1-July-2020 Messages

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
1) శ్రీమద్భగవద్గీత - 414 / Bhagavad-Gita - 414
2) శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 202 / Sripada Srivallabha Charithamrutham - 202
3) మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 83
4) The Masters of Wisdom - The Journey Inside - 106 
5) శ్రీ ఆర్యా ద్విశతి - 66
6) దాశరధి శతకము - పద్య స్వరూపం - 45 / Dasarathi Satakam - 45
7)  నారద భక్తి సూత్రాలు - 22
8) సాధనా చతుష్టయ సంపత్తి - ముముక్షత్వము
9) సౌందర్య లహరి - 29 / Soundarya Lahari - 29 
10) శ్రీమద్భగవద్గీత - 328 / Bhagavad-Gita - 328
11) 
12) 
13) 
14) 
15) 
16) 
17)  
18) 
19) 
20) 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీమద్భగవద్గీత - 414 / Bhagavad-Gita - 414 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 22 🌴

22. రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గన్ధర్వయక్షాసురసిద్ధఙ్ఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||

🌷. తాత్పర్యం : 
పరమశివుని పలుమారులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీకుమారులు, మరత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు.

🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 414 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 22 🌴

22. rudrādityā vasavo ye ca sādhyā
viśve ’śvinau marutaś coṣmapāś ca
gandharva-yakṣāsura-siddha-saṅghā
vīkṣante tvāṁ vismitāś caiva sarve

🌷 Translation : 
All the various manifestations of Lord Śiva, the Ādityas, the Vasus, the Sādhyas, the Viśvedevas, the two Aśvīs, the Maruts, the forefathers, the Gandharvas, the Yakṣas, the Asuras and the perfected demigods are beholding You in wonder.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 202 / Sripada Srivallabha Charithamrutham - 202 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 32
 
🌻. నరసింహరాయల ఆతిథ్యం (కాళీమాత) (శ్రీపాదులకుకు 12 ఏళ్ళు) 🌻 

పుత్తడిబొమ్మ రమణి మమ్మల్ని శ్రీపాదులు పీఠికాపురం పోయి రమ్మని ఆదేశించారు. మేము కృష్ణ ఈవలి ఒడ్డు చేరి ఆ రోజున ఒక బండమీద శ్రీచరణుల పాదముద్రలను చూసి ఎంతగానో ఆనందం, ఆశ్చర్యం చెందాము. వారు సూర్యనమస్కారాలు ఆ బండ మీద నిల్చొని చేసేవారు. 

మేము వెళ్ళుతుండగా పంచదేవ్పహాడ్లో ఒక జొన్నచేను యజమాని సాదరంగా మమ్మల్ని పిలిచి చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. తరువాత తన అనుభవాలని మాతో పంచుకున్నారు, “నా పేరు నరసింహ రాయడు. 

నా చిన్నతనంలోనే తల్లితండ్రులు పోవడంతో మేనమామ నన్ను పెంచారు. మా మేనత్త గయ్యాళి, దురాశ ఎక్కువ. వారి కూతురు రమణి. పేరుకు తగ్గట్టుగా అందము, సౌశీల్యం మేళవించి ఉన్న పుత్తడి బొమ్మ. రమణి తన దగ్గర ఉన్నఒక కృష్ణ విగ్రహాన్ని పూజిస్తూ ఉండేది. 

రమణికి ఎన్నో పెళ్ళి సంబంధాలు వస్తుండేవి, కాని మా రమణికి నన్ను చేసుకోవాలని ఉండేది. నాకు పని ఎక్కువ, ఆహారం తక్కువ అవడంవల్ల అసలే దుర్బలు డను, ఇంకా బలహీనంగాను పిరికివాడిగాను తయార య్యాను. కుహనా సాధువు రాక ఒకసారి మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చాడు. 

అతడు మా మేనత్తను మాయమాటలతో లోబరచుకొని కాళిమాత పూజ చేయాలని దాని వల్ల పెద్ద నిధి దొరుకుతుందని చెప్పాడు. రమణి ఎంత మొత్తుకుంటున్నా వినకుండా మొదటి పనిగా మా రమణి పూజ చేసే కృష్ణ విగ్రహాన్ని పారేసాడు. 

రోజూ కోళ్ళు బలి ఇవ్వడం, వాటి రక్తంతోను, ఇంకా కొన్ని విచిత్ర స్మశాన పరికరాలతోను పూజగది అంతా నానా భీభత్సంగా ఉండేది. రమణిలో కాళీమాత ప్రవే శించిందని చెప్పి ఆమెకు అన్నం బదులు రక్తం తాగడానికి ఇస్తుండేవాడు. 

ఇల్లంతా స్మశానంలా ఉండేది. ఆ సాధువుకి వశీకరణం కూడా తెలుసు. రమణి మీద వశీ కరణ ప్రయోగం చేసి దుష్ట సంకల్పంతో ఒక అర్థరాత్రి మా రమణిని సమీపించాడు. 

మా రమణి బిగ్గరగా అరిచి ఇనుప వస్తువుతో అతని తలమీద కొట్టింది. తన వశీకరణం ఎలా విఫలం అయ్యిందో వాడికి తెలియలేదు. దత్తుల కరుణ మర్నాడు పొద్దున ఒక బ్రాహ్మణ బిచ్చగాడు మా ఇంటికి వచ్చాడు. 

అప్పటి మా మనస్థితులను బట్టి ఒకరు మా ఇంట్లో భూతప్రేతాలే ఉన్నాయని, కేవలం దరిద్రమే ఉన్న దని, అస్తవ్యస్త పరిస్థితులే ఉన్నాయని కావాలంటే అవి తీసుకొని వెళ్ళమని చెప్పాము. ఆయన అన్నింటికి సరే అన్నారు. నేను నా వెండి తాయెత్తు ఇచ్చాను. ఆ దొంగ సాధువు కపాలం భిక్షగా తీసుకొని పొమ్మని ఎగతాళి చేసాడు. 

ఇంతలో మా ఇంట్లో కళ్ళు జిగేల్ అనేటట్లు ఓ దివ్య ప్రకాశం కనిపించింది. ఒక కిరణం రమణిలో ఒకటి నాలో ప్రవేశించింది. రమణి స్వస్థురాలయింది, నేను బలశాలిని, ధైర్యవంతుడను అయ్యాను. మా అత్తకు పక్షవాతం వచ్చింది. 

మాంత్రికుడి నోటిలోనుండి రక్తధారలు వచ్చి వాడి శక్తులన్ని హరించుకు పోయాయి. తరువాత ఆ దివ్య ప్రకాశం మానవరూపం ధరించింది. ఆ దివ్య భవ్య స్వరూపం ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీపాద శ్రీవల్లభుల వారిదే. 

నిజానికి కాళీమాత ధ్వంసం చేసేది సాధకునిలో ఉన్న కామం, క్రోధం మొదలైన దుష్టశక్తులను అని, ఆమె కోళ్ళు, మేకలు కోరదని, ప్రాణమయ జగత్తులో ఉన్న రాక్షస శక్తులు కాళికా రూపం ధరించి మేము ఫలానా దేవతలం అని అసత్యాలు చెప్పుతూ క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తూ బలులు కోరుతాయని శ్రీపాదులు మాతో చెప్పారు. 

ఈ ప్రేతాత్మలు ఆయా దేవతా రూపాలను ధరించగలుగుతాయే కాని ఆ దేవతా శక్తులు మాత్రం వాటికి ఉండవు అని కూడా స్పష్టంగా చెప్పారు. తరువాత ప్రభువులు మా మేనత్తను అనుగ్రహించి ఆమెను స్వస్థురాలిని చేసారు. స్వయంగా వారే దగ్గరుండి రమణితో నా వివాహం జరిపించారు. 

అపుడు వారి వయసు 12 సంవత్సరములని చెప్పి ఆ రోజు వారు మాకు ఇచ్చిన అక్షితలు ఇవే అంటూ కొన్ని అక్షతలు చూపించి కాలాం తరంలో ధర్మగుప్తులు, శంకరభట్టు వస్తారని వారికి ఇవ్వ మని శ్రీపాదులు తనను ఆదేశించారని చెప్పి మాకు కొన్ని అక్షతలు ఇచ్చారు. 

ఆహా! శ్రీవల్లభులు ఎంతటి లీలామయ అవతార స్వరూపులు!      

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.                      

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 202 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 9 🌴

🌻 Vissavadhanulu born as thorny bush due to sinful Karmas - 3 🌻

This Vissavadhanulu was born in ‘Gautama’ gothra. That is the only relation between Gautama Maharshi and Vissavadhanulu.  

This is a very meager debt relation. Gautama Maharshi also took part in the ‘savithru kathakachayanam’ done in this same Peethikapuram. Vissavadhanulu was not only born in Peethikapuram by luck but he also got My darshan which was extremely difficult to get.  

The time has come to prove that Sri Datta can grant higher states with his causeless affection even on undeserving persons. As a result of all those reasons, this incident had happened. If there is no debt relation, even a dog will not come to you.  

So, if any one comes to you for help, you help him if possible. If not possible, you tell him about your inability to help, politely. But don’t show arrogance.  

If you show your arrogance, I will also show my arrogance on you, because I am the one present inside all beings.  

If you are truth, the world is truth, this creation is truth, then it is the same truth that I am the root cause for all this. 

 I am the parama satyam (the ultimate truth) which is the truth of all the truths. In Vedas also it was said ‘satyam jnanam anantham brahma’. Thus He explained. 

I was looking stunned. Pleasure tears were flowing on the cheeks of Bapanarya. Sripada wiped the tears from grandfather’s cheeks with his little hands and said, ‘Thatha, these days, you have always been in My dhyana. Your life is fulfilled. 

 I will take the avathar of Nrusimha Saraswathi exactly in your form. This is true.’ He put his hand in Bapanarya’s hand as if promising. Bapanarya asked Sripada, ‘a doubt has been there in my mind for a long time.  

Shall I ask?’ Immediately Sripada said smiling, ‘Thatha! How can a doubt be there for a person of your caliber? How can I clear it being a boy of only ten years? Still I will try. You can ask.’ Is is true that Brahma, Vishnu, Maheswar do the creation, Bapanarya Sripada Bapanarya annihilation? Yes Is is t sustainance and rue that Saraswathi, Laxmi and Parvathi are the forms of their Shakti? 

Sripada : yes
Bapanarya : Is it true that it is Adipara Shakti which created these three 'Murthis' and three Shaktis. 

Sripada : yes
Bapanarya : In that case, who are you?

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 83 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 *సాధన- సమిష్టి జీవనము - 4* 🌻

సాధకులు ఆత్మవంచనకు పాల్పడరాదు. తాము తప్పు చేస్తే, ఎవరు చెప్పినా సర్దుకోవడానికి సిద్ధమయితే తమకే మంచిది. ఎవరు చెప్పారని కాదు, ఏమి చెప్పారనేది ముఖ్యము. అంతేకాని, తమ తప్పు తెలిసి కూడ, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, ఇతరులపై తప్పురుద్దటం మానుకోవాలి. 

అసలు‌ సంగతేమిటంటే, ఒక వ్యవహారంలో ఏంచేయాలి అనే అంశం ఎన్నివేల మంది సాధకులు కూర్చుండి గురువును ప్రార్థించినా ఒకటే సమాధానం తట్టుతుంది, సమర్పణ ఉంటే, సమిష్టి జీవన ప్రాధాన్యాన్ని గూర్చి కేకలు వేస్తూ, నినాదాలు ఇచ్చేవారు‌ గూడ తద్భిన్నంగా వర్తిస్తుంటారు. 

తోటి సాధకులతో గలసి పనిచేయాలంటే, ఒక్కోసారి అనేక మనోవికారాలు అడ్డు వస్తుంటాయి. తోటివారు ఎంతటి గుణసంపన్నులు, సేవానిమగ్నులు, పరిశుద్ధలయినా‌సరే, తమ కన్న పాండిత్యంలో, విజ్ఞానంలో లేదా సమాజంలో,‌ ప్రసిద్ధిలో, వయస్సులో, కులములో తక్కువవారనే‌ భావంతో‌ వారితో‌ కలిసి‌ పనిచేయాడానికి‌ అతిశయం‌ అడ్డువస్తూ‌ ఉంటుంది. తమ అతిశయాన్ని వెల్లడించలేక, అవతలివారి యందు దోషాలను ఎన్నడమూ జరుగుతూ ఉంటుంది. 

ఇంకా కొందరు తమ ఇంట్లో పూజలు, కార్యక్రమాలు జరిగినపుడు‌ ఉత్సాహంగా, చురుకుగా పాల్గొంటారు. తోటి సాధకుల ఇండ్లలో అవి ఏర్పాటయితే నీరుగారి పోతారు, యాంత్రికంగా పాల్గొంటారు లేదా అసలు పాల్గొనరు.

తమకూ, తోటివారికీ నడుమ విభజన రేఖ గీచే ఏ అంశమునయినా మరవగలగాలి, సమిష్టి జీవన‌ మాధుర్యంలో తమను తామే మరవగలగాలి. అపుడే‌ దివ్యానంద స్పర్శ‌ అందుతుంది..
....✍ *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹 The Masters of Wisdom - The Journey Inside - 106 🌹
🌴 The Aquarian AGE - 2 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Descent of the Aquarian Energy - 1 🌻

Towards the end of the 19th century, Madame Blavatsky foresaw that at the beginning of the 20th century an energy would come to uplift humanity and to usher in the Age of Aquarius. 

Some of her followers then prepared Jiddu Krishnamurti as a pure instrument for receiving the energy. But the Divine had other plans. 

The descending energy was so strong; the higher circles decided that the energy could only be received by the Agastya Ashram. 

Agastya, the Master of the Nilagiri Mountains, also called Master Jupiter, always came to the rescue of the Hierarchy in situations of crisis. And it was decided that the energy would touch the planet in Kumbhakonam (temple city in the state of Tamil Nadu, India). 

The name of the place means 'Aquarius Angle'. There is an Adi Kumbeswara Temple, and the lake where the energy entered is still considered very sacred today.

Master CVV, an advanced disciple of Agastya, was chosen to receive the energy. 

He decided to be born in the same place that the Aquarian Energy had visited before. He was born in Kumbhakonam in 1868, 42 years before the descent of the Energy. 

Until the descent, he led the life of a Raja Yogi, full of splendour and fulfilment. He knew that the energy was touching the earth and that he would receive this energy.

At the midnight of March 31, 1910, when the tail of Halley's comet touched the earth, there was a strong thunderclap over Kumbhakonam and the energies struck the Master's house like a mighty lightning bolt. He sat awake in the antechamber of the house, ready to receive the energy of the comet. 

The energy penetrated him and was absorbed by him. This is not possible for a normal person.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: K.P. Kumar: The Aquarian Master. Div. seminar notes/ E. Krishnamacharya: Spiritual Astrology.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 66 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II ఆర్యా ద్విశతి - 131వ శ్లోకము II 🌻

తదుపరి విపులే ధిష్ణ్యే
తరళదృశ స్తరుణ కోకనద భాసః I
కామాకర్షిణ్యాద్యాః
కలయే దేవీః కలాధర శిఖణ్డాః II 131 II

🌻 II ఆర్యా ద్విశతి - 132వ శ్లోకము II 🌻 

(సప్తమ పర్వము - సర్వసంక్షోభణ చక్రస్థిత గుప్తతరయోగినీ ధ్యానము)

తస్యోపరి మణిఫలకే తామ్రాంభోరుహదళప్రభాశోణాః I
ధ్యాయామ్యనంగకుసుమాప్రముఖా దేవీశ్చ విధృతకూర్పాసాః II ౧౩౨

🌻. తాత్పర్యము : 
తస్యోపరి - దానికి మీద (సర్వాశాపరిపూరక చక్రమునకు పైన), మణిఫలకే - మణిపీఠము నందు, తామ్రాంభోరుహ - ఎఱ్ఱని తామరల యొక్క, దళప్రభా - రేకుల కాంతి వలె, శోణాః - ఎఱ్ఱనివారును, విధృతకూర్పాసాః - రవికలు తొడిగినవారునూ అగు, అనంగకుసుమప్రముఖాః - అనంగకుసుమ మొదలగు గుప్తతర యోగినులు అని పేరుగల, దేవీ - దేవతలను (శక్తులను), ధ్యాయామి - ధ్యానించుచున్నాను !!

సర్వాశాపరిపూరకచక్రమునకు పై భాగమున మణిపీఠము నందు ఎఱ్ఱని తామరరేకుల కాంతి వలె ఉన్నవారును, రవికలు ధరించినవారు అయిన అనంగకుసుమ మొదలగు గుప్తతర యోగినీ దేవతలను ధ్యానించుచున్నాను !!

🌻. వివరణ :
సర్వాశాపరిపూరక చక్రమునకు పైన సర్వసంక్షోభణ చక్రము గలదు. ఇది సప్తమపర్వము. దీని యందు అనంగకుసుమాదేవి మొదలగు గుప్తతర పేరుగల ఎనిమిది మంది శక్తులు నివసింతురు. వీరికి అధిష్ఠానదేవత త్రిపురసుందరీదేవి. 

సప్తమేపర్వణికృతవాసా గుప్తతరాభిదాః I
అనంగశక్తయస్త్వష్టౌ తాసాం నామానిమచ్ఛృణు I
అనంగకుసుమానంగమేఖలా చ ద్వితీయకా I
అనంగమదనానంగ మదనాతురయా సహా I 
అనంగరేఖాచానంగవేగానంగాంకుశాపి చ I
అనంగమాలిన్యపరా ఏతాదేవ్యో జపాత్విషః II (లలితోపాఖ్యానము 24వ అధ్యాయము, 25-27 శ్లోకములు)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 45 / Dasarathi Satakam - 45 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 89వ పద్యము : 
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
నీ భార్య లక్ష్మీదేవి సకల సంపదలనొసగును. నీ పుత్రిక గంగాదేవి సమస్త పాపములను తొలగించును. మీ కుమారుడు, సృష్టికర్తయైన బ్రహ్మ ఆయుర్దాయమునిచ్చును. నిన్నే కోరి భజించిన ప్రయోజనములుకలుగవే.

🌻. 90వ పద్యము : 
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస
త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
తామరాకుపై నీటి బొట్టువలె బురదలో నివసించు కుమ్మరి పురుగుకు బురద అంటని మాదిరిగా మానవుడు జనక రాజర్షివలె సంసారియయ్యును విరాగివలె నుండవలెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 45 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 89th Poem : 
nIsati pekku galmuliDanErpari, lOka makalmaShaMbugA 
nIsuta sEyu pAvanamu nirmita kAryadhurINa dakShuDai 
nIsutuDiccu nAyuvulu ninna BajiMcina galgakuMDunE 
dAsulakIpsitArthamulu dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
Your consort Lakshmi bestows riches on people. Your daughter Ganga sanctifies the world. Your son Brahma discharges his duties as creator efficiently. With this kind of family background it is only to be expected that you will fulfill the desires of your devotees.

🌻 90th Poem : 
vArijapatramaMdiDina vArividhaMbuna vartanIyamaM 
dAraya roMpilOna danu vaMTani kummaripurvurIti saM 
sAramunan melaMgucu vicAraguDaiparamoMdugAde sa 
tkAra merxiMgi mAnavuDu dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
Just like a water drop on the leaf of a lotus, like the Kummari insect which dwells in mud but is devoid of mud on its skin, if a person lives with detachment he will surely attain Moksha.Just like a water drop on the leaf of a lotus, like the Kummari insect which dwells in mud but is devoid of mud on its skin, if a person lives with detachment he will surely attain Moksha.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. నారద భక్తి సూత్రాలు - 22 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 13

🌻 13. అన్యథా పావిత్య్ర శంకయా 🌻

       శాస్త్రాలను మార్చడం అనేది పరాభక్తుని బుద్ధిననుసరించి జరుగదు. 

ఒకవేళ అతడొక మేధావిగా శాస్త్రాల నభ్యసించి ఏవేవి మార్పులు చేస్తే బాగుంటుందని ఆలోచించి నిర్ణయిస్తే, అతడు పతనం చెందుతాడు. అది శాస్త్ర రక్షణ కానేరదు. 

స్వానుభవపూర్వకంగా ఉన్న దానినే అవసరమైనప్పుడు పరాభక్తుడి ద్వారా ఆ మార్పు చేస్తున్నట్లు అతడికి కూడా తెలియకుండానే లోక కళ్యాణార్థము జరిగేది శాస్త్ర రక్షణ. 

ఇది దైవీ ప్రేరణ వల్ల జరిగేది. బోధించే గురువులంతా, ఈ సత్యాన్ని గ్రహించి వర్తించాలని తెలియ చేస్తున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. సాధనా చతుష్టయ సంపత్తి - ముముక్షత్వము 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ముముక్షత్వము అనగా మోక్షమందు ఆపేక్ష కలిగి ఉండుట. 🌻

మోక్షమందు ఆపేక్ష ఎప్పుడు కలుగుతుంది?

సంసారము నందు కలుగు దుఃఖములచే బాధించబడినపుడు.
అప్పుడు సంసారము వలన కలుగు దుఃఖములను పోగొట్టుకొను మార్గము చెప్పు సద్గురువు ఎక్కడ దొరకునా అని ప్రయత్నించును. ఇదే మోక్షమందు ఆపేక్ష కలుగుట.

మోక్షము అంటే ఏమిటి?
మోక్షము అంటే నేను అసంత్రుప్తుడను , అసంపూర్ణుడను అను భావన నుండి విముక్తి.

నేను ఆత్మ స్వరూపుడను , నేను పరిపూర్ణుడను అను జ్ఞానము కలుగుట వలన మాత్రామే ఈ విముక్తి సాధ్యము.

మోక్షమందు ఆపేక్ష లేక ముముక్షత్వము జిజ్ఞాసగా, తనను తానూ తెలుసుకోవాలి అనే కోరికగా మారినప్పుడు అది సద్గురువు దగ్గరకు నడిపిస్తుంది.

సద్గురువు వలన ఆత్మ జ్ఞానము తెలసికొనుట ద్వారా అహంకారము మొదలుకొని స్తూల దేహము వరకు ప్రతి దశలోను తాధాత్మ్యత చెందుట వలన బంధము కలుగుచున్నది, ఇదే సమస్త దుఃఖములకు మూలము అని గ్రహిస్తాడు.

 స్వస్వరూపం గుర్తించుట ద్వారా అజ్ఞానము చేత కల్పించబడిన బంధములను తోలగించుకోవాలి అనే కోరిక కలుగుతుంది. అదే ముముక్షత్వము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. సౌందర్య లహరి - 29 / Soundarya Lahari - 29 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. గర్భవిఛ్చిత్తి నివారణ, మూర్ఖుడు మీద వశ్యత 🌴

శ్లో: 29. కిరీటం వైరించం పరిహర పురః కైటభ భిదః 
కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్బారి మకుటం l 
ప్రణమ్రే ష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనం 
భవ స్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్వి జయతే ll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! నీ ముందు భాగమున ఉన్న బ్రహ్మ యొక్క కిరీటమును తప్పుకొని, కైటభుడు అను రాక్షసుని వధించినట్టి రత్నములు పొదిగి కఠినముగా ఉన్న విష్ణు మూర్తి కిరీటము కొసను తాకి జారెదవు ఏమో, జంభుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కిరీటమును తప్పుకొని, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగువారు నమస్కరించుచుండగా, నీ మందిరమునకు వచ్చుచున్న పరమ శివుని కొఱకు నీవు వడివడిగా వెళ్ళు సమయమున నీ పరిచారికలు ఈ విధముగా పలుకుట సమంజసమే కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పప్పుతో కూడిన అన్నమును, లేదా తేనె, లేదా వడలను నివేదించినచో మూర్ఖత్వం వున్న వారి మీద వశ్యత, గర్భవిఛ్చిత్తి నివారింపబడును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 29 🌹 
📚 Prasad Bharadwaj 

🌴 Avoiding Abortions and Taming Bad People 🌴

29. Kiritam vairincham parihara purah kaitabha bhidah Katore kotire skalasi jahi jambhari-makutam; Pranamreshwateshu prasabha mupayatasya bhavanam Bhavasy'abhyutthane tava parijanoktir vijayate.

🌻 Translation : 
Yours escorts divine, shout with concern at thee. Avoid the crown of brahma, you may hit your feet, at the hard crown of Vishnu, who killed the ogre kaidaba, avoid the crown of Indra, when you get up and rush in a hurry, to receive thine lord who comes to your place.

🌻. Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times each day for 45 days, offering kulaannam (Dhal Rice ) or Honey or Dal Vada's as prasadam, it is said that one would be able to avoid miscarriage and get ability to control bad people.

🌻 BENEFICIAL RESULTS:
Taming of wild animals, bringing bad characters to righteous path, quick and easy delivery in the case of pregnant women. 
 
🌻. Literal Results: 
A surprise and unexpected visit from somebody close to the heart. Controlling people who are wicked, quarrelsome and hostile. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. శ్రీమద్భగవద్గీత - 328 / Bhagavad-Gita - 328 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 09 🌴

09. న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ||

🌷. తాత్పర్యం :
ఓ ధనంజయా! ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తతస్థునివలె ఉండి ఈ భౌతికకర్మలన్నింటి యెడ సదా ఆసక్తిలేనివాడనై యుందును.

🌷. భాష్యము : 
భగవానునకు ఎట్టి కర్మము లేదని ఈ విషయమున ఎవ్వరును భావింపరాదు. ఆధ్యాత్మికజగత్తులో అతడు సదా దివ్యకర్మల యందు నిమగ్నుడై యుండును. 

కనుకనే శ్రీకృష్ణభగవానుడు సదా సచ్చిదానందపూర్ణములైన కర్మలలో నిమగ్నుడైయుండుననియు, భౌతికకర్మలతో అతనికెట్టి సంబంధము లేదనియు బ్రహ్మసంహిత యందు తెలుపబడినది (ఆత్మారామస్య తస్యా స్తి ప్రకృత్యా న సమాగమ: ). 

భౌతికకర్మలన్నియు అతని వివధశక్తులచే నిర్వహింపబడును. అతడు మాత్రము సృష్టించబడిన జగత్తు యొక్క భౌతికకర్మల యెడ సదా తటస్థుడై యుండును. 

ఆ తటస్థత్వమే “ఉదాసీనవత్” యను పదము ద్వారా ఇచ్చట తెలుపబడినది. అనగా భౌతికకర్మల యందలి ప్రతి సుక్ష్మంశము పైనను అదుపు కలిగియున్నప్పటికిని అతడు తతస్థుని వలె వర్తించుచుండును. న్యాయస్థానమున కూర్చుండు న్యాయాధికారి ఉదాహరణను ఇచ్చట ఒసగవచ్చును. 

అతని ఆజ్ఞచే కొందరికి మరణశిక్ష, ఇంకొందరికి కారాగారవాసము, మరికొందరికి ధనలాభములు వంటివి జరుగుచున్నను అతడు మాత్రము అచ్చట జరుగు లాభనష్టములతో సంబంధములేక తటస్థుడై యుండును. 

అదే విధముగా జగము యొక్క ప్రతికార్యమందును తన ప్రమేయమున్నప్పటికి భగవానుడు సదా తటస్థుడై యుండును. కనుకనే వేదాంతసూత్రము (2.1.34) “వైషమ్యనైర్ఘృణ్యేన” అని ప్రవచించినది. 

అనగా శ్రీకృష్ణభగవానుడు భౌతికజగత్తు ద్వంద్వములతో సంబంధములేక వాటికి పరుడై యుండును. అలాగుననే జగత్తు యొక్క సృష్టి, లయములతో కూడా అతనికి సంబంధము లేదు. 

అనగా జీవులు తమ పూర్వకర్మల ననుసరించి పలువిధములైన జన్మలను పొందుచుండగా, శ్రీకృష్ణభగవానుడు వారితో ఎట్టి జ్యోక్యమును కల్పించుకొనడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 328 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 09 🌴

09 . na ca māṁ tāni karmāṇi
nibadhnanti dhanañ-jaya
udāsīna-vad āsīnam
asaktaṁ teṣu karmasu

🌷 Translation : 
O Dhanañjaya, all this work cannot bind Me. I am ever detached from all these material activities, seated as though neutral.

🌹 Purport :
One should not think, in this connection, that the Supreme Personality of Godhead has no engagement. 

In His spiritual world He is always engaged. In the Brahma-saṁhitā (5.6) it is stated, ātmārāmasya tasyāsti prakṛtyā na samāgamaḥ: 

“He is always involved in His eternal, blissful, spiritual activities, but He has nothing to do with these material activities.” Material activities are being carried on by His different potencies. The Lord is always neutral in the material activities of the created world. 

This neutrality is mentioned here with the word udāsīna-vat. Although He has control over every minute detail of material activities, He is sitting as if neutral. 

The example can be given of a high-court judge sitting on his bench. By his order so many things are happening – someone is being hanged, someone is being put into jail, someone is awarded a huge amount of wealth – but still he is neutral. He has nothing to do with all that gain and loss. 

Similarly, the Lord is always neutral, although He has His hand in every sphere of activity. In the Vedānta-sūtra (2.1.34) it is stated, vaiṣamya-nairghṛṇye na: 

He is not situated in the dualities of this material world. He is transcendental to these dualities. Nor is He attached to the creation and annihilation of this material world. 

The living entities take their different forms in the various species of life according to their past deeds, and the Lord doesn’t interfere with them.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍁🌲


No comments:

Post a Comment