సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ‖ 52 ‖
🌻 202. 'సర్వేశ్వరీ' 🌻
సకలమునకు ఈశ్వరి శ్రీదేవి అని అర్థము.
సృష్టి యందు సర్వమూ శ్రీదేవి అధీనముననే యున్నది. సృష్టి చైతన్యము శ్రీదేవియే. అన్ని జీవరాశులయందు ఆమె చైతన్యమే విరాజిల్లుతూ నున్నది. త్రిగుణములుగాని పంచభూతములు గాని తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలవు.
అట్లే జీవులు కూడ తమకు తాముగా ఏమియూ నిర్వర్తింపజాలరు. జీవులయందు ఇచ్చగాని, జ్ఞానముకాని, క్రియాశక్తిగాని పనిచేయుటకు వారి యందున్న చైతన్యమే ఆధారము. చేతన లేనప్పుడు జీవునికి తనకు తా నున్నాడని కూడ తెలియదు. అందరి యందు, అన్నిటి యందు తానుండి, ఆయా ధర్మములను నిర్వర్తించు శక్తిగా శ్రీదేవియే యున్నది.
ఇది ఆమె ఈశ్వరత్వము. ఉప్పు ఉప్పగా నుండుట, వేప చేదుగ నుండుట, నిమ్మ పులుపుగ నుండుట, తేనె తీపిగ నుండుట యందు కూడ శ్రీదేవి అస్థిత్వము దర్శింప వచ్చును. ఇట్లందరి జీవుల సమస్త చేష్టలకు ఆధారముగా నున్నది శ్రీదేవి. సృష్టి యందు సమస్తమునకు ఆమె ఈశ్వరి. ఆమెకు ఈశ్వరుడాయన. ఆయన (ఈశ్వరుడు) కూడ కనుపింపవలె నన్నచో ఆమెయే ఆధారము. ఆమె లేని ఆయన జగత్తునకు లేడు. ఆయన లేక ఆమె ఏమియూ చేయలేదు. నిజమునకు ఆమె ఆయన ఒకటియే.
కనిపించునపు డామె యగును, సంకల్పించినపుడు ఆయన యగును. ఏమీ సంకల్పించని స్థితిలో కేవలము తానుగ నుండును, ఆ తాను ఆమె కాదు, ఆయన కాదు. రెండునూ ఏకము చెందిన స్థితి. ఆ ఏకత్వము నుండి తాను అస్థిత్వము (ఆయన)గను, చేతన (ఆమె)గను ఏర్పడుదురు. ఇవి రెండును అవిభాజకములు.
అందు వలననే సర్వేశ్వరి, సర్వేశ్వరుడని సంబోధింతురు. సత్, చిలు లేనిచో ఏమియూ లేదు. కావున వారిదే ఈశ్వరత్వము. ఈశ్వరత్వ మనగా అన్నిటి యందునూ అస్థిత్వముగను, చైతన్యముగను వశించి స్వామిత్వమును నెరపుట.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 202 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Sarveśvarī सर्वेश्वरी (202) 🌻
She is the supreme ruler of the universe and leads the beings to the Brahman as discussed in the previous nāma. Ruler is the one who is concerned about his citizens. She has no superior or equal as discussed in nāma 198. Hence She is the Supreme ruler.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
07 Feb 2021
No comments:
Post a Comment