శ్రీ మదగ్ని మహాపురాణము - 190 / Agni Maha Purana - 190
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 190 / Agni Maha Purana - 190 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 58
🌻. స్నపనాది విధానము - 2 🌻
శల్పికి ద్రవ్యమునిచ్చి సంతోషపరచవలెను. గురువునకు గోదానమీయవలెను. "చిత్రందేవానామ్" ఇత్యాది మంత్రము పఠించుచు ప్రతిమనేత్రములను తెరవవలెను. "అగ్నిర్జ్యోతిః" ఇత్యాది మంత్రముచే దృష్టిసంచారము చేయవలెను. ప్రతిమను భద్రపీఠముపై నుంచి ఆచార్యుడు తెల్లని పుష్పములు, నెయ్యి, ఆవాలు, దూర్వలు, కుశలు దేవత శిరస్సుపై ఉంచవలెను.
"మధువాతా" ఇత్యాది మంత్రముచే నేత్రములందు అంజనము ఉంచివలెను. ఆ సమయమున "హిరణ్యగర్భః" "ఇమంమేవరుణః" ఇత్యాది మంత్రములు పఠింపవలెను. ఘృతవతీ ఇత్యాది ఋక్క పఠించుచు ఘృతము శరీరమునకు పూయవలెను. శనగపిండితో నలిచి "అతోదేవాః" ఇత్యాది మంత్రము పఠింపవలెను. "సప్తతే అగ్నే" ఇత్యాది మంత్రము పఠించి గర్భజలముతో ప్రతిమను కడగవలెను. "ద్రువదాదివ" ఇత్యాది మంత్రముచే అను లేపనము, ఆపోహిష్ఠామ" ఇత్యాది మంత్రముచే అభిషేకము చేయవలెను. అభిషేకానంతరము నదీ-తీర్థజలములచే స్నానము చేయించి, 'పావమానీ' ఋక్కు పఠించుచు రత్నస్పర్శగల ఉదకముతో స్నానము చేయింపవలెను.
"సముద్రం గచ్ఛస్వాహా" ఇత్యాది మంత్రము చదువుచు తీర్థ మృత్తికచేత, కలశజలము చేతనుస్నానము చేయించవలెను. "శంనోదేవీః" ఇత్యాది మంత్రముగాయత్రీమంత్రము పఠించుచు వేడినీళ్ళతో స్నానము చేయించవలెను. "హిరణ్యగర్భః" ఇత్యాది మంత్రములచే పంచవిధ మృత్తికలతో స్నానము చేయించవలెను. పిమ్మట "ఇమంమేగంగేయమునే" ఇత్యాది మంత్రముచే ఇసుక కలిపిన జలముచేతను, "తద్విష్ణోః పరమంపదమ్" అను మంత్రముతో పుట్టమట్టి కలిపిన ఉదకము చేతను, పూర్ణ ఘటముతో స్నానము చేయించవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 190 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 58
🌻Consecration of the idol (snāna) - 2 🌻
7. The sculptor should be satisfied by offering articles (of present). A cow should be given as gift to the priest. Then the eyes of the idol should be made open with (the recitation of) the syllable citraṃ deva.[3]
8. The sight should be endowed with (the recitation of the syllable) agnir jyoti.[4] Then white flowers, ghee and mustard seeds should be placed on the pedestal.
9. The priest should place dūrvā grass and tips of kuśa grass on the head of the deity. Then the priest should anoint the eyes (of the deity) with the syllables madhu vātā.[5]
10. The syllables hiraṇyagarbha and imam me should be recited. Then the idol should be anointed with ghee reciting (the hymn) ghṛtavatā.[6]
11. The flour paste of masūra (a variety of grain) should be rubbed on the deity reciting (the hymn) ato devā.[7] Then the priest should wash (the deity) with hot water with the recitation of) sapta te agne[8].
12. It should be anointed with (the syllables) Urupadādiva. (The image) should be bathed [i.e., snāna] with (the waters of) the rivers and sacred places with (the syllables) āpo hi ṣṭḥā[9] and with the (waters containing) gems (with the) pāvamāna.
13. (The image) (should be bathed) with the waters of an earthern pot with (the syllable) samudraṃ gaccha[10]. It should be consecrated with śanno devī[11] and bathed with hot water (consecrated) by gāyatrī.
14. The supreme god should be bathed with five (kinds of) earth with (the syllable) hiraṇya. With pot made of earth of an anthill and sand waters and (the syllable) imam me[12] (it should be bathed).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment