపై ప్రయోగింతుమో అది మనకు దక్కగలదు. అట్టి అనురాగము ధర్మబద్ధము కానిచో బంధనమునకు కారణమగును.
బంధకారణమైన అనురాగము పాశమువలె పనిచేయును. బంధ కారణము కాని అనురాగము ఉపకరణమై నిలచును. జీవుల పై మహాత్ముల అనురాగము ఉపకరణముగ కన్పట్టుచున్నది కదా! సంసార జీవుల యొక్క అనురాగము ఎడతెగని బంధములుగ ఏర్పడుచున్నవి కదా! జ్ఞానము నందలి తారతమ్యములే ఇట్టి స్థితులను కలిగించును.
దేవి యొక్క రాగ స్వరూప పాశము బంధస్థితిని హెచ్చరించుచున్నది, మోక్షస్థితిని సూచించుచున్నది అని తెలియవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 8 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 8. Rāgasvarūpa-pāśāḍhyā रागस्वरूप-पाशाढ्या 🌻
Rāga means desire or a wish. Pāśa is a type of rope used to pull an object.
She pulls all the desires of Her devotees using this rope. There are three śakti-s (śakti in this context means power) – iccā, jñāna and kriya.
This nāma talks about iccā śakti or the desire. She never allows Her devotees to sink with desires.
This arm is Her left upper arm and is represented by Aśvārūdā Devi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi
24 Sep 2020
No comments:
Post a Comment