🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 218 / Sri Lalitha Chaitanya Vijnanam - 218 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖
🌻 218. 'మహారతి:' 🌻
అమితమైన రతి కలిగినది శ్రీమాత అని అర్థము.
మహేశ్వరుడు మహా యోగి. మహా తపస్వి. యోగులకు, తపస్వి జనులకు అతడే పరమగురువు. సృష్టియందు మొట్టమొదటగ తపస్సును ప్రారంభించినవా డతడే. సతతము పరతత్త్వమున లగ్నమై యున్న చేతస్కుడు మహాదేవుడు. అగ్ని శిఖవలె అతని చేతన మంతయూ ఊర్ధ్వమున కుండును.
అతని చేతన సృష్టియందు ప్రసరింప చేయవలెనన్నచో ఊర్ధ్వమార్గమున నున్న చేతనను ఇతర దిక్కులకు ప్రసరింప చేయవలెను కదా! అట్టి సమర్థత సృష్టియం దెవ్వరికినీ లేదు.
కాని శ్రీమాత కూడ తపస్వినియే యగుట చేత తన దీర్ఘకాల తపస్సు ద్వారా మహాదేవుని మెప్పించినది. మహాదేవుని సృష్టికామునిగ, మహాకామునిగ మరల్చినది. ఆమె కామేశ్వరియై మహాదేవునితో చేరి సర్వలోక సృష్టి నిర్మాణము గావించినది.
ఆమెకు సహకరించుచు మట్టి యందు కూడ నుండుటకు మహాదేవు డంగీకరించెను. ఎచ్చట శ్రీమాత యున్నదో, యుండునో అచ్చట శివుడు కూడ యుండును.
ఎచ్చట శివుడుండునో అచ్చట శ్రీమాత కూడ యుండును. ఒకరు లేక ఒకరు వుండుట యను ప్రశ్నయే లేదు. పరమునందైనను పదార్థము నందైననూ ఇరువురునూ యుందురు. రతి అను పదమునకు ఇది పరాకాష్ఠ. అందులకే ఆమె మహారతి.
శ్రీదేవి తన భక్తుల యెడల కూడ అట్టి అనురక్తియే కలిగి యుండి వారిని వీడక రక్షించుచుండును. శ్రీదేవి భక్తులు కూడ ఆమె యందు కల ప్రీతిచే సృష్టియం దేవిషయమును పట్టించుకొనరు.
ఇతర విషయములందు వారికి ప్రీతి యుండదు. సమస్తము నందును శ్రీమాత మాహాత్మ్యమును, వైభవమును దర్శించుచు ఆమెనే ఉపాసించుచూ అన్య చింతనలు లేక అభియుక్తులై యుందురు. వారికే మహారతి అను పదమునకు అర్థము తెలియును. రతి యనగా అనన్యమైన ఆసక్తియే గాని కేవలము పాశవిక కామము మాత్రమే కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 218 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mahā-ratiḥ महा-रतिः (218) 🌻
She gives immense happiness and delight to Her devotees. (rati means pleasure, enjoyment, delight in, fondness for).
This is possible because She has that kind of potential energy, full of happiness and delight. After all, She is the incarnation of auspiciousness. Her form, Her radiance, Her qualities, Her supreme care (being Śrī Mātā or the divine mother) all these lead to happiness when one cogitates Her sincerely.
There is also another reason for this. Śiva is known for His auspiciousness. His wife is also full of auspiciousness as She is always with Him. 998th nāma of this Sahasranāma is Śrī Śiva meaning auspiciousness. Nāma 53 is Śiva.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Feb 2021
No comments:
Post a Comment