22 - MAY - 2022 ఆదివారం, భాను వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 22, మే 2022 ఆదివారం, భాను వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 205 / Bhagavad-Gita - 205 - 5- 01 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 604 / Vishnu Sahasranama Contemplation - 604🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 283 / DAILY WISDOM - 283🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 183 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 122🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 22, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కాలాష్టమి, Kalashtami 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 6 🍀*

*7. ఓం రుద్రతేజోజ్జ్వలజ్వాలామాలినే మణికుమ్భాయ హుం ఫట్ స్వాహా ।*
*ఓం భవాయ రుద్రరూపిణే ఉత్తరదిగ్భాగే సర్వమృత్యోపశమనార్థం మాం రక్షతు ॥ 7 ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : గురుదేవుల స్మరణలో శిష్యుల సమర్పణ శక్తి ఇమిడి ఉన్నది. స్మరణ, సమర్పణ ఎంత తీవ్రముగా ఉంటే అనుగ్రహము అంత ఎక్కువుగా వుంటుంది. - సద్గురు శ్రీరామశర్మ 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ సప్తమి 13:01:21 వరకు
తదుపరి కృష్ణ అష్టమి
నక్షత్రం: ధనిష్ట 22:48:24 వరకు
తదుపరి శతభిషం
యోగం: ఇంద్ర 26:58:16 వరకు
తదుపరి వైధృతి
కరణం: బవ 13:04:20 వరకు
వర్జ్యం: 03:37:00 - 05:09:00
మరియు 29:51:30 - 31:25:50
దుర్ముహూర్తం: 16:59:10 - 17:51:14
రాహు కాలం: 17:05:41 - 18:43:18
గుళిక కాలం: 15:28:03 - 17:05:41
యమ గండం: 12:12:47 - 13:50:25
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 12:49:00 - 14:21:00
సూర్యోదయం: 05:42:15
సూర్యాస్తమయం: 18:43:18
చంద్రోదయం: 00:13:44
చంద్రాస్తమయం: 11:46:47
సూర్య సంచార రాశి: వృషభం 
చంద్ర సంచార రాశి: మకరం
మతంగ యోగం - అశ్వ లాభం 22:48:24
వరకు తదుపరి రాక్షస యోగం 
- మిత్ర కలహం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 205 / Bhagavad-Gita - 205 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 01 🌴*

*01. అర్జున ఉవాచ*
*సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |*
*యచ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్సితమ్ ||*

🌷. తాత్పర్యం :
*అర్జునుడు ఇట్లు పలికెను: ఓ కృష్ణ! తొలుత నన్ను కర్మత్యాగము చేయుమని చెప్పి తిరిగి భక్తియుతకర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము.*

🌷. భాష్యము :
భక్తితో చేయబడు కర్మ శుష్కమైన మానసికకల్పనల కన్నను ఉత్తమమైనదని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయమున తెలియజేయు చున్నాడు. ప్రకృతికి పరముగా నుండి మనుజుని కర్మఫలముల నుండి ముక్తిని చేయగలిగినందున భక్తియోగము వాస్తవమునాకు మానసికకల్పనల కన్నును సులభమైన మార్గమై యున్నది. ఆత్మను గూర్చిన ప్రాథమిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన వైనము ద్వితీయాధ్యాయమున వివరింపబడినది. 

ఏ విధముగా ఆత్మ అట్టి భవబంధము నుండి బుద్ధియోగము(భక్తియోగము) ద్వారా ముక్తినొందగలదో కూడా ఆ అధ్యాయముననే వివరింపబడినది. జ్ఞానస్థితిలో నిలిచియున్నవాడు ఒనరింపవలసిన ధర్మములేవియును ఉండవని తృతీయాధ్యాయమున వివరింపబడినది. సర్వవిధ యజ్ఞములు అంత్యమున జ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణభగవానుడు చతుర్థాధ్యాయమున బోధించెను. అయినను పూర్ణజ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయుటకు సంసిద్ధుడగుమని చతుర్థాధ్యాయపు అంత్యమున భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. అనగా భక్తియుతకర్మ మరియు జ్ఞానముతో కూడిన అకర్మల ప్రాముఖ్యమును ఏకమారు నొక్కిచెప్పుచు శ్రీకృష్ణుడు అర్జునుని భ్రమకు గురుచేసి అతని స్థిరత్వమును కలవరపరచెను. 

జ్ఞానపూర్వక త్యాగమనగా ఇంద్రియప్రీతికర కర్మలనన్నింటిని విరమించుట యని అర్జునుడు ఎరిగియుండెను. కాని ఎవరేని భక్తియోగమునందు కర్మనొనరించుచున్నదో కర్మ ఎట్లు ఆగిపోగలదు? అనగా కర్మ మరియు త్యాగము రెండింటికిని పొత్తు కుదరదు కనుక సన్న్యాసముగా (జ్ఞానపూర్వక త్యాగము) అన్నిరకముల నుండి విడివడియుండుట యని అర్జునుడు భావించెను. జ్ఞానపూర్వక కర్మ బంధమును కలుగజేయదు కనుక అకర్మతో ససమానమని అర్జునుడు అవగతము చేసికొననట్లుగా ఇచ్చట కనిపించుచున్నది. కనుకనే తానూ కర్మను విరమింపవలెనో లేదా జ్ఞానయుతుడై కర్మనొనరింపవలెనో అతడు తెలియగోరుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 205 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 01 🌴*

*01. arjuna uvāca*
*sannyāsaṁ karmaṇāṁ kṛṣṇa punar yogaṁ ca śaṁsasi*
*yac chreya etayor ekaṁ tan me brūhi su-niścitam*

🌷 Translation : 
*Arjuna said: O Kṛṣṇa, first of all You ask me to renounce work, and then again You recommend work with devotion. Now will You kindly tell me definitely which of the two is more beneficial?*

🌹 Purport :
In this Fifth Chapter of the Bhagavad-gītā, the Lord says that work in devotional service is better than dry mental speculation. Devotional service is easier than the latter because, being transcendental in nature, it frees one from reaction. In the Second Chapter, preliminary knowledge of the soul and its entanglement in the material body were explained. 

How to get out of this material encagement by buddhi-yoga, or devotional service, was also explained therein. In the Third Chapter, it was explained that a person who is situated on the platform of knowledge no longer has any duties to perform. And in the Fourth Chapter the Lord told Arjuna that all kinds of sacrificial work culminate in knowledge. However, at the end of the Fourth Chapter, the Lord advised Arjuna to wake up and fight, being situated in perfect knowledge. Therefore, by simultaneously stressing the importance of both work in devotion and inaction in knowledge, Kṛṣṇa has perplexed Arjuna and confused his determination. Arjuna understands that renunciation in knowledge involves cessation of all kinds of work performed as sense activities. 

But if one performs work in devotional service, then how is work stopped? In other words, he thinks that sannyāsa, or renunciation in knowledge, should be altogether free from all kinds of activity, because work and renunciation appear to him to be incompatible. He appears not to have understood that work in full knowledge is nonreactive and is therefore the same as inaction. He inquires, therefore, whether he should cease work altogether or work with full knowledge.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 604 / Vishnu Sahasranama Contemplation - 604🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻604. శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ🌻*

*ఓం శ్రీమతాం వరాయ నమః | ॐ श्रीमतां वराय नमः | OM Śrīmatāṃ varāya namaḥ*

*శ్రీమతాం వరః, श्रीमतां वरः, Śrīmatāṃ Varaḥ*

*బ్రహ్మాదీనాం సమస్తానామ్ ఋగ్యజుస్సామలక్షణా ।*
*యేషాం శ్రీరస్తి తేషాం చ ప్రధానః శ్రీమతాం వరః ॥*
*ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ ।*
*ఇతి శ్రుతేర్మహావిష్ణుః శ్రీమతాం వర ఉచ్యతే ॥*

*ఋక్‍, యజుర్‍, సామతదంగాది రూపమగు విద్యయే 'శ్రీ' అనబడును. అట్టి శ్రీగల బ్రహ్మ మొదలగువారు శ్రీమంతులు. అట్టి శ్రీమంతులలో శ్రేష్ఠుడు 'శ్రీమతాంవరః'. 

*ఋచస్సామాని యజూగ్‍ంషి సా హి శ్రీ రమృతా సతామ్ (తైత్తిరీయ బ్రాహ్మణము 1.1.1)*

*'ఋక్కులు, యజుస్సులు, సామములు - ఈ త్రివిధ రూపము గల విద్యయే 'సత్‍'జనులకు ఉండు శ్రీ. అది అమృత తుల్యమౌ శాశ్వతమగు శ్రీ.' అను శ్రుతి వచనము ఈ విషయమున ప్రమాణము.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 604🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻604. Śrīmatāṃ Varaḥ🌻*

*OM Śrīmatāṃ varāya namaḥ*

ब्रह्मादीनां समस्तानाम् ऋग्यजुस्सामलक्षणा ।
येषां श्रीरस्ति तेषां च प्रधानः श्रीमतां वरः ॥
ऋचस्सामानि यजूग्‍ंषि सा हि श्री रमृता सताम् ।
इति श्रुतेर्महाविष्णुः श्रीमतां वर उच्यते ॥

*Brahmādīnāṃ samastānām r‌gyajussāmalakṣaṇā,*
*Yeṣāṃ śrīrasti teṣāṃ ca pradhānaḥ śrīmatāṃ varaḥ.*
*R‌cassāmāni yajūgˈṃṣi sā hi śrī ramr‌tā satām,*
*Iti śrutermahāviṣṇuḥ śrīmatāṃ vara ucyate.*

*R‌uk, Yajur and Sāma are the Śrīḥ of those who possess it like Brahma and others who are hence called Śrīmantaḥ. Since Lord Hari is the best amongst such, He is called Śrīmatāṃ Varaḥ.*

*ऋचस्सामानि यजूग्‍ंषि सा हि श्री रमृता सताम् / R‌cassāmāni yajūgˈṃṣi sā hi śrī ramr‌tā satām (तैत्तिरीय ब्राह्मण १.१.१/Taittirīya brāhmaṇa 1.1.1)*

*R‌uk, Yajur and Sāma are the Śrī of the good - making for immortality.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 283 / DAILY WISDOM - 283 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 9. ప్రతిదానికీ కొంత ప్రాముఖ్యత ఉంటుంది 🌻*

*శారీరక స్వయం అని పిలువబడే వ్యక్తిగత స్వయం కంటే సామాజిక స్వయ నియంత్రణ సులభం. మన శరీరాన్ని మనం సులభంగా నియంత్రించలేము, ఎందుకంటే కుటుంబ సభ్యులు మొదలైన బాహ్య సంబంధాల పట్ల ఉండే సాన్నిహిత్యం కంటే మన స్వచ్ఛమైన స్థితి లేదా స్పృహతో అది గొప్ప సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటుంది. కుటుంబ సభ్యుల ఉనికిని మనం కొన్ని రోజులు మరచిపోవచ్చు, కానీ మనకు శరీరం ఉందని కొన్ని రోజులు మర్చిపోలేము; అది చాలా కష్టం. కాబట్టి, బంధం నుండి చైతన్యాన్ని ఉపసంహరించుకోవడం నేను చెప్పినట్లుగా దశలవారీగా చేయాలి.*

*చైతన్యం దశలవారీగా బాహ్య బంధాల నుండి క్రమ క్రమంగా తనని తాను ఉపసంహరించుకుంటూ మరల వెనక్కు వెళ్లకుండా, నిశ్చితమైన అడుగులు వేస్తూ, ఒక్క అడుగును సైతం వదలకుండా చేసే ప్రయాణం వల్ల సమస్యలు కూడా క్రమంగా సన్నగిల్లుతాయి. ఈ అభ్యాసంలో మనం దూకుడుని ప్రదర్శించకూడదు, ఎందుకంటే ప్రతి చిన్న వస్తువు ఎంతో ముఖ్యమైన అంశం మరియు మనం తప్పిన ఒకే ఒక్క అడుగు ఏదో ఒక రోజు ఇబ్బందిని సృష్టించవచ్చు. చిన్న కోరికలు చాలా పెద్దవిగా లేదా ఇబ్బందికరంగా కనిపించవు, కానీ వాటిని పూర్తిగా విస్మరిస్తే అవి ఇబ్బందికరంగా మారవచ్చు, ఎందుకంటే ఈ ప్రపంచంలో పూర్తిగా అప్రధానమైనదిగా పరిగణించబడేది ఏదీ లేదు. ప్రతిదానికీ ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంది; మరియు సమయానుసారం, అది మనకు సహాయం చేయగలదు లేదా అది మనలను ఇబ్బంది పెట్టగలదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 283 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 9. Everything has Some Importance 🌻*

*The social self is easier to control than the personal self, known as the bodily self. We cannot easily control our body, because that has a greater intimacy with our pure state or consciousness than the intimacy that is exhibited by external relations like family members, etc. We may for a few days forget the existence of the members of the family, but we cannot forget for a few days that we have a body; that is a greater difficulty.*

*So, the withdrawal of consciousness from attachment has to be done by degrees, as I mentioned, and the problems have to be gradually thinned out by the coming back of consciousness from its external relationships, stage by stage, taking every step with fixity so that it may not be retraced, and missing not a single link in this chain of steps taken. We should not take jumps in this practice of self-restraint, because every little item is an important item and one single link that we missed may create trouble one day. There may be small desires which do not look very big or troublesome, but they can become troublesome if they are completely ignored because there is nothing in this world which can be regarded as wholly unimportant. Everything has some importance or the other; and if the time comes, it can help us, or it can trouble us.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 183 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది. 🍀*

*సమాజం ప్రతి బిడ్డని స్కూలు గుండా, కాలేజీ గుండా, యూనివర్సిటీ గుండా వెళ్ళాలంటుంది. అంటే జీవితంలో మూడింట ఒక వంతు నాశనమవుతుంది.. శక్తిని అసహజమైన కేంద్రానికి తొయ్యడం. శక్తిని మనసుపై కేంద్రీకరించడం, హృదయం వేపు మళ్ళకుండా చెయ్యడం! సహజమైన క్రియ శక్తి హృదయంలోకి సాగి అక్కడి నించీ మనసుకు సాగాలి. మనసంటే మేధస్సు. అది సహజ ప్రక్రియ.*

*హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. అదే మనసు గుండా శక్తి సాగితే మనసు అధికారి అవుతుంది. హృదయం నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 122 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 94. సున్నిత సంబంధము 🌻*

*మైత్రేయ సంఘము అతి ప్రాచీనమైనది. ఈ సంఘమున ఒకే చైతన్యము చాలా దేహముల యందు పనిచేయుచున్నది. దాని యందు పనిచేయునది కృష్ణచైతన్యమే. అందరి జీవాత్మలు కృష్ణ చైతన్యమునకు వాహికలు. వారి వారి శరీరములు జగత్ కళ్యాణమున కున్ముఖమై యుండును. కృష్ణునికి మేమందరము స్నేహితులమే. అందరి యందు అతనికి మిత్రత్వముండుట చేత ఇది మిత్ర సంఘమైనది. మైత్రేయ సంఘమనగా కృష్ణుని మిత్రుల సంఘమే. కృష్ణుడనగా జగన్నాథుడే. అది విశ్వవ్యాపకమైన చైతన్యము. దాని యందు అహర్నిశలు జీవించు వారు మైత్రేయ సంఘ సభ్యులు.*

*శ్రీకృష్ణుడు వీరందరి యందును మిత్రత్వము వహించినను, సంఘమందలి సభ్యులు కృష్ణుని మిత్రులనుకొనరు. వారి కతడు గురువు, దైవము. గురువు, దైవము వాత్సల్యకారణముగ మిత్రత్వము చూపుదురు. అంత మాత్రమున కృష్ణ చైతన్యము నందు జీవించుచున్న సభ్యులు కృష్ణునితో మిత్రులవలె ప్రవర్తించక, భక్తులవలెను, శిష్యుల వలెను ప్రవర్తింతురు. మిత్రత్వము చూపుచున్న సద్గురువును మిత్రుడను కొనుట అవివేకము. మిత్రత్వము సలుపుట అతని వాత్సల్యమే కాని తన అర్హత కాదని శిష్యుడెరుగవలెను. అట్లు కానిచో శిష్యుడహంకారమున పడును. ఈ సున్నితమైన గురు శిష్య సంబంధము గమనార్హము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment