🌹 . శ్రీ శివ మహా పురాణము - 200 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
44. అధ్యాయము - 19
🌻. శివునితో కుబేరుని మైత్రి - 2 🌻
ఆయమేవ వరో నాథ యత్త్వం సాక్షాన్నిరీక్ష్యసే | కిమన్యేన వరేణశ నమస్తే శశిశేఖర || 14
ఇతి తద్వచనం శ్రుత్వా దేవదేవ ఉమాపతిః | దదౌ దర్శన సామర్ధ్యం సృష్ట్వా పాణితలేన తమ్ || 15
ప్రసార్య నయనే పూర్వముమామేవ వ్యలోకయత్ | తతోSసౌ యాజ్ఞదత్తిస్తు తత్సామర్థ్య మవాప్య చ || 16
నాథా! నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుటయే నేను కోరే వరము. ఈశా! ఇతర వరములతో పనియేమి? ఓ చంద్రశేఖరా! నీకు నమస్కారమగు గాక! (14).
దేవదేవుడగు పార్వతీపతి ఈ మాటను విని, ఆతనిని అరచేతితో స్పృశించి, చూడగలిగే శక్తిని ఇచ్చెను (15).
యజ్ఞదత్త కుమారుడగు ఆ కుబేరుడు చూడగలిగే శక్తిని పొంది, కన్నులను తెరచి, ముందుగా పార్వతీ దేవిని చూచెను (16).
శంభోస్సమీపే కా యోషిదేషా సర్వాంగ సుందరీ | ఆనయా కిం తపస్తప్తం మమాపి తపసోsధికమ్ || 17
అహో రూపమహో ప్రేమ సౌభాగ్యం శ్రీ రహో భృశమ్ | ఇత్యావాదీదసౌ పుత్రో ముహుర్మహురతీవ హి || 18
క్రూరదృగ్వీక్షతే యావత్పునః పునరిదం వదన్ | తావత్పుస్ఫోట తన్నేత్రం వామం వామావిలోకనాత్ || 19
అథ దేవ్య బ్రవీద్దేవ కిమసౌ దుష్టతాపనః | అసకృద్వీక్ష్య మాం వక్తి కురు త్వం మే తపః ప్రభామ్ || 20
అసకృద్వీక్షణనాక్‌ష్ణా పునర్మామేవ పశ్యతి | అసూయ మానో మే రూపప్రేమ సౌభాగ్య సంపదా || 21
శంభుని సమీపములో సర్వాంగ సుందరియగు ఈ యువతి ఎవరు? ఈమె ఎట్టి తపస్సును చేసినదో? నా కంటె అధికమైన తపస్సును చేసినది (17).
అహో!ఏమి రూపము! అహో! ఏమి ప్రేమ! ఏమి సౌభాగ్యము! ఏమి శోభ! ఇట్లు కుబేరుడు మరల మరల పలుకుచు అతిగా ప్రవర్తించెను (18).
ఇట్లు పలుకుచూ క్రూరమగు చూపులతో ఆమెను చూచుటచే, అతని ఎడమ నేత్రము పగిలిపోయెను (19).
అపుడా దేవి దేవునితో నిట్లనెను. ఏమి ఇది? ఈ దుష్టతాపసుడు అదే పనిగా నన్ను చూచి మాటలాడుచున్నాడు. నాతపశ్శక్తిని వీనికి తెలుపుడు జేయుము (20).
మరల మరల నన్నే చూచుచున్నాడు. నా రూపమును, ప్రేమను, సౌభాగ్యమును, సంపదను చూచి అసూయపడుచున్నాడు (21).
ఇతి దేవీగిరం శ్రుత్వా ప్రహస్య ప్రాహ తాం ప్రభుః | ఉమే త్వదీయః పుత్రోసౌ న చ క్రూరేణ చక్షుషా|| 22
సంపశ్యతి తపోలక్ష్మీం తవ కిం త్వధి వర్ణయేత్ | ఇతి దేవీం సమాభాష్య తమీశః పునరబ్రవీత్ || 23
వరాన్ దదామి తే వత్స తపాసానేన తోషితః | నిధీనామథ నాథస్త్వం గుహ్యకానాం భవేశ్వరః || 24
యక్షాణాం కిన్నరాణాం చ రాజ్ఞాం రాజా చ సువ్రతః | పతిః పుణ్యజనానాం చ సర్వేషాం ధనదో భవ || 25
దేవి యొక్క ఈ మాటలను విని శివప్రభువు చిరునవ్వుతో ఆమెతో నిట్లనెను. ఉమా! ఈతడు నీ కుమారుడు. ఈతడు నిన్ను క్రూరదృష్టితో చూచుటలేదు (22).
పైగా నీతపస్సంపదను వర్ణించుచున్నాడు. ఇట్లు దేవితో పలికి ఈశుడు మరల కుబేరునితో నిట్లనెను (23).
వత్సా! నీ తపస్సును నేను మెచ్చితిని. నీకు వరములనిచ్చెదను. నీవు నిధులకు నాథుడవు అగుము. గుహ్యకులకు ప్రభువ అగుదువు (24).
యక్షులకు, కిన్నరులకు, రాజలకు రాజువై వ్రతములననుష్ఠించుము. పుణ్యాత్ములకు ప్రభువు అగుదవు. అందరికీ నీవే ధనమును ఇచ్చెదవు (25).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment