నిర్మల ధ్యానాలు - ఓషో - 208
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 208 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. సత్యాన్ని సృష్టించాల్సిన పని లేదు. దాన్ని కనిపెట్టాలి. కారణం అది అప్పటికే మన దగ్గరుంది. కానీ ఆ విషయం గురించి మనకు స్పష్టత లేదు. మనం మరింత చురుగ్గా, మరింత చైతన్యవంతంగా మారాలి. 🍀
ప్రతి మనిషీ తన అస్తిత్వంతో బాటు సత్యాన్ని వెంట తెచ్చుకుంటాడు. సత్యాన్ని సృష్టించాల్సిన పని లేదు. దాన్ని కనిపెట్టాలి. లేదా తిరిగి కనిపెట్టాలి. కారణం అది అప్పటికే మన దగ్గరుంది. మనలో వుంది. కానీ ఆ విషయం గురించి మనకు స్పష్టత లేదు. మనం నిద్రలోకి జారుకుని ఆ విషయమే మరిచిపోయాం. మనం దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవాలి. మనం మరింత చురుగ్గా, మరింత చైతన్యవంతంగా మారాలి. ఏదీ కోల్పోలేదు. నువ్వు నిద్రలో వున్నావు. అంటే నువ్వు బిచ్చగాడినని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు బిచ్చగాడివి కావు.
ఒకసారి నువ్వు నిద్రలేస్తే, మత్తు వదిలించుకుంటే నువ్వెంత పనికిమాలిన కలగన్నావో తెలుసుకుని ఆశ్చర్యపోతావు. నీలో గొప్ప నిధులున్నాయి. నీది శాశ్వతమయిన జీవితం. దేవుని రాజ్యం నీలో వుంది. అంతిమ సత్యం నీదే. అది మనతో బాటు మనం వెంట తెచ్చుకున్నది. మనమే అది! కాబట్టి యిది ఎక్కడో అన్వేషించాల్సింది, వెతకాల్సింది కాదు. నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించి నువ్వు మేలుకోవాలి. అంతే!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jul 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment