భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 112


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 112   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. అరుణి మహర్షి - 4 🌻

21. గ్రోధం అంటే మర్రిచెట్టు. దాని కాయలను పగులగోడితే అందులో గింజలుటాయి. మరి గింజను పగులకొడితే ఏముంటుంది? ఆ గింజలో ఏమీ ఉండదు. అది భేదించబడి నప్పుడు ఏమీ ఉండదు. కాని అందులో ఆ మహావృక్షం యొక్క సూక్ష్మ రూపం ఉంది. అలాగే ఆ పరమాత్మయొక్క సూక్షమమైన బీజమందు ఇంత జగత్తూ ఇమిడిఉంది.

22. కాబట్టి నీవు దానిని భేదించటం సాధ్యపడదు. దానిని ఎవరూ భేదించలేరు. వీటన్నిటికీ మూలమైన ఒకానొక వస్తువన్నదనే జ్ఞానం – ఆ ఒక్కటీ ఏదో నీకు తెలియనక్కరలేదు- దానిని గురించిన ధ్యానమే నీకు తపస్సు అవుతుంది. అంటే తెలిసున్న వస్తువుగురించి ధ్యానము సులభమే. తెలియని వస్తువును గురించిన ధ్యానం కష్టం.

23. మనకు తెలిసినవాళ్ళు దూరదేశంలో ఉంటే, వాళ్ళను గురించి మనస్సులో భావనచేస్తాము, వారు మనకు తెలుసు కాబట్టి. విష్ణుధ్యానం చెయ్యమంటే, ఆయనను ఎవరు చూచారు? ఆయన ఎలా ఉంటాడు? ఎవరో పెద్దలు, ఆశ్రమవాసులు ఈ రూపంలో ఉంటాడు ఇట్లా ధ్యానం చెయ్యమని చెప్పారు.

24. జగత్తులో ఉండే వైవిధ్యాన్ని గుర్తించే ఈ బుద్ధి, ఇంద్రియముల సాయం తోటే మనస్సు అక్కడికి వెళ్ళుతుంది. అయినప్పటికీ ఏ ప్రకారంగా బోధించబడిందో ఆ వస్తువును అలాగ స్వయంగా చూడగలిగిన శక్తి దానికిలేదు.

25. కానీ అలా చేసినవాళ్ళు ఈ స్థితిలో అనుగ్రహంపొంది ఆ దర్శనం పొందుతున్నారు. ఇది ఎవరి శక్తి? ఇది మనోబుద్ధులయొక్క శక్తికాదు. దానిని అన్వేషిస్తూ వెళ్ళేవాడికి అదే ఎదురొచ్చి అనుగ్రహించి దర్శనమిచ్చే లక్షణము దానియందున్నది.

26. ఆ ఈశ్వరానుగ్రహంమీద ఆధారపడి తపస్సు ఫలించవలసిందే తప్ప, తపస్సుచేసేవాడి సమర్థతే అక్కడ లేదు. కాబట్టి ఆ కల్యాణ గుణం దానియందున్నది అనే భావనతో తపస్సు చేస్తే, పరమాత్మవస్తువు నీకు దర్శనం అవుతుంది.

27. తండ్రికి ఉండవలసింది మమకారం కాదు, వాత్సల్యం. వాత్సల్యంలో మోహం ఉండదు, ప్రేమ ఉంటుంది. ప్రేమవల్ల పిల్లలు మంచిమార్గంలో వెళతారు. కానీ మన కుండే మోహం వలన వాళ్ళు బాగుపడరు.

28. ప్రేమ పవిత్రమైనది. మోహమే బంధనము. మోహము తండ్రీకొడుకులిద్దరినీ దుఃఖంలో ముంచుతుంది. దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది మోహం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020

No comments:

Post a Comment