🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 338 / Sri Lalitha Chaitanya Vijnanam - 338 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।
విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀
🌻 338. 'వేదజననీ' 🌻
వేదములకు తల్లి శ్రీదేవి అని అర్థము. వేద మనగా ఏది తెలిసినచో ఇక తెలియవలసిన దేమియు ఉండదో అది వేదము. అనగా పూర్ణజ్ఞానము. తెలియుటకు తెలివి వలయును. తెలివి చైతన్యము నుండి పుట్టినది. మేల్కాంచిన వెనుకనే తెలివి పనిచేయును. నే మేల్కాంచిన వెనుకనే నేనున్నానని తెలియును. ఇట్లు మేల్కాంచుటకు చైతన్య మాధారము. చైతన్యము తత్త్వము యొక్క వ్యక్తస్థితి. అట్టి వ్యక్త స్థితి నుండి జీవులు పుట్టుదురు. వారి యందును ఉండుట, చైతన్యవంతులగుట జరుగుచుండును. చైతన్యవంతమైనపుడే నేనున్నానని తెలియును. తానున్నానని తెలిసినవాడే తన పరిసరము లను, సృష్టిని కూడా తెలియుటకు ప్రయత్నించును. తెలివి ఆధారము గనే తెలియుట జరుగును.
తెలుసుకొనువాడు, తెలుసుకొను విషయము, తెలుసుకొనుట అను కార్యము- మూడును కలిపి జ్ఞానము. తెలుసుకొను వాడు తెలియుట యందు నిమగ్నమై తెలియబడు విషయమున కరగును. అపుడు జ్ఞానమే తానుగ నున్నాడని తెలియును. చైతన్యమే తానుగ నున్నాడని తెలియును. తా నొకడు ప్రత్యేకముగా నున్నాడను భావము తొలగును. ఉన్నదంతయూ సత్ చిత్ లే అని తెలియును. ఇట్లు వేదము తెలియును. అది తెలియబడుటకు శుద్ధ చైతన్యమగు శ్రీమాతయే ఆధారము. ఆమెయే తెలియు వానికి, అతని యందలి తెలివికి, తెలియ వలెనను ఆసక్తికి, తెలియబడు విషయమునకు మూలము, పుట్టినిల్లు కనుక ఆమెయే వేదమాత. ఆమెయే 'వేదజనని'.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 338 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini
Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻
🌻 338. Veda-jananī वेद-जननी (338) 🌻
Creator of Veda-s. Literally this can be explained as ‘She gave birth to Veda-s’. Veda-s originated from the Brahman in the form of sound. This sound was realized by the ancient sages and taught to their disciples orally. Only in the recent past, Veda-s are made available in textual forms. More than the text, the orthoepy is important in Veda-s and any wrong recitals or wrong notes (svara) leads to undesired results. This was the reason for teaching Veda-s orally. Veda-s originate from Śabda Brahman (śabda means sound).
Muṇḍaka Upaniṣad (I.i.5) gives a different interpretation. “There are two categories of knowledge, secular or aparā and spiritual or parā. Aparā comprises of four Veda-s, phonetics, rituals, grammar, etymology, metre and astronomy. But parā is that by which one knows the Brahman, which is ever the same and never decays.”
But, Bṛhadāraṇyaka Upaniṣad (II.iv.10) puts this in a different perspective. “Rig Veda, Yajur Veda, Sāma Veda, Atharva Veda, history, mythology, arts, Upaniṣads, pithy verses, aphorisms, elucidations and explanations are like the breath of this infinite Reality. They are like the breath of this Supreme Self.”
Puruṣa-sūktam gives yet another interpretation. It says that ‘the Veda-s originated from sarvahuta yajñā that was conducted by gods and great sages, invoking Puruṣa as the lord of this fire ritual. This Puruṣa is called the Brahman, from whom the Veda-s originated.
Even though the interpretations are different, all of them concur that the Veda-s or its subtle form sound, originated from the Supreme.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 Jan 2022
No comments:
Post a Comment