🌹. మనోశక్తి - Mind Power - 77 🌹
Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. Q 73 :-- Code language (కోడ్ లాంగ్వేజ్) 🌻
Ans :--
1) onion కి అనేక పొరలున్నట్లే మన దేహం కూడా అనేక పొరలను కలిగి ఉంది.
ఇప్పుడు మనం ఏ దేహాన్ని కలిగి ఉన్నా స్త్రీగాగాని, పురుషుడుగగాని గతజన్మలకు సంబందించిన దేహాలు ఆ జన్మలలో పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం కోడ్ లాంగ్వేజ్ అనగా విద్యుదయస్కాంత శక్తి రూపంలో అంతర్ శక్తిలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. మనం ఆ దేహాలను ఆ కోడ్ లాంగ్వేజ్ ని అంతరేంద్రియాల ద్వారా దర్శించే వీలుంది.
2) ఇప్పుడు మనం ధరించి ఉన్న దేహం యొక్క genetic నిర్మాణం గత జన్మల్లో మనం సంపాదించిన ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి ఉంటుంది. మన దేహంలోని జీవకణాలన్నీ అనేకానేక జన్మల్లో పొందిన జ్ఞానాన్నంతటిని కోడ్ లాంగ్వేజ్ రూపంలో దాచుకుని ఉన్నాయి.
3) ఉల్లిపాయను గమనిద్దాం, ఉపరితలం లో ఉన్న పొర మాత్రమే మనకు కనిపిస్తుంది. లోపల పొరలు కనిపించవు. ఉల్లిపాయకు ఉన్న ప్రతి పొరలో విద్యుదయస్కాంత శక్తి,జీవరసాయినిక శక్తి ఉండటం వల్ల ఉల్లిపాయకు ఒక ఆకారం ఏర్పడింది. ఉల్లిపాయకు గల రుచి,దాని ఘాటు వాసనలు దానిలో ఉన్న చైతన్య శక్తి వల్ల వచ్చింది.
అలాగే వర్తమానంలో మనకు దేహం మాత్రమే కనిపిస్తుంది. మిగతా అనేకానేక జన్మలలోని దేహాలు అదృశ్యపొరలు వలె మన దేహంలోనే ఇమిడి వున్నాయి .ఈ దేహాలన్నీ చైతన్య శక్తి ద్వారా అనుసంధానింపబడి ఉన్నాయి.
4) అనేకానేక జన్మల్లో ధరించిన దేహాలు ఆధ్యాత్మిక జ్ఞానం చైతన్య పరిణామం అంతా ఆత్మశక్తి కి వారసత్వంగా సంక్రమిస్తుంది.
5) మనం అనారోగ్యం తో ఉన్నామనుకోండి,గత జన్మలో మన ఆరోగ్యకరమైన దేహం యొక్క జెనెటిక్ కోడ్ లాంగ్వేజ్ ని ప్రస్తుత దేహంలోకి చొప్పించి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
6) ఈ జన్మలో మనకు ధైర్యం లేదనుకోండి,గత జన్మలో ధైర్యవంతుడిగా మనం పొందిన అనుభవాల ద్వారా ధైర్యాన్ని మనకు మనమే ప్రాప్తించుకోవచ్చు.
7) ఈ కోడ్ లాంగ్వేజ్ transfer చేసుకోవడానికి స్వప్నాలు,అంతర్ ప్రపంచం మనకు ఉపయోగపడతాయి.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment