🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ఎనిమిదో అధ్యాయము
🌻. గర్భో త్పత్త్యాది కథనము - 10 🌻
హా కాంతే ! హాధనం! పుత్రాః - క్రంద మానః సుదారుణమ్,
మాండూక ఇవ సర్పేణ - మ్రుత్యువా నీయతే నరః 56
మర్మ సూన్యథ్య మానే షు - ముచ్యమానే షు సంధిషు
యద్దు:ఖం మ్రియమాణస్య - స్మర్యతాంతన్ము ముక్షుభి: 57
దృష్టా వాక్షి ప్యమాణాయాం - సంజ్ఞ యా హ్రియమాణయా,
మృత్యు పాశేన బద్ధ స్య - త్రాతా నైనో పలభ్యతే 58
సంరుధ్య మాన స్తమసా - మహ చ్చిత్త మివా విశన్,
ఉపహూత స్తా జ్ఞాతీ - నీక్షతే దీన చక్షుషా 59
అయఃపాశేన కాలేన - స్నేహపాశేన బంధుభి:
ఆత్మావం కృష్య మాణం త - మీక్షతే పరి త స్తథా 60
ఓసి ప్రియురాలా! ఓ విత్తమా! ఓయీ! మిత్రురాలా! అని సంబోధిస్తూ భయంకరముగా దుఃఖిస్తూ మానవుడు కప్పను పామువలె మృత్యువు చేత కొనపోబడును.
మర్మ స్థానములు ప్రాణవాయువుతో వీడి పోవుచుండగా కరచరణాదుల సంధులు వీడిపోగా మరణము బొందువాని దుఃఖము వర్ణించుట యసాధ్యము కావున మొక్షే చ గ్భలవారి చేత సర్వదా పరమాత్ముడు స్మరింపబడు గాక.
యమకింకరుల చేత దృష్టి యాకర్షింపబడి చైతన్యమును కోల్పోయి మృత్యుపాశముతో బంధింపబడిన వాడిని కాపాడు వాడుండడు. (కనుక అన్ని విపత్తులబారి నుండి రక్షించు పరమాత్ముని ఎల్లప్పుడూ స్మరించవలెను).
అజ్ఞానముచేత బిలువబడిన ఆసన్న మరణుడు గొప్ప జ్ఞానమును బొందిన పగిది, బంధువులచేత బిలువబడి దీనత్వముగల చూపులతో, అందరిని అవలోకించును. (మాట్లాడు శక్తిలేమి చేత చూపుతోనే తృప్తి నొందును) యముని లోహపుత్రాడుతో గట్టబడిన వాడై, బంధువుల ప్రేమ త్రాటిచేత నిరువిపులా లాగాబడుచున్న యాత్మను చూచుచుండును. అల్లాంటప్పుడు జ్ఞానమును ప్రతిఫలము నిచ్చునది. భగవద్ద్యాన మొక్కటే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 64 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 10 🌻
O sweetheart! O my wealth! O dear friends! Like this a human cries out for help while being gobbled by the death as like as a frog cries in the clasp of a snake.
The pain and suffering which a human experiences at the time when his Pranas start leaving him, that pain can't be expressed in words.
One who remains filled with desire for liberation, he remembers the Paramatma always.
No one exists who protects one from the noose of Yama's attendants (therefore one should always remember the Paramatma who protects from every agony).
The ignorant one dies a pathetic death. He calls out the relatives for help, looks at everyone with a pitiful eyes to satisfy himself when the speech abandons him.
In order to avoid such suffering only way is knowledge and only remembrance of the divinity gives the fruition.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం ##శివగీత #SivaGita
16 Sep 2020
No comments:
Post a Comment