నిర్మల ధ్యానాలు - ఓషో - 166
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 166 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఉనికి నించీ నువ్వు వేరయినట్లు భావించకు. కలువు. కలసిపో. కేవలం పరిశీలకుడిగా మాత్రమే వుండకు. మెల్ల మెల్లగా నువ్వు తలుపు తట్టడాన్ని నేర్చుకుంటావు. అనుభవంతో నువ్వు అనంతంలో కలిసిపోయి ఏకత్వాన్ని పొందడం అభ్యసిస్తావు. ఆ అనుభవమే దైవం. 🍀
కేవలం ఒక నదిలాగా సముద్రంలో కలిసి అదృశ్యమయిపో. దైవత్వంలో కలిసిపో. ఉనికి నించీ నువ్వు వేరయినట్లు భావించకు. కలువు. కలసిపో. మరింతగా. మనం ఎప్పుడూ వేరని అంటూ వుంటాం. అది మతానికి సంబంధించిన భావన కాదు. ప్రత్యేకతని, వేరు కావడాన్ని ఎత్తి చూపడం. కలయికని ఒత్తి చెప్పడం మతం. అది చైతన్యం నిండిన ప్రయత్నం. సూర్యాస్తమయాన్ని చూస్తే దాంట్లోకి అదృశ్యంకా.
కేవలం పరిశీలకుడిగా మాత్రమే వుండకు. పరిశీలింపబడేది, పరిశీలింపబడేవాడు ఒకటి కావాలి. మెల్ల మెల్లగా నువ్వు తలుపు తట్టడాన్ని నేర్చుకుంటావు. అప్పుడు చెట్టునానుకుని కూచుని చెట్టులో కలిసిపోయే అనుభూతిని పొందుతావు. ఈ చిన్ని విషయాల అనుభవంతో నువ్వు అనంతంలో కలిసిపోయి ఏకత్వాన్ని పొందడం అభ్యసిస్తావు. ఆ అనుభవమే దైవం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
17 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment