నిత్య ప్రజ్ఞా సందేశములు - 07 - 7. మార్పు అనేది . . . / DAILY WISDOM - 07 - 7. Change is . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 07 / DAILY WISDOM - 07 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 7. మార్పు అనేది అసత్యం యొక్క లక్షణం 🌻


మార్పు అనేది అసత్యం యొక్క లక్షణం. సత్యం అనేది స్వీయ-సంతృప్తి కలిగివున్నది, స్వయం-అస్తిత్వం కలిగివున్నది, నిర్ద్వంద్వమైనది, ప్రశాంతత మరియు పూర్తిగా పరిపూర్ణమైనది అని ఉపనిషత్తులు నొక్కి చెబుతున్నాయి. ఉపనిషత్తులు చైతన్యం అంతర్ముఖం అయ్యి అనంతానికి విస్తరించడానికి దోహదపడతాయి.

ఈ విషయంలో ఉపనిషత్తులు చాలా మార్మికమైనవి. మార్మికత అంటే అహెతుకత కలిగివుంటుందని లేదా విపరీత భావనలు కలిగి ఉంటాయని అని అపార్థం చేసుకోకూడదు. ఉపనిషత్తుల యొక్క మార్మికత ఏంటంటే అవి మీలో కేవలం ఒక భావోద్వేగానికి దారితీయకుండా మీ చైతన్యాన్ని అంచెలంచెలుగా మీ మనస్సును, బుద్ధిని దాటించి ఉన్నత చైతన్యంతో ఏకీకృతం చేయడం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 7 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda, 📚. Prasad Bharadwaj

🌻 7. Change is the Quality of Untruth 🌻


Change is the quality of untruth and the Upanishads assert that Reality is Self-satisfied, Self-existent, non-dual, tranquil and utterly perfect. An appeal to the inwardness of consciousness expanded into limitlessness is the burden of the song of the Upanishads.

In this respect the Upanishads are extremely mystic, if mysticism does not carry with it an idea of irrationalism or a madness of spirit. The transcendental mysticism of the Upanishads is not the effect of an emotional outburst, but a calm transcendence of intellect and reason through a development into the integral consciousness.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment