శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 9
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 9 / Sri Lalitha Chaitanya Vijnanam - 490 - 494 - 9 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀
🍀 101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 9 🌻
లోపల వెలుపల అను భేదము దాటినవారే నిజమగు వీరులు. తాను యితరులు అను భేదము దాటినవారు వీరులు. వీరు మెలకువ, స్వప్నము, నిద్ర అను మూడు స్థితులే గాక, నాలుగవ స్థితి యగు తురీయ స్థితిని తెలిసినవారు. ఇట్టి వారిచే శ్రీమాత సృష్టి నిర్వహణము చేయుచు నుండును. వారికి వరములొసగి శక్తివంతులను జేసి కృతకృత్యులను చేయును. దివ్యాకర్షణ గల వాచక శక్తి గలవారిని కూడ వీరులందురు. వారు చేయు దివ్యబోధన ద్వారా జీవులుద్ధరింప బడుచుందురు. వారు బ్రహ్మ రసామృతమును పానము చేయుచు యితరులకు పంచి పెట్టుకొందురు. ఇట్టి వారిని కూడ శ్రీమాత అనుగ్రహించు చుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 485 to 494 - 9 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya
danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻
🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya
mahavirendra varada rakinyanba svarupini ॥ 101 ॥ 🌻
🌻 Description of Nos. 485 to 494 Names - 9 🌻
The real heroes are those who transcend the distinction between inside and outside. Those who transcend the distinction of self and others are heroes. They are aware of not only the three states of waking, dream and sleep, but also the fourth state of Turiya. Srimata manages the Creation through these people. She bestows boons on them and makes them powerful and accomplished. Those with divine attraction of oratory skills are also heroes. They uplift beings through divine teaching. They drink Brahma Rasamrita and distribute it to others. Srimata bestows her grace on such people too.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment