✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 04 🌴
04. అధిభూతం క్షరో భావ: పురుశ్చాధిదైవతం |
అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాం వర ||
🌷. తాత్పర్యం :
ఓ దేహధారులలో శ్రేష్టుడా ! నిరంతరము పరిణామశీలమైన భౌతికప్రకృతి అధిభూతమన బడును (భౌతికజగత్తు). సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండెడి విశ్వరూపమే అధిదైవతమనబడును. దేహదారుల హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండెడి దేవదేవుడైన నేనే అధియజ్ఞడును (యజ్ఞప్రభువును).
🌷. భాష్యము :
భౌతికప్రకృతి నిరంతర పరిణామశీలమై యుండును. పుట్టుట, పెరుగుట, కొంతకాలము నిలిచియుండుట, ఇతరదేహములను ఉత్పత్తి చేయుట, శిథిలమగుట, చివరికి నశించుట యను ఆరువిధములైన మార్పులకు భౌతికదేహములు లోనగుచుండును. అట్టి ఈ భౌతికప్రకృతియే “అధిభూతము” అనబడును. ఇది ఒక నిర్దిష్టమైన సమయమున సృష్టించబడి వేరొక నిర్దిష్ట సమయమున నశింపజేయబడును. సమస్తదేవతలను మరియు సమస్తలోకములను తన యందు కలిగియున్న శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమే “అధిదైవతము” అనబడును.
దేహమునందు ఆత్మతోపాటుగా శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యమైన పరమాత్మయు నిలిచియుండును. ఈ శ్లోకమునందు “ఏవ” అను పదము మిగుల ప్రధానమైనది. ఏలయన దాని ద్వారా శ్రీకృష్ణుడు తన కన్నను పరమాత్ము భిన్నుడు కాడని నొక్కి చెప్పుచున్నాడు. ఆత్మ చెంతనే నిలిచియుండెడి ఆ పరమాత్మయే జీవి కర్మలకు సాక్షిగా నుండి అతని వివిధస్వభావములకు కారణమై యున్నాడు. అనగా జీవుడు స్వతంత్రముగా వర్తించుటకు అవకాశమొసగుచు అతని కర్మలను పరమాత్ముడు సాక్షిగా గమనించుచుండును.
శ్రీకృష్ణభగవానుని వివిధరూపముల ఇట్టి సర్వకార్యములు దివ్యసేవలో నియుక్తడైన కృష్ణభక్తిభావనాయుతునికి అప్రయత్నముగా విదితము కాగలవు. “అధిదైవతము” అని పిలువబడు భగవానుని విశ్వరూపము ఆ దేవదేవుని పరమాత్మరూపమున ఎరుగలేని ఆరంభదశలో నున్న సాధకునిచే ద్యానింపబడుచుండును. కనుకనే అధోలోకములు పాదములుగా, సూర్యచంద్రులు నేత్రములుగా, శిరము ఊర్థ్వలోకములుగా పరిగిణింపబడు “విరాట్పురుషుని” (విశ్వరూపమును) ధ్యానము చేయుమని ఆరంభకునికి ఉపదేశించ బడుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 314 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 04 🌴
04. adhibhūtaṁ kṣaro bhāvaḥ puruṣaś cādhidaivatam
adhiyajño ’ham evātra dehe deha-bhṛtāṁ vara
🌷 Translation :
O best of the embodied beings, the physical nature, which is constantly changing, is called adhibhūta [the material manifestation]. The universal form of the Lord, which includes all the demigods, like those of the sun and moon, is called adhidaiva. And I, the Supreme Lord, represented as the Supersoul in the heart of every embodied being, am called adhiyajña [the Lord of sacrifice].
🌹 Purport :
The physical nature is constantly changing. Material bodies generally pass through six stages: they are born, they grow, they remain for some duration, they produce some by-products, they dwindle, and then they vanish. This physical nature is called adhibhūta. It is created at a certain point and will be annihilated at a certain point. The conception of the universal form of the Supreme Lord, which includes all the demigods and their different planets, is called adhidaivata.
And present in the body along with the individual soul is the Supersoul, a plenary representation of Lord Kṛṣṇa. The Supersoul is called the Paramātmā or adhiyajña and is situated in the heart. The word eva is particularly important in the context of this verse because by this word the Lord stresses that the Paramātmā is not different from Him.
The Supersoul, the Supreme Personality of Godhead, seated beside the individual soul, is the witness of the individual soul’s activities and is the source of the soul’s various types of consciousness. The Supersoul gives the individual soul an opportunity to act freely and witnesses his activities. The functions of all these different manifestations of the Supreme Lord automatically become clarified for the pure Kṛṣṇa conscious devotee engaged in transcendental service to the Lord. The gigantic universal form of the Lord called adhidaivata is contemplated by the neophyte who cannot approach the Supreme Lord in His manifestation as Supersoul.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment