శ్రీ మదగ్ని మహాపురాణము - 125 / Agni Maha Purana - 125
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 125 / Agni Maha Purana - 125 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 39
🌻. విష్ణ్వాది దేవతా ప్రతిష్ఠకై భూపరిగ్రహము - 2🌻
దేవతా విగ్రహమును నగరాభిముఖముగ స్థాపింపవలెను; దేవతల పృష్ఠభాగము నగరము వైపు ఉండగూడదు. దేవాలయ నిర్మాణమును కురుక్షేత్రగయాది తీర్థస్థానములందు గాని, నదీసమీపమునందు గాని చేయవలెను. బ్రహ్మాలయమును నగర మధ్యమునందు, ఇంద్రాలయమును నగరమునకు తూర్పునను నిర్మించిన ఉత్తమ మని చెప్పబడినది.
అగ్నిదేవునకు, మాతృకలకును ఆగ్నేయదిక్కునందును, భూతగణములకు యుమధర్మరాజునకును దక్షిణమునను, చండికా - పితృగణ-దైత్యాదులకు నైరృతిదిక్కునందును, వరణునకు పశ్చిమమునందును, వాయుదేవునకు, నాగులకు వాయవ్యదిక్కునందును, యక్షులకులేదాకుబేరునకు ఉత్తరమునందును చండీశమహేశునకు ఈశాన్యమునందును, ఆలయమును నిర్మింపవలెను.
విష్ణ్వాలయము అన్ని దిక్కులందును నిర్మింపవచ్చును. బుద్ధిమంతుడెన్నడును, పూర్వమునుంచియు ఉన్న దేవాలయమున చిన్నది చేసి చిన్న దేవాలయమును గాని, సమానమైనదానిని గాని, విశాలమైనదానిని గాని నిర్మింపరాదు, ఏదైన ఒక దేవాలయమునకు సమీపమున దేవాలయమును నిర్మించునపుడు రెండు దేవాలయముల మొత్తము ఎత్తుకు రెట్టింపు సీమాప్రదేశము విడచి నూతనదేవాలయమును నిర్మింపవలెను. విద్వాంసుడు రెండు దేవాలయములకును పీడ కలుగకుండు నట్లు చూడవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 125 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 39
🌻 Preparations of ground for constructing temples - 2 🌻
9. Even though deficient in all characteristics he who is a. master of the tantras is (to be looked upon as) the preceptor. The image of the deity should be placed facing the city and never turned backwards.
10. At Kurukṣetra, Gayā and other places and near the rivers, (the image of) Brahmā at the centre of the city and (the image of) Indra on the east are auspicious.
11-12. (The images) of Agni, mothers, goblins, and Yama (should be placed) in the south-east. (The images) of Caṇḍikā (should be placed) in the south and those of the manes and demons in the south-west. The temples ofVaruṇa and others should be built in the west. (The images) of Vāyu and Nāga (serpent) (should be) on the north-west and those of Yakṣa and Guha (Kārttikeya) on the north.
13-15. (Those) of Caṇḍīśa (the lord of Caṇḍī), the great lord and Viṣṇu (are) always (placed) in the north-east. One should not knowingly construct a temple of a reduced size or equal in size or bigger in size than another temple already constructed so as to encroach upon it. A wise-man would leave between them a space measuring twice the elevation and erect a new temple without affecting both the temples. After having examined the ground one has to take possession of it.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment