నిర్మల ధ్యానాలు - ఓషో - 183
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 183 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది. 🍀
సమాజం ప్రతి బిడ్డని స్కూలు గుండా, కాలేజీ గుండా, యూనివర్సిటీ గుండా వెళ్ళాలంటుంది. అంటే జీవితంలో మూడింట ఒక వంతు నాశనమవుతుంది.. శక్తిని అసహజమైన కేంద్రానికి తొయ్యడం. శక్తిని మనసుపై కేంద్రీకరించడం, హృదయం వేపు మళ్ళకుండా చెయ్యడం! సహజమైన క్రియ శక్తి హృదయంలోకి సాగి అక్కడి నించీ మనసుకు సాగాలి. మనసంటే మేధస్సు. అది సహజ ప్రక్రియ.
హృదయం గుండా శక్తి వస్తే హృదయం అధికారిగా వుంటుంది. మనసు సేవకుడిగా వుంటుంది. కానీ మనం విద్యా విధానమని చెప్పుకునేది హృదయాన్ని విస్మరించేలా చేస్తుంది. అదే మనసు గుండా శక్తి సాగితే మనసు అధికారి అవుతుంది. హృదయం నిర్లక్ష్యం చెయ్యబడుతుంది. మేధస్సు సేవకుడుగా వుంటే మంచి పనివాడుగా వుంటుంది. అదే అధికారమిస్తే అసహ్యకరమయిన యజమానిగా వుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
22 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment