మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 84


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 84 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 సాధన- సమిష్టి జీవనము - 5 🌻


తమకూ, తోటివారికీ నడుమ విభజన రేఖ గీచే ఏ అంశమునయినా మరవగలగాలి, సమిష్టి జీవన‌ మాధుర్యంలో తమను తామే మరవగలగాలి. అపుడే‌ దివ్యానంద స్పర్శ‌ అందుతుంది.

ఇంకో విషయము. ఆధునిక యువత చాలా వరకు ఇంగిత జ్ఞానంతో కన్నా, ఉద్వేగాలకు, ఆవేశాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ముఖ్యకారణము తల్లిదండ్రులు, మానవుల గుండె లోతుల్ని తడిమి రసప్లావితం చేయగల కావ్యాలను వారికి అందింపలేక పోవడమే. సాధకులు అనుదినమూ రామాయణ భారత‌ భాగవతాది కావ్యపఠనము విధిగా అవలంభించాలి.

రానున్న శతాబ్దములలో సమిష్టి జీవనం అన్ని సరిహద్దులను చెరపేసి విస్తరిస్తుంది. ఇది పరమగురువుల ప్రణాళిక. దీనికి అనుగుణముగా సాగలేనివారే వెనుకబడిపోతారు. క్రొత్తవారు చేరతారు అంతే.


....✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹


21 Sep 2021

No comments:

Post a Comment