🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 181 / Sri Lalitha Chaitanya Vijnanam - 181 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ‖ 49 ‖
🌻 181. 'మృత్యుమథనీ'🌻
భక్తుల యొక్క మృత్యువును నాశనము చేయునది శ్రీదేవి అని అర్థము.
మృత్యువును నాశనము చేయుట అనగా “నేను మరణింతును” అను అజ్ఞానపూరిత భావమును నశింపజేయును. దేహములు విడచుట మరణము కాదు. అది విరామమే. దుస్తులను మార్చుట వంటిది దేహములను విడచుట. నేను మరణింతును అన్న భావన జీవుని చిత్తవృత్తియందు పటిష్ఠమై యున్నది. అందువల్ల మరణానుభూతి కలుగును.
మహాభక్తులూ, పరమభక్తులూ కూడ దేహమును వదలి నారు కదా! తెలిసినవానికీ, తెలియనివానికీ కూడ మరణము లేదు. తెలియనివాడు తన భావనచేత మరణము ననుభవించును. తెలిసిన వాడు మరణమును మార్పుగా గ్రహించును.
మరణమనగా మార్పే అని సనత్సుజాతుడు ధృతరాష్ట్రునకు బోధించెను. లేని మరణము ఉన్నదనుకొని జీవుడు భయబ్రాంతుడగు చున్నాడు. మానవుని జీవితమంతయూ లేనివి ఉన్నట్లుగా ఊహించుచునే సాగిపోవును. అట్లే మరణము కూడ. ఇట్టి అజ్ఞాన నిర్మూలనము జ్ఞానానుభూతిచే కలుగును. అట్టి జ్ఞానమును అందించునది శ్రీదేవి అని అర్థము.
అంతియేకాని చివికి, చినిగిపోయి, కుళ్ళు కంపు కొట్టుచున్న దేహముననే ఉంచునని కాదు అర్థము. మృత్యుమథనీ అనగా “మృత్యువు” అను భావమును భక్తుల యందు నశింపజేయును.
రామ కృష్ణాదులకైననూ దేహవిసర్గన తప్పలేదు. వారు జ్ఞానులు కనుక మరణము ననుభవింపలేదు. అట్లే యోగులు, భక్తులు, సిద్ధులు కూడ. మృత్యువు రాకూడదని ప్రార్థన చేయరాదు. మృత్యు అనుభూతి లేక జ్ఞానానుభూతియే యొసంగమని ప్రార్థించవలెను.
“మృత్యోర్ము!” అనగా మృత్యుబంధము నుండి విడిపింపుమని అర్థము. బంధము లన్నియూ భావ బంధములే. మృత్యుభావ బంధమునుండి విడిపింపుమని మృత్యుంజయ మంత్రార్థము. 'మృత్యుమథనీ' అనిన కూడ అదే అర్థము.
మృత్యువు మూడు దశలలో ఉండునని తెలుపుదురు. ఒకటి భౌతికము. ఇది భౌతిక శరీరమును విడచుట, రెండవది సూక్ష్మము. ఇది సూక్ష్మ దేహమును వదలునపుడు కలుగునది. అప్పుడు ఇంద్రియ లోకములకు సంబంధించిన బంధములు తెగును. మూడవది కారణము. ఈ మృత్యువు కారణ శరీరమును విడచునపుడు కలుగునది. అట్టి వానికి భావబంధములు కూడ ఉండవు.
భావ బంధములు విసర్జించుట, ఇంద్రియ బంధములు విసర్జించుట, భౌతిక బంధములు విసర్జించుట, ఎవనికి జరుగునో అతడు మూడు మృత్యువులు దాటినవాడై, ముక్తుడై జీవించును, అట్టివానికి శరీరము లున్నప్పటికీ అతడు ముక్తుడే.
అది ఉన్ననూ లేకున్ననూ అతని కొకటియే.
మరియొక మాట. మృత్యువు దేహమునకు గాని జీవునకు కాదు. జీవాత్మ భావన పొందినవానికి, దేహాత్మ భావన సడలును. అపుడిక మృత్యువు లేదు. దేహమనగా కారణ, సూక్ష్మ, భౌతిక దేహములు కూడను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 181 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Mṛtyu-mathanī मृत्यु-मथनी (181) 🌻
She destroys the death of Her devotees. Mṛtyu means death. Only someone without death alone can give the boon of deathlessness.
Death also means rebirth. She does not allow Her devotees to be reborn. This means that She destroys the karma-s of Her devotees.
Devotee does not mean a person who performs rituals. One who is able to identify himself with Her is called a devotee and this stage can be attained only by perpetual meditation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
16 Jan 2021
No comments:
Post a Comment