దేవాపి మహర్షి బోధనలు - 25

🌹. దేవాపి మహర్షి బోధనలు - 25 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌻 16. వృషభము  - వాక్కు🌻

ప్రతి అణువు పరిణామములో ఒక సూర్యమండలము కాగలదు. ప్రతి జీవుడును అటులనే పరిణామ క్రమమున అనగా పరమపదము చేరుకొను మార్గమున ఒక బ్రహ్మాండ శరీరమును ధరించగలడు. నిజమునకు విశ్వమంతయు ఏకాక్షరము నుండి ఉద్భవించినదియే కదా! పరమపదము నుండి ఉద్భవించిన వాక్కు ఈ సమస్త విశ్వ నిర్మాణమునకు ఆధారమై నిలచియున్నది. దీనినే దివ్యసం ని కూడ నిర్వచింతురు. 

దీని పంచాంగములే పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచేంద్రియములు మరియు కర్మేంద్రియములు.  పై తెలుపబడిన నాలుగు పంచకములను వాక్కుయే అధిష్ఠించి యుండును. దీనినే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి స్థితులని తెలుపుదరు. పంచాంగముగ నేర్పడిన సృష్టికి అధిష్టాన దేవత సరస్వతి లేక వాక్కుయే. ప్రవహించునది కావున సరస్వతి యనిరి. వాక్కును వృషభముగ కూడ పేర్కొనిరి. 

మనయందు ఈ వృషభము కంఠధ్వని రూపమున వ్యక్తమగుచున్నది. కంఠధ్వనిని సమర్థవంతముగ, శ్రావ్యముగ, పవిత్రముగ నిర్వర్తించుకొనువారు తమ జీవనమును పునర్ నిర్మాణమును చేసుకొనగలరు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

07 Feb 2021

No comments:

Post a Comment