భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 118



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 118 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. కండూప మహర్షి 🌻

బోధనలు/గ్రంధాలు: కండూపాఖ్యానమ్

🌻. జ్ఞానం:
కండుమహర్షి బాల్యంనుంచే తపస్సు చేసుకుంటున్నాడు. పురాణాలలో ఈయన తల్లితండ్రులెవరో, ఏ వంశస్థుడో చెప్పలేదు.

మోక్షం అంటే ఒక మామిడి పండుకాదు. ఏం కావాలంటే, ముక్తిని ప్రసాదించమని అంటే, ఏదీ వద్దని అర్థం. కాబట్టి ఇంత తపస్సుచేసి ఏదీ వద్దని అంటే ముక్తికాక మరేమిటి అర్థం?

కండుమహర్షి కామక్రోధాది ద్వంద్వాలన్నిటికీ అతీతుడై ఇంద్రియాలు దమించి ఏకాగ్రతతో ధ్యానంచేసి, బ్రహ్మాండమైన దివ్యతేజస్సులతో విష్ణుపదం పొందాడట. బ్రహ్మపారజపము అని ఆయన చేసినట్లు పురాణంచెబుతోంది.

బ్రహ్మపారజపము అంటే ఏమిటి? పరబ్రహ్మయొక్క ధ్యానము ఎట్లా ఉంటుందంటే, పరమాత్మ స్వరూపుడైన హరి పరాత్పరుడు, అపారపారుడు, బ్రహ్మపారుడు అంటే ఈ బ్రహ్మసృష్టించిన జగత్తుకు పరమందున్నాడు. ఈ భౌతికమైన జగత్తును బ్రహ్మ సృష్టించాడు. ఆయన దీనికి పరమందున్నాడు. తమసఃపరస్తాత్… అని,

గాయత్రియందు నాలుగో పాదం – తురీయ పాదం – ‘పరోరజసి సా2వదోం’ అని ఉంది. రజోగుణంచేత సృష్టించబడ్డ ఈ జగత్తుకు బయట ఉండే శుద్ధతత్త్వమేదయితే ఉన్నదో – ‘రజసః పరస్తాత్’ అది. ‘పరోరజసి సా అవతు ఓం’ అని దానికి విశ్లేషణం.

అది తురీయపాదం. అది జపించటమే ఈ పరబ్రహ్మ ఉపాసన. దానికి వ్యాఖ్యానం వ్రాసారు. బ్రహ్మపారజపం చేసాడంటే, గాయత్రీమంత్రంలోని ఈ నాలుగవపాదాన్ని జపించాడు అని అనుకోవచ్చు.

అన్నిటికీ పరమాత్మయే కారణం. పరహేతువాతడు. సర్వకార్యములందు ఫలప్రదాత అతడు.

కర్తృకర్మరూపములచే సర్వమూ రూపొందిస్తాడు. అతడే కర్త, అతడే కర్మ, అతడే క్రియ. ఆ క్రియయొక్క ఫలముకూడా అతడే! భోక్త అతడే! అన్నిటిలోనూ పూసలోనిదారంలా అతడే ఉంటాడు.

ఆ బ్రహ్మపేరే ప్రభువు, పిత, సర్వభూతుడు. అతడు అవ్యవము, నిత్యము, అజము అనే వర్ణములకు పాత్రుడై, అసంగుడై ఉంటాడు. అన్నింటిలోనూ ప్రవేశించి ఉండడంతప్ప, వానితో కలసి ఉండడం లేదు.

బ్రహ్మము, అక్షరము, నిత్యము అయినవాడు పురుషోత్తముడు. అతడి దయచేత రాగాదులు, సర్వ దోషములుకూడా నశిస్తాయి. ఈ ప్రకారంగా ప్రార్థనచేయటమే బ్రహ్మపారజపమని వర్ణన ఉంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment