విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 540 / Vishnu Sahasranama Contemplation - 540
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 540 / Vishnu Sahasranama Contemplation - 540 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻540. సుషేణః, सुषेणः, Suṣeṇaḥ🌻
ఓం సుషేణాయ నమః | ॐ सुषेणाय नमः | OM Suṣeṇāya namaḥ
సుషేణః, सुषेणः, Suṣeṇaḥ
శ్రీవిష్ణోశ్శోభనా సేనా విద్యతే హి గణాత్మికా ।
యస్ససోఽయం సుషేణ ఇత్యుచ్యతే విదుషాం వరైః ॥
పార్షద గణ రూపమగు అనగా 'సు' లేదా శోభనమైన సేన గలవాడు అను విగ్రహమున సుషేణ శబ్దము విష్ణువును బోధించును.
:: పోతన భాగవతము ద్వితీయ స్కంధము ::
వ.మఱియు ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండును సునంద నందకుముదాది సేవితుండును బ్రకృతిపురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును గర్మేంద్రియ జ్ఞానేంద్రియమనో మహాభూతంబులను షోడశ శక్తులును బంచతన్మాత్రంబులునుం బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభా విక సమస్తైశ్వర్యాతిశయుండునునై స్వస్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానందకందళిత హృదయారవిందుడును, రోమాంచకంచుకిత శరీరుండును, ఆనందబాష్పధారాసిక్త కపోలుండును నగుచు. (238)
అమూల్యమైన మణిమయ సింహాసనంలో కూర్చున్నవాడూ; సునందుడు, నందుడు, కుముదుడు మొదలైన పార్షదుల సేవలు గైకొనుచున్నవాడూ; ప్రకృతి, పురుషుడు, మహతత్త్వము, అహంకారము అనే నాలుగు శక్తులూ; వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే పంచ కర్మేంద్రియాలూ; శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనే పంచ జ్ఞానేంద్రియాలూ; మనస్సూ; పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే పంచభూతాలూ - ఈ పదునారు శక్తులూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రలూ తనచుట్టూ చేరి కొలుస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో భాసించేవాడూ; ఇతరులకు లభ్యం కానివీ, తనకు మాత్రమే స్వభావసిద్ధమైనవీ అయిన సకలైశ్వర్యాలతో ప్రకాశించేవాడూ; నిజస్వరూపంలోనే వినోదించేవాడూ, అంతటికీ అదినాథుడు, పరమపురుషుడు, పరమశ్రేష్ఠుడు, పద్మాక్షుడూ అయిన నారాయణుడిని బ్రహ్మ దేవుడు చూసినాడు. ఆయన హృదయపద్మము అమితానందముతో వికసించినది. ఆయన శరీరం గగుర్పాటు చెందినది. ఆయన చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో ఆర్ద్రములైనాయి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 540 🌹
📚. Prasad Bharadwaj
🌻540. Suṣeṇaḥ🌻
OM Suṣeṇāya namaḥ
श्रीविष्णोश्शोभना सेना विद्यते हि गणात्मिका ।
यस्ससोऽयं सुषेण इत्युच्यते विदुषां वरैः ॥
Śrīviṣṇośśobhanā senā vidyate hi gaṇātmikā,
Yassaso’yaṃ suṣeṇa ityucyate viduṣāṃ varaiḥ.
He who possesses the auspicious groups of senas or armies of the form of gaṇas. So Lord Viṣṇu is Suṣeṇaḥ.
:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे नवमोऽध्यायः ::
ददर्श तत्राखिलसात्वतां पतिं श्रियः पतिं यज्ञपतिं जगत्पतिम् ।
सुनन्दनन्दप्रबलार्हणादिभिः स्वपार्षदाग्रैः परिसेवितं विभुम् ॥ १४ ॥
Śrīmad Bhāgavata - Canto 2, Chapter 9
Dadarśa tatrākhilasātvatāṃ patiṃ śriyaḥ patiṃ yajñapatiṃ jagatpatim,
Sunandanandaprabalārhaṇādibhiḥ svapārṣadāgraiḥ parisēvitaṃ vibhum. 14.
Lord Brahmā saw Him in the Vaikuntha, who is the Lord of the entire devotee community, the Lord of the goddess of fortune, the Lord of all sacrifices, and the Lord of the universe, and who is served by the foremost servitors like Nanda, Sunanda, Prabala and Arhana, His immediate associates.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महावराहो गोविन्दस्सुषेणः कनकाङ्गदी ।
गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः ॥ ५८ ॥
మహావరాహో గోవిన్దస్సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః ॥ 58 ॥
Mahāvarāho govindassuṣeṇaḥ kanakāṅgadī,
Guhyo gabhīro gahano guptaścakragadādharaḥ ॥ 58 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
13 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment