మైత్రేయ మహర్షి బోధనలు - 105
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 105 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 83. కృతజ్ఞత -2 🌻
సరాసరి దివ్యప్రేమను అనుసరించుట కుదరదు. ప్రతి స్వల్ప విషయములకు కూడ కృతజ్ఞతే సమాధానము కావలెను. అవి చిన్న సహాయము పొందినను గుర్తుంచుకొనుట ఒక సంస్కారము. మిక్కుట ముగ సహాయము పొంది గుర్తించనివారు పాషండులు. కృతజ్ఞతా భావమును మీ యందు పెంపొందించుకొనుడు.
శరీర మందలి అణువణువును కృతజ్ఞతతో నింపుడు. పంచభూతము లకు, పంచేంద్రియములకు, పంచ ప్రాణములకు, మనస్సునకు, బుద్ధికి, గ్రహతారకలకు, అంతరిక్ష దేవతలకు, పశుపక్ష్యాదులకు, సమస్త ప్రాణికోటికి కృతజ్ఞుడై యుండువాడే ప్రేమానుభూతిని పొందగలడు. అట్టి వాని నుండి ప్రేమ గంగాఝరి వలె ప్రవహించును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
17 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment