శ్రీ మదగ్ని మహాపురాణము - 71


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వతో భద్ర మండల విధి - 4 🌻

చత్వార్యన్తర్బహిర్ద్వే తు శోభార్థం పరిమృజ్య తు | ఉపద్వారప్రసిద్ధ్యర్థం త్రీణ్యన్తః పఞ్చ బాహ్యతః. 37

పరిమృజ్య తథా శోభాం పూర్వవత్పరికల్పయేత్‌ | వహ్నికోణషు సప్తాన్తస్త్రీణి కోష్ఠాని మార్జయేత్‌. 38

పఞ్చవింశతికవ్యూహే పరం బ్రహ్మ యజేచ్ఛుభీ | మధ్యే పూర్వాదితః పద్మే వాసుదేవాదయః క్రమాత్‌. 39

వరాహం పూజయిత్వా చ పూర్వపద్మే తతః క్రమాత్‌ | వ్యూహాన్‌ సంపూజయేత్తావద్యావత్‌ షట్త్రింశగో భవేత్‌. 40

యథోక్తం వ్యూహ మఖిలమేకస్మన్‌ పఙ్కజే క్రమాత్‌ | యష్టవ్యమితి యత్నేన ప్రచేతా మన్యతే7ధ్వరమ్‌. 41

సత్యస్తు మూర్తిభేదేన విభక్తం మన్యతే 7చ్యుతమ్‌ | చత్వారింశత్కరం క్షేత్రం హ్యుత్తరం విభజేత్ర్కమాత్‌. 42

ఏకైకం సప్తధా భూయస్తథైకైకం ద్విధా పునః | చతుష్షష్ట్యుత్తరం సప్తశతాన్యేకసహస్రకమ్‌. 43

కోష్ఠకానాం భద్రకం చ మధ్యే షోడశకోష్ఠకైః | పార్శ్వే వీథీం తతశ్చాభద్రాణ్యథ చ వీథికామ్‌. 44

షోడశాబ్జాన్యథో వీథీ చతుర్వింశతిపఙ్కజమ్‌ | వీథీపద్మాని ద్వాత్రింశత్‌ పఙ్త్కివీథిజకాన్యథ. 45

చత్వారింశత్తతో వీథీశేషపఙ్త్కిత్రయేణ చ | ద్వారశోభోపశోభాః స్యుర్దిక్షు మధ్యే విలోప్య చ. 46

ద్విచతుష్షడ్ద్వారసిద్ధ్యై చతుర్దిక్షు విలోపయేత్‌ | పఞ్చత్రీణ్యకకం బాహ్యే శోభోపద్వారసిద్ధయే. 47

ద్వారాణాం పార్శ్వయోరన్తః షడ్వా చత్వారి మధ్యతః | ద్వే ద్వే లుప్యే దేవమేవ షడ్‌ భవన్త్యుపశోభికాః. 48

ఏకస్యాం దిశి సఙ్ఖ్యాః స్యుశ్చతస్రః పరిసంఖ్యయా | ఏకైకస్యాం దిశి త్రీణి ద్వారాణ్యపి భవన్త్యుత. 49

పఞ్చ పఞ్చ చ కోణషు పఙ్త్కౌ పఙ్త్కౌ క్రమాత్సృజేత్‌ | కోష్ఠకాని భవేదేవం మర్త్యేష్టం మణ్డలం శుభమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సర్వతోభద్రమణ్డలాది విధిర్నామోనత్రింశోధ్యాయః.

మరల, శోభానిర్మాణమునకై లోపల నున్న నాలుగు కోష్ఠములను, వెలుపల నున్న రెండు కోష్ఠములను తుడిచి వేయవలెను. పిమ్మట ఉపద్వారము లేర్పడుటకై లోపల నున్న మూడు కోష్ఠములను, వెలుపలనున్న ఐదు కోష్ఠములను తుడిచివేయవలెను.

పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింపవలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ఠములను, లోపలనున్న మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతి వ్యూహమండలము లోపల నున్న కమలకర్ణికపై పరమాత్మను పూజింపవలెను.

మరల తూర్పు మొదలైన దిక్కులలో నున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున నున్న కమలముపై భగవంతుడగు వారహమూర్తిని పూజించి క్రమముగా ఇరువదిఐదువ్యూహముల పూజచేయవలెను.

ఇరువదియారవ తత్త్వమైన పరమాత్మునిపూజ సంపన్నమగువరకును ఈ క్రమముజరుగవలెను. ఒకేమండలముపై అన్ని వ్యూహముల పూజనుక్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తిభేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వము నందు భేదమేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేరువేరుగా చేయవలెను.

నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్కదానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్కదానిని మూడేసి భాగములు చేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను.

ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువదినాలుగు (1764) కోష్ఠకము ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీథి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారుదలములు కమలమును వీథినినిర్మింపవలెను.

పిమ్మట క్రమముగ ఇరువదినాలుగు దలముల కమలము వీథి ముప్పదిరెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడుపంక్తులచే ద్వారములు, శోభలు ఉపశోభలు, నిర్మింపవలెను.

సర్వదిశల మధ్యభాగమునందు ద్వారసిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కొష్ఠకములు తుడిచివేయవలెను. దానిబాహ్యభాగమునందు శోభా-ఉపద్వారము లేర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచివేయవలెను.

ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగా ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్య నున్న రెండు రెండు కోష్ఠములు కూడ తుడిచివేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును.

ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములను ఉండును. కోణములలో ఒక్కొక్క పంక్తిలోని ఐదేసి కోష్ఠముల విడువవలెను. అవి కోణము లగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండల మేర్పడునున.

అగ్నేయమహాపురాణమునందు సర్వతోభద్రమండలాది విధి యను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment